Thursday 21 February 2019

నేటి ప్రాంజలి ప్రభ కధలు (ఈవారం స్పెషల్ )







ఉన్నవాల్ళకో రీతి - లేనివాళ్ళకో రీతి 

ఆ భవనం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. రంగురంగుల లైట్లు కనులకింపుగా ఆ భవనాన్నంటుకుని వేళ్ళాడుతున్నాయ్. ఆ భవంతి ఆవరణలో కార్లు బారులు తీరి నిలబడుతున్నాయ్. హాల్లో ఏర్పాటు చేసిన కుర్చీల వరుసల్లో బోలెడు మంది స్త్రీలు కూర్చుని, తమ మధ్య ఆ ఇంటి కోడలు శ్రీలక్ష్మికి జరుగుతున్న సీమంత వేడుకు చూస్తున్నారు. నిముష నిముషానికి కూల్‌డ్రింక్ సీసాలు అందిస్తున్నారు పనివాళ్ళు.

వేడుక ముగిసింది.

పెద్ద ఎత్తున స్వీట్లూ, హాట్లతో పార్టీ మొదలయింది. కొంతమంది రెండేసి ప్లేట్లు  తింటున్నారు. కొంత మంది కొంచెం రుచి చూసి వదిలేస్తున్నారు.

ఆ భవనం యజమాని నిరంజనం మేడమీద కూర్చుని ఆనందంలో తేలిపోతున్నాడు. తన కొడుక్కు వివాహమై నాలుగేళ్ళయింది. ఇన్నాళ్ళకి ఇప్పుడు కోడలు గర్భవతయింది. అదే ఆయన ఆనందానికి కారణం. ఆయనేకాదు ఆ యింట్లోని సభ్యులందరూ తమ వంశాన్ని నిలబెట్టే చిన్నిపాపాయి రాక కోసం వేయి కళ్ళతో ఆనందంగా ఎదురు చూస్తున్నారు. శ్రీలక్ష్మి ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఇద్దరు లేడీ డాక్టర్లను నియమించారు. ఒక నర్స్‌కి తాత్కాలికంగా ఇంట్లో ఉద్యోగం ఇచ్చారు. ఆమెని అడుగుపెట్టనీకుండా, అలసట చెందనీకుండా అన్ని ఏర్పాట్లూ చేశారు.

రాత్రి తొమ్మిదింటిగ్గానీ ఆ వేడుక తాలూకు హడావిడి తగ్గలేదు.

శ్రీకాంత్ భార్య శ్రీలక్ష్మిని ఆప్యాయంగా తమ గదిలోకి తీసుకెళ్ళిపోయాడు.

"ఈ పండుగలో బాగా అలసిపోయినట్లున్నావ్! విశ్రాంతి తీసుకో" అన్నాడతను.

శ్రీలక్ష్మి అలసటగా నవ్వింది.

మంచం మీద అలగ్గా వాలింది.

"కూర్చుని కూర్చుని కొంచెం నడుం నొప్పిగా వుంది..." అంది చిన్నగా నవ్వుతూ.

శ్రీకాంత్ వెంటనే లేడీ డాక్టర్‌కి ఫోన్ చేశాడు.

"అబ్బే డాక్టరెందుకూ ఈ మాత్రానికే... వద్దండీ..." వారిస్తూ అందామె.

అతను వినిపించుకోలేదు.

"నీకు తెలీదు శ్రీలక్ష్మీ! మన జాగ్రత్తలో మనం వుండడం మంచిది" సౌమ్యంగా అన్నాడతను.

ఆ భవనం ఎదురుగా శిథిలావస్థలో వున్న పాకల్లో కూడా ఆ రోజు సందడిగా వుంది. ఆ పాకల్లోని చాలామంది స్త్రీలు ఓ పాకదగ్గరకు చేరి అక్కడ నులకమంచం మీద పడుకొన్న నాగమ్మ వేపు జాలిగా చూసి మాట్లాడుకొంటున్నారు.

నాగమ్మ బాధతో మెలికలు తిరుగుతోంది.

"కొంచెంసేపు ఓర్చుకోవే! అదే తగ్గిపోతుంది..." ఓ ముసలమ్మ అంటోంది.

"అయిదో నెల వచ్చినప్పట్నించీ ఇలాంటి నెప్పులు మామూలేలే" మరో స్త్రీ సర్ది చెప్తూ అంది.

"ఒకవేళ కడుపు పోయినా మంచిదే" నాగమ్మ అత్త అంది.

ఆ రాత్రంతా నాగమ్మ భర్తా, అత్తామామలు నిద్రలేకుండానే గడిపారు. ఏ క్షణాన ఆమెకు గర్భవిచ్చిత్తి అవుతుందోనని క్షణమొక యుగంగా ఎదురు చూశారు ఆ రాత్రంతా. బాధతో మూల్గుతూనే వుంది నాగమ్మ.

"ఒకోళ్ళకి ఆ మందు వెంటనే పనిచేస్తుంది. అది వేసుకున్న గంటలో గర్భం పోతుంది. మరి మన రాతేంటో దీని కింతవరకూ ఆ సూచన కనిపించడం లేదు" దిగులుగా అంది అత్త.

