Thursday 21 February 2019

శివ ధ్యాన శ్లోకాలు !....





శ్రీ లింగాష్టకం:

బ్రహ్మ మురారి సురార్చిత లింగం 
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం 
తత్ప్రణమామి సదాశివ లింగం - 1



దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం - 2



సర్వ సుగంధ సులేపిత లింగం 
బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం 
తత్ప్రణమామి సదాశివ లింగం - 3



కనక మహామణి భూషిత లింగం 
ఫణిపతి వేష్టిత శొభిత లింగం
దక్ష సుయజ్ఞ నినాశక లింగం 
తత్ప్రణమామి సదాశివ లింగం - 4



కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశక లింగం 
తత్ప్రణమామి సదాశివ లింగం - 5



దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభి రేవచ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం 
తత్ప్రణమామి సదాశివ లింగం - 6



అష్టదళోపరివేష్టిత లింగం 
సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశక లింగం 
తత్ప్రణమామి సదాశివ లింగం - 7



సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం

తత్ప్రణమామి సదాశివ లింగం - 8


లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహమోదతే.https://www.blogger.com/blogger.g?blogID=6467456646648286268#editor/target=post;postID=2036718692760572245;onPublishedMenu=allposts;onClosedMenu=allposts;postNum=135;src=link

భక్తి సాగరం's photo.

చంద్రశేఖరాష్టకమ్.....

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ।
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥


రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం
శింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకమ్ ।
క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 1 ॥


పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం
ఫాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహమ్ ।
భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవమవ్యయం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 2 ॥


మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం
పంకజాసనపద్మలోచనపుజితాంఘ్రిసరోరుహమ్ ।
దేవసింధుతరంగసీకర సిక్తశుభ్రజటాధరం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 3 ॥


యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం
శైలరాజసుతా పరిష్కృత చారువామకలేబరమ్ ।
క్ష్వేడనీలగళం పరశ్వధధారిణం మృగధారిణం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 4 ॥


కుండలీకృతకుండలేశ్వరకుండలం వృషవాహనం
నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్ ।
అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 5 ॥


భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం
దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ 
భుక్తిముక్తఫలప్రదం సకలాఘసంఘనిబర్హణం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 6 ॥


భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమమ్ ।
సోమవారుణ భూహుతాశనసోమపానిఖిలాకృతిం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 7 ॥


విశ్వసృష్టివిధాయినం పునరేవపాలనతత్పరం
సంహరంతమపి ప్రపంచమశేషలోకనివాసినమ్ ।
క్రిడయంతమహర్నిశం గణనాథయూథసమన్వితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 8 ॥


ఫలశ్రుతి:
మృత్యుభీతమృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్ ।
పూర్ణమాయురరోగితామఖిలార్థ సంపదమాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః ॥

భక్తి సాగరం's photo.

సదాశివ అక్షరమాలా స్తోత్రం:

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ || 
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||


అద్భుతవిగ్రహ అమరాధీశ్వర, అగణితగుణగణ అమృతశివ !!సాంబసదాశివ!!
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ


 !!సాంబసదాశివ!!
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ, సుందరరూప సురేశశివ !!సాంబసదాశివ!!
ఈశసురేశమహేశ జనప్రియ, కేశవసేవిత పాదశివ


!!సాంబసదాశివ!!
ఉరగాదిప్రియ భూషణ శంకర, నరకవినాశ నటేశశివ


 !!సాంబసదాశివ!!
ఊర్జితదానవనాశ పరాత్పర, ఆర్జిత పాపవినాశశివ 


!!సాంబసదాశివ!!
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ, రవిచంద్రాగ్ని త్రినేత్రశివ !!సాంబసదాశివ!!
ౠపమనాది ప్రపంచ విలక్షణ, తాపనివారణ తత్వశివ !!సాంబసదాశివ!!
లింగస్వరూప సర్వ బుధప్రియ మంగళ మూర్తి మహేశశివ !!సాంబసదాశివ!!
ళూతాధీశ్వర రూపప్రియశివ వేదాంతప్రియ వేద్యశివ 


!!సాంబసదాశివ!!
ఏకానేక స్వరూప విశ్వేశ్వర లోహిహృదిప్రియ వాసశివ 


!!సాంబసదాశివ!!
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశశివ !!సాంబసదాశివ!!
ఓంకారప్రియ ఉరగవిభూషణ, హ్రీంకారాది మహేశశివ 


