Saturday 10 July 2021

12/07/2021***

                       వాక్కు

[10:00, 12/07/2021] Mallapragada Sridevi: మేము ఆరోజుల్లో

.          ఆరోజులు మధుర జ్ఞాపకాలు

బాల్యంలో మనం విన్న  పెద్దల మాటలు

నిన్న మధ్యాహ్నం  భోజనం చేస్తుంటే  పొలమారింది. నెత్తి మీద కొట్టుకుని మంచినీళ్లు తాగుతుంటే "ఎవరో తలుచుకుంటున్నట్లున్నారు. బహుశా పెద్ద మనవడేమో?" అంది మా ఆవిడ.

"అయుండొచ్చు"అన్నాను నేను కాస్త నిమ్మళించాక.

అన్నం తిని సోఫాలో కూచోగానే, చిన్నప్పటి మా ఇంటి భోజనాల సీను జ్ఞాపకం వచ్చింది. ఇప్పటిలా టేబుల్స్ లేవు గదా, ఇంట్లో ఉన్నవాళ్ళం అందరం బావి దగ్గిరకు వెళ్లి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నాకే, నేల పీటల మీద బాసింపట్టు వేసుకుని కూచుని భోంచేసేవాళ్ళం. 

వంటకన్నీ ఇత్తడి గిన్నెలే ఉండేవి ఎక్కువగా. కంచాలు,గ్లాసులు మాత్రం స్టీలువి ఉండేవి.  మంచినీళ్ళు తాగే చెంబులు కంచువి కూడా ఉండేవి. చాలా పాత్రల మీద ఎంతో గుండ్రంగా  తెలుగు అక్షరాలతో పేర్లు చెక్కి ఉండేవి.  బొగ్గు కుంపట్ల మీదే వంటంతా...

అమ్మ పక్కనే కూచుని వడ్డిస్తూ ఉండేది.

"ఇంకొంచెం కలుపుకో, నెయ్యి వేసుకున్నావా" అంటూ అందరినీ కనుక్కుంటూ వడ్డించేది.

ఒకవేళ భోంచేస్తున్నప్పుడు ఎవరికైనా పొలమారితే గానీ, పచ్చడి కారానికి వెక్కిళ్ళు వస్తేగాని, పక్కనే కూచున్న అమ్మ కొన్ని నీళ్లు తీసుకుని వారి నెత్తి మీద జల్లి

 "నీ పేరేంటి, ఏ ఊళ్ళో పుట్టావు చెప్పు?"

అని అడిగేది.

నేను అయితే అడ్డతీగల అని, మా అక్కయితే కాకినాడ అని చెప్పేవాళ్ళం. కాస్త స్థిమిత పడ్డాక నా పేరుకి, ఊరు పేరు కి,  ఎక్కిళ్ళకి ఏమి సంబంధం అని ఆడిగితే,  "ఏమో తెలీదు గానీ నీకు వెక్కిళ్ళు పోయాయా లేదా" అని తిరిగి ప్రశ్న వేసేది అమ్మ. నిజంగానే గమ్మత్తుగా వెక్కిళ్ళు ఆగిపోయేవి.

ఇలాగే ఇంకో కిటుకు ఉండేది అమ్మ దగ్గిర. "మీ ఫ్రెండ్ రాము గాడి సైకిల్ పోయిందిట గదా" అనో "పక్కింటి పిన్నిగారు ఇంట్లో బిందె ఎవరో ఎత్తుకుపోయారుట" అంటూ ఏవో వింత వార్తలు చెప్పేది.

"నిజమా??"అంటూ మన దృష్టి అటు వెళ్ళేది.  ఈ లోపల వెక్కిళ్ళు, పొలమారడం తగ్గిపోయేవి ఆశ్చర్యంగా.

అమ్మ నవ్వేసి " ఊరికే...నీ దృష్టి మళ్ళిద్దామని"అనేది నవ్వుతూ

అలాగే అన్నం తినేటప్పుడు అస్సలు మాట్లాడవద్దు అనేవారు పెద్దలు. మాట్లాడుతూ తింటే అన్నం వంటికి పట్టదుట.

అన్నం తింటూ మధ్యలో కంచం దగ్గిరనుంచి లేవకూడదు అనేవారు.

కంచంలో ఏమీ వదిలేయకుండా తినాలి, వృధా చేయకూడదు, కంచంలో చేయి కడగకూడదు అని చిన్నప్పటినుంచే తెలుసుకున్న తరం మనది.

 మనతో కూచున్న అందరూ అన్నం తినడం అయ్యాకే లేచి చేయి కడుక్కునేవాళ్ళం.

అమ్మ మాత్రం అందరం తిన్నాక,

నాన్నగారు తిన్న పళ్ళెంలోనే తానూ

తినేది.

రాత్రిపూట ఉప్పు అని అడిగేవారు కాదు పెద్దవాళ్ళు.  ఎందులోనైన ఉప్పు తగ్గినా, మజ్జిగ లోకి కావలసి వచ్చినా, "కాస్త చవి చూపించు" అనేవారు. కంచములో ఒక పక్కకి వేసేవారు గానీ చేతిలో వేసేవారు కాదు.

అలాగే రాత్రి పూట ఉసిరికాయ పచ్చడి నిషేధం. తినకూడదు అనేవారు.

వడియాలు పెట్టాలంటే ఆ బూడిద గుమ్మడికాయ మీద మగవాళ్ల  చేతికి కత్తి ఇచ్చి  ఒక చిన్న గాటు పెట్టించే తరవాత ఆ కాయని ముక్కలు చేసేది అమ్మ

చీకటి పడితే చెట్టు మీద చేయి వేయవద్దు అనేవారు. పూలు గానీ పళ్ళు గానీ , కరివేపాకు గానీ, సూర్యాస్తమయం ముందే కోయాలి అనేవారు. 

పసిపిల్లలు ఉయ్యాలలో లేనప్పుడు ఖాళీ ఉయ్యాల ని ఊపవద్దు అనేవారు. 

 ఆడపిల్లలు బియ్యం తింటుంటే నీ పెళ్లి సమయానికి పెద్ద వాన వస్తుంది అని భయపెట్టి ఆ అలవాటు మానిపించేవారు.

ఉరుములు,మెరుపులు, పిడుగులతో వర్షం వస్తుంటే ఉరిమినప్పుడల్లా "అర్జున, పల్గుణ, పార్థ, కిరీటి"  అని అంటూ దండం పెట్టుకుని మమ్మల్నీ అలా చేయమనేది  అమ్మ.

వినాయకచవితి నాడు సాయంత్రం చుట్టుపక్కల అందరి ఇళ్ళకి వెళ్లి  ఆ ఇంటి వినాయకుడిని చూసి  రమ్మనేవారు. ఎంతమంది వినాయకులకు మొక్కితే అంత బాగా చదువు వస్తుంది అనేవారు.

నాన్నగారూ ఏదైనా పని మీదో, లేక ఏదైనా ఊరి కో ప్రయాణమవుతుంటే శకునం చూసి మరీ

రోడ్ ఎక్కేవాళ్ళు.