వాళ్ళందరి వృత్తి రోడ్డు పక్కా - గుళ్ళు, సినిమా హాళ్ళ దగ్గరా కూర్చుని అడుక్కోవడం-

ఈ పరిస్థితుల్లో నాగమ్మ గర్భం ధరించడం అందరికీ గుండెల్లో రాయి పడింది. తమకే కడుపునిండా తిండి దొరకడం లేదు. ఇక ఆ పసిగుడ్డు బయటికొస్తే దానికెవరు పెడతారు?

తెల్లారేసరికి నాగమ్మ నొప్పులు తగ్గిపోయాయ్.

"ఇంకేం చేస్తాం...పద అడుక్కోవడానికి..." అన్నాడామె భర్త.

అలాగే, లేచి అతనితోపాటే అడుక్కోవడానికి బయల్దేరింది నాగమ్మ.

శ్రీలక్ష్మికి నొప్పులు వచ్చాయ్. వెంటనే ఆమెను కార్లో అతి ఖరీదయిన ఓ నర్సింగ్‌హోమ్‌కి తీసుకెళ్ళారు. అక్కడ ఆమెను అంతవరకు కనిపెట్టి వున్న లేడీ డాక్టర్లిద్దరూ కాక మరో స్పెషలిస్ట్ కూడా రప్పించ బడింది. ఆ వేళంతా ఆమెని కనిపెట్టే వున్నారందరూ. ఎప్పుడో అర్థరాత్రికి కాని ప్రసవించలేదు శ్రీలక్ష్మి. అదీ సిజేరియన్ ఆపరేషన్ తర్వాత!

ఆ రోజు నాగమ్మ బజార్లో అడుక్కొంటుంటే హఠాత్తుగా నొప్పులొచ్చాయ్. భరించలేని నొప్పులు.

ఆమె రోడ్డుపక్కనే పడి బాధపడడం చూసిన దారినపోయేవాళ్ళు ఓ రిక్షా మాట్లాడి , ఆమెను అందులో వేసి హాస్పిటల్‌కి పంపించారు. ఆమెను ప్రభుత్వ హాస్పిటల్ వరండాలో పడేసి వెళ్ళిపోయాడు రిక్షావాడు.

హాస్పిటల్ సిబ్బంది ఆమెను చూసి కూడా చూడనట్లు ఎవరి దారిన వాళ్ళు తిరగసాగారు.

నాగమ్మకి నొప్పులు అధికమయ్యాయి.

గట్టిగా కేకలు పెడుతూ అటూ ఇటూ తిరిగే నర్సులనూ, డాక్టర్లనూ బ్రతి మాలసాగింది.

చివరికి ఆమె ఆ వరండాలోనే మరో ముష్టిదాని సాయంతో ప్రసవించేసింది.

శ్రీలక్ష్మికి మగపిల్లాడు పుట్టాడు. అయితే ఆ పిల్లాడి కాళ్ళూ చేతులు చచ్చుబడిపోయివున్నాయ్. ఇది చూస్తూనే ఆ ఇంటివాళ్ళంతా నిరుత్సాహ పడిపోయారు.

వెంటనే కార్లు స్పెషలిస్టుల దగ్గరకు పరిగెత్తాయ్.

డాక్టర్లు ఒకరి తర్వాత మరొకరు పరీక్షించి ఆ పాపాయిని విదేశాలకు తీసుకెళ్ళాలనీ, అప్పుడే ఆ పాపాయికి కాళ్ళూ చేతులూ సరిగ్గా రావచ్చని అభిప్రాయాలు వెలిబుచ్చారు.

వారం తర్వాత అలాంటి కేసులు నయం చేశాడని పేరుపొందిన ఓ బొంబాయి వైద్యుని దగ్గరకు విమానంలో బయల్దేరిందా కుటుంబం.

నాగమ్మకి ఆడపిల్ల పుట్టింది. పిల్ల ఆరోగ్యంగా వుంది. ఆ మర్నాడే మంచాలు ఖాళీ అవ్వాలని హాస్పిటల్ వాళ్ళు ఆమెను బయటికి గెంటేశారు. ఆ పసిగుడ్డును తీసుకుని నెమ్మదిగా ఇంటికి చేరుకుంది నాగమ్మ.

ఆమె అంత త్వరగా ఇంటికి రావడం ఆ ఇంటిల్లిపాదికీ నచ్చలేదు.

"మరో రెండ్రోజులక్కడే వుంటే మంచి తిండి దొరికేదిగా" అందామె అత్త దిగులుగా.

"వుంటానంటున్నా బయటికి తోసేశారు..." చిన్నగా జవాబిచ్చింది నాగమ్మ.

పాపాయిని అందరూ మూగి చూశారు. బొద్దుగా ఆరోగ్యంగా వుందాపిల్ల.

"ఏ వంకా లేని పిల్ల" నిరుత్సాహంగా అంది అత్త.

