Friday 17 August 2018

pranjali pabha (telugu patrika) (13-=8-౨౦౧౮ )




నేటి హాస్యం ప్రాంజలి ప్రభ.కం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

"ఈ రోజు నాకు అస్సలు వొంట్లో బాగోలేదు!" అంది "భార్య " 
"అయ్యో!! ...అవునా....నేను ఈ రోజు నిన్ను బయటకి తీసుకుని వెళ్లి డిన్నర్ చేద్దామనుకున్నానే!!" అన్నాడు "భర్త " 
"హిహిహి.....ఏదో సరదాకి జోక్ చేసాను...నాకు బాగానే వుంది " అంది "భార్య " 
"హహహ...నెనూ జస్ట్ జోక్ చేశా.....లేచి వంట వండు, మరి!!" అన్నాడు " భర్త "
మీ మాటలు ఎప్పుడు నమ్మను కాబట్టి ఇప్పుడు నమ్మటానికి 
నీ వేషాలు ఎప్పుడు నిజమైనావి కాబట్టి, ఇప్పుడు సంతోష పడటానికి 
ఆ...     ఆ.. 
--((**))--

వాజ్ పేయి కి అశ్రు నివాళి! 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఊపిరిపోసి పార్టీకి కొత్త శక్తి తెచ్చావు 
- ప్రజాసేవ కోసం నిరంతరము తపించావు

గరళం మింగి అమృతం ప్రజలకు పంచావు 
- రాజకీయము రక్షించుటకు కృషి చేసావు    

సమస్యల వలయాన్ని ధర్మంతో జయించావు 
- ప్రధాని,రచయితగా నిస్వార్ధ పరుడవు 

ఐక్యరాజ సమితిలో వాగ్ధాటిని చూపావు  
- ప్రజల నమ్మకాన్ని న్యాయంగా నిలబెట్టావు  

పార్టీ సభ్యులను ఏకం చేసే చతురుడవు 
- రాబోయే కాలము అంతా మాదేనని చాటావు

 నీవు ఎవరిని నొప్పించని నాయకుడవు 
-రాజ్యాంగాన్ని ఔపోసన పట్టిన ధీరుడవు 

 రాజకీయములో బ్రహచారైన భీష్ముడవు 
- భరత జాతి గర్వించే మహా నాయకుడవు 

మూడుసార్లు ప్రధాని ఐన అజాతశత్రువు
- ప్రజల హృదయాలలో ఉన్న ఆత్మబంధువు 

జీవికి మరణం తప్పదు 
మరణానికి పుట్టుక తప్పదు    
ధర్మం, సత్యం, న్యాయానికి చావు ఉండదు 
ఇది వేణుగోపాల రాజకీయ లీల సుమా   
--((**))--

హరిః ಓమ్

5) శ్లోకము

స్వయంభు శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః !
అనాది నిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః !!

తొమ్మిది పుణ్యనామముల తో శ్రీహరి ఈ పుణ్యశ్లోకము నస్తవనీయుడు.

37) స్వయంభూః ఓం స్వయంభువేనమః

తనంతటతాను గానే ఉత్పన్నమైన వాడని భావము.31, 34 నామముల వివరణమును తిలకింప ప్రార్థన.

ప్రపంచములో ఏకార్యము జరిగిననూ దానికి తప్పక యేదియో కారణముండి తీరవలయును. కార్యకారణ సంబంధం విశ్వమంతటనూ కానవచ్చును . కానీ భగవానుడీ నియమమున కతీతుడు . 

"అజో పిసన్, ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా". అను గీతావాక్యము స్మరణీయము( అ4_శ్లో6).

నేను పుట్టుక లేనివాడనే అయ్యునూ, నాశనరహితుడనైననూ, సర్వనియామక సార్వభౌముడ నయ్యును నా ఇచ్ఛానుసారముగా నా ప్రకృతి ఆధారంగా నేను అవతరింౘు ౘుందునని గీతాశాస్త్రవాణి 

38) శంభుః ఓం శంభవేనమః

శుభముల ప్రసాదింౘు వాడని ఈ నామము యొక్క భావము. శైవసంప్రదాయము నందునూ దివ్యనామముల లో "శంభుః" నామము మరియొక సుప్రసిద్ధ నామము. (27వ నామ వివరణమును తిలకింపుడు.). తమ పవిత్రనామమును స్మరించి నంత మాత్రముననే భక్తులకు వారి కోర్కెలనెల్లా వర్షింప చేయువాడు పరమశివుడు. శివకేశవులకు తారతమ్యము లేదు. శ్రీమహావిష్ణువే ఇచ్చట శంభునామముతో గానము చేయబడుౘున్నాడు. సకలకోరికల పరిపూర్తి కొఱకు భగవన్నామమును ఆశ్రయింౘవలయునని భావము. అనగా ఈ స్తవరాజము యొక్క సంకీర్తనము సకలాభీష్ట
సిద్ధి వ్రతమని భావము.

