Sunday 6 February 2022

ఆరోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం


_____(((((())))))_____
ప్రాంజలి ప్రభ
 

🍀. రథ సప్తమి లేదా అచల సప్తమి,  సూర్య జయంతి, నర్మదా జయంతి శుభాకాంక్షలు 🍀

నేటి సూక్తి : నీ అసలు స్వరూపం మీద నిరంతరం దృష్టి సారించు. అది నిన్ను మాయ నుండి విముక్తుడిని చేస్తుంది. 

రధసప్తమి, సూర్య జయంతి, నర్మదా జయంతి శుభాకాంక్షలు మరియు శుభ మంగళ వారం మిత్రులందరికీ ఇందు వాసరే,  08, ఫిబ్రవరి 2022 మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

 రథ సప్తమి శ్లోకాః 

. అర్కపత్ర స్నాన శ్లోకాః |
1. సప్తసప్తిప్రియే దేవి సప్తలోకైకదీపికే |
సప్తజన్మార్జితం పాపం హర సప్తమి సత్వరమ్

2. యన్మయాత్ర కృతం పాపం పూర్వం సప్తసు జన్మసు |
తత్సర్వం శోకమోహౌ చ మాకరీ హంతు సప్తమీ

3. నమామి సప్తమీం దేవీం సర్వపాపప్రణాశినీమ్ |
సప్తార్కపత్రస్నానేన మమ పాపం వ్యాపోహతు

. అర్ఘ్య శ్లోకం |
సప్త సప్తి వహప్రీత సప్తలోక ప్రదీపన |
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర

 నర్మదా దేవి స్తోత్రం

శ్రీ నర్మదే సకల-దుఃఖహరే పవిత్రే
ఈశాన-నన్దిని కృపాకరి దేవి ధన్యే ।
రేవే గిరీన్ద్ర-తనయాతనయే వదాన్యే
ధర్మానురాగ-రసికే సతతం నమస్తే ॥

పండుగలు మరియు పర్వదినాలు :
రథ సప్తమి లేదా అచల సప్తమి, సూర్య జయంతి, నర్మదా జయంతి

 రథ సప్తమి - సూర్య ఆరాధన విధానం.. 

రథ సప్తమి రోజున ఉదయం అర్కపత్ర స్నాన శ్లోకం పఠిస్తూ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి  అర్ఘ్య శ్లోకంతో  సూర్య భగవానునికి నీటిని సమర్పించండి. తరువాత ఓం సూర్య దేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ధూపం లేదా ధూపద్రవ్యాలను కాల్చండి. సూర్య కిరణాలలో ఆవుపాలతో చేసిన పరమాన్నాన్ని నివేదన చేయండి.

దీని తర్వాత  శ్రీ సూర్య స్తుతిని పఠించడం లేదా సూర్య చాలీసాను పఠించండి. ఆ తర్వాత ఆవు నెయ్యి దీపంతో సూర్య భగవానుని హారతినివ్వండి. సూర్య పూజ సమయంలో ప్రత్యేక కార్యాల సాధన కోసం మీరు ఇతర సూర్య మంత్రాలను కూడా జపించవచ్చు. పూజానంతరం గోధుమలు, బెల్లం, పప్పు మొదలైన వాటిని దానం చేయడం మంచిది.
*****
🌞. శ్రీ సూర్య స్తుతి 🌞

1. నమః సూర్యస్వరూపాయ ప్రకాశాత్మస్వరూపిణే |
భాస్కరాయ నమస్తుభ్యం తథా దినకృతే నమః 

2. శర్వరీహేతవే చైవ సంధ్యాజ్యోత్స్నాకృతే నమః |
త్వం సర్వమేతద్భగవన్ జగదుద్భ్రమతా త్వయా 

3. భ్రమత్యావిద్ధమఖిలం బ్రహ్మాండం సచరాచరమ్ |
త్వదంశుభిరిదం స్పృష్టం సర్వం సంజాయతే శుచి 

