Sunday 10 February 2019




Image may contain: drawing

ప్రాంజలి ప్రభ
ప్రేమికుల రోజు సంధర్భముగా
ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ


కుక్కతోక వంకరే
తీద్దామనుకోవటం దండగ
నాయకుల బుద్ధి వంకరే
మారుద్దామనుకోవటం దండగ

పేమికుల ప్రేమ వంకరే
మాన్పిద్దామనుకుంటే దండగ
అనుంబంధాలు వంకరే
సంబంధాలు ఉండటం దండగ

అనురాగాలు వంకరే
అభిమానాలు ఉండటం దండగ
సంయమనం వంకరే
రాయబారులు ఉండటం దండగ

ఆచారాలు వంకరే   
సంస్కారాలు ఉండటం దండగ
చర్యకు ప్రతిచర్యరే
లక్షణాలు ఉండటం దండగ

ప్రేమ ఉన్నచోటరే 
కోపం ఉండటం దండగ
కామం ఉన్న చోటరే   
ద్వేసాహం ఉండటం దండగ

దక్షత ఉన్నచోటరే
మొండితనం ఉండటం దండగ
విశ్వాసం ఉన్న చోటరే
అనుమానం ఉండటం దండగ 

ప్రేమ ఉన్నచోటరే
మూర్ఖునిగా ఉండటం దండగ
నవ్వు ఉన్న చోటరే
నవ్విస్తూ ఉండటం పండగ 

--((**))--



ప్రాంజలి ప్రభ
ప్రేమికుల రోజు సంధర్భముగా
ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ


చిరు నవ్వుల్తో పిలిచిందో
మరి పువ్వులతో రమ్మంది
చలి గాలి పిలుస్తున్నదో
మరి మనసుతో రమ్మంది

సతి వంపుల్లోనే ఏముందో
మతి ఊపుల్లోకే రమ్మంది 
వరి చేనుల్లోకే పిల్చిందో
మరి వంకర్లతో తుళ్లింది

మడి మాయల్లోకీ దించిందో
జడి వానల్లోనే జల్లంది
కిల రావమ్ముతో ఘల్లందో       
కల ప్రేమమ్ముతో కల్సింది

కానీ అని కళ్ళు మూయవు
కానీ అని వళ్ళు చూపవు
కానీ అని తుళ్ళి పిల్వవు
కానీ అని మళ్ళి అన్నావు

--((**))--


విశ్వాసం  
ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకి వచ్చింది,
" నాన్నా..! నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగేస్తోంది.
నాకే ఇన్ని కష్టాలు రావాలా..? " అంటూ తన బాధలను చెప్పుకుంటూ
వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.

తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు.
చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు.

గ్యాస్ పొయ్యి మీదున్న - మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు.
వాటిల్లో నీళ్ళు పోసి ఒకదానిలో బంగాళా దుంపలు ( ఆలుగడ్డలు),
మరొకదానిలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీగింజలు వేశాడు.

తండ్రి తనతో అలా నిర్లక్ష్యముగా ఉండి,
ఏమీ మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా -
అలాగే చూడసాగింది ఆ అమ్మాయి.

అలా 20 నిముషాలు మరిగించాక - స్టవ్ ని కట్టేసి, ఆ గిన్నెలను దింపి,
వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలింఛి చెప్పమన్నాడు.

నాన్న ' అలా ఎందుకు చేసాడా పని..' అని అయోమయముగా ఉన్న ఆ కూతురు వాటిని పరిశీలించాక అంది,

" ఏముందీ..! దుంపలు మెత్తబడ్డాయి. కోడిగుడ్డు గట్టిపడింది.
కాఫీ డికాషన్ వచ్చింది........
అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్నా?.. " అంది.

అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి,

" ఆ మూడింటికీ ఒకే రకమైన ప్రతికూలత ఎదురయ్యింది. అంటే ఒకేలా ఒకే రకమైన గిన్నెల్లో, అదే గ్యాస్ వేడినీ, వేడి నీటినీ చవిచూశాయి.

కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి అని గమనించావా?
మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి.
చితికిపోయే గుడ్డు గట్టిపడింది.
గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడి, వాటిలోని రసాన్ని ఊరించి,
నీటిరంగునే మార్చింది.. అవునా..!!

ఇప్పుడు చెప్పు..

వీటిల్లో - నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావు?

మెత్తబడిపోతావా..? ( ఇప్పుడు నీవున్న స్థితి అదే.. )

గట్టిపడిపోతావా..?

పరిస్థితులను మారుస్తావా...?

ఇక్కడ నీదే ఎంపిక,
దానిమీదే ఇందాక నీవడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది.." అన్నాడు.

