Friday 4 February 2022

-***


 

నేటి సూక్తి : మనిషి తానైనదానికి, తాను కాని దానికి మధ్య తేడాను గుర్తించినప్పుడు మాత్రమే సత్యానికి చేరువ అవుతాడు.



 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 345-1  / Sri Lalitha Chaitanya Vijnanam  - 345 -1🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*మూల మంత్రము :*

*🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।*

*క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀*

*🌻 345-1. 'క్షేత్రపాల సమర్చితా'🌻* 

*క్షేత్ర పాలకులచే ఆరాధింపబడునది శ్రీమాత అని అర్థము. పాలనము క్షాత్రధర్మము. పాలించుటకు పాలనా జ్ఞానము అవసరము. అట్టి జ్ఞానము కలుగవలెనన్నచో శ్రీమాతను ఆరాధించ వలెను. మానవ శరీరముల నుండి దివ్య శరీరముల వరకు గల రూపము లన్నింటినీ పోషించు కొనుటకు, రక్షించు కొనుటకు ఆయా జీవులయందే పాలక ప్రజ్ఞగా శ్రీమాత వసించు చున్నది. ఆమె నారాధన చేసినవారికి ఆ ప్రజ్ఞ మేల్కాంచి రక్షణ పోషణాదులు జరుగుచుండును. పశు రూపములలో నున్న జీవులు కూడ తమను తామిట్లే పోషించుకొనుచు రక్షించుకొను చున్నారు. ఆహారమునకై తిరుగాడు పీత సహితము అలికిడవగానే కన్నములో దూరును. అట్లే ఇతర జీవులును.*

*మానవులు జీవిత మంతయూ శరీర పోషణము, రక్షణము కొరకు పాటు పడుచుందురు. అది వారి కర్తవ్యమై నిలచినది. ఈ కర్తవ్య నిర్వహణము సరిగ జరుగవలెనన్నచో శ్రీమాత రక్షింపవలెను. అపుడు శ్రీమాత తదనుగుణమగు సంకల్పమును, జ్ఞానమును, క్రియా శక్తిని ప్రసాదించును. అట్టివారే వారి వారి  శరీరములందు సుఖ పడుదురు. తమ శరీరములనే కాక ఇతరులను కూడ రక్షించుట, పోషించుట, ఒక దేశమునకు, ఒక లోకమునకు రక్షణ పోషణ కల్పించుట కూడ పాలక శక్తియే. ఇట్టి వారిలో శ్రేష్ఠులు దిక్పాలకులు, లోకపాలకులు.*

*సశేషం...*

శరణము తెలిపిన మెదిలె భావముకు

మరణము బిగువున కదిలె శాపముకు 

చరణపు పలుకులు కులుకె తాపముకు 

తడబడి చేసే తప్పులు కనుగొని బ్రతుకు 

అనుభవ భావం వప్పులు తెలిపుటయే ఈశ్వరా 

👏అంబేత్కర్ గారి గొప్పతనం ఏంటో ఒక్క దేశాద్యక్షుడి మాటలోనే వినండి సోదరా! ఓపికతో అందరూ చదవండి! అందరూ తెలుసుకోవాలన్నదే మన ASF ప్రయత్నం.అమెరికా వంటి బలమైన దేశాన్ని ఎదిరించి గెలిచిన ప్రపంచంలోకేల చిన్న దేశం వియత్నాం ఒకటి.

 👉 దాదాపు ఇరవై సంవత్సరాలు

  కొనసాగిన ఆ యుద్ధంలో అమెరికా  ఓడిపోయింది. అమెరికాను వియత్నాం జయించిన తరువాత, వియత్నాం అద్యక్షుడిని ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న అడిగారు .....

  🧔మీరు యుద్ధాన్ని ఎలా గెలిచారు లేదా అమెరికాను ఎలా ఓడించారు అనేది ప్రశ్న.

 🤷 కానీ ఆ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం విన్నప్పుడు మీరు ఆశ్చర్యపోతారు మరియు మీ ఛాతీ కూడా అహంకారంతో నిండి ఉంటుంది.

 👉 ఇచ్చిన సమాధానం చదవండి.