4. క్రియతే త్వత్కరైః స్పర్శాజ్జలాదీనాం పవిత్రతా |
హోమదానాదికో ధర్మో నోపకారాయ జాయతే 

5. జ్ఞానైకధామభూతాయ నిర్ధూతతమసే నమః |
శుద్ధజ్యోతిస్స్వరూపాయ విశుద్ధాయామలాత్మనే 

6. వరిష్ఠాయ వరేణ్యాయ పరస్మై పరమాత్మనే |
నమోఽఖిలజగద్వ్యాపిస్వరూపాయాత్మమూర్తయే 

7. తావద్యావన్న సంయోగి జగదేతత్ త్వదంశుభిః |
ఋచస్తే సకలా హ్యేతా యజూంష్యేతాని చాన్యతః 

8. సకలాని చ సామాని నిపతంతి త్వదడ్గతః |
ఋఙ్మయస్త్వం జగన్నాథ త్వమేవ చ యజుర్మయః 

9. యతః సామమయశ్చైవ తతో నాథ త్రయీమయః |
త్వమేవ బ్రహ్మణో రూపం పరంచాపరమేవ చ 

10. మూర్తామూర్తస్తథా సూక్ష్మః స్థూలరూపస్తథా స్థితః |
నిమేషకాష్ఠాదిమయః కాలరూపః క్షయాత్మకః |
ప్రసీద స్వేచ్ఛయా రూపం స్వతేజః శమనం కురు 

11. ఇదం స్తోత్రవరం రమ్యం శ్రోతవ్యం శ్రద్ధయా నరైః |
శిష్యో భూత్వా సమాధిస్థో దత్త్వా దేయం గురోరపి 

12. న శూన్యభూతైః శ్రోతవ్యమేతత్తు సఫలం భవేత్ |
సర్వకారణభూతాయ నిష్ఠాయై జ్ఞానచేతసామ్ 

ఇతి శ్రీమార్కండేయపురాణే సూర్యస్తుతిః ||
🌹 🌹 🌹 🌹 🌹

💧. శ్రీ నర్మదాష్టకము 💧

1. శ్రీ నర్మదే సకల-దుఃఖహరే పవిత్రే
ఈశాన-నన్దిని కృపాకరి దేవి ధన్యే ।
రేవే గిరీన్ద్ర-తనయాతనయే వదాన్యే
ధర్మానురాగ-రసికే సతతం నమస్తే ॥ ౧॥

2. విన్ధ్యాద్రిమేకలసుతే విదితప్రభావే
శాన్తే ప్రశాన్తజన-సేవితపాదపద్మే ।
భక్తార్తిహారిణి మనోహర-దివ్యధారే
సోమోద్భవే మయి నిధేహి కృపాకటాక్షమ్ ॥ ౨॥

3. ఆమేకలాదపర-సిన్ధు-తరఙ్గమాలా
యావద్ బృహద్ -విమల -వారి-విశాలధారా ।
సర్వత్ర ధార్మికజనాఽఽప్లుతతీర్థదేశా
శ్రీనర్మదా దిశతు మే నిజభక్తిమీశా ॥ ౩॥

4. సర్వాః శిలా యదనుషఙ్గమవాప్య లోలా
విశ్వేశరూపమధిగమ్య చమత్కృతాఙ్గాః ।
పూజ్యా భవన్తి జగతాం స-సురాఽసురాణాం
తస్యై నమోఽస్తు సతతం గిరిశాఙ్గజాయై ॥ ౪॥

5. యస్యాస్తటీముభయతః కృతసన్నివేశా
దేశాః సమీర-జలబిన్దు-కృతాభిషేకాః ।
సోత్కణ్ఠ-దేవగణ-వర్ణితపుణ్యమాలాః
శ్రీభారతస్య గుణగౌరవముద్గృణన్తి ॥ ౫॥