!!సాంబసదాశివ!!
ఔరసలాలిత అంతకనాశన, గౌరిసమేత గిరీశశివ 


!!సాంబసదాశివ!!
అంబరవాస చిదంబరనాయక, తుంబురునారద సేవ్యశివ !!సాంబసదాశివ!!
ఆహారప్రియ ఆదిగిరీశ్వర, భోగాదిప్రియ పూర్ణశివ

 !!సాంబసదాశివ!!
కమలాక్షార్చిత కైలాసప్రియ, కరుణాసాగర కాంతిశివ 

!!సాంబసదాశివ!!
ఖడ్గశూల మృగ ఢక్కాధ్యాయుత, విక్రమరూప విశ్వేశశివ !!సాంబసదాశివ!!
గంగాగిరిసుత వల్లభ గుణహిత, శంకరసర్వ జనేశశివ 


!!సాంబసదాశివ!!
ఘాతకభంజన పాతకనాశన, గౌరీసమేత గిరిశశివ 


!!సాంబసదాశివ!!
జ్ఞజ్ఞాశ్రిత శృతిమౌళి విభూషణ, వేదస్వరూప విశ్వేశశివ !!సాంబసదాశివ!!
చండ వినాశన సకల జనప్రియ, మండలాధీశ మహేశశివ !!సాంబసదాశివ!!
ఛత్రకిరీట సుకుండలశోభిత, పుత్రప్రియ భువనేశశివ 


!!సాంబసదాశివ!!
జన్మజరామృతి నాశనకల్మష, జరహితతాప వినాశశివ !!సాంబసదాశివ!!
ఝంకారాశ్రయ భృంగిరిట ప్రియ, ఒంకారేశ మహేశశివ


!!సాంబసదాశివ!!
జ్ఞానాజ్ఞాన వినాశక నిర్మల, దీనజనప్రియ దీప్తశివ


 !!సాంబసదాశివ!!
టంకాధ్యాయుత ధారణ సత్వర, హ్రీంకారాది సురేశశివ 


!!సాంబసదాశివ!!
ఠంకస్వరూప సహకారోత్తమ, వాగీశ్వర వరదేశశివ


 !!సాంబసదాశివ!!
డంభ వినాశన డిండిమభూషణ, అంబరవాస చిదీశశివ !!సాంబసదాశివ!!
ఢంఢం డమరుక ధరణీనిశ్చల, ఢుంఢి వినాయక సేవ్యశివ !!సాంబసదాశివ!!
నళిన విలోచన నటనమనోహర, అళికులభూషణ అమృతశివ !!సాంబసదాశివ!!
తత్వమసిత్యాది వాక్య స్వరూపగ, నిత్యానంద మహేశశివ !!సాంబసదాశివ!!
స్థావరజంగమ భువనవిలక్షణ, భావుక మునివర సేవ్యశివ !!సాంబసదాశివ!!
దుఃఖవినాశన దళితమనోన్మన, చందనలేపిత చరణశివ !!సాంబసదాశివ!!
ధరణీధర శుభధవళ విభాస్వర, ధనదాది ప్రియ దానశివ !!సాంబసదాశివ!!
నానామణిగణ భూషణ నిర్గుణ, నటన జనప్రియ నాట్యశివ !!సాంబసదాశివ!!
పన్నగభూషణ పార్వతినాయక, పరమానంద పరేశశివ !!సాంబసదాశివ!!
ఫాలవిలోచన భానుకోటి ప్రభ, హాలాహలధర అమృతశివ !!సాంబసదాశివ!!
బంధవినాశన బృహదీసామర, స్కందాదిప్రియ కనకశివ !!సాంబసదాశివ!!
భస్మవిలేపన భవభయనాశన, విస్మయరూప విశ్వేశశివ !!సాంబసదాశివ!!
మన్మథనాశన మధుపానప్రియ, సుందర పర్వతవాసశివ !!సాంబసదాశివ!!
యతిజన హృదయ నివాసిత ఈశ్వర విధి విష్ణ్వాది సురేశశివ !!సాంబసదాశివ!!
రామేశ్వర రమణీయ ముఖాంబుజ, సోమేశ్వర సుకృతేశశివ !!సాంబసదాశివ!!
లంకాధీశ్వర సురగణసేవిత, లావణ్యామృత లసితశివ 


!!సాంబసదాశివ!!
వరదాభయకర వాసుకిభూషణ, వనమాలాది విభూషశివ !!సాంబసదాశివ!!
శాంతిస్వరూప జగత్రయ చిన్మయ కాంతిమతిప్రియ కనకశివ !!సాంబసదాశివ!!
షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ, షాడ్గుణ్యాది సమేతశివ !!సాంబసదాశివ!!
సంసారార్ణవ నాశన శాశ్వత, సాధుహృది ప్రియవాసశివ !!సాంబసదాశివ!!
హర పురుషోత్తమ అద్వైతామృత, పూర్ణమురారి సుసేవ్యశివ !!సాంబసదాశివ!!