ఆ అమ్మాయి మొఖంలో ఏదో తెలీని వెలుగు. కన్నీళ్లు ఆగిపోయాయి. బాధలేదు.

దాని బదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది..



" నాన్నా! యూ ఆర్ మై రియల్ హీరో.. మెంటార్.. ఎవర్ అండ్ ఫరెవర్.." కృతజ్ఞతాభావంతో అంది.

#ఇరుగు-పొరుగు*
#రచన... #మునిమాణిక్యం నరసింహారావు గారు.
మన ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళను బట్టి ఉంటుంది మన సౌఖ్యం.
ఇరుగూ పొరుగూ అన్నారు. మనకు కీర్తి వచ్చినా అపకీర్తి వచ్చినా వాళ్ళవల్లే వస్తుంది. మన ఇంటి ప్రక్కన ఒక ప్లీడరు గుమస్తా ఉన్నాడనుకోండి, ఇక మన కర్మం కాలిందన్న మాటే, ఆ యింట్లో అత్తకూ కోడలకూ పడదు. అత్త ఆ పిల్లను కాల్చుకు తింటూ వుంటుంది, ఆ పిల్ల అప్పుడప్పుడు మన ఇంటికి వస్తూ వుంటుంది. ఆ అమ్మాయి మనతో ఏవో నేరాలు చెప్పుతున్నదని ఆ ముసలిదానికి అనుమానం.
ఓ మారు సరిగ్గా అలాగే జరిగింది గదా. మా ఆవిడ మా యింటి ప్రక్కావిడ కోడలూ ఒక్క ఈడువాళ్ళు. అంచేత ఆ పిల్ల మా యింటికి వచ్చి ఏదో పిచ్చాపాటి కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోతుండేది. ఆ ముసలిదానికి మా ఆవిడపైన కొర్రుగా వుండేది. ఏమీ అనలేక వీలైనప్పుడల్లా ఏవో సూటీ పోటీ మాటలు అనటం సాగించింది.
అందరిళ్ళల్లోనూ వుంటై తగూలు, పొరుగింటితగూ అంటే కొందరు చెవి కోసుకుంటారు, అత్త మామాల్లో, ఆడబిడ్డల్లో కాపురం చేయకుండా అదృష్టవశాత్తు పొరుగూరిలో ఒంటరి కాపురం చేస్తూన్నది కాబట్టి ఆ కాంతమ్మ ఠింగురంగా అంటూ కులుకుతున్నదీ. అర్ధశేరు బియ్యం అత్తెసరు వేసి, రెండు వంకాయలు వేయించిందా అంటే ఇక పనేలేదు ఆ అమ్మాయికి. అల్లాగ వుండాలంటే ఎల్లాగ వీలు అవుతుందమ్మా అందరికీ-అని యిల్లాగ ఏవో సాధింపు మాటలు అంటూ వుండేది. అప్పుడు మా కాంతం కొత్తగా కాపురానికి వచ్చినరోజులు. ఇంకా మాకు సంతానం కలగలేదు.
పిల్లా జల్లా లేకుండా ఒంటరి కాపురం చేస్తున్న రోజుల్లో పొరుగింటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా మనకు అట్టే బాధ వుండదు. అయితే కాస్త జాగ్రత్తగా వుండాలిసిందల్లా భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడే. ఆ నాలుగు నెలలో ఆరు నెలలో మటుకు వంచిన తల ఎత్తకుండా నడవాలి ఆ వీధిలో. అప్పుడే మన గౌరవం దక్కుతుంది. ఇంటావిడ, బిడ్డకు మూడో నెల వెళ్ళక మునుపే వచ్చినపుడు, ఇంటి ప్రక్క వాళ్ళు మనలని గురించి మంచిగా చెబుతారు. లేక...
నీవు ఒకరోజున స్నానం చేస్తూ వుండటం - ఆ సమయాన్నే పొరిగింటి ఆవిడ కోడలు పూలజడ వేసుకొని దొడ్డి గోడ మీదుగా తొంగి చూడటం నీవు ఆ చక్కని పిల్లను నివ్వెరపోయి చూస్తూ అవతల వంటింటి గుమ్మంలో నుంచి ఆ అమ్మాయి అత్తగారు గుడ్లు మిటకరించి చూస్తున్నట్లు గమనించక పోవటం, ఇత్యాది విషయాలు జరిగినయ్యో, నీ కర్మం కాలిందే.