6. స్వాస్థ్యాయ సర్వవిధయే ధన-ధాన్య-సిధ్యై
వృద్ధిప్రభావనిధయే జనజాగరాయై ।
దివ్యావబోధవిభవాయ మహేశ్వరాయై
భూయో నమోఽస్తు వరమఞ్జులమఙ్గలాయై ॥ ౬॥

7. కల్యాణ-మఙ్గల-సముజ్జ్వల-మఞ్జులాయై
పీయూషసార-సరసీరుహ-రాజహంస్యై ।
మన్దాకినీ-కనక-నీరజ-పూజితాయై
స్తోత్రార్చనాన్యమర-కణ్టక-కన్యకాయై ॥ ౭॥

8. శ్యామాం ముగ్ధసుధా-మయూరవదనాం రత్నోజ్జవలాలఙ్కృతిం
రామాం ఫుల్ల-సహస్రపత్రనయనాం హాసోల్లసన్తీం శివామ్ ।
వామాం బాహువిశాల-వల్లివలయా-లోలాఙ్గులీపల్లవాం
లాలిత్యోల్లసితాలకావలికలాం శ్రీనర్మదాం భావయే ॥ ౮॥

9. శ్రీనర్మదాఙ్ఘ్రి-సరసీరుహ-రాజహంసీ
స్తోత్రాష్టకావలిరియం కలగీతవంశీ ।
సంవాద్యతేఽనుదినమేకసమాం భజద్భి-
ర్యైస్తే భవన్తి జగదమ్బికయాఽనుకమ్ప్యాః ॥ ౯॥

10. కాశీపీఠాధినాథేన శఙ్కరాచార్యభిక్షుణా ।
కృతా మహేశ్వరానన్ద-స్వామినాఽఽస్తాం సతాం ముదే ॥ ౧౦॥

ఇతి కాశీపీఠాధీశ్వర-జగద్గురు-శఙ్కరాచార్య-స్వామి-
శ్రీమహేశ్వరానన్ద-సరస్వతీ-విరచితం నర్మదాష్టకం సమ్పూర్ణమ్ ।
🌹 🌹 🌹 🌹 🌹



శ్రీశుకుడు నుడివెను - బ్రహ్మదేవుడు సృష్టికార్యమును ప్రారంభించుటకు ముందుగా ఇంతకుముందు పేర్కొనిన రీతిగా ధారణద్వారా భగవంతుని ఆరాధించి ఆ  ప్రభువును సంతుష్టుని గావించెను. ఫలితముగా ఆయనకు అమోఘమైన దృష్టి ప్రాప్తించెను. నశించిన పూర్వకల్పస్మృతి జ్ఞప్తికి వచ్చెను. బుద్ధియందు పరమాత్మజ్ఞానము అంకురించెను. ప్రళయమునకు పూర్వము విశ్వనిర్మాణము ఎట్లుండెనో అదేవిధముగా మరల అతడు జగత్తును సృష్టించెను. 

శబ్దములద్వారానే వస్తువులయొక్క పరిజ్ఞానము కలుగును. కనుక, శబ్దములద్వారానే వాటిని స్మరించుటకు వీలగును. ఈ విధముగా శబ్దబ్రహ్మయే (వేదములే) విశ్వమంతయును వ్యాపించి యుండును. కాని, మానవుడు అర్థరహితమైన విషయచింతన చేయుటవలన అతని బుద్ధి మాయమయి పదార్థమలయందు భ్రమించుచుండును. స్వప్నద్రష్టవలె అతని మనస్సు వాస్తవతత్త్వమును గ్రహింపజాలదు. ఏలయన, ప్రపంచము నందలి వస్తువులు అన్నియును మాయామయములే. అవిసత్యములు కావు. అట్టి స్థితిలో జీవులు సంసారమునందే (జననమరణ చక్రమునందే)పరిభ్రమించుచుందురు.

