Saturday 11 August 2018

Pranjali prabha (11-08-2018)

 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - కృష్ణాయనమ:

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 






అధిక్షేప ప్రేమ లీల 
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ 

శుద్ధమైన మనసుకు నిద్దురేలా 
- మానవత్వానికి మచ్చ చూపు లీలా

ఇష్టమైన రోజుకు కష్టాలు ఏలా
- కష్టమైనప్పుడు శాంతి లేని లీలా   

హనుమ ధర్మ వాక్కు అద్భుత లీలా
- రామ నామ మహిమ జీవిత లీలా    

ఇంద్రియాలపై మాయ మహిమ లీలా
- కర్మ, జ్ఞాణ, అంతర్గత మోక్ష లీలా    

పరమాత్మ యోగ సాధనల లీలా
- అనుష్టానముతో అనుబంధ లీలా  

శ్రీ హరి యోగవేదాంత ప్రేమ లీలా 
- శరణాగతి పొందిన మోక్ష లీలా
  
జిహ్వతో సంసారి మనస్సుపై లీలా 
- స్త్రీ ఓర్పుతో గుణాతీతా బంధ లీలా 

తల్లి, తండ్రి, గురువుల బోధ లీలా 
- తరుణ నియోగ దేహ శక్తి లీలా

సృష్టి స్థితి లయకారుని లీలా 
సరస్వతి, లక్ష్మి, పార్వతి లీలా 
పాప పుణ్యాలతో ప్రజా లీలా 
ఇది వేణుగోపాల ప్రేమ లీల 
--((**))--

హరిః ಓమ్ 

3) శ్లోకం 

యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః, 
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః !! 

18) యోగః ఓం యోగాయనమః 

" యోగ". మనగా కలయిక ( union ) అని అర్థము. 
ఇంద్రియములను మనస్సును ౘక్కగా నిగ్రహించి పరమాత్మయందు లగ్నం చేయుటయే యోగమన బడును. జీవిత్మ పరమాత్మ లయొక్క సంయోగమే " యోగము ". కర్మ, భక్తి, జ్ఞాన మార్గము లన్నియునూ ఆత్మపరమాత్మలను కలుపు యోగములే యగుటచేత పరమాత్మ యోగసాధనము చేత పొందబడు వాడు గాన యోగః అను నామముచే జెప్పబడును. 

పైన వివరించిన యోగములను ౘక్కగా అనుష్ఠానము చేసి పరమాత్మ ను బొందుమని ఈ నామము మనకు బోధింౘుౘున్నది. 

19) యోగవిదాం నేతా ఓం యోగవిదాం నేత్రేనమః 

యోగవిదులు అనగా యోగమును బాగుగా నెఱింగినవారు. యోగానుష్ఠానము లందు ౘక్కని యనుభవమును బొందినవారు. నిరంతరమూ భగవంతుని యందే తమ మనస్సును లగ్నం గావించిన మహనీయులు. అట్టి వారి యోగక్షేమములను తానే వహింతునని గీతాచార్యుడు వాగ్దానము చేసినాడు(అ9_22) కావుననే శ్రీహరి యోగవిదాంనేతా అని గానము చేయబడుౘున్నాడు. 
నన్ను శరణాగతిని బొందినవారిని మృత్యు, సంసారసాగరము నుండి సముద్ధరణము గావింతునని గీతాచార్యుని వాగ్దానము స్మరణీయము(అ12_7) నీ చిత్తమును నాయందుంచి నీవు నా 
యనుగ్రహంచేత సకల కష్టములను తఱించిపోగలవు. అని గీతాచార్యుడు ఆనతిచ్చెను గదా (అ 18_53) 
"నమేభక్తఃప్రణశ్యతి". 
నా భక్తునకు పతనము లేదని , శ్యామసుందరుని శరణాగతిని బొందినౘో వారికెట్టిభయమునూ లేదని ఈ నామముయొక్క పుణ్యప్రబోధనము.
 --((**))--


ఛందశ్శాస్త్రం..43...సీసపద్యము నియమములు

సీస పద్యం.....
మనం పాట లాగా పాడుకోవడానికి బాగా వీలుండే పద్యం సీసమే! పూర్వం పౌరాణిక నాటకాలలో, ఇలాంటి సీస పద్యాలు ఎక్కువ గా ఉండేవి. ఇంకా వ్రాయడం సులువు. , ఇంటి పేర్లు, పేర్లు కష్టమైన గురు లఘువులు ఉన్నవి, అన్నీ ఇందులో సులభంగా ఇమిడి పోయే పద్యం ఇది. బాగా సాదన చేసుకుంటే అన్ని విధాల ఉపయోగ పడుతుంది. ఇది కూడా సూర్యేంద్ర గణాలతో ఉండేదే కాబట్టి, ఆటవెలది, తేట గీతి లాగ ఆడుకుంటూ పాడుకుంటూ వ్రాసెయ్యొచ్చు.

