Monday 27 August 2018

ప్రాంజలి ప్రభ (telugu పత్రిక) -8 - 201 8



తరుణ - స/న/న/భ/న/జ/న/స IIU IIII IIU IIII IIU IIII IIU 
శ్రీ కృష్ణాష్టమి సందర్భముగా 
ఆరాధ్య ప్రేమ లీలా 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

మనువాడు మనసు మమతాను జపము ఎగసే నయనము గదరా    
వనజాక్షుని గన మనసే కరిగెను   ప్రణయస్వరములు కదిలెన్  
తనువంత పులకిత సుతామధురము ఎగసే పయనము గదరా 
మనసాయె మగువ పిలుపే మదిపులకితమయ్యెమరులు గొలిపెన్      

వినవేల మనసు దినమంత కరుణ ఎగసే తరుణము గదరా   
కనులందు వెదకె సిరులందు వెదకె తనువే తమకము గదరా
కనులార పిలుపు కనువిందు తలపు కలకాదు జపము గదరా 
వినుమిప్పుడెహరి ననుజేరుమువడి కనిచెప్పుము పలుకధలన్        

వెదికే కన్నులకు చూపుఉండదు  
ప్రేమించే మనసుకు దారితెల్వదు 
ప్రేమకు చీకటి వెల్తురు అనేది లేదు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--
పది నిముషాలు

సాహితీమిత్రులారా!

తరుణ - 

ఆధారము - కల్పితము 
స్ఫూర్తి - త్యాగరాజ కృతి "కరుణాజలధి దాశరథి" యందలి అనుపల్లవి - తరుణారుణనిభచరణాఽసురమదహరణా శ్రితజనశరణాఽద్భుతగుణ

తరుణ - స/న/న/భ/న/జ/న/స IIU IIII IIU IIII IIU IIII IIU 
24 సంకృతి 8322556

ఎనిమిది మాత్రల (2+6, 4+$, 6+2) విఱుపుతో, ప్రాస యతితో -

వనజాక్షుని గన - మనసే కరగెను - ప్రణయ స్వరములు కదలెన్ 
దినయామినులను - విన గీతికలను - జిన కోరిక మది మెదలెన్ 
కను మూయఁగ నవ - దనిశ మ్మిట హృది - వనరెన్ విరహపు వెతలన్ 
విను మిప్పుడె హరి - నను జేరుము వడి - కని చెప్పుము బలు కతలన్

5,3 మాత్రల విఱుపుతో, ప్రాసయతి -

వినవేల మనసు - నిను వేగఁ బిలిచె - దినమెల్ల గడచెఁ గదరా 
కనులిందు వెదకెఁ - దనువెల్లఁ గదలెఁ - బ్రణయాన హృదిని వ్యధరా 
వినువీథి నడుమ - వనజారి వెలిఁగెఁ - దనరారె గగన తలమే 
కనరార త్వరగ - ఘననీల వపువు - నునుకాంతి ప్రణయ ఫలమే

మొదటి రెండు పాదములలో 5,3; చివరి రెండు పాదములలో ఎనిమిది మాత్రల విఱుపు, అక్షరసామ్య యతి -

దయఁ జూప నిదియె - తరుణమ్ము గదర - దరిసించ నగునొ వరదా 
భయమయ్యె హృదిని - భరియించ నవదు - భగవంత వెతయు వలరా 
పయనమ్మున గడు - వయినమ్ముగ నొక - పథమొక్కటి గన నగునా 
జయమంగళముగ - జగమం దలరెడు - సరసా నిను గన నగునా

ఖండగతిలో IIUI IIIII UIII - IIIU IIIII IU అక్షరసామ్య యతితో -

అరుణమ్ము గగనమున నెందు గన - నరుసమై పులుఁగులట జనెన్ 
తరుణమ్ము సుమధురము సాయమున - త్వరగ రమ్మరుణ రవిఁ గనన్ 
కిరణాల నుదయశశి చీఁకటిని - గెలుచు వెన్నెలల వెలుఁగుతో 
సరసాల నుడుల నొక గీతికను - సరిగఁ బాడుమిఁక యెలుఁగుతో

ఆఱు మాత్రలు IIUII IIIIU - IIIIII UIIII IIU అక్షరసామ్య యతితో -

విరబూసిన యలరులతోఁ - బ్రియతమ కిఁక నిచ్చెద సరములుగా 
స్వరసింధువు తరఁగలతో - సరసిజముఖి ముంచెద స్వరములుగా 
నరవిందపు టరుణిమతో - నలరి వెలిఁగె నాకస మొక నదిగా 
దరుణమ్మిది హరుసముతోఁ - ద్వరగ మురియఁ గైతల చిఱు గదిగా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


హరిః ಓమ్ 

8) శ్లోకము 

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః ప్రజాపతిః ! 
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః !! 

