Wednesday 20 February 2019

నేటి లలిత సంగీతాలు ఈ వారంలో






నేటి గీతం (ఛందస్సు (కుసుమవిచిత్రా )
లలిత సంగీతం 
ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లపరగడ ఆరామకృష్ణ 

ఏమని చెప్పేది
ఎలా చెప్పేది ఓ మానవా
లోకం తీరు ఇంతేనని ఎలాచెప్పేది

నయనము సాగే - పదములు రాలే
ఉరుములు  మెర్సే - తరువులు ఊగే
పిడుగులు  వచ్చే  -  పవనము వీచే   
సమయము రాకే  -  కలయను నమ్మే 
అణుకువ లేకే  - మనుగడ చెడే
చమటలు పట్టనులే

ఏమని చెప్పేది
ఎలా చెప్పేది ఓ మానవా
లోకం తీరు ఇంతేనని ఎలాచెప్పేది

తరుణము మించే - కరములు ఊపే 
వయసును దాచే - వలపును పెంచే
సొగసును చూపే - నడుమును ఊపే
కురులను తిప్పే -  వలువలు  సద్దే
అనుకువగ ఉండే - అనుకరణ చేసే
మనసును ఆర్పించెలే 

ఏమని చెప్పేది
ఎలా చెప్పేది ఓ మానవా
లోకం తీరు ఇంతేనని ఎలాచెప్పేది

యువతకు నేర్పూ  - వనితకు ఓర్పూ
వయసుకు మార్పూ - తరువుకు దోస్తూ
మనసుకు ప్రేమా  - తనువుకు  శీలం
కధలకు మూలం  - చరితకు గానం
కళలకు సాయం  -  కలువకు అందం
మధురిమ భావాలులే 

ఏమని చెప్పేది
ఎలా చెప్పేది ఓ మానవా
లోకం తీరు ఇంతేనని ఎలాచెప్పేది

మరిచెను ప్రేమా - అవధులు మారే
తలవని  గుర్తే  - పిలవని  మాయా
కొడుకుల తీరే - కలియుగ సేవా
మమతలు మారే  -  మనుగడ మారే
తపనలు తీరే - తనువులు సాగే 
భయమును పెంచేనులే   

ఏమని చెప్పేది
ఎలా చెప్పేది ఓ మానవా
లోకం తీరు ఇంతేనని ఎలాచెప్పేది
ఈ లోకం తీరు ఇంతేనని ఎలాచెప్పేది



--((*))--


నేటికవిత
ప్రాంజలి ప్రభ
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

స్త్రీ హృదయం చిరు దివ్యల వలయం
సుఖాన్ని పంచి చింతల తీర్చే అది ఒక దేవాలయం

పువ్వు వైనానీవె, సాహస స్పూర్తివైనా నీవే
సహనానికి పేరు నీదే, ఘనకీర్తికి మరోపేరు నీదే
ఓర్పు వహించి, నిగ్రహాన్ని పెంచే స్త్రీవి నీవే
రాతలలో ఘనత నీదే, మాటలలో నేర్ప నీదే

అందుకే స్త్రీ హృదయం చిరు దివ్యల వలయం
సుఖాన్ని పంచి చింతల తీర్చే అది ఒక దేవాలయం

స్త్రీ అణకువ తనాన్ని చులకచేయుట ఎందుకు
స్త్రీని చూసి నిర్మల హ్రదయంతో సాగు ముందుకు
స్త్రీ సీలాన్ని పరీక్ష చేసి వేదించుట ఎందుకు
స్త్రీని ఎప్పుడు అవమానించి సాగలేవు ముందుకు

స్త్రీ గౌరవాన్ని నలుగురిలో చులకన ఎందుకు
స్త్రీని అందరిముందు ఆదరంచుట మరువకు
స్త్రీ శ్రమలో శ్రవంతి అంటూ హింసించుట ఎందుకు
స్త్రీకి శ్రమలో సహాయపడి ఆనందించుట మరువకు

అందుకే స్త్రీ హృదయం చిరు దివ్యల వలయం
సుఖాన్ని పంచి చింతల తీర్చే అది ఒక దేవాలయం


--((**))--

లలిత గీతం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

నా కంటి వెల్గువు నీవు, నా మనసులో ఉన్నావు
నా పరివర్తన మార్గం నీవు, నా బుద్ధికి ప్రధానివైనావు      

నీ కంట కన్నీరు నే చూడలేను !
నా కంఠ ప్రాణమున్నంత వరకును !
నీ మాట ఎప్పటి కీ జవదాటలేను !
నా ధర్మం తప్పకున్నతవరకును !..... నా 
  