అందువలన విద్వాంసుడు ప్రపంచములోని వస్తువుల గురుంచి తనకు అవసరమైనంత మాత్రమే ఆలోచింపవలెను. ఈ విషయమున అతడు పూర్తిగా జాగరూకుడై యుండవలెను. పరమపదమునకు మాయయె (మోహమే) విఘ్నకారకమని నిశ్చయాత్మక బుద్ధితో ఎరుగవలెను. కావున,అట్టివిషయములలో  చిక్కుకొనరాదు. ఎట్టి ప్రయత్నము లేకుండగనే ప్రారబ్దవశముస పదార్థములు వాటంతట అవియే లభించినచో, ఇతర పదార్ధముల కొరకై  పరిశ్రమించుట వ్యర్థమే.


నేలపై పరుండుటవలననే హాయిగా ఉన్నప్పుడు మంచము కొరకు ఏలప్రయత్నింపవలెను?భగవత్కృప వలన దృఢమైన భుజములుండగా దిండుయొక్క అవసరము ఏమి? నీరుత్రాగుటకు దోసిలియున్నప్పుడు వివిధములగు పాత్రలకై ప్రయత్నింపనేల? వల్కలలములను ధరించుట వలన గాని,దిగంబరముగా ఉండుట వలన గాని అనుకూలముగా ఉన్నప్పుడు అమూల్యములగు వస్త్రములకై తాపత్రయపడుట ఎందులకు? 

ధరించుటకు సాధారణమైన వస్త్రములు చాలుగదా! మానవుల ఆకలిని తీర్చుటకు ఫలవృక్షములు ఉన్నవిగదా! సమృద్ధిగా జలముగల జీవనదులు మన దాహముసు తీర్చుట వలన అవి ఎండి పోవుట లేదుగదా! పర్వతగుహలు నివాసస్థానములు ఉపయుక్తములు కావా? శరణాగతులను రక్షింఛు భగవత్కృప సులభముగా ఉన్నప్పుడు పండితులు ధనమదాంధులను సేవించుట ఎందులకు? 

భగవంతుడు మన హృదయాకాశములోనే విలసిల్లుచున్నాడు. అతడే ప్రియతముడైన అంతరాత్మ. ఎల్లరకును అతడే ప్రాప్యుడు. అట్టి అనంతుడైన భగవంతుడు మన అంతఃకరణమునందే ఉన్నాడని బుద్ధిద్వారా నిశ్చయించుకొని, అతనిని అనన్యభక్తితో సేవించుచుండవలెను. అప్పుడు ఈ సాంసారిక వాసనలు అన్నియును దూరమై మనము పరమానందమగ్నుల మగుదుము.

సంసారరూపమైన వైతరణిలో పడి దుఃఖపరంపరలో కొట్టుమిట్టాడుచున్న జీవుల దురవస్థను మనము చూచుచునే యున్నాము. వారికి క్షణకాలమైనను మనశ్శాంతి లభించుట లేదు. కానీ, వారు తమ హృదయములలోనే విరాజమానుడైన పరమానంద స్వరూపుడగు భగవంతుని పట్టించుకొనుటలేదు. ఇది మిక్కిలి ఆశ్చర్యకరము. వారు భగవచ్చింతనను మాని విషయభోగములయందే మునిగి అజ్ఞానులవలె తమ జీవితములను వ్యర్థముగా గడుపుచున్నారు. 
ఇంకావుంది -- శ్రీ కృష్ణార్పణం 
*****

లగ్ జా గలే..... :'( లతామంగేష్ 06-02-2022  మరణం 

ఏదో ఒక సాయంత్రాన అట్లా నిల్చుంటాను వొకింత మనసుబాగాలేని తనంతోనో, కాస్త వొంటరితనాన్ని కోరుకునో కానీ... లతా తోడులేని వొంటరితనమేమిటీ? ఒక మెత్తని స్వరం అట్లా గుండెని కోస్తూ లోలోపలికి దిగబడకుంటే ఆనాటి సాయంత్రమో, నిశ్శబ్దంగా ఉన్న అర్థరాత్రో ఏం సాధించటానికి గడిచినట్టు? 

