Thursday 8 July 2021


  

🪔 ॐ卐 సుభాషితమ్ ॐ卐 💎

శ్లో|| అనర్ఘమపి మాణిక్యం హేమాశ్రయమషేక్షతే।

వినాశ్రయం న శోభన్తే పణ్డితా వనితా లతాః॥

....సుభాషితరత్నకోశః….

తా|| "ఎంత అమూల్యమైన మాణిక్యమైనా అది శోభించాలంటే దానికి బంగారం ఆశ్రయం ఉండాలి. అదే విధంగా పండితులు, స్త్రీలు, లతలు ఆశ్రయం లేకపోతే ప్రకాశించరు".


[21:02, 07/07/2021] Mallapragada Ramakrishna: సమస్య


లేని యిల్లు ఏదో చెప్పు

ఉన్నా లేనట్లు ఉండేవారు చెప్పు

పచ్చగా నున్న


ఓర్వలేని మనుషులు ఉన్న లోకం

నిజాయితీ గా ఉన్నా తప్పు పట్టే లోకం


పుడమి

పురిటి నెప్పులు గమనించరు

ప్రకంపిస్తే వనికి పోతారు



ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యే నమః

[05:05, 08/07/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 61 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 

📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ద్వితీయ అధ్యాయము -  సాంఖ్య యోగము - 14  🌴

14. మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణ సుఖదు:ఖదా: |

ఆగమపాయినో నిత్యాస్తాంస్తితిక్షస్వ  భారత ||


🌷. తాత్పర్యం :

ఓ కౌంతేయా! తాత్కాలికములైనట్టి సుఖదుఖముల రాకయు, కాలక్రమమున వాటి పోకయు శీతగ్రీష్మకాలముల వంటివి. ఓ భరతవంశీయుడా! ఇంద్రియానుభవము వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలత నొందక సహించుట మనుజుడు నేర్వవలెను.

🌷. భాష్యము :

విధ్యుక్తధర్మమును చక్కగా నిర్వహించుట యందు సుఖ:దుఖముల తాత్కాలికమైన రాకపోకలు సహించుట ప్రతియెక్కరు నేర్వవలెను. వేదనియమము ప్రకారము మాఘమాసము నందును (జనవరి-ఫిభ్రవరి) తెలావారుఝాముననే స్నానమాచరింపవలెను. ఆ సమయమున వాతావరణము అతిచలిగా నున్నను వేదనియమా చరణమునకు కట్టుబడినవాడు తత్కారమునకు సంశయింపరు. 

అదే విధముగా ఎండాకాలపు అతివేడి సమయమున మే,జూన్ నెలల యందు కుడా స్త్రీలు వంటశాల యందు వండుటకు సంశయింపరు. అనగా వాతావరణపు అసౌకర్యములు కలిగినప్పటికిని మనుజుడు తన విధ్యుక్తధర్మమును నిర్వహింపవలెను. ఆ రీతిగనే యుద్ధమనునది క్షత్రియధర్మము. 

అట్టి యుద్దమును స్నేహితుడు లేదా బంధువుతో చేయవలసివచ్చినను క్షత్రియుడైనవాడు తన విధ్యుక్తధర్మము నుండి వైదొలగరాదు. జ్ఞానస్థాయికి ఎదుగుట కొరకై మనుజుడు నిర్దేశిత నియమనిబంధనలను అనుసరింపవలెను. ఏలయన కేవలము జ్ఞానము మరియు భక్తి ద్వారానే ఎవడైనను తనను తాను మాయాబంధముల నుండి ముక్తుని గావించు కొనగలడు.

ఈ శ్లోకమున అర్జునుని సంభోధించిన రెండు నామములకు ప్రాశస్త్యము కలదు. కౌంతేయ అనెడి సంబోధన అతని తల్లి తరపున గల రక్తసంబంధమును, భారత అనెడి సంబోధనము తండ్రి ద్వారా సంక్రమించిన గొప్పదనమును సూచించుచున్నది. ఈ విధముగా రెండు వైపుల నుండియు అర్జునుడు గొప్ప వారసత్వమును కలిగియున్నాడు. అట్టి వారసత్వము స్వీయధర్మపాలన యందు గొప్ప బాధ్యతను కలిగించుచున్నందున అతడు యుద్దమును నిరాకరించుటకు అవకాశము లేదు.

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ అన్నమాచార్య సంకీర్తన

అధ్యాత్మ సంకీర్తన , రేకు: 272-4 , సంపుటము: 3-415, రేకు రాగము: దేసాళం.

వెదకవో చిత్తమా వివేకించి నీవు

అదనఁ దదియ్యసేవ అంతకంటే మేలు!! 

