Thursday 3 February 2022


 

ఆరోగ్యం బ్రహ్మ..ఆనందం బ్రహ్మ.. ఆధ్యాత్మిక బ్రహ్మ

............అమృత వర్షం..........
     కవిత్వం అంటే  ఆషామాషీ వ్యవహారం కాదు.  అది ఉబుసుపోక దినుసు కాదు.
అది ఎంతో  విలువైనది. అందునా  సంప్రదాయ సిద్ధమైన  పద్య కవిత్వం  మరింత   ప్రశస్తమైనది.  
ఆ పద్య నిర్మాణం కూడ తీరికగా తనకు నచ్చిన రీతిలో తోచిన తీరులో  తనకు ఆహ్లాదంగా  ఉన్నప్పుడు తనంత తానుగా  చేయటం కాదు. ఆశువుగా  వేదిక మీద  అప్పటికప్పుడు చేయటం, తాననుకున్న  భావాలూ  పదాలూ కాక, ఎదుటివారు(పృచ్ఛకులు) కోరిన భావాలతో పదాలతో పద్యం కట్టటం, అన్ని పద్యాలనూ చివరికి ధారణ చేసి అందించటం  సామాన్యమైన విషయం కాదు. 
ఈ ప్రక్రియనే మనం అవధానం అంటున్నాం. తెలుగు భాషకే ప్రత్యేక మైన ఈ విద్య అష్టావధానం నుంచి  శతావధానంగా, సహస్రావధానంగా  వికాసం పొందింది.   ఎంద రెందరో ఈ రంగంలో అఖండ విజయం సాధించిన సన్నివేశాలు చూస్తున్నాం మనం.
అంతే కాదు. 
  
అలా  అవధానం  అటు అవధానికీ ఇటు సదస్యులకూ  కూడ ఆనందామృత వర్షమే.  
ఈ అంశాన్నే అవధాను లందరి పక్షాన  ప్రతినిథిగా  'మహా సహస్రావధాని',  పద్మశ్రీ గరికిపాటి  నరసింహారావు   ప్రసన్న గంభీర శైలిలో  ఒక అవధాన సభలో  ఆశువుగా వెల్లడించారు.  
________________________
శబ్దబ్రహ్మ ముపాస్య దైవము;
   స్వ విశ్వాసంబు పీఠంబు; ని
శ్శబ్దాంత ర్మథనమ్ము  మంత్ర
   మననాచారమ్ముగా; కౌముదీ 
సుబ్దీపంబులె అంధకార దళన
  జ్యోతుల్;   సహస్రార మం 
దబ్దక్రీడ వధాన విద్య యనగా; 
   ఆనందమే బ్రహ్మమౌ.
---------------------------------------
    అవధానం ఆట కాదు. అర్చన.  ఈ అర్చనలో  శబ్ద బ్రహ్మమే  ఉపాస్య దైవం.  అంటే  శబ్దాన్ని పరమాత్మగా దర్శిస్తూ చేసే  ఉపాసన. 
అర్చన చేసే సమయంలో  దేవతామూర్తికి ఒక ఆసనం ఏర్పాటు చేస్తారు.   తన ఆత్మ విశ్వాసమనే ఆసనంపై  శబ్ద బ్రహ్మను ప్రతిష్ఠించి ఉపాసన చేస్తాడు  అవధాని.  
మరి, ఏ మంత్రానుష్ఠానం చేస్తాడు? అంటే  అది పైకి కనిపించదు. వినిపించదు.  నిశ్శబ్దంగా లోలోపలే అంతర్మథనం రూపంలో జరుగుతుంది.  అవధాన అంశాలను అందమైన పద్యాలుగా తీర్చిదిద్దే  ప్రయత్నంలో అవధాని అంతరంగంలో నిశ్శబ్దంగా జరిగే మథనమే మంత్ర మననం. 
  తనలో అంతర్మథనం ఇంతగా జరుగుతున్నా,   చాల మామూలుగా నవ్వుతూ నవ్విస్తూ,  ఆ కవి అవధానం నిర్వహిస్తాడు. అలవోకగా  చిరునవ్వులు చిందిస్తూ  పద్యాలు అందిస్తాడు.  ఇది అంతర్మథనం కనుక, పైకి కనిపించదు.   నిశ్శబ్దంగా జరిగేది  కనుక, బయటికి వినిపించదు.  అవధాని పెదవులపై చిరునవ్వుల పువ్వులనే మనం చూస్తాం. కాని, లోపల జరుగుతున్న యజ్ఞాగ్ని మనకు కనిపించదు.  