"మన కర్మం! మన పాక్కెదురుగా వున్న గొప్పోలింట్లో కాల్లూ సేతులూ ఆడని బాబు పుట్టాడంట. దేవుడలాంటి పిల్లని మనకిస్తే ఎంత బావుండేది" విచారంగా అన్నాడామె మామ.

పిల్ల ఇల్లెగిరిపోయేటట్లు ఏడుపు మొదలెట్టింది. ఆకలికి ఓర్చుకుంటూనే ఆ పిల్లకు పాలు పట్టింది నాగమ్మ.

పాలు సరిగ్గా రాక పిల్ల వుండుండి ఏడుస్తూనే వుంది.

కన్నో కాలో వంకరతో పుడుతుందని అంతా ఆశపడ్డారు. కానీ తీరా చూస్తే ఆ పిల్ల ఏ వంకా లేకుండా పుట్టింది.

ఇప్పుడిలాంటి ఆరోగ్యంగా వున్న పిల్లని బజార్లో పడేసి అడుక్కుంటే డబ్బెవరు పడేస్తారు?

కాళ్ళు లేని పిల్లో, చేతుల్లేని పిల్లో, చెవి, ముక్కు ఏదో ఒకటి వికృత రూపంలో వున్న పిల్లయితే నాలుగు డబ్బులు రాల్తేనే ఆ పిల్లకు, తమకూ కూడా జరుగుబాటు వుంటుంది.

ఇప్పుడేం దారి? ఏం చేయడం? నాగమ్మ ఆలోచనలో పడింది. ఎటూ తేలడం లేదామెకి.

ఓ పక్క తన ఆకలి, మరోపక్క పిల్ల ఆకలి! ఏటూ తేలనీయడం లేదవి. ఏ ఆలోచనా తోచనీయడం లేదు.

బొంబాయి చేరుకుని వారం రోజులైంది.

నిరంజనం తన మనవడ్ని స్పెషలిస్టుకి చూపించాడు.

ఆయన ఎన్నో ఖరీదైన పరీక్షలు జరిపి - అంత తేలిగ్గా నయం కాదనీ, చాలా కాలం వైద్యం చేయిస్తే వుపయోగం వుండవచ్చనీ చెప్పాడు. తనకి వాళ్ళ వూరు వచ్చి చూడ్డం సాధ్యం కాదు కనక వాళ్ళనే కొంత కాలం బొంబాయిలో వుండి పొమ్మన్నాడూ.

తనకి కూడా సాధ్యం కాని పక్షంలో అప్పుడు అమెరికాకి వెళ్ళవచ్చని సలహానిచ్చాడు. దాంతో ఆ కుటుంబం మకాంని తాత్కాలికంగా బొంబాయికి మార్చేసింది. భగవంతుడి మీదా, ఆ డాక్టరుమీదా భారం వేసి వేలకివేలు డబ్బు ఖర్చు చేయసాగారు.

భగవంతుడికి మొక్కులూ, పూజలూ -

డాక్టరుకి ఫీజులూ, పార్టీలూ -
రాన్రాను నాగమ్మకి ఆ పిల్లతో ప్రాణం మీద కొస్తోంది.

ఇంటిల్లిపాదీ అడుక్కొచ్చినా చాలటం లేదు. ఆ పిల్లను చూస్తుంటే నాగమ్మకి కోపం ముంచుకొస్తోంది!

తనేం పాపం చేసిందని దేవుడు తన కిలాంటి ఆరోగ్యకరమైన బిడ్డనిచ్చాడు. తనకన్న రెండునెల్లు ముందు కన్న సన్యాసమ్మకి ఇద్దరు గుడ్డిపిల్లలు? అంతకుముందు రామిగాడి పెళ్ళాం రంగికి తల పెద్దది, శరీరం చిన్నదిగా వున్న పిల్లాడు పుట్టాడు...

ఇలా అందరికీ అదృష్టం కలిసొచ్చింది. ఆ పిల్లలను పడుకోబెట్టొ అడుక్కొంటుంటే వాళ్ళ జోలెలన్నీ నిండిపోతున్నయ్! తన ఖర్మే ఇలా కాలిపోయింది. ఆకలికి తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లని లాగి కొట్టింది నాగమ్మ. పిల్ల ఆ దెబ్బకి ఓర్చుకోలేక తల్లడిల్లిపోసాగింది.

* * * * *

చాలారోజుల తర్వాత ఆ స్పెషలిస్ట్ వైద్యం కొంతవరకూ పని చేయడం ప్రారంభించింది. శ్రీలక్ష్మి పిల్లాడు కాళ్ళూ చేతుల్ని ఇప్పుడు కొంచెంకొంచెంగా కదప గలుగుతున్నాడు. ఆ రోజు పెద్ద పండగ జరిపేశారు వాళ్ళు. ఆ డాక్టరుకు ఖరీదయిన వాచీ బహూకరించారు.

"పూర్తిగా స్వస్థత చేకూరాలంటే అతి ఖరీదయిన ఓ ఆపరేషన్‌ని చేయాల్సి వుంటుంది" అన్నాడు డాక్టర్.

