Thursday 15 July 2021

16/07/2021***




మూడు మూల ప్రతిపాదనలు :
(Three fundamental proposiitions) : 

 మొదటి ప్రతిపాదన :- 

సర్వవ్యాపి, శాశ్వతం , హద్దులు లేనిది సుస్థిరము అయిన ఒకే ఒక్క తత్వం కలదు .. అదీ మాటలకు అందనిది .. మనసు , బుద్ధికి దొరకనిది . ఊహాతీతమైనది . ఈ తత్త్వాన్ని `` అగ్రాహ్యం , అవాచ్యం , అలక్షణం , అచింత్యం  అని మాండూక్యోపనిషత్తు వివరించింది .‌ (అవాఙ్మానస గోచరం)ఈ తత్వాన్ని గురించి మరింత లోతుగా పరిశీలిద్దాం .. వ్యక్తమైన సృష్టికి పూర్వం ఉన్నది ఒక్కటే ఒక్కటి.. అది అనంతం . మూలకారణం . దీన్ని పాశ్చాత్య తత్వవేత్తలు rootless root ( కారణములేని కారణమూ, వేరులేని వేరు ) అనీ unconscious , unknowable ( ( నా ప్రజ్ఞం , అగ్రాహ్యం ) అని వర్ణించారు . తత్వతః దీనికి , వ్యక్త ప్రపంచానికి , ఎటువంటి సంబంధం లేదు . దీన్నే ప్రాజ్ఞులు సత్ అన్నారు .. ఇది అచింత్యం . దీన్ని being అనడం కంటే be- Ness అస్తి , అనడము సబబుగా ఉంటుంది. ఈ be - Ness ది సీక్రెట్ డాక్ట్రిన్ లో ద్విరూపిగా ప్రస్తావించబడింది .  అవ్యక్తాకాశం లేక మహాకాశం ( absolute abstract space )

 2 .  అవ్యక్తమైన సంచలనం ( absolute abstract motion ) ఈ రెండు విషయాలు మానవుని మేధస్సుకు అందనివి . అట్లని ఇవి లేవు అని చెప్పజాలం . చలనం ఉన్నచోట చైతన్యం లేక ప్రజ్ఞ ఉండే తీరుతుంది చలనం వున్నప్పుడు మార్పు తప్పనిసరిగా ఉండే తీరుతుంది . కనుక చలనం , పరివర్తన ఈ రెంటికీ అవినాభావ సంబంధం ఉంది. ఆదిలో సంచలనం అవ్యక్త పరబ్రహ్మ సంకల్ప ప్రభావంతో కలిగింది. ఈ మహాసంకల్పాన్నే మహా నిశ్వాసము ( the great breath ) అని అన్నారు .. ది సీక్రెట్ డాక్ట్రిన్ చేసిన మెదటి ప్రతిపాదన ఉన్నది ఒక్కటే . ఈ ఒక్కటీ పరిపూర్ణమైంది . ( One  absolute be ness ) దీనినే అస్తి అనవచ్చు . ఇదే సృష్టికి కారణం . ఈ ఒక్కటే ఒక్కటిగా చెప్పబడే తత్వ్తమే పరబ్రహ్మ . ఇది రసస్వరూపం . సృష్టికి దీనికి సంబంధం లేదు. అయినా సృష్టి అంతా దినికి పరిమితమైన ప్రతీక . ఇది అద్వితీయము . ఇది కాదు ఇది కాదు ( నేతి నేతి ) అని విచారిస్తూ పోగా , ఒక స్థితిలో ప్రకృతి - పురుషుడు , శక్తి , ద్రవ్యం అనేవి రెండు వైపులు మాత్రమే . ఈ రెండు సృష్టికి ఆధారం . అవ్యక్త స్థితిలో మూల ప్రకృతి , మూల పురుషుడు , వ్యక్త స్థితిలో ఇవి పదార్థం - శక్తిగా గోచరిస్తాయి .. మూలప్రకృతి చరాచరసృష్టిలో నామ రూపాలకు మూలమలనట్లు అవ్యక్త స్థితిలోని మూలపురుషుడు ( విరాట్ పురుషుడు ) చైతన్యానికి ప్రజ్ఞకు మూలాధారము ... అవ్యక్త స్థితి నుంచి , ఈశ్వర సంకల్పానురూపమైన జగత్తు వ్యక్తము కావసినప్పుడు , ప్రకృతి పురుషుల సంయోగం కావాలి . కేవలం పురుషునొక్కని వలనగాని , కేవలం ప్రకృతి వలన కానీ సృష్టి జరగదు . ప్రకృతి పురుషుల సంయోగానికి , ఒక సంధాన సూత్రం కావాలి. ఈ సంధాన సూత్రం ఫోహాత్ ( fohat ) అని పేరొందింది .. ఈ ఫోహాత్ ప్రబావం వల్లనే ప్రకృతి పురుషుల సంయోగం జరిగి సృష్టి వ్యక్తమైంది. పరబ్రహ్మ రాజసశక్తియే ఫోహాత్ . ఈ శక్తి , ధ్యానచోహనుల ద్వారా ప్రకృతి పురుషుల సంయోగం జరిపింది . ధ్యాన చోహానులను విశ్వకర్మలు అనవచ్చు ( architects of the universe ) వీరి ప్రమేయము చేతనే ప్రకృతి పురుషుల సంయోగం జరిగి , ఉపాదులు నిర్మించబడ్డాయి . ఈ ఫోహాత్ శక్తియే మనసుకు పదార్థానికి సంబంధం కలుగజేస్తుంది. ఇంతే కాకుండా ప్రతి పరమాణువునకు జీవాన్ని అందజేస్తుంది .. 
ఈ పై వివరించిన విషయాల సారాంశం :- 
🕉️ వేదాంత పరిభాషలో పేర్కొన్న పరబ్రహ్మ తత్త్వము, సత్యము ఒక్కటే . దీన్నే సత్ అని కూడా అంటారు. ఇదే సత్ - అసత్ కూడా (absolute being and non - being ) 

🕉️ ఆదిలో ఈ పరబ్రహ్మ , ఈశ్వరుడుగ విరాట్ పురుషుడుగ (unmanifest logos ) వ్యక్తమయినాడు . ఇది సగుణబ్రహ్మ అవతరణకు పూర్వపు స్థితి .
🕉️ తదుపరి ప్రకృతి - పురుషుడు ( spirit- matter ) వ్వక్త మయింది . దీనినే జీవం అనవచ్చు .
🕉️ తదుపరి మహాత్తత్వ్తము ప్రకటితమైనది . ఇదియే చిత్ లేక విశ్వాత్మ ( universal soul ) ఇదే ప్రకృతికి దోహదం చేసే తత్వం .
🕉️ గుణాత్మకమైన విశ్వమందు అంతా వ్యాపించి ఉన్న ఈ పరమ తత్త్వం ద్వంద్వ రూపంగా ప్రకటితమైంది ..
                                                                                                                                   con...


No comments:

Post a Comment