కలతలు కష్టాల , కలకల మేల !
కాలంబు కిలకిల , గమకాల మేళ !
నడకలు నష్టాలు, నకనక మేల !
దేహంబు గలగల, దయచేయు వేళ! ... నా 
   
గుడిగంట మ్రోగేది , కోర్కెలన్ దీర్చ !
హృది జంట కోరేది , హృదయముప్పొంగ !
వలపంత పొంగేది, దాహమున్ దీర్చ !
మనువంత కోరేది, మమతముప్పొంగ! .... నా  
   
వెతలేమి సేయునే వెర్రి నా కన్ని !
కథ లేమి చెప్పనే ఇష్ట నా సన్ని !
కథ కంచి కేగునే గతులన్ని పన్ని !
జతకూడి సేవలే మతులన్నిసన్ని ! .... నా   

ఆత్మ బంధువు నేను హాయంత నీదె !
ఆత్మ సేవలు పంచె ప్రేమంత నీదె !  
నీ కంట కన్నీరు నే చూడలేను !
నా కంఠ ప్రాణమున్నంత వరకును ! ..... నా 

నా కంటి వెల్గువు నీవు, నా మనసులో ఉన్నావు
నా పరివర్తన మార్గం నీవు, నా బుద్ధికి ప్రధానివైనావు       
నా కంటి వెల్గువు నీవు, నా మనసులో ఉన్నావు
నా పరివర్తన మార్గం నీవు, నా బుద్ధికి ప్రధానివైనావు       

--((**))-- 


లలిత గీతం
మల్లాప్రగడ రామకృష్ణ

చరు చిరు నవ్వుల శ్రీవారు చిందులు ఎందు కండీ
అడిగినవన్నీ అందిస్తున్నా అలుక మానరెందుకండీ
అలుక మాన రెందుకండీ

ఆ ఏమిస్తున్నావ్ పక్కింటి పిన్నిగారొచ్చారు ఈరోజుకు దూరమంటారండీ
పెద్దల గౌరవించటం మనలక్ష్యం కదండి ఈరోజుకు దూరంగా ఉండండీ
దూరం ఉండండీ

నిన్న ఎంతో సంతోషంగా పలకలకరిస్తే దిబ్బ మోహంపెట్టారు కదండీ
పక్కింట్లో తాతగారు బాల్చీ తన్నేసారు అందుకే
దూరంగా ఉండాలన్నానండీ

మరి మోన్న హోటల్లో డిన్నర్ చేసి ఇంటికొచ్ఛాక మూడు మారింది ఎందుకండీ
ఎందుకా చిన్ననాటి స్నేహితుడు అంటూ ఇంటికి తెచ్చి నామీద చిందులెందుకండీ

ఇది కలా నిజమా 
ఇది నిజమే కలకాదు

చిరు చిరు నవ్వుల శ్రీవారు ఈరోజు మోత్తం నీదే కదండి అలకమానండీ
ఓదేవుడా అన్ని అందించి అదొక్కటి అందించకుండా అడిస్తున్నావు కదా

దేవునిపై, నాపై కోపం వదలండి, ముందు అందుకోండి కళ్ళి
ఆహా ఏమిరుచి ఓహో ఏమిరుచి 
అట్లాగా ఆ ఆ కద్దిగా నాకు పెట్టండీ

అలుక తీరిందా శ్రీవారు 
నోరు పండింది శ్రీమతిగారు
కొద్దిగ ఓపికపడితే
ఆ పడితే అంతా సరిగమలే
అవునా అంతా సరిగమలా

చిరు చిరు నవ్వుల శ్రీవారు 
అలుకమాని అందునుచూసి జుర్రుకోండి
చిరు చిరు నవ్వుల శ్రీమతిగారు 
నవ్వుల పువ్వుల అందిస్తే ఈరోజు ఇక చాలండి

ఏరోజుకారోజు మీకు కొత్తే కదండి

ఆ కొత్తే ఆ కొత్తే ..... ఆ కొత్తా ఆ కొత్తా

--(*)--


నేటి లలిత గీతం  
ప్రాంజలి ప్రభ 
మల్లాప్రగడ రామకృష్ణ 

తల్లి మాట వినరా 
తల్లే నీకు జీవిత విధాత రా 

తల్లి ఋణము తీర్చరా 
తల్లే దేవతని తెలుసుకోరా 
తల్లే తీర్చును ఆశయాలురా
తల్లే తీర్చు సమస్త కష్టాలురా    