అసలే అనుమాన పడుతుంటుంది మీ ఆవిడ. మొగుడి మీద ప్రేమ వున్న ప్రతి మానవతికి అటువంటి అనుమానం వుండటం సహజం. అందులో తాను లేనప్పుడు ఏమి అన్యాయం జరిగిందోనని భయపడుతూనే వస్తుంది మీ ఆవిడ. వచ్చే రావటంతోనే కొంప మునిగిపోయినట్లు పని గట్టుకొని వచ్చి ఆ ముసలిముండ నీ మీద నేరాలు చెప్పేస్తుంది వున్నవి కొన్ని, లేనివి కొన్నిని నీవు ఎంతో వుత్సాహంతో ఇంటికి వస్తావు ఎన్నాళ్ళకో వచ్చిన భార్యను చూచి కబుర్లు చెప్పుకుందామనీ బిడ్డను ముద్దాడుదామనీ ఆదుర్దాతో ఇంటికి వచ్చేసరికి బుసబుసలూ రొసరొసలూ మీ ఆవిడ. కారణమూ నీకు తెలియదు ఆవిడ చెప్పనూ చెప్పదూ, ఏమిటి కాంతం, అదినేననేమాట. నీవు కూడా ఏదో పేరు పెట్టి పిలుస్తావుగా. ఏమిటే రాజ్యం, సుబ్బులూ, లక్ష్మీ (ఏదో ఒకటి) ఎందుకే అల్లాగ వున్నావు. సంతోషంగా లేవేం? అమ్మాయికి ఇంకా నీళ్ళు పోశావుకావేం, మధ్యాహ్నం కాఫీ తాగలేదా అంటూ ఏవో వెయ్యి ప్రశ్నలు వేస్తావు, నా సంగతి మీ కెందుకు లెద్దురూ. మీకు నేనే కావలసి వచ్చాను. అనో లేకపోతే ఇంకా మృదువుగానో ఏదో నీరసం మాట అనేస్తుంది, మీ ఆవిడ. అసలు సంగతి చెప్పదు. ఆ సాయంత్రం నీవు బ్రతిమిలాడినా, ఒట్టిదే భయపెట్టినా ఒట్టిదే ఆ రాత్రికి ఎప్పుడో బయట పెడుతుంది అసలు సంగతి నీవు ఎంతో బ్రతిమిలాడిన తరువాత, ఆ తరువాత అదంతా అబద్ధం అని నచ్చజెప్పేటప్పటికి తలప్రాణం తోకకు వస్తుంది, ఇదేమైనా నలుగురిని పిలిచి నిలదీసి అడిగి నిజం తేల్చే విషయం కాదాయె. ఎల్లాగ మీ ఆవిడను నమ్మించటం. చాలా కష్టం ప్రాణం మీదికి వస్తుంది.
కాబట్టి ఇరుగూ పొరుగూతో బహు జాగ్రత్తగా ప్రవర్తించాలె. అనుభవం మీద వ్రాస్తున్నాను.
సాధారణంగా నీవు అద్దెకు ఇల్లు తీసుకొనేటప్పుడు మీ యింటి ప్రక్కవాళ్ళకు ఫోనుగాని రేడియోగాని ఉండేటట్లు చూచుకో. సాధారణంగా వెన్నెలరాత్రుళ్ళు, భోజనానంతరం వాళ్ళు ఫోను పెట్టుకొని కూర్చుంటారు. మనకు అది చాలా అనుకూలం. మనకే ఫోను వుంటే, వుండే బాధలు ఏమీ లేకుండా ఫోను వుండటం మూలాన కలిగే సౌఖ్యం అంతా అనుభవించవచ్చు మన నెవ్వరూ ఫోను ఇవ్వమని అడగరు. రికార్డుల విషయంలో అప్ టు డేట్ గా మాట్లాడుతూ, స్వంతానికి పోను కలిగివున్న వాళ్ళలాగే మాట్లాడవచ్చును.
మన ఇంటిప్రక్కవాళ్ళకు పిల్లలు వుండకూడదు. అంటే నీవు అట్లా కోరాలని నేను అనను. నీవు కోరినంత మాత్రాన వాళ్ళకు పిల్లలు కలగకుండా వుండటమూ జరగదు. అయినా అటువంటి కోరికలు కోరమని కాదు నేననటము, పిల్లలు లేని సంసారం ప్రక్కనే నీవు ఉండూ అంటాను.
పిల్లలు వుంటే...
వాళ్ళ పిల్లలకు మన పిల్లలకూ పోట్లాటలు తప్పవు. ఒకమారు నేను వున్న ఇంటి ప్రక్క ఆయనకు నలుగురు పిల్లలుండటం తటస్థించింది. ఇక మా అవస్థ చెప్పటానికి వీలులేదు. మొదట్లో వాళ్ళ పిల్లలూ మా పిల్లలూ కలిసి ఆడుకుంటారని సంతోషించాను. కాని ఏం జరిగింది?