 👉 అన్ని దేశాలలో అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికాను ఓడించడానికి, ఓగొప్ప మరియు అద్భుతమైన భారత దేశ ఒక్క నాయకుడి చరిత్రను నేను చదివాను. మరియు మేము ఆయన జీవిత చరిత్ర నుండి ప్రేరణను ఉపయోగించి సులభంగా జయించాము.

 🧔 జర్నలిస్ట్ ఇంకా అడిగారు, "ఆ గొప్ప నాయకుడు ఎవరు?" ఎవరి చరిత్ర?"

 ✊ మిత్రులారా, నా ఛాతీ అహంకారంతో విశాలమైనప్పుడు, మీ ఛాతీ కూడా అహంకారంతో నిండి ఉంటుందని నేను చదివినప్పుడు.

 👉 వియత్నాం అద్యక్షుడు

  నిలబడి, ఆ ప్రశ్నలకు బదులిచ్చారు ..., "నాయకుల బెదిరింపులకు వ్యతిరేకంగా పోరాడిన భారతదేశపు గొప్ప నాయకుడు భీమ్‌రావు అంబేద్కర్"

 👏 బాబా సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ పేరు

  అతను ఆపేరు తలచుకునేటప్పుడు అతని కళ్ళలో వీరోచిత ప్రకాశం వెలుగు చూసింది.

 ✊ ఆయన ఇంకా మాట్లాడుతూ ... "అంత గొప్ప వ్యక్తి మన(వియత్నాం) దేశంలో జన్మించి ఉంటే, మేము ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించేవాళ్లము."

 👏 కొన్ని సంవత్సరాల తరువాత ఆ వియత్నాం దేశాధినేత మరణించాడు, అప్పుడు అతను తన సమాధిపై ఏమి వ్రాయించంకున్నాడో తెలుసా??,

  "ఇది భీమా రావు అంబేద్కర్ శిష్యుడి సమాధి !!"అని వ్రాయించంకున్నాడు.

 👉 తరువాత కొంత కాలానికి వియత్నాం

  విదేశాంగ మంత్రి భారత పర్యటనకు వచ్చారు.

 👉 ముందస్తు ప్రణాళిక ప్రకారం, అతనికి మొదట ఎర్ర కోట మరియు తరువాత గాంధీజీ సమాధి చూపించారు.

 👏 ఇవన్నీ చూసిన ఆయన అసలు ఆ "గొప్ప భీమ్ రావు అంబేద్కర్ గారి సమాధి ఎక్కడ ఉంది" అని అడిగాడు.

 ✊ అప్పుడు భారత ప్రభుత్వ అధికారులు నివ్వెరపోయారు, అప్పుడు వారు ముంబైలోని దాదర్లో చైత్య భూమి గురించి ప్రస్తావించారు.

 👉 వియత్నాం విదేశాంగ మంత్రి ముంబైకి చేరుకొని, అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమాధిని ఆయన చూశారు.

 ✊ సమాధిని చూసిన తరువాత,ఆయన ఆ సమాధి దగ్గర ఉన్న కొంత మట్టిని తీసుకొని తన సంచిలో నింపాడు, దానిపై అక్కడ ఉన్న జర్నలిస్ట్ లు ఆ మట్టిని తీసుకోవడానికి గల కారణం ఎందుకు అనిఅడిగారు !!

 👏 అందుకు సమాదానం గా ఆ వియత్నాం విదేశాంగ మంత్రి, ఇలా సమాధానం ఇస్తూ"ఈ నేల బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి పాదాలను తాకినది. ఈ మట్టిలో ఒక గొప్ప నాయకుడు జన్మించాడు. నేను ఈ మట్టిని నా దేశపు మట్టిలో చేర్చుతాను ... తద్వారా నా దేశంలో ఇలాంటి నాయకుడు అంబేద్కర్ గారి లాంటి వారు పుడతారు" అని ఆయన సమాధానం ఇచ్చారు. "

  👏బాబా సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ గారి గురించి కేవలం భారతదేశమే మాత్రం గర్వపడటమే కాదు, ప్రపంచం మొత్తం గర్వపడాలి. ఈ పోస్ట్ మరింత గర్వంగా ఎక్కువ మంది స్నేహితులను పంచుకుంటుందని నేను ఆశిస్తున్నాను.****

ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

 నాకుకావాలి అంది ............