"ఎంత డబ్బయినా ఖర్చు చేస్తాం. మాక్కావల్సింది మా మనవడు అందరిలాగా తిరగడం... వాడు మిగతా అందరి పిల్లల్తో ఆడుకోవాలి. అంతే!" ఆవేదనతో అన్నారు నిరంజనంగారు.

ఆ వారం రోజులుగా ఇంటిల్లిపాదీ ఆపిల్ల గురించే ఆలఒచిస్తున్నారు.

రాన్రాను ఆ పిల్లను భరించడం కష్టమైపోతోంది వాళ్ళకి.

"ఏం సేద్దామే...?" నాగమ్మ భర్త దిగులుగా అడిగాడు.

"నువ్వే సెప్పు..." తోచక విసుగ్గా అన్నది నాగమ్మ.

"పోనీ, ఏడయినా ఇడిసేద్దామా..." అడిగాడతను.

"నీ ఇట్టం. ఇడిసేద్దామంటే ఇడిసేద్దాం" కొంత అయిష్టంగానే అందామె.

లోపల తను కన్న మొదటి సంతానాన్ని అలా పారేయడం ఆమెకు ఇష్టం లేదు.

"రేపు పొద్దుగుంకింతర్వా తట్టుకెల్లి ఏ రోడ్డు ప్రక్కనో ఇడిసేద్దాం. ఎవరో ఒకల్లట్టుకెల్లి పెంచుకుంటారు..." నిర్ణయించుకున్నట్లుగా అన్నాడతను.

"సరే..." వప్పుకుంది నాగమ్మ కన్నీళ్ళద్దుకుంటూ.

ఆ రాత్రి వాళ్ళ నిర్ణయాన్ని అత్తమామలు విన్నారు.

"ఆ పిల్ల కొద్దిగా పెద్దదయితే మనకి శానా వుపయోగపడుద్దిరా! అదే అడుక్కొంటది. అలా ఇడిసేత్తానంటే ఎలా?" అన్నాడు మామ.

"అవును. ఇంత కష్టపడి కని, ఆ పిల్లనట్టా ఇడిసేత్తే ఎట్టా?" తనూ అతన్ని సమర్థిస్తూ అంది అత్త.

"మరంతవరకూ దీన్నెలాగే సూట్టం?" చిరాగ్గా అన్నాడు నాగమ్మ భర్త.

అందరూ మళ్ళీ ఆలోచనలో పడ్డారు.

"నేనో మాట సెప్తా ఇంటావా?" అడిగాడు మామ.

"ఆ పిల్లకి కాళ్ళూ, సేతులూ ఇరిసేద్దం. మర గొడవా వుండదు. రోడ్డు పక్కన పారేసి వుంచితే మనందర్నీ కూడా అదే పోసిత్తుంది..."

అందరూ నిశ్శబ్దంగా వుండిపోయారు.

కన్నపిల్లను పారేసుకోవడం కన్నా అదే నయమనిపించింది నాగమ్మకి.

అందరికీ ఆ పద్ధతే బాగనిపించింది.

అందరూ ముసలాడిని అంత మంచి ఉపాయం ఆలోచించినందుకు పొగిడారు.

ఆ రాత్రి-

బొంబాయిలో శ్రీలక్ష్మి పాపాయికి కాళ్ళూ చేతులూ మామూలుగా వచ్చేందుకు ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు శ్రమపడుతూంటే...

నాగమ్మ పాకలోంచీ కాళ్ళూ చేతులూ మెలితిప్పబడ్డ శిశువు పాక ఎగిరిపోయేటట్లు ఏడ్వడం మొదలు పెట్టింది...


(యువ మాసపత్రిక ఫిబ్రవరి 1980లో ప్రచురితం)





నారాయణ నామ మహాత్యం 



ఒకసారి నారద మహర్షి కి ఓ అనుమానము వచ్చింది. 