తల్లి మాట వినరా 
తల్లే నీకు జీవిత విధాత రా 

తల్లి ప్రేమ నుండి తప్పించు కోలేవురా 
తల్లి ధ్యాస వీడ తరము కానే కాదురా  
తల్లి ప్రేవు ముడికి తగు పాశమే లేదురా  
తల్లి పదపు వెలుగు తరపు నీడరా 

తల్లి మాట వినరా 
తల్లే నీకు జీవిత విధాత రా 

తల్లే జ్ఞానయోగమని తెలుసుకోరా  
తల్లే జ్ఞాన సిద్ధికి మూలమేరా 
తల్లే భక్తి కర్మలకు సాయపడునురా 
తల్లే మాయమర్మము ఛేదించురా 

తల్లి మాట వినరా 
తల్లే నీకు జీవిత విధాత రా 
    
తల్లి సేవయే దైవసేవని నమ్మరా 
తల్లే విశ్వంలో వజ్రం లా నిలుపురా
తల్లే నిర్భయమ్మని గమనించారా
తల్లే చాలించువరకు ప్రేమపంచురా 
  
తల్లి మాట వినరా 
తల్లే నీకు జీవిత విధాత రా 

తల్లిమాటే శాస్త్రమని తెలుసుకోరా 
తల్లితండ్రుల సేవయే నీ ధర్మంరా 
తల్లి తండ్రుల దీవెనే సార్ధకం రా 
తల్లి తండ్రుల ప్రేమయే సత్యమురా     

తల్లి మాట వినరా 
తల్లే నీకు జీవిత విధాత రా 


 -((**))--


ప్రాంజలి ప్రభ - నేటి లలిత గీతం 
రచయత:  మల్లాప్రగడ రామకృష్ణ 

ఒరేయ్ ఒరేయ్ ఎం చేస్తున్నావురా 
తిన్నది సరిపోలా, ఎం తిందామనుకుంటున్నావురా   
ముందు వెనక చూసి చేసున్నావురా  
వెనక  ముందు చూసి వెనకేస్తున్నావురా  

ప్రాణాన్ని బతికిస్తావో, ప్రాణం గాల్లో కలిపేస్తావో 
బావిని పూడుస్తావో, జలం వచ్చేదాకా శ్రమిస్తావో  
దాహం తీర్చి ప్రాణం నిల్పుతావో, మత్తు ఎక్కించి తీస్తావో  
ఇల్లు కూల్చేస్తావో, ఇంటిలో ఉండి బాగు చేస్తావో 

ఒరేయ్ ఒరేయ్ ఎం చేస్తున్నావురా 
తిన్నది సరిపోలా, ఎం తిందామనుకుంటున్నావురా   

చిత్తం నీ చేతిలో ఉంచుకొని జీవిస్తావో 
నీ చేతలే చిత్తం అనుకొని నశిస్తావో 
దొరగా ఉంటావో, బానిసగా బతికేస్తావో
కాలంతో కలుస్తువో, కాలాన్ని కాలుస్తావో 

ఒరేయ్ ఒరేయ్ ఎం చేస్తున్నావురా 
తిన్నది సరిపోలా, ఎం తిందామనుకుంటున్నావురా   

భ్రమలో బతికేస్తావో, శ్రమిస్తూ జీవిస్థావో,
ఆసక్తి చూపి కుటుంబాన్ని నిలబెడుతావో  
కూకటి వెళ్ళను నరికి సంబర పడతావో
శక్తితో జీవిస్తావో, మాయకు చిక్కి బలి ఔతావో 

ఒరేయ్ ఒరేయ్ ఎం చేస్తున్నావురా 
తిన్నది సరిపోలా, ఎం తిందామనుకుంటున్నావురా   
ముందు వెనక చూసి చేసున్నావురా  
వెనక  ముందు చూసి వెనకేస్తున్నావురా  


--((**))--  


ప్రాంజలి ప్రభ లలిత గీతం
మల్లాప్రగడ రామకృష్ణ

పెళ్ళి కడుకుని ఆటపట్టిస్తూ

ఎందుకురా తొందరా పిల్లవుంది ముందర
ఏ మాయకు చిక్కి లొంగి పోయావురా.. లొంగి పోయావురా....2

దొండపండుకు కాకి రంగు జోడు
ములక్కాడకు క్యాబేజి జోడు
మల్లెపువ్వుకు గడ్డిపువ్వు జోడు
ముద్దుకళకు మోద్దురూపుజోడు...ఎందుకురా

ఎందుకురా తొందరా పిల్లవుంది ముందర
ఏ మాయకు చిక్కి లొంగి పోయావురా.. లొంగి పోయావురా....2

చదువుచూసి మోసపొయ్యావా 
ఉద్యోగం ఆశచూసి లొంగావా 
ఆస్తిచూసి రుబ్బురోలుకి చిక్కావా
పప్పులో ఉప్పులా కల్సిపోతావా ...