79. గాడిద

గాడిదలంటే నీకు భయమా,  నా చేయి  అంత గట్టిగా పట్టుకున్నావు అన్నాడు భర్త భర్యతో

నా కేం భయం లేదు మీ గతస్మ్రుతులు గుర్తుకు వచ్చి గాడిద లాగ ప్రవర్తించ కుండా మిమ్ము నీను గట్టిగా పట్టుకున్నాను.

80. ప్రేమించనివారితో

మీరు ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించారా

ఎవరినీ నీను ప్రేమించ లేదు

ఇప్పుడు ఎవరినైనా ప్రేమిస్తున్నారా

ఎన్నిసార్లు చెప్పాలి నేను ఎవరిని ప్రేమిమ్చటములేదు

ఐతే మరి నాతొ మీకెం పని నా దారి నేను చూసుకుంటా

ప్రేమించని వారితో కాపురం చేయటం ఎమ్దుకూ  ....  


ऊँ!
----
ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యోనమః !!!
--
" పద్యప్రకాశినీభారతీస్థశ్రీశారదాముఖేభ్యో మహద్భ్యో విపచ్ఛేఖరేభ్యః !!!
--
బమ్మెఱపోతరాజొకఁడు ..
----
' రాజీవగంధియు , రమాభగవత్యంశయు , మహాగుణమణియు , భీష్మకమహారాజుగారి బాలామణియునైన రుక్మిణి నవ్యఘనశ్యామలదేహుఁడైన శ్రీకృష్ణునిఁదలఁచుచు ' నీకుదాస్యంబుసేయని ,
జన్మమేల.. యెన్ని జన్మము లకు ? '..అని..యహరముమనంబుననిండుగభావించుచున్నది.
ఏలననగా..' కన్యా వరయతే రూపమ్! '
అందునా..భువనమోహనుఁడైననాయశోదానందవర్ధనుని వరియింపనికన్యామణియుండునా ?
ఆ వసుదేవనందనునకు తనమనోనిశ్చయమునుసాకల్యముగసానుకూలముగనెఱింగింపఁగ సరసవాగ్మియైన వేదపండితుఁడైన విద్వస్తవనీయుఁడైన అగ్నిద్యోతనుఁడనువిప్రోత్తమునిద్రారకానాథునిచెంతకుపంపెను.
అమ్మహీసురుఁడును ' కృష్ణా యదుభూషణా ! ' యని శ్రీకృష్ణ నామస్మరణపారాయణమునుచేయుచు తనకు తెలియనట్లుగనే యెంతో దూరముగానున్న ద్వారకను ' అదిగో ద్వారక ' ..యనినట్లుగా చాలత్వరగనే చేరుకొనఁగా , భూసురాగమమునుగ్రహించిన
శ్రీ కృష్ణస్వామి అనేకవిధములుగ సత్కరించెను. అమందానందకలితహృదయుఁడైన అగ్నిద్యోతనుఁడు తనవచ్చినపనియైన ' రుక్మిణీ సందేశము' నువినిపించినపిమ్మట..
ఆ రాౘకన్నియయొక్క సౌందర్యమునువర్ణించెనిట్లు..
1)సీ.
--
పల్లవవైభవాస్పదములుపదములు
   కనకరంభాతిరస్కారులూరు
 ( ల్) అరుణప్రభామనోహరములుకరములు
    కంబుసౌందర్యమంగళము
గళము
మహితభావాభావమధ్యంబుమధ్యంబు
   చక్షురుత్సవదాయి చన్నుదోయి
పరిహసితార్ధేందుపటలంబు నిటలంబు
   జితమత్తమధుకరశ్రేణి వేణి
ఆ.
--
భావజాశుగములప్రాపులుచూపులు
కుసుమశరునివింటకొమలుబొమలు
చిత్తతోషణములు చెలువభాషణములు
జలజనరనముఖముచంద్రసఖము !!! 
--
గోగోపగోపీజనారాధ్యుఁడైన శ్రీ కృష్ణునివరియింపఁదగిన భామామణి..యీ రుక్మిణమ్మ !
అంతే కాక..
ఆవ్విప్రోత్తముఁడు  దేవదేవునితో..