ఏ అర్చన చేసినా సంప్రదాయం ప్రకారం  దీపారాధనతోనే కదా! ప్రారంభిస్తాం మనం. 
ఈ అర్చనలో ఏమిటా దీపం? ఒకటేమిటి?  పండితులు ఔనని తలఊపే వ్యాకరణ సమ్మతమైన పదాలే దీపాలు.  "సిద్ధాంత కౌముది" అనే సంస్కృత వ్యాకరణ గ్రంథ అధ్యయన ఫలంగా  స్ఫురించే  పదాలు.  ఆ పదాలను 'సుబంతాలు', 'తిఙంతాలు'
 
అంటారు వ్యాకరణ పరిభాషలో. ఆ దీపపు కాంతిలో  సాగుతుంది అవధాన  శబ్దబ్రహ్మోపాసన. 
ఫలితంగా వెలువడేది వట్టి మాటల కూర్పు అయిన పద్యం మాత్రమే కాదు.  అది అవధాని అనే  ఉపాసకుని సహస్రార కమలంలో కురిసే అమృతవర్షం. అప్పుడు కలిగే ఆనందం  బ్రహ్మానందంతో  సమానమైనది.  తనతో పాటు  సహృదయ సదస్యు లందరికీ ఈ ఆనందాన్ని పంచుతాడు అవధాని. 
====================
అవధానం అంటే శబ్దబ్రహ్మోపాసన అని ఇంత ప్రౌఢ సుందరంగా పలికిన మహా సహస్రావధానికి  ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం?
అశ్వధాటిని మించిన     ఆశుధాటి అతుల చతురోక్తులను మేటి హాస్యపేటి భారతీయత నెలకొన్న భవ్యవాటి ఘటికు డవధాన ఘనపాఠి గరికిపాటి.
అని 
పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారికినిండు మనసుతో అభినందనలూ అభివందనాలూ సమర్పిస్తూ...
       నమస్సులతో....
    మీ  మల్లాప్రగడ  శ్రీమన్నారాయణ మూర్తి.


నేటి రాధాకృష్ణ సరస గీతం 03-02-2023
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ   

రాధానీ కల ఇదిగా -కృష్ణానీ కల ఇదిగా రాధానీ వలపులుగా - కృష్ణా నీ తలపులుగా 
నీ మాయన్ బడితినిగా  దాహమ్మున్ అడిగితిగాఁ నీ కాలమ్ ఇది కథగా   
దేహమ్మున్ వడి వడిగా 
రాధానీ కల ఇదిగా - కృష్ణానీ కల ఇదిగా నీకై కోర్కెలు మదిగా ప్రేమమ్మేగ కథలుగా  నాకై తీర్పుగను మదిగా స్నేహమ్మే గ మనసుగా రాధానీ వలపులుగా - కృష్ణా నీ తలపులుగా లోకమ్మంతయు కనగా జీవంమ్మంతయు కలగా నాకంమ్మంతయు మనగా ప్రేమమ్మంతయు కళగా రాధానీ కల ఇదిగా - కృష్ణానీ కల ఇదిగా ఏకాంతమ్ము న నెలగా శ్రీ కాంచమ్మును వలగా
శ్రీ శాంతమ్ముయు నెలగా  శ్రీ శాంతిత్వము వలగా
రాధానీ వలపులుగా - కృష్ణా నీ తలపులుగా 
ప్రేమాచ్ఛాదక మనగా దేహత్యాగము అనగా 
ప్రోత్యాహమ్ముయు యనగా ఉచ్చాహమ్ము యు అనగా 
రాధానీ కల ఇదిగా - కృష్ణానీ కల ఇదిగా 
రాధానీ వలపులుగా - కృష్ణా నీ తలపులుగా    
కృష్ణానీ కల ఇదిగా - రాధానీ కల ఇదిగా
కృష్ణా నీ తలపులుగా- రాధానీ వలపులుగా
ఆధారం: UU UII IIU
*****
నేటి రాధాకృష్ణ సరస గీతం- ప్రాంజలి ప్రభ
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ
02-02-2022

సానుకూలము ఇదియే
తనువునే సంగ్రహించు కృష్ణా --- 2
సామర్ధ్యము చూపావు లే
నీపై విశ్వాసమంది రాధా --- 2

