Friday 5 November 2021

 




Transcendental Love | A Common Thread

01. మనస్సు , 02. ప్రేమతో - ప్రేమ లేఖ, 03. నేటి ఆధ్యాత్మికం : ,04. ఆలింగనం అంటే ఏమిటి -(?), 05. ఆశ్రయం కోసమో, 06. భగవంతుడు రెండు సార్లు మనిషి, 7. కంచిలోబంగారుబల్లి_కథ,08. నేటి త్రిపురాంతకం............!!, 09. భేదభావం నశిస్తే జీవన్ముక్తుడే 10.  ఓం నమె భగవతే శ్రీరమణాయః

01. మనస్సు 

శూన్యమగు ఆకాశమునకు పేరు మాత్రమే కలదు. వేరే రూపములేనట్లు, మనస్సుకు కూడ ఎటువంటి రూపము లేదు. అయినను ఆకాశము వలె మనస్సు సర్వత్ర విస్తరించియున్నది. చంచల శక్తితో కూడిన మనస్సొక్కటియే స్ఫురించుచున్నది, భ్రమించుచున్నది, స్వర్గ, నరకములకు పోవుచున్నది, యోచించుచున్నది. సంసారమున నిమగ్నమగుచున్నది, పతనమగుచున్నది లేక ముక్తి పొందుచున్నది. 

ఇదంతయు మనస్సు యొక్క పనియే గాని, జగత్తు వేరుగ లేదు. సంకల్పమే మనస్సు. చలనము నుండి వాయువు, ద్రవ్యము నుండి నీరు వేరుకానట్లు, మనస్సు సంకల్పము కంటే వేరు కాదు. దేహ రూపియగు బ్రహ్మమే మనస్సనిజెప్పబడి, అది భౌతిక బుద్ధిని సృష్టించుచున్నది. దృశ్య ప్రపంచమే మనస్సు. చిత్త మాలిన్యముల వలెనే నీకీ దృశ్యమగు విశ్వము కనిపించుచున్నది. ఈ మాలిన్యం తొలగినచో, దృశ్యము అగుపడదు. అపుడు నిర్మల దర్పణము వలె స్వచ్ఛమగుదుము.

 గాలి వీచనిచో లతాదులు కదలవు. అలానే ఆత్మలో ఏకత్వముఏర్పడిన, చిత్త స్పందన ఆగి, రాగ ద్వేషములు వాసనలు దొలగిపోవును. అద్దము నందు ప్రతిబింబము లేకున్న అద్దము స్వచ్చమగునట్లు, నీవు ఈ జగత్తు కాదు అని భావించిన ద్రష్ట కూడ కేవలుడగును. 

ఇదంతయు విన్న శ్రీరాముడు, వసిష్ఠు నీవిధముగా ప్రశ్నించెను. సత్తునకు వినాశము లేదు. అసత్తునకు ఉత్పత్తి లేదు. ఎడతెగక దోషములతో నిండి సద్వస్తువు వలె ప్రకాశించు ఈ జగత్తు, అసత్యమని ఎట్లు తెలుసుకొనగలమో తెలుపు మనగా, వసిష్ఠుడు ఇట్లు పల్కుచున్నాడు. ఈ దృశ్య ప్రపంచము శాంతించు మంత్రమును చెప్పుచున్నాను. దీని వలన దృశ్య భావము నశించును. ఆకాశాది భూతములు, వ్యవహారమందు మాత్రమే జగత్తు అనబడును. కాని పరమార్ధ దశ యందు బ్రహ్మమే కలదు.

 ఈ ప్రపంచము స్వప్నమున గాంచు గృహాదుల వలె, మనస్సు యొక్క కల్పనమే. ఈ మనస్సుకు యుత్పత్తి లేదు, శరీరము లేదు. స్వప్నము, స్వప్నమును గాంచలేనట్లు మనస్సు అసత్తయ్యి, నిజేచ్చ వలన, నిజ శరీరమును కల్పించుకొని, దాని వలన, ఇంద్రజాలము వలె జగత్తును విస్తరించుచున్నది. చంచల శక్తితో కూడిన మనస్సోక్కటియే స్ఫురించుచున్నది, భ్రమించుచున్నది.

