Monday 20 August 2018

ప్రాంజలి ప్రభ (అంతర్జాల telugu పాత్రిక ) -8- 2 0 1 8

ఓం శ్రీ రాం - శ్రిమత్రే నమ: శ్రిక్రిష్ణాయనమ:  


ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం

తాత మనవడి (చిన్న కధలు-  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

తాతయ్య మనవడ్ని ప్రక్కన కూర్చోపెట్టుకొని చిన్న ఆద్యాత్మిక ఉపన్యాసం చెప్పటం మొదలి పెట్టాడు.    
సమస్త జీవరాసిలోనూ పరమాత్మను దర్శించగల శక్తి  మానవునకే ఉన్నది.   "ఒక చేతి వ్రేళ్ళు ఒకటిగా ఉండవు " అయినా విశ్వమంతా సౌందర్యమయంగా కనబడుతుంది ప్రతి ఒక్కరికి. దూరమునుండి కొండ చుస్తే నున్నగా కనబడుతుంది దగ్గరకు వెళ్ళితేగాని దాని విశ్వ రూపం తెలియదు.  ప్రతి మానవుడు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ధర్మిక శక్తి సాధించు కోగలిగితే ప్రపంచంలోని స్థితిగతులన్నీ మారుతాయి. " ఒకడికున్నదని ఏడిస్తే ఒక కన్ను పోతుంది - తనకు లేదని ఏడిస్తే రెండో కన్ను పోతుంది " గుడ్డి వాడిగా మారితే ఫలితము ఎమన్నా ఉన్నదా .  కలతలు కార్పణ్యాలు ప్రబలిన చోటే శాంతి స్థాపన చేయుట మన కర్తవ్యము అని భావించి ముందుకు సాగాలి.  ఘర్షణకు తావు లేకుండా, ద్వేషం దారి ఇవ్వకుండా,  అసూయ ఆవకాశమివ్వకుండా, పూర్తిగా మనో నిబ్బర శక్తితో ప్రతిఒక్కరిని శక్తి వంచన లేకుండా ఆదుకుంటూ జీవితం సాగించాలి.   "చెడు  వినకు, చెడు అనకు, చెడు కనకు."   "ఒకడిని చూస్తే పెట్టబుద్ధి - ఉంకొకడిని చూస్తే మెట్టబుద్ధి" అయినా  ఆదర్శమైన ప్రేమ సర్వత్ర వ్యాపించి ఉన్నది, అయినా  అసూయా ద్వేషాలకతీతంగా మానవులుగా ఆ పరమాత్ముని ప్రార్ధిస్తూ కర్తవ్యదీక్షతో కంకణ బద్దులుగా మారి మనుష్యుల్లో ఉన్న పరమాత్ముని గమనిస్తూ  ప్రవర్తించే వాడే నిజమైన మానవుడు.
తాత నేను నిజమైన మానవుడ్ని కానా అన్నాడు మానవుడు,. ఎందుకు కావు వయసుని బట్టి ప్రవర్తనే 
మన:శాంతి కలిగించే విధముగా ఉంటె చాలు ఈ కలియుగంలో. 
అలాగే తాతయ్య ఎవ్వరికి కష్టం కలిగించకుండా ఉంటా. సరేరా బాబు ఉంటా ... ఆ ఉంటా 
ఆ.. ఉంటా అని వెళ్లి పోతావే. 
తాతయ్య మీరే చెప్పారు ఒకనాడు అవునంటే కాదని, కాదంటే అవునని వస్తా ...  కాదు కాదు వీళ్ళొస్తా ... అంటూ బయలు దేరాడు మనవుడు         
--((**))--

ఆదిక్షేప ప్రేమ లీల  - ప్రాంజలి ప్రభ.కం 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

నయనాల చూపులకు నవనీతము కరిగే 
- సోయగాల మెరుపుకు అభిమానము పెరిగే 

పరువాల వెన్నెలకు పరిమళము కరిగే 
- మదిలీల మగువకు చమత్కారము పెరిగే   

వింత గోల వయసుకు విపరీతము కలిగే 
- సంత గోల వనితకు ఉపోద్ఘాతము పెరిగే 

విధి లీల మనసుకు భయమోహము కలిగే 
- ప్రేమ లీల మహిళకు సుఖభారము పెరిగే 

శుభమో భారమో భయమో 
ద్వేషమో దాహమో తాపమో  
సతిపతిగా కరుగుటే  
వేణు గోపాల పేమ సుమా  
   --((**))--