చలిపులి పిలిచింది చర్మంబు పగిలింది
మంచునే కురిపించి మాటు వేసె రాధా

చల్లగాలి యె పెర్గి చపలచిత్తము ఆయె
మత్తును పెంచియు మమత కోరె కృష్ణా

కలలాయె బత్కు.. కలకాల మేలు.
కిలరావ మయ్యె కీర్తి బతుకే రాధ

విలలాప సేవ.వెలలాగ చిందు. .
వలలాగ జిక్కి వృధ్ధి బతుకే. కృష్ణా

చలిలోన వచ్చాను చక్కని చుక్కను
వెచ్చపర్చు మిపుడే వేగ మల్లె రాధా ---2

కౌగిలి అందించు కరములు బందించు
సౌఖ్యముయే నీకు సుఖము నాకు కృష్ణా ---2

అలకాయె నీవు అలనాడు మాట.
అందుకేది చెప్పి ప్రీతి బతుకే కృష్ణా

జలకాలు ఆడి.జిలికేను మేలు
చలిలాగ వేడు శాంతి బతుకే రాధా

మోదము లేదని మైకము లేదని
వినుము తీరు ఇదియు వింత కాదు కృష్ణా

ఖేదము లేదని భేదము లేదని
అన్నమాట ఇదియు ఆశ కాదు రాధా

గరికపైవొదిగాను విశ్రాంతి తీరు వేళ
మత్తుగావిని పించుము గాన లీల కృష్ణా

అణువణువు నిండిన ప్రణవం ఆత్ర హేళ
నువ్వు అడుగంట ని ప్రమ నమ్మె లీల రాధా

విలలాప సేవ వెలలాగ చిందు.
వలలాగ జిక్కి వృధ్ధి బతుకే కృష్ణా

చలిపులి పిలిచింది చర్మంబు పగిలింది
మంచునే కురిపించి మాటు వేసె రాధా

సానుకూలము ఇదియే
తనువునే సంగ్రహించు కృష్ణా --- 2
సామర్ధ్యము చూపావు లే
నీపై విశ్వాసమంది రాధా --- 2