 "పాలమ్మాయి వస్తోంది. మంచిది వెళ్ళిరండి"అని అమ్మ అనేది. ఎవరూ ఎదురు రాకపోతే అమ్మ గానీ, అక్క గానీ అటు వెళ్లి ఇటు  ఇంట్లోకి శకునంగా రావడం కూడా జరిగేది మధ్యేమార్గంగా.

గడప మీద కూచోకూడదు  అని చెప్పేవారు. ఏదైనా ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా గడప దాటి చేయమనేవారు.

ఆడపిల్లలు జుట్టు విరబోసుకుని  ఉండకూడదు అనేవారు. 

దొడ్లో కాకి ఆగకుండా కావు కావుమంటుంటే చుట్టాలు వస్తారు అనుకునేవాళ్ళం.   అలాగే ఎవరైనా చుట్టాలు అనుకోకుండా వస్తే "రండి రండి" అని  సంతోషంగా ఆహ్వానిస్తూనే "పొద్దున్న కాకి అరచినప్పుడే అనుకున్నా ఎవరో ఇంటికి వస్తారని..." అనేవాళ్ళం.

ఒక కాకి చనిపోతే దాని చుట్టూ పది కాకుల గుంపు చేరి కావు కావుమంటూ వాటి సంఘీభావమో, సంతాపమో తెలియచేస్తే వాటి స్నేహాభావాన్ని మెచ్చుకున్నాము. ఆబ్దికాలలో కాకి పిండం తిన్న కాకులను మన పితృదేవతలలాగా భావించి శిరస్సు వంచి మరీ దండం పెట్టేవాళ్ళం.

ఇప్పటి తరానికి ఇవన్నీ చాదస్తాలు, పిచ్చి నమ్మకాలు లాగ అనిపించవచ్చు గానీ ఇవన్నీ వింటూ, చూస్తూ, ఆచరిస్తూ పెరిగిన తరం మనది. ఎందుకు అని ఎదురుతిరగలేదు,

ఇప్పటివారిలా వితండవాదం చేయలేదు, చాదస్తాలు అని కొట్టి పారేయ్యలేదు.

పెద్దల మాట చద్దిమూట అనుకుంటూ ఆచరించాము.హాయిగా ఆనందంగా పెరిగాము...

కాదంటారా???


అవునంటే మీరు విన్న మీ మీ పెద్దల మాటలు మరిన్ని ఇక్కడ పంచుకోండి. 🌹

.


----

"సీ.

----

దక్షిణామూర్తయే దాక్షాయణీశాయ

    శంభవే రుద్రాయ 

శంకరాయ

నగరాజపూజ్యాయ నగవాసినేనమః

     నమకరతాయ చ చమకకలిత

సేవ్యాయ వృషభేంద్రసేవితాయశివాయ

     రాఘవహృదయాయ అఘహరాయ

నేత్రత్రయాయ చ నిగమాత్మరూపిణే

     గిరిజార్చితాయ చ పురహరాయ

గీ.

--

ఓంనమఃకపాలకరాయయోగినేచ

ఓంనమఃపినాకహస్తాయ యుక్తి ముక్తి

దాయినే చ భవాయ చ దాంతిదాయ

సాంబశోభినే స్థాణవే శర్మదాయ !!! "

----------------------------------------

( శ్లోకమేనం మయా అప్పాజీ పేరి..విరచితం , మహాజనాః !!! )

---------------------------------------

 భార్యాభర్తల     అనుబంధం గురించి

             అమృత వాక్యాలు

నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.

తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.

అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.

అహంకారి భార్య దొరికితే అంబానీ కూడా సన్యాసంలో కలవాల్సిందే.

ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే,ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే ఇదే మధురమైన బంధం.

భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం.బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.

సంసారం అంటే కలసి ఉండడమే కాదు.

కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.

ఒక మంచి భర్త భార్య కన్నీరు తూడుస్తాడెమో కానీ అర్థం చేసుకునే భర్త

ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.

భార్యాభర్తల సంబంధం శాశ్వతం.కొంతమంది మధ్యలో వస్తారు.

మధ్యలోనే పోతారు.

భార్యకి భర్త శాశ్వతం.

భర్తకు భార్య శాశ్వతం.

ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క!

అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.

జు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం.

ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది "మాంగల్య బంధం"

బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.

మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది.కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.

కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.

నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే.

నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.

ప్రేమ అనేది చాలా విలువైనది.దాన్ని "వివాహం"అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.

సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం"కుటుంబం"

గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.

కలిమి లేములతో..

కలసిన మనసులతో...

కలివిడిగా మసలుకో..

కలకాలం సుఖసంతోషాలు పంచుకో..!

బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది.

పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే.

ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదు.


భర్తకి భార్య బలం కావాలి.

బలహీనత కాకూడదు

భార్యకి భర్త భరోసా కావాలి

భారం కాకూడదు.

భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి

అయోమయం కాకూడదు.

మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.

అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే

ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.

పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా,కష్టం- సుఖం గురించి కాదు.

ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.

 ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం......... సేకరణ.. మీ.. కారంకి -హైదరాబాద్