ఆదిక్షేప ప్రేమ లీల  - ప్రాంజలి ప్రభ.కం 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 
ఈ రోజు పెళ్లి రోజు జరుపుకునే జంటకి శుభాకాంక్షలు 

సన్న నవ్వుల కోరిక కన్నా, కావలిసిందేమిటి జంటకి 
- నిత్య పువ్వుల వాసన కన్నా, పరిమళమేమిటి జంటకి

సత్య వాక్కుల బోధల కన్నా, మాటలు ఇంకేమిటి జంటకి   
- ఉన్న దానితో సంతృప్తి కన్నా, ఆశ ఎక్కువేమిటి జంటకి 

ఆశయముతో బ్రతుకు కన్నా, బాధ కష్టమేమిటి జంటకి   
- మనసు దాటని మాట కన్నా, ఓపిక తీర్పేమిటి జంటకి  

నీడలా ఉండుట తృప్తి కన్నా, పొందేటి సేవేమిటి జంటకి   
- ఇంటిలో ప్రేమ పంచుట కన్నా, వేడుకలు ఏమిటి జంటకి  

ఒక రొకరు నమ్ముటం కన్నా, బ్రతుకు మార్పేమిటి జంటకి 
- ఉన్నది దానం చేయుట కన్నా, పొందు పాశమేమిటి జంటకి  

చెలిమి ఊయల పాట కన్నా, గుణ స్వర మేమిటి జంటకి 
- చిలిపి కోర్కల మాట  కన్నా,  మనో రాగమేమిటి జంటకి 

తల్లి తండ్రుల ప్రేమలు కన్నా,  కావలసిన దేమిటి జంటకి    
- దైవ సన్నిధి పూజలు కన్నా, మనో  తృప్తి ఏమిటి జంటకి

పసిడి వెలుగు బాట కన్నా, వెన్నెల పొందేమిటి జంటకి
- మనసు వాంఛ తీర్చుటకన్నా, ధనం పని ఏమిటి జంటకి   

లోకవ్యవహారము, భయము ,సిగ్గు,
 దాక్షిణ్యము, ధర్మసీలత 
ఈ యైదును లేనివారితో స్నేహము కూడదు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--

తాత మానవుడి చిన్న కధ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తాత నాకు ఒక కధ చెప్పు అని అడిగాడు మనవుడు. అప్పుడు తాత "తినే ప్రాప్తి ఉంటె వడ్డించేవాడు మనవాడవుతాడు అన్నాడు" అవును తాత దేవుడి మీద నమ్మకం ఉంటె ఎంతటి  రోగమైన క్షణంలో పోతుంది అన్నాడు మనవుడు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కదా తాత అవునురా మనవుడా ఒక్కోసారి దేవుడే నీవుకష్ట పడకుండా నీ దగ్గరకే వచ్చి నీకు సేవ చేస్తాడు నీవు చేసిన పుణ్యాన్ని బట్టి నీదగ్గర ఉంటాడు. ఏదన్న ఉదాహరణ చెప్పు తాత . 
సరే చెపుతా  విను అని చెప్పటం మొదలు పెట్టాడు తాత.              
స్టీఫెన్ అనే ఒక ప్రఖ్యాత డాక్టర్, వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప అవార్డును అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. రెండూ గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది. కాన్‌ఫరెన్సుకు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒకా కారు అద్దెకు తీసుకుని ప్రయాణం కొనసాగించాడు. మళ్ళి కొంతసేపు అయిన తరువాత, విపరీతమైన గాలివాన, వర్షం..దానితో ఈ వాతావరణంలో ముందుకు సాగలేక ఆగిపోయాడు. భరించలేని ఆకలి, అలసట, వేళకు వెళ్ళలేకపోతున్నాను అనే చికాకులతో ఉన్నాడు ఆ డాక్టరు. కొంతదూరం ముందుకు వెళ్ళాక, అతనికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లోకి వెళ్ళి వారి ఫోను ఉపయోగించుకుందాము అనుకున్న ఆ డాక్టరుకు ఆ ఇంటి తలుపు తీసిన ఒక ముసలామె తన ఇంట్లో కరంటు, ఫోను సౌకర్యాలు లేవు అని, బాగా వర్షంలో తడిసిపోయినందున తన ఇంట్లో కొంత సేపు విశ్రాంతి తీసుకోమని, వెచ్చగా ఉండేందుకు టీ, కొంత ఆహారం టేబుల్ మీద పెట్టి తను ప్రార్ధన చేసుకోవడానికి వెళ్ళింది. ఆమె పక్కన ఉయ్యాలలో ఒక పసివాడు ఉన్నాడు. ఆమె గురించిన వివరాలు తెలుసుకుందామనుకున్నా, ఆమె ప్రార్ధనలు ఎంతకీ పూర్తి అవటం లేదు. ఎట్టకేలకు ఆమె ప్రార్ధనలు ముగించి వచ్చిన తరువాత, ఆమె మంచి మనసుకు ఆమె చేసిన ప్రార్ధనలు అన్నీ ఆ భగవంతుడు వింటాడు అని భరోసా ఇచ్చాడు. ఆ ముసలామె చిరునవ్వు నవ్వి, భగవంతుడు నేను కోరిన అన్ని కోరికలూ తీర్చాడు ఒక్కటి తప్ప, ఎందుకనో ఈ కోరిక మాత్రం తీర్చడం లేదు అని చెప్పింది. 