***** See less
Co
02.01.2022 ప్రాంజలి ప్రభు.. ప్రాతఃకాల సందేశము
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
ఐదవ అధ్యాయము-మూడవ భాగము
ధుంధుకారి ప్రేతత్వమును పొందుట - ఉద్ధరింపబడుట
సూర్యనారాయణ భగవానుడు, ధుంధుకారి ప్రేతత్వ విముక్తికి శ్రీమద్భాగవత సప్తాహ శ్రవణ సాధనవిధానమును గోకర్ణుని అభ్యర్ధనపై ఇంకను ఇట్లు చెప్పుచుండెను- "నాయనా! ప్రయత్న పూర్వకముగ శ్రీమద్భాగవత పారాయణము చేయుము. ఈ సాధనము మిగుల సులువైనదికదా!" అని అందరును ఈ మాటనే చెప్పిరి. కనుక, గోకర్ణుడు కూడ ఇందుకు తగినట్లుగా నిశ్చయించుకొని భాగవతకథను వినిపించుటకుగాను సంసిద్ధుడాయెను.
అంతట పట్టణముల నుండి, పల్లెల నుండి అసంఖ్యాకమగు ప్రజలు కథను వినుట కొరకు తరలి వచ్చిరి.ఇంకనూ చాలమంది కుంటివారు, గ్రుడ్డివారు, ముదుసలివారు, మందమతులు కూడ తమ తమ పాపములను నశింపజేసికొనుటకై అచటికి చేరుకొనిరి. ఈ విధముగా అచటకు చేరిన జనసమ్మర్ధమును గాంచి దేవతలకు కూడ ఆశ్చర్యము కలిగెను. గోకర్ణుడు వ్యాసపీఠమును అలంకరించి, కథను చెప్ఫసాగెను. అప్పుడచటకు ప్రేతరూపమున ఉన్న ధుంధుకారి కూడ చేరుకొనెను. తాను కూర్ఛొనుటకు ఇటునటు స్థలమును వెదుకసాగెను. ఇంతలో నిలువుగా నిలిపినట్టి ఏడు కణుపులు గలిగిన వెదురుకర్రమీద ఆ ప్రేతము దృష్టి నిలిచినది. అప్పుడా ప్రేతము వెదురుకర్ర మొదట్లో అనగా క్రిందనున్న రంధ్రమునందు జొచ్చి ఆ కథను వినుటకై అచట కూర్ఛొనెను. వాయురూపముతో ఉండుటవలన ఆ ప్రేతము బయట ఎక్కడను కుర్చుండలేకపోయెను. అందువలన వెదురు కర్రను ఆశ్రయించెను. గోకర్ణుడు విష్ణుభక్తుడగు బ్రాహ్మణుని ముఖ్యశ్రోతగా నియమించెను. ప్రథమస్కంధము నుండియే స్పష్టమైన కంఠధ్వనితో కథను వినిపించుటను ప్రారంభించెను. సాయంకాలము కథకు విశ్రాంతి నీయబడినది. అప్పుడొక అద్భుతము జరిగినది. సభాసదులందరు చూచుచుండగా ఆ వెదురుకర్రయొక్క మొదటి కణుపు పట-పట శబ్దము చేయుచు పగిలిపోయెను.
ఇదే విధముగ రెండవదినము సాయంత్రము రెండవ కణుపు పగిలి పోయెను. ఇటులే మూడవ దినము అదే సమయమునకు మూడవ కణుపు పగిలిపోయెను. ఇదే రీతిగ ఏడు దినములయందు ఏడు కణుపులు పగిలిపోయెను. పన్నెండు స్కంధములను వినుటచేత ధుంధుకారి వరుసగా ఏడు కణుపులను పగులగొట్టుకొని పవిత్రుడై, ప్రేతత్వమునుండి విముక్తుడాయెను. అంతట అతడు దివ్యరూపమును ధరించి అందరియెదుట నిలచెను. అతని శరీరము మేఘమువలె శ్యామవర్ణముతో నుండెను. అతడు పీతాంబరమును ధరించి, తులసీ మాలలచే శోభిల్లుచుండెను. శిరముపై ధరించిన మనోహరమైన కిరీటము, చెవులయందుగల కమనీయమైన కుండలములు మిలమిల మెరయుచుండెను.
అతడు వెంటనే తన సోదరుడైన గోకర్ణునకు నమస్కరించి అతనితో ఇట్లు పలికెను - సోదరా! నీవు దయతో నాకు ప్రేతత్వపు బాధలనుండి విముక్తిని కలిగించితివి. ప్రేత పీడను నశింపజేయునట్టి శ్రీమద్భాగవతకథ పవిత్రమైనది. శ్రీకృష్ణధామమునకు చేర్చునట్టి ఈ సప్తాహ పారాయణము మిగుల ధన్యమైనది. సప్తాహ శ్రవణము ప్రారంభింపబడినప్పుడు ఈ భాగవతకథ ఇప్పుడే శీఘ్రముగా మమ్ములను అంతమొందించునని సమస్తపాపములు గజగజ వణికి పోవుచుండును. తడిసినవి, ఎండినవి, చిన్నవి, పెద్దవియగు అన్ని రకములైన కట్టెలను నిప్పు కాల్చివేయును. అటులే ఈ సప్తాహశ్రవణము మనస్సుద్వారా, మాటలద్వారా, కర్మలద్వారా చేయబడిన అన్నివిధములైన పాపములను భస్మమొనర్చును. 
ఈ భారతదేశమందు శ్రీమద్భాగవతకథను ప్రతివాడు  వినవలయును. ఒకవేళ విననిచో, వాని జన్మము వ్యర్థమైనదేనని పండితులు, దేవతలు ఆ సభయందు ప్రకటించిరి. ఈ దేహము అనిత్యమైనది. దీనిపై మోహమును పెంచుకొనెదరు. దీనిని బాగుగా లాలించి, పోషించి, హృష్ట-పృష్టముగా, బలముగా తయారుచేయుట మంచిదే. కాని, శ్రీమద్భాగవతకథను శ్రవణము చేయకుండా ఏమి చేసిననూ, ఈ శరీరమువలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. అట్టి మనిషి జన్మము నిష్ఫలము. ఎముకలే ఈ శరీరమునకు ఆధారమైన స్తంభములు. రక్తనాళములు, నాడులు అను త్రాళ్ళచే ఇది బంధింపబడినది. వీటిపైనుండి రక్తము, మాంసములతో పైపూతగా నింపబడినది. ఆ పైన ఇది అంతయు చర్మముచే కప్పబడినది. ఇది పూర్తిగా దుర్గంధపూరితము. అంతేగాదు, మలమూత్రములతో కూడిన భాండము.
ఈ శరీరము వృద్ధాప్యముచేత దుర్గతినొందును. దుఃఖముచేత బాధింపబడును. ఇది రోగములకు పుట్టినిల్లు. ఎల్లకాలము ఏదో ఒక కోరికచే పీడింపబడుచుండును. దీనికెప్పటికి తృప్తి కలుగదు. ఈ శరీరమును ధరించియుండుట కూడా ఒక భారమే అగును. దీని రోమరోమమునందు దోషములే నిండియున్నవి. ఇకపోతే, ఇది కేవలము క్షణభంగురమైనది. క్షణములో ఇది మటుమాయమగును. అంత్యకాలమునందు దీనిని పాతిపెట్టినచో, ఇది క్రిములుగా మారును. ఏదేని పశువు భక్షించినచో, ఇది మలముగా మారిపోవును, అగ్మియందు కాల్చినచో, బూడిదకుప్పగా మార్పు చెందును. ఇట్టి మూడువిధములగు గుర్తులచేత శరీరముయొక్క స్థితి, గతులను గూర్చి స్పష్టముగా పేర్కొనబడినది. ఇంతటి అస్థిరమైన శరీరముద్వారా మానవులు శాశ్వతమైన ఫలమును ఒసగునట్టి ఉత్తమకార్యములను ఏల ఆచరింపకుందురోకదా? ఉదయము వండిన అన్నము సాయంత్రమునకు చెడిపోవును. అట్టి అన్నరసముతో పోషింపబడిన శరీరము శాశ్వతమెట్లగును?
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ,  ఆశుకవితాధురీణ
 6281190539
*****
*ఇది ఇది చదివిన తర్వాత దాచుకో కుండా, పంచుకోకుండా ఉండలేను😊🙏 
*వేటూరి విశ్వరూపం* 
ఈరోజు వేటూరి గారి జయంతి సందర్భంగా మనకోసం.....!
నీ సొగసు చూడ తరమా? ’-
                               ఐదో చరణం కధ  -

