Sunday 7 November 2021

 

తాత - మనుమడు కధ 

      ఆ రోజు ఒక పేరున్న రెష్టారెంట్ ముందు కారు లో సుమారు తొంబై దాటిన వారి తాతగార్ని నెమ్మదిగా చెయూత నిచ్చి నడిపించుకొని తీసుకు వచ్చాడు. ఓ మూల ఉన్న టూ సిట్టర్ టేబుల్ దగ్గరకు నడిపించుకుని జాగ్రత్తగా కూర్చో బెట్టాడు.

చెప్పండి తాతగారు ! ఏంటి తింటారు ? అడిగాడు మనవడు.

             నాకు మటన్ చాలా ఇష్టం, కాని పళ్లు లేవుగా! ఎలా తింటాను అన్నాడు.

ఓస్ ! ఇంతే కదా ! అని బేరర్ ను పిలిచి, ఓ ప్లేట్ చాల మెత్తని మటన్ ఖైమా, బాగుండాలని ఆర్డర్ పెట్టాడు. ఇదిగో! అది అయ్యేలోపు చికెన్ సూప్ ఫ్రెష్ గా పట్టుకు రా ! అని చెప్పాడు.

            ఐదు నిమిషాల్లో చికెన్ సూప్ వచ్చింది!

ఆ మనుమడు ఒక తెల్లటి టవల్ ను తాతయ్య మెడ ముందు అమర్చి....సూప్ నెమ్మదిగా స్పూన్ తో త్రాపిస్తున్నాడు. అయినా అది ఆబోసి నోరు చుట్టూ అంటుకుంది. కర్చిఫ్ తో మూతి శుభ్రం చేసాడు. ఈ లోగా మటన్ ఖైమా వచ్చింది.

            తాతయ్యకు నెమ్మదిగా స్పూన్ తో తినడం వలన చాలా సమయం పట్టింది...! ఐనా విసుగు చెందకుండా నెమ్మదిగా తాతయ్యతో కబుర్లు చెబుతూ....నానమ్మ పై జోకులు వేస్తూ తినిపించాడు. చనిపోయిన భార్య జ్ఞాపకాలు అంత అందంగా మనవడు గుర్తు చేసి నందుకు, ఆ తాతయ్య కళ్లలో ఆనందం...ఓ పక్క కంటనీరు.

            రెష్టారెంట్ లో అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఆ కుర్రాడు ఏమాత్రం పట్టించుకోలేదు. బిల్ పే చేసి నెమ్మదిగా మరలా నడపించుకొని తీసుకు వెళ్లిపోయాడు.

కొడుకు, కోడలు చాలా మంచి వాళ్లు, జాగ్రత్తగా చూసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుందని ఏది పడితే అది పెట్టరు. మనవడు అలా కాదు. వచ్చిన ప్రతీ సారి తాతయ్యను కార్లో వేసుకుని షికారు తిప్పడమే కాకుండా, చిన్న పిల్లలకు తినిపించినట్లు, ఐస్ క్రీమ్స్ , రక రకాల చిరుతిండి తినిపిస్తాడు. తండ్రి చెప్పినా వినడు!

ఒక్కరోజుకు ఏం కాదు డాడీ.... నేను చూసుకుంటాను కదా అని....రాత్రి పడుకునే ముందు జీర్ణం కావడానికి పళ్ల రసం, టాబ్లెట్ వేసేస్తాడు.

          మామూలు సమయంలో చాలాఇబ్బంది పడే పెద్దాయన.... చిత్రంగా మనవడు వచ్చినపుడు హుషారుగా ఉంటారు. ఒక్క కంప్లైంట్ కూడ ఉండదు. కొడుకు ముసి ముసిగా నవ్వుకుంటాడు.

        ఓసారి ఉండలేక కొడుకుని అడిగాడు..,,ఏరా! వచ్చినపుడల్లా తాతయ్యను కుషీ చేస్తావ్ ! తాతయ్య అంటే అంత ఇష్షమా?

దానికి కొడుకు చెప్పిన సమాధానం....డాడీ ! నా చిన్నతనంలో అమ్మా, మీరు క్షణం తీరిక లేకుండా ఉద్యోగాల వలన బిజీగా ఉండేవారు. ఇంట్లో నాన్నమ్మ తాతయ్య, నా విషయంలో చాలా శ్రద్ధ చూపేవాళ్లు. తాతయ్యా ! ... నన్ను స్కూల్ నుండి తీసుకొని వస్తూ....నేను ఏది అడిగితే అది కొనిచ్చి ముద్ధు చేసేవారు. ఒక్కోసారి నా బట్టలు పాడు చెసేవాడిని. తాతయ్య నాన్నమ్మ ఆ రోజులలో నాకు చేసిన సేవలు గుర్తున్నాయి. నేను ఏమిచ్చి వాళ్లను ఆనంద పరచ గలను. నానమ్మ ఇప్పుడు లేదుగా. అందుకే వచ్చిన ప్రతిసారీ కనీసం తాతయ్య తో ఒక్కరోజైనా గడపి నా జ్ఞాపకాలు సజీవం గా ఉంచుకుంటాను అని చెప్పాడు.