ఆమెకు అభ్యంతరం లేకపోతే, ఆమెకు కల కోరిక ఏమిటో చెప్పమని, తాను సాధ్యమైనంత సహాయపడతానని చెప్పాదు వైద్యుడు. ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది. "ఈ ఉయ్యాలలో ఉన్నవాడు నా మనుమడు. అతనికి ఒక అరుదైన క్యాన్సర్ వ్యాధి సోకింది. ఎంతో మంది వైద్యులకు చూపించాము. ఎవ్వరూ నయం చేయలేకపోయారు. ఒక్క స్టీఫెన్ అన్న ఆయన మాత్రమే ఈ వ్యాధి తగ్గించగలడు, ఆయన ఇక్కడికి చాలా దూరంలో ఉన్నాడు. అందుకే వైద్యం మీద ఆశ వదిలేసి, భగవత్ ప్రార్ధనలతో జీవితం గడిపేస్తున్నాను అని చెప్పింది. వింటున్న డాక్టరు కళ్ళల్లో నీళ్ళు. "భగవంతుడు దయామయుడు. ఆయన మీ ప్రార్ధనలు వినడమే కాదు, ఆ డాక్టరును మీ వద్దకే తీసుకువచ్చాడు కూడా. విమానం పాడయ్యి, గాలివానలో చిక్కుకుని, నేను మీ ఇంటికి వచ్చాను. కాదు కాదు, ఈ పరిస్థితి సృష్టించి ఆయనే నన్ను మీ వద్దకు పంపాడు. ఆ డాక్టర్ స్టీఫెన్ ను నేనే." అని బదులిచ్చాడు. అప్పుడు ఆ క్షణం అతను అందుకోవలసిన అవార్డు అతనికి గుర్తు రాలేదు. 

భగవత్ ప్రార్ధన లోని మహత్యం అదే. మనం వెళ్ళలేని చోటుకు కూడా దాని శక్తి వెళుతుంది. కావలసినది నమ్మకం అంతే. 1.అడగడం, 2. నమ్మడం, 3.అందుకోవడం...ఇవే ప్రార్ధనకు కావలసిన అంశాలు. భగవంతుని నమ్మి మనం ప్రార్ధిస్తే, మనకు కావలసినది ఆయన తప్పక మనకు లభింపచేస్తాడు. అని చెప్పాడు తాత కధ ముగిస్తూ 
--((**))--


వింటున్నా వింటున్నా
తల్లి గర్భమందు నుండి
లయ తప్పని చప్పుడొకటి
లలితం గా వింటున్నా!

ఓం కార శబ్దం... లా
ఓం భూర్బువ స్సువ:.. లా
మధుర మైన స్వరము నె
హృదయం లో వింటున్నా!

మనసు లోని మలినాన్ని
మనిషి లోని కాలుష్యాన్ని
శృతి తప్పని శబ్ద మొకటి
శుద్ధి చేయు ప్రతి క్షణం!

మమత లకు, మోహానికి
మనుగడకు, ప్రాణ మదె
మంచి చెడు భావాలను
మార్పు చేయు చోటు అదే!

జీవరాసు లన్నిటికి
జీవము ఆ శబ్దమె
విశ్వ విభు డైన గాని
విన వలెను దాని మాట!

డాక్టర్.....
శ్రీనివాసమూర్తి గంజాం 

శ్లో === లోకయాత్రా భయం లజ్జా దాక్షిణ్యం ధర్మ శీలతా | 
పజ్జ యస్మాన్ని విధ్యన్తే నకుర్యాత్తెన సజ్గతి మ్ || 

భావము === లోకవ్యవహారము, భయము ,సిగ్గు, దాక్షిణ్యము, ధర్మసీలత ఈ యైదును లేనివారితో స్నేహము కూడదు.

వందనము 

పల్లవి. అన్నమయ్య ఏది అడిగి నాడయ్య? 
అన్న, పానములా? ఆస్తులా, మేడలా? ||అన్న|| 

అనుపల్లవి. మిన్నైన సిరులేమి కోరినాడయ్యా? 
వెన్నుని వన్నెల సహవాసము తప్ప. ||అన్న|| 

1. త్యాగ రాజుల వారు తారక రాముని, 
రాగ సుధలో ముంచి రంజింప జేసి, 
పొగడి, పల్లకి, పదవి, పుడమి సంపదలు, 
యోగి పుంగవుడు అడిగినాడయ్యా? ||అన్న|| 

2. రామ దాసుల వారు, భక్తి రమ్యతతో, 
స్వామి కీర్తన చేసి సుఖమొందిరే గాని, 
కమ్మిన చీకటిలో కారావాసములో, 
యిమ్మని కాసులు అడిగినాడయ్యా? ||అన్న|| 

3. దేవుడిచ్చిన ఆ తియ్యని కంఠము, 
స్వామికే అర్పించి సుఖ మొందు సుజన, 
అమ్మ అలమేలును, అందాల స్వామిని, 
ప్రేమ రాగముతో పూజింపుమయ్యా. ||అన్న|| 

4. నిత్య సంకీర్తనతో నరహరిని నుతి చేసి, 
ముత్యములా జగములో వెలిగి పోవయ్యా, 
నిత్యము గాదు యీ నర జన్మ చెరసాల, 
సత్యమిది, స్వరమును శృతి చేయవయ్యా. ||అన్న|| 

రమాకాంతరావు చాకలకొండ 25 జూన్ 2015 
Visit: http://ramakantha.com / & http://lordbalajisongs.com/
Ramakantha Rao Chakalakonda | Poet, Lyricist, Writer
ramakantha.com
--((**))--
కం. శరణాగత సంశ్రితభయ 
హరణా సురనికర శేఖరానర్ఘమణి 
స్ఫురణాపరిచయరంజిత 
చరణా వనమాలికా భుజంగభరణా 

కం. అజగవశార్ఙ్గలంకృత 
భుజగర్వనిరస్తదైత్య భూమాస్తుత్య 
త్రిజగద్ధారణనిత్య 
భుజగసమాచరితశయన భూషణకృత్యా 

కం. జలనిధిహిమవద్భూధర 
కలితజననకేళికౌతుకవ్యక్తావ్య 
క్తలలితసౌందర్యస్ఫుర 
దలఘుతనుస్త్రీసనాథ హరిహరనాథా! 

ఆంధ్రమహాభారతము "విరాటపర్వము" నుండి హరిహరనాథ స్తుతి. (తిక్కన సోమయాజి)

--((**))--
  
గజల్ 2405.

అందాలకు లోటుండదు..తను అలిగిన సమయాన..!
పరిమళించు సెలయేఱే..తను నవ్విన సమయాన..!

ప్రతిచినుకొక మౌనరాగ మాలపించు తనను కూడి..
సరిగమలకు పరవశమే..తను పాడిన సమయాన..!

మబ్బులలో కలహంసయె..కదిలినట్లు నడకలు కద..
ప్రతిమెఱుపుకు వేడుక కద..తను ఆడిన సమయాన..!

విహరించే ఊహలకే..పల్లకి కద తన ఊసే..
మధువేదో పొంగునుగా..తను చూసిన సమయాన.!

రత్నకాంతు లెన్నైనా..తక్కువేగ తన సొగసుకు..
నవపున్నమి కోవెలగా..తానయ్యిన సమయాన..!

ఈ మాధవ గజలంటే..తన ముద్దుల ధార కదా..
నా శ్వాసల దీపంతో..తను చేరిన సమయాన..!
--((**))--

గజల్ 2401. 

నిశిని వలచిన శశిని చూశా..తెల్లవారని రేయిలో..! 
కలికి వెన్నెల సఖిని చూశా..ఆశ వాడని రేయిలో..! 

యేటిగట్టున వింత సొగసుల..విరహవేదన విందుగా.. 
అలుక చూపని చెలిని చూశా..కలలు వీడని రేయిలో..! 

పండువెన్నెల వన్నెలెన్నో..తెల్లబోయే వేళరో.. 
గుండెవీణియ తడిని చూశా..రాగమారని రేయిలో..! 

పలకరించు అందమేదో..పరువమల్లే పూసెనే.. 
పసిడి చెలిమికి నిధిని చూశా..గంధమందని రేయిలో..! 