మనోసౌలభ్యమ్మే సుమధుర సుఖం సర్వ విదితం

వినాప్రేమత్వమ్మే మనసుకు మదం పెర్గి పరువం

గుణాలోలత్వమ్మే విషయము ననే మార్చు తరుణం

మనావేదాంతమ్మే బతుకుల కళే మార్చు శివుడే


 హృదయం స్పందనే మన జీవితం

వినయం వల్లనే మన ఉద్యమం

సహనం ఉండుటే మన విద్యయే

సుఖమే సంపదే మన తృప్తి గా


నేడు అందరికీ జన్మదిన శుభాకాంక్షలు 

మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ


ఫలముల నందించు చుండు నిత్యము

బలములు పెంచేను పండు పత్యము

విలువలు మార్చేను ఎండు పైత్యము

వెలుగుల సూర్యుడు పంచు సత్యము


సమత్వం అంటూనే మది మురిప మే నీ పలుకు గా

సమర్ధత్వం ఏదీ మనుగడ తొ నే  నీ మనిషి గా

మమతే పొందా కా నయనముల నే నీ పరము గా

సమతే కోరే నే వినయముగ నే నీ వరము గా


అంటూ ఈశ్వరుని కోరే


నేటి సమస్యా పూరణం


వాడికి ఏమి తెల్పిన ను వల్లదు అంటునె సర్దుకొమ్మనెన్

తండ్రికి లేని మీసములు తల్లికి వచ్చెను కూతురేడ్వగన్

వేడికి వచ్చి పోవునులె వాటిని గూర్చియు ఎందుకేడ్పుయున్

ఊడలు పెర్గి నీడ లను ఊయల వల్లెను ఊగు చుండగన్

వేడిన దైవ శృష్టయును తెల్పు ట సాధ్యము ఎవ్వరెర్కయున్


సక్యతే మనస్సు  సుఖము కళలు కొరకు విశ్వ మాయచూడు 

ఐక్యతే కుటుంబ ఐనను నయము తలచు వెలుగు ఒక్కటేను

ముఖ్య మై వినోద మనము పరము ఒకటి యగుటయేనుశక్తి

సౌఖ్యమే సహాయ సమయ వరము మధుర ముగను విద్య వల్ల


చామంతీ మల్లెల గులాబి పిలిచే జై కృష్ణు డేమైననే

ఏమోనే ఏ కవి మనస్సు తొలి చే ఎంతటి వైభోగమే 

సమ్మోహస్వరవాణి నాద చరితం స్వేతాంబరం ధారిగా

ప్రేమించే సకలం మురారి మనసై భాగ్యమ్ము పంచేను లే


మనోసౌలభ్యమ్మే సుమధుర సుఖం సర్వ విదితం

వినాప్రేమత్వమ్మే మనసుకు మదం పెర్గి పరువం

గుణాలోలత్వమ్మే విషయము ననే మార్చు తరుణం

మనావేదాంతమ్మే బతుకుల కళే మార్చు శివుడేే


స్రుగ్వ్యాపారము తోను వుండి మనసే సర్వుల్ని ఆకర్షి తం

దృగ్వ్యాపారము లోను సేవ తరుణం తత్భా వ సామాన్య మం

ధగ్వ్యాపారము తో అహమ్ము పెరిగే దారిద్ర్య నిర్మూలనం

వాగ్వ్యాపారము వల్లనే సమధురం వాత్స్యా య సౌలభ్యమే


 నేటి నా ఆలోచనా కవితా చందస్సు.

మగవారిని అహంకారం...

ఆడదాని మమకారం

మధ్య సంఘర్షణ

పర వశంలో మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ


పున్నమి నా కేలనో పువ్వులు నా కేలనో

వెన్నెల నా కేలనో వెల్తురు నా కేలనో

అన్ని యు  నా కేలనో ఆతృత నా కేలనో

ఉన్నవి నా కేలనో నచ్చిన నా కేలనో


అనుకొనే చిన్నది


కన్నుల లో నీటి నీ చూడరు లే ఎందు కో

మిన్ను ననే మేఘ మే కుర్వదు లే ఎందు కో

అన్ని తినే మన్షి కే కోపము యే ఎందు కో

ఉన్న పనే చేయ డే వాడును నా కెందు కో


అంటూ విలపించింది చిన్నది.


రమ్మని నీ వందు వా .. మత్తున నీ వుందువా

కమ్మని నీ పొందు నే.. వద్దని నీ వందు వా

చెమ్మ ను లే జుర్రు కో.. జారుట యే ఎందుకో

సొమ్ములు యే వద్దు లే.. ముద్దులు యే అందుకో


మొరటోడు మొగుడు గూర్చి తెల్పింది 


పొమ్మ ని నీ వందువా.. పూర్తిగ నన్ జంప గా

తుమ్ముల కే వద్దు నా .. కాలము నన్ చూడ వా

నమ్మితి నీ బుద్ధులు నే .. సాయము నన్ చేసె దా

కమ్మిన నీ నిద్దుర నే...ఆపియు నన్ చేరవా

అంటూ జాలిగా నెమ్మదిగా వేడుకుంది


నన్ను గనన్ మోహనా .. నే జడ మై యుంటినా

ఉన్న కథన్ తెల్పి తే... నా దియు తప్పంటి వా

చన్నులు నన్ చూపి తే.. ప్రే మయు తప్పంటి వా

విన్నప మున్ మోహ నా.. సౌఖ్యము ఏ లంటి వా


అంటూ ఘాటుగా చిన్నది కృష్ణు ను నే అడిగేను


కన్నుల తో గానరా .. కామిని నీ కంటి రా

మన్నన నే పొంద రా ... మాదియు నీ వంటి రా

తన్నుల నే తిందు నా.. తప్పుల నే చేతు నా

అన్నియు నీ కోర్క లే... తప్పవు గా నాకు నూ


భక్తి భావము గా వేడుకుంది శ్రీ కృష్ణుని చిన్నది..

చేసిన కర్మాను సారమే ఇది దిగులు వలదు 

మంచి రోజులు వచ్చు ముందు 

ఓర్పే నీ ఆయుధం..

ప్రేమే నీ లక్ష్యం ...

అని తెలుసుకో అంటూ పలుకులు వినబడే


అటులనే వాగ్వల్లభ

మేలు చేయు మోనమ్మే ..మోహపర్చు దేహమ్మే

ఆలి మాట ధర్మమ్మే ..ఆర్తి తీర్చు దేహమ్మే

జాలి చూపు వైనమ్మే ..దారి చూపు దైవమ్మే

మేలు చేయు మాఅమ్మే ... వేచి ఉండె కాలమ్మే

అంటూ ఇద్దరూ నమస్కారాలు చూపే 

.....,,,,,,.... 

