Tuesday 2 November 2021

ఈ వారం (7) కధలు (22---27)

Krishna Images, Wallpaper, Photos, Pics, And Graphics

22. హరే కృష్ణ 
ఆత్మ స్వరూపులు అయిన మనం అందరం కొన్ని విషయాలు శ్రీ కృష్ణుని నుండి విపులంగా తెలుసుకోవాలి.
శ్రీ కృష్ణుని చేతిలో ఉండే మురళి తెలుసుగా ఎప్పుడూ ఉదుతూ గానం చేస్తూ ఉంటాడు. ఈ మురళి లో 7 రంధ్రాలు ఉంటాయి. ఈ 7 రంధ్రాలు షట్ చక్రాలు.ఈ షట్ చక్రాలలో సా ,రి ,గా, మా, పా, దా ,నీ , అని ఉడుతూ మరలా క్రిందకి అంటే నీ,దా,పా,మా,గా, రీ,సా అంటూ క్రిందకి ఊడుతూ గానం చేస్తూ ఉంటాడు.
అనగా ఈ శ్రీ కృష్ణుని చేతిలో మురళిని చూపించడం జరిగింది.షట్ చక్ర ల ద్వారా ప్రాణాయామము చేసే టప్పుడు వెలువడే సుమధుర ధ్వని గురించి అర్థమయ్యేలా చెప్పడానికే e మురళిని చూపించడం జరిగింది.
వెన్ను ముక ద్వారా ప్రాణాయామం చేస్తూ క్రిందనున్న ప్రాణాన్ని పైకి లాగి పైన ఉన్న ప్రాణాన్ని క్రిందకి లాగుతూ చేస్తుంటే యోగి కొంత సేపటికి తన్మయత్వం లోనికి వెడతాడు. ఆ తన్మయత్వంలో తనను తాను మరచిపోయాడు. ఆ తన్మయత్వం మే కలయిక.భగవంతునితో కల
--(())--

 

23. మా చిన్నప్పుడు మా పెద్దమ్మ ఒక కథ చెప్పేది. ఒక యజమాని తన యింటి  అరుగు మీద  

కూచుని ఉంటాడు. యింతలో ఒక భిక్షగాడు వచ్చి ధర్మం చేయండి బాబూ అంటాడు. ఆయన భార్యను కీక వేసి ఏమే!మూడు జన్మల  దరిద్రుడు వచ్చాడు, భిక్షం తీసుకొనిరా అంటాడు. భిక్ష గాదు కోపంతో అదేమిటి నన్ను మూడుజన్మల దరిద్రుడని అంటారు?అన్నాడు. అపుడు యజమాని నవ్వుతూ మరి అంతే కదా పోయిన జన్మ లో నీవు దానం చెయ్యలేదు కాబట్టి ఈ జన్మ లో దరిద్రుడిగా పుట్టావు,దరిద్రుడవు కాబట్టి దానాలు చెయ్యలేవు  పాపాలు చేస్తావు. మరుజన్మలో కూడా దరిద్రుడిగా పుడతావు. అది అలా కొనసాగుతూనే వుంటుంది. నీవు మూడు జన్మల దరిద్రుదివే కదా!ఆ భిక్ష గాడు భిక్షాటన మానేసి కష్టపడి సంపాదించి దానాలు చేస్తూ పుణ్యాన్ని పొందుతాడు.

దాన మెప్పుడూ గుప్తంగా చెయ్యాలి. అంటే నేను ఫలానా వాడికి యింత యిచ్చాను ఇంకోడికి యింత యిచ్చాను అని చెప్పుకో కూడదు. "దానమానావ మా నస్యా 

నవగోప్యా మనీషిభి:" అని చెప్తారు.

24.  