          "సావన్ కా మహీనా పవన్ కరె సోర్... ముఖేష్ చెబుతాడు "పవన్ కరే షోర్" లతా పాడుతుంది. ముఖేష్ విసుక్కుంటూ "షోర్ కాదు సోర్..సోర్" అంటాడు లతా సరిచేసుకుంటుంది అయితే.... నాకైతే సోర్ అన్నా షోర్ అన్నా తేడా ఏముందీ!? లతా స్వరాన్నుంచి జారిపడే ఒక్క అక్షరం చాలదూ రాగమైపోవటానికి, ఒక్క నిట్టూర్పు చాలదూ ఒక్కసారి గుండే మేల్కున్నట్టు లేచి మరీ పాటకోసం ఎదురు చూడటానికి...... 

         లతా భారతీయ సినిమాకి ఒక యాడెడ్ ఎట్రాక్షన్. "ఆజా సనం మథుర్ చాందినీమే హమ్ తుమ్ మిలే" అంటూ ఒక్కసారి ఆ స్వరం వినపడితే చాలదూ... మనిషిగా పుట్టినందుకూ, వినటానికంటూ రెండు చెవులున్నందుకూ ఆనందించటానికీ. లతా..లతా..లతా... మూడోక్లాసులో కదా నీ స్వరాన్ని విన్నదీ "ఏ మేరే వతన్ కే లోగో..." అంటూ ఆమె స్వరాన్ని విన్నదీ, అట్లా భాషతెలియకున్నా కుర్బానీ అన్న పదానికి అర్థం తెలియకున్నా కళ్ళు చెమర్చుకుని స్వతంత్రదిన చాక్లెట్ ని కూడా అట్లా చేతిలోనే ఉంచుకుని కూచుండి పోయానూ... 

     అయిదుగురు చెల్లెళ్ళ భాధ్యత పదమూడేళ్ళ పసి భుజాలమీద పడితే పాడటం తప్ప మరో విషయం తెలియని లతా, పాటంటే నేనే అనుకున్న చిన్నారి లతా... ఎన్ని కన్నీళ్ళని తుడుచుకుందో, మరెన్ని కలలని ఆ కనురెప్పలు దాటకుండా దాచుకుందో ఎవరికి తెలుసు? లతాకి తప్ప.... "అక్బర్ పాదుషా కళ్ళలో విస్మయాన్ని చూసిన అనార్ఖలీ ధిక్కారపు పదును "ప్యార్ కియా కోయి చోరి నహీ కీ" అన్న లతా స్వరమే లేకపోతే ఇప్పటికీ అనార్ఖలీ ఎందరికి గుర్తుండేది? మొఘల్ ఏ అజమ్ సినిమాలో మధుబాల కనిపిస్తే.... అంతకన్నా ఎక్కువగానే లతా వినిపించింది. నౌషాద్ సంగీతానికి కొన్ని సందర్భాలలో లతా ప్రాణంలా పనిచేసింది.      

 * సినిమా అంటే ప్రపంచమంతా ఒక రకం అయితే ఇండియన్ సినిమా మరో రకం. ఇక్కడ సినిమా అంటే పాట కూడా సినిమా పాట అంటే లతా కూడా*

1947 దేశంతోపాటు బాలీవుడ్ కూడా రెండు భాగాలయ్యింది. అప్పటికే హిందీ చిత్ర పరిశ్రమని ఏలుతున్న ఖుర్షీద్, నూర్జహాన్ లాంటి సమ్మోహ స్వరాలు పాకిస్థాన్ వెళ్లిపోవడంతో లతా "అవసరం" కలిగింది. అప్పటికే మరాఠీలో కొత్తగా పాడుతున్న లతా గొంతు ఆ సంవత్సరం వచ్చిన "మజ్బూర్"తో దేశమంతా "దేక్ సక్తా హూ..." అంటూ హిందీలో కొత్తగా పలికిన స్వరాన్ని విన్నది. ఇక రెండేళ్ల తర్వాత వచ్చిన "మహల్" తో మరింత పాపులర్ అయ్యింది. దేశమంతా "సుర్ కి మాయా"లో పడిపోయింది. అలా మొదలైన లతా.... ఒక దశలో బాలీవుడ్ సంగీతాన్ని వేళ్ళ మీద ఆడించింది. ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కళ్యాణ్ జీ-అనంద్ జీల దగ్గరినుంచీ ఈనాటి  రెహమాన్ వరకు  లత గొంతుని తోడు తీసుకున్నవాళ్లే. 