             సమాధానం విన్న తండ్రి కళ్లలో నీళ్లు....నీ జ్ఞాపకాల మాటేమో గాని... నీవు వచ్చిన వెంటనే తాతయ్య కళ్లలో ఉత్సాహం.. చూస్తుంటే నేను ఆయనకు ఎంత రుణపడి ఉన్నానో అర్ధం అవుతుంది. నాకు మీ అమ్మకు అందమైన వార్ధక్యం కళ్ల ముందు కనిపిస్తూంది...! యు ఆర్ గ్రేట్ మై సన్.

             గమనిక :-డబ్బువెనుక పరుగులుపెట్టే ఈ కాలంలో ఇలాంటి సంబంధ బాంధవ్యాలు కాపాడుకునే కుటుంబాలు మాత్రం నిజంగా స్వర్గధామాలే.... !అన్ని కుటుంబాలు కూడా ఇలాగే ఉండలని ఆశిస్తూ...!

--(())--


 కార్తీక మాసం  30 రోజులు  - పూజించవలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం.......!!


*👉1వ రోజు:*

 నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు.

దానములు:- నెయ్యి, బంగారం

పూజించాల్సిన దైవము:-స్వథా అగ్ని

జపించాల్సిన మంత్రము:- ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా


*👉2వ రోజు:*

నిషిద్ధములు:-తరగబడిన వస్తువులు

దానములు:-కలువపూలు, నూనె, ఉప్పు

పూజించాల్సిన దైవము:-బ్రహ్మ

జపించాల్సిన మంత్రము:-

ఓం గీష్పతయే - విరించియే స్వాహా


*👉3వ రోజు:*

నిషిద్ధములు:- 

ఉప్పు కలిసినవి, ఉసిరి

దానములు:- ఉప్పు

పూజించాల్సిన దైవము:- పార్వతి

జపించాల్సిన మంత్రము:-  ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా


*👉4వ రోజు:*

నిషిద్ధములు:- వంకాయ, ఉసిరి

దానములు:- నూనె, పెసరపప్పు

పూజించాల్సిన దైవము:- విఘ్నేశ్వరుడు

జపించాల్సిన  మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా


*👉5వ రోజు:*

నిషిద్ధములు:- పులుపుతో కూడినవి

దానములు:- స్వయంపాకం, విసనకర్ర

పూజించాల్సిన దైవము:- ఆదిశేషుడు

జపించాల్సిన మంత్రము:-  (మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)