ఇది అద్భుతమైన భారతీయ శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి మచ్చుతునక ....
సౌదీ అరేబియా లోని. ..మక్కా మసీదు  ( ఒకప్పుడు శివాలయం ) మహారాష్ట్ర ఎల్లోరా లోని. ...కైలాస నాథ్ శివాలయం కాంభోజ రాజ్యం../ కంబోడియా దేశంలో ఉన్న అంగ్ కోర్ వాట్ శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రము. ..ఈ మూడు నిర్మాణాలు ఒకే సరళ రేఖలో నిర్మించబడ్డాయి చూశారా. ...
అది ఈ నాటి శాస్త్ర వేత్తలు శాటిలైట్ సాయంతో కనుగొన్నారట. ..
ఏ శాటిలైట్ లు లేని వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఇలా ఒకే సరళ రేఖలో నిర్మాణాలు ఎలా చేశారు. .. పైగా ఇవి ఒకే కాలంలో నిర్మించినవి కావు. .. వేరు వేరు కాలాల్లో నిర్మించినవి. ..శాటిలైట్ విజ్ఞానం కంటే ఎన్నో రెట్లు గొప్ప విజ్ఞానం మన భారతీయుల సొంతం అని ఇప్పటికైనా అర్థమయిందా అందరికీ. ..ఇంతటి మహత్తర విజ్ఞానాన్ని అందించిన మన పూర్వీకులను మనం స్మరించుకోవడమే మరిచాము. .మన మహర్షులు మనకు అందించిన వేద విద్యను కాదని. ..విదేశీయుల విద్యలు నేర్చుకోవడంపైనే శ్రద్ధ పెడుతున్నాము. ..
ఇది ఎంతటి శోచనీయం...మన మహర్షులకు. ..గొప్ప ఆర్కిటెక్చర్లు అయిన విశ్వకర్మలకు మనం ఎంతగానో ఋణపడి ఉన్నాము. .

మన హైందవ ధర్మాన్ని మనసా వాచా కర్మణా  పాటిస్తున్న నిజమైన హిందువులకు ...
దేవాలయ పూజారులకు. ..వాటిని శుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు. .అందరికీ వందనాలు. .
సనాతన హైందవ ధర్మమా నీవు కలకాలం వర్థిల్లుదువుగాక. ..
జై విశ్వకర్మ భగవాన్ , జై భరతమాత, జై తెలుగు తల్లి, జై హింద్
--(())--

 25...వేంకటేశ్వరుని నేటి కధ

వెంకన్న స్వామి:ఏమోయ్ పద్మా. . ఏమి చేస్తున్నావు.

పద్మావతి:  ఏముంది స్వామీ. . భక్తులు లేరుగా. . ఖాళీగానే ఉన్నా.

వెం.స్వామి: సరే, ఆ అలివేలుని కూడా రమ్మను. . అలా ఏడుకొండలూ తిరిగొద్దాం.

అలివేలు మంగ: నేను తయారుగానే ఉన్నా స్వామీ, ఆశీస్సులు ఇచ్చే పని కూడా లేదుగా.

వెం.స్వా: సరే పదండి, ఎంతకాలమయిందో నా ఏడుకొండలూ చూసి.

పద్మ: అబ్బ, బయట ఎంత హాయిగా ఉంది స్వామీ.

 మొన్నటి వరకూ ఒకటే జనం, రణగొణ ధ్వనులు, హారన్ల మోతలూ.

అలివేలు: అవునక్కా. .అసలు బయటకొద్దామంటే ఒకటే కాలుష్యం, ఏ బండోడు ఎక్కడ గుద్దుతాడో అని భయం.

వెం.స్వామి: దేవేరులూ, అటు చూడండి. . మన వన్యప్రాణులు ఎంత కన్నుల పండువగా తిరుగుతున్నాయో, వాటి మొహంలో ఆనందం చూశారా. .

పద్మ: అవును స్వామీ, ఇలాంటి ప్రశాంత వాతావరణం మళ్ళీ చూస్తామని అనుకోలేదు. .

అలివేలు: స్వామీ, నిత్యం మనల్ని చూడడానికి వచ్చే భక్తులు రాని లోటు అనిపించడం లేదా. .

వెం.స్వామి: పిచ్చిదానా, నిజమైన భక్తి మనసులోనే పుడుతుంది. .అటువంటి భక్తులు ఈరోజు కాకపోతే రేపు వస్తారు. .ఇక్కడికి వచ్చే వారిలో చాలామంది ఏదో ఒక కోరికతో మనకి లంచంగా కానుకలిచ్చేవారే. .