2) ఆయెలనాగనీకుఁదగునంగనకుందగునీవు..మాయుపా
ధ్యాయులయానపెండ్లియగుఁదప్పదు జాప్యములేల.. నీవు..నీ
తోయమువారిఁగూడుకొనితోయరుహాననఁదెత్తుగా..వి
చ్చేయుముశత్రులన్ నుఱుముసేయుముశోభనంబిలన్ ..
--
' నీకునామెతోపరిణయముతప్పకజరుగును..యియ్యది నిశ్చయము.. మాయుపాధ్యాయుల( గురువుల ) యాన .నీవునీవారినియచటకుతోడ్కొనివచ్చియామెనుచేకొనుము..శుభమగును '..యనివిన్నవించెను. పిమ్మట.. పురుషోత్తముఁడైనవాసుదేవుఁడావిప్రవరునితో..

3) కన్నియమీదనాతలఁపుగాఢము కూరుకురాదురేయి..నా
కెన్నఁడు..నావివాహముసహింపకరుక్మితలంచకీడు ..నే
మున్నెయెఱుంగుదున్ బరులమూకలడంచి కుమారిఁదెత్తు..వి
ద్వన్నుత మ్రానుద్రచ్చినవహ్నిశిఖన్ వడిఁదెచ్చుకైవడిన్ ..'
--
అని..మ్రానునందు ఆరణి మథించి అగ్నినిప్రజ్వలింపఁజేయునట్లుగ నేనాకుమారినిఁగొంపోవుదును. ఆకన్నెమీదనామనసు ప్రగాఢముగాలగ్న మయ్యె..రుక్మిప్రయత్నములనువమ్ముచేయుచుశత్రువులనాకయ్యమునందుజయించెదను...
అని మేఘనినదగంభీరస్వరముతోదృఢముగాపలుకుచు తననిర్ణయమునావిద్వన్నుతునకుప్రకటించెను.

' 4) వచ్చెదవిదర్భభూమికిఁ జొచ్చెదభీష్మకునిపురముసురుచిరలీలన్
తెచ్చెదబాలను వ్రేల్మిడి వ్రచ్చెదనడ్డంబురిపులువచ్చినఁబోరన్ ..'తనమనోగతాభిప్రాయమునీవిధముగావ్యక్తీకరించెను..భక్తవశ్యుఁడాతనితో..
ఇట్లుండగా..భైష్మి తనలోతానుబెంగపడఁగసాగెను..అదెటులనఁగా..

5) లగ్నంబెల్లివివాహమున్ గదిసౄనేలారాఁడాగోవిందుఁడు
ద్విగ్నంబయ్యెడిమానసంబు వినెనోవృత్తాంతమున్ బ్రాహ్మణుం
డగ్నిద్యోతనుఁడేటికిన్ దడిసె నాయత్నంబుసిద్ధించెనో..
భగ్నంబైచనునో విరించికృతమెభ్భంగిన్ బ్రవర్తించునో ? 
--
రుక్మిణి తనమనమునందు రేపే..వివాహముహూర్తము..
గోవిందుఁడేమో రాఁడాయెనింకను..
ఆ వెళ్ళిన భూసురుఁడు తనవృత్తాంతమునుచెప్పెనా ?
లేక గోవిందుఁడద్దానినితప్పుగాతలఁచెనా ?
ఇంతకీ..నాపట్ల..బ్రహ్మవిలిఖితంబెట్లున్నదో ..యేమో ???

                   స్వస్తి!!!


మన వృక్షసంపద 

ప్రతీ గ్రామంలో, కాలనీల్లో, వీధుల్లో, పొలాల-కాలవ-చెరువు గట్లపై, రోడ్లకి ఇరువైపులా తప్పనిసరిగా పెంచవలసిన చెట్లు
1.వేప
2.రావి
3.మఱ్ఱి
4.మద్ది
5.కానుగ (గానుగ)
6.ఉసిరి
7.జమ్మి
8.చింత
9. సీమచింత
10. నల్లతుమ్మ, తెల్లతుమ్మ
11. సుబాబుల్
12. అశోక
13. గుల్మొహర్ (తురాయి/ కోడిపుంజు చెట్టు)
14. నేరేడు (జంబూ ఫలం)
15. మారేడు
16.సరుగుడు
17. ఆఫ్రికన్ తులిప్
18. అడవి లవంగ
19. తాడి
20. జువ్వి
21. నీలగిరి (జామాయిల్/యూకలిఫ్టస్)
22. బాదం
23. వెదురు
24. రబ్బరు
25. కొబ్బరి
26. నల్లతుమ్మ
27. తమ్మ
28. వెలగ
29. పున్నాగ
30. పత్తి
31. ఆముదం
32. అవిసె
33.పల్లేరు
34. గుంటగరగర
35. గచ్చకాయ
36. వామింట
37. మొగలి
38. పనస
39. పంపర పనస
40. ఈత
41. గొబ్బి
42. పూచిక
43. గోరింటాకు
44. పొన్న
45. పొగడ
46. ఇండుప కాయ (చిల్లగింజ)
47. ఇప్ప
48. రేల
49. మోదుగ
50.కుంకుడు
51. శీకాయ
52. చందనం (గంధం)