నేటి ఆలోచనా పద్యాలు


మాకును తెల్పకే కధలు మానస మంతయు తిప్పుటే భయమ్

వేకువ జామునే కలిసి వేదన పల్కులె పల్కుటే వినమ్

మీకును మీకు మీకు మరి మీకును మీకును మీకు మీకునున్

మోక్కెద  నేను నేను విను మాటలు వద్దులె బంధనం కథే


అక్షర విన్యాసం అర్ధము నేతెల్పె అలుపెరుగని విధము

సాక్షి సామరస్య శక్తి నివ్వకయే సాదు వాద మొద్దు

మొక్షమేది రాదు మోడుగా మార్చ క నన్ను బతక నివ్వు

అక్షర సత్య మే ఆప కుండా పలకాలని దైవ మనె


విత్తు నే తినే ను విజయ చీమలు గా మానవ మృగాలే

చెత్త నే తినే జాతి పక్షులు గా మొలక ఎత్త కుండ

మత్తు గాను నెమరు మొక్కనుతినేసియు  మనుష జన్మ ఇదియు

ఎత్తులెన్నేసిన ఏదయలేనట్టి వెధవ బతుకు దారి


 నిదుర లోన గూడ నిప్పు అనియు అరిచి భయము తెచ్చు చుండు

కదిరి లాత్రిప్పుచు కలవ రించు చుండె మనసు తో మానవ

ఉదయ వెలుగులా గ ఊరు కోక ఆస్వాదించే ప్రకృతిలొ 

అద్భుతం బుగాను కలము పట్టి కవిత తృప్తి అమోఘమ్ము


మనస్సే పాదాల్నే తలచుతు విధి ప్రేమికుడు నై

వయస్సే ధ్యానం గా సకలము శుభ కారకుడనై

ఉషస్సే విశ్వం గా కళలకు విజయా మనసు నై

సమస్యే కాలం తో కధలు గ తెలి పేందుకు శివా


వెల కాంతల అంద మంత సుడి లయ గుండున్

కల కాంతకు సాటి రారు కవలయ మందున్

కల విద్యలు ఎన్నియైన బతుకును మార్చవ్

కుల విద్యకు సాటి రావు నిజమును కాదా



విజయం తధ్యము తొందరెందుకును దేవేంద్రా యి వేలంబునన్

సృజనా నందము శోభ నిచ్చును లె యీ విశ్వాస కాలమ్మునన్

భజనే వద్దులె సేవ భావముతొ నాకర్షించి సంతోష రా

గజనీ ముద్దులు పంచి శంకరుని నాకర్షింపు పూసెజ్జకున్

*శ్రీఆది శంకరాచార్య విరచితం శ్రీగోవిందాష్టకం*


ఓంశ్రీమాత్రే నమః


*1) సత్యం ఙ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశమ్ |*

*గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసమ్ |*

*మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారమ్ |*

*క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*


*2) మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసమ్ |*

*వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిమ్ |*

*లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనా లోకమ్ |*

*లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*


*3) త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నమ్ |*

*కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్ |*

*వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసమ్ |*

*శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*

*4) గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలమ్ |*

*గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలిత గోపాలమ్ |*

*గోభిర్నిగదిత గోవిందస్ఫుటనామానం బహునామానమ్ |*

*గోపీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*


*5) గోపీమండలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభమ్ |*

*శశ్వద్గోఖురనిర్ధూతోద్గత ధూళీధూసరసౌభాగ్యమ్ |*

*శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావమ్ |*

*చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*


*6) స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢమ్ |*

*వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః|*

*నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థమ్ |*

*సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*


*7) కాంతం కారణకారణమాదిమనాదిం కాలధనాభాసమ్ |*

*కాళిందీగతకాలియశిరసి సునృత్యంతమ్ ముహురత్యంతమ్ |*

*కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నమ్ |*

*కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*


*8) బృందావనభువి బృందారకగణబృందారాధితవందేహమ్ |*

*కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందమ్ |*

*వంద్యాశేష మహాముని మానస వంద్యానందపదద్వంద్వమ్ |*

*వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*


*9)గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యః |*

*గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి |*

: హరిఓం ,                           -           

  *🌸నేను! నేను!! నేను!!!*🌸 

మనలో అహంకారం ఎక్కువ. మన మనసును అహంకారం శాసిస్తోంది. 'అహంకారం' అంటే 'నేను' అనే గర్వం.

- 'నేను' ఈ కుటుంబానికి యజమానిని. అందరికీ తిండి పెడుతున్నాను. కాబట్టి నామాట ప్రతి ఒక్కరూ వినాలి. నన్ను ఎదిరించకూడదు. నన్ను తక్కువచేసి మాట్లాడకూడదు'

'నేను' కాబట్టి ఈ పనిని చెయ్యగలిగాను'

ఇలా 'నేను' ప్రతిరోజూ, ప్రతివ్యక్తి మాటల్లోనూ, చేతల్లోనూ వ్యక్తమవుతోంది. ఇది అవతలి వ్యక్తులు భరించలేని స్థాయికి కూడా వెళ్తుంది. వాళ్ళు భరించలేకపోవడానికి వాళ్ళలో కూడా 'నేను' అన్న అహంభావం ఉండటమే కారణం!

రహూగణుడు అనే రాజు తత్వజ్ఞానం కోసం కపిల మహాముని దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్నది పల్లకిలో. పల్లకిని నలుగురు బోయీలు మోస్తున్నారు. పెద్దంత దూరం వెళ్లిన తరవాత బోయీలు అలసిసోయారు. ఒక్కొక్కరికి కాస్సేపు విశ్రాంతి ఇవ్వడానికి ఒక అదనపు బోయీ కావాలి. చుట్టూ చూశారు. దోవపక్కన చేనుకు ఒకడు కాపలా కాస్తున్నాడు. వాణ్ని తమకు సహాయంగా రమ్మన్నారు. అతడు వెంటనే వచ్చి పల్లకిని మోయడానికి సిద్ధపడ్డాడు. ఒక బోయీకి కాస్సేపు విశ్రాంతి లభించింది.

వచ్చిన కొత్తవ్యక్తి జడ భరతుడు. అహంకారం, మమకారం, మిథ్యాజ్ఞానం ఏమీలేనివాడు. భరతుడికి పల్లకి మొయ్యడం కొత్త. పల్లకిలో కుదుపులు మొదలయ్యాయి.

లోపల కూర్చొని ఉన్న రహూగణుడికి కోపం వచ్చింది. 'ఓరీ బుద్ధిహీనుడా! పల్లకి మొయ్యడం కూడా నీకు చేతకాదా? నిన్ను కఠినంగా శిక్షిస్తేగాని నీకు బుద్ధి రాదు' అని తిట్టాడు.

భరతుడు తలపైకెత్తి రాజు వంక చూస్తూ 'రాజా! నీ పల్లకి మోసే భారం నా శరీరానిదేగాని, అందులోని జీవుడిది కాదు. కాబట్టి నేను నీ పల్లకి మొయ్యడంలేదు. స్థూలత్వం, కృశింపు, వ్యాధులు, మనోవ్యధలు, ఆకలిదప్పులు, భయరోషాలు, జరామరణాలు, నిద్రాజాగరణలు, అహంకార మమకారాలు దేహంతోపాటు పుడతాయి. దేహాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. 'ఈ దేహమే నేను' అని నేను అనుకోవడంలేదు. కాబట్టి నేను జీవన్మృతుణ్ని. యజమాని, సేవకుడు అనే సంబంధం విధికృతమైంది. ఆ వ్యవహారం శరీరానికే పరిమితం కాని జీవుడి వరకు రాదు.

రాజు అనే అహంభావంతో నువ్వు నన్ను శిక్షిస్తానంటున్నావు. ఉన్మత్తత, జడత్వం స్వభావంగా ఉన్న నన్ను నీ శిక్ష ఏం చేస్తుంది? స్తబ్ధుణ్నయిన నాపట్ల నీ ఆగ్రహం, శిక్ష రెండూ వ్యర్థమే!' అన్నాడు.

భరతుడికి మించిన గురువు ఉండడని రాజుకు తెలిసిపోయింది. దిగ్గుమని పల్లకి దిగి భరతుడి కాళ్లకు మొక్కి తత్వబోధ చెయ్యమని వేడుకొన్నాడు.

భరతుడిలాగా మనమందరమూ ప్రవర్తించాల్సిన అవసరం లేదు. అంత స్తబ్ధులుగా ఉండి ఈ ఆధునిక ప్రపంచంలో జీవించడం కష్టం.

కాని కొంతవరకైనా జ్ఞానం సంపాదించుకొని, అహంభావాన్ని ఒకింత అదుపులో పెట్టుకోగలిగితే మనం మరికొంత సుఖంగా జీవించగలం. ఎదుటివాళ్లు కొంతస్వేచ్ఛగా వూపిరి పీల్చుకోగలుగుతారు.................           -                                                      -     🙏..... వి. లక్ష్మీశేఖర్ ......  

#జులై11నుండిఆగస్టు8వరకుఆషాఢమాసం- #ఆషాఢమాసంవిశిష్టత🚩*_ 

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

ఆషాఢమాసాన్ని శూన్యమాసం అన్నారు. అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిధి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ఇక ప్రతి వారానికి , ప్రతి 15 రోజులకొకసారైనా ఏదో ఒక పండుగ ,  వ్రతం ,  పూజ ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి *చాతుర్మాస్య వ్రతం* ప్రారంభిస్తారు.

దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాడమాసంలో అందరు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు.

ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ. వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపినవాడు గురువైతే , లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు.

తెలంగాణలో గ్రామదేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన(బోనం) తీసుకెళ్ళి అర్పించి బోనాలు మొదలయ్యేది ఆషాఢంలోనే. సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాధుడి రథ యాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే.