                             మేం 'మిస్టర్ పెళ్ళాం' ఫీచర్ ఫిలిం తీస్తున్న రోజులు. అది 14,డిశెంబరు 1992, మార్గశిర సోమవారం, ప్రఖ్యాత గేయ రచయిత శ్రీ వేటూరి సుందరరామ్మూర్తిగారు అయ్యప్ప దీక్షలో, హైదరాబాదులో ఉన్నారు. నిర్మాణ సారధ్యం పూర్తిగా చేస్తున్న నేనేమో చెన్నైలో బాపుగారి దగ్గర వున్నా. మా సినిమాలో, ఓ సందర్భంలో, హీరోయిన్ని ఆటపట్టిస్తూ, హీరో చిలిపిగా పొగిడే ఓ పాటని, త్యాగరాజ కృతి "నీ సొగసు చూడ తరమా .." అనే పదాలను అనుపల్లవిగా పొదుగుతూ అందించడానికి ప్రయత్నించమని, ప్రముఖ గేయ రచయిత శ్రీ వేటూరిగారికి బాపూగారు సూచించారు. 

               అలా అడిగిన మర్నాడే ఆ పాటకి అద్భుతమైన ఓ నాలుగు చరణాలను వేటూరిగారు మాకు అందించారు. ఐతే ఐదో చరణాన్ని మాత్రం మరో మూడు రోజుల్లో అందిస్తానన్నారు. కానీ అలా జరగలేదు.  కానీ, అప్పటికే ఆ మొదటి నాలుగు చరణాలకి అద్వితీయ సంగీత దర్శకుడు శ్రీ యం.యం. కీరవాణిగారు మధురమైన ఓ ట్యూన్ కట్టేసి, రికార్డింగ్ కి సిద్ధమైపోయారు. 

                      Dec-18 తారీకున A-VMG స్టూడియోలో రికార్డింగ్ కాల్షీట్ కూడా కంఫర్మ్ చేసేసాను.  ఆ ఐదో చరణం మాత్రం ఇంకా అందకపోడంతో, నాకు కంగారు మొదలై హైదరాబాదుకి ఫోన్ చేసి, వేటూరిగారిని  కాంటాక్ట్ చేస్తే, తాను అదే మధ్యాన్నం ఫ్లయిట్ లో వస్తున్నాననీ, 3 గంటలకల్లా, చెన్నైలో దిగిన వెంటనే, డైరెక్ట్ గా AVM-Gకి వచ్చి, స్వయంగా తన ఐదో చరణాన్ని నాకు అందించడం ఖాయమని భరోసా ఇచ్చేశారు. వెంటనే బాపూగారికి ఆ విషయం చెప్పేశాను. దాంతో ఆయన, అంతకు ముందనుకున్నట్టు  కాల్షీటుని కాన్సిల్ చెయ్యకుండా రికార్డింగ్ స్టూడియోకి 2.30 pm కల్లా చేరుకున్నారు.