వరుస ఆఫర్లు,  డబ్బు, పేరుతో పాటు కొత్తవాళ్ళని రానివ్వదు, ఆఖరికి సొంత చెల్లెలు ఆషాకి కూడా ఆఫర్లు రాకుండా అడ్డుకుంటోంది అనే అపకీర్తినీ తెచ్చుకుంది.  ఇంత ఎదిగినా లతా, లతా స్వరం ఎందుకో గానీ ఒపీ నయ్యర్ కి మాత్రం నచ్చలేదు... ఆశాని లతా ఎదురు నిలబెట్టాడు. అక్కచెల్లెళ్ల ఇద్దరిమధ్యా ఉన్నాయని అనుకుంటున్న విభేదాలు బహిరంగమయ్యేదాకా వచ్చాయ్. అయినా విమర్శలు చేసినవాళ్లే నోళ్లు మూసుకొని,చెవులు రిక్కించి మరీ విన్నారు "దీదీ" పాటని. అయినా విమర్శలదేముంది వస్తూనే ఉంటాయి ఈ మధ్య వెలుగులోకి వచ్చిన గాయని "రానూ మండల్" విషయంలోనూ లతా అక్కసు చూపిస్తోంది అంటూ ప్రచారం జరిగింది.... 

"మధుమతి" సలీల్ చౌదరీ పాడించిన "ఆజారే పరదేశీ" పాటకు ఫిలింఫేర్ అవార్డ్ దాసోహం అయ్యింది.  ఇప్పుడంటే రకరకాల సౌండ్స్ తో భయపెడుతున్నారు గానీ అప్పట్లో "బీస్ సాల్ బాద్" జనాన్ని బాగానే బయపెట్టింది. ఇక అందులో "కహీ దీప్ జలే" పాట #ఆనందభయం అనే కొత్త అనుభూతిని పరిచయం చేసింది. ఆ అద్భుత స్వరం ఆనందం, సినిమాలో ఆ పాట సన్నివేశం భయం. (ఈ ట్యూన్ ని కొంత కాపీ చేసి అప్పట్లో ఈటీవీ లో వచ్చిన #అన్వేషిత సీరియల్ పాటకు వాడుకున్నారు). 

        ఇక "సత్యం శివమ్ సుందరం" ఇప్పటికీ వెంటాడే ఆ గొంతు జీనత్ అమన్ సౌందర్యాన్ని మించి పాపులర్ అయ్యింది. లతా...లతా... లతా.. ఏళ్ళు గడిచినా అదే గాత్రం, సమ్మోహపు రాగం. ఇద్దరం కలిసి పాడుతున్నప్పుడు నీకెందుకు ఎక్కువ నాకెందుకు తక్కువ? ఈ ప్రశ్న ఏకంగా #మొహమ్మద్_రఫీ కె!!? బాలీవుడ్ విస్తుపోయింది. రెమ్యునరేషన్ విషయంలో లతా సవాల్ అప్పటికి ఒక సాహసం. ఫలితం రఫీ ఆమెతో కలిసి పాడను అంటూ అలిగాడు. కానీ ఎలా? లతా లేకుండా పాటా... కుదరలేదు మెట్టు దిగాల్సిందే రఫీ అయినా ఇంకెవరైనా అంతే... మళ్లీ లతాతో గొంతు కలపక తప్పలేదు.

