Sunday 7 November 2021

 



O Radhamadhava.....how to live without You! 


వాల్మీకి మహర్షి విరచిత యోగ వాశిష్ట సారము 

13. జీవన్ముక్తుడు 
తత్వజ్ఞానమునొంద గోరువాడు ముందుగా శాస్త్ర విరుద్దముగ నడవకుండ, భోగవాసనలను పరిత్యజించ వలెను. దొరికిన దానితో తృప్తి నందవలెను. జ్ఞాన వైరాగ్యాది విశిష్టగుణములు కల్గిన సాధు పురుషుని ఆశ్రయింపవలెను. విద్యలన్నింటిలో, ఆధ్యాత్మ విద్యయె యున్నతమైనది. చిల్లగింజ వలన జలముల మకిలి తొలగునట్లు, సాధు సంగమము, సచ్ఛాస్త్రము వలన వైరాగ్యము లభించును. ఆ బ్రహ్మము ఎచ్చట వున్నదని రాముడు ప్రశ్నించినపుడు, వసిష్ఠుడు, చైతన్య రూపమున నున్న బ్రహ్మము విశ్వమంత విస్తరించివున్నదని. ఈ చిన్యయ బ్రహ్మమే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సూర్యుడు. 

ఈ జీవుడు అజ్ఞుడై దుఃఖము ననుభవించుచున్నాడు. చిత్తవృత్తులు నశించి అంతర్ముఖమైనపుడు పూర్ణత్వము ప్రకాశించును. దానిని తత్వ సాక్షాత్కారమందురు. అపుడు హృదయ గ్రంధి విచ్ఛిన్నమై సందేహములన్నియు తొలగిపోవును. సంచిత కర్మలు లయమై పోవును. బ్రహ్మం యొక్క స్వరూపమును గూర్చి చెప్పుచు వసిష్ఠుడు, అది ఆకాశములో శూన్యముగను, రాతిబండలో నిశ్చేష్టితముగను, ప్రకాశ పదార్ధములలో వెలుతురుగను, ఆ పరమాత్మ నిక్షిప్తమైయున్నాడు. రూప రహితమైన ఆకాశము నీలవర్ణముగనున్నట్లు, చిన్మయ బ్రహ్మమున ఈ భ్రాంతి జగత్తు కన్పడుచున్నది, అనే జ్ఞానము కల్గినపుడు బ్రహ్మ స్వరూపము బోధపడును. ప్రళయ కాలమున, ఈ దృశ్య సముహములన్నియు నశించును. ఆ పరమ పురుష బ్రహ్మ మెుుక్కటే మిగిలియుండును. 

అపుడు శ్రీరాముడు సూక్ష్మమైన ఈ బ్రహ్మమున, ఈ ప్రపంచ మెట్లు ఇమిడియున్నదని ప్రశ్నించెను. ఆవగింజయందు మేరు పర్వతముండ గలదా! అందుకు వసిష్ఠుడు ఏకాగ్ర చిత్తముతో, సాధు సంగమ, సత్‌శాస్త్రములను సేవించిన, నీ చిత్తమునంటి యున్న మరీచిక వంటి దృశ్య భ్రాంతి తొలగును. చైతన్యము మాత్రమే మిగిలియుండును. అహంకారము తొలగును. ఈ జగత్తు మిథ్యయే, జగత్తను వస్తువు సృష్టించబడలేదు కనుక అది లేదు. అందువలన మర్రి విత్తునందుమర్రి వృక్షమున్నట్లు, ఈ విశ్వమంతయు సూక్ష్మాతి సూక్ష్యమై, బ్రహ్మము నందు నిక్షిప్తమై యున్నది. ఇంకనూ ఈ శాస్త్రజ్ఞానము పొంద వలయునన్న, ఈ మహారామాయణమే యుత్తమమైనది. ఇందు వున్న విశేషములే మిగిలిన శాస్త్రములందున్నవి. దీనిని శాస్త్ర కోశమందురు. మంచి మందు పుచ్చుకొనిన రోగము నశించునట్లు శాస్త్రమును పఠించిన జీవన్ముక్తి లభించును. ఒక బ్రహ్మమున చిత్తము నిల్పి బ్రహ్మ గతప్రాణులై ఒండొరులు బ్రహ్మమును గూర్చి మాట్లాడు కొనువారు జ్ఞానులు. వీరు జీవన్ముత్తులు. సాధారణ మహాత్ములకు ముక్తి మరణానంతరము లభించుచు. పని పాటల నొనర్చుచు, జ్ఞాన తంత్రుడై, జాగ్రదవస్ధ యందు కూడ, నిద్రితునివలె నిర్వికారుడై మెలగువాడు జీవన్ముక్తుడగును. 