అమ్మలుగన్న అమ్మ , ముగ్గురమ్మ మూలపుటమ్మ జగజ్జననీ సకల జీవులకు ఆహారం అందించిన శాకంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. ఈ మాసంలో *శాకంబరీ నవరాత్రులు* కూడా చేస్తారు. వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్తమాతృకలు , మహిషాసుర మర్దిని , దుర్గా దేవిని , భైరవ , వరహా , నారసింహుల యొక్క ఆరాధన తప్పక చేయాలి.

కొత్తగా పెళ్ళైన వధువును పుట్టింటికి తీసుకువెళ్ళేది ఆషాఢ మాసంలోనే. ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. ఆషాఢమాసంలో స్త్రీ నెలతప్పితే , 9 నెలల తరువాత అంటే వేసవి కాలంలో(మార్చి నుంచి మే మధ్య కాలంలో) ప్రసవం జరుగుతుంది. సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత విజృంభిస్తాయి. అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడివాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది. శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢమాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు. మాతశిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలి మెట్టు అన్నది మన పూర్వీకులు ఆలోచన. అందుకే ఈ సంప్రదాయం.

ఆషాఢమాసంలో తొలకరి మొదలై వర్షాలు పడతాయి. ఇంట్లో అందరు వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్ళినా , కొత్తగా పెళ్ళైన జంట కలిసి గడపటానికి ఇష్టపడతారు. వ్యవసాయ కుటుంబాల్లో అందరు కలిసి పని చేయకపోతే , చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తవారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది.

శూన్యమాసం అంటే భయాలను కలిగించేందుకు వచ్చింది కాదు , శాస్త్రీయ కారణాల వల్ల ఆషాడాన్ని శూన్యమాసంగా నిర్ణయించారు పెద్దలు.

*గోవిందాంఘ్రి సరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘః |*

*గోవిందం పరమానందామృతమంతస్థం స తమభ్యేతి ||*


ఓం... శ్రీ రామ..శ్రీమాత్రే నమః

*🚩శ్రీవేంకటేశ్వర దివ్యచరిత్ర-36🚩* 

        *బావాజి*

శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమలలోని మాడవీథులలోకి ప్రవేశించే భక్తులకు, ప్రధానగోపురానికి కుడివైపు ఒక మఠం కనిపిస్తుంది. దానిమీద శ్రీ వేంకటేశ్వరుడు ఎవరో భక్తునితో పాచికలాడుతున్న దృశ్యం ఉంటుంది. ఆ మఠమే హాథీరాం మఠం. 

ఆ భక్తుడే బావాజి! 

బావాజి బంజారా తెగకు చెందినవారు. కొన్ని వందల ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేస్తూ ఆయన ఉత్తరాది నుంచి తిరుమలకు చేరుకున్నారు. 

అయితే శ్రీ వేంకటేశ్వరుని దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది. తోటి యాత్రికులంతా వెళ్లిపోయినా, ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వేంకటేశ్వరుని దర్శించుకునేవారు. అలా ఎంతసేపు ఆ మానుషమూర్తిని చూసుకున్నా బావాజీకి తనివి తీరేది కాదట.

ఆలయంలో గంటల తరబడి బావాజీ నిలబడి ఉండటం, అర్చకులకు కంటగింపుగా మారింది. అతనెవరో తెలియదు, అతని భాషేమిటో అర్థం కాదు. అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండటం అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయనను బయటకు గెంటివేశారు. ఇకమీదట ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేశారు.

శ్రీనివాసుని దర్శనభాగ్యం కరువైన బావాజి చిన్నపిల్లవాడిలా విలపించాడు. సాక్షాత్తూ ఆ దేవుడే తనని గెంటివేసినంతగా బాధపడ్డాడు. అలా రాత్రింబగలు కన్నీరుమున్నీరుగా తడుస్తున్న బావాజీని ఓదార్చేందుకు ఆ శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు.

నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏం! నేనే రోజూ నీతో సమయం గడిపేందుకు వస్తుంటానని బావాజీకి అభయమిచ్చాడు. 

అలా నిత్యం రాత్రిపూట పవళింపు సేవ ముగిసిన తరువాత, ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవాడు బాలాజీ. 

పొద్దుపొడిచేవరకూ వారిద్దరూ కబుర్లతో కాలం గడిపేవారు. కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలూ ఆడుకునేవారు. అలా ఒకసారి....

బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించనేలేదు. సాక్షాత్తూ ఆ కాలస్వరూపుడే సమయాన్ని మర్చిపోయాడు. 

సుప్రభాతవేళ సమీపించింది. జగన్నాథునికి మేల్కొలుపు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు. ఆ చప్పుళ్లను విన్న వేంకటేశ్వరుడు దిగ్గున లేచి ఆలయం లోపలికి వెళ్లిపోయాడు. 

ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి బావాజి మఠంలోనే ఉండిపోయింది. 

ఆ ఉదయం మూలవిరాట్టుని అలంకరిస్తున్న అర్చకులు, ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవ్వడం గమనించారు. 

అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆలయం లోపలకి ప్రవేశించాడు. 

బావాజీ చేతిలో ఉన్న ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించలేదు. ఆ ఆభరణాన్ని లాక్కొని ఆయనను దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుపోయారు.

సాక్షాత్తూ ఆ దేవుడే తనతో పాచికలాడేవాడంటే నమ్మేది ఎవరు! నవాబూ నమ్మలేదు.

బావాజీని కారాగారంలో పడేశారు. నిజంగానే  ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రీ నీకోసం వచ్చే మాట నిజమే అయితే... నీకు ఒక పరీక్షను పెడుతున్నాం. 

ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తాం. ఉదయం సూర్యుడు పొడిచే వేళకి అవన్నీ పొడిపొడిగా మారిపోవాలి. అని హుంకరించాడు నవాబు. 

ఆ అర్ధరాత్రి బావాజీని బంధించిన గది నుంచి ఏనుగు ఘీంకారాలు వినిపించాయి. అవేమిటా అని లోపలికి తొంగిచూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు, బండెడు చెరుకుగడలను సునాయాసంగా పిప్పి చేయసాగింది. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. ఎక్కడి కావలివాళ్లు అక్కడే ఉన్నారు. 

అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది. ఆ కార్యక్రమం జరుగుతున్నంతవరకూ బావాజీ రామనామస్మరణ చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచీ ఆయనకు హాథీరాం బావాజీ అన్న పేరు స్థిరపడిపోయింది.

హాథీరాం భక్తిని స్వయంగా చూసిన నవాబు ఆయనను ఆలయ అధికారిగా నియమించాడు.

హాథీరాంజీతో పాచికలాడి స్వామి తిరుమలలో తన ఆస్తున్నింటినీ పందెంగా పెట్టి ఓడిపోయాడని, అప్పటినుండి తిరుమల ఆలయం అతని వారసుల అధీనంలో ఉన్నదనీ కూడా ఒక కథనం ఉంది. 