దేవాలయాల్లో తప్పనిసరిగా పెంచవలసిన మొక్కలు (వినాయకచవితికి పత్రిగా ఉపయోగించే 21 రకాల మొక్కలు కనీసం ఆలయాల్లో అయినా పెంచుకోవాలి)
***

వినాయకచవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు.
1. మాచీ పత్రం (మాసుపత్రి)
2. దూర్వా పత్రం (గరిక)
3. అపామార్గ పత్రం(ఉత్తరేణి)
4. బృహతీ పత్రం (నేలములక,వాకుడాకు)
5. దత్తూర పత్రం (ఉమ్మెత్త)
6. తులసీ పత్రం (లక్ష్మీ తులసి, కృష్ణతులసి..)
7. బిల్వ పత్రం (మారేడు)
8. బదరీ పత్రం (రేగు)
9. చూత పత్రం (మామిడి)
10. కరవీర పత్రం (దేవగన్నేరు)
11. మరువక పత్రం (ధవనం,మరువం)
12. శమీ పత్రం (జమ్మి)
13. విష్ణుక్రాంత పత్రం (శంఖుమల్లె పత్రి)
14. సింధువార పత్రం (వావిలి)
15. అశ్వత్థ పత్రం (రావి)
16. దాడిమీ పత్రం (దానిమ్మ)
17. జాజి పత్రం (జాజి ఆకు)
18. అర్జున పత్రం (మద్ది)
19.దేవదారు పత్రం
20. గండలీ పత్రం (లతాదూర్వా,దేవకాంచనం)
21. అర్క పత్రం(జిల్లేడు)

ఇవి కూడా ఆలయాలలో స్థలం ఉంటే పెంచుకోవచ్చు.
1.పారిజాతం
2. మందారం
3. బిళ్ళ గన్నేరు, నిద్రగన్నేరు
4. నూరువరహాలు
5. సంపెంగ
6. ఉసిరి, రాచ ఉసిరి
7.అరటి
8. కొబ్బరి
9. నేరేడు
10. తమలపాకు
11. వేప
12. జామ
13. నిత్యమల్లి
14. రుద్రాక్ష
15. బ్రహ్మకమలం

ఇంటి పెరడులో పెంచుకోగలిగిన మొక్కలు
ఔషధ_మొక్కలు
1. తులసి (రామతులసి, కృష్ణతులసి, లక్ష్మీతులసి, పుదీనాతులసి ఇలా 8 రకాలుగా ఉన్నాయి)
2. కలబంద
3. రణపాల
4. వాము
5. నల్లేరు
6. తిప్పతీగ
7.జిల్లేడు
8. నాగజెముడు
9.అశ్వగంధ
10. నిమ్మగడ్డి
11. తమలపాకు
12. బిర్యానీ ఆకు
13. యాలకులు
14. సునాముఖి (దాల్చిన చెక్క)
15. కరక్కాయ
16. గంజేరు
17. సరస్వతి ఆకు
18.అల్లం,శొంఠి
19. పునర్నవ
20. కరివేపాకు
21. మరువము