 స్వర్గ నరకములకు బోవుచున్నది. సంసారమున నిమగ్నమగుచున్నది. ముక్తినందుచుచున్నది. ఇదంతయు మనస్సు యొక్క పనే. మనస్సు గాక మఱి జగత్తులేదు. మహాప్రళయమున దృశ్య సృష్టి అంతయు లయమగును. అప్పుడు మిగిలేది బ్రహ్మ మొక్కటియే.
వాల్మీకి మహర్షి విరచిత యోగ వాశిష్ట సారము 

--(())--
Bapu Bomma
02. ప్రేమతో - ప్రేమ లేఖ 
చూడు రాధ నిన్ను మరవలేకున్నాను, నీ జ్ఞాపకాలు నన్ను వెంట బడు తున్నాయి, మనం  కలసిన రాత్రులు గుర్తుకు వస్తున్నాయి, నీ నవ్వును ఒక అక్షర మాలాగా వర్ణించాలని ఉన్నది, నీ నవ్వే చీకటిలో వెన్నెలను పంచె ఒక నక్షత్రం లాగా నాకు కనబడింది, నీ అమృత భాష్యం ఎంత మరవాలన్న మరువ లేకున్నా నంటే  అంత అద్భుత శ్రవణా నందముతో,  సత్య స్పూర్తితో, కరుణ రసముతో, కావ్య భావాలతో  వక్తపరిచి మనసును దోచిన, జ్ఞాపకాల వలయ సుందరివి నీవు.

తొలిసారి నిన్ను చూశా, నీ చిరునవ్వులో కలిశా, నీ సౌందర్యాన్ని ఆస్వాదించా, నీ కళ్ళల్లో నా నీడను చూశా, నీ పెదాల విరుపు చూశా, నా హృదయ స్పందన తెలియ పరిచా, నీ ఓర కంటిలో నిలిచా, నీ పెదాలలో తడిశా, నిన్ను నేను మరువ లేక నీపై పెంచుకున్నాను ఆశా

నాకు తెలుసు నీ కవ్వింత, నేను గమనించా నీ పులక రింత, వలపు చూపుతూ చూపించావు నాకు తుళ్లింత, నీ పులకరింత నాలో పెంచును తపనంత, నీకె పంచాలని నాలో పరుగును గిలిగింత, చెప్పాలని ఉన్నది నాకు ఇంకా కొంత, నీ సంతోషము కొరకు వేచి ఉంటాను జీవితమంతా

నీ పరిచయముతో పరవశించా, నిను దగ్గరగా పరికించా, నీకు కావలసినవన్నీ చేయించి  ఉంచా, జతగా అందించి తరించా, కలవరింత తొలగించి ఆనంద పరిచా, నీ విచ్చిన వింతను గ్రహించా, హమేషా నీకు తోడుగా నడిచా, నీ మనసును బట్టి ప్రవర్తించా, నా తనువును నీకె అర్పించా, నిను వదలి కొంత కాలం జీవించా, ఇక బ్రతుకంతా నీకోసం వేచి ఉండ దలిచా

ఓ మాధవా నీ ఉత్తరమునకు నా ప్రత్యుత్తరము నా హృదయాంతరములో ఉన్న భావాలను ఒక్కసారి నీకోసం వక్త పరుస్తున్నాను, నీవు చదివి నీ ప్రేరణలను నాకు తెలియ పరుచు                                            

నీవు నామనసులో నిలిచిన ఒక గిరి, అదే నాకు నిరంతరము కల్పిస్తుంది సిరి, అందుకే నీవంటే నాకు ఎప్పుడు గురి, నీకోసం నేను వేచి ఉంటా తప్పని సరి, నీవు నామనసులో నిలిచి పోయిన పోకిరి, గుర్తుకొస్తున్నది నీవు చేసిన అల్లరి, నీతో వేగ లేక ఎప్పుడూ అంటాను సరి సరి,  అందుకే నీతో కలిసే దాకా ఉంటుంది నా ఊపిరి.