బర్మన్ ల కాలంనుంచీ రెహమాన్ శకం దాకా సంగీత దర్శకులు, రఫీ, ముఖేష్ ల నుంచీ సోనూనిగం వరకూ గాయకులు, మధుబాల నుంచీ ఐశ్వర్యా రాయ్ లాంటి హీరోయిన్లవరకూ లతా ఎవర్ గ్రీన్ గానే ఉంది, అదే ఉత్సాహంతో పాడుతూనే వచ్చింది. ఫిలిమ్ ఫేర్ నుంచీ పద్మ అవార్డులు దాటుకుని "భారత రత్న" వరకూ చేరుకుంది.. 

          62 ప్రాంతంలో ఒకసారి మృత్యువు ఒడిదాకా వెళ్లి బయటపడింది. విషప్రయోగం జరిగిందని చెప్పారు డాక్టర్లు. ఆమె వంటవాడే ఆ కుట్రలో భాగస్వామి అని కూడా వార్తలు వచ్చాయి. కొన్ని నెలల పాటు ఇల్లు కదలలేదు, గొంతు విప్పలేదు ఇక పాడలేనేమో అని భయపడ్డ లత అది మరణం కన్నా భయంకరం అనుకుంది. కానీ ఆ గొంతులో అమృతం ఉంది అది లతని బతికించింది. లతతో పాటు సినిమా పాటని,  ఆమె అభిమానులని కూడా... 

   అయితే ఇప్పుడు మళ్లీ ఇంకోసారి... లత అనారోగ్యం పాలైంది, హాస్పిటల్లో చేరింది, అమృతం ఉందికదా తిరిగొస్తుంది లే అనుకున్నాను... పాడకుండా లతా, ఆమె పాట వినకుండా నేనూ ఎలా ఉండగలం?? అనుకున్నాను. కానీ........ 

          పాట... నేనూ.... ఇక్కడ ఈ అర్థరాత్రి మరి లతా!!??? "మేరే నైనా సావన్ బాందో ఫిర్ బి మెరా మన్ ప్యాసా..... అంటూ పిలుచుకుంటూ చూస్తున్నా.... కానీ దీదీ ఇక రాదు, ఇక పాడదు... 

లగ్ జా గలే.... అన్నప్పుడు ఆ తర్వాత వచ్చే "ఫిర్ యే రాత్ హో న హో...." అన్న దగ్గర చివరి #హో..... దగ్గర ఉంటుంది లతా

"హమ్ కో హామీసే చురాలో" పాటలో "పాస్ ఆవో..." కీ... "గలే సే లాగాలో..." కీ మధ్యలో వచ్చే చిన్న గ్యాప్ లో ఉంటుంది లతా... 

"జియా జలే జాన్ జలే..... చివర నిలబడి ఉంటుంది లతా.. 

"దేఖ ఏక్ ఖ్వాబ్ పాటలో... ప్యార్ కి హాజార్ దీప్ హై ముందు ఉండే నిశ్శబ్దంలో కనిపిస్తుంది లతా.... 

కానీ.... ఇలా ఎంత ఓదార్చుకున్నా, ఎంత మోసం చేసుకున్నా నిజం నిజమే కదా.... 

లతా ఇకలేదు అని, ఇక పాడదూ అన్న నిజాన్ని  అంగీకరించాల్సిందే కదా... 