పద్మ: అవును స్వామీ, ఇంతటి విపత్తుకి కారణమైన కరోనాని మనం కట్టడి చేయలేమా. .

అలివేలు: నాదీ అదే అనుమానం స్వామీ. .

వెం.స్వామి: అమాయకపు దేవేరులూ, మీరు ఇంటిపట్టున ఉండబట్టి బయట పరిస్థితి అర్థం కావడం లేదు గానీ కొన్ని విషయాలు చెబుతా వినండి.
 
అసలు కొండమీద ఇంత కాలుష్యానికి కారకులెవరు. ‌.
 
దర్శనాలలో, అర్చనలలో సామాన్య భక్తునికి అవకాశముందా. .
 
కొండమీద జరిగే అక్రమాలు మనం చూసీ ఏమి చేశాం. .
 
మనమీద ఈ ప్రభుత్వాల పెత్తనాలేంటి. .
 
ఒకపక్క పవళింపు సేవ అంటారు, వెంటనే సుప్రభాతమా. .
మనకి ఏకాంత సేవ అంటూనే జనాన్ని చేరవేస్తున్నారా, లేదా. .
 
మనకి నిద్ర అనేది లేక కళ్ళు ఎరుపెక్కడం లేదూ. .ఎన్ని సంవత్సరాయింది మనకి ఏకాంతం దొరికి. .
పెట్టిన నైవేద్యం కైంకర్యం కావాలన్నా కాస్త సమయం కావద్దూ. .
 


ఇప్పుడు మన కొండమీద సంచరించే జీవజాతులు , సహజ నీటివనరులూ మాయమవడం లేదూ. .
ఇంతెందుకు, మనం ఈ వందా, నూటేభై ఏళ్ళలో ఇంత సరదాగా ఎప్పుడైనా ఉన్నామా. .

దేవేరులు: అవును నాధా. . మేము ఇంత ఆలోచించలేదు. .అదేదో మహమ్మారి అనుకున్నాం గానీ జనానికి, కాస్త  ఇంగిత జ్ఞానం ఇచ్చింది. .

వెం.స్వామి. . అవును
దేవేరులూ, ఈ మూసివేతలకి, వాటికన్ లో ఏసు, మక్కాలో అల్లా కూడా సంతోషంగానే ఉన్నారట. . నిన్న కలిసినప్పుడు తమ సంతోషాన్ని తెలిపారు. .

దేవేరులు: నిజమే స్వామీ మాకైతే పిల్లలకి సంక్రాంతి సెలవులు దొరికినంత ఆనందంగా ఉంది. . పనిలో పనిగా మన మిగతా దేవుళ్ళ దగ్గర కెళ్లి సరదా సంబరాలు చేసుకుందాం. .

వెం.స్వామి: వద్దు దేవీ. . తప్పు. . ఇప్పుడు జనం అంతా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. . మనం కూడా అలానే పాటించి లోకానికి ఆదర్శంగా నిలుద్దాం. .

దేవేరులు: అటులనే స్వామీ. .

సర్వేజనా సుఖినోభవంతు. శుభం.🙏
ఇప్పటికైనా .. కనువిప్పు 👀 కావాలి....

((()))

26. ఒక మంచి కధ...

క్షణంలో సగం--శ్రీరంగం శ్రీనివాసరావు...(శ్రీ శ్రీ)

(ఇది--ఆంధ్ర జ్యోతి మాసపత్రిక, 1949 ఏప్రియల్--ఉగాది సంచికలో ప్రచురించబడింది. తరువాత ఇంకెక్కడైనా ప్రచురించారో లేదో నేను చూడలేదు.)

.

ఒక సాయంత్రం (వాడి పేరు చెప్పను) కనబడ్డాడు.