॥పల్లవి॥

చూపులెన్నైనాఁ గలవు సూర్యమండలముదాఁకా

చూపులు శ్రీహరిరూపు చూడ దొరకదు గాని

తీపులెన్నైనాఁ గలవు తినఁ దిన నాలికెకు

తీపు శ్రీహరిప్రసాదతీర్థమని కోరదు!! 

॥వెద॥

మాటలెన్నైనాఁ గలవు మరిగితే లోకమందు

మాటలు శ్రీహరినామము మరపఁగ వలె

తేటలెన్నైనాఁ గలవు తీరని చదువులందు

తేటగా రామానుజులు తేరిచె వేదములలో!!

॥వెద॥

చేఁతలెన్నైనాఁ గలవు సేసేమంటే భూమి

చేఁతల శ్రీవేంకటేశు సేవ సేయవలెను

వ్రాఁతలెన్నైనాఁ గలవు వనజభవుని ముద్ర-

వ్రాఁతలు చక్రాంకితాలె వహికెక్కే ముద్రలు!! 

॥వెద॥

భావం :-

ఓ మనసా విచారించి వెదుకు అధికమైనటు వంటి సేవ అంతకన్న కలదామేలు చూపులు ఎన్నైన కలవు సూర్యమండలం దాక. చూపులు శ్రీహరి రూపం చూడటానికి దొరకదు గాని బాధలెన్నైన కలవు దానికోసం.

తిన్న నాలుకకు మధురమైన శ్రీహరి ప్రసాదం తీర్ధం కోరుకోదా. లోకములో మరవకుండా ఉంటే ఎన్ని మాటలైన ఉంటాయి. శ్రీహరి నామము ముందు ఆ మాటలు మరువగలమా. చదువుల కోరిక తీరక పోతే ఎన్ని తెలివితేటలైన కలవు.

రామానుజులు వేదములో సారము తెలిపినాడు. భూమి మీద  చేయాలంటే ఎన్నో చేయవచ్చు. శ్రీవెంకటేశ్వరుని సేవ చేయవలేను. భుజములు పై బ్రహ్మముద్రలుగా వాసికెక్కిన సుదర్శన చక్రం ముద్రలు ఉన్న అంటు అన్నమయ్య కీర్తించాడు.

---


ఓం సమీహనాయ నమః | ॐ समीहनाय नमः | OM Samīhanāya namaḥ


సర్వయజ్ఞ స్వరూపత్వాత్ యజ్ఞ ఇత్యుచ్యతే హరిః ।

యజ్ఞాకారేణ సర్వేషాం దేవానాం తుష్టి కారకః ।

ప్రవర్తత ఇతి తథా వా యజ్ఞో వై ఇతి శ్రుతేః ॥


సర్వ యజ్ఞ స్వరూపుడు. సర్వ దేవతలకును యజ్ఞ భాగములు అందజేయుట ద్వారమున వారికి తుష్టిని కలిగించుచు యజ్ఞ రూపమున తానే ప్రవర్తిల్లుచున్నాడు అనియూ చెప్పవచ్చును. 'యజ్ఞో వై విష్ణుః' (తై. సం. 2.5.5) 'యజ్ఞమే విష్ణువు' అను శ్రుతివచనము ఇందులకు ప్రమాణము.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్‍చ క్రతుస్సత్రం సతాం గతిః ।సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ ౪౮ ॥


[ 🌹. వివేక చూడామణి - 99 / Viveka Chudamani - 99🌹

✍️  రచన : పేర్నేటి గంగాధర రావు

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 


🍀. 22. కోరికలు, కర్మలు   - 9 🍀

336. విద్యావంతడైన వ్యక్తి ఎచ్చట ఉంటే అచ్చట ఆ వ్యక్తి సత్యాసత్యముల విచక్షణా జ్ఞానముతో వేదాలను నమ్మి తన దృష్టిని అతని వైపు మళ్ళించగలుగుతాడు. అదే అత్యున్నతమైన సత్యము. సాధకుడు అట్టి స్థితిని పొందిన తరువాత చిన్న పిల్లల వలె కాక జాగ్రత్తగా అసత్యమైన విశ్వానికి దూరముగా ఉంటాడు. లేనిచో అది అతని పతనానికి కారణమవుతుంది. 

337. శరీరానికి కట్టుబడి ఉన్న వ్యక్తికి విముక్తి లేదు. అలానే విముక్తి పొందిన వ్యక్తికి శరీరముతో ఏవిధమైన గుర్తింపు ఉండదు. నిద్రించు వ్యక్తి మెలుకవలో ఉండడు. మెలుకవలో ఉన్న వ్యక్తి నిద్రించడు. ఈ రెండు వ్యతిరేక ప్రభావము కలిగి ఉన్నవి. 