27వ. నామవివరణము

మంగళప్రదుడని ఈనామము నకర్థము. త్రిగుణాతీతుడు, పరమపవిత్రుడును, మంగళకరుండును
నగుటచేత శ్రీపతి "శివః" అను దివ్యనామముచేత స్తవనీయుడగును శివకేశవుల కెట్టి భేదమునూ లేదని ఈ స్తవరాజము లో స్పష్టముగా తెలుపబడియున్నది.
శైవసంప్రదాయ శబ్దములెన్నియో దీనియందు గలవని పాఠకులు గమనింౘగలరు . అటులనే శివసహస్రనామావళి యందుకూడా వైష్ణవనామము లెన్నియో గమనింౘగలరు. శివకేశవులకు భేదముౘూపువాడు అవివేకి, అతడు మహానరకము నకు పోవునని మనశాస్త్ర పురాణాదులలో స్పష్టంగా తెలుపబడి యున్నది.

39) ఆదిత్యః ఓం ఆదిత్యాయనమః

ఈ నామము సూర్యభగవానుని సూచింౘుౘున్నది.

1) సూర్యమండల మధ్యభాగమున బంగారు వర్ణముతో ప్రకాశింౘు ౘున్న మహాపురుషుడే పరబ్రహ్మ మగుట చేత. ఆ దివ్యనామముతో గానము చేయబడుౘున్నాడు.

2) భూమికి "అదితిః" అను పేరు కలదు. గనుక ఆదిత్యు డనగా భూమికి భర్తయగు శ్రీమన్నారాయణ మూర్తి యగును.

3) " ఆదిత్యానాం ఆహం విష్ణుః" ద్వాదశాదిత్యుల యందు నేను విష్ణువును అని గీతాచార్యుని వచనము(అ10_21).

4) ఆదిత్యుడనగా "అదితి" కుమారుడనియును అర్థము కలదు. అదితి యొక్క కుమారుడు వామనుడు కనుక శ్రీమహావిష్ణువు యొక్క ఐదవ అవతారమును తెలుపుౘున్నది. కావున భగవానుడు ఆదిత్యనామ వాచ్యుడగుౘున్నాడు. సూర్యోపాసనము సర్వరోగహర మని తెలియదగును. ఇట్టి
నామముతో కూడిన కారణముచేతనే ఈ స్తవరాజపారాయణ "రోగార్తో ముచ్యతే రోగాత్" సర్వరోగహరమని ఉత్తర పీఠికలో వ్రాయబడియున్నది.

5) ఒక్కడేయగు సూర్యుడు అనేక జలపాత్రలయందు అనేకములుగా ప్రతిబింబింౘు నట్లు ఒక్కటేయగు ఆత్మ అనేక శరీరములయందు అనేకములుగా నుండునట్లు తోౘు ౘుండును. ఇట్టి సూర్యునివంటి పోలిక కలిగియున్న కారణం చేతనే శ్రీహరి "ఆదిత్య" అనుమహనీయ నామమున 
అర్చనీయుడగుౘున్నాడు.

--((**))--


నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ప్రపంచం లో 2 పనులు చాలా కష్టమైనవి!! 
1.మన మాటల తో వేరొకరిని మన దారిలోకి తీసుకుని రావడం 
2.ఇంకొకరి డబ్బులు , మన జేబు లోకి తెచ్చుకోవడం!!

మొదటి పని లో విజయం సాధిస్తే....వాళ్లని "టీచర్" అంటారు!! 
రెండవ పని లో విజయం సాధించిన వాళ్ళని "వ్యాపారస్తుడు" అంటారు!!!

పై రెండింటిలో విజయం సాధించిన వాళ్లని. ఏమంటారో మిరే చెప్పండి ...