ఎందుకురా తొందరా పిల్లవుంది ముందర
ఏ మాయకు చిక్కి లొంగి పోయావురా.. లొంగి పోయావురా....2

కళ్ళ కైపుకు కాలరెగరేసి నట్టున్నావ్
జడ ఊపుకు జారి చిక్కి ఉన్నట్టున్నావ్ 
పెదవి విరుపుకు లొంగిపోయి ఉన్నావ్ 
పెళ్లి కోసం ఆరాట పడుతున్నావ్.......

ఎందుకురా తొందరా పిల్లవుంది ముందర
ఏ మాయకు చిక్కి లొంగి పోయావురా.. లొంగి పోయావురా....2

ఎందుకు కక్కుర్తిపడ్డావురా
చుక్కేసుకొని చిందులేద్దాం రారా
దర్జాగా దమ్ముకొట్టుదాం రారా
చతుర్ముఖ పొరాయణం ఆడుదాం రారా

ఎందుకురా తొందరా పిల్లవుంది ముందరా
ఏమాయకు చిక్కి లొంగిపొయ్యావురా
ఎందుకురా తొందరా పెళ్ళి ఉందిముందరా
మమ్ముచూడవురా ఇక మాతో పనిలేదురా
ప్రేమపక్షి ఇకచేస్తున్నాము గులామురా
ఇక నీకర్మ నీదేరా నీబతుకు నీదేరా
ఎందుకురా తొందరా ముందుంది పండగరా

-((*))--


లలిత సంగీతం 
రచయిత: మాలాప్రగడ రామకృష్ణ 

కొత్త పెళ్లికూతుర్ని ఆటపట్టిస్తూ ఈ  విధంగా పాడుతున్నారు కొందరు

ఆమ్మో ఆమ్మో ఏమి సిగ్గునే
ఆమ్మో అప్పుడే బుగ్గ ఎరుపెక్కిందిలే

బుగ్గన చుక్కా వచ్చెనే,
సిగ్గుల మొగ్గ విచ్చెనే,
ఈ నిగ్గే పగ్గ మేసి నెగ్గాలమ్మా
ఈ నిగ్గే పగ్గ మేసి నెగ్గాలమ్మా

ఆమ్మో ఆమ్మో ఏమి సిగ్గునే
ఆమ్మో ఆమ్మో ఏమి సిగ్గునే
తేనె కు తీయదనం
తెలిపే ముద్దులో వయశుకు వెచ్చనం
తెలిసే పొద్దులో కలలకు కమ్మదనం
కలిగే రేయి లో వలపుల మూల ధనం

ఆమ్మో ఆమ్మో ఏమి సిగ్గునే
ఆమ్మో ఆమ్మో ఏమి సిగ్గునే

పెరిగే హాయిలో
చల్లని నీడలో
అందాల వెల్లువలో
వందేళ్ళ పల్లవులే
పాడే పరువాలే
తోడుగా పంచాలి ఈ తరుణంలో

ఆమ్మో ఆమ్మో ఏమి సిగ్గునే
ఆమ్మో ఆమ్మో ఏమి సిగ్గునే

వేడిగా విరహాలె వీడగా
గాజుల వీణ మీట గా
జాజుల వాన చాటగా
ఈ కొంగు కొంగు కూడే రంగ రంగ వైభవం గా

ఆమ్మో ఆమ్మో ఏమి సిగ్గునే
ఆమ్మో ఆమ్మో ఏమి సిగ్గునే

తొందర నీ కొద్దు
ఈ పొద్దు కానిద్దు
పంచాలి ముద్దు
వద్దనేది వద్దు
పెట్టకూ హద్దు
అది నీకు నూరేళ్ళ పద్దు

ఆమ్మో ఆమ్మో ఏమి సిగ్గునే
ఆమ్మో ఆమ్మో ఏమి సిగ్గునే
ఆమ్మో అప్పుడే బుగ్గ ఎరుపెక్కిందిలే

వెయ్యాలి కూడికలు
చెయ్యాలి వేడుకలు
పంచాలి కానుకలు
ఇవ్వాలి దానాలు

ఆమ్మో ఆమ్మో ఏమి సిగ్గునే
ఆమ్మో ఆమ్మో ఏమి సిగ్గునే
ఆమ్మో అప్పుడే బుగ్గ ఎరుపెక్కిందిలే

ఇక చాలు చాలురా తోయండి గదిలోకి ...................  