338. ఎవడైతే తన మనస్సుతో తన ఆత్మను తెలుసుకొంటాడో అతడు స్వేచ్ఛను పొందుతాడు. అలా కాక కదులుచున్న, స్థిరముగా ఉన్న వస్తు సముదాయముపై దృష్టిని ఉంచి గమనిస్తుంటాడో, అది అతని పతనము. అందువలన అన్ని మోసాలను అధికమించి వ్యక్తి తన యొక్క ఆత్మిక స్థితిలో స్థిరపడాలి. 


 సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[05:05, 08/07/2021] +91 98494 71690: 🌹. దేవాపి మహర్షి బోధనలు - 110 🌹 

✍️. సద్గురు కె. పార్వతి కుమార్

 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

🌻 90. మానవ లక్షణము - 2 🌻

ప్రతి ఆధ్యాత్మిక సంఘమును, సూక్ష్మలోకముల నుండి గమనించు మాకు, యిదియే మరల మరల కన్పట్టుచున్నది. ఒక సోదర బృందమున, ఆశయమొక్కటే యున్నను దానిని నిర్వర్తించు విధానమున పలువురికి పలుభావము లేర్పడుచుండును.

దానికి కారణము సభ్యుల స్వభావ వైవిధ్యము. అందరును ఒకే స్థితిని చేరిన ప్రజ్ఞను కలిగి యుండరు కదా! వాని స్వభావమందలి వైవిధ్యములే వారి వైవిధ్య ధోరణికి కారణము. వైవిధ్యమగు భావములను సమన్వయించుట సులభమగు విషయము కాదు. దీనికి సహనము ముఖ్యము. అట్టి సహనము కలవాడే బృందమును నడుపుట శ్రేయస్కరము.


సహనము, సద్బుద్ధి, సహకారము, సోదరత్వమునకు అత్యంత ఆవశ్యకమగు అంశములు. దీనిని పొందుటకు చైతన్యమును వికాసవంతము చేసుకొనవలెను. ఇతరుల అభిప్రాయములను కూడ పరిగణలోనికి తీసుకొని ఆలోచించుట దీనికి ప్రధానము. 


పదికోణముల నుండి ఒకే విషయమును అవగాహన చేసుకొనినచో కార్యనిర్వహణము సమగ్రముగయుండును. సభ్యులందరును పరితృప్తి చెందుదురు. సహకరించుట అనుకరించుటకన్న కష్టమైన పని. “పై వారి ననుకరింతుము. తోటివారితో సహరించము.” ఇది ప్రస్తుత మానవుని లక్షణము.



🍀.  నువ్వు వర్తమాన క్షణంలో వుంటే దైవత్వంలో వున్నట్లే. ధ్యానానికి అదే అర్థం. ప్రార్థనకు అదే అర్థం. 🍀


దైవత్వానికి దారి హఠాత్ సంభవమైంది. ప్రతిస్పందనతో వుండడమంటే దైవత్వంతో వుండటం. మనసు ఎప్పుడూ ప్రతిస్పందన గుణంతో వుండదు. సహజంగా వుండదు. ఈ క్షణంలో వుండదు. ఎక్కడో గతంలోనో, భవిష్యత్తులోనో వుంటుంది. ఒకటేమో యిపుడు లేనిది, యింకొకటేమో యింకా రానిది. వాటి మధ్య అది అసలయిన దారిని కోల్పోతూ వుంటుంది.


వర్తమాన క్షణమన్నది కాలంలో భాగం కాదు. అందువల్ల వర్తమాన క్షణమన్నది మనసుకందదు. మనసు, కాలం ఒక్కలాంటివే. అది నీలోని భాగమని నువ్వనవచ్చు. కానీ కాలం, మనసు నీకు బయట వున్నాయి.


నువ్వు వర్తమాన క్షణంలో వుంటే దైవత్వంలో వున్నట్లే. ధ్యానానికి అదే అర్థం. ప్రార్థనకు అదే అర్థం. ప్రేమకు అదే అర్థం. వర్తమానంలో నువ్వు తీసుకునే చర్య నీ చర్య కాదు. అది నీ నించీ దైవత్వం నిర్వహించే చర్య. అది నీ గుండా ప్రవహించే దైవత్వం. 