ళాళితభక్త జనేశనిజేశ్వర, కాళినటేశ్వర కామశివ

 !!సాంబసదాశివ!!
క్షరరూపాది ప్రియాన్వితసుందర, సాక్షిజగత్రయ స్వామిశివ !!సాంబసదాశివ!!
సాంబసదాశివ సాంబ సదాశివ సాంబసదాశివ సాంబశివ || 
సాంబసదాశివ సాంబశివ సదాశివ సాంబసదాశివ సాంబశివ ||

భక్తి సాగరం's photo.



శ్రీ శివతాండవ స్తోత్రం....
జటాటవీగలజ్జల ప్రవాహపావితస్థలే
గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకారచండ తాండవం తనోతునశ్శివశ్శివం


జటాకటాహ సంభ్రమ ద్భ్రమ న్నిలింప నిర్ఝరీ,
విలోలవీచివల్లరీ విరాజమానమూర్థని;
ధగధగ ధగజ్జ్వల ల్లలాటపట్టపావకే,
కిశోర చంద్ర శేఖరే రతిః ప్రతిక్షణం మమ.


ధరా ధరేంద్ర నందినీ విలాస బందు బంధుర,
స్ఫురదృగంత సంతతి ప్రమోద మాన మానసే ,
కృపా కటాక్ష ధోరణీ నిరుద్ధ దుందరాపది,
క్వచి ద్దిగంబరే మనో వినోద మేతు వస్తుని .


జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణామణిప్రభ,
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే;
మదాంధ సిందురస్ఫురత్త్వ గుత్తరీయ మేదురే,
మనోవినోదమద్భుతం భిభర్తు భూతభర్తరి.


సహస్రలోచన ప్రభృ త్యశేష లేఖ శేఖరః,
ప్రసూన ధూళిధోరణీ విధూసరాంఘ్రి పీఠభూః;
భుజంగరాజ మాలయా నిబద్ధ జాట జూటకః,
శ్రియైచిరాయజాయతాం చకోరబంధు శేఖరః


లలాట చత్వరజ్వల ద్ధనంజయ స్ఫులింగభా,
నిపీత పంచసాయకం నమ న్నిలింపనాయకం;
సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం,
మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః.


కరాల ఫాల పట్టికా ధగద్ధగద్ధగ జ్జ్వల,
ద్ధనంజయాహుతికృత ప్రచండపంచసాయకే;
ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్ర పత్రక,
ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ.


నవీన మేఘ మండలీ నిరుద్ధ దుర్ధరస్ఫురత్,
త్కుహు నిశీధీనీతమః ప్రబంధ బంధకంధరః;
నిలింపనిర్ఝరీధర స్తనోతు కృత్తిసింధురః,
కలానిదానా బంధురః శ్రియం జగద్ధురంధరః.


ప్రఫుల్ల నీలపంకజ ప్రపంచ కాలి మచ్ఛటా,
విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం;
స్మరచ్చిదం, పురచ్చిదం, భవచ్చిదం, మఖచ్చిదం,
గజచ్ఛి దంధ కచ్చిదం తమంత కచ్ఛిదం భజే.


అగర్వ సర్వ మంగళా కలాకదంబ మంజరీ,
రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం;
స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం,
గజాంత కాంధ కాంతకం తమంతకాంతకం భజే.


జయత్వ దభ్ర విభ్రమ ద్భ్రమద్భుజంగ మస్ఫుర,
ద్ధగ ద్ధగ ద్వినిర్గ మత్కరాల ఫాల హవ్యవాట్;
ధిమి ద్ధిమి ద్ధిమి ధ్వన మృదంగ తుంగ మంగళ,
ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః.


దృషద్విచిత్ర తల్పయో ర్భుజంగ మౌక్తి కస్రజో,
ర్గరిష్ఠరత్న లోష్ఠయోః సుహృద్వి పక్ష పక్షయోః;
తృణారవింద చక్షుషోః ప్రజా మహీ మహేంద్రయో,
స్సమం ప్రవర్తితం కదా సదా శివం భజామ్యహమ్.


కదా నిలింప నిర్ఝరీ నికుంజ కోట రేవస,
న్విముక్త దుర్మతిస్సదా శిరస్థ మంజలిం వహన్;
విముక్త లోల లోల లోచనో లలాట ఫాల లగ్నక,
శ్శివేతి మంత్ర ముచ్చరన్ కదా సుఖీ భవామ్యహమ్.