నా కల్లల్లో ఎప్పుడు ఉంటుంది నీ ఆకృతి, అదే నేర్పింది నాకు సంస్కృతి, అది ఒక కృతి, అందుకే నాకు నిత్య సంక్రాంతి, నీ తలపుల వల్లే నాకు నిర్మల  ప్రకృతి, అందుకే నన్ను బ్రతికిస్తుంది కొత్త అనుభూతి.

నా కళ్ళలో నిలిచి పోయినది మెరుపు, నాకు గుర్తు తెస్తుంది తొలివలపు, అదే మన ఇద్దరి మధ్య నిలిచిన మలుపు, ఇది ఓటమి కాదు మన ఇద్దరి గెలుపు, కాలమే మన మధ్య చూపుతున్న మేలుకొలుపు  

సరసం మనల్ని త్తేజ పరిచింది, విరహం మనల్ని ఏకం చేసింది, ఆశయాల మార్గంలో నడిపించింది, మధుర క్షణాల సాఫల్యం ఫలించింది, మధురాతి మధురం మన మధ్య దాపత్య సుఖం.  దాన్నే గుర్తు చేస్తూ మనమధ్య ఎడబాటు ఉన్న ప్రేమలేఖలు మనల్ని బ్రతికిస్తుంది. 
అంటూ ముగించింది రాధ మాధవకు ప్రేమలేఖ.   
--(())--

03. నేటి ఆధ్యాత్మికం : 

మనం అద్దె ఇళ్ళలో ఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి  యజమాని, ఇల్లు * ఖాళీ చేయమని ఆదేశియస్తే, వెంటనే సామను అంతా సర్దుకుని వేరు ఇల్లు వెతుక్కుంటాము.*   ఎక్కడకు వెళ్ళినా పోగు చేసుకున్న సామాను అంతా తీసుకువెళతాము.  అలాగే ఈ శరీరం కూడా ఓ అద్దె ఇల్లు. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే, అన్నేళ్ళు ఉంటాము.      

 ఋణం తీరిన తర్వాత, ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు గెంటివేయబడుతుంది.   
 దానికి ఆ తర్వాత దేహం మీద ఏ హక్కు ఉండదు.   అప్పడు అది, తాను గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని, వెళుతుంది. అవే సంచితకర్మలు . ప్రారబ్ధ కర్మలు - అనేక సంచిత కర్మలతో కలిసి జీవుడు ప్రయాణిస్తుంటాడు.

 ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో,  అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఈ  కర్మలు అయితే పక్వానికి వస్తాయో , లేదా పండుతాయో, ఆ కర్మలను అనుసరించి,  జీవుడికి తదుపరి దేహం ఇవ్వబడుతుంది. అంటే జన్మల పరంపరలో జీవుడు చేసిన  కర్మలలో అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మ ప్రారబ్ధ కర్మ.ఈ దేహం ప్రారబ్ధ కర్మ ఆధారంగా ఏర్పడింది.    ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. అంతవరకు ఆ ఫలాలను అనుభవించవలసిందే.    
 ప్రారబ్ధం తీరిన క్షణమే, మరుక్షణం కూడా కాదు, ఆ క్షణమే ఆత్మ, దేహాన్ని విడిచిపెట్టేసి, మళ్ళీ ఇంకో శరీరం యొక్క అన్వేషణలో పడుతుంది.                   

 ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. ఈ జన్మలో మన కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు, ఆప్తులు,  బంధవులు మొదలైన వారంతా ఒక జన్మలో మన కర్మల  ఆధారంగా మనమే ఎంచుకున్నాము. ఆయ వ్యక్తులతో మనకున్న ఋణం కారణంగా, వారి నుంచి సేవ పొందడమో, లేదా సేవ అందించడమో చేస్తాము. ఆ ఋణమే బంధము. 

ఈ శరీరం ఏర్పడడానికి కారణమైన ప్రారబ్ధకర్మలన్నీ ఈ జీవితం ముగిసేనాటికి  ఖర్చయుపోగా , జన్మజన్మల నుంచి వస్తున్న సంచితకర్మలకు, ఈ జన్మలో చేసిన సంచితకర్మలు కలుస్తాయి.                           

ఈ మొత్తం కర్మల్లో ఏ కర్మలైతే పక్వానికి సిద్ధంగా ఉంటాయో, అంటే అనుభ వించ డాన కి  సిద్ధమవుతాయో , అవి ప్రారబ్ధాలుగా మారి జీవుడి తదుపరి దేహం ఉంటుంది. ఈ చక్రం ఇలానే కొనసాగుతుంది . అందుకే ఆదిశంకరులు భజగోవింద స్తోత్రంలో 
"
 పునరపి జననం పునరపి మరణం 
 పునరపి జననీ జఠరే శయనం" 
అని అన్నారు.

 మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ తల్లుగర్భంలో పిండంగా ఎదగడం.... అంటూ అందులో స్పష్టం చేశారు. 

 ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, అంతా నా ప్రారబ్ధం అంటాము, 
 అంటే ఇదే. మనం ఒకనాడు తెలిసో, తెలియకో చేసిన పాపపుణ్య కర్మల ఫలం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాము.    

 అలాగే పాపం పండింది అనేమాట కూడా ఉపయోగిస్తాము.              
 పాపం పండడమేంటి? అంటే ఎప్పుడో చేసిన దుష్కర్మ ఈనాడు తన ఫలితాన్ని చూపిస్తోంది.                   
 ఎప్పుడో చిన్న విత్తనం వేశాడు, అది మొలకెత్తి, పెరిగి, పెద్దదై ఈనాడు ఫలాలను ఇస్తోంది.    
ఆ ఫలాలను అనుభవించాల్సింది కూడా ఆ విత్తనం వేసినవాడే.        
 విత్తనం చిన్నదే కానీ, దాని నుంచి వచ్చే చెట్టు పెద్దదే కావచ్చు.                         
 అలానే చేసిన పని కూడా. కాబట్టి సాధ్యమైనంతవరకు సత్కర్మలే చేయమని శాస్త్రం చెబుతుంది. 

ప్రాంజలి ప్రభకు గౌరవనీయులైన "శ్రీనివాసరావుగారు గదిరాజు గారు  పంపినది ఇందు పొందు పరిచాను ధన్యవాదములు  


04. ఆలింగనం అంటే ఏమిటి -(?)

మనసులు కలసిన వేళ, హృదయం స్పందించిన వేళ, ప్రకృతి కరుణించిన వేళ, ప్రశాంత వాతావరణంలో, పున్నమి వెన్నెల కాంతులలో, చల్లగా వీచే గాలియందు ఆణువణువూ తపించే స్పర్శ హృదయాలు ఏకమవుటం లో ఉన్న ఆనందం, స్వర్గం కన్నా మిన్న అని నేను అనుకుంటాను, స్వర్గాన్ని అయినా వర్ణించగలము కానీ, సుఖాన్ని వర్ణించటం ఎవరి తరము కాదు. విద్యార్థులతో ఉన్న పెద్దలతో రామకృష్ణ శర్మ పంతులుగారు ఈవిధముగా చెపుతున్నారు.
  