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

[05:05, 08/07/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 287  / Sri Lalitha Chaitanya Vijnanam  - 287 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁


🍀  67. ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ ।

నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా ॥ 67 ॥ 🍀


🌻 287. 'నిజాజ్ఞా రూపనిగమా'🌻 


దేవి ఆజ్ఞా రూపములే వేదములు అని అర్థము. మహాచైతన్య ముద్భవించిన వెనుకనే వేదముల ప్రసక్తి. ప్రళయమున వేదములు మహా చైతన్యములోనికి, మహాచైతన్యము ప్రళయములోనికి ఇమిడి యుండును. అపుడేమియు లేనట్లుండును. లేనట్లుండుటయేగాని లేకుండుట కాదు. లేనట్లున్న స్థితియే ఆది. అందుండి ఉద్భవించునది మహాచైతన్యము లేక శ్రీమాత. ఆమె ఇచ్ఛయే వేదములకు మూలము. 


మన యందలి సంకల్పముల పుట్టుకకు కూడ ఈ ఇచ్ఛయే కారణము. పుట్టిన సంకల్పము భావ రూపము, భాషా రూపము, కర్మ రూపము దాల్చును. ఇచ్ఛయే కారణముగ ప్రాణస్పందనముకూడ కలుగును. సంకల్పము ఋగ్వేదము కాగా, భావ మయము, చేత మయము అగుట యజుర్వేద మగును. వీని కాధారముగ సామవేదమై ప్రాణములు స్పందించును. అవతరించు సృష్టి అధర్వణ వేదమై నిలచును. 


ఇట్లు శ్రీమాత ఇచ్ఛయే అన్ని వేదములకు మూలము. నాలుగు వేదములు ఆమె ఆజ్ఞా రూపములే. నిగమము లనగా వేదానుసారమైన తంత్రములు, తంత్రము లనగా విధానములు. ఏ మానవుని యందైననూ ఈ నాలుగు వేదములే వ్యక్తమగు చుండును. మానవునికి కలుగు స్ఫురణ, భావము, ఉచ్చారణ ఋగ్వేదము. అతని యందలి ప్రాణ ప్రవృత్తులు సామ వేదము. భావనను తీరుగ అమర్చుకొని కార్యములు యజ్ఞార్థముగ నిర్వర్తించుట యజుర్వేదము. ఇట్లు నిర్వర్తింపబడిన కార్యములు భూమిపై అవతరించుట అధర్వణ వేదము. 


ఇట్లు నాలుగు వేదములు మానవుల యందు ప్రకాశించు చున్నవి. ఇట్లు ప్రకాశించుటకు మూలము మన యందలి శ్రీదేవి ప్రకాశమే. ఆమె చైతన్య స్వరూపిణిగ మన యందుండుట వలన మానవుడు ఆ చైతన్యము, తన చైతన్యమని భ్రమపడు చుండును. అట్లే తన సంకల్పమని, తన ప్రాణమని, తన తెలివితేటలని, తాను సృష్టించెనని భావించును. కాని అన్నిటికీ మూలమైన స్ఫురణ కలుగనిచో ఏమి చేయగలడు? శ్రీమాత ఆజ్ఞగనే నాలుగు వేదములు, సృష్టి యందు మానవుని యందు వర్ధిల్లుచున్నవి. 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[06:58, 08/07/2021] +91 99491 88364: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

💚💚💚💚💚💚💚💚💚💚


సమస్యను పూరించండి.......


నకిలీ  లంజ  గతిం  చరించు

    మృగముం  తా గోరె శ్రీరామునిన్

***********

ఇందులో  బూతు మాట లేదు.

పదముల విరుపు గమనించండి.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇది బిందుయతి.

0త, 0థ, 0ద, 0ధ....... న  లకు యతి

అప్పకవీయం...10వ . యతి   చూడండి.


🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

🟢🟢🟢🟢🟢🟢🟢🟢🟢🟢

 వ్యర్ధ వాదా లే కంఠము ను గట్టిగ పట్టి పో షించే

స్వార్ధ బుద్ధి తో ను శుద్ధి చేయు పలుకు నిప్పు పెట్టి నట్లె

ఆర్ధి కముగా నే అర్ధ ముపయోగము తర్క వాద మొద్దు

వ్యర్ధ భావ ఘటము వెండి కొండ వేడి ఉన్న లేనట్లే


 తకలీ తిర్గుగతిం మధించు సుఖమంతా ఆశ శ్రీ భ్రాంతి యున్

మకిలీ చేరుమతిం భేధించు వయసంతా చేష్ట శ్రీ శక్తి యున్

నకిలీ లంజ గతిం చరించు మృగముం తా గోరె శ్రీ రామునిన్

ఒక లీల భవతిం హరించు జగతం తా గోరె శ్రీ భక్తియున్


ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యే నమః


నిను వీడి ఉండదు లె

ఉండదు కాలమే లె

కాలము నీడలా వెంటాడెను ఈశ్వరా


బంధము గా మారెను

మారె బుధ్ధి చేరెను

చేరె నీడే వెంటాడు మనిషి ఈశ్వరా


గ్రహణము చీకటితో

చీకటి వెలుగుల తో

వెలుగు నీడల మనిషి జీవితం ఈశ్వరా

: ధన్యవాదాలు మీరు ఇతరులు వ్రాసినవి పెట్టగలరు


: నకిలీ లంజగతిన్ చరించు మృగమున్ తాగోరె శ్రీరామునిన్.