వాళ్ళరామూ ఎర్ర కాగితం ఒకటి పుల్లకు గుచ్చి ఆడుకొంటూ వున్నాడు. మా రాధాయి చూశాడు దాన్ని, పోనీ తనకూ అటువంటిది ఒకటి కావాలని చెపితే చేసి ఇవ్వనూ, ఊహు, అల్లాగ చెప్పక, వాడిచేతులో కాగితాన్ని గద్దతన్ను కొచ్చినట్లు లటిక్కున లాకొచ్చాడు ఇంక వాడి సంగతి, చప్పున వచ్చి నాతోనో, తల్లితోనో, మీ అబ్బాయినా ఎర్ర కాగితం లాక్కున్నాడు. నాది నాకు ఇప్పించండి అని అడగవచ్చునా. మాటలు వచ్చిన వెధవ అహ అట్లా అడక్క, ఠపీమని నేలపై పడిపోయి, కెవ్వున కేకేసి, ఒక్క పెట్టున ఏడ్పు సాగించాడు. బట్టలు బాడి అయినై. వాళ్ళ అమ్మ ఒచ్చి ఏమిట్రానాయనా అని ఎంతో సేపు అడిగితే చివరకు చెప్పాడు ఈ అన్యాయాన్ని గురించి.' ఆమె వచ్చి మా ఆవిడ మీద కేక వేసింది. ఏమిటమ్మా మీ రాధాయ పిల్లల చేతుల్లో చిల్లిగవ్వ అయినా నిలవనీయడు, ఠపీమని గద్ద తన్నుకు పోయినట్లు తన్నుకుపోతాడు ఎట్లాగ ఏడ్చేదమ్మా అని, ఈవిడకూ వుక్రోషం. నా కొడుకు అంత చెడ్డవాడా అని...మీ వాడు అంతేనమ్మా అన్నది. అక్కడ నుంచి వేసుకొన్నారు పోట్లాట ఒక అరగంట సాగింది. ఇంతలో మా రాధాయ ఆ కాయితం కాస్త చింపేశాడు. ఆ సంగతి రామూ కనిపెట్టి మళ్ళీ కెవ్వుమన్నాడు. ఇంతలో నేనొచ్చి రామూను ఊరుకో పెడదామని ఇంకో ఎర్రకాయితం ఇస్తే ఒప్పుకోడే! పోనీ ఎన్ని రంగుల కాయితాలిచ్చినా ఒప్పుకోడే! ఆ కాయితమే కావాలంటాడు. చినిగిపోయిందిరా నాయనా ఆ కాయితం ఇంకోటి తీసుకోరా అంటే వినడే! ఎల్లాగ వీళ్ళ తగూ తీర్చటం !!! కాబట్టి ఇంతకూ చెప్పేవచ్చే దేమిటీ అంటే ఈ పిల్లల తగూలతో ప్రాణం హైరాన అవుతుంది. కొంచెం ముందుగానే జాగ్రత్తపడి పిల్లా జెల్లా లేనివాళ్ళకు దగ్గరగా వుండటం మంచిది. ప్రక్క ఇంటి వాళ్ళకు పిల్లలు లేకపోతే మన పిల్లలనే ఎత్తుకొని ముద్దాడి మిఠాయి, లడ్డూ, అవీ తురుచు వాళ్ళకు పెడుతూ వుంటారు.
మన ఇంటి ప్రక్కవాళ్ళకు కారు కూడా వుంటే మంచిది ఎప్పుడైనా అందులో ఎక్కి మనం కూడా షికారు వెళ్ళటానికి అవకాశం వుంటుంది.
మన ఇంటిప్రక్క ఆవిడ చక్కనిదై ఫ్యాషన్ తెలిసినదైతే చాలా అదృష్టం, ఆమె మన ఆడవాళ్లకు అప్పుడప్పుడు తలదువ్వి పూలుపెట్టి కట్టూ బొట్టూ నేర్పుతుంది.
మన పిల్లలను రోజూ ముస్తాబు చేసే పని ఆమెకే అప్పజెప్పయ్యాలి. మన పిల్లలు ఆమెను అత్తయ్య అని పిలుస్తూ, ఎప్పుడూ అక్కడే కాలం గడుపుతూ ఆడుకుంటూ వుండటం జరుగుతుంది.
దేముడు మేలుచేసి, మన యింటి ప్రక్కవాళ్ళు డబ్బున వాళ్ళు అయివుండాలని మనం కోరుకోవాలె. అలాగ అయితే వాళ్ళు మనలకు ఎన్నడూ డబ్బు అప్పు అడగరు. కాస్తో కూస్తో వాళ్ళవద్దే మనము అప్పు పుచ్చుకోవచ్చు.

మన యింటి ప్రక్కవారి దొడ్లో కాస్త కాయా కూరా పండుతూ వుండటం, పూలూ అవీ పూస్తూ వుండటము కూడా అవసరం.
💐

No comments:

Post a Comment