లలిత గీతం  

అతడు : జల్లు జల్లు తనువును తడుపుతూ ఉంటే 
                గుండె గుండె ఘల్లు ఘల్లు మని మ్రోగుతూ ఉంటే 
                నా మనసే నిన్నే కోరుతూ ఉంది రాజళ్లూ                 

ఆమె    : జల్లు జల్లు తనువును తడుపుతూ ఉంటే 
                గుండె గుండె ఘల్లు ఘల్లు మని మ్రోగుతూ ఉంటే 
                నా మనసే నిన్నే కోరుతూ ఉంది రాజళ్లూ 

అతడు : కురిసింది జల్లు తనువంతా జిల్లు, ఒళ్ళంతా నిన్నే కోరుతూ 
                ఊహలు నిజం  చేయాలని, ఆశలు  తీర్చాలని ఈ జల్లులు నన్ను 
                 కలవర పెడుతూ ఉరకలు వేస్తుంది రావే నా జల్లూ 

ఆమె : చలి చలి గా ఉందా, గిలిగింతలు పెడుతుందా, వెచ్చని 
            కౌగిలి నేను అందిస్తానుగా, నీ ఆశలు తీర్చే ఈ జల్లు 
            నీవెంట ఉంటె, నీ వళ్ళంతా జిల్లు జిల్లు మనిపిస్తా 

అతడు : ఓ తొలకరి జల్లా, నా గుండెలో చేరి నన్ను ఉక్కిరి 
                 చేస్తున్నావే, నా భాధను నీకు తెలుపలేకున్నాను 
                 ఓ జల్లా, నా కోరికను తీర్చి, నన్ను ఆదుకోవా జల్లూ 

ఆమె : ఓ జల్లా నీమాటలకు నా వళ్లంతా వయ్యారంగామారే
            తనువంతా శృంగారం కోరే, మనసంతా మమకారం 
            పంచి ఆనందం, ఆనంద సౌఖ్యాలను అందించాలని 
            ఉంది ఓ జల్లా     

అతడు : జల్లు జల్లు తనువును తడుపుతూ ఉంటే 
                గుండె గుండె ఘల్లు ఘల్లు మని మ్రోగుతూ ఉంటే 
                నా మనసే నిన్నే కోరుతూ ఉంది రాజళ్లూ                 

ఆమె    : జల్లు జల్లు తనువును తడుపుతూ ఉంటే 
                గుండె గుండె ఘల్లు ఘల్లు మని మ్రోగుతూ ఉంటే 
                నా మనసే నిన్నే కోరుతూ ఉంది రాజళ్లూ 



నేటి లలిత సంగీతం
రచయత :మల్లాప్రగడ రామకృష్ణ 
  
మహా మహులు మెచ్చిన రాణి 
నామదిలో నిల్చిన మహారాణి 
అన్నీ ఉన్నా అర్భాటంలేని రాణి 
అందుకే నా హృదయంలో ఉన్న మహారాణి  
     
అక్షరాల కూర్పు పదాల చేర్పుకు 
ఆధారం నీవేగా 
నాలో ఓర్పును కల్పించి నేర్పుకు 
ఆధారం నీవేగా
మనస్సును ఉల్లాసపరిచే రాగంకు 
ఆధారం నీవేగా
తపన తాకిడి తగ్గే మౌన గీతంకు 
ఆధారం నీవేగా
అందుకే   
మహా మహులు మెచ్చిన రాణి 
నామదిలో నిల్చిన మహారాణి 
అన్నీ ఉన్నా అర్భాటంలేని రాణి 
అందుకే నా హృదయంలో ఉన్న మహారాణి

నీ ధ్యాసలో పడిన నా అడుగుకు 
ఆధారం నీవేగా
తనువు తడిసి పోతుంది చూపుకు
ఆధారం నీవేగా
నా ఆలోచన వెన్నెల సిరులకు
ఆధారం నీవేగా
భావఝరిలో నేను బ్రతుకుటకు
ఆధారం నీవేగా
అందుకే 
మహా మహులు మెచ్చిన రాణి 
నామదిలో నిల్చిన మహారాణి 
అన్నీ ఉన్నా అర్భాటంలేని రాణి 
అందుకే నా హృదయంలో ఉన్న మహారాణి