ఇంకను ఎవ్వని ముఖము సుఖము లభించిన వికసింపక, దుఃఖము లభించిన దుఃఖించక అన్ని సమయముల ఒకేరీతిగ నుండునో, లభించిన దానితో తృప్తి నొందునో అతడే జీవన్ముక్తుడు. అహంభావము లేనివాడు, కార్యము లొనర్చుచున్నను, ఒనర్పక పోయినను, కర్తృత్వాభిమానములు అంటని వాడు జీవన్ముక్తుడు. 

ఇంకను లోకమునకు భీతి కల్గించని వాడును, భీతినొందని వాడును, సుఖదుఃఖముల ననుభవించని వాడును, సంసారాసక్తి లేని వాడును. దేహియైనను నిరాకారుడు, చిత్త సహితుడయ్యు అమనస్కుడు , జగత్‌ వ్యాపారముననున్నను, కామమునకు లొంగనివాడు, పదార్ధములన్నింటియందు, ఆత్మ యొక్క పూర్ణత్వమును గాంచువాడు, జీవన్ముక్తుడనబడును. 

వాయువు స్పందనను వీడి నిశ్చలమగునట్లు, విదేహముక్తుడు మరల జన్మింపడు, మరణించడు, వ్యక్తము కాడు, అట్టివాడు బ్రహ్మమగుట వలన సృష్టి, స్ధితి, లయ మొనర్చగల్గును. అతడు ఆకాశము, మేరు పర్వతము, భూమి, జల, అగ్ని, చీకటి వెలుగు, సముద్రమై యున్నాడు. భూత,భవిష్యత్‌ వర్తమాన కాలములందు, అతడే యున్నాడు. అట్టిముక్తిని పొందుటకు ఈ జగత్తంతయు బ్రహ్మముతో నిండియుండునని గ్రహించవలెను. అట్టి జ్ఞానము పొందుటకు అభ్యాసము, యుక్తి, ఉపదేశము అవసరము. ఖేచర ముద్రలో భూమధ్యమున జగత్‌ స్వరూపమును కాంచునట్లు, జీవన్ముక్తుడు, బ్రహ్మమై సర్వమును గ్రహించును. 

ఈ బ్రహ్మము సర్వదా పవిత్రము, జాగృతమునైనను, మరల అలా కాకుండ వున్నది. నానావిధ రూపములుగ వేర్వేరుగనున్నది. ఈ బ్రహ్మమే నీటి యందు అలలు లేచునట్లు, ఈ బ్రహ్మ వస్తువునుండియె, ఈ దృశ్య జగత్తు ప్రభవించినది. రూప, రస, గంధ, శబ్ద, స్పర్శలు, క్రియలు వీటి జ్ఞానము కూడ ఈ బ్రహ్మము వలననే గల్గుచున్నది. ప్రకాశ స్వరూపమగు ఈ బ్రహ్మము స్వయం ప్రకాశమే. బుద్దిగుహ యందుండి దానిని ప్రకాశింప జేయుచున్నది. దీనినెవ్వరు ప్రకాశింప జేయలేరు. చిత్త వృత్తుల నిరోధించి, మనస్సును కూడ లయమొనర్చిన, మిగిలియుండు అవర్ణనీయ సాక్షి చైతన్యమే అయ్యది. 