ఈ సమస్యకు నాపూరణ.

ఒకచో నుండక గంతులేయుచును వారున్నట్టి యచ్చోటనే

చకితంబయ్యెడు దాని మేను మెరిసెన్ స్వర్ణంపు ఛాయల్ గనన్

యెగదొట్టున్ యది సంచరించెను గదా యింపారుగా నొప్పె జా

నకి లీలం జగతిన్ చరించు మృగమున్ తాగోరె శ్రీరామునిన్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

సుకుమారంబగులేడిచూడుమదిగోచోద్యంబుగాదోచెలే

దకటాదానినిపట్టితెమ్మునికనాదైవంబునీవేకదా

యికముందెన్నెడుఁగోరనేదినినుపొమ్మింకంచుతాపల్కె,జా

నకిలీలంజగతించరించుమృగముంతాగోరెశ్రీరామునిన్!


నిత్య విద్యార్థి.

 ప్రాంజలి ప్రభలో పోష్టు చేసినందు ధన్యవాదాలు, ఫేస్బుక్ లో మీ అనుమతితో పోష్టు చేస్తాను రోజువారి పత్రిక ఆన్లైన్

 నేటి ప్రాంజలి భక్తి ప్రభ

*అత్యంత అరుదైన దర్శనం

కాశీ విశ్వనాథుడే స్తుతించిన మహామహిమాన్వితమైన డుండి గణపతి స్వామివారి నిజరూప దర్శనం 

ఎంతటి కష్టాలైనా తొలగించే మహామహిమాన్వితమైన సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతిరోజూ కనీసం 4 సార్లు అయినా, 6 నెలలు పాటు భక్తి శ్రద్ధ, విశ్వాసాలతో పఠిస్తే గణేశుని విశేష అనుగ్రహం కలుగుతుంది*

 "శ్రీ మహాదేవ కృత డుండి రాజ స్తవం" సుప్రసిద్ధము

 

కాశీ మహా క్షేత్రములో ఉన్న 54 ముఖ్య గణపతుల్లో అతి ముఖ్యముగా చెప్పబడు"శ్రీ డుండి గణపతి మహారాజు"  దివ్య దర్శనం 

మనం ఏ కార్యం తలపెట్టినా, అది ఎటువంటి అవరోధాలు కలుగకుండా, విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్ధిస్తాము. సకల సంకటాలనూ తొలగించే గణపతి అనుగ్రహం కోసం సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే, శ్రీ గణేశ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎవరికి వారు స్వయంగా, అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ప్రతీరోజూ ఈ మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి, గణేశ అనుగ్రహం పొందుదాం

*

 నారద ఉవాచ

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |

భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || 1 ||

దేవతలందరికంటే  ముందుగా పూజిపబడే వాడు, గౌరీ తనయుడు, విఘ్నాధిపతీ ఐన గణపతిని సకల సుఖ సౌభాగ్య ధన ధాన్య ఐశ్వర్య ఆరోగ్య వృద్ధి కొరకు సదా  నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధించెదను🙏🌼🌿

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |

తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || 2 ||

ప్రధమ నామం : వక్రతుండ (ఒంపు తిరిగిన తొండము కలవాడు),


 ద్వితీయ నామం: ఏకదంత (ఒకే దంతము కలవాడు), 

తృతీయ నామం: కృష్ణపింగాక్ష (ముదురు గోధుమ రంగు కన్నులవాడు),

చతుర్థ నామం: గజవక్త్ర (ఏనుగు ముఖము వంటి ముఖము కలవాడు).


లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |

సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || 3 ||


పంచమ నామం: 


లంబోదరం (పెద్ద పొట్ట కలవాడు), 


షష్టమ నామం: వికట (భారీ కాయము కలవాడు), 


సప్తమ నామం: విఘ్నరాజా (విఘ్నాలను తొలగించేవాడు), 


అష్టమ నామం: ధూమ్రవర్ణ (ముదురు గచ్చకాయ రంగు కలవాడు).