ఆలింగనం మనుషుల మధ్య ఆప్యాయతకు అనురాగానికి గట్టి ఆనవాలు, తోలి వలపునకు అది ఓనమాలు, జన్మ జన్మ  బంధాలకు, ఆత్మీయతకు, జీవిత సాఫల్యానికి, తన్మయత్వ స్వభావానికి, తరుణం మించకుండా తమకం తగ్గ  కుండా, చలామణి అవుతూ, నిత్య ఆశల వలయంలోకి లాగుతూ, మనస్సును నిర్మలంగా ఏరోజుకారోజు మార్చేది ఇది.

ఒక్కో రకం ఆలింగనానికి ఒక్కో రకం అనుభూతి, వాత్సాయన గ్రంధంలో అనేక రకాల అనుభూతులు మనకు తెలియ పరిచారు.

పెద్దలు మనకు దీవెన ఒక ఆలింగనం అట్లాగే లాలన పాలన చూసి ఆనంద పడుతూ ఇచ్చేది ఆలింగనం .

కరచాలనం చేసి, దరహాసముతో, మెత్తగా ప్రియమార హత్తు కొనుట మర్యాద పూర్వక ఆలింగనం. దేశాధినేతలు, ప్రముఖులు, జరిపే మర్యాద పూరకముగా, గౌరవ సూచనగా జరిపేది.  ఒకరకం ఆలింగనం.

పాలిండ్లు పొంగారి యవ్వన గర్వంతో బాహుబలిని ఆకర్షించి అనంత సుఖాలు పొందాలని ఆశించి, పెదాల రుచిచూడాలని  ఘాడంగా ఆలింగనం చేసే శృంగార నెరజానుల ఆలోచనే వేరు, ఇది ఒక అనుభూతి.

ఆలింగనాన్ని ఆశించకుండా దూరం దూరం అని మడి కట్టుకు కూర్చున్న, మన:స్పర్ధలు పెరిగి, ఆరోగ్యము నలిగి, వయసు పెరిగి, ఆలోచనల మనిషి గా, అనుమాన మనిషిగా మారితే అపార్ధం పెరిగి సంసారం వీధిన పడుటకు ఆలింగనం లేకపోవుట కుడా ఒక కారణం. ఈ అనుభూతి పొందలేనివాడు సంసారిగా జీవిన్చలేడని నాభావన.

--(())--

05. ఆశ్రయం కోసమో, 

అనుభందం కోసమో మద పిచ్చితో మగువ, మగవాన్ని రెచ్చగొట్టి కోరిక తెలియచేసి నేను కన్యను నీవు బ్రహ్మ చారివి మనమధ్య లేదు ఎటువంటి సందేహము నా భాహు భాండాలలో చుక్కు మదనా అని వెంబడి పడేవారు, అటువంటి పరిస్థితులలో లొంగి పోయేవారు సహజం.

విశ్వనాధ గారి వర్ణన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం
పుష్కరతీర్థంలో జలకాలాడిన మేనక నిలువెల్లా తడిసిన బట్టలతో విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చింది. ఆ 'సురవధూటి' జుట్టును ముని తుడవబోయాడు. ఆమే వారించి తుడుచుకో, ఆమె తివురు ... అతడు వారించి తుడవగా . అతడు తివురు ... చేతులందేయుచు పెనంగా చివరిదైన ఫలము తడి కౌగిలింతగా పరిణమించే అన్నారు.
 అపనలతో తహ తహ లాడే శృంగార ఆలింగనాల పర్యవసానం చప్పుకో నవసరం లేదు.

నల్లని మేఘాలలో వెలుగుల విరజిమ్మే విద్యుత్తుదాగి వున్నట్లే....మనం చేసే ప్రతి కష్టంలోనూ సుఖం దాగి వుంటుంది. ఎదో కొత్తదనం మనలో దాగి ఉన్నది, అది  ప్రపంచానికి అందచేయటమే మనలక్ష్యం గా జీవించాలి,  అలాగే మనం చేసే పని మనం చేస్తున్నాము అనుకుంటాము, మనల్ని చేయిన్చేవాడు ఒక పరమాత్ముడు వెనక ఉండి నడిపిస్తు న్నాడని అనుకోలేము, ఇది నా కష్టార్జితం అని, ఇది నా సుఖాల సంతతని, నా తోడు ఆలింగన మని    అనుకుంటాం, కానీ రుణాల భంధమని గమనించ లేక పోతాం అయినా ఇది మాయా ప్రపపంచం, భాహు బందాలలో చిక్కి సుఖ సౌఖ్యాలు పొందిన వానికే మనస్సు ప్రశాంతిగా ఉండ కలుగు తుందని నాభావనా.          

