Sunday 5 August 2018

Pranjali Prabha (06-08-2018 )



సీతా దేవికి హనుమంతుండు రాముని గురించి వివరముగా తెలియపరిచిన విషయములు చదవండి.     

సీతా రాముని  పద్మముల రేకులవలె విశాల మైనవియును, సమస్తమైన ప్రాణుల మనస్సును ఆకర్షించు సౌందర్యము కలవాడును, పుట్టుకతోనే మంచిరూపముతొను, దాక్షిన్యము తోను జనించిన వాడును, శ్రీ రామ చంద్రుని స్వరూపమును గూర్చి మారుతి యధాతధముగా చెప్పు చుండెను

తేజమును - సూర్యుని తో సమానుడును, ఓర్పును - భూమి తో సమానుడును, బుద్ధి యందు  - బృహస్పతి  తో సమానుడును, కీర్తి యందు - ఇంద్రునితో సమానుడును. 

సమస్త జీవలోక రక్షకుడును, తనవారి అందరికి రక్షకుడును,  ఉత్తమనడవడికతొ పాలించు వాడును, ధర్మం తొ శత్రు సంహారకుడును. 

ఓ భామిని రాముడు ఈ సమస్త ప్రపంచకమును, నాలుగు వర్ణాల వారినీ రక్షించు చుండెను, 
లోకములో అందరకి కట్టు బాట్లు ఏర్పరిచెను, అందరు కట్టుబాట్లుతో ఉండునట్లుగా చూచు చుండెను.  

రాముడు మిక్కిలి కాంతి మంతుడును, మిక్కిలి గౌరవింప దగిన వాడును, బ్రహ్మచర్య వ్రతములో ఉన్నవాడును, సత్పురషులకు  ఉపకారము ఎట్లుచేయవలెనో తెలిసిన వాడును. 

కర్మల ప్రయోజనము, ఫలితము తెలిసిన వాడును, ఏ పనికి ఎట్టి ఫలితము వచ్చునో  ఊహించ గలవాడును, రాజనీతి ధర్మమును చక్కగా  అమలుపరుచు వాడును, బ్రాహ్మణుల విషయమున గౌరమును చూపినవాడును.

రాముని భుజములు విశాలమైనవి గను, భాహువులు దీర్ఘమైనవి గను, కంఠం శంఖా కారము గను
 ముఖము మంగళ ప్రదమై య్యుండును.

సుందరమైన రాముని నేత్రములు ఎర్రగాను, ప్రక్క య్యముకలతో భాహు బలిగాను, రామ్ అనే పేరు లోకమంతా వ్యాపించు ఉండును, విద్యాశీల సంపన్నుడు, వినయ వంతుడును. 

రాముడు యజుర్వేదము చక్కగా అద్యయనము చేసిన వాడును, మహాత్మూలచేతను, వేదవేత్తల చేత గౌరవము పొందిన వాడును, ధనుర్వేదము నందు మిగిలిన మూడు వెదము లందును
ఉప వేదములందు  వేదవేదాన్గములందు పాండిత్యము కలవాడును. 

రాముని కంఠధ్వని దుందుభి వలే గమ్బీరముగా ఉండును, రంగు నిగనిగలాడుతూ నల్లని రూపములొ అందరిని ఆకర్షించు చుండును, రాముని అవయవములన్నీ  సమముగా విభక్తములై  ఉండును, గొప్ప ప్రతాపము  చూపి శత్రువులను పీడించు  వాడును. 

వక్షస్థలము,  ముజేయి,  పిడికిలి స్థిరముగా ఉండే వాడును, కనుబొమ్మలు, ముష్కములు,  భాహువులు, దీర్ఘముగా ఉండును, కేశములు, మోకాళ్ళు, హేచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉండును,  నాభి,కడుపు క్రిందభాగము, వక్షస్థలము పొడవుగా ఉండును.  