*👉6వ రోజు:*

నిషిద్ధములు:- ఇష్టమైనవి , ఉసిరి

దానములు:- చిమ్మిలి

పూజించాల్సిన దైవము:- సుబ్రహ్మణ్యేశ్వరుడు

జపించాల్సిన  మంత్రము:- ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా


*👉7వ రోజు:*

నిషిద్ధములు:- పంటితో తినే వస్తువులు, ఉసిరి

దానములు:- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం

పూజించాల్సిన దైవము:- సూర్యుడు

జపించాల్సిన మంత్రము:- ఓం. భాం. భానవే స్వాహా


*👉8 వ రోజు:*

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం

దానములు:- తోచినవి - యథాశక్తి

పూజించాల్సిన దైవము:- దుర్గ

జపించాల్సిన మంత్రము:- 

ఓం - చాముండాయై విచ్చే - స్వాహా


*👉9వ రోజు:*

నిషిద్ధములు:- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి

దానములు:- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు

పూజించాల్సిన దైవము:- అష్టవసువులు -

పితృ దేవతలు

జపించాల్సిన మంత్రము:-  ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః


*👉10వ రోజు:*

నిషిద్ధములు:- గుమ్మడికాయ, నూనె, ఉసిరి

దానములు:- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె

పూజించాల్సిన దైవము:- దిగ్గజాలు

జపించాల్సిన మంత్రము:-

ఓం మహామదేభాయ స్వాహా

*👉11వ రోజు:*

నిషిద్ధములు:- పులుపు, ఉసిరి

దానములు:- వీభూదిపండ్లు, దక్షిణ

పూజించాల్సిన దైవము:- శివుడు

జపించాల్సిన మంత్రము:- 

ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ

*👉12వ రోజు:*

నిషిద్ధములు:- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి

దానములు:- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ

పూజించాల్సిన దైవము:- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు

జపించాల్సిన మంత్రము:-

ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా

*👉13వ రోజు:*

నిషిద్ధములు:- రాత్రి భోజనం, ఉసిరి

దానములు:- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం

పూజించాల్సిన దైవము:- మన్మధుడు

జపించాల్సిన మంత్రము:- 

ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా

*👉14వ రోజు:*

నిషిద్ధములు:- ఇష్టమైన వస్తువులు, ఉసిరి

దానములు:- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె

పూజించాల్సిన దైవము:- యముడు

జపించాల్సిన మంత్రము:-

ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా

*👉15వ రోజు:*

నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు

దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు 

జపించవలసిన మంత్రం:-

'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'

*👉16వ రోజు:*

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది,ఎంగిలి, చల్ల

దానములు:- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము:- స్వాహా అగ్ని

జపించాల్సిన మంత్రము:- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః

*👉17వ రోజు:*

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు

దానములు:- ఔషధాలు, ధనం

పూజించాల్సిన దైవము:- అశ్వినీ దేవతలు

జపించాల్సిన మంత్రము:- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా

*👉18వ రోజు:*

నిషిద్ధములు:- ఉసిరి

దానములు:- పులిహార, అట్లు, బెల్లం

పూజించాల్సిన దైవము:- గౌరి

జపించాల్సిన మంత్రము:- ఓం గగగగ గౌర్త్యె స్వాహా

*👉19వ రోజు:*

నిషిద్ధములు:- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి

దానములు:- నువ్వులు, కుడుములు

పూజించాల్సిన దైవము:- వినాయకుడు

జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా

*👉20వ రోజు:*

నిషిద్ధములు:- పాలు తప్ప - తక్కినవి

దానములు:- గో, భూ, సువర్ణ దానాలు

పూజించాల్సిన దైవము:- నాగేంద్రుడు

జపించాల్సిన మంత్రము:- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం

*👉21వ రోజు:*

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం

దానములు:- యథాశక్తి సమస్త దానాలూ

పూజించాల్సిన దైవము:- కుమారస్వామి

జపించాల్సిన మంత్రము:- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా

*👉22వ రోజు:*

నిషిద్ధములు:- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి

దానములు:- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు


పూజించాల్సిన దైవము:- సూర్యుడు

జపించాల్సిన 

మంత్రము:- ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా

*👉23వ రోజు:*

నిషిద్ధములు:- ఉసిరి, తులసి

దానములు:- మంగళ ద్రవ్యాలు

పూజించాల్సిన దైవము:- అష్టమాతృకలు

జపించాల్సిన మంత్రము:- 

ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృ కాయ స్వాహా

*👉24వ రోజు:*

నిషిద్ధములు:- మద్యమాంస మైధునాలు, ఉసిరి

దానములు:- ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు

పూజించాల్సిన దైవము:- శ్రీ దుర్గ

జపించాల్సిన మంత్రము:- 

ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా

*👉25వ రోజు:*

నిషిద్ధములు:- పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు

దానములు:- యథాశక్తి

పూజించాల్సిన దైవము:- దిక్వాలకులు

జపించాల్సిన మంత్రము:- 

ఓం ఈశావాస్యాయ స్వాహా

*👉26వ రోజు:*

నిషిద్ధములు:- సమస్త పదార్ధాలు

దానములు:- నిలవవుండే సరుకులు

పూజించాల్సిన దైవము:- కుబేరుడు

జపించాల్సిన మంత్రము:- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా

*👉27వ రోజు:*

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, వంకాయ

దానములు:- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు

పూజించాల్సిన దైవము:- కార్తీక దామోదరుడు

జపించాల్సిన మంత్రము:- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా

*👉28వ రోజు:*

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ

దానములు:- నువ్వులు, ఉసిరి

పూజించాల్సిన దైవము:- ధర్ముడు

జపించాల్సిన 

మంత్రము:- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా

*👉29వ రోజు:*

నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి

దానములు:- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము:- శివుడు (మృత్యుంజయుడు)

జపించాల్సిన మంత్రము:- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, 

ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్

*👉30వ రోజు:*

నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి

దానములు:- నువ్వులు, తర్పణలు, ఉసిరి

పూజించాల్సిన దైవము:- సర్వదేవతలు, పితృ దేవతలు

జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః

ఓం నమః శివాయ.   సేకరణ:  pranjali prabha. 🙏

శ్రీమతి గారు ఈరోజు భగవద్గీత గురించి కధగా చెప్పవా. నీ నోటి నుండి వింటే అసలు విన్నట్టే ఉండదు 

అంటే బాగుండదా 

కాదే నీ మాటలు మనసుకు హత్తు కుంటాయి 

అందుకే చెప్పఁమంటున్నాను. 