తపస్సు కొకరు, చదువుకు ఇద్దరు, సంగీతానికి ముగ్గురు, ప్రయాణానికి నలుగురు, వ్యవసాయానికి ఐదు లేక ఏడుగురుండాలి.యుధ్ధానికి మాత్రం ఎక్కువమంది అవసరం. ప్రతిఒక్కరి జీవితానికి స్త్రీ పురుషుని సంగమం ఒక్కటే ఒక్కటి, ఇరువురికి నిత్యకల్యాణం పచ్చ తోరరణం, మనస్సు శాంతి కి సునాటికి మనోనిగ్రహ శక్తికి ఇది ఒక మార్గం అని నా భావనా   

ఈరోజు కొన్ని సామెతలను ఉదాహరింస్తున్నాను, మిగతా భాగము రేపు చెప్పుకుందాం

ప్రేమ కలయికకు ఒక నిదర్శనమైతే,  దయ, కరుణ, స్నేహము, వాత్సల్యము, బంధము, ఆత్మీయత, అనురాగము అనేవి కుడా ప్రేమకు చిహ్నాలు.

ప్రతి ఒక్కరు సృష్టి రహస్యానికీ తోడ్పాటుగా ఉండాలి " జోడు లేని బతుకు, తాడూలేని బొంగరం " అంది ఒక సామెత ఉన్నది. అనగా బ్రహ్మచారి జీవితం తడులేని బొంగరం ఒకటేనని దీని భావం ప్రతిఒక్కరు తప్పకుండా పెళ్లాడాలని, సమాజ పురోగతికి తోడ్పడాలనేది మన పూర్వీకుల ఆకాంక్షగా ఈ సామెత చెపుతున్నది. పురుషులు కానీ స్త్రీ కాని పెళ్లి కాకుంటే పరిపూర్ణులు కాలేరని మన పెద్దల నమ్మిక.

మీరందరూ అనవచ్చు పెళ్లిళ్లు కావటంలేదు, చదువులు ఉద్యోగాలు అంటూ కాలయాపన చేస్తూ వయసు ముదిరేదాకా ఉంటున్నారు, ఎంత ఉన్న సంపాదన సరిపోవటంలేదని ప్రతిఒక్కరు అనుకుంటున్నారు, ప్రపంచ ఆధునిక పోకడలకు బానిసలై భయపడుతున్నారు, ఈవయసులో చేయాల్సిన పని ఆవయసులో చేయక భాధను తెచ్చుకుంటున్నారు.

ఏది ఏమైనా మన పెద్దలు చెప్పిన సామెత ఒకటి గుర్తు చేస్తాను " కళ్యాణ మొచ్చినా, కక్కొచ్చినా ఆగవు "
పెళ్ళి సంబందాల కోసం తిరగడం వాళ్ళ ఏడు జతల చెప్పులు అరిగా యంటారు. అంటే సంభందాలు కుదరటం అంత  కష్టమని భావన అయితే కొన్నిసార్లు పెద్దగా ప్రయత్నం లేకుండానే పిల్లలకు మంచి సంభందాలు వచ్చి వెంటనే  ఇరువైపులా అంగీకారం కుదిరి చెకఃచెకా పెళ్లిళ్లు జరుగుతాయి. కక్కు వస్తే ఆపడం అసాధ్యం అలాగే సమయమొస్తే ఇబ్బందులన్నీ తొలగి పెళ్లి తథ్యం.