ఈ పద్యం లో, నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి.

ఆ నాలుగు పెద్ద పాదాలనూ..మళ్ళీ నాలుగు పెద్ద పాదాలుగా, నాలుగు చిన్న పదాలుగా విడగొట్టి రాస్తారు.దీని స్వరూపం ఇలా ఉంటుంది.

ఒకటో పాదం :-- ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర -..... పెద్ద పాదం. 
రెండో పాదం:-- ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య-.... చిన్న పాదం.

మూడు..,.. నాలుగూ... .......పాదాలు

ఐదూ..,,,,, ఆరూ.. .పాదాలు

ఏడు........ ఎనిమిదీ.. పాదాలు

వరుసగా ఒకటీ రెండూ పాదాల వలెనే ఉంటాయి.

ఇలాగే..ప్రతి పాదం లోని మొదటి గణం మొదటి అక్షరానికీ.. మూడవ గణం మొదటి అక్షరానికీ యతి చెల్లాలి.

ప్రాస యతి కూడా చెల్లుతుంది.

ఈ పద్యానికి ప్రాస నియమము లేదు.

అక్షర నియతి లేదు

సీస పద్యం పూర్వ భాగం వ్రాసిన తర్వాత దాని కింద ఒక తేటగీతి లేక, ఒక ఆట వెలది గానీ వ్రాయాలి. అప్పుడే.. సీసం పూర్తి అయినట్టు లెక్క. ఇలా వ్రాయడాన్ని "ఎత్తు గీతి" అంటారు.

ఇక మనకందరకూ బహుగా పరిచయమున్న ఒక పద్యానికి గణ విభజన చేసి చూద్దామా..
సీ,,
కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు
శేష శాయి కి మొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము 
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి.

పై పద్యానికి గణ విభజన చేసినచో.,,,

ఇంద్ర ఇంద్ర ఇంద్ర ఇంద్ర
| | U | U U | | | | | | | | I
కమలాక్షు- నర్చించు - కరములు-కరములు
ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య
U U | U U | U | U |
శ్రీనాధు -వర్ణించు- జిహ్వ -జిహ్వ 
ఇంద్ర ఇంద్ర ఇంద్ర ఇంద్ర 
| | U | | | U | U | | U | |
సురరక్ష -కునిజూచు - చూడ్కులు -చూడ్కు లు
ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య
U | U | | U | | | | | | | 
శేషశా- యికిమొక్కు- శిరము -శిరము 
ఇంద్ర ఇంద్ర ఇంద్ర ఇంద్ర 
UIU UUI UII UII 
విష్ణునా -కర్ణించు -వీనులు - వీనులు
ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య
| | U | | | | | | | | | | |
మధువైరి - దవిలిన -మనము- మనము
ఇంద్ర ఇంద్ర ఇంద్ర ఇంద్ర
| | U | | | | | | | | | | | | | 
భగవంతు -వలగొను - పదములు -పదములు
ఇంద్ర------- ఇంద్ర -----సూర్య-- సూర్య 
| | U | | | U | U | U |
పురుషోత్త -మునిమీది- బుద్ధి - బుద్ధి

దీనిని సీస పద్యం పూర్వ భాగం అంటారు...దీని తరువాత తప్పని సరిగా ఆటవెలది గాని..,,తేటగీతి గాని వ్రాసి సీస పద్యం ముగించాలి

""నల, నగ, సల, భ, ర, త"" లు. ఇంద్ర గణాలు.

"గల లేక హగణం" మరియూ "న "గణాలు సూర్య గణాలు

ఇవి ఎప్పుడూ మనసులో తిరుగుతూ ఉంటేనే మనం ఆట వెలది తేటగీతి సీస పద్యాల్ని సమర్ధవంతం గా వ్రాయగలము అనే విషయాన్ని గుర్తుంచు కోవాలి.

ఈ రోజుతో ఛందశ్శాస్త్రం పాఠాలు ముగించ బడినవి వాస్తవానికి పద్య రచనకు ఛందస్సుతోపాటు, సంధులు, సమాసములు,అలంకారములు నేర్చుకొనట తప్పనిసరి..,అయినప్పటికీ మిత్రులందరు కొంత అవగానకు వచ్చినారని ఇంతటితో విరమించు చున్నాను .,

సమాప్తం.,,,


అధిక్షేప ప్రేమ లీల 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

గిరిగీచుక కూర్చొణ బోకు,  సరిలేదనుకోకు  
- మర్యాద లేదనీ, మర్చిపోయి ప్రవర్తించుటెందుకు  

నా కెవరు సరి రారన్నట్లు, పదమాలికేందుకు
- మదం పెంచెడి, అహంకారపు మాటలెందుకు
     
తృప్తి నిచ్చేడి హృదయాన్ని, నీవు పంచలే వెందుకు   
- కరుణతో జనుల సహాయం తీసుకొన వెందుకు    

సద్వినియోగం చేసుకోక నీ బాధ పంచుటెందుకు 
- తరుణమ్మను వ్యర్ధము చేసి బ్రతుకుట ఎందుకు 

సమభావంతో ఉండక నీ దౌర్జన్యం చూపుటెందుకు 
- సానుభూతి తెల్పక దర్పపు పలుకులు ఎందుకు  

సృష్టి రచన గూర్చి అడిగే హక్కు, నీకు ఎందుకు   
- నిరుపేదను తూలనాడుట అవసరమా నీకు 

సరసంబుగా బాసలాడి మోసగించుట ఎందుకు
- మతి నుంచక అతిగా గొప్పలు చెప్పుట ఎందుకు  

ప్రాప్తమైన దాని తోడ తృప్తిగా బ్రతక వెందుకు 
- తల్లి, తండ్రి, గురువు, సేవించక తిరుగు డెందుకు

చెవిటి వాని ముందు శంఖం ఊదటం 
మొండి వానికి హిత బోధ చేయటం
కరి తొండాన్ని ఊపద్దనటం 
కుక్క తోక వంకరతీయుట వ్యర్థం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--
   

పదమాలిక నిడెద నొకటి 
ముదమిచ్చెడి రీతిలోనఁ బొంగించి నుడుల్ 
పదిలముగా దాచుకొనఁగ 
హృదయము దలఁచెడి విధమగుఁ, దృప్తికరంబై

--

సూక్తి సంచయము 
================
--

** కందపద్యముతో పలికి, లోనున్న వారందించిన సూక్తిసంచయము. మొదటి రెండు పాదములు రాగానే "నాకు సాటిలేరని ఎప్పుడైనా,ఎవరితోనయినా అన్నానా? నేనొక గరికపూవునని, నీ శక్తి , ప్రేరణ వలననే వ్రాస్తున్నానని 
చెప్పుకొంటున్నానుగదా!" అన్నాను. నీ గురించి కాదు.ఇవి అందఱి కొరకు, జనరల్ గా నిస్తున్నవని సమాధానమిచ్చారు.


సర్వేజనా సుఖినోభవంతు ,,ధన్యవాదములు


2) శ్లోకం 

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః! 
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ !! 

15) సాక్షీ ఓం సాక్షిణేనమః 

సర్వమునూ ౘూౘుౘుండు వాడని భావము. భగవానుడు ప్రతి మానవుని హృదయక్షేత్రము నందుందురు. అందు జరుగుతున్న శారీరక, మానసిక, కాయిక సకల కార్యకలాపములను 
ౘూౘుౘుండు ను. సూర్యుడు అన్ని వస్తువుల యందునూ ౘక్కగా ప్రకాశింౘుౘున్ననూ ఆయా వస్తువుల గుణదోషములతో సంబంధము లేని వాడయినట్లు ఆత్మ సర్వమునూ ౘూౘుౘున్ననూ 
ఆయా కర్మల గుణదోషములతో సంబంధము లేకయే యుండును. కనుక ఆత్మసాక్షియని చెప్పబడును. 

ధర్మమార్గమున ప్రవర్తింపవలెనని ఈ నామము బోధింౘుౘున్నది. ఇతరులెవ్వరూ ౘూౘుటలేదని ధర్మవిరుద్ధ కార్యములలో రహస్య ముగా ప్రవర్తింౘుౘున్ననూ ఆత్మసాక్షియై 
సర్వమునూ గ్రహింౘుౘునే యున్నదను జ్ఞానముగలిగి ప్రవర్తింపవలెనని ఈ నామముయొక్క ప్రబోధమైయున్నది. 