నేత్రములు, గోళ్ళు, అరచేతులు, అరకాల్లు ఎర్రగా ఉండును, పాదరేఖలు,కేశములు, లింగమని నున్నగా ఉండును, కంఠధ్వని, నడక, గమ్భీరముగా ఉండు వాడును,  అవావసౌష్టమే అద్భుతం పూర్ణ చంద్రుని మోముగలవాడును.  

ఉదరము నందు మూడు ముడతలు గలవాడును, స్తనములు, స్తనాగ్రములు రేఖలు అను మూడింటి యిందు లోతైన వాడును, కంఠం,  లింగం, వీపు, పిక్క,  అను నాలుగు హ్రస్వములుగా ఉన్నవాడును, రాముని శిరస్సునందు మూడు  సుడులు కలవాడును. 

అంగుష్టము మోదట నాలుగు వేదములును సూచించు రేఖలు కల వాడును, అతని నుదుటిపైన, అరచేతులలోన,  అరకాళ్ళలోన,  నాలుగేసి రేఖలు ఉండును, మోకాళ్ళు ,తొడలు,పిక్కలు బాహువులు సమానముగా ఉన్న వాడును, శ్రీ రాముడు తొమ్భైఆరు అంగుళముల (8 అడుగులు) ఎత్తు కలవాడును. 

రెండు కనుబొమ్మలను, రెండు నసాపుటములను,  రెండు నెత్రములను, రెండు కర్ణములను
రెండు పెదవులను, రెండు స్తనానగ్రములను, రెండు చేతులను, రెండు ముంజేతులను. 

రెండు మోకాళ్లను, రెండు ముష్కములను,  రెండు పిరుదులను, రెండు చేతులను, రెండు పాదములను, పిరుడులపై కన్దరములను, జంటలుగా ఉన్న 14 అంగములు సమానముగా ఉన్న వాడును. 

సింహము, ఏనుగు, పెద్దపులి, వృషభము వలే నడుచు వాడును, ముక్కు, గడ్డము, పెదవులు, చెవులు చాలాఅందముగా ఉన్న వాడును, కళ్ళు, పండ్లు, చర్మము, పాదములు, కేశములు నిగానిగాలాడు చుండును, రెండు దంత పంక్తులలో స్నిగ్దములు, తెల్లని మెరుపు కలిగి ఉండును. 

ముఖము, కళ్ళు, నోరు,నాలుక, పెదవులు, దవడలు, స్తనములును, గోళ్ళు,  హస్తములు, పాదములు, ఈ పది పద్మము వలె ఉండును, శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, వక్షము, హృదయమును, కడుపు, చేతులు, కాళ్ళు, వీపు ఈ  పది పెద్దవిగా ఉండును. 

తేజస్సు, కీర్తి, సంపద అను మూడింటి చేత లోకమంతా వ్యాపించి యుండును, చంకలు, కడుపు, వక్షము, ముక్కు, మూపు, లలాటము ఆరు ఉన్నతములై ఉండును, వ్రేళ్ళ కణువులు, తలవెంతుకలు, రోమములు, గోళ్ళు, లింగము, చర్మమును, మీసమును, దృష్టి, బుడ్డి అను తొమ్మిదింటి యందు సూక్షమములుగా ఉండును. 

ధర్మ అర్ధ అక్కమములను సమముగా అనుభవించు వాడును, శుద్దమగా మాతా-పితృ వంశములు  కలవాడును, సత్య, న్యాయ, ధర్మములందు ఆసక్తి కలవాడును, సర్వలోక ప్రియముకోరకు ప్రియముగా మాట్లడువాడును. 

శ్రీమంతుడు ప్రజలను దగ్గరకు తీయ్యుట యందును, వారిని అనుగ్రహించుట యందు ఆసక్తి కలవాడును, దేశకాలయుక్తా యుక్తములయందు జ్ఞానము కలవాడును, పరాజయము అనేది తెలియని మహానుభావుడును.  