                        అప్పటికే మన బాలూగారు అక్కడికి వచ్చేసి, పాట రిహార్సల్స్ లో మునిగిపోడం మాకు కనిపించింది. బాపూగారు నావేపు చూసి, ఓసారి తన అరచేతిని నాకు చూపించారు. ఆ ఐదో చరణం సంగతేంటన్నది ఆయన ఉద్దేశమే ఐనా, అది నా చెంప ఛెళ్ళుమనిపించే ఓ లుక్ లా నాకనిపించి, బయటికి పారిపోయాను. మరో 20 నిమిషాల్లో, అయ్యప్ప దీక్ష దుస్తుల్లో వున్న వేటూరిగారు AVM_G కి చేరిపోయి నాకు ఓ టెన్షన్ తగ్గించి, మరో టెన్షన్లో పడేసారు.
 తన ఐదో చరణాన్ని ఇంకా రాయలేదన్నారు.

                     కాసేపట్లో రాసేసి, ఇచ్చేస్తానంటూ,  ఆరుబయట వున్న సిమెంట్ సోఫాలో కూర్చొని,నన్ను తన పక్కనే కూర్చోమంటూ, రాయడం మొదలెట్టారు. ఒక్కసారి తానొచ్చిన సంగతి బాపుగారికి చెప్పొస్తానంటే, ముందుకాదని, సరేనన్నారు. భయం భయంగా లోపలికెళ్ళిన నన్ను బాపూగారు ,"ఇప్పుడేంటీ కధా ?" అన్నట్టు చూడ్డంతో, "వేటూరిగారొచ్చేసి ఐదో చరణం రాస్తున్నా"రని చెప్పా.

                        "ఈసారి చరణాన్ని పంపించండి..చాలు !" అని తన ఫైల్ వేపు తల తిప్పుకున్నారు. మీకు తెలుసుగా... that is Bapu. ఐతే , ఆ ఐదో చరణం అంత సాధారణంగా పుట్టలేదు. దాదాపు ఓ చిన్న సైజు సాగర మథనం జరిగింది. అదెలాగంటే..
అదెలాగంటే..

                                నేను బాపుగారిని కలిసి తిరిగి రాగానే వేటూరిగారు ఐదో చరణాన్ని రాసి, పక్కన పెట్టేసి, ఇంకేదో రాస్తూ కనబడ్డారు. చిన్న సైగతో ఆయన అనుమతి తీసుకొని, ఆయన పక్కన పడేసిన కాయితాన్నందుకొని, ఆ ఐదో చరణాన్ని చదివాను:
 ' ఇల్లాలుగ అల్లాడిన ఆ రోజులలో, సఖికీ సుఖమే మిగిలిందిలే,    ఆఫీసుకి వెళ్ళొచ్చే ఈ రోజులలో, పతికీ బ్రతుకే తెలిసిందిలే,   చిగురాకులే సడి చేసినా, చిలకమ్మ వచ్చిందని,    ఎదతోడుగా ఎదురేగినా, నిదరొచ్చి వాలిందనీ,    త్యాగరాజ కృతిలో  సీతాకృతిగల ఇటువంటి
    సొగసు చూడ తరమా '

                                అది చదివిన నాకు, అమ్మో, అంతుందా! అనిపించింది. ఆనందం పట్టలేక ఒక్క గెంతేయాలనిపించింది. ఆ ఐదో చరణాన్ని తీసుకొని బాపూగారి దగ్గరికి లంఘించబోయాను. 
వెంటనే వేటూరిగారు నా చొక్కాపట్టుకొని వెనక్కిలాగి, నన్నక్కడే కూర్చోమన్నట్టు సైగచేసారు. అలా ఎందుకో నా కర్ఢం కాలేదు. నేనలా కూర్చోగానే, నా చేతిలోవున్న కాయితాన్ని లాగేసి, నలిపేసి, ఉండచుట్టి వెనక్కి పడేసారు. తను ఫ్రెష్ గా రాసిన మరో వెర్షన్ నా చేతికిచ్చి, మళ్ళీ రాసుకోడంలో మునిగిపోయారు. ఆ రెండో వెర్షన్ ఎలా సాగిందంటే….