ఇమం హి నిత్యమేవ ముత్త మోత్తమం స్తమం,
పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధి మేతి సంతతం;
హరే గురౌ సుభక్తి మాశు యాతినాన్యథా గతిం,
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్.


పూజావసాన సమయే దశ వక్త్ర గీతం,
య శ్శంభు పూజన మిదం పఠతి ప్రదోషే;
తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగ యుక్తాం,
లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః.

ఇతి శ్రీ రావణ కృతం శివతాండవ స్తోత్రం సంపూర్ణం

శ్రీకాళహస్తీశ్వర మహత్యం,ధూర్జటి,పరమశివుడు! 


శా|| వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి, ని 
ర్వాణశ్రీ జెఱపట్ట జూచిన విచారద్రోహమో, నిత్య క 
ణ్యాణ క్రీడల బాసి, దుర్దశలపాలై, రాజలోకాధమ 
శ్రేణీ ద్వారము దూర జేసి తిపుడో శ్రీకాళహస్తీశ్వరా! 
తా|| ఈశ్వరా! బ్రహ్మాదులకు గూడ అలభ్యమైఅ 
నీ యింటి సింహద్వార దేశమున నిలిచి ముక్తికాంతను చేపట్టుద మను ఆలోచన, 
నా వంటి అల్పుడు చేసినందువల్లనో యోమోకాని, 
నీ సేవాభాగ్యమునకు దూరమై, 
అధములైన రాజులను సేవించు నట్లు చేసినావు గదా! 
శా||అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా 
కాంతల్ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ 
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా 
జింతాకంతయు జింత నిల్పడు గదా, శ్రీకాళహస్తీశ్వరా! 
తా|| ఆలోచించినచో ఈ జగతత్తంతయును మాయయేగదా! 
మానవు డా సంగతి తెలిసియుండియు, భార్యయు, పుత్రులు, 
ధనములు, తన శరీరము అన్నియు శాశ్వతములని భావించి 
మోహమునొందుచు, జీవనమునకు పరమార్థభూతుడైన 
నిన్ను మనసులో ఒక్క నిమిషమైననను ధ్యానించడు గదా! 
ఎంత అజ్ఞానము

శ్రీమాత్రేనమః ! 

ఆర్యాశతకమ్ --మూకపంచశతి. 
(మూలమ్: శ్రీఆది శంకరులు .) 
"స్మరమధనవరణలోలా 
మన్మధహేలా విలాసమణిశాలా 
కనకరుచిశౌర్యశీలా 
త్వమంబ బాలా కరాబ్జధృతమాలా." 
తాత్పర్యం: 
మన్మధుని మదించిన ఆ శివుని మన్మధ విలాసంతోనే ధరించి, బంగారుకాంతిని దొంగిలుంచు స్వభావం గల చేతి మాలను ధరించిన నీవు బాలవే. 
" విమలపటీ కమలకుటీ 
పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ 
కామ్కాక్షి పక్ష్మలాక్షీ 
కలితవిపంచీ త్వమేవ వైరించీ." 
తాత్పర్యం: 
ఓ కామాక్షీ। ధవళ వస్త్రములు ధరించి,కమలములు కుతీరములుగా గలిగి, పుస్తక రుద్రాక్షలు దాలిచిన కరములు, అధిక రెప్పలు గల కన్నులు కలదానావు, వీణ ధరించిన సరస్వతివి నీవే 
భాషా భారతి's photo


--((*))--



వాణి నజురాణి ఘననీలవేణి మధుర 

వాణిఁ బల్లవసంకాశపాణిఁ బృథుల 
సైకతశ్రోణి నాత్మలో సన్నుతింతు 
సుమధు మధుర సుధావచస్స్ఫూర్తికొఱకు 

అయ్యలరాజు నారాయణామాత్య ప్రణీత "హంస వింశతి" నుండి సరస్వతీ స్తుతి


--((*))--



"పవిపుష్పంబగు, నగ్నిమంచగు,నకూ / పారంబు భూమీస్థలం
బవు,శత్రుండతిమిత్రుడౌ,విధముది / వ్యాహారమౌనెన్నగా
నవనీమండలి లోపలున్ శివ శివే / త్యా భాషణోల్లాసికిన్
శివ!నీ నామము సర్వవశ్యకరమౌ / శ్రీకాళహస్తీశ్వరా!""

శ్రీకాళహస్తీశ్వర శతకము ధూర్జటీ. శ్రీకాళహస్తీశ్వరా!ఈ భూమియందు నీమహిమగల నామమైన
.
"శివ శివ"యని నామోచ్చారణము చేయువానికి . కఠినమైన వజ్రము సుకుమారమైన పువ్వుగాను,అగ్నిమంచుగాను . , సముద్రము భూమిగాను,శత్రువు మిత్రుడుగాను, విషము
. గొప్పరుచికరమైన ఆహారముగాను కన్పట్టు చుండును. . పరికించగా నీ పేరు అన్నింటిని వశము చేసుకోనునట్టిది అని తెలియును.