తోడుని కోల్పోయిన మనిషి దుఃఖం – దేవరాజు మహారాజు పద్యం

సాహితీమిత్రులారా!
భూమినీ, సముద్రాన్నీ, చెట్లనూ, పశు పక్ష్యాదులను సృష్టించిన తరువాత, దేవుడు పురుషుడిని సృష్టించాడట! ఆ ఒంటరి పురుషుడు దిగాలుగా వుండడం చూసి, చలించిపోయిన దేవుడు, మాట్లాడుకోవదానికైనా, పోట్లాడుకోవదానికైనా అతడికి ఒక తోడు వుంటే బాగుంటుందని భావించి ఒక స్త్రీని సృష్టించాడట దేవుడు.

ఎంతో సానుభూతితో, కరుణతో అతడికి ఒక తోడుని ఇచ్చిన ఆ దేవుడే అర్థాంతరంగా అతడి నుండి ఆమెను వేరు చేసి, ఆమెను తన వద్దకు తిరిగి తీసుకు వెళ్ళిపోతే ఎంత దుఃఖం? సంక్లిష్ట నగర జీవన విధానంలో భారంగా రోజులు గడిపే, వయసు పైబడిన మగ వాడికి ఆ కష్టం ఎంత దుర్భరం?

ఎంతో భారమైన ఆ దుఃఖాన్ని కవిత్వం చేసి, పాటకుల గుండెల్ని బరువెక్కించిన కవి దేవరాజు మహారాజు.

ఒక్కొక్క సారి, భాషకు సంబంధించి, కవిత రూపానికీ, శైలికీ సంబంధించి ఆ కవిత చదువరులను అబ్బురపరచకపోయినా, ఆ కవిత లోని వస్తువు తాలూకు సార్వజనీనత, కవిత లోని ఆర్తి కట్టి పడవేస్తుంది. అట్లాంటి ఒక అరుదైన మంచి కవిత, దేవరాజు మహారాజు గారి ఈ కవిత.
అందమైన బంధం ఏదైనా లోకం ముందు అనవసర ఆర్భాటాలను ప్రదర్శించదు.

బహుశా, అందుకే ఎంతగానో సహచరిని ప్రేమించిన మనిషి సంవేదన కూడా చాలా సాదా సీదాగా అగుపిస్తూనే ఆర్తితో తొనికిసలాడుతున్నది. అక్కడక్కడా వాచ్యంగా తోచినా, కవిత చివరికి వచ్చేసరికి దిగులు నిండిన ఒంటరి శూన్యంలోకి నెట్టివేస్తుంది.

ఒంటరి గూటి పక్షి



నిశ్శబ్దం లోంచి శబ్దం లోకి రావడం – పుట్టుక శబ్దం లోంచి నిశ్శబ్దం లోకి పోవడం
 – చావు ఇవ సహజాలని అందరికీ తెలుసు అయినా, ఒక్కోసారి అసహజాలని భ్రమిస్తాం!
కలలు ఊహలు భ్రమలు మనిషి ఔన్నత్యానికి కొలబద్దలు అవి కాలంతో పెనవేసుకు పోయేవి

కాలానికి అల్లుకు పోయిన కలే – జీవితం
ఆ కల కరిగిపోవడమే – కాలం చేయడం

అనూహ్యంగా అకస్మాత్తుగా జీవిత భాగస్వామిని కోల్పోవడం
బతుకులో కరెంట్ పోవడం – శాశ్వత అందత్వమే!
మరీ వయసు పైబడినపుడు ఆ బాధ
మరింత లోతుగా మరింత గాడంగా మరింత చిక్కగా

ప్రేమ అనుబంధం అనురాగం ఉన్నఫళాన తెగిపోతే
తపించే ఏ హృదయమూ తట్టుకోలేదు
బిగుసుకునే పిడికిలి లోంచి, భాగస్వామి ఇసుకలా రాలిపోతే
ఒంటరితనం ఒంటిమేడై పెరిగిపోతుంది, భవిష్యత్తు భయపెడుతుంది