' తెలి చీరల మరుమల్లెల ముస్తాబులలో, క్షణమే యుగమై గడిచేనులే,
 కడకొంగున తలవాల్చిన నారీమణికి, కనులా కలలే మిగిలేనులే,
 ఒకనాటి ఎడబాటులో, ఒరిగిందిలే వనితామణి,
వొడిదీపమే కొడిగట్టగా,కరిగింది కాంతామణీ..
                          "ఆహా, ఎంతద్భుతంగా వుందో  - లోపలికి తీసుకెళ్ళనాండీ ?"   అనడిగిన నావేపు  చిరు కోపంతో చూసి,   దాన్ని కూడా వెనక్కి లాక్కొని,  ఉండ చుట్టి వెనక్కి పారేసారాయన. నాకేమీ అర్ధం కాలేదు.

 ఓ చిర్నవ్వు నవ్వి, మళ్ళి రాయడంలో ఒదిగిపోయి,  మరో వెర్షన్ మరింత అద్భుతంగా సృష్టించి నాకు చూపించారు. దాని తీరెట్లు కొనసాగిందనగా...
' కౌగిళ్ళకు కట్నాలుగ దాచిన పరువం, కన్నీటికి కరిగిందొక కాటుక రేఖై,  వస్తాడని ముస్తాబులు చేసిన అందం, ఈనాటికి   మిగిలిందొక రాలిన పూవై,   పసిగాలిలో పతి ఊసులే వినిపించె విధి ఆటలో,    కడకొంగునే పడకిల్లుగా  గడిపింది ఎడబాటులో,  త్యాగరాజ కృతిలో సీతాకృతిగల ఇటువంటి  సొగసు చూడ తరమా...'
                                 
ఈ చరణం చూసిన నాకు, ఓ క్షణం గురువుగారి మనోవేదన పట్ల ధ్యాస పెరిగి,   ఆలోచనలో పడ్డాను. ‘అసలీయన ఏం చెప్పదల్చుకున్నారు, ఎందుకిలా మథన పడుతున్నారు…’ అనుకుంటూ పైకి చూస్తుండగా, దాన్ని కూడా ఆయన వెనక్కి లాగేసి, ఉండచుట్టి వెనక్కి పడేశారు.
 ‘మరో వెర్షన్ రాస్తాను, అలా కూర్చో’ అన్నట్టు నాకు సైగ చేసారు.

అవతల, పాట రికార్డింగ్ మొదలైందని, బాపుగారు ఐదో చరణం కోసం ఎదురు చూస్తున్నారనీ ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి రహస్యంగా నాకు చెప్పి వెళ్ళిపోయాడు. నా గుండెల్లో బాంబు పేలినట్టవడం వేటూరి వారు గమనించారు. అంతే, వెంటనే ఆయన స్పీడందుకొని, మరో కొత్త చరణం రాసి నా చేతిలో పెట్టేసారు. అదెలా నర్తించిందనగా...

'రామలాలికి లేచిన పసిప్రాయం బరువై, రామపాదమే సోకని శిలకన్నా బరువై, రాముడికోసం కన్నుల ప్రాణాలే కొలువై, రామచిలక ముక్కుపుడక ముద్దులు కరువై, మల్లెపూలు నలుపన్నది మాపటి విరహం, వెన్నెలైన వేడన్నది మంచపు నరకం, పతిరాకకు ఎదురుచూపు పడతుల పరువం, నిట్టూర్పుకు పుట్టినిల్లు కదలని నిమిషం, త్యాగరాజ కృతిలో సీతాకృతిగల ఇటువంటి సొగసు చూడ తరమా...'

" ఇదెలావుంది, నిర్మొహమాటంగా చెప్పండి !" అంటూ స్వామి దాదాపు నన్ను శాసించారు. నిజం చెప్పొద్దూ, నాకెందుకో కొంచెం ఎక్కువైందనిపించి, నోరుజారి, ఆ మాటే ఆయనతో అన్నా. అంతే, ఠక్కున ఆ కాయితం కూడా లాగేసి, నలిపేసి, వెనక్కి పారేసారు. తమ ఐదో వెర్షన్ కి శ్రీకారం చుట్టారు. అంతలో మా రమణగారు స్టూడియోకి వచ్చి, కారు దిగి, మా దగ్గరికి రావడం, వేటూరిగారు తమ ఐదో చరణపు ఐదో వెర్షన్ ఆయనకి చూపడం, దాన్ని చూసిన రమణగారు 'అత్యద్భుతం మహప్రభో !' అంటూ ఓకే చెయ్యడం, నా మనసు కుదుటబడ్డం, అన్నీ ఒకే క్షణంలో జరిగిపోయాయి.
 ఇపుడా ఐదో వెర్షన్ ఎలా మెరిసిందనగా....