శరీరమునకు వాతాది స్పర్శలు తగిలినను, చిత్తమునకు, స్పర్శ జనించి, వికారము కలుగునట్లు బ్రహ్మమున్నది. అచల స్వభావులగు స్ధావర పదార్ధములకు మనోబుద్యాది ఇంద్రియములు లేకున్నను, చైతన్యమున్నట్లు, పరమాత్మస్ధితి సర్వత్ర విస్తరించియున్నది. బ్రహ్మ, సూర్య, విష్ణు, హరాధి దేవతలు లయమైనను, ఈ బ్రహ్మ మొక్కటియె మిగిలియుండును. దీనికెట్టి యుపాధి లేనందున, నిర్వికల్ప స్వరూపమగును. 

ఈ జగత్తు బ్రహ్మమున నున్నను, దీనికి వేరు రూపము లేదు. కాటుక కును నలుపునకును భేదము లేనట్లు, బ్రహ్మమునకు జగత్తుకు భేదము లేదు. అలాగే మంచుకు చల్లదనమునకు భేదము లేదు. నీరు ద్రవ భావమును, వాయువు స్పందన రూపమును, ప్రకాశము కాంతి ఆకారము దాల్చుకున్నట్లు, బ్రహ్మము జగదాకారము వహించియున్నది. దృశ్యమున్నను ద్రష్టయుండును. దృష్టి యుండిన దృశ్యముండును. ఈ రెంటికిని బంధమున్నది. వీటిలో ఏ ఒక్కటి లేకున్న, రెంటికి ముక్తి కల్గును. దృశ్యబుద్ధి సంపూర్ణముగ నశించు వరకు, దృశ్యమగుపించు చుండును.

[09/10, 18:45] +91 92473 43585: మహా ప్రస్థానం:-


❇️ ప్రస్థానం అనగా యాత్ర

❇️ మహాప్రస్థానం అనగా అంతిమయాత్ర (తిరిగి రాని యాత్ర)    

   

➡ ఈ యాత్ర జరగవలసినది ఆత్మకు కానీ, దేహానికి కాదు.

➡ అనగా ఆత్మ, భూమి మీద జన్మకు మళ్ళీ తిరిగి రాని యాత్రను నిర్వర్తించాలి.

➡ ఈ యాత్రను సమాప్తం చేయాలంటే  'నేను' అనే అహంకారం తొలగాలి.

అహంకారం పోవాలంటే "ధ్యానం", ఆత్మ విచారణ, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం తప్పకుండా చేయాలి.

[09/10, 19:02] +91 92473 43585: రోగం అనేది శిక్ష కాదు, 'ఓ శిక్షణ'.

[11/10, 18:44] +91 92473 43585: మనలోకి 'మనం' వెళ్తే, మనల్ని మనం అర్థం చేసుకుంటే, ఇతరులను అర్థం చేసుకోవడం చాలా సులభం.

[11/10, 19:01] +91 92473 43585: 'కర్మఫలం' మీద ఆశ పడకుండా 'కర్మాచరణ' లో మాత్రమే  నిమగ్నం కావడమే "కర్మయోగం".

[12/10, 20:14] +91 92473 43585: ఏకాంతం అంటే ఒంటరితనం కాదు, జనసాగరం లో ఉండి కూడా అంతర్ముఖుడై ఉండటం.

[13/10, 19:28] +91 92473 43585: గురువు అంటే నేర్పించేవాడు కాదు! శిష్యుడు అంటే నేర్పించబడేవాడుకాదు! నిజానికి ఎవ్వరూ ఎవ్వరికీ ఏ విద్యను అందించలేరు!


 అయితే, ఎవరికి వారు తమ తమ సాధన అవగాహనల ద్వారా 'నేర్పు' ఉన్నవారి 'నేర్పరితనం' చూసి నేర్చుకుంటారు!  తగిన సాధన క్రమంలో, అనుభవక్రమంలో లఘువులు (శిష్యులు) గురువులుగా ఎప్పుడూ అవుతూనే ఉంటారు!

[13/10, 19:36] +91 92473 43585: ప్రతి సంకల్పమూ శూన్యం అవటమే - ధ్యానం.

[14/10, 18:55] +91 92473 43585: మాయ - యమ:-


యమ అనే శబ్దాన్ని తిప్పి చదివితే మాయ అనే శబ్దం వచ్చును.