ఆలింగన సుఖం తెలిసిన వారి మధ్య బంధం విడదీయుట అసాధ్యం. రేపుకొన్ని విషయాలు తెలుసుకుందాం మీకందరికీ వందనం అంటూ లేచారు తెలుగు మాష్టారు.                 
                      
--(())--


06. భగవంతుడు రెండు సార్లు మనిషి అజ్ఞానానికి నవ్వుతాడు.
ఇంకాసేపట్లో చనిపోయే బిడ్డకు వైద్యంచేస్తూ వైద్యుడు వాళ్ళ తల్లితో “ఏమీ భయం లేదమ్మా మీ అబ్బాయికి ఏమి కాదు.నేను బతికిస్తాను“ అన్నప్పుడు.

మరోసారి ఇద్దరు అన్నదమ్ములు భూమిని పంచుకొని
 “ఇదిగో ఈభూమి నాది ,అదిగో అటువైపు వున్నది నా తమ్మునిది “అన్నప్పుడు. వీడి  తండ్రి,తాత,ఇదే మాట అన్నారు పోయారు. ఇప్పుడు వీడు అదే అంటున్నాడు.
రేపు వీడు పోతాడు అయినా “ఇది నాది” అనే భ్రమలో,
మాయలో,అజ్ఞానంలో బతుకుతున్నాడు అని నవ్వుకుంటాడట.

నిజమే...ఏది శాశ్వతం కాదు. మనం ,మన పిల్లలు,మనం సంపాదించుకున్న ఇళ్ళు,భూమి, మన బ్యాంకు బాలన్స్ ఏవి మనవెంట రావు.

ఈ విషయం మనకందరికీ తెలుసు.అయినా “నాది నావి “అనే మాయలోనే ఉండిపోతున్నాము. ప్రతిరోజూ తెల్లవారుతోంది. పగలు వెళ్ళిపోతోంది. రాత్రి మొదలవుతోంది.  తర్వాత మళ్ళీ తిరిగి  పగలు ఏర్పడుతోంది. పగలు తిరగడం, రాత్రుళ్ళునిద్రపోవడం  ఎన్నాళ్ళిలా? ప్రతిరోజూ  తిన్నదే తింటున్నాం. తాగిందే తాగుతున్నాం.  రోజూ అదే తిండి. అదే నీరు. అదే మంచం.
అదే నిద్ర. అయినా ఎందుకో వీటి మీద ఆశ చావడం లేదు. దుఃఖం తొలగడమూ లేదు.  ఏమాత్రం అర్ధంకాని ఈ పగలు, రాత్రి అనే ప్రయాణం చివరికి ఎక్కడికి? ఆలోచిస్తుంటే ఈ ప్రయాణం ఒకరోజు చావడం దగ్గరకు తప్ప మరొక చోటుకు కానే కాదని మాత్రం తెలుస్తోంది.

ఇక్కడ పుట్టేదంతా ఒకనాటికి తప్పక నశించేదే అయినప్పుడు ఈ దుఃఖం దేనికి? ఈ ఆరాటం దేనికి? మనలో ఏర్పడి ఉన్న ఈ “నాది - నావి - నావాళ్ళు” అనే భ్రమంతా  మనకు ఎక్కడినుంచి వచ్చింది? ఈ జీవితమే మూన్నాళ్ళ ముచ్చటని  తెలుస్తూనే ఉన్నప్పటికీ మరి  మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం?
డబ్బు సంపాదించాలి.. దాన్ని భద్రంగా దాచుకోవాలి.. అందరికంటే గొప్పవాళ్ళం అయిపోవాలి అని.