"బయల్దేరు" అన్నాడు. ఎక్కడకని అడిగి లాభంలేదు వాడితో. హఠాత్తుగా అలాగే ఎన్నోసార్లు కనబడి ఏవో ప్రతిపాదనలు చేస్తూ వుంటాడు. నేను మారుమాట లేకుండా వాటిని శిరసావహిస్తూ ఉంటాను. "అనుభవం జ్ఞానానికి జనకుడు" అంటే నేను నమ్మను. అలాగే "అవసరం సృష్టికి జనని" అనే సుభాషితంలోకూడా నాకు నమ్మకంలేదు. అంటే పూర్తిగా నమ్మకం లేదనాలి. అవన్నీ సగం సత్యాలు కాబట్టి సగం సగం మాత్రమే నమ్ముతాను.
ఇద్దరం బయలుదేరిన తర్వాత వీడు (ఎవరి పేరైతే చెప్పదలచుకోలేదో వాడు) "ఇప్పుడు మనం లక్షాధికారులం కావడం ప్రారంభిస్తున్నాం. తక్షణమే! జోరుగా నడు" అన్నాడు. ఇద్దరం తక్షణం ప్రారంభించాం. కాని ఆ ప్రారంభం ఇప్పటికీ ప్రారంభదశలోనే ఉండి పోయింది. అప్పుడు బయల్దేరిన మేము ఇంకా బయల్దేరుతూనే ఉన్నాం.
* * *
ఈ సాయంత్రం ఇక్కడ ఈ నగరంలో.....సముద్రంలాంటి ఆకాశంలాంటి ఎడారిలాంటి ఆకాశంలాంటి సముద్రంలాంటి ఎడారిలాంటి ఎడారి, సముద్రంలాంటి ఎడారి, ఆకాశంలాంటి ఎడారి, ఎకసక్కెంలాంటి ఎడారి........
ఇక్కడ ఈ నగరంలో ట్రాం లో నేను......ఎదురుగుండా సెలూన్లో అద్దంలో నేను : అదైనా క్షణంలో సగంసేపు!
అదీ అసలు సంగతి. ట్రాంలో వెళుతున్న నేను సెలూన్లో అద్దంలో క్షణంలో సగంసేపు నన్ను నేను ప్రతిబింబించి నాకు నేను కనిపించాను. క్షణంలో సగంసేపు ఒకేసారి సెలూన్లోనూ ట్రాంలోనూ నివసించాను.
ఇక్కడ ఈ సాయంత్రం........ఎడారిలో ఆకాశంలో క్షణంలో సగంలో ట్రాంలో సెలూన్లో జనం మధ్య జనసముద్రమ్మధ్య జనసముద్రం మధ్య నేను.
ఇక్కడ ఈ నగరంలో ఈ క్షణంలో సగం సేపు ఏమిటి జరుగుతోంది?
* * *
"మనం లక్షాధికారులం కావడం ఎప్పుడు ప్రారంభిస్తాం" అని ప్రశ్నించాడు నయనకన్ను. వాళ్లిద్దరూ నాయరు దుకాణంలో నిన్నటి పకోడీలు నములుతున్నారు."ఇదిగో ఈ క్షణం" అన్నాడు దొరసామి. "టీ తీసుకున్న తక్షణం."
"డబ్బులు చాలుతాయా" అన్నాడు నయనకన్ను.
నాయరు రెండు గ్లాసులతో టీ తెచ్చి--వాళ్లముందుంచి పోయాడు.
"గుర్రాలు మోసం చేశాయని చెబుదాం. అరువుంటాడు నాయరు" అన్నాడు దొరసామి.
* * *
అక్రమ లాభాలమీద అదనపు పన్ను తగ్గింపు. ఆర్థిక పరిస్థితిమీద కేంద్ర ప్రభుత్వపు దండయాత్ర కృషి. ఇతోధిక కృషి. ద్రవ్యోల్బణము. దాని నరికట్టుటకు ఆరు మార్గాలు. రామపాదాల పీత నడక. అన్నివేళలూ తేనీటి వేళలే.
* * *
కాకెమ్మ చక్కని చుక్క. నిజంగా ఆ పేరుకి తగ్గదికాదు. పదేళ్ల కిందట మరీ బాగుండేది. అప్పుడు సినీమాలో నటించడానికిక్కడకు వచ్చింది. ఒక కెమేరా మనిషి ఆమె శరీరాన్ని అనేక కోణాలనుంచి చూసి చవిచూసి 'నువ్వు మంచం మీదకే కాని తెరమీదకి పనికిరా'వన్నాడు. దరిమిలాను చాలామంది ఆ అభిప్రాయాన్ని స్థిరపరిచారు. ఇప్పుడు కాకెమ్మ ఇంకో మంచం మీదకి వెళ్లబోతూంది.
* * *
దశవర్ష ప్రణాళిక బుట్టదాఖలా. బంగారం ధర పడిపోవడంవల్ల బ్యాంకులకి మూడురోజులు సెలవు. ఈ రాత్రి చంద్రుడు నూటికి 75 వంతుల నష్టంతో వ్యవహరిస్తాడు. అనుకోని గుర్రాల ఆకస్మిక విజయం.
* * *
జమీందారు సొంతకారు నడుపుకుంటూ జోరుగా పోతున్నాడు. స్వరాజ్యం వచ్చిన తర్వాతనో అంతక్రితం ఆరేడు నెలల పూర్వమో జమీందారు జాతీయ మతం తీసుకొని దీక్షావస్త్రాలు ధరించాడు.
పేవ్ మెంటుమీద నడుస్తున్న కుర్రాడు జమీందారును చూశాడు. కుర్రాడి జేబులో వేడివేడి వేరుసెనగపప్పుంది. పిడికిటి నిండా వేరుసెనగపప్పు తీసుకొని పట్టుకున్నాడు. కద్దరు దుస్తులతో కనుపండువుగా కనబడుతూన్న జమీందారుని వెరుసెనగ పప్పుతో అభిషేకించాలన్న ఆశ ఆ కుర్రాడి మనస్సులో మెరుపులాగ మెరిసింది. కాని ఒక నిశ్చయానికి రాలేకపోయాడు. కారు జోరుగా దాటిపోయింది.
* * *
జగద్విఖ్యాతి వహించిన షేక్స్పియరు మహాకవి నాటకం హేమ్ లెట్. మనస్సు స్థిరపరచుకోలేకపోయిన మానవుని విషాదాంత గాధ.
* * *
"ఉప్మా పట్రా" అన్నాడు. పట్టుకొచ్చాడు అయ్యర్వాళ్. తింటున్నాడు తెమ్మన్నవాడు. అందులో రెండు రాళ్లున్నాయి. కాఫీ తీసుకోకుండానే బిల్లు తీసుకొని డబ్బు చెల్లిస్తూ "ఉప్మాతోబాటు రెండు రాళ్లు ఎక్కువగా ఇచ్చాడు. అంచేత వాటికి నా యథాశక్తి ధర రెండర్థణాలు ఒక అణా చెల్లిస్తున్నా" నని అణా ఎక్కువ ఇవ్వబోయాడు. నేతాజీ విలాస్ కాఫీ క్లబ్బు (ఇక్కడ పదార్థాలు కల్తీలేని నేతితో చెయ్యబడవు) ప్రొప్రయిటరు అణా వైపు అతి భయంకరంగా చూశాడు. "ఎవరైనా బిచ్చగాడికి ధర్మం చేసుకో" అన్నాడు. రాళ్ల ధర చెల్లించదలచుకున్న మనిషి అణాకాసుని జేబులో వేసుకొని రెండు అయిదు రూపాయల నోట్లు బల్లమీదపెట్టి వెళ్లిపోయాడు.
"వెర్రి వెధవ" అనుకున్నాడు ప్రొప్రయిటరు, రూపాయి నోట్లను దాచేస్తూ.ఆ సమయంలోనే ఒక అణాకాసు అడుక్కునే అమ్మి డబ్బాలో పడ్డ చప్పుడయింది.
* * *
"కమ్యూనిస్టులను పాతేస్తున్నాం" అన్నారు దొరతనంవారు. పాతేస్తున్నారు. వానలు కురిస్తే దేశం అంతటా కావలసినంత పంట.
*************
(69 న్నర సంవత్సరాల తరువాత ఇప్పుడుకూడా నిన్ననో మొన్ననో వ్రాసినంత తాజాగా లేదూ ఈ కథ? ఆలోచించండి!)
(((())))