పరమగురువులు బోధించినది, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించినది నేను చెప్పటం ఏమిటి మీమాటలు నాకు నవ్వు తెప్పిస్తున్నాయి. 

అదికాదే ఏపుట్టలో ఏపాముందో తెలియదు అట్లాగే మంచిని ఎంతమందైన చెప్పవచ్చు దానికి కొలమానం లేదు వారుచెప్పఁరాని భావన వద్దు , నీకు తెలిసినది చెప్పు చాలు. ఎవ్వరికీ పూర్తిగా భగవద్ గీత అర్ధం చేసుకొనే శక్తి లేదు కేవలం యోగీశ్వరులకుతప్ప. 

అందుకే భగవద్గీత గూర్చిన సంభాషణము అత్యంత బాధ్యతా యుతమైనది. వారిని గూర్చి ఎంత తక్కువ సంభాషించిన అంత మేలు. కారణమేమనగా  వారిని గూర్చిన అవగాహన కలవారు వాణ్నియమము కలవారగుటచే మాట్లాడరు. వారిని గూర్చి తెలియని వారు గాలి కబుర్లుగ నియమముల నుల్లంఘించి మాట్లాడ కూడదు.  

నేను ఆ భగవంతుని ప్రార్ధించి చెప్పటానికి ప్రయత్నిస్తాను.  ఆయన త్వరగానే అర్థం అవుతుందని ఆశిస్తాను. ఆపరమాత్ముడు  నన్ను ఆజ్ఞాపించినది నేను చెప్పగలను. ‘‘ఈ పని చెయ్యాలి. నీకు నచ్చితే చెయ్యి. లేకపోతే, నీ ఇష్టం’’ అనేవారు నాతో. ఉన్నా ,అన్నా , ‘‘అసలైన ప్రేమ ఇలా ఉండాలి’’ అనేది భగవద్ గీత భావము అదే మీకు తెలియపరుస్తాను 

         భగవద్గీతలో గ్రుడ్డివారైన,  వయసు మీదపడిన వారైన "దృతరాష్టుడు కౌరవుల రాజు"  వారికి  కన్నప్రేమ ఎప్పటికీ తగ్గదు,  మనవారు పరాయివారు మధ్య సంఘటనలు తెలుసుకోవాలని ఆరాటం తగ్గదు. అందుకే నేను చెప్పేది వారికి వయసు  మీద పడినవారు కన్నవారిని ఎటు వంటివారైనా వదులుకోలేరు వారిని ఎదిరించి మాట్లాడలేరు. పిల్లలు కూడా గమనించాలి పెద్దల్ని బాధ పెట్ట కూడదు పెట్టిన వారు మాట్లాడలేరు ఎందుకనగా ప్రేమ.      

              అందరికన్నా ముఖ్యం "గురువు" ఆ గురువుని ప్రార్ధించి ఏ పని అయినా చెయ్యాలని భవగవద్ గీత బోధిస్తున్నది. గురువుని మించిన శిష్యులనుతయారుచెయ్యాలని గురువుకి ఆశగా ఉంటుంది అందుకనే తనలో ఉన్న  విద్యనంతా అనాడు గురుకులములో నేర్పేవారు తరువాత  "ప్రకృతి విద్య , సంసార విద్య, ప్రపంచ విద్య నేర్చుకోమని బయటకు పంపేవారు. 

శ్రీమతిగారు ఈ నాడు అటువంటి గురువులు లేరా. గురువులు ఉన్న నేర్చుకొనే ఓర్పు నేర్పు ఉన్నవారు లేరు ఆనాడు సంస్కృతం ఒక్కటే వుంది అదే క్షుణ్ణంగా నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఆంగ్లం వచ్చి మనుష్యులను పాడుచేస్తున్నది అర్ధం కానీ బాష భోధిస్తున్నారు అదేతేడా నేనొక్కటే చెప్పగలను అప్పుడు బతికి బతికించే విద్య, ఇప్పుడు బతుకుటకు కొనుక్కునే విద్య. 

ఇక వర్ణించను భగవద్ గీత గురించి ఆలోచిద్దాం ....

అట్లాగే కాస్త కాఫీ త్రాగక మళ్ళా చెపుదానివిలే అన్నాడు శ్రీవారు      

((()))


No comments:

Post a Comment