"సిరిమల్లెలు హరినీలపు జడలో తురిమి,  క్షణమే యుగమై, వేచీ వేచీ,  చలిపొంగులు చెలికోకల ముడిలో అదిమీ,  అలసీ, సొలసీ, కన్నులువాచీ, నిట్టూర్పులో, నిశిరాత్రిలో, నిదరోవు అందాలతో,
 త్యాగరాజ కృతిలో సీతాకృతిగల ఇటువంటి నీ సొగసు చూడ తరమా !"
        - అంతే,   దాన్ని తీసుకొని వాళ్ళిద్దరూ లోపలికెళ్ళగానే, నేను కాసేపాగి, వెనక్కి పారేయబడ్డ కాయితం ఉండలన్నీ ఏరుకొని, కళ్ళకద్దుకొని దాచుకున్నాను. (అందువల్లే ఇవాళ ఈ మధురాను భూతిని మీతో పంచుకోడం సాధ్యపడింది.) ఆ తర్వాత, మరో గంటలో శ్రీ బాలుగారి గళాన, ఖరహరప్రియ రాగంలో, మధురగాన సురభి శ్రీ యం.యం.కీరవాణిగారు స్వరపరచిన బాణీలో, ఆ ఐదో చరణం అత్యద్భుతంగా ప్రాణం పోసుకొంది. అది వింటుండగా నా కళ్ళవెంట జల జలా ఆనందాశ్రువులు రాలడం గమనించిన బాపూగారు, నన్ను కౌగలించుకొని ఉపశమింపజేసారు. వారందరి సమక్షంలో శ్రీ వేటూరి స్వామికి పాదాభివందనం చేసాక గానీ నా ఆవేదన చల్లారలేదు.
 ఓ సానబట్టిన వజ్రం లాంటి పాట పుట్టుక వెనక ఎంత మేథా మథనం జరుగుతుందో ఉటంకించడానికి, ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ దొరకడం అసాధ్యమేమో. 
That is VETURI . 
 ఆయనకి రజత కమలం రాడంలో ఆశ్చర్యమేముంది. అంతటి మహానుభావుణ్ణీ మన తెలుగువాడిగా పొందగలగడం మనమంతా చేసుకున్న అరుదైన అమూల్య అదృష్టం. కాదనగలరా?
 పాటల సిద్ధాంతి "వేటూరి" జయంతి!! గీత గీస్తే ప్రాణం పోసినట్టుండాలి!
గీతం రాస్తే పువ్వు పూసినట్టుండాలి! ఇది తిరుగు లేని సత్యం ఇందుకు "వేటూరే" సాక్ష్యం!
వేదనల్ని నేలలో నాటితే వెదురు పొదలై ప్రభవించాయి! వెదురు పొదల్ని ఊపిరితో మీటితే
వేటూరి పాటలై ప్రవహించాయి!!
ఆయన అక్షర తూణీరంలో... 'ఓంకార నాదానుసంధానమౌ గానా'లే కాదు 'ఓలమ్మీ తిక్కరేగిందా'లూ ఉంటాయి! 'రాలిపోయే పువ్వు'లే కాదు 'రగులుతోంది మొగలిపొద'లూ ఉంటాయి!

'ఆరేసుకోబోయి పారేసుకున్న'
అందం చందం ఊహకందాక 
ఓహో 'కందం' అనుకున్నాం!
రాలుపూల రాగపరాగాన్ని 
పాటగా మలచి, పాటను పక్షిని చేసి 
వాగర్ధాల రెక్కలు తొడిగిన
వాఙ్మయ సిద్దార్థుడు ఆయన!!
తెలుగు నుడికారం అలంకారమై 
పదపదాన మెరిసి ప్రేక్షకజన రంజకమై
ఆయన పాటల గుడికి ప్రాకారమైంది!
తెలుగు జాతీయం ఓంకారమై
ఆ కలాన ఒదిగి జాతీయపురస్కారమై
సినీ గేయ విజయానికి శ్రీకారం చుట్టింది!!
ప్రపంచ పర్యాటక స్థలాల్ని చూడడం టూరిజం!
ప్రపంచాన్ని పాటల్లో పట్టి చూపడం "వేటూరిజం"!!
.........ప్రాంజలి ప్రభ

***

No comments:

Post a Comment