27... విగ్రహ ఆరాధన ఎందుకు చెయ్యాలి ? ఎలా చెయ్యాలి ??
సర్వాంతర్యామియైన భగవంతుడు కేవలం తపఃసంపన్నులను, యోగులకే చూడ సాధ్యమవుతాడు. ఆకారణంగా సామాన్యులకు ‘అర్చావతారవిగ్రహా’లే శరణ్యమవుతున్నాయి.

విగ్రహాలలో భాగాచ్చక్తి నింపటానికి మంత్రం, యంత్రం, తంత్రం అనే మూడు సాధనములు ఉన్నాయి. భగవతత్వం ప్రప్రథమంగా శబ్దంచే గ్రహింపబడుతుంది. భగవద్రాహకమగు శబ్దమేది ఉందో, అదే ఆ దైవం యొక్క మంత్రంగా నిలుస్తోంది.

నిత్యపూజాగృహములయందు పూజావిగ్రహాలు 4 అంగుళాలు మొదలు 12అంగుళాల వరకు ఉండాలి. పూజా ప్రతిమలు రత్నాలతో తయారైనవైతే అత్యుత్తమం. ఆ తరువాత బంగారం, వెండి, రాగి లోహాలతో విడివిడిగా గాని, ఈ లోహములన్నింటిలో కలిపి గాని (పంచలోహాలు) చేయుంచుకోవటం ఉత్తమం. రాయితో తయారైనవి మధ్యమం, చెక్కలతో తయారైనవి అధమం. దైవపటాలకన్నా విగ్రహాలు శ్రేష్ఠం. అందులోనూ పంచలోహాల విగ్రహాలు గాని, శిల, దారు, మృత్తికావిగ్రహాలు కాని, శక్త్యానుసారంగా ఉపయోగించుకోవచ్చు.

దైవవిగ్రహాలు చూడటానికి ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా, మనస్సుని ఆకట్టుకునే విధంగా, కళాత్మకంగా, సుందర మనోహరంగా తీర్చిదిద్దిఉండాలి.

ఇంట్లో ఈశాన్యభాగంలోగాని, ఉత్తర, తూర్పుభాగాలలోగాని పూజామందిరాన్ని ఏర్పరచుకోవాలి. పూజామందిరంలో ఈశాన్య, తూర్పు, ఉత్తర భాగాలలో ఉన్నతమైన స్థలంలో గాని, ఎత్తైన పీఠంపైగాని పూజావిగ్రహాలను ప్రతిష్టించాలి. దైవవిగ్రహాలకు ఎదురుగా కూర్చుని పూజించరాదు.

సగుణ జ్ఞానహీనస్య నహినిర్గుణ వేదనమ్
నందిదర్శన హీనస్య యథా న శివదర్శనమ్

ఎలాగైతే నంది దర్శనాన్ని చేయలేనివాడు శివదర్శనాన్ని చేయలేకపోతాడో, అలాగు సగుణజ్ఞానంలేనివానికి నిర్గుణజ్ఞానం సిద్ధించదు. పెద్దఆకారంతో గర్భగుడికి బైటనున్న నందీశ్వరుని చూడజలని అశక్తుడు చీకట్లో చిన్నదిగా ఉన్న శివలింగాన్ని ఎలా చూడగలడు? అని శివపూరానం చెబుతోంది. అందుకనే సగుణరూపంలో మనకోసం భూలోకానికి విచ్చేసి కొలువైన దైవాలను నియమనిష్ఠలతో పూజించి వారి ముందు మన లో ఉన్న మనసును ఉంచి వారి కరుణాకటాక్ష వీక్షణాలతో మన జన్మలను ధన్యం చేసుకుందాం.

హిందూమతంలో పధానమయినది ఏకేశ్వరభావాన. ఏ దేవుని పూజించినా ఆ పూజలన్నీ ఏకేశ్వరునికే చెందుతాయన్నది ప్రతి ఒక్క హిందువు అపర నమ్మకం! మన సాంప్రదాయాలు, సనాతనధర్మం, భక్తి, అంతర్యమి ల నుండి సేకరించిన సమాచారము
సేకరణ : గూగుల్ సర్చ్ నుండి

No comments:

Post a Comment