మంచుపూలకు మధువులేవో..నింపుతున్నది ఎవ్వరో.. 
శుభముహూర్తపు సడిని చూశా..ఘడియవాలని రేయిలో..! 

ప్రేమసాగర తీరమేదో..చేర్చవేలర మాధవా.. 
దిగులు పడు ఊర్వశిని చూశా..మువ్వనవ్వని రేయిలో..!

--((**))--

గజల్ 2406. 

వంతెనగా తనతనువును..నిలిపినాడు..జైజవాన్..! 
దేవునికే ప్రతిరూపమై..నిలచినాడు..జైజవాన్..! 

మనసు రాయి చేసుకున్న..మాంత్రికుడే సైనికుడా.. 
ఒక రక్షణ యంత్రంలా..ఒదిగినాడు జైజవాన్..! 

కాపాడే తత్వానికి..ప్రతీకగా ముందుండును.. 
విపత్తులకు ఎదురీదగ..సాగినాడు జైజవాన్..! 

ఎంత చరుకుతనము వాని..సొంతమోయి గమనిస్తే.. 
సమయానికి తగుశక్తిగ..ఎదిగినాడు జైజవాన్..! 

జీతానికి కాకతాను..తన నేనును విడనాడెనె.. 
తనకమ్మని జీవితాన్ని..ఇచ్చినాడు జైజవాన్..! 

మాధవుడా నీ గజలే..అంకితమాతని పదముల.. 
తన సర్వస్వం తా నర్పించినాడు జైజవాన్..!
--((**))--




గజల్ 2407. 

సన్ననవ్వుల పంటకన్నా..సంపదేమిటి జంటకి..! 
ఉన్నదానితొ తృప్తికన్నా..ఎక్కువేమిటి జంటకి..! 
ర్కెతీరగ గొడవపడితే..అసలు నెమ్మది ఎక్కడ.. 
మనసు దాటని మాటకన్నా..ఓపికేమిటి జంటకి..! 

చిన్నిసరదా నీడలాగా..తోడు నిలచుట మధురము.. 
ఇంటిచుట్టూ తోటకన్నా..వేడుకేమిటి జంటకి..! 

ఒకరికోసం ఒకరు బ్రతుకని..లోకమెట్లా ప్రేమా.. 
మనసునిండిన శ్వాసకన్నా..పండుగేమిటి జంటకి..! 

చిలిపి ఆశల గగనమేదో..చేరకుండా ఎట్లా.. 
చెలిమిఊయల పాటకన్నా..వేదికేమిటి జంటకి..! 

మధురమాధవ గజల్ లాగా..ప్రవహించే దెన్నడు.. 
పసిడివెలుగు బాటకన్నా..వెన్నెలేమిటి జంటకి..!
--((**))--


అధిక్షేప పేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

పండువెన్నెల వన్నెలెన్నో చూశా, తెల్లారే వేళలో  
- నది పరుగు కడలిలో చూశా, వర్షపు వేళలో 

తొలి ముద్దు పెదవియందు చూశా, మొదటి రాత్రిలో  
- నళిని వలచిన శశి చూశా, అంబరం ఆశలో 

యుగ యుగాల ఆశను చూశా, జగతి లీళలో   
- కలికి వెన్నెల సఖిని  చూశా, ప్రకృతి వడిలో  

అలుక తీర్చే ఆకలిని చూశా, శ్రీమతి వడిలో 
- గుండె వీణియ తడిని చూశా, ఆత్రుత మదిలో 

కలి బలిమి గర్వమును చూశా, నాయక వేటలో 
- యేటి గట్టున సొగసును చూశా, యవ్వన ఆశలో 

మెరుపుతో మేఘం పన్నీరు చూశా, శ్రావణ మాసంలో    
- ఆశతో పుడమి ఆత్రుత చూశా, తెలుగు భాషలో 

విత్తు విచ్చి విజ్ఞాన తేజం చూశా, సామాన్య శాస్త్రంలో 
- పెంపకంలో అమ్మ ప్రేమను చూశా, జీవన గమ్యంలో  

మల్లె పూల సువాసనను చూశా, శృంగార లీలలో  
- దిగులు పడు యవ్వనాన్ని చూశా, మగువ మత్తులో 

జాబిల్లి ఆశా, భానుప్రతాపం చూశా
ప్రకృతి ఆశా, కాల మహిమ చూశా      
ఆనందం ఆరోగ్యం ఆధ్యాత్మికం చూశా 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))- 

No comments:

Post a Comment