ఈ పవిత్ర శ్లోకమునందు శ్రీహరి పదివిధములగు మంగళనామములతో గానము చేయబడు ౘున్నాడు. 

64) ఈశానః ఓం ఈశానాయనమః 

సర్వమునూ శాశింౘువాడు ఈయన భయము వలననే సూర్యాగ్నిచంద్రులునూ వాయువు మున్నగు నవి తమతమ నిత్యకార్యక్రమములలో మిగుల జాగ్రత్తగా ప్రవర్తింౘు ౘుందురు గావున " ఈశానః" అని శ్రీహరి కీర్తనీయుడగుౘున్నాడు. 

65). ప్రాణదః ఓంప్రాణదాయనమః 

1). ప్రాణులకు చైతన్యమును ప్రసాదింౘు వాడు 

2). కాలుని రూపమున ప్రాణులను సంహరింౘువాడు. 

3). ప్రాణులను శోధింౘువాడు 

4) ప్రాణులను ఛేదింౘువాడు. 

సంస్కృతభాషలో "దః" అనునది "ఇచ్చుట" అనియును, నాశనము చేయుటయును అను రెండు విధములగు అర్థములను సూచింౘును. కనుక ప్రాణ+దః = ప్రాణశక్తిని ఇచ్చువాడు అనియును 
ప్రాణ+దః = పారాణులను నశింపచేయువాడనియును కూడా అర్థమేయగును. భగవానుడు సర్వశక్తిమంతుడని ఈనామము సూచింౘును. ఖండింౘువాడును అతడే, రక్షించి పోషింౘు వాడునూ అతడేయను భావమును ఈనామము సూచింౘుటచేత శ్రీహరి "ప్రాణదః" అను నామముచే గీర్తనీయుడు. 

66) ప్రాణః ఓం ప్రాణాయనమః 

ఉౘ్ఛ్వాసనిశ్వాసములను కల్గింౘు వాడు. ప్రాణులకు ప్రాణమై యున్నవాడని బృహదారణ్య కోపనిషత్తు తెలుపుౘున్నది. 
(ప్రాణస్య ప్రాణః). ఈ శ్రుతివాక్యము ననుసరించి ప్రాణః అనగా క్షేత్రజ్ఞుడు లేక పరమాత్మయని చెప్పబడును.
 --((**))--
హరిః ಓమ్

8) శ్లోకము

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః ప్రజాపతిః !
భూగర్భో మాధవో మధుసూదనః !!

ఈ పవిత్ర శ్లోకమునందు శ్రీహరి పదివిధములగు మంగళ నామములతో గానము చేయబడు ౘున్నాడు.

67) జ్యేష్ఠః ఓం జ్యేష్ఠాయనమః

అన్నిటికంటే మిక్కిలి పెద్దవాడు అని భావార్థము.

68) శ్రేష్ఠః ఓం శ్రేష్ఠాయనమః

అన్నిటికంటే మిక్కిలి ప్రశంశనీయుడు అని అర్థము.

69) ప్రజాపతిః ఓం ప్రజాపతయేనమః

ప్రజలకు అధిపతి. ప్రజలనగా సంతానమని యర్థము. కాన ప్రజాపతియనగా "పరమపితా" వాత్సల్యస్వరూపుడగు తండ్రి. " పితా√హమస్య జగతః" అను గీతావాక్యము స్మరణీయము (అ_9_17).

70) హిరణ్యగర్భః ఓంహిరణ్యగర్భాయనమః

విశ్వరూపమగు హిరణ్యమును గర్భమునందు ధరించినవాడగుటచే హిరణ్యగర్భుడగును. బ్రహ్మాండ స్వరూప మయిన హిరణ్మయాండమునందు వ్యాపించి ఉన్న సృష్టికర్త యగు బ్రహ్మదేవుడు హిరణ్యగర్భుడగును. అట్టి వానికి ఆత్మయై యున్నందున శ్రీహరి " హిరణ్యగర్భః" అని పిలువ బడును.

71) భూగర్భః ఓం భూగర్భాయనమః

భూమినంతనూ తన గర్భమునందు ధరించినవాడగుటచే శ్రీహరి " భూగర్భః " అని కీర్తనీయుడు.
--((**))--

No comments:

Post a Comment