నవమం బాలచంద్రం చ దశమంతు వినాయకమ్ |

ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || 4 ||


నవమ నామం: బాలచంద్ర (చంద్రుని శిరస్సుపై ధరించేవాడు), 


దశమం: వినాయక (విఘ్నములకు నాయకుడు)


 ఏకాదశ నామం: గణపతి (దేవగణములకు అధిపతి) 


ద్వాదశ నామం: గజానన (ఏనుగు ముఖము కలవాడు).


ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |

న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || 5 ||


విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |

పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || 6 ||


ఈ ద్వాదశ (పన్నెండు) నామముల శ్లోకం భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వలన జ్ఞానము కోరుకున్నవారికి జ్ఞానము, ధనధాన్యములు కోరుకున్నవారికి ధనధాన్య వృద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునేవారికి పుత్ర సంతానము మరియు మోక్ష సిద్ధి కోరుకునేవారికి మోక్షము సిద్ధించును


జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |

సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || 7 ||


ఈ సంకట నాశన గణపతి స్తోత్రం ఆరు మాసాలపాటు జపించినవారికి కోరిన ఫలములు లభించును. ఒక సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్౹౹

తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || 8 ||

🌿🌼🙏ఈ సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధలతో రాసి ఎనమండుగురు బ్రాహ్మలకు దానం చేసినయెడల ఆ వినాయకుని కృపకు పాత్రులై సకల జ్ఞానములు సిద్ధించును🙏🌼🌿


ఓం గం గణపతయే నమః

 నేటి ప్రాంజలి దేవాలయ వివరములు

చనిపోయినవారిని కొన్ని నిమిషాలు  బతికించే  దేవాలయం ..

 #భారత దేశంలో చనిపోయిన వారిని తిరిగి బతికించగలిగే దేవాలయం ఉదన్నది వాస్తవం. 

ప్రపంచంలో శాస్త్ర, సాంకేతికత ఎంతగా అందుబాటులోకి వచ్చినా మానవ మేదస్సుకు అర్థం కాని ఎన్ని విషయాలు ఈ విశ్వంలో ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇందులో చావు, పుట్టుకలు కూడా ఉన్నాయిఅందులోనూ ప్రాణం పోకడ గురించి ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అదే కోణానికి చెందిన కథనం ఇది. ఈ దేవాలయంలో చనిపోయినవారు కొద్ది సేపు తిరిగి ప్రాణాలతో బతుకుతారు. ఇందుకుl సంబంధించిన వివరాలు..


 #లఖమండల్ మందిరం

ఇందులో ప్రధాన దైవం ఆ పరమశివుడు. లఖ్ మండల్ ఒక పురాతన దేవాలయం. ఇందు పరమశివుడు నిత్యం నివశించే ప్రాంతంగా స్థానికులు నమ్ముతారు.

భారత దేశంలో అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో ఈ లఖ్ మండల్ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయాన్నిసందర్శనం వల్ల దురదృష్టం పోయి అదుష్టం వరిస్తుందని చెబుతారు.


పాండవులు కాలుపెట్టిన పవిత్రస్థలాల్లో లఖ్ మండల్ మందిరం కూడా ఒకటి. పాండవులు అజ్జాత వాసంలో ఉన్న సమయంలో ఈ లఖ్ మండల్ మందిరంలో కొద్ది రోజుల పాటు గడిపారని చెబుతారు.


లఖ్ మండల్ అనే పదం రెండు పదాల నుంచి ఉద్భవించిందని చెబుతారు. #లఖ్ అంటే అనేక, #మండల్ అంటే దేవాలయం లేదా లింగం అని అర్థం


ఇక్కడ భారతదేశ పురావస్తుశాఖ అధీనంలో జరిపిన తవ్వకాల్లో అనేక కళాఖండాలు బయటపడ్డాయి. అందులో అతి ముఖ్యమైన ఆకర్షణ స్వామి వారి #లింగం 


అత్యంత పారదర్శకత కలిగిన ఈ దేవాలయం చుట్టుపక్కల ఉన్న పచ్చదనం అంతా అ లింగం పై భాగంలో మనం గమనించవచ్చు. ఒక్కసారి ఈ లింగాన్ని చూస్తే ఆధ్యాత్మిక పొంగిపొర్లుతుంది🙏


ఇక్కడ స్థానికులు చెప్పే కథను అనుసరించి ధుర్యోధనుడు పాండవులను లక్క గృహంలో నిర్భంధించి చంపాలని నిర్ణయిస్తాడు. ఆ గృహమే ప్రస్తుత దేవాలయమని భక్తులు నమ్ముతారు.