ఆ..... ఆ ................
--((**))--
నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఒకే .. 
ఓకె.. 
ఆ(....ఆ( 
అలాగే... 
బై... 
ఆ(?.. 
ఓకే.. 
..ఓకే.. 
స.........రే... 
అరె!!...సరే అన్నాను గా... 
ఆ( ఆ( 
బై.. 
పెట్టేస్తున్నాను... 
ఇంక ఆపుతావా ?? 
బై ..బై..బై

మల్లి సెల్ మ్రోగింది 
ఈ సెల్లు కనుగొన్న వారు ఎవరోకాని 
ఎంతటి చెవులు, చూసి కళ్ళు దెబ్బతింటున్నాయి 
ఆ.... ఆ..... 
--((**))--
నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

స్కూల్ పిల్లలను టీచర్ అడుగు తున్నది 
"ఎరా!?? " చిట్టు " .... 
ఆన్సర్ షీట్లో సమాధానాలు ఏమీ రాయకుండా , వొట్టి తెల్ల కాగితం ఇచ్చావెమ్!??" అడిగింది టీచరు! 
"మీరే కదా టీచర్, మొన్న .... 
పేజీలు పేజీలు వ్రాస్తే పెద్దోడివి అయిపోయావా!!???" అని కొప్పడ్డారుగా, మరి
."నాకే సమాధానం చేబుతునావురా... 
అందుకే టీచర్ తెల్ల కాగితం ఇచ్ఛా అన్నాడు వినయంగా 
నన్నరవకండి ఏదన్న వ్రాసి మార్కులు మీరే వేయండి అన్నాడు 
ఆ.... ఆ... 
--((**))--
నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

అది నిన్నటి మాట!! 
ఎవరూ లేని వాడికి దేముడే దిక్కు.... 
ఇప్పటి మాట... 
ఎవరూ లేని వారికి ... 
గూగుల్ దిక్కు.!!
--((**))--
నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

తాత మనవుడు మాటలాడు కుంటున్నారు
నాకు ...ఒక పుస్తకం రాయాలంటే.... 
కనీస పక్షం ఒక ఏడాది పడుతుంది!!" అన్నారు 'తాత " గారు!!
కళ్ళజోడు లేకుండా ఎన్ని రోజుల్లో వ్రాయగలవు తాతయ్య 
ఉంటేనే సరిగా కనబడదు, ఇక లేక పొతే ఎల్తగురా 
"ఎందుకు అంత బాధ , ...తాతయ్యా!! 
బజారు లో రాసిన పుస్తకాలు భొల్డు అమ్ముతున్నారు గా" అన్నాడు "మానవుడు "
--((**))--
నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

స్కూల్ పిల్లలను టీచర్ అడుగు తున్నది 
"రేపటి పౌరులు...." 
టీచర్: మైక్రోసాఫ్ట్ లో ప్రోగ్రామ్స్ గురించి చెప్పండి.. 
రాము:ఎమెస్ వర్డ్ 
సీత: ఎమెస్ ఎక్సెల్ 
రాణి: ఎమెస్ పవర్ పాఇంట్..... 
రంగా :...ఎమెస్ ధోని!!
టీచర్ : ధోని అన్నావేమిటిరా 
ఏమో నాకు తెలియదు టి.విలో విన్నా అన్నా 
ఆ.... 
--((**))--
నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

అది నిన్నటి మాట!! 
ఎవరూ లేని వాడికి దేముడే దిక్కు.... 
ఇప్పటి మాట... 
ఎవరూ లేని వారికి ... 
గూగుల్ దిక్కు.!!
--((**))--

నేటి చిన్న కధ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

కొమ్మల గువ్వల సవ్వడి వినినా 
రెమ్మల గాలుల సవ్వడి వినినా 
ఆలలు కొలనులొ గలగల మనినా 
దవ్వుల వేణువు సవ్వడి వినినా 

నీవు వచ్చెవని నీపిలుపే విని 
కన్నుల నీరిడి కలయ చూచితిని 

ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండునో 
ఎంత హాయి ఈరేయి నిండెనో
Old Is Gold .. 
Excellent Song.. 

చిత్రం: కలిసిన మనసులు (1968) 
సంగీతం: మాస్టర్ వేణు 
గీతరచయిత: దేవులపల్లి 
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 

పల్లవి: 
ఒక్క క్షణం ఒక్క క్షణం 
నన్ను పలకరించకు నా వైపిటు చూడకు 
ఒక్క క్షణం ఒక్క క్షణం 
నిన్ను తలచుకోనీ నా కన్ను మూసుకోనీ 
మోయలేని ఈ హాయిని మోయనీ 
ఒక్క క్షణం ఒక్క క్షణం 
ఒక్క క్షణం ఒక్క క్షణం 
ఆ రెప్పలు వాల్చకూ 
అటు ఇటు కదలకు 
ఒక్క క్షణం ఒక్క క్షణం 

చరణం 1: 
ఆ కన్నులలో ఊహల అర్ధమేదొ అడగనీ 
ఆ కొలనులలో నీడలా అదే పనిగ చూడనీయ్ 
మోయలేని ఈ హాయిని మోయనీ ఒక్క క్షణం ఒక్క క్షణం 