ఇదంతా పిచ్చి కాకపోతే ఇంకేంటి.!
ఇలా మనలో మనం ప్రశ్నించుకోవాలి .
ఈ శరీరం పుట్టేటప్పుడు, ఈ శరీరం పెరిగేటప్పుడు,  ఈ శరీరం పోయేటప్పుడు ఏదయితే మార్పు అనేదే లేకుండా ఈ శరీరంలో ఉందో అదే ఆత్మ. ఆ ఆత్మే  నేను' అన్న ఎరుక  కలిగిననాడు ఆత్మజ్ఞానం మనలో వుద్భవిస్తుంది. జ్ఞానం కలిగిన తరువాత వైరాగ్యం, దాని తరువాత భక్తి , భక్తికి పరాకాష్ట  భగవంతుని దర్శనభాగ్యం, చివరిగా ముక్తి.

ముక్తి పొందడానికెే  దైవం మనకు మానవజన్మ ప్రసాదించాడని  తెలుసుకున్న తరవాత  సాధన చెయ్యాలి.
మనం కోరుకునే జ్ఞానం, ముక్తి మరెక్కడో లేదు మన మనస్సులోనే ఉంది.

మనిషి దేవుణ్ణి కోరుకోవలసిన వరాలు-

"అనాయాసేన మరణం - బాధలేని సుఖమరణం
వినా దైన్యేన జీవనం - ఒకరిపై ఆధారపడని జీవితం
దేహాంతే తవ సాన్నిధ్యం - పోయేముందు నీ దర్శనం
దేహిమాం పరమేశ్వర - ప్రసాదించు పరమాత్మా! "

అని కోరుకోవాలి..
--(())--

07. కంచిలోబంగారుబల్లి_కథ

బంగారు బల్లి అంటే ఎవరికైనా యిట్టె గుర్తొచ్చేది తమిళనాడులోని కంచిలో గల కామాక్షి అమ్మవారి ఆలయం. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని ముట్టుకుంటే దోషం వెళ్లి ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఈ బంగారు బల్లి గురించి ఒక పురాణ గాధ ఉంది. అదేమిటంటే గౌతమ మహర్షి కి ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఎప్పటిలాగే శిష్యులు కుండ పట్టుకొని నది తీరానికి వెళ్లి నీటిని తీసుకొస్తుండగా అందులో బల్లి పడింది. వారు చూసుకోలేదు.

దీన్ని గమనించిన గౌతమ మహర్షి శిష్యులిద్దరినీ బల్లి వలె మారిపొమ్మని శపించెను. శాప విముక్తి కోసం ఇరువురు మహర్షిని వేడుకొనగా, కాంచీపురం లోని వరదరాజపెరుమాళ్ ఆలయానికి వెళ్ళమని, అక్కడ పరిష్కారం లభిస్తుందని చెప్తాడు.

ఇద్దరూ కూడా సరే అనుకోని వరదరాజపెరుమాళ్ ఆలయానికి వెళ్తారు. బల్లుల రూపంలో ఉండి స్వామి వారిని నిత్యం ప్రార్ధించగా, ఒకానొక రోజు శాపం నుండి వారిద్దరికీ విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో సూర్యుడు, చంద్రుడు సాక్ష్యంగా ఉండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి, భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు.

బంగారం అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అనే అర్థం వస్తుంది. సరస్వతి దేవి నుండి శాపం పొందిన ఇంద్రుడు దోష నివారణకై పెరుమాళ్ ఆలయంలో బల్లులను ప్రతిష్టించినట్లు మరో కధనం కలదు.

ఇంట్లో బల్లి తిరుగుతున్నప్పుడు అది మీద పడితే ఎట్లా ? అనే అపోహ అందరికీ ఉంటుంది. అలా పడినపుడు వెంటనే కామాక్షి ఆలయంలోని బల్లిని తలుచుకొని స్నానం చేసి, ఇష్టదైనవాణ్ణి ఆరాదిస్తే దోషం పోతుందంటారు. ఏమోఇంకా దోషం ఉందేమో అనుకునేవారు కంచి అమ్మవారిని దర్శించుకొని బల్లులను తాకుతారు.
--(())--

No comments:

Post a Comment