16) క్షేత్రజ్ఞః ఓం క్షేత్రజ్ఞాయనమః 

ఈ శరీరమునకు క్షేత్రమని పేరు. (గీత అ13_2) 

ఈ శరీరము శుభాశుభ కర్మములవలన కలుగుౘున్న ది. ప్రతి క్షేత్రమునందునూ క్షేత్రజ్ఞుడగు పరమాత్మ విలసిల్లుౘుండును. (గీత 13_2)

 క్షేత్ర ములు నశింౘుౘున్ననూ క్షేత్రజ్ఞుడు నశింపడు. క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు గల భేదములను గుర్తించి గ్రహింౘుటయే జ్ఞానమని చెప్పబడును (గీత అ13_3) 

క్షేత్రజ్ఞుడగు పరమాత్మ ను గుర్తింౘుటయే జీవిత పరమలక్ష్యము. ఈ లక్ష్యసాధనమునే ఈ 
నామము బోధింౘుౘున్నది. 

17) అక్షరః ఓం అక్షరాయనమః 

అక్షరుడనగా నాశనములేని పరమాత్మ యని భావము. సర్వమునూ నశించిననూ నాశనము లేనిది పరబ్రహ్మము అక్షరంబ్రహ్మ పరమం అని గీతావచనము. (అ 8_3) 

శ్లోకం:- 

నైనం ఛిందంతి శస్త్రాణి నైనందహతి పావకః ! 
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః !! 

ఆత్మ శస్త్రములచేత ఛేదింపబడునది కాదు అగ్నిచేత దహింపబడునది కాదు. జలములచేత తడుపబడునది కాదు, వాయువుచేత శోషింపబడునది కాదు. కావున ఆత్మ అక్షరః అను దివ్యనామముతో శ్రీహరి గానముచేయబడును. అట్టి అక్షర పరబ్రహ్మము నీవేయని ఈ నామము మరల బోధింౘుౘున్నది. 

ఈ శ్లోకమునందు " ఏవచ " అను పదము ఆ. ప్రయోగములచేత 16వ నామమగు "క్షేత్రజ్ఞుడను" నామమును 17వ. నామమగు " అక్షరుడను" నామము ను రెండునూ ఒక్కటియే యని గ్రహింప వలయును.
--((**))--

ఛందశ్శాస్త్రం..42..12/7/2015 ఉప జాతులు 

ఉప జాతులు వాటి స్వరూపాలు,,,, 

1.ఆట వెలది.,, 

a)1......3.....పాదాలు 3 సూర్య గణములు 2..ఇంద్ర గణములుండును 
2......4.......పాదాలు 5 సూర్య గణములుండును 
(రెండు పాదములు కలిపి 10 గణములుండును) 
b) ప్రతి పాదము నాలుగవ గణము ప్రథమాక్షరము యతి స్థానము ,,,యతికి బదులుగా ప్రాస యతి కూడ వాడ వచ్చు,, 
c)...ప్రాస నియమము లేదు,,, 
d).. అక్షర నియతి లేదు... 

ఆ.వె 
పాము కుండు విషము *పడగ కోరలయందు 
మనిషి కెల్ల విషము *మహిని జూడ 
నదుపులేని నోట *నలుసు మాటలు జారు 
వినుము జ్యోతి మాట *వెలుగు బాట .. 

(శ్రీమతి Nagajyothi Ramna Susarla ...,,ముఖపుస్తకం) 

గణ విభజన 
సూర్య--సూర్య--సూర్య----ఇంద్ర--------ఇంద్ర 
U |--------U |-------| | |--- ----| | | U------| | U | 
పాము--కుండు--విషము--పడగకో--రలయందు 
సూర్య-సూర్య--సూర్య--సూర్య---సూర్య 
| | |------U |-------| | |----- -- | | |--------U | 
మనిషి--యెల్ల--విషము--మహిని--జూడ 
సూర్య-సూర్య-సూర్య-ఇంద్ర-----ఇంద్ర 
| | |-------U |----U |----- | | | U--------| | U | 
నదుపు--లేని--నోట--నలుసుమా--టలుజారు 
సూర్య సూర్య సూర్య సూర్య సూర్య 
| | | U | U | | | | U | 
వినుము.--జ్యోతి--మాట--వెలుగు--బాట 

అ,వె 
ప్రాణ కోటి యెపుడు *ప్రకృతి వశముననె 
ఉద్భవించు చుండు *నూపిరొదులు 
పరిమితంబు నిదియు *ప్రాణులకే గాని 
ధాత యెచటి కెపుడు *తరలి పోడు!! 