అందుకే 
నీవు నాకు నచ్చావు మనోహర 
నా మదన సామ్రాజ్యానికి హ్రదయ మనోహర  
అందుకే 
అన్నీ ఉన్నా అర్భాటంలేని రాణి 
అందుకే నా హృదయంలో ఉన్న మహారాణి

--((**))--



ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రేనమ:
లలితా సంగీతం 

ఓ వయ్యారి భామా, వగల మారి భామా
ఏమేమి చేస్థావు, ఏమేమి చూస్తావు, 
ఏమేమి మాట్లాడుతావు నీవు

ఓ వయ్యారి వీరా, మాయలు చేయకురా  
ఏమేమి చేయను, ఏమేమి చూడను,
 ఏమేమి మాట్లాడనూ నీతో

చిరునవ్వు చూపించి, చిందులు చూపించి
చింత లేకుండా చేస్తావు నీవు
చిన్ని చిన్ని మాటలకు, ఛుక్ ఛుక్ రైలులా
కదులుతూ కవ్విస్తావు నీవు  
చలి గిలి లేకుండా వేడిని పంచి, వేగమునూ పెంచి,
వేకువంతా నిద్రలేకుండా చేస్తావు నీవు
చిన్న దానివైనా చిరుతల వెంబడిస్తావు
     
ఓ వయ్యారి భామా వగల మారి భామా
ఏమేమి చేస్థావు, ఏమేమి చూస్తావు, 
ఏమేమి మాట్లాడుతావు నీవు

ఓ వయ్యారి వీరా మాయలు చేయకురా  
ఏమేమి చేయను, ఏమేమి చూడను,
 ఏమేమి మాట్లాడనూ నీతో


చింపాంజీ మోఖముతో  చందూలు వేస్తూ 
నీ వెంట పడు వారు ఎవరో చూపు 
ఎత్తు పళ్ళు , దొప్ప చెవులను చూసి 
కామించే వారెవరో చూపు 
వెర్రి వేషాలు వేషే, జిడ్డు మొఖాన్ని చూసి
నీ వెనక  పడిందెవరో చూపు 
రాముడవు కాదు రాజులా ఉన్న నిన్ను చూసి
ఏ రాకుమారిని వలపించిందో చూపు 

ఓ వయ్యారి భామా వగల మారి భామా
ఏమేమి చేస్థావు, ఏమేమి చూస్తావు,
 ఏమేమి మాట్లాడుతావు నీవు

ఓ వయ్యారి వీరా మాయలు చేయకురా 
ఏమేమి చేయను, ఏమేమి చూడను,
 ఏమేమి మాట్లాడనూ నీతో

నీ అందం నాహృదయంలో చిక్కేందే 
మరచి పోలేని గులాబివి నీవు    
దివినుంచి దిగివచ్చావా దేవతలాగున్నావు 
దమ్ము   చూపిస్తున్నావు నీవు  
అనురాగం పంచి సరాగముల సరిగమలు చూపి 
శర్డు కోమంటావు నీవు 
మువ్వల సవ్వడితో ముంగురులను కదల్చి 
మూసి మూసి నవ్వులు పంచు తావు 

ఓ వయ్యారి భామా వగల మారి భామా
ఏమేమి చేస్థావు, ఏమేమి చూస్తావు, 
ఏమేమి మాట్లాడుతావు నీవు

ఓ వయ్యారి వీరా మాయలు చేయకురా  
ఏమేమి చేయను, ఏమేమి చూడను, 
ఏమేమి మాట్లాడనూ నీతో

నల్లని వాడవైన, గుణంలో గొప్పవాడివి నీవు
అందుకే నీవు నాకు నచ్చవు  
బీదవాడవైనా ప్రేమను పంచే వాడివి నీవు  
అందుకే ప్రేమను పంచుతాను నీకు 
ఉద్యోగము లేక పోయిన మగధీరుడవు నీవు
అందుకే నీమాటలు నచ్చాయి నాకు 
రారాజుగా వద్దు, రాముడుగా ఉంటె చాలు 
అందిస్తా ఇక సొంతమవుతా నీకు 
   
ఓ వయ్యారి భామా వగల మారి భామా
ఏమేమి చేస్థావు, ఏమేమి చూస్తావు,
 ఏమేమి మాట్లాడుతావు నీవు

ఓ వయ్యారి వీరా మాయలు చేయకురా
ఏమేమి చేయను, ఏమేమి చూడను,
ఏమేమి మాట్లాడనూ నీతో

--((*))--

లలిత గీతం  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
నీ చరన రాజీవ సేవను నిరంతరం 
దయచేయుము గోవిందా   దయచేయుము గోవిందా 
నీ కరుణా కటాక్షము మాపై 
కురిపించుము గోవిందా కురిపించుము గోవిందా   

నిరతమ్ము నీ పైన మా మనసు నిలుపమయ్యా 

సతతమ్ము నీ రూపు మా హృదయమ్ము నిలపమయ్యా 
లలితమ్ము నీ నామము మా పెదాల్లో నిలపమయ్యా 
ఫలితమ్ము నీ పాద పూజకు ఆశను నిలపకయ్యా ...... నీ పాద ...