శివ ధ్యాన శ్లోకాలు !....

"ముక్తాలంకృతసర్వాంగమిన్దుగంగాధరం హరమ్,
ధ్యాయేత్కల్పతరోన్మూలే సమాసీనం సహోమయా".
.
ముత్యములచే అలంకరింపబడిన సర్వావయములనుకలవాడు, చంద్రుని గంగను ధరించినవాడును, ఉమతోకూడ కల్పవృక్షము క్రింద కూర్చుండిన వాడును అగు హరుని ధ్యానించుచున్నాను.
.
దేవత: రుద్రుడు
ఋషి: మండూకుడు

శివ ధ్యాన శ్లోకాలు !....

భస్మోద్భాసితసర్వాంగం జటామండలమండితమ్
ధ్యాయేత్త్ర్యక్షం వృషారూఢం గణేశ్వరయుతం హరమ్"
.
విభూతిచే ప్రకాశించునట్టి యెల్లావయవములు గలవాడును, జటాసమూహముచే  అలంకరింప బడినవాడును, మూడుకన్నులు కలవాడును, గణనాథునితో కూడిన వాడును, వృషభమును ఆరోహించినవాడు అగు హరుని ధ్యానించుచున్నాను.

.సోమయ--పెద పాటి...( శివ జ్ఞాన దీపిక)

--((**))--



సతి దేవి ప్రాణ త్యాగం......పోతన భాగవత పద్యం.!
.
తండ్రి అయిన దక్షప్రజాపతి దక్షయజ్ఞ సమయంలో ప్రవర్తించిన తీరును నిరసించి సతీదేవి పలికిన పలుకులు:
జనుడజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్లించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై యీశ్వరున్
ఘను నిందించిన నీ తనూభవ ననంగా నోర్వ నీ హేయ భాజనమైనట్టి శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాప్తించెదన్
.
భావం:
మనిషి, తనకు తెలియకుండా తినకూడని పదార్థాలు తిన్నప్పుడు వెంటనే వాంతి చేసుకుని ఉదరాన్ని శుభ్రం చేసుకుంటాడు. చెడు స్వభావం కలిగిన నువ్వు, గొప్పవాడైన పరమశివుని నిందించిన కారణం చేత, నేను నీ కుమార్తెను అనిపించుకోవడాన్ని సహించలేను. అందువల్ల ఈ అసహ్యమైన శరీరాన్ని విడిచి, పవిత్రతను పొందుతాను.

--((**))--



మహాదేవ దేవేశ దేవాధిదేవ,
స్మరారే పురారే  హరేతి ,
బృవాణా స్మరిష్యామి భక్త్యా భవంతు
తతో మే దయాశీల! దేవ...! ప్రసీద...

మహాదేవా, దేవేశా ... దేవతలలో అధికుడవు.  దేవసృష్టికి ముందే ఉన్నవాడవు గాన అదిదేవుడా ... మన్మదునితో విరోధించిన వాడా ... త్రిపురములను కాల్చిన వాడా ... మార్కండేయుని రక్షించ యముని శిక్షించినవాడా ... అని పులుకుచు భక్తితో నిన్నే స్మరించున్నాను... దయాస్వభావముగల దేవా... నాకు ప్రసన్నుడవగుము...

 (శ్రీ శంకర భగవత్పాద విరచిత శివభుజింగ స్తవము నుండి

విశ్వేశ  విశ్వభవనాశిత విశ్వరూప
విశ్వాత్మక త్రిభువనైక గుణాధివాస
హి ఇశ్వవంద్య కరుణామయ దినభంధో 
సంసార దు:ఖ గహనాజ్జగదీశ రక్ష

ఓ విశ్వేశ్వరా  విశ్వసృష్టి సంహారకా ... విశ్వరూపుడా . .. విశ్వమే  శరీరంగా కలవాడా ... ముల్లోకాలలో త్రిగుణాలన్నింటికీ అధారమైనవాడా ... సర్వులచేత పూజించ బడే వాడా, కరుణా మయు డా ... దీనులపాలిటి  పెన్నిధి... ఓ జగదీశ... నన్ను అనంత సంసార దు:ఖాన్నుండి  కాపాడు అని ప్రార్దిన్చిరి 

 (శ్రీ శంకర భగవత్పాద విరచిత శివనామావళి అష్టకం నుండి


--((*))--


Image may contain: 1 person

పన్నగ భూషణ పావన నేత్రుడ బాధల బాపెడి భాస్కరుడా !
ఎన్నగ లేముర యిద్దరి నీకృప ఎన్నని జెప్పెద ఈశ్వరుడా !
కన్నుల ధర్మపు కాంతుల జల్లుచు కాంక్షలు దీర్చెడి కారకుడా !
వెన్నుడ వీవెగ వేదము నీదెగ వేదన బాపర వేల్పువు గా !
సన్నుతి చేసెద సాగిలి వేడెద సాధన నిమ్ముర సాంబ శివా !