ఈస్టిండియా కంపెనీవారు దేవాలయాల నిర్వహణలో జోక్యం కలుగ జేసుకోకూడదని నిర్ణయించుకొన్న తరువాత (ఈ కథనం ఆధారంగా కావచ్చును) 1843లో ఆర్కాటు జిల్లా కలెక్టరు సనదు (ఉత్తర్వు) తో తిరుమల నిర్వహణను హాథీరాంజీ మఠం అధిపతికి అప్పగించారు


||శ్రీ విశ్వ తేజా గోవిందా 

శ్రీ గిరి నిలయా గోవిందా నిర్గుణ రూపా

గోవిందా

తిరుమల వాసా గోవిందా||


 ||గోవిందా హరి గోవిందా

వేంకటరమణా గోవిందా 

గోవిందా హరి గోవిందా

వేంకటరమణా గోవిందా|| 


ఓం నమో వేంకటేశాయ!!

*వివాహ ధర్మం*

చిదంబర క్షేత్రానికి దగ్గరలో ఒక మట్టి కుండలు చేసుకొని బ్రతికే కుమ్మరి వాడు ఉండేవాడు. మహాభక్తుడు ఇతడు. ఇతడు మహాభక్తుడై  భక్త్యావేశంతో శివనామాలు ఎక్కువ పలికేవాడు – *"శివా, హరా, రుద్రా"* అంటూ. *నీలకంఠ* నామం ఈయనకి చాలా ఇష్టం. ఎప్పుడూ *"నీలకంఠా! నీలకంఠా!"* అని అరవడం. ఎవరైనా పలకరించినా కూడా నీలకంఠ అనడంతో ఊర్లో వారందరూ ఈయనకి *నీలకంఠ నాయనార్* అని పేరు పెట్టారు. 

చిదంబర నటరాజుకి మట్టి సామగ్రి, కుండలు వగైరా సప్లై చేయడం ఈయన వృత్తి. ఆయనకి అర్పణ చేసుకోనే దానికి డబ్బు పుచ్చుకొనే వాడు కాదు. శివార్పణ బుద్ధితో ఇచ్చేవాడు. అలా ఆలయానికి తీసుకువెళ్ళి సమర్పణ చేసి స్వామి దర్శనం చేసుకొని రావడం ఈయన దినచర్య. ఇతని భార్య కూడా చాలా యోగ్యురాలు. ఆమె కూడా ఇతనికి ఎల్లవేళలా సహకరించేది. ఇద్దరూ మహాభక్తులు. 

నూతనంగా వివాహం చేసుకున్నాడు. యువకుడు.  కాపురం వెలగబెడుతూ కొద్ది మాసములు అవుతున్నది. ఆ సమయంలో మళ్ళీ ఈయన ఇలాగే కుండలు తీసుకువెళ్ళి ఇచ్చి చిదంబరం సమీపంలో వీళ్ళ ఊరైన పల్లెటూరుకి వస్తూ ఉన్నాడు. త్రోవలో పెద్ద వర్షం పడింది. 

వర్షం తట్టుకోలేక ఒక ఇంటి చూరును ఆశ్రయించాడు. అరుగుమీద నిలబడ్డాడు. వర్షం జోరు పెరిగిపోయింది. జల్లు కొడుతోంది. తట్టుకోలేక పోతున్నాడు.  

ఆ ఇంట్లో ఉన్న ఆవిడ ఎవరో బాటసారి అక్కడ బాధపడుతూ ఉన్నాడు ఆశ్రయమిద్దాం అని వెంటనే తలుపుతెరిచి మీరు లోపలికి రండి అని పిలిచింది. ఆయన లోపలికి వచ్చాడు. తుడుచుకోవడానికి పొడి వస్త్రాలు ఇచ్చింది. అవి సుగంధబంధురంగా ఉన్నాయి. తుడుచుకున్నాడు. అటుతర్వాత వేడిపాలు, ఆహారపదార్థాలు  ఇచ్చి ఆమె అతిథిమర్యాద చేసింది. వర్షం తగ్గిన తర్వాత నేను వెళ్ళొస్తానమ్మా, ఇంత సహాయపడ్డారు మీరు ఎవరు? అంటే..... నేను వేశ్యా వృత్తితో జీవిస్తున్నాను, ఇక్కడికి మహాత్ములు వచ్చారు, కాస్త సేవ చేసుకొనే భాగ్యం దొరికింది అంటే మంచిది, శుభం అని ఆయన వెళ్ళిపోయాడు. 

ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి సువాసనలు వస్తున్నాయి వస్త్రాలు, వెళ్ళేటప్పుడు ఈ సెంటులు ఏమీ లేవు చిదంబరేశ్వరుడు ఏమైనా పూశాడా? అన్నది భార్య. ఆయన పూయలేదు కానీ త్రోవలో వస్తూ ఉంటే వర్షం పడింది నేను ఒక గుమ్మం దగ్గరికి వెళ్ళాను అన్నాడు.  ఎవరిల్లేమిటి?అంది భార్య.  అదొక వేశ్యా గృహం అని చెప్పాడు. ఏమీ దాచుకోలేదు, అబద్ధం ఆడలేదు. వెంటనే ఆవిడ నాదగ్గర ఇవాళ నోరు జారావు కానీ తమరికి ఈ అలవాటు కూడా ఉందన్నమాట. ఒక వేశ్య తాకినటువంటి ఈ శరీరాన్ని ఇంక నేను ముట్టుకోను, మీరు నన్ను ముట్టుకుంటే ఒట్టే అన్నది. 

కొంతమంది ఆవేశాలతో నోరు జారుతూ ఉంటారు. కానీ మాటకి చాలా విలువ ఇచ్చేటటువంటి దేశం మనది. వాక్కు చాలా ప్రధానం కదా! *‘అగ్నిర్మేవాచిశ్రితా’* – అగ్ని వాక్కు. ఏముంది మాటలే కదా అని కొందరంటారు. మాటని చక్కగా వాడుకుంటే అది అగ్నియై, వరమై అనుగ్రహిస్తుంది. దుర్వినియోగం చేసుకుంటే శాపమై ఇంకోలా బాధపెడుతుంది. అయితే మొత్తానికి ముట్టుకుంటే ఒట్టే అన్నది.  వెంటనే ఈయనకి కోపం వచ్చింది. ముందు, వెనుక విచక్షణ లేకుండా నన్ను నువ్వు అనుమానించి అవమానించావు. ఆ మాత్రం నమ్మకం లేదా భర్తమీద? వివాహం చేసుకున్న భర్త అబద్ధం ఆడతాడు అని ఎలా అనుకున్నావు నువ్వు? నా మాటలో నీకు నిజాయితీ కనిపించలేదా? నిష్కపటంగా ఉన్నది చెప్తే నువ్వు నామీద ఇంత నింద వేశావు గనుక నేను కూడా ఎప్పుడైనా నిన్ను ముట్టుకుంటే ఒట్టే అన్నాడు.

ఇద్దరూ మంచి పంతం పట్టారు. ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈవిడ ధార్మికంగా పతివ్రత లాగా అన్ని సహకారాలూ చేస్తోంది. చక్కగా సమయానికి వండి పెడుతోంది, భగవదర్చనకి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తున్నది. ఈయన మట్టి కుండలు చేస్తున్నప్పుడు మట్టి కలపడంలో చక్రం తిప్పడంలో సహకరిస్తున్నది, అన్నీ చేస్తున్నది. కానీ భర్తగా భావించలేదు. ఆయన భార్యగానూ స్వీకరించలేదు. వారి ధర్మాలను వారు బాధ్యతగా చేసుకుంటూ వెళ్తున్నారు. *"నాతి గల బ్రహ్మచర్యం"* అంటారు, ఆ పరిస్థితి. 