ప్రేమమ్ము  నీ మధుర భక్తి కై సాధన నిలుపమయ్యా 

ద్వేషమ్ము  మాలో తొలగించి యోగశక్తిని నిలుపమయ్యా  
కామమ్ము కట్టలు తెంచుకోక నిగ్రహాశక్తిని నిలుపమయ్యా
మోక్షమ్ము వచ్చేట్లు మీసేవ అనుమతిని నిలుపమయ్యా ...... నీ పాద ...

పత్యమ్ము చేసియు మేమందరము వేడుకుంటున్నామయ్యా      

నిత్యమ్ము మేమే మిమ్ము కొలవాలని ఆయాసంతో ఉన్నమయ్యా 
సత్యమ్ము నిలిపి ధర్మాన్ని నిలిపి నీలో కలవాలని ఉందయ్యా 
భత్యమ్ము ఆశించం మన: శాంతి అందించి మమ్ము కాపాడుమయ్యా   

నీ చరన రాజీవ సేవను నిరంతరం 

దయచేయుము గోవిందా   దయచేయుము గోవిందా 
నీ కరుణా కటాక్షము మాపై 
కురిపించుము గోవిందా కురిపించుము గోవిందా   

--((**))--




నేటి ప్రాంజలి ప్రభ 
లలిత సంగీతం (2) 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

నేను నాది అనకురా 
జీవితమే ఒక వేదమురా 

సుఖదు:ఖాలకు నిలయమురా 
బందనాలనుండి విముక్తి పొందాలిరా 
సహనంతో కర్మ విముక్తి పొందాలిరా 
ప్రాపంచిక సుఖాలు వదిలితే శాంతిరా 

నేను నాది అనకురా 
జీవితమే ఒక వేదమురా 

గురుబోధలో సత్యాన్ని తెలుసు కోవాలిరా 
జ్ఞానంతో నిర్వి కల్ప సమాధిని చేరాలిరా 
నిర్వాణ స్థితి యొక్క ఆనందాన్ని పొందాలిరా 
భేదము చూడక అంతా ఒకటేనని భావించాలిరా

నేను నాది అనకురా 
జీవితమే ఒక వేదమురా 

అత్యుత్తమ సేవలలో జీవితము గడపాలిరా
ఇతర సంభందాల మాటలకు లొంగక ఉండాలిరా  
ధర్మ పలుకులతో అవ్యక్తమైన ఆనంద స్థితి పొందాలిరా 
స్వత్సమైన ఎరుక స్థితిలో ఉండి కార్యం నిర్వహించురా  

నేను నాది అనకురా 
జీవితమే ఒక వేదమురా 

నిన్ను నీవు తెలుసుకోవటానికి ప్రయత్నించుమురా  
సప్త ధాతువులతో కూడిన శరీరము మనదిరా 
కామ క్రోధ,మోహ,మద,మాశ్చర్యములను గెలవాలిరా 
పంచ భూతాలకు లొంగి జీవితము సాగించాలిరా 

నేను నాది అనకురా 
జీవితమే ఒక వేదమురా 

స్త్రీ లోలునిగా మారక స్త్రీని గౌర వించుమురా 
స్త్రీ శక్తిని తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడుకురా 
స్త్రీ సుఖ సౌఖ్యములను అందించే కలియుగమురా
మాత, పిత, గురు, దేశ, సేవే నిత్యమని గమనించాలిరా 

నేను నాది అనకురా 
జీవితమే ఒక వేదమురా 
  
--(*)--


The only difference between a good day and a bad day is your attitude.” #indian #girlboss #celebration #photography #gudipadwa #festival #beautiful #mumbai #portrait


నేటి ప్రాంజలి ప్రభ 
లలిత సంగీతం (2) 