నారాయణ నామస్మరణ వలన ప్రయోజనము ఏమిటాని? వెంటనే మహర్షి వైకుంఠము వెళ్ళి తన అనుమానమును శ్రీమన్నారాయణుని ముందుంచాడు. భగవంతుడు నారదమహర్షితో ఇలా అన్నాడు. "నారదా! ఇప్పుడే భూలోకంలో నైమిశారణ్యంలో ఒక కీటకం జననమెత్తింది. దానిని వెళ్ళి అడుగు" అని ఆకీటకాన్ని చూపించాడు. భగవంతుని ఆనతి మేరకు నారదుడు ఆకీటకము దగ్గరకు వెళ్ళి నారాయణ నామస్మరణ వలన ప్రయోజనము ఏమిటని ప్రశ్నించాడు. వెంటనే ఆకీటకము గిలగిలకొట్టుకుని చనిపోతుంది. విచారంగా నారదమహర్షి వైకుంఠము తిరిగి వెళ్ళి జరిగిన విషయము శ్రీమన్నారాయణునికి విన్నవించాడు. "ఒహో! అలాగా!! అయితే మళ్ళీ భూలోకం వెళ్ళి, కశ్యపుని ఆశ్రమములోనున్న కపిలగోవుకి జన్మించిన వత్సము(ఆవుదూడ)ను అడుగు" అని ఆనతిస్తాడు. నారద మహర్షి కశ్యపుని ఆశ్రమములోనున్నఆవుదూడ వద్దకు వెళ్ళి అదే ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నవినగానే ఆ ఆవుదూడకూడ గిలగిల తన్నుకుని చనిపోతుంది. నారదమహర్షి ఆశ్చర్యచకితుడయ్యి, విషయాన్ని శ్రీమన్నారాయణునికి తెలియపరుస్తాడు. శ్రీమన్నారాయణుడు "నారదా! ఇప్పుడే కాశీరాజుకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ శిశువుని వెళ్ళి నీ ప్రశ్న వెయ్యి" అని చెపుతాడు. అప్పుడు నారదమహర్షి " ప్రభూ, నావలన ఒకకీటకము ఆవుదూడ చనిపోయినవి. ఇప్పుడు శిశుహత్యాపాతకముకూడా నామెడకు చుట్టుకునేలావుంది." అని శ్రీమన్నారాయణునితో వాపోతాడు. దానికి శ్రీమన్నారాయణుడు, "నారదా! నీకు ఏహత్యాపాతకము తగలదు. ఆశిశువు వద్దకు వెళ్ళి నీఅనుమానము నివృత్తిచేసుకో" అని అభయమిస్తాడు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞమేరకు నారదమహర్షి ఆ కాశీరాజుకు జన్మించిన శిశువు దగ్గరకు వెళ్ళి తన సందేహము తీర్చమని అడుగుతాడు. అప్పుడాశిశువు పకపకానవ్వి "ఓ మహర్షి నేను అనేక జన్మలలో చేసిన పాపాల ఫలితముగా నీచమైన కీటకజన్మ ఎత్తవలసివచ్చింది. ఆజన్మలో నీవు వచ్చి "నారాయణ" అనే నామము నాచెవిలో పడవేసావు. ఆ అతిపవిత్రమైన నామము నాచెవిన పడగానే నాజన్మజన్మల పాపము నశించి పవిత్రమైన గోజన్మ వచ్చింది. ఆ జన్మలో కూడా నీవు వచ్చి మరల ఆ అతిపవిత్రమైన నామము నాకు వినిపించావు. తక్ష్ణమే ఆ పుణ్యఫలము అనుభవించనిమిత్తము ఈ కాశీరాజుకు కుమారునిగా జన్మించాను. ఇంతకన్నా నారాయణ నామస్మరణ మహాత్యము ఏమని చెప్పమంటావు! ఓ మహర్షి !" అని ఆ శిశువు మరల తన నరజన్మ అనుభవములోనికి వెళ్ళిపోతుంది. 

నారదమహర్షి పరమానందభరితుడై శ్రీమన్నారాయణుని అనేకానేకములుగా స్తుతించి తన త్రిలోకసంచారమునకు నారాయణ నామస్మరణ చేస్తూ బయలుదేరుతాడు.












దేవుని కోరిక 

సుగుణ రూపనగుడిి గారి కలము
నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి తన పేదరికానికి చాలా చింతిస్తుండేవాడు. ఏ పనీ చేయకుండా ఇతరులతో పోల్చుతూ తన పేదరికానికి కారణమైనారని తల్లితండృలని, దేవుడినీ తిడుతూ ఉండేవాడు.

అలా ఒకసారి దేవుడిని తిడుతూ ఉండగా దేవుడు ప్రత్యక్షమై "నాయనా ఏమిటి నీ బాధ?" అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి "స్వామీ, నీవు ఎంతోమందిని ధనికులుగా పుట్టించావు. మరి నన్ను ఎందుకు పేదరికంలో పుట్టించావు?" అని అడిగాడు.



దానికి దేవుడు "నాకు ఎవరిమీదా ప్రత్యేకమైన ఆసక్తి కానీ శతృత్వము కానీ లేవు. వారి వారి ఆలోచనలను, వారు చేసే కర్మను బట్టి మాత్రమే వారు పేదవారా లేక ధనికులా అన్నది వారే నిర్ణయించుకోవాలి. కొంతమంది పుట్టుకతో పేదలైనా వారి స్వశక్తితో ధనికులుగా మారారు. మరికొందరు పుట్టుకతో ధనికులైనా సరైన మార్గంలో పయనించక కటిక దరిద్రం అనుభవిస్తున్నారు. ఎవరు ఏ విధంగా పుట్టినా అందరికీ ఎదగడానికి కావలసిన వసతులు కల్పించడమే నా విధి" అన్నాడు.




కానీ ఆ వ్యక్తి ఒప్పుకోకుండా అలాగే వాదిస్తూ "అందరికీ వసతులు కల్పించడమే నీ విధి అన్నావు. మరి నాకేమీ వసతులు కల్పించలేదే" అన్నాడు. ఆ తరువాత వారి మధ్య సంభాషణ ఇలా జరిగింది.