' మానినీ వృత్తము ' ( పంచ పాది ) : ఓ పన్నగ భూషణా , సర్పాన్ని ఆభరణము గా ధరించిన వాడా , ఓ శివా , పవిత్రమైన కన్నులు కలవాడా , ఓ ముక్కంటీ , మా బాధల్ని మాయంచేసే ఓ భాస్కరుడా , ఓ జ్ఞాన ప్రదాతా , మోక్షానికి ఈ వలి గట్టుపై నిల్చుని నీ దయను నీ గొప్పతనాన్నీ పొగడ గలనా స్వామీ ?

ఆ కన్నుల్లో ధర్మమనే ప్రకశవంతమైన కాంతుల్ని వెదజల్లుతూ మా కోరికలు తీర్చే మహానుభావా , నీవే విష్ణువు , నీదే వేదం , నా బాధల్ని తొలగించే ప్రభువి వీ నీవే కదరా శివా ! హరా ! కాపాడు

ఓ భోళా శంకరా , ఓ సాంబ శివా , నిన్ను పొగుడుతూ ,సాష్టాంగ ప్రణామం చేస్తాను , ఉపాయాన్నీ / తెలివినీ / నేర్పునీ ప్రసాదించు స్వామీ ! అని భావము !




శివ సౌందర్యం  


సున్దరః శివః తస్య సౌన్దర్యమ్ శివా 

ఆనందరూపః శివః తస్యానన్దమ్ శివా 



ఆచలః  పరమేశ్వరః తత్ర జాతా నదీ పరమేశ్వరీ 

స్థితిశక్తి రూపః శంకరః  గతిశక్తి రూపిణీ శాంకరీ 



ఈశస్య హాసః ఈశానీ శివస్య విలాసమ్ శివానీ 

మౌనీ దక్షిణామూర్తి తస్య వాగ్ధారా దాక్షాయణీ  



పూర్ణచంద్రః చంద్రశేఖరః తస్య కౌముదీ చంద్రముఖీ 

ఉజ్జ్వలః సూర్యః రుద్రః తస్య తేజమ్ రుద్రాణీ 



చిదాకాశరూపః ఈశ్వరః చిత్తభూతాకాశరూపిణీ ఈశ్వరీ 

పరమపురుషః పినాక పాణి: తస్య ప్రకృతీ మనోరూపేక్షుకోదండమండితా 



ఫలప్రదాతా ఫణీశ్వరః ఫలదాయినీ తస్య తరుణీ 

భక్తజనమనోహ్లాదకః  బాలేందుధరః 
శ్రీకంఠనేత్ర కుముదాహ్లాద చంద్రికా పార్వతీ 



లయకారకః భస్మయుతః సృష్టిస్థితిలయకారిణీ భవానీ 

మనఃకారకః మందాకినీధరః మనోరూపిణీ తస్య అర్ధాంగీ 



అపవర్గదాతః గరళాశనః ఈశ్వరః అపవర్గదాయినీ 
కంబుకంఠీ అంబికా నటరాజః శివః 
తస్య నాట్యం శివా హావభావ ప్రకటనం లాస్యమ్ ఆపి సా 