(శ్రీ PVR Gopinath....ముఖపుస్తకము) 

సూర్య-సూర్య--సూర్య-- ఇంద్ర - ఇంద్ర 
U |-- U |-- | | |-- | | | |--- | | | | 
ప్రాణ -కోటి -యెపుడు--ప్రకృతివ -శముననె 
సూర్య-సూర్య -సూర్య- సూర్య-సూర్య 
U |--- U |--- U |---- U |------- -| | | 
ఉద్భ--వించు--చుండు--యూపి--రొదులు 
సూర్య---సూర్య--సూర్య--ఇంద్ర--ఇంద్ర 
| | |--- U |--- | | |--- ---- U | |-------UU | 
పరిమి--తంబు--నిదియు--ప్రాణుల--కేగాని 
సూర్య--సూర్య--సూర్య--సూర్య--సూర్య 
U |--- --| | |--------| | |-------| | |------U | 
ధాత--యెచటి--కెపుడు--తరలి--పోడు 

పై రెండు పద్యములు...ఆట వెలది నియమములన్నీ పాటింపబడి ఆటవెలదికి ఉదాహరణలు గానిలచినవి.. 

( శ్రీమతి నాగజ్యోతి రమణ సుసర్ల....శ్రీ గోపినాథ్ పిన్నలి గార్లకు థన్యవాదములు) 

2..తేటగీతి.,, 

a)..ఒక సూర్యగణము.,,2 ఇంద్ర గణాలు 2 సూర్య గణాలు ఏపాదానికాపాదం 5 గణాలుంటాయి,,, 
b)..ప్రతి పాదానికి నాలుగవ గణం ప్రధమాక్షరము యతి స్థానము.,,ప్రాసయతి కూడ వాడ వచ్చు, 
c)..ప్రాస నియమము లేదు 
d)..అక్షర నియతి కూడ లేదు 

ఉదాహరణకు 
పాల్కడలి పుత్రికాస్తన పద్మసరసిఁ 
దిరుగు రాజ హంసవు నిను స్మరణఁజేయు 
నెదల వసియించి రహిమించు నదయ మూర్తి 
పాహి లక్ష్మీనృసింహ కృపా విభూష 

పైన ఉదహరించిన పద్యమును గణ విభజన చేసి చూసిన యెడల,,,, 

గణ విభజన 
సూర్య -ఇంద్ర - ఇంద్ర -సూర్య- సూర్య 
U | | | U | U | | U | | | | 
పాల్క -డలిపుత్రి -కాస్తన- పద్మ- సరసిఁ 
సూర్య -ఇంద్ర -ఇంద్ర -సూర్య - సూర్య 
| | | U | U | | | U | | | U | 
దిరుగు -రాజహం -సవునిను -స్మరణఁ -జేయు 
సూర్య ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య 
| | | | | U | | | U | | | | U | 
నెదల -వసియించి -రహిమించు- నదయ -మూర్తి 
సూర్య -ఇంద్ర -ఇంద్ర -సూర్య -సూర్య 
U | U U | U | | U | U | 
పాహి -లక్ష్మీనృ -సింహకృ -పావి -భూష 

తే.గీ 
సగము మేనయ్యె పార్వతి శంకరునకు 
వదనమందున తావిచ్చె వాణిపతికి 
జలనిధి సుతతాసతియయై చక్కగ ముర 
హరుని వక్షస్థలమ్మున నమరె లక్ష్మి 

( శ్రీమతి Dr.Umadevi Balluri...,,ముఖపుస్తకము) 

గణ విభజన చేసి చూసినచో..,... 

సూర్య-----ఇంద్ర------ఇంద్ర----సూర్య--సూర్య 
| | |---------U U |-------U | |-----U |-----| | | 
సగము--మేనయ్యె--పార్వతి--శంక--రునకు 
సూర్య--ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య 
| | |--------U | -----|UU ------|U |--------| | | 
వదన--మందు నతావి --చ్చెవాణి--పతికి సూర్యఇంద్రఇంద్రసూర్యసూర్య 
| | |--------| | | U--------| | | U------------U |-----| | | 
జలని--ధిసుతతా---సతియయై--చక్క-గముర 
సూర్య -- ఇంద్ర----ఇంద్ర----సూర్య--సూర్య 
| | |--------UU|------U||-----------| | |------U | 
హరుని--వక్షస్థ---లమ్మున--నమరె--ల క్ష్మి 

(శ్రీమతి డా"ఉమాదేవి బల్లూరి గార్కి థన్యవాదములు) 

పై పద్యములు రెండు ప్రతి పాదము నందు ఒక సూర్యగణము రెండు ఇంద్ర గణములు రెండు సూర్య గణములు వచ్చి..తేటగీతి నియమములు పాటింపబడి 
తేటగీతి పద్యమునకు ఉదాహరణలు గా నిలిచినవి......,,,,, 

సశేషం......రేపుకలుద్దాం ...,,

Pranjali Prabha.com 

No comments:

Post a Comment