పూల_మొక్కలు
1. మల్లెలు ( తీగమల్లి, జడమల్లి, బొండు మల్లి)
2. మందారం
3. కనకాంబరం 
4. బిళ్ళగన్నేరు (పిచ్చి మొక్క అనుకుంటాం కానీ షుగర్ కి బాగా పనిచేస్తుందట)
5. గులాబి 
6. రాధామనోహరం
7.చంద్రకాంత
8.చిలకగన్నేరు
9. నందివర్ధనం
10. నవరత్నాలు
11. నూరువరహాలు
12. బంతి, బంగళాబంతి
13. చామంతి
14. సన్నజాజులు 
15. విరజాజులు
16. సీతమ్మవారిజడబంతి
17. సంపెంగ
18. పూల తీగ మొక్కలు (శంఖు పూలు, మాలతీ,గోకర్ణ, కౌరవ-పాండవ పూలు, పింక్ వైన్ ట్రంపేట్, టెకొమో రాడికన్స్, బోగన్ విల్లా,అల్లామందా క్రీపర్, బటానీ పూలు, రంగూన్ క్రీపర్ మొదలైనవి)
19. తామర,కలువ
20.హెలికోనియా
21. లిల్లీ
22. నాచు/గడ్డి గులాబీ
23. తులిప్
24. ముళ్ళగోరింట
25. నీలమణి(Lavender)
26. మంకెన
27. ప్రొద్దు తిరుగుడు
28. మెక్సికన్ సన్ ఫ్లవర్
29. బ్రహ్మ కమలం
30. డిసెంబరాలు
31. జర్బరా
32. దాలియా
33. డైసీ
34. తులిప్
35. ఆర్కిడ్
36. నైట్ క్వీన్

ఇంట్లో తేలికగా పెంచుకోగలిగిన ఆకుకూరలు, కూరగాయలు
1.తోటకూర
2. బచ్చలికూర
3. పాలకూర
4. మెంతికూర
5. చుక్కకూర, గోంగూర
6. పుదీనా
7. కొత్తిమీర
8. ఉల్లి,వెల్లుల్లి
9. చామ, చిలకడ దుంప
10. టమోట, సీమ టమోట
11. బీన్స్
12. కాకర
13. బీర
14. సొర
15. దోస, బుడందోస
16. కీరాదోస
17. చిక్కుడు
18. వంకాయ
19. పచ్చిమిర్చి
20. మునగ (కనీసం ఈ ఆకులు తినడానికి అయినా పెంచుకోవాలి)
21. వాక్కాయ
22. పొట్లకాయ
33. కాప్సికం
34. గుమ్మడి
35. క్యాబేజీ
36. కాలిఫ్లవర్
37. బఠాణి

పండ్ల మొక్కలు
1. సపోటా
2. సీతాఫలం
3.బొప్పాయి
4. కమల
5. దానిమ్మ
6. నారింజ
7. బత్తాయి
8. పనస
9. పంపర పనస
10. రేగి
11. ఏప్రికాట్
12. అవకాడో
13. నిమ్మ
14. స్వీట్ లెమన్
15. మామిడి
16. నేరేడు
17. జామ
18. ఉసిరి
19. అరటి
20. కొబ్బరి
21. ద్రాక్ష
22. అంజీర

ఇంటి లోపల పెట్టుకునే ఆక్సిజన్ మొక్కలు
1. వీపింగ్‌ ఫిగ్‌ (WeepingFig )
2. మనీప్లాంట్‌ (MoneyPlant )
3. స్పైడర్‌ ప్లాంట్‌ (SpiderPlant)
4. అరెకా ఫామ్‌ ( ArecaPalm)
5. జెర్బారా డైసీ (GerberaDaisy)
6. స్నేక్‌ ప్లాంట్‌ (SnakePlant)
7. పీస్ లిల్లీ (PeaceLily) 
8. కలబంద (Aloevera)
9. చైనీస్ ఎవర్‌గ్రీన్ (ChineseEverGreen)
10. ఆర్కిడేసి (Orchid)
11. బ్రాడ్ లేడీ పామ్ (BroadLeafLadyPalm)
12. డ్రాగన్ (DragonPlant)
13. లక్కీ బ్యాంబూ (LuckyBamboo)
14. తులిప్ (Tulip)
15. ఫెర్న్ (Fern)

తులసి లేని ఇల్లు, వేపలేని వీధి, ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దల మాట. ఈ వర్షాకాలంలో మీకు వీలైనన్ని మొక్కలు, చెట్లు మీ ఇంట్లో, వీధిలో, ఆలయాల్లో నాటండి. ఇంకా మీకు తెలిసిన చెట్ల, మొక్కలు పేర్లు తెలియచేయండి.

1 comment: