Friday 11 February 2022





 

 యదక్షరం పరం బ్రహ్మతత్సూత్రమితి ధారయేత్।।
(బ్రహ్మోపనిషత్)

- అక్షర పరబ్రహ్మమును యజ్ఞోపవీతముగా భావించి ధరించవలెను।

లోకా స్సమస్తా స్సుఖినోభవన్తు!

"ఋభువు చేసిన సంగ్రహ ఉపదేశము"
ప్రార్థనా ప్రత్యక్షాచరణ రెండూ అవసరమే అను ముగింపు అధ్యాయము నుండి।।

అహంకారంలేని మనసు సత్యమనే తీరానికి చేరుస్తుంది !

శాంతి అంటే అనుకూలత లోనుండి వచ్చే సంతోషం కాదు। 
పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా మనసు వేదనకు గురికాని నిశ్చలత। అది అర్థంచేసుకోవడం నుండి, అవగాహనలోనుండి వస్తుంది। 
ఆత్మజ్ఞానమంటే అది ఒక విజ్ఞానం లాంటిదికాదు। 
పరిపూర్ణమైన సహజత్వం। 
పువ్వుకి కాల విజ్ఞానం ఉండదు। 
కానీ అది వికసించే జ్ఞానం దానిలోనే నిక్షిప్తమై ఉంది। 
అనవసరమైన దానికోసం చేయిచాచటం అహంకారం। 
మళ్లీ చేయిచాచటం ఆశ। 
ఆశ, అహంకారంలేని మనసు శాంతిగా ఉంటుంది। 
ఆ మనసే సత్యమనే తీరానికి చేరుస్తుంది। 
గురువుదయ మనని సత్యానుభూతితో ఈశ్వరుని తెలుసుకునేలా చేసి నేను బ్రహ్మము అనే జ్ఞానాన్నిస్తుంది !

*****

 ఉపనిషత్తులలో గల 108 మహా వాక్యములు
ధ్యానస్థితిలో దశలు।

రాజయోగం ప్రకారం సృష్టిలో మూడు రకాల మానసిక స్థితులు ఉన్నాయి। కార్యాలు మనకు తెలియకుండా జరిగిపోయే బోధరహిత స్థితి। మనకి తెలిసి కార్యం జరిగే స్థితి బోధావస్థ। తెలిసికూడా నేను అనే కర్తృత్వం ఏర్పడని స్థితి బోధాతీత స్థితి। జంతుజాలం అంతా బోధ రహితస్థితిలో ఉంటుంది। మనుషులంతా బోధావస్థలో ఉంటారు। గురువు దయతో మాయను వీడిపోతే కార్యం జరుగుతూ కూడా తాను చేస్తున్నానన్న 'నేను భావన' లేని బోధాతీత స్థితిలో ఉండగలుగుతాం। ఇప్పటికే సద్గురువు అలా ఉండి చూపుతున్నారు। అందుకు ఎవరికి ఏది సులభమార్గమో వారి వారి సాధ్యాసాధ్యాలను బట్టి ఉంటుంది। పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క ఊరికి వెళ్ళాలంటే కారులో వెళ్తే త్వరగా వెళ్తామా ? బైక్ పై వెళ్తామా ? సైకిల్ పై త్వరగా వెళ్తామా ? అంటే ఇవేవి నడపడంరాని వాడికి నడిచి వెళ్ళడమే తొందరగా గమ…

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

39) ఆన్తర మేకం కిఞ్చిత్‌- నన్తత మనుసన్ద ధన్మౌనీ ।
కరపుట భిక్షా మశ్నన్‌- అటతి హి వీథ్యా జడాకృతిః కో7పి ।।

తా।। అన్నిటికిని లోనిదైన వస్తువును ఎద్దానినో సంతతమును ధ్యానించుచు, మౌనియై - కరతల భిక్షాశనుడై - జడుని వలె వీధులయందు పర్యటించు మహాత్ములు అరుదుగా నుందురు।

వివరము :-

శరీరము కంటే ఇంద్రియములు - వాని కంటే మనస్సు - దాని కంటెను బుద్ధి - లోపలివి। కాగా - దానికిని లోపలిది ఆత్మవస్తువు, పరబ్రహ్మము।
పోయ్యి మీద గిన్నె - గిన్నెలో నీరు - నీటిలో బియ్యము, బియ్యము ఉడికెను। ఎట్లు ఉడికెను? వేడి ఎచట నుండి లభించినది?
నీటి నుండి లభించినది, నీటికి వెచ్చదనము సహజగుణమా? కాదు, గిన్నె నుండి ఉష్ణశక్తి నీటికి చేరినది। గిన్నెకును వేడిమి స…

 శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

రేకు: 40-1
సంపుటము: 1-243
రేకు రాగము: సామంతం

నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప- । నగరాజధరుడ శ్రీ నారయణా ।।

దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యం బియ్య- । 
నోపక కదా నన్ను నొడబరపుచు ।
పైపైనె సంసారబంధముల కట్టేవు । 
నాపలుకు చెల్లునా నారాయణా ।।

చీకాకుపడిన నా చిత్తశాంతము సేయ- । 
లేకకా నీవు బహులీల నన్ను ।
కాకుసేసెదవు బహుకర్మల బడువారు । 
నాకొలదివారలా నారాయణా ।।

వివివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను ।
 భవసాగరముల దడబడ జేతురా ।
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ । 
నవనీత చోర శ్రీనారాయణా ।।

*****
అన్నమయ్య శ్రీవారిని ఈ బంధాలపై వ్యామోహాన్ని తెంచమని, శాశ్వతమైన వైరాగ్య సుఖాన్ని ఇప్పించమని కోరుతున్నారు। 

వేదం (=నిగమం)
వేదాంతం(=నిగమాంతం)
ఈ రెండింటి లోనూ వర్ణనలు కలవాడా !
గోవర్ధన పర్వతాన్ని ధర…

 శ్రీమన్నారాయణీయము దశమ స్కంధము 55వ దశకము - అఘాసురవదమ్ - 55 - 2-శ్లోకములు

55-2

అధిరుహ్య పదాంబురుహేణ చ తం నవపల్లవతుల్యమనోజ్ఞరుచా।
హ్రదవారిణి దూరతరం న్యపతః పరిఘూర్ణితఘోరతరంగగణే॥

భావము। :-

బాలుని రూపమున ఉన్న ఓ! భగవాన్! చిగురుటాకులవలెనున్న నీ చిరుపాదములతో ఆ వృక్షమును అధిరోహించి, వృక్షాగ్రమును చేరితివి।
అచ్చటి నుండి, నీవు తరంగములతో ఎగిసిపడుచూ ఉధృతముగా ప్రవహించుచున్న యమునానదీ జలములలోనికి దుమికితివి; వెనువెంటనే ఆ నదీగర్భమున ప్రవేశించితివి।

** - శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ఐదవశతకం)

 శ్లోకము:-
యః ప్రాజ్ఞః, తరుణ దివాక రోజ్జ్వ లాంగీం 
తన్వంగి! త్రిపుర జితో విచిన్తయేత్ త్వామ్!
 
తస్యాజ్ఞాం దధతి శిరస్సు ఫుల్ల జాజీ 
మాలాంవా! ధరణి జుషోభవంతః!!

భావము:-

మనోవిలయమాత్రేణ దుఃఖశాన్తిరవాప్యతే మనోమననమాత్రేణ దుఃఖం పరమవాప్యతే
మనస్సు యొక్క విలయమాత్రముచే దుఃఖము శమించిపోవును। మనస్సు యొక్క మననమాత్రముచే మహాదుఃఖము కలుగును। 

5-122

దుఃఖముత్పాదయత్యుచ్చైరుత్థితశ్చిత్త రాక్షసః సుఖాయానన్తభోగాయ తం ప్రయత్నేన పాతయ।
ఓ రామచంద్రా! ఈ చిత్తమను రాక్షసుడు పైకి లేవదీయబడినచో మహాదుఃఖము గలుగజేయును। కాబట్టి సుఖముకొఱకును దేశకాల, వస్తుపరిచ్ఛేదరహితమైనట్టి మోక్షముయొక్క అనుభవము కొఱకును నీ వా చిత్తరాక్షసుని ప్రయత్న పూర్వకముగ పడద్రోయుము। 

5-123

తస్య చఞ్చలతా ఏషా త్వవిద్యా రామ సోచ్యతే వాసనాపదనామ్నీం తాం విచారేణ వినాశయ। 
ఓ రామచంద్రా! వాసనానిలయ మను పేరుగల మనస్సు యొక్క చంచలత్వ మేది గలదో, అదియే అవిద్యయని చెప్పబడును। అద్దానిని నీవు విచారణచే నశింపజేయుము।

*****
ఎంత చక్కని దో ఎంత చిక్కగాను నవ్వు చున్నాదే
ఎంత పల్కులతో ఎంత చూపులతో హృదయము దోచెనులె
ఎంత చోద్యముయే ఎంత హాస్యము యే హృదయ చింత పెరిగె
ఎంత ముఖ్యమో ను ఎంత సహనమ్మే హృదయ వాంఛ కలిగె

ప్రేమ సుగంధమో ప్రేమ వలపు వీణ రాగ మరందమో 
కోమల పుష్పమో కోకిల గానమో రాస లీలలు గా
కౌమిది హర్షమో కన్నుల పిలుపుయో సుందరభావమై
నా మది నిల్వదే ననుయె కరుణించవె నామనోనేత్రివి

ఆమె లావణ్యం ఆమె లాలిత్వం నాకు సంతోషం
ఆమె కారుణ్యం ఆమె కర్తవ్యం నాకు విశ్వాసం
ఆమె ధారుఢ్యం ఆమె దేహత్వం నాకు రాహిత్యం
ఆమె వాస్తవం ఆమె వాత్సల్యం నాకు సమ్మోహం

ఊహ లలో మునిగి ఊయల లో ఊగి ఊరుకో లేకయె
స్నేహితుల తోను స్నేహము బంధమై మనసు హాయి గూర్చె
దాహము తీర్చుటే దరిన సేవ చేసి సహన సహ కారము
దేహము పరులకే దాన ధర్మాలను చేయు విశ్రాంతిగ

నచ్చె మదీయ భావమునె నాది మనస్సు పంచునే సదా
మెచ్చె ను నీ కళా వరము మాయను మాపి వచ్చెదా సదా
సచ్చరి తంబునే తెలిసి సర్వము పంచెదా సదా
నా చెలి హృద్యమే సుఖము నేడు ఫలించు శక్తిగా

ప్రకృతి లో జడత్వం మాయ మోహం
సుకృతి యే ధనత్వం మాయ లక్ష్యం
వికృతి యే ఋణత్వం మాయ వైనం
యి ధృతి యే సమత్వం మాయ లోకం

రోగము వచ్చెనే యువతి రాగము దేనికి ఇప్పుడేగదా
భోగము ఎందుకే ధనము పంచితి ఆశను తీర్చలేను గా
వేగము వద్దులే బతుకు వాంఛను మానుట కోరుటే సదా
రాగము తెల్పకే విషయ లభ్యము దైవము తీర్పు యే కథా

మనిషి తెలివి మీరి మాయ చెంత చేరి అంత తెల్సననే
కనులు ఉన్న నిన్ను కాన లేని బతుకు ఆశ పాముతోను
మనసు పద్మాన్నే పంచ లేకయె శివ పూజకు పువ్వులను
కోనసీమ పండు కొండనెక్కి తెచ్చి నిన్ను మరిచె మనిషి

పాప మనె బీజం మొలచి మోక్కగాను ఎదిగి  వృక్ష మయ్యె
ఒప్పు కర్మఫలం ఓర్పు కొమ్మలై పూర్వ జన్మ యుక్తి
మెప్పు శరీరమే మొగ్గలు ఆకులై వీర్య ఫలపుష్పమె
తాపముయె దుఃఖం తపము సంసారం పండు పుట్టి రాలు

ఇందిరాలయ - ర/స/జ/భ/ర/జ/జ/ర/గగ
UIU IIUI - UIU IIUI - UIU IIUI - UIU UU
26 ఉత్కృతి 5680475

భీముఁడే గుణమందు - భీముఁడే రణమందు -
భీముఁడే తనువందు - భీముఁడా ఱేఁడే
రాముఁడే మనమందు - రాముఁడే హృదియందు -
రాముఁడే తలఁపందు - రాముఁడా ఱేఁడే

కాముఁడే పొడయందు - కాముఁడే నడయందు -
కాముఁడే వలఁపందు - కాముఁడా ఱేఁడే
భీముఁడై నను జేరు - రాముఁడై నను బిల్చు -
కాముఁడై నను గూడు - స్వామి నా ఱేఁడే

నేటి పాట

ఆనందం పొందాలి ఈ కళ్లతో
ఆదర్శ మై బ్రతకాలి ఈ వేళలో।।।।2

ఆత్రుతతో చూడకే ఈ కళ్లతో
ఆత్మీయతా చూపాలి ఈవేళలో।।।।।2

నీలాంబరం।।చూసి కళ్లలో।।
మేఘామృతం।।
జారె నాగుండె లో।।
మాటలు మోయలేని పెదవే
మౌనంగా నిన్ను సాయమడిగా

మేఘాంబరం ।। చూసి
పింఛమై పురివిప్పె 
నాట్యమే నాగుండె లో
ఆటలు ఆడుతుంటే కదిలే

మౌనంగా నిన్ను సాయమడిగా
హృదయాంబరం విచ్చెనే
మచ్చికై మౌనంబు వీడెనే
ఈ హృద్యతాపమ్ము నీకొరకే
వేచియున్నాది ఇప్పుడే లే

ప్రేమమ్ము గా నిన్ను సాయమడిగా
అధరామృతం అందుకో
ఆత్మక్షోభ ఇక దేనికో
ఈహృద్యతాపమ్ము నీకొరకే
పొందాలి నీవిప్పుడేలే

ప్రేమమ్ముగా ఇప్పుడే సాయమడిగా
ఆనందం పొందాలి ఈ కళ్లతో

ఆదర్శ మై బ్రతకాలి ఈ వేళలో।।।2
ఆత్రుతతో చూడకే ఈ కళ్లతో

ఆత్మీయతా చూపాలి ఈవేళలో।।2
0

నేటి పాట 

వేళ కాని వేళ సరస మంటు
వేలు చూపి వేగ పరుచుటేల
వెన్నలమ్మ వేళ మనసు అంటు
ఉన్న కాల మంత మరుచుటేల

 నిశ్శబ్దంగా సాగుతూ ఉన్న చిరునవ్వు లే
జాలి గుండెలో పరిగెత్తు తున్న పరిమళాలు లే
సుతిమెత్తగా తాకుతూ ఉన్న సుగంధాలు లే
సుప్రభాత గీతాలు గా పలుకుతున్న హృదయ స్పందనలే

 శ్వాస నీ చుట్టూ తిరుగు తున్న ధ్యాస మారదు లే
కాల గుప్పెట్లొ బ్రతుకు తూ ఉన్న కామ్య మే ఇది లే
శాసించు శక్తి అవసరం ఉన్న చేయ లేదులే
ఎవరు ఎన్ని చెప్పినా ప్రేమ ఉన్న నిన్ను మరవలే

పదనిసలు మాటలు తెలపకు
మధురిమలు మనసు మరువకు
సరిగమలు వరుస కలపకు
పరుషముల పలుకు చిలుకకు

మల్లెపూల వాసన ఆస్వాదించు
గులాబీ పూలను ఘభాలించు
సంపెంగ పువ్వు పరిమళించు
మొగలి రేకుల జడ గమనించు

వేళ కాని వేళ సరస మంటు
వేలు చూపి వేగ పరుచుటేల
వెన్నలమ్మ వేళ మనసు అంటు
ఉన్న కాల మంత మరుచుటేల


ఋభు గీత సమాప్తం
ఓమ్ శాంతి శాంతి శాంతిః



No comments:

Post a Comment