దేవుడు: నీకోసం నేను ఎన్నో పనులు చేసుకునే అవకాశం కల్పించాను. కానీ నీవు పని చేయకుండా కేవలం ధనికులను చూస్తూ వారిలా పుట్టలేదే అని అలోచిస్తూ కాలం వెళ్ళబుచ్చి నీఅంతట నీవే అవకాశాలను కోల్పోయావు. అయినా నీవు ధనవంతుడవు కావు అని నీవెందుకు అనుకొంటున్నావు?



వ్యక్తి: నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. తినడానికి కనీసం తిండి లేదు. నేను ధనికుడనెలా అవుతాను.



దేవుడు: సరే. నేను నీకొక లక్ష రూపాయలు ఇస్తాను ఒక వేలు కోసిస్తావా?
వ్యక్తి: అమ్మో లేదు.

దేవుడు: అలా ఐతే ఐదు లక్షలిస్తాను, ఒక చేయి ఇస్తావా?
వ్యక్తి: చేయి లేకుండా జీవితాంతం అడుక్కుతినాలా?. లేదు

దేవుడు: పోనీ పది లక్షలిస్తాను ఒక మూత్ర పిండం ఇస్తావా?
వ్యక్తి: ఉన్న ఒక్కటీ పాడైపోతే నాకు ఇచ్చేవాడు ఎక్కడ దొరకాలి? ఇవ్వను.

దేవుడు: 20 లక్షలకి నీ కన్నులు ఇస్తావా?
వ్యక్తి: జీవితాంతం కటిక చీకటిలో బ్రతకడంకంటే దుర్భరమైనది ఇంకొకటి లేదు. 
కాబట్టి ఇవ్వను.

దేవుడు: 50 లక్షలిస్తాను నీ గుండెను ఇస్తావా?
వ్యక్తి: లేదు

దేవుడు: 1 కోటి రూపాయలు ఇస్తాను. నీ మెదడు ఇస్తావా?
వ్యక్తి: గుండె, మెదడు లేకుండా నేనెలా బ్రతుకుతాను? ఇన్ని రోజులూ ఇంత పేదరికంలోనైనా బ్రతుకుతున్నది ఇలా చావడానికేనా?

దేవుడు: చూశావా నాయనా. కొన్ని లక్షల విలువైన శరీరాన్నీ, కొట్ల విలువచేసే మెదడునూ నీకిచ్చాను. ఉన్న వాటిని వాడుకోకుండా అనవసరంగా సమయం వృధా చేసుకొని జీవితాన్ని దుర్భరం చేసుకొంటున్నావు.

ఈ రోజుల్లో మనుషులు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు.కానీ నేను నీకు ఇంతటి ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇచ్చాను. దాని విలువ తెలుసుకొని బ్రతుకు అన్నాడు.

సోమరితనంగా నాకు డబ్బు లేదే,నాకు దేవుడు అదివ్వలేదే యిదివ్వలేదే అని బాధ పడకుండా వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోవాలి.
సర్వేజనా సుఖినోభవంతు కనువిప్పు కలిగించె కధ.


--((**))--


ప్రాంజలి ప్రభ కు 
ఓం శ్రీ రాం   శ్రీ మాత్రేనమ:

మల్లాప్రగడ రామకృష్ణ 
ఉపవాసము!
.
ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం. ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అని అర్ధం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార, పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని పస్తు ఉంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట లేక ఒకరోజు లేక కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.
.
భక్తితో కావచ్చు.. బరువు తగ్గేందుకు కావచ్చు.. కారణమేదైనా చాలామంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటే బలహీనత, అసిడిటీ, డస్సిపోవటం, తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంఖణం చేయటం కాదని, ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి.

మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలున్నవారు, గర్భిణులు, పిల్లలు.. అసలు ఉపవాసం చేయకపోవటం మేలు. మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె, నెయ్యి వేసి వండిన స్వీట్లు, కొవ్వు పదార్ధాల వంటివి దండిగా తింటుంటారు. ఇదీ మంచిది కాదు. దీనివల్ల ఉపవాస ఫలమూ ఉండదు. కాబట్టి ఉపవాస సమయంలో- మన శరీరానికి అవసరమైన పోషకాహారం, మితంగా తీసుకోవటం మంచిది. ఇలా చేస్తే ఉపవాసం తర్వాత శరీరం మరింత ఉత్తేజంగా, తేలికగా, ఉల్లాసంగా అనిపిస్తుంది.


 ఉపవాస సమయంలో- పండ్లు, కూరగాయ ముక్కల వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. పండ్లు దండిగా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, శక్తికీ కొదవుండదు. అలాగే పాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, క్యారెట్ల వంటివాటితో చేసిన పదార్ధాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, మాంసకృత్తులు, క్యాల్షియం వంటివన్నీ లభిస్తాయి. ఉపవాస సమయంలో- మజ్జిగ, పండ్ల రసం, నిమ్మ నీరు, కూరగాయ సూపుల వంటి ద్రవాహారం తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదు.


 ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వు పదార్ధాలు కాకుండా.. మెంతికూర కలిపి చేసిన మేథీ చపాతీ; సగ్గుబియ్యం, కూరముక్కల వంటివి కలిపిన ఖిచిడీ; పాలు, పెసరపప్పు వంటి వాటితో చేసిన పాయసం వంటివి తీసుకోవటం ఉత్తమం.