ఇలా చాలాకాలం గడిచిపోయింది. కైంకర్యాలు జరిగిపోతూ ఉన్నాయి. పరమేశ్వరుడు ఊరుకుంటాడా? ఎవరైనా తన బిడ్డలు వివాహం చేసుకున్నాక కాపురం సరిగా జరగట్లేదు అంటే ఏ తల్లిదండ్రులు భరించగలరు? ఆ తల్లిదండ్రులు కూడా భరించలేరు. సత్కర్మలు, చక్కటి ధర్మము లోకంలో ఉండాలి అని కోరుకొనే వారు. గృహస్థ ధర్మంలో ఉండవలసిన శోభ దానికీ ఉండాలి. ప్రారబ్ధం వాళ్ళని ఇంతవరకూ తెచ్చింది. కానీ పరమేశ్వరుని నమ్ముకున్న వాళ్ళ ప్రారబ్ధాన్నికూడా తిప్పగలడు పరమాత్మ. ఇది బాగా గుర్తుపెట్టుకోవలసింది. *"ప్రారబ్ధంను భగవంతుడు మార్చలేడు అనుకోవద్దు. గట్టిగా ఆశ్రయిస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడు. దృఢమైన నమ్మకం ఉండాలి."*  శివారాధన వల్ల, శివభక్తి వల్ల ఏర్పడే నిర్మలత్వం వల్ల కలిగే తేజస్సు. ఆ తేజస్సు ఎప్పుడూ ఉంటుంది. అలాంటి వారిని ఎప్పుడూ కాపాడుకుంటాడు పరమాత్మ. 

ఒకప్పుడు ఒక విచిత్రం జరిగింది. వీళ్ళు కేవలం కుండలు చేసి ఇవ్వడమే కాదు, గృహస్థ ధర్మంలో ప్రధానమైన ధర్మం అతిథిసేవ. వీళ్ళు గృహస్థాశ్రమ ధర్మం ఎప్పుడూ పాటించేవారు. ఇంటికి వచ్చిన అతిథులకి భోజనాలు పెట్టడం ఇత్యాదులు చేసేవారు. వచ్చిన వాడు ఎవడైనా శివుడు అనుకోవాలి. అందులో శివభక్తులు వస్తే ప్రత్యేకంగా సాక్షాత్ శివుడు వచ్చాడు అనే అనుకునేవారు. ఎవరు శివచిహ్న ధారణ చేసి వచ్చారో వారిని చూస్తే మరీ పరవశం వీరికి. శివచిహ్నధారణ అంటే భస్మధారణ, రుద్రాక్షలు ధరించిన వారు, పంచాక్షరీజపపరాయణులు.  అటువంటి వారు దొరకడం అరుదు. దొరికితే విడిచిపెట్టకూడదు. వారింటికి ఎప్పుడూ వివిధములైనటువంటి శివయాత్రాపరాయణులు యాత్రలకి వెళ్తూ వచ్చేవారు. యాత్రలో ఉండేవారు నియమంగా ఉంటారు కదా! నియమంగా ఉన్నవాళ్ళకి నియమబద్ధమైన భోజనం పెట్టాలి గదా! 

ఒక మహానుభావుడు వచ్చాడు. ఆయనకి మంచి భోజనం పెట్టారు. ఆయన ముసలాయన. వీళ్ళ భక్తి చూసి ఆయన పరవశించిపోయాడు. నీ భక్తి చాలా బాగుంది కానీ నీదగ్గర రకరకాల కుండలు వగైరా చేసి శివుడికి అర్పిస్తూ ఉంటావు. బాగుంది. నా దగ్గర ఒక మట్టికుండ ఉంది. పాతది, నల్లగా ఉంది. ఈ పాత్ర పట్టుకు తిరుగుతుంటే ఈ క్షేత్రాలలో ఎక్కడ విరిగిపోతుందో అని నా భయం. విరిగిపోతే కొత్తది కొనుక్కోవచ్చు కదా అని నువ్వు అనవచ్చు. ఇది అలాంటిది కాదు. దీనికి ఒక చరిత్ర ఉంది. మహిమ ఉంది. చాలా పవిత్రమైనది. విలువైనది. నా ప్రయాణంలో దెబ్బతింటుందేమో, పైగా కుండలు భద్రపరచే నేర్పరితనం నీదగ్గర ఉంది గనుక ఈ పాత్రను నువ్వు భద్రపరచు. తిరిగి నేను వచ్చినప్పుడు తీసుకుంటాను. ఇంకొక్క మాట చెప్తాను, ఈ పాత్రే శివలింగం అనుకో, అంత జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆ మహానుభావుడు వెళ్ళిపోయాడు. శివభక్తులకి చేసే సేవ శివసేవే కదా! ఆ కారణంగా ఈ పాత్రని ఒకచోట భద్రంగా దాచిపెట్టాడు. రోజూ పొద్దున్నే స్నానం చేసి వచ్చి దాచిపెట్టిన పెట్టె తెరచి పాత్రకి దణ్ణం పెట్టి వెళ్ళేవాడు. రోజూ ఉందో లేదో చూసుకునేవాడు. ఎందుకంటే తన వస్తువును భద్రపరచుకోవడం కంటే పరవస్తువును మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదొక ధర్మం. ఎందుకంటే commitment.  అంత జాగ్రత్తగా చూసుకున్నాడు. 