➡ యముని కర్తవ్యం ఏమిటంటే

 మనము భౌతిక శరీరాలము అనే 'మాయ'ను  తొలగించడమే.

[14/10, 19:46] +91 92473 43585: పదార్థ త్యాగం - పరమార్థ యోగం:-


 'పదార్థం'పై మమకారాన్ని త్యాగం చేస్తేనే 'పరమార్థం' వైపు దారి మళ్ళుతుంది.  


భౌతిక పదార్థాలు నిమ్న లోకాల వైపు దారి తీస్తే, పరమార్థ యోగం ఊర్థ్వ లోకాల వైపు దారి తీస్తుంది.

[16/10, 20:10] +91 92473 43585: జగత్తు మిథ్య - బ్రహ్మం మిథ్య

 ( మొదటి జన్మల్లో)


జగత్తు సత్యం - బ్రహ్మం మిథ్య

( తరువాతి జన్మల్లో)


జగత్తు మిథ్య - బ్రహ్మం సత్యం

(సాధన మొదలు పెట్టిన తొలి జన్మల్లో)


జగత్తు సత్యం - బ్రహ్మం సత్యం

( మోక్ష దశకు చేరువయినప్పుడు)


జగత్తు అనగా ఇహలోకం,  బ్రహ్మం అనగా పరలోకం. (ఊర్ధ్వ లోకాలు)

 యధార్థం ఏమిటంటే జగత్తు సత్యమే (తాత్కాలిక సత్యం),  బ్రహ్మము సత్యమే (శాశ్వత సత్యం)

[18/10, 20:01] +91 92473 43585: ప్రార్ధన:-  ప్రా+ అర్థన 

➡️ ప్రాణ శక్తిని అర్థించడం (కోరడం)

➡️ మరి ప్రాణ శక్తి అత్యధికంగా లభించేది 'ధ్యానం'లో మాత్రమే.

[21/10, 20:17] +91 92473 43585: వృక్షారణ్యంలో ఉండే యోగి కన్నా,


జనారణ్యంలో ఉండే యోగి శక్తి చాలా ఎక్కువ.

[26/10, 20:09] +91 92473 43585: ఎదిగే చెట్టుకు పట్టిన చెద పురుగే అహంకారం.

[27/10, 19:37] +91 92473 43585: ఎవరైనా నచ్చకపోతే,  వారి గురించి ఆలోచించడం ద్వారా చాలా శక్తి వృధా అవుతుంది.

[28/10, 20:17] +91 92473 43585: నీవు ధ్యాన కేంద్రం లో కూర్చొని ధ్యానం చేయడం కాదు;


 నీవు ఎక్కడ కూర్చొని ధ్యానం చేస్తే అదే "ధ్యాన కేంద్రం" అవుతుంది.

[29/10, 18:58] +91 92473 43585: నేను వేరే, నువ్వు వేరే, నేను ఇదే, నేను ఇంతే, ఇది నాది అనే భావాల్ని సమగ్రంగా, సంపూర్ణంగా వదలిపెట్టగలగడమే సన్యాసం.

[29/10, 19:04] +91 92473 43585: ప్రజల్పం అంటే 'అసందర్భపు ప్రేలాపన',  'పనికిరాని మాటలు మాట్లాడటం'.


 ప్రజల్ప రాహిత్యం అంటే శక్తిని పొదుపు చేయటం అనగా నోట్లో నుంచి ఒక్క అనవసరపు మాట కూడా మాట్లాడకుండా ఉండటం.

[30/10, 19:45] +91 92473 43585: 👉 'వర్తమానం'లో ఉండడమే- పాజిటివ్ ఎనర్జీ 


👉 'భూత, భవిష్యత్తు' లో ఉండడమే- నెగిటివ్ ఎనర్జీ

[30/10, 20:07] +91 92473 43585: 👉 చలం - కదిలేది (ఉయ్యాల ఊగడం)

👉 నిశ్చలం - కదలనిది కానీ కదలడానికి అవకాశం ఉన్నది. (ఉయ్యాల ఆగడం)

👉 అచలం - ఎట్టి కదలిక లేనిదే అచలం. (ఉయ్యాలకు ఆధారమైన కొక్కెం.Hook)

 ✳️ అచలమే చలానికి, నిశ్చలానికి ఆధారం.