. హిందూమతంలో ఉపవాసదీక్ష

శివరాత్రి
నాగులచవితి
తొలి ఏకాదశి
కార్తీక సోమవారం
.ఇస్లాంలో ఉపవాసవ్రతం!


సౌమ్


సౌమ్ అనగా ఉపవాసం. ఇస్లాం ఐదు మూలస్థంభాలలో మూడవది. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా అచరించవలసిన నియమం ' ఉపవాసవ్రతం' . ఈ ఉపవాసంను పార్సీ భాషలో రోజా అని అంటారు. అరబ్బీ భాషలో సౌమ్ అని పిలుస్తారు.


రామాయణం లో వాల్మీకి మహాముని వర్ణించారు ఉపవాసం ఆరోగ్యానికి ఒక దివ్వఔషధము. చెట్లకు సమస్త జీవరాశికి పరిణామ దసలున్నాయి అవేవి మనిషిలా పలురకాల ఆలోచనలతో కుంగి పోవు. వాటికి వర్తమానమే ముఖ్యం దాన్ని అవి ఆనందందంగా గుర్తిస్తాయి. పోను పోను చెట్లు మొడు లౌతాయి పచ్చదనం లేని కట్టెలౌతాయి ఆచెట్లపై ఉన్న పక్షులకు అది గడ్డు కాలమే అవుతున్నది. అయినా నాలుగు చినుకులు పడితే తరువు తనువూ సమస్తము పత్ర హరిత మయమవుతున్నది. పువ్వుల కాయలతో నిండుగా ఉంటుంది.

అదే మనుష్యులు ఆశతో ఆకలితో ఎక్కడా దొరకనట్లుగా చూసిన ఆహారాన్ని ఎక్కువగా తింటారు కొందరు, కొందరు ఏది చూసిన అను మానంతో తింటారు, మరికొందరు ఉదరపోషణ ధర్మానికి శక్తిని ఇచ్చే పోషక పదార్ధాల ఆహారాన్ని తింటారు. ఎంత తిన్న వయసు పెరిగిన కొద్ది మన శరీరంలో మార్పులు వస్తాయి. అమర్పులకు తగ్గట్టుగా మనం ఆహారం తీసుకోవాలి, వయసు పెరిగితే చెట్లలాగా వికసించే శక్తి మనకు ఉండదు.

అందుకే శనివారం, మంగళవారం ఉపవాసము ఉండుట మంచిది అని పెద్దలు చెప్పారు ఎందుకనగా మనం తిన్న ఆహారము జీర్ణము కావాలి అది ఒక సంచి అదే పనిగా తిండిని తొక్కుతూ పోతే శరీర భాగాలు పని చేయటం తగ్గు గుతుంది.  బద్దకం పెరుగుతుంది, నిద్రముంచు కొస్తుంది. ఇది ఎవరికీ మంచిది కాదు.               

ఉపవాసం ఆరోగ్యానికి, వీర్యశక్తికి తప్పని అవసరం. ప్రకృతి ని బట్టి మానవులు అసలు విషయము గ్రహించి ప్రస్తుత స్థితిని బట్టి ఆనందము అను భవించుటకు ఉపవాసము అవసరము.    



"తెల్ల గ్రద్దనెక్కిన నల్లనయ్యా"
........................................

ఒక గ్రామంలో ఒక పశువుల కాపరి ఉండేవాడు. అతడు పరమ భక్తుడు. కాని అక్షరశూన్యుడు. పగటిపూట పశువులను మేలుకుని
సాయంత్రమయ్యేసరికి పురాణం వినడానికి గుడికి వెళ్లేవాడు. అక్కడ ఒక పౌరాణికుడు పురాణంచెబుతూ 
భక్తిమార్గాన్నిబోధిస్తున్నాడు.ఆయన
ఒక రోజు మహావిష్ణువు యొక్క స్వరూపమును,లక్షణములను 
వివరిస్తూ నల్లనివాడు,తెల్లనిగ్రద్ద
నెక్కేవాడు, తెల్లని నామం ధరించే
వాడు, భక్తుల కోర్కెలు తీరుస్తాడని, వారు పెట్టే నైవేద్యం స్వీకరిస్తాడని, నమ్మినవారిని తప్పక అనుగ్రహిస్తా డని బోధించాడు. పశువుల కాపరి ఈ మాటలు శ్రద్ధగా విన్నాడు. ఆ పౌరాణికుడు వర్ణించిన విష్ణు రూపం హృదయంలో గాఢంగా హత్తుకు
పోయింది.ఏవిధంగానైనా ఆదేవుణ్ని
చూసితరించాలనిసంకల్పంకలిగింది

మరునాడు పశువుల కాపరి యధాప్రకారం ఉదయమే లేచి మధ్యాహ్న భోజనమును మూట
గట్టుకుని పశువులతో బయలు
దేరాడు. పశువులను మేతకుతోలి తానుఒకచెట్టునీడలోకూర్చున్నాడు.
తాను తెచ్చుకున్న చల్లకూడును నారాయణునికి నైవేద్యం పెట్టి--

"తెల్ల గ్రద్ద నెక్కిన నల్లనయ్యా!
చల్లత్రాగ మెల్లగాను రావయ్యా"

అని ప్రార్థించడం మొదలుపెట్టాడు.