ఇక ఈ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద మానవ, దానవ అనే రెండు ఎత్తైన విగ్రహాలు మనలను ఆకట్టుకొంటాయి. అయితే స్థానికులు మాత్రం ఈ రెండు విగ్రహాల్లో ఒకటి భీమసేనుడిదని, మరో విగ్రహం అర్జునుడిదని నమ్ముతారు.


మానవ, దానవ ప్రతిమలను విష్ణువు నివశించే వైకుంఠం ద్వారపాలకులైన జయ విజేయులతో పోల్చేవారు కూడా స్థానికులు చెబుతారు. ఎవరైనా చివరి ఘడియల్లో ఉన్నప్పుడు లేదా చనిపోయిన వెంటనే ఈ రెండు విగ్రహాల ముందుకు తీసుకువస్తారు

అనంతరం ఆ పరమశివుడు కొలువై ఉన్నట్లు భావించే ఇక్కడి శివలింగాన్ని అభిషేకించిన నీటిని ఆ చివరి ఘడియల్లో ఉన్న వారికి లేదా చనిపోయిన వ్యక్తి నోట్లో పోస్తే తిరిగి కొద్ది సేపు బదుకుతాడని ఇక్కడి స్థానికులు బలంగా నమ్ముతారు

ఇందుకు ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు చూపిస్తారు. ఇక ఈ ప్రాంతానికి దగ్గర్లో దుంధి ఓడారి అని పిలువబడే ఓ గుహ ఉంది. స్థానికుల కథనం ప్రకారం పాండవులు తమను కాపాడుకోవడానికి ఈ గుహలోనే ఉన్నారని చెబుతారు


 దేవతలు నివసించే రాష్ట్రంగా పేరొందిన #ఉత్తరాఖండ్ లోని #డెహ్రడూన్ జిల్లాలో చౌన్సర్ - బావర్ అనే ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది.

ఈ దేవాలయాన్ని ఉత్తర భారత దేశ శైలిలో నిర్మించారు. లఖ్ మండల్ దేవాలయం #చక్రతా నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఈ మెరిసే శివలింగం..* శివలింగంపై నీరుపోస్తే అద్దంలా అద్భుతంగా మెరుస్తూ పోసినవారి బింబం  లింగంపై స్పష్టంగా కనిపిస్తుంది.. *అభిషేకం చేసిన నీరు కూడా స్వఛ్చంగా మారటమే కాకుండా రుచి కూడా తియ్యగా మారడం ఈ లింగంలోని అద్భుతం.

🕉️ఓం నమః శివాయ🕉️🙏🙏🙏

రోడ్దు ద్వారా ఈ దేవాలయాన్ని చేరుకోవాలనుకొనేవారు ముందుగా చక్రతా కు వెళ్లి అక్కడి నుంచి బస్సు లేదా ట్యాక్సీ ద్వారా ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు.

ఇక్కడికి దగ్గరగా అంటే డెహ్రడూన్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 107 కిలోమీటర్లు. ఇక 130 కిలోమీటర్ల దూరంలో జాలి గ్రాంట్ విమానాశ్రయం ఉంది.

ऊँ!

----

"మత్తకోకిల..

--

శ్రీలనిచ్చెడిమాసిరమ్మనురీతిఁగొల్చెదభక్తిమై


ఉత్పలమాల

--

శ్రీలనువర్షధారలుగశీకరతుల్యఁపు సౌఖ్యమిచ్చెడున్


శార్దూలము..

--

శ్రీలక్ష్మీ పతిపండరీశుఁడొసఁగున్ శేషాహితల్పుండునౌ


చంపకమాల..

--

కలుషవిహర్త యేమనకుదిక్కనియంద్రుగనిత్యభాగ్యమై !!! "