➡️ రఘుగా (నామరూపాలు) ఉన్నంతకాలం చలం, నిశ్చలం రెండు ఉంటాయి. రఘును దాటితే ఉండేది అచలమే.

➡️ చలం, నిశ్చలం కలిగిన నేను - ఉన్నట్లున్న నేను;    అచలం కలిగిన నేను - అసలైన నేను.

[01/11, 18:56] +91 92473 43585: నేను స్వతంత్రుడినా?  అస్వతంత్రుడినా? అని నిన్ను నీవు  ముందు ప్రశ్నించుకో.


👉 నీవు స్వతంత్రుడివే అయితే,  'నా కర్మకు నేనే బాధ్యుణ్ణి' అని అనుకుని ప్రశాంతంగా ఉండు.

👉 నీవు అస్వతంత్రుడివే అయితే,  'కర్త భగవంతుడు' అని స్థిమితంగా ఉండు.

[02/11, 18:51] +91 92473 43585: 'సత్యం'తో పరిశోధనలు చేయడానికి ఉన్న అద్భుతమైన పరికరమే మన "జీవితం".

[02/11, 19:35] +91 92473 43585: ➡ బింబం - ఆత్మ

➡ ప్రతిబింబం - ప్రపంచం

➡ అద్దం - మాయ 


బింబం సరిచేసుకోవడానికే అద్దం.


 ఆత్మ తనను తాను అద్దంలో (మాయ) చూసుకుని,  సవరించుకుంటే (ఉద్ధరించుకుంటే) అదే ప్రపంచాన్ని సవరించడం (ఉద్ధరించడం) అవుతుంది.

[03/11, 18:52] +91 92473 43585: తప్పు సామెత:- 

పండగ పూట పాత మొగుడేనా


సరి అయిన సామెత:-

పండగ పూట పాత మడుగేనా ( వస్త్రమేనా)

అనగా పండగపూట కొత్త వస్త్రాలను ధరించమని..

[05/11, 18:44] +91 92473 43585: తప్పు సామెత:-

 ఇల్లు ఇరకాటం - ఆలి మర్కటం (కోతి)


సరి అయిన సామెత:-

ఇల్లు ఇరు కవాటం - ఆలి మరు కవాటం

అనగా ఇంటికీ రెండు తలుపులు ఉండాలి.,  భార్య తలుపు చాటు ఉండాలి అని.

[06/11, 18:21] +91 92473 43585: 4 దశలు


1) ఆర్తః:- ఆర్తనాదాలు చేసేవారు. అనగా ఏదైనా 'కష్టాలు' వచ్చిన తర్వాతనే భగవంతుణ్ణి స్మరిస్తారు.

2) అర్థార్థి:- ఏదైనా 'ప్రయోజనం', 'కోరికలు' ఉంటేనే భగవంతుణ్ణి స్మరిస్తారు.

3) జిజ్ఞాస:- వీరు నిజంగా భగవంతుణ్ణి 'తెలుసుకోవాలని' తపన పడేవారు.

4) జ్ఞాని:- చివరికి భగవంతుణ్ణి తానే అని 'తెలుసుకున్నవారు'. మనమందరం ఆ పరమాత్మ యొక్క స్వరూపాలమని అందరికీ 'తెలియచేసేవారు'.

[08/11, 18:47] +91 92473 43585: మన "మనస్సు" ఎలా పనిచేస్తుందో, శాస్త్రజ్ఞుల యొక్క వివరణ:-


 ఉదాహరణ:- ఒక స్నేహితుడు వచ్చాడు.,  అతన్ని ఆనందంగా లోపలికి ఆహ్వానించాము.


 ఈ యొక్క సంఘటనలో 4 విభిన్న పరిస్థితులు మనస్సులో చోటు చేసుకున్నాయి.,  అవేంటో చూద్దాం


1) Conscious:- అనగా ఎరుక.,  'ఒకడు' వచ్చాడు అని తెలుసుకోవడమే ఈ సంఘటనలో మొదటి పరిస్థితి.