విష్ణుసమానః శివః ఇందిరా శివా బ్రహ్మరూపః శివః వాణీ శివానీ 

శివః సత్ శివా సతీ శివః చిత్ చిదాభాసా  శివా 



ప్రజ్ఞానఘనః శివః ప్రజ్ఞా శివానీ చిన్మయః శివః మాయా శివానీ 

శివస్య హృదయం సుందరీ శివానీ శివస్య రాగః రాగరాగిణీ భవానీ

పరాప్రకృతీధరః శివః పశ్యన్తీమధ్యమావైఖరీ ధారిణీ శివా

అవ్యక్తమూలః శివః వ్యక్తావ్యక్తస్వరూపిణీ శివా

అమృతమయః శివః అమృతవర్షిణీ శివా

జ్ఞానధరః శివః జ్ఞానస్వరూపిణీ శివా

జ్ఞాతా శివః తస్య జ్ఞానం శివా  ధ్యాతా శివః ధ్యానం శివా

భాషామూలః సారః తాత్పర్యస్వరూపః  శివః 

 వాక్యార్థ ధారిణీ నానార్థ తత్వాత్మికా శివా 

మౌనరూప వచస్ శివః చతుర్విధ వాగ్రూపిణీ శివా

గుణాతీతః నిర్గుణః శివః సత్త్వరజస్తమోగుణరూపిణీ గుణాతీతవర్తినీ శివా 



నిష్క్రియాపరః శివః క్రియాస్వరూపిణీ శివా 

పరిణామరహితః శివః పరిణామరూపా శివా 



అభావః భావాతీతః భవః భావాభావ రూపిణీ భవానీ 

ఉపాసనాగమ్యః శివః ఉపాసనా ప్రేరణ - కరణ - సిద్ధి- దాయినీ శివా 



భాగ్యశాలి: దుర్గాతిప్రియః తస్య భాగ్యం దుర్గా 

విభవయుతః సోమః తస్య విభవమ్ ఉమా 



లక్ష్యః శివః లక్షణం శివా రాజరాజేశ్వరః శివః రాజరాజేశ్వరీ శివా 

రసరూపః శివః రసానుభావకారిణీ శివా నిరంజనః శివః  రంజనీ శివా 



నిష్కామ రూపః కామేశ్వరః కామరూపిణీ కామేశ్వరీ 

నివృత్తి రూపః శివః  ప్రవృత్తి వృత్తి   రూపిణీ శివా 



అంతఃకరణమూలః  శివః అంతఃకరణరూపిణీ శివా 

భూతనాథః శివః భూతవాహినీ శివా 



ప్రాణాధారః శివః పంచప్రాణరూపిణీ  శివా 
నిస్సంకల్పః శివః సంకల్పకారిణీ శివా 

నిర్వికల్పః శివః నిర్వికల్ప వికల్ప కారిణీ శివా
 జ్ఞానగమ్యః శివః జ్ఞాన కారిణీ శివా 



సమాధిస్థః శివః సమాధి దాయినీ శివా

జ్ఞానం శివః జ్ఞానరూపిణీ శివా 



నిత్యః శివః నిత్యా శివా శుద్ద్ధః శివః శుద్ద్ధా  శివా 

బుద్ధః శివః బుద్ధీ శివా ముక్తః శివః ముక్తీ శివా 



జ్ఞానస్థితి: శివః జ్ఞానబోధా శివా  

బ్రహ్మా శివః మాయా శివా 

విభవః శివః వైభవం శివా 

విమలః శివః విమలా శివా 


శక్తి ధరః శివః శక్తీ శివా 

ధర్మరూపః శివః ధర్మమ్ శివా 



రామః శివః రామా శివా 

కృష్ణః శివః రాధా శివా 



ప్రేమరూపః శివః ప్రేమమ్  శివా 

వాత్స్యలః శివః  వాత్స్యల్యమ్ శివా 



హృదయమ్ శివః నైర్మల్యమ్ శివా 

శాంత రూపః శివః శాంతి దాయినీ శివా 



కాలాతీత రూపః శివః కాలకాలాతీతవర్తినీ శివా 

ముని: శివః తస్య మౌనం శివా  



చారుచంద్రకలాధరః శివః చారుహాసకౌముదీ శివా 

శతకోటి సూర్య తేజస్స్వరూపః శివః శతకోటి తటిల్లతా సమరుచిరా శివా 




శివ ధ్యాన శ్లోకాలు !....
.
.:రూపయౌవనసంపన్నా మూర్తేవ వనదేవతా
పుష్పితాశోకపున్నాగ సహకారశిశూపమః ||