స్మృతిని ఊతకర్రగా చేసుకునిముందుకు నడిచిపోవడం చెప్పినంత తేలిక కాదు
మొక్కవోని ధైర్య సాహసాలు కావాలి, గుండె రాయి కావాలి ఏళ్లకేల్ల దాంపత్య జీవితం తర్వాత
ఏర్పడ్డ వెలితిని ఎలా పూడ్చుకుంటారు ఎవరైనా? జ్ఞాపకాల్ని అదిమిపెట్టి, తోడుని తనతోనే భావించుకుని ఇద్దరిలా కనిపించడం మాటలా?
అలాంటి ద్విపాత్రాభినయం మృత్యు సమానమే కదా!
మేత కోసం దేశ విదేశాలకు ఎగిరిపోయిన పిట్టలు
కబురు పెడితే మాత్రం, తను ఎగిరేదెలా?
వారిలో ఇమిడేది ఎలా?

ఆ మాట, ఆ అలికిడి, ఆ స్పర్శ ఆ చూసుకోవడం, ఆ పంచుకోవడం, మనసున మనసై కొట్టుకోవడం
మారు మూల పల్లెలో, వేసవి మధ్యాహ్నంలో ఇప్పుడిక జీవితపు ఆగాథాలు ఎవరితో పంచుకోవడం?
బతుకులో లేని తీపిని, ఆశని ఎవరి కళ్ళలో చూసుకోవడం?

పరిచితాలన్నీ అపరిచితాలై తనింట్లో తానే అవసరం లేని అతిథి ఐపోవడం
ప్రతి ఊపిరిలో అభద్రత – ప్రతి చూపులో బెరుకు బతుకు రథం కుంగిపోతున్న సంకేతం
కాలానికి నమస్కరించే నిబ్బరం తప్ప మరొకటి పనికి రాదు

చీకటిని మించిన చీకటి – ఒంటరితనం మరణాన్ని మించిన మహా విషాదం – తోడు లేకపోవడం!
ఆమె సమక్షంలో జీవితం గొప్ప వెలుగుతో ప్రకాశించేది అన్న విషయాన్ని చెప్పడానికి, ‘జీవిత భాగస్వామిని పోగొట్టుకోవడం అంటే బతుకులో కరెంటు లేకపోవడం’ అంటున్నాడు కవి.

అప్పటిదాకా అతడికి అసహజాల భ్రమల రంగుల ఆకాశంలో కనిపించిన జీవితం, ఆమె నిష్క్రమణతో ఒక్కసారిగా నేల పైన పడిపోయి, ఒక తత్వ చింతన లోకీ, వేదాంతం లోకీ జారి పోవడం ఈ కవితలో మనకు కనిపిస్తుంది.

సంతోషాన్నైనా, దుఃఖాన్ని అయినా, తను బతికే ఇంట్లో కలిసి పంచుకోవడానికి ఒక మనిషి లేకపోతే అది ‘ మరణాన్ని మించిన మహా విషాదం ‘ అని వాపోతున్నాడు కవి.

అంతేనా?
విదేశాలకు ఎగిరెళ్లి పోయిన పిల్లల్ని ‘ మేత కోసం ఎగిరిపోయిన పిట్టలతో ‘ పోలుస్తూ, ‘ వాళ్ళు రమ్మని పిలిస్తే మాత్రం, వెళ్లి వాళ్ళతో ఇమిడేది ఎలా అని కూడా వాపోతున్నాడు.

ఈ కవితలో గమనించవలసిన మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, చాలా కొద్ది కాలమే కొనసాగి తెగిపోయిన భార్యా భర్తల బంధం గురించి కాదు ఇక్కడ ప్రస్తావించింది … ‘ఏళ్లకేల్ల దాంపత్య జీవితం తర్వాత ఏర్పడ్డ వెలితిని’ గురించి’ ఈ కవిత మాట్లాడింది.

అందుకే, దేవరాజు మహారాజు గారి ఈ కవిత, ఒక మంచి కవితగా మిగిలిపోయింది.
--------------------------------------------------------
రచన - కోడూరి విజయకుమార్, వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

--------------------------------------------------------


No comments:

Post a Comment