భగవంతుడు రాలేదు. నైవేద్యం ఆరగించలేదు. భగవంతుడు ఆరగించని చల్లకూడును తానూ తినకూడదని నిశ్చయించుకుని నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ విధంగా పదకొండు రోజులు గడిచాయి. పశువుల కాపరి కృంగి, కృశించి బలహీనుడైపోయాడు. కాని ధ్యానము మానలేదు.

" తెల్లగ్రద్దనెక్కిన నల్లనయ్యా
చల్లత్రాగ మెల్లగాను రావయ్యా!"

మహావిష్ణువు అతని నిష్కళంక భక్తికి చలించిపోయాడు.ఒకముసలి
బ్రాహ్మణరూపంలో కనిపించాడు.

"నేను నారాయణుణ్ని. నీవు ప్రార్థించావు కదా వచ్చాను."
అన్నాడు. పశువుల కాపరికినమ్మకం
కలగలేదు.

"ఇతడు దేవుడా? కాదా? సుందర రూపం లేదు. ముఖం నల్లగా లేదు. తెల్లని గ్రద్దపై రాలేదు."

పశువుల కాపరి : "ఓ ముసలి బ్రాహ్మణుడా! నీవు రేపు ఏడు
గంటలకు ఏటి ఒడ్డుకు రా! "

భగవానుడు: "సరే!"

పశువుల కాపరి హడావిడిగా పౌరాణికుని దగ్గరకు వెళ్లాడు. విషయం చెప్పి రేపు ఏడుగంటలకు ఏటిఒడ్డుకు రమ్మని అభ్యర్థించాడు. విషయం గ్రామస్తులకు తెలిసింది.
వారుకూడా ఉత్సాహం చూపారు.

ఉదయం ఏడింటికల్లా అందరూ ఏటిఒడ్డుకు చేరుకున్నారు.అందరూ
ఎదురు చూస్తూండగానే ముసలి బ్రాహ్మణుడు ఒక్కసారిగా తిరిగి ప్రత్యక్ష మయ్యాడు. పశువులకాపరి 
ఉత్సాహంగా అరిచాడు.

" ఇదిగో! ఇతడే నిన్న వచ్చిన
ముసలి బ్రాహ్మణుడు."

బ్రాహ్మణ రూపంలో వున్న భగవంతుణ్ని పౌరాణికునితో సహా అక్కడ గుమిగూడిన గ్రామస్తు లెవ్వరూ చూడలేకపోయారు.వారు 
పశువుల కాపరిని గేలిచేస్తూ, కోపంతో కొట్టడం ప్రారంభించారు. పశువుల కాపరికి ఒళ్లు మండింది. దేవునికేసి తిరిగి--

" బాపనయ్యా!నాకు ఈ గతి పట్టించడానికా నీవు వచ్చావు?
నాకు కనపడినట్లుగా వారికెందుకు కనిపించవు?" అని అరుస్తూ బ్రాహ్మణుని చెంప అదిరేట్లు ఒక్క దెబ్బ కొట్టాడు.

మరుక్షణం జగన్మోహనాకారంతో చిరునవ్వు ముఖంపై పూసుకుని
ధగధగ మెరిసేమణిభూషణాదులతో
పీతాంబర శోభతో గరుడవాహనంపై
మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు.

పశువుల కాపరి ఆనందానికి అంతు లేదు. కళ్లనుండికన్నీటిధారలు!

" తెల్ల గ్రద్దనెక్కిన నల్లనయ్యా!
నా కన్నతండ్రీ! నన్ను కరుణించి 
వచ్చావా!"

ఇంతలో ఆకాశం నుండి విమానం దిగడం, ప్రియ భక్తుణ్ని అధిరోహింప జేసుకుని రివ్వుమని ఎగిరిపోవడం క్షణాల్లో జరిగిపోయింది.

కొసమెరుపు: సాధకుడు మొదట శాస్త్రం ద్వారా లేదా గురురూపేణా
దైవం యొక్కస్వరూపస్వభావాలను 
వింటాడు. ఇది 'జ్ఞాతుం.' అనగా తెలుసుకోవడం. తరువాత ఆ స్వరూప స్వభావాలను ధ్యాన ప్రక్రియలద్వారా కొంతకాలంతర్వాత
ప్రత్యక్షంగా దర్శించి కొంతవరకూ తృప్తి పడతాడు. ఇది ' ద్రష్టుం.' 
కాని పూర్తి సంతృప్తిని చేకూర్చేది 
భగవంతునిలో చేరిపోవడం. ఇది ' ప్రవిష్టుం'. దీన్నే ద్వైత, విశిష్టాద్వైత,
అద్వైత స్థితులని చెబుతారు.




(భగవాన్ సత్యసాయి వారి ఉపన్యాసములు

No comments:

Post a Comment