చరణం 2: 
ఆకులతో గాలి ఊసులాడకూడదు 
ఏటిలోని అలలు పెదవి విప్పకూడదు 
ఆకులతో గాలి ఊసులాడకూడదు 
ఏటిలోని అలలు పెదవి విప్పకూడదు 
మేను మేను తాకగా.. మౌనముగా గువ్వలవలే 
కొమ్మ పైని మాటాడక కునుకు జంట పువ్వుల వలే 
మోయలేని ఈ హాయిని మోయనీ ఒక్క క్షణం ఒక్క క్షణం 

చరణం 3: 
మోము పైన ముంగురులు ముసరవచ్చునా 
మోవి చుట్టు కోరికలు మూగవచ్చునా 
మోము పైన ముంగురులు ముసరవచ్చునా 
మోవి చుట్టు కోరికలు మూగవచ్చునా 
వాగులాగా ఈ సమయం సాగిపోవుననే భయం 
నాలో నిండిన నీవే నాకు చాలు నేటికి 
మోయలేని ఈ హాయిని మోయనీ ఒక్క క్షణం ఒక్క క్షణం 
ఒక్క క్షణం ఆ.. ఆ 
ఒక్క క్షణం..ఆ..ఆ 
ఒక్క క్షణం ఆ.. ఆ 

--((***))--

https://www.youtube.com/watch?v=ZFQoFYTdPwM
Kalasina Manasulu | Okka Kshanam song
Watch the romantic song, "Okka Kshanam" sung by Ghantasala and P Susheela from the film Kalasina Man...

--((**))--

--((**))--

అధిక్షేప ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ   

కన్ను రెప్ప వాల్చ నంటుంది నిన్ను చూస్తే 
- మనసు ఉరకలు ఏస్తుంది ఎందుకో 

హృదయం దడ దడ లాడు నిన్ను చుస్తే 
- మంచులా కరిగి పొమ్మంటుంది ఎందుకో 

మాట పాటగా మారుతుంది నిన్ను చూస్తే
- సెలయేరులా మారమంటుంది ఎందుకో 

ప్రేమ శిక్ష నాకు ఎందుకు నిన్ను చూస్తే
- కళ్లెంలేని గుర్రంలా పరుగు ఎందుకో  

నాలో మెఱుపు తీగ విధ్యుత్ నిన్ను చూస్తే
- చినుకు పూల సంబరం నాలో ఎందుకో

చిరునవ్వు గల తలపు నిన్ను చూస్తే 
- అధరామృతం అందివ్వ మంది ఎందుకో

పెదవి సొంగ కారుస్తుంది నిన్ను చూస్తే  
 - తేట నీరు అందుకో  అంటుంది ఎందుకో 

 బొడ్డు చీర నిల్వ నంటుంది నిన్ను చూస్తే
- తనువు ఎదో కావాలంటుంది ఎందుకో

వయసు వయసు పంచుకో
సిగ్గు విడిచి తృప్తి అందుకో 
నిత్యం ధర్మ బుద్ధి నిలుపుకో
ఇది వేణుగోపాల ప్రేమ సుమా

--((**))--    

చేటీ భవన్నిఖిల భేటీ, కదంబవన వాటీషు నాకి పటలీ
కోటీర చారుతర కోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా!
పాటీర గంధ కుచశాటీ కవిత్వ పరిపాటీమగాధిప సుతా
ఘోటీ కులా దధిక ధాటీ ముదార ముఖ వీటీ రసేన తనుతామ్!!

--((**))--

అధిక్షేప ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

హృదయంలో దాగి ఉన్నాడు గుర్తు పట్టనట్లు భేటీ  
- పరువంలో ఉండి ఉన్నాడు చూసి చూడనట్లు కోటీ  

పాషాణంగా ఉన్న మనస్సును మార్చ లేనట్లు పోటీ   
- నవ పారిజాతం గా  నీవు నాకు దక్కనట్లు శాటీ  

ముసుగులో ఉంచి నాకు తెస్తున్నావు ఇక్కట్లు ఘోటీ 
- నవ్వుని పంచ లేక పడుతున్న అగచాట్లు చీటీ  

ఇత్తడి పుత్తడి అయినా  బుద్ధి మారనట్లు ధాటీ 
- ప్రకృతి పరంగా నిత్యం ఆనందించటం పరిపాటీ   

మణీకిరణ కోటీ
గంధ కుచశాటీ
లేదు ఎప్పుడు పోటీ 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--

No comments:

Post a Comment