2) Perception:- అనగా గుర్తించటం. ఆ వచ్చిన ఒకరు తన 'స్నేహితుడు' అని గుర్తించడమే రెండవ స్థితి.


3) Sensation:- అనగా అలజడులు. బాధ, ఆనందం, భయం, కోపం, దయ (ఇవి కొన్ని మాత్రమే). ఈ సంఘటనలో చూసిన వెంటనే 'ఆనందం' కలిగినది అనే స్థితి.


4) Reaction:- అనగా ప్రతి స్పందన. పై ఉదాహరణలో 'లోపలికి ఆహ్వానించడమే' ఈ సంఘటనలోని ప్రతి స్పందన.


మన మనస్సు -- ఈ సంఘటన అంతా (4 పరిస్థితులు) ఒక సెకనులోని 10 లక్షల వంతు సమయంలోనే జరుగుతుంది. మనకు ఎంతయితే Sensation ఉంటుందో అంతా Reaction ఉంటుంది.  అందువలన యోగులు Sensation స్థితిలో స్థిరంగా ఉంటారు.

1 .
నీలో అనంతశక్తి ఉందని విశ్వాసం కలిగి ఉండు. జాగరూకుడవై ఆ శక్తిని వ్యక్తపరచు. "నేను ఏదైనా సాధించగలను". అని సంకల్పించు. పాము విషం కూడా గట్టిగా తిరస్కరిస్తే మీపట్ల నిర్వీర్యమైపోతుంది. "చేయలేను" అని అనవద్దు. ప్రతికూల భావనలు రాకూడదు జాగ్రత్త!


లోపం ఉన్నదని భావించడమే లోపాన్ని సృజిస్తున్నది. బలం, పరిపూర్ణతల గురించి భావించడమే లోపాన్ని సరిదిద్దగలదు.

3 .
మనం చేసే ప్రతి ఆలోచన మన శరీరాలు అనే ఇనుప ముద్దలపై పడే చిన్న సుత్తి దెబ్బల లాంటిది. దాని నుండి మనం ఏమి కావాలని అనుకుంటున్నామో అలా రూపొందుతాం. మన ఆలోచనలు ఎలా తయారు చేస్తే అలా అయ్యాం మనం. అందువల్ల మీరేం ఆలోచిస్తున్నారు అనే దాని పట్ల జాగ్రత్త వహించండి.

4 .
మనస్సు శాంతితో, ఏకాగ్రతతో ఉన్నప్పుడే, మన శక్తి అంతా ఉత్తమ కార్యసాధనలో వినియోగపడగలదు. ఈ ప్రపంచంలో ప్రభవించిన ఉన్నతమైన కార్యశీలుర జీవితచరిత్రలను చదివితే వారంతా స్థిరచిత్తులని గ్రహించగలరు.

5 .
శరీరాన్ని గురించి మనమెంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. ఎందుకంటే, మనలను కిందికి దిగలాగేది ఈ శరీరమే. సంగత్వం, దేహాత్మబ్రాంతి - ఇవే మన దుఃఖాలకు కారణం.

6 .
మన చుట్టూ ఉండే విషయాలు ఎన్నటికీ మెరుగుపడవు. అవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. వాటిలో మనం తెచ్చిన మార్పుల ద్వారా మనమే పరిణతిని పొందుతాం.

7 .
రాత్రీ పగలూ ఒక్కటిగా కూడజాలవు. రాముడు కాముడు ఒక్కచోట ఉండలేరు.


లక్ష్య వస్తువుపై ఏకాగ్రత పెంచుకోవడానికి ముందు మీరు ఇతర విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి.

9 .పిరికితనాన్ని మించిన మహాపాతకం మరొకటి లేదు. పిరికిపందలు రక్షించబడరు. అది నిశ్చయం.

10 .
విజయం పొందాలంటే, మొక్కవోని పట్టుదలను, ప్రబలమైన సంకల్ప శక్తిని నీవు కలిగి ఉండాలి. 'నేను సముద్రాన్నే తాగేస్తాను. నా సంకల్ప శక్తితో పర్వతాలు కూడా పొడి పొడి కావలసిందే! అని పట్టుదల గలవాడు అంటాడు. అటువంటి వీర్యోత్సాహంతో, ధృఢ సంకల్పంతో కష్టపడి పని చేయి. తప్పక గమ్యాన్ని చేరతావు.