     లతా కి అల్విదా ..... పాటకి అల్విదా..... :'(



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 345-2  / Sri Lalitha Chaitanya Vijnanam  - 345 -2🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀  76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।

క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀

🌻 345-2. 'క్షేత్రపాల సమర్చితా'🌻 

మొత్తము సృష్టి పాలనము చేయు ప్రజ్ఞ విష్ణు ప్రజ్ఞ. త్రిమూర్తులలో విష్ణువుతో కూడి లోకపాలకులు, దిక్పాలకులు, చక్రవర్తులు, ప్రభువులు, ఇతర చిల్లర అధికారులు శ్రీమాత నర్చించుచు వారి వారి కర్తవ్యములను చక్కబెట్టుట ఈ నామ రహస్యము. కొద్దియో గొప్పగనో విష్ణు ప్రజ్ఞ మేల్కాంచనిచో రక్షణ పోషణ లుండవు. క్షేత్రపాలు డనగా శివుడని కూడ అర్థ మున్నది. శివుడు దారుకుడను అసురుని చంపుటకు శ్రీమాత కాళీ ప్రజ్ఞను వినియోగించెను. అపుడు శ్రీమాత కాళిగ శివునికి సహకరించి దారుకాసురుని సంహరించెను. ఆ సంహార మతి భీకరము.

ఆ సవయమున కాళి కోపాగ్ని అతితీవ్రమై సంహారానంతరము కూడ ఉపసంహరింప బడలేదు. ఆ కోపాగ్నికి లోకములు కల్లోలమగు చుండెను. అపుడు శివుడు ఒక అందమైన బాలుని రూపము దాల్చి ఏడ్చుచు కాళికి ఎదురేగెను. ఏడ్చుచున్న అపురూపమగు బాలుని చూచిన వెంటనే కాళి యందలి శ్రీమాత వాత్సల్య భావమును ధరించెను. అపుడు బాలుని చేరదీసి ఓదార్చుటకై తన స్తన్యమిచ్చెను. బాల శివుడు స్తన్యముల నుండి క్షీరములనే గాక కాళి కోపాగ్నిని కూడ పానము చేసెను. ఈ బాలునే క్షేత్రపాల శివుడందురు. ప్రసన్న అయిన శ్రీమాతను బాలశివుడు అర్చించెను. కావున శ్రీమాత 'క్షేత్రపాల సమర్చిత' అయినది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


5। దండ కమండల దారులై భక్తులు

     ముడుపులు కట్టిన ముక్తి రాదు

      విభూతి పూసియు, పులిచర్మము ధరించి

      ముక్కుమూసియు యున్న ముక్తి రాదు   

      సంసారిగా ఉన్న, సన్యాసిగా ఉన్న

      మనసుయే లేకున్నా ముక్తి రాదు

      పుణ్యతీర్ధాలు తిరిగి, దాన ధర్మాలు 

      మౌనము అహముంటె ముక్తి రాదు


      గురువు వాక్యాలు మనసున గుర్తు నిచ్చు   

      తల్లి తండ్రుల గౌరవం తృప్తి నిచ్చు 

      భక్తితో దయచూపితే ముక్తి వచ్చు

     ప్రాంజలిప్రభ ఆనంద ప్రేమ వచ్చు                          

        --((**))--


6।   ప్రజల దారిద్రాన్ని పారద్రోలు మనవి  

       హరి భక్తే వజ్ర ఆయుధంబు

      అజ్ణాణ అంధకా రముతొల గించేది 

      నీభక్తి భావాము నూదయంబు

      దుర్భుద్ధి మాపియు ధర్మబుద్ధిని పెంచు 

      నీ సేవ ధర్మము వానలంబు

      నిత్య అమృత తత్వ నియముగా ఇచ్చేది

       నామ స్మరణ దివ్య ఔషధంబు


      వెన్న ఉన్నను నేతి వెతికినట్లు

      భార్య ఉన్న పరస్త్రీని  కోరినట్లు

      దేవతనుఎంచి ప్రార్ధించి దయయు నట్లు

     ప్రాంజలిప్రభ ఆరొగ్య ప్రేమ నెచ్చు


       ****


2 comments:

  1. Top 5 best casinos in Washington State
    The 상주 출장마사지 best place to play 김포 출장마사지 casino games in Washington 영주 출장마사지 State is 서울특별 출장마사지 at 동해 출장마사지 Harrah's Casino in Harrah's Cherokee. This riverboat hotel offers gambling fun

    ReplyDelete