----------------------------------------

 కల్లోలం అనిపించుటే కళలకున్ కాలమునమ్ముండుటే 

ముల్లోకాలలొ ఉండుటే ఫలముకున్ దానముధర్మాలకే

సౌలభ్యం కలుగించుటే సమయమున్ కాలహితమ్ముండుటే

శ్రీ లక్ష్మీ పతి పండరీ శుడొసగున్ శేషహితల్పుండునౌ



 ఉదయ అడుగు జాడలు

జాడ వెలుగు నీడలు

నీడల్లా వెంటాడె మనుష్యులు ఈశ్వరా


నీడగా నీ వెనుక

వెనుక నేను చిక్కక

చిక్కు లొచ్చినా దారి మార్చదు ఈశ్వరా


మాయ గ చేరు నీడ

నీడ ఉండును అండ

అండ దండ గా నీడలోనే ఈశ్వరా


అద్దం లో బింబమే

బింబం సుందర మే

సుందర నీడ మనసు మార్చేను ఈశ్వరా


వీడెను మబ్బు నీడ

నీడ గా వాన పొడ

పొడ గడబిడ నీడలు కొలువగును ఈశ్వరా


ఊహలే నీడలై

నీడలే మాయలై

మాయలే మనుష్యుల జీవితం ఈశ్వరా


నిను వీడి ఉండదు లె

ఉండదు కాలమే లె

కాలము నీడలా వెంటాడెను ఈశ్వరా


బంధము గా మారెను

మారె బుధ్ధి చేరెను

చేరె నీడే వెంటాడు మనిషి ఈశ్వరా


గ్రహణము చీకటితో

చీకటి వెలుగుల తో

వెలుగు నీడల మనిషి జీవితం ఈశ్వరా


 కుండ నీటిన బింబము 

బింబము తోను ఘటము 

ఘటము లోన చంద్రుని నీడ యే ఈశ్వరా



 ముత్యపు చిప్ప ఏ పుత్తడి వెలుగులే అనుట మనిషి తలపు 

గాజు ముక్కలన్నీ కొత్త మణులుగాను చెప్పు మనిషి మలుపు 

పిండి నీరు యంత పాలు చెప్పు మాయ ఇదియు నమ్మ పలుకు 

ఎండమావుల్లో  నీళ్లను చూచేటి బ్రాంతి చెందు జగతి 

ఏక దేవుడనే కాక అన్య దేవుళ్లను పూజ చేయు మనిషి


తాపత్ర్పపుల్ల తవధీరహ మన్ననేళ

శ్యామత్ర్పపుల్ల సుఖధీరహ విన్నహేళ

ఈపత్ర్పపుల్ల సరసీరుహ నారికేళ

ప్రేమత్ర్పపుల్ల సహనోరుహ ధారికేళ  ... .... 17


కాలద్రుమాది కళ నాయక ఏలికానాం

ఆశద్రుమాది వర నాయక సేవకానాం

పాశద్రుమాది సహ నాయక పోషకానాం

పూగద్రుమాది సు మనోహర పాలికానాం  .. .... 18


సామర్థ్య సాక్షి విమల స్సహ సర్వ ధర్మాః

ప్రారబ్ధ భావ వినయ స్సహ ఆర్య సర్వాః

కారుణ్య హాయి మనసు స్సహ కార్య బందాః

ఆయాతి మంది మనిల స్సహ దివ్య గంధైః ... ... 19


ప్రేమాత్మ మార్గ విభో యశ సుప్రభాతమ్   

సాహిత్య లక్ష్య విభో మది సుప్రభాతమ్ 

ఆరోగ్య సేవగ విభో శుభ సుప్రభాతమ్  

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్   ... ..... 20


ఉన్మాద మాత్ర కల నిత్యము పంజరస్థాః

తన్మాయ కాల భయ తత్వము పంజరస్థాః

సన్మార్గ జైత్ర మది సత్యము పంజరస్థాః

ఉన్మీల్య నేత్ర యుగ ముత్తమ పంజరస్థాః ... ... 21


విశ్వాసతిష్ట కలగా ఫల సాధ్యమవ్వు   

సత్యాప్…

[18:43, 08/07/2021] Mallapragada Ramakrishna: ప్రాంజలి ప్రభ ....కరోనాపై ..

పద్యాలు 

రచయత: మల్లాప్రగడ  రామకృష్ణ  


ప్రాంజలి ఘటియించి చెపుతున్నాను ఈ 

మార్పుకు సహనము కరుణ మనస్సు 

ఏకమవుట వల్ల నిర్మలమ్మే వేద వా

క్కే మనుగడ మార్గమే 


కాలము నిను వంచి శోధనా వేద నా 

చేసి మనసు మమత మగువ సొంత 

మంత కలలుగాను లోక మంతా ఎదో 

తీపి వలయ మైనదే 


ఏమని తెలి పేది దేశ ఆరోగ్య మం

తా నలిగియు వెతలు కలిగియే మ 

నో మయమును చెప్ప వీలు లేకే సహా 

యమ్ము అటక ఎక్కియే  


దారుణములు జర్గు చుండెనే ఏది మం 

చో చెడుయో తెలుసు కొనక ఉండు

టే సమయ మంత కర్జి పోతున్నదే   

యీ మనసుకు భాదయే 


మారు పలుకు లేక చేయ వల్సిందె చే

సే విషయపు మలుపు తెలుపు లోగ    

అంత జరిగిపోయి సాధనంతా సహా

యమ్ము కరుణ లేకయే  

--(())--

No comments:

Post a Comment