11 .ఒక ప్రాపంచిక క్షుద్రకీటకం మాదిరి చావటంకంటే, సత్యాన్ని భోధిస్తూ కార్యరంగంలో మరణించటం ఉత్తమం.

12 స్త్రీకి గాని, పురుషుడుకి గాని - హృదయపవిత్రతే మొదటి సుగుణం.

13 .మనం తలపెట్టిన ప్రతీ కార్యంలోను మెచ్చుకొనేవారు కొందరు, తప్పులెన్నేవారు కొందరు ఉంటారు.

14 . మీలోని దివ్యత్వాన్ని పెంపొందించేది పుణ్యం; పాశవికతను పెంచేది పాపం.

15 . ..
ఏ వ్యక్తి అయినా, ఏ దేశమైనా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే మూడు లక్షణాలు అవసరం. అవి-
1. మంచితనానికి ఉన్న శక్తి పట్ల అఖండ విశ్వాసం.
2. అసూయ, అనుమానం లేకుండా  ఉండడం.
3. మంచిగా ఉండాలనుకునే వారికీ, మంచి చేయదలచుకునే వారికి తోడ్పడటం.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మార్చి 28.

16 .
లేవండి! మేల్కొనండి! ఇకపై నిద్రించకండి (అజ్ఞానాంధకారము నుండి బయటకు రండి). ప్రతి ఒక్కరిలోనూ కోరికలు, దుఃఖాలను తొలగించుకొనే శక్తి ఉంది. నమ్మండి! అప్పుడు ఆ శక్తి ప్రకటితమవుతుంది.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మార్చి 26.

17 ...
ధీరులూ, సమర్ధులైన కార్యసాధకులకే అదృష్టం అనుకూలిస్తుంది. దిగంతాలను తాకే వీరోచితమైన ధైర్యోత్సాహాలతో ప్రయత్నిస్తూ కడదాకా వేచి ఉండేవారే అధ్బుతాలను సుసాధ్యం చేయగలరు.

17. 
ప్రతీ వ్యక్తి సొంత ఆదర్శాన్ని తీసుకుని, దానిని సాధించడానికి ప్రయత్నించాలి. తానెన్నటికీ సాధించే ఆశ లేని ఇతరుల ఆదర్శాలను ఆచరించడం కంటే, తను నమ్మిన ఆదర్శాన్ని సాధించే వరకు ప్రయత్నించడమే పురోగతికి ఖచ్చితమైన మార్గం.



18. 
నాయనలారా! నిజమైన మానవులవ్వండి. అదే నేను కోరేది. దీనిలో మీరు కొంతైనా విజయం సాధించినా, నా జీవితం సార్ధకమైనట్లు భావిస్తాను.


19. 
ధ్యైర్యం, నీతిపరత్వం తప్ప నా బిడ్డలైన మీకు మరే మతం అవసరం లేదు.


20. 

కృతజ్ఞత, అతిధిసత్కారం భారతీయుల ప్రత్యేక లక్షణాలని మనం గుర్తించాలి.


   ప్రతి మనిషిలోను దివ్యత్వం గర్భితంగా ఉంది. ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి. దివ్యత్వం గల పవిత్రులూ, మంచివారైన వ్యక్తుల దరికి దుఃఖం ఎన్నటికీ చేరదు.

  మన దేశానికి ఇప్పుడు కావలసింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు. ఇంకా ఎవ్వరూ నిరోధించలేనిదీ, జగత్తులో రహస్యాలను ఛేదించగలిగేదీ అయిన వజ్ర సంకల్పం! మహా సముద్రంలో అట్టడుగునకు మునగవలసి వచ్చినా, ముఖాముఖీ మరణాన్ని ఎదుర్కోవలసి వచ్చినా, లక్ష్యాన్ని ఏ విధంగానైనా సాధించగలిగే ధృఢసంకల్పం మనకు కావలసి ఉంది.



No comments:

Post a Comment