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

చిరు చిరు నవ్వుల శ్రీ వారికీ 
ఏమికావాలి మరి ఏమి కావాలి 

నీ హావ భావ నటనా చాతుర్యంతో నా మతిని దోచావు  
నీ అంగగంగ విన్యాసంతో నా హృదయాన్ని దోచావు 
నీ చమత్కర చాతుర్యంతో నా సర్వస్వాన్ని దోచావు 
నీ మాటల గారడీతో నా పెదాలను కదలనీయక చేసావు 

చిరు చిరు నవ్వుల శ్రీమతిని 
ఏమి అడగాలి మరి ఏమి అడగాలి

చిరు చిరు నవ్వుల శ్రీ వారికీ 
ఏమికావాలి మరి ఏమి కావాలి 

పరుగులెత్తే వయసుకు పవళింపుల్లో ముద్దు చేసావు 
చూపులు వెన్నెల సిరులతో నన్ను తడిపి వేసావు  
కొంటె చూపులతో కొన ఊపిరినీ కుదించివేసావు 
నీ ధ్యాసలో నా అడుల సవ్వడినే మార్చి వేశావు  

కోరుకున్న మొగుడికి ఇంకా 
ఏమి కావాలి మరి ఏమి కావాలి   

చిరు చిరు నవ్వుల శ్రీ వారికీ 
ఏమికావాలి మరి ఏమి కావాలి 

నామనస్సుకు శాంతి కావాలి విశ్రాంతి కావాలి 
నా వయసుకు తృప్తి ఇవ్వాలి సంతృపిగా మార్చాలి 
ఇస్తావా మరి ఇస్తావా 
నన్నే నువ్వు దోచావు మరి దాచాల్సిందేముంది 

నాకు నీవు కావాలి నీకు నేనుకావాలి 
నీకు నేనుకావాలి నాకు నీవుకావాలి 
నాకు నీవు కావాలి నీకు నేనుకావాలి 

నీకు నేనుకావాలి నాకు నీవుకావాలి 


నేటి ప్రాంజలి ప్రభ 

లలిత సంగీతం (1) 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

అనురాగభంధమై

ఆనంద దీపికై 
ఆశలు తీర్చే అలివేణివై ఉన్నావు నీవు   
నా ప్రాణానికి ప్రాణమైనావు నీవు ....  ....  ....

అవునా నాకు మాత్రం 

విరజాజిలా నీ మోము పై 

విరియాలని ఉంది   
జడివానలా నీ వలపుల్ని  
తీర్చి తడవాలని ఉంది 
ఊవ్విలూరిస్తు నీ తలపుల్లో 
ఉండి మెరవాలని ఉంది 
వెన్నెలనై నీ మనస్సులో     
కురియాలని ఉంది 

అనురాగభంధమై

ఆనంద దీపికై 
ఆశలు తీర్చే మగనివై ఉన్నావు నీవు  
నా ప్రాణానికి ప్రాణమైనావు నీవు ....  ....  ....

అవునా నాకు మాత్రం 


నీ చేతుల్లో బందీ నై  

నిలిచి పోవాలని ఉంది 
మత్తుగా గమత్తులను 
నీకు తెలపాలని ఉంది 
విపంచినై నీ చేతులపై 
రాయాలని ఉంది
నీ మోముపై శసికాంతిని 
చూడాలని ఉంది    

అనురాగభంధమై

ఆనంద దీపికై 
ఆశలు తీర్చే అలివేణివై ఉన్నావు నీవు   
నా ప్రాణానికి ప్రాణమైనావు నీవు ....  ....  .... 2 

అవునా నాకు మాత్రం 

నీలో ... నె సగమై 
కరిగి పోవాలని ఉంది 
నీ ప్రాణానికి నాప్రాణం 
తోడై నీడై ఉండాలని ఉంది 

అనురాగభంధమై

ఆనంద దీపికై 
ఆశలు తీర్చే మగనివై ఉన్నావు నీవు  
నా ప్రాణానికి ప్రాణమైనావు నీవు ....  ....  ....

పల్లకీలో నీవు నేను  (ఇద్దరూ )
కలసి పండించుకోవాలి
విడదీయని బంధంమై 
ఉండిపోవాలి 
విడిపోని బంధమై 
నిలిచి పోవాలి 

అనురాగభంధమై

ఆనంద దీపికై 
ఆశలు తీర్చే అలివేణివై ఉన్నావు నీవు   
నా ప్రాణానికి ప్రాణమైనావు నీవు ....  ....  .... 2 

అనురాగభంధమై

ఆనంద దీపికై 
ఆశలు తీర్చే మగనివై ఉన్నావు నీవు  
నా ప్రాణానికి ప్రాణమైనావు నీవు ....  ....  ....

--((**))--   

No comments:

Post a Comment