పంచవింశతి నక్షత్రో మయూరకృతశేఖరః
అకలజ్ఞ్కశరచ్చంద్రపూర్ణబింబసమాననః ||

ప్రాన్తే బద్ధకపర్దాన్తో వసానశ్చర్మ కోమలమ్
సవ్యాపసవ్య విధృతకృతమాల విభూషితః ||

ధారాకదంబపుంజేన నాభిదేశప్రలంబినా
అజజ్ఞ్ఘప్రేక్షణీయేన ప్రేక్షణీయో2పి శత్రుభిః ||

భార్యాస్య చారుసర్వాంగీ వన్యాలంకారభూషితా
ఆదర్శ మూర్తిశ్శోభానాం వన్యానామివ నిర్మలా ||
.
తస్యా హస్తే ధనుర్దత్వా శరమేకం చ నిర్మలమ్
ద్వితీయమంసమాలామ్బ్యశిష్టం వామేన బాహునా ||
.
సుగన్ధి పుష్పస్తబకమాఘ్రాయాఘ్రాయ పాణినా
వీజ్యమానో మన్దమన్దం నవపల్లవశాఖయా ||
.
సమావృతో బాలకైశ్చ శ్వభిశ్చాపి మనోహరైః
గచ్చద్బిరగ్రతో దృప్తైర్ధ్యాతవ్యో జగతాం గురుః ||
.
ఏవంభూతో మహాతేజాః కిరాతవపురీశ్వరః
.
ఆకారము వహించిన రూపయౌవన సంపన్నమగు వనదేవతయో అనదగినవాడును, పుష్పితములగు అశోకపున్నాగసహకారముల గున్నలవలే నున్నవాడును, ఇరువది ఏండ్లవయస్సుకలవాడును, నెమలిపింఛం శిరము నందు దాల్చినవాడును, కలంకము లేని శరత్కాలచంద్రుని నిండుబింబము పోలు బింబము గలవాడు, ఒకపక్కకు ముడవ బడిన జటాజూటము కలవాడును, కోమలమగు వ్యాఘ్రచర్మము ధరించినవాడును, సవ్యముగా అపసవ్యముగా ఱేలపూదండలు దాల్చినవాడును, నాభిప్రదేశము మొదలు పిక్కలవరకు వేలాడునట్టి కడిమిపూలదండలచే శత్రువులకు ఆనందకరము అగు సౌందర్యము కలవాడును, తనవలే వన్యాలంకారములచే అలంకృతమయి నిర్మల యయి అడవియందలిశోభకు దర్పణమో అనదగి ఒప్పుచున్న సర్వాంగసుందరియగు దేవిహస్తమున ధనస్సును నిర్మలమగు ఒక బాణము ఒసగి ఆమె రెండవ మూపును తన వామబాహువుచే అవలంబించి రెండవచేత సుగంధియగు పూగుత్తిని పలుమాఱు మూఱ్కొనుచు క్రొంజిగురు రెమ్మచే వీవబడుచున్నవాడును, తనముందు గర్వించి నడుచుచున్న పిల్లవాండ్రచేత మనోహరమగు కుక్కలచేతను పరివేష్టితుడును, ఇట్టి ఆకారము దాల్చిన కిరాతవేషుడగు లోకగురువు ఈశ్వరుని ధ్యానించుచున్నాను.
.
దేవత: మహాదేవుడు
ఋషి: మహాదేవుడు



పరమేశ్వర స్తోత్రం 
 ప్రాంజలి ప్రభ 

నమః కనక లింగాయ వేద లింగాయ వైనమః
నమః పరమ లింగాయ వ్యోమలింగాయ వైనమః 1


నమ స్సహస్ర లింగాయ వహ్నిలింగాయ వైనమః
నమః పురాణ లింగాయ శ్రుతిలింగాయ వైనమః 2


నమః పాతాళ లింగాయ బ్రహ్మ లింగాయ వైనమః
నమో రహస్య లింగాయ సప్త ద్వీపోర్ద్వ లింగినే 3


నమ స్సర్వాత్మ లింగాయ సర్వ లోకాంగ లింగినే
నమస్త్వ వ్యక్త లింగాయ బుద్ద లింగాయ వైనమః 4


నమోహంకార లింగాయ భూత లింగాయ వైనమః
నమ ఇంద్రియ లింగాయ సమస్తన్మాత్ర లింగినే 5


నమః పురుష లింగాయ భావ లింగాయ వైనమః
నమో రజోర్ద్వ లింగాయ సత్త్వలింగాయ వైనమః 6


నమస్తే భవ లింగాయ నమస్త్రై గుణ్య లింగినే
నమోనాగ లింగాయ తేజో లింగాయ వైనమః 7


నమో వాయ్వర్ద లింగాయ శ్రుతిలింగాయ వైనమః
నమస్తే ధర్మ లింగాయ సామలింగాయ వైనమః 8


నమో యజ్ఞాంగ లింగాయ యజ్ఞ లింగాయ వైనమః
నమస్తే తత్త్వ లింగాయ దేవానుగత లింగినే 9


దిశనః పరమం యోగ మపత్యం మత్సమం తధా
బ్రహ్మ చైవాక్ష యమదేవ శమం చైవ పరం విభో

అక్షయత్వం చవంశస్య ధర్మేచ మతి మక్ష యామ్ 10

అగ్నిః || వసిష్టేన స్తుత శ్శంభుస్తుష్ట శ్శ్రీపర్వతే పురా
వసిష్టాయ వరందత్వా | తత్రై వాంతరధ యత 11

--(())--

No comments:

Post a Comment