కొంతకాలం అయిన తర్వాత ముసలాయన వచ్చాడు. భోజనాలు అవీ అయ్యాక నా పాత్ర ఇస్తే వెళ్ళిపోతాను అన్నాడు. తెస్తాను స్వామీ అని వెళ్ళి పెట్టె తెరిచి చూసే సరికి పాత్ర లేదు. ఇదేమిటి? ఇవాళ ప్రొద్దున కూడా చూశాను స్వామీ ఉన్నది. ఇప్పుడు లేదు అన్నాడు. భలే చాలా విలువైనది అని చెప్పానని నొక్కేశావా? మోసం చేశావు. దొంగవి నువ్వు, నాకు ఆ పాత్ర ఇవ్వు అన్నాడు. స్వామీ! ఆ పాత్రని రోజూ చూడడం వల్ల దాని ఆకారం బాగా గుర్తుంది. ఎలా పోయిందో నాకు తెలియదు కానీ అలాంటి పాత్ర నీకు ఒకటి చేసిస్తాను అన్నాడు. ఇదిగో మోసం తెలిసిపోయింది. అది విలువైనది గనుక దానిని వంచనతో దాచిపెట్టడమో, అమ్మడమో, వాడుకోవడమో చేశావు. నాకు మాత్రం ఆ పాత్ర ఇవ్వవలసిందే అన్నాడు. లేనిది ఎలా ఇవ్వనయ్యా, ఒట్లు పెడుతున్నాను అని చాలా ఒట్లు పెట్టాడు. నీ ఒట్లు గిట్లు జాన్తా నై. నాకు ఆ పాత్ర ఇవ్వు అన్నాడు. గోలపెట్టి రోడ్డుమీదకి వచ్చాడు. ఇదిగో మీఊళ్ళో నీలకంఠనయనార్ అని పేరు పెట్తుకొని తిరుగుతున్న వీడు పచ్చి మోసగాడు. వీడు నా పాత్రని దాచిపెట్టాడు అని అరిచాడు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు. ఛీ ఛీ అలాంటి వాడు కాదు. మాకు తెలుసు ఆయన చరిత్ర. కొంచెం ఆగు వెతుకుతాడు. ఎక్కడైనా పెట్టాడేమో అన్నారు ఊరివాళ్ళు. ఇల్లంతా వెతికాను దొరకలేదు అన్నాడు. నాకు న్యాయం జరగాలి అన్నాడు ముసలాయన. పంచాయతీ. ఊరి పెద్ద వచ్చాడు. మేము ఈయన మాటని నమ్ముతాం. నీ పాత్ర ఇవ్వాలన్నదీ నమ్ముతాం. ఏం చేస్తే నువ్వు నమ్ముతావో చెప్పు అన్నారు ఊళ్ళో వాళ్ళు. నేను నమ్మాలంటే వీడు వాళ్ళ పిల్లలమీద ఒట్టు పెట్టాలి అన్నాడు. పిల్లలు లేరు వాళ్ళకి అన్నారు. సరే అయితే వాడి పెళ్ళాం మీద ఒట్టు పెట్టమన్నాడు. ముట్టుకోడు. అప్పుడు బయటపడింది ఊళ్ళో వాళ్ళకి నియమం. వీళ్ళు ఒకరిమీద ఒకరు చెయ్యి వేసుకొని ఒట్టుపెట్టుకుంటే నేను ఒప్పుకుంటాను అన్నాడు. అసలు ముట్టుకోం అని ఒట్టు పెట్టేశారు వాళ్ళు ఇప్పుడేమంటావు అన్నారు ఊళ్ళో వాళ్ళు.  అవన్నీ నాకు తెలియదు, వాళ్ళిద్దరూ కలిసి ఒట్టు పెట్టాల్సిందే అన్నాడు. 

ఇదేమిటయ్యా మాకొక నియమం ఉంది ఒట్టు పెట్టుకున్నాం అన్నాక నువ్వు అది అతిక్రమించమంటున్నావు. ఒక ఒట్టుకోసం ఇంకొక ఒట్టు వదిలేస్తే ఈ ఒట్టుకి విలువ ఏం ఉంటుంది? అన్నాడు. బాగుంది సత్యప్రతిజ్ఞులు, మీ ఒట్టును నమ్మాలి గనుక మరొక ఒట్టు చెప్తాను, మీకూ ఇబ్బంది, ఉండదు, నాకూ ఇబ్బంది ఉండదు, చిదంబర నటరాజు దగ్గర శివగంగా తీర్థం అని అత్యద్భుతమైన కొలను ఉంటుంది. సాక్షాత్ అమ్మవారు గంగాదేవి అక్కడికి వచ్చింది. చిదంబరేశ్వరుని దగ్గర ఉంది. ఆ శివగంగా తీర్థంలో వీళ్ళిద్దరూ మునిగి ఒక కఱ్ఱ తీసుకొని  ఆ కఱ్ఱ ఒక కొన ఈయన, ఒక కొన ఆవిడ పట్టుకొని ఆ పాత్ర ఏమైందో నిజంగా మాకు తెలియదు, నటరాజు మీద ఒట్టు పెడుతున్నాం అని అంటే అప్పుడు నేను ఒప్పుకుంటాను అన్నాడు. 

సరే అని ఊరు ఊరంతా జాతరలా వెళ్ళారు. ఇప్పటికి ఒట్టు పెట్టుకొని వాళ్ళు పదుల సంవత్సరాలు అయిపోయి ముసలివాళ్ళు అయిపోయారు. వీళ్ళు చక్కగా మునిగి కఱ్ఱ పట్టుకొని లేచేటప్పటికీ పెళ్ళి అయినప్పుడు ఉన్న నిత్యనూతన యౌవనం వాళ్ళకి వచ్చేసింది. ఎదురుగా ముసలాయన కోసం చూస్తే లేడు. మహాకాంతిపుంజంలో పార్వతీ పరమేశ్వరులు ఉభయులూ దర్శనమిచ్చి సుఖంగా బ్రతకండర్రా. హాయిగా కలిసి కాపురం చేయండి. చక్కటి సంతానాన్ని కనండి. నిరంతరం నానామంతో నా సేవతో మీరు ఆనందించి తరువాత కుటుంబంతో సహా నాలో మిమ్మల్ని ఐక్యం చేసుకుంటాను అని అభయమిచ్చాడు. 


ఇలా నీలకంఠ నాయనార్ ని కాపాడినటువంటి నీలకంఠునికి నమస్కారం చేసుకుందాం.  

స్వామి దయ చూడాలి, ఇహమూ, పరమూ ఎలా అనుసంధానం చేస్తాడో! ఎందుకంటే దాంపత్య ధర్మంలో ఉన్న గొప్పతనం మహానుభావుడికి తెలుసు. దంపతులు అనే ధర్మం చాలా గట్టిది. నిజానికి ఇంత అపనింద జరిగినా, అవమానం జరిగినా వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప లక్షణం భారతీయ వైవాహిక ధర్మాన్ని ఎంత గౌరవించారు అంటే విడిపోలేదు. అది దాంపత్యధర్మం యొక్క గొప్పతనం. అపనమ్మకం ఎన్ని ఉన్నప్పటికీ కూడా దాంపత్యం అనేది ఇద్దరు కలిసి బ్రతకడానికి తీసుకొనే లైసెన్స్ కాదు. ఇద్దరూ కలిసి పాటించవలసిన ధర్మం అది. భారతదేశంలో పెళ్ళి అనేది యజ్ఞజీవనం కోసం చేసుకొనే సంస్కారం. అంతేకానీ ఇద్దరు కలిసి పిల్లల్ని కని ఎంజాయ్ చేయడానికి చేసుకొనే అగ్రిమెంట్ కాదు పెళ్ళంటే. ఈ రహస్యం పరమాత్మకి తెలుసు. 

అందుకే భారతీయులకి దాంపత్యధర్మం, దాంపత్య సంస్కారం, వివాహ సంస్కారం అనేవి దేవతలనుండి లభించిన దివ్యసంస్కారం. అందుకే దాని వెనకాల ఒక సంప్రదాయం, ఒక పరంపర, ఒక కుటుంబం దానిని నిలబెట్టుకోవలసిన బాధ్యత ఉంది. ఇది వివాహం. ఇది దాంపత్యధర్మం. ఇది కుటుంబంతో పిల్లలకి ఉన్న అనుబంధం. అది తెంచుకుంటే తెగేది కాదు, అనుకుంటే తెచ్చుకొనేది కాదు. ఉన్నదది. ఉన్న పరంపరాగతమైన దాంపత్య ధర్మాన్ని నువ్వు నిలుపుకో అనే భావం మనం చిన్నప్పటినుంచీ పిల్లలకి కలుగజేస్తే ధైర్యంగా ఉండవచ్చు. పరమేశ్వరుడు సంతోషించింది ఏమిటంటే ఇంతభక్తిలో ధర్మాన్ని తప్పకుండా గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ మాటకి కట్టుబడి నిగ్రహంగా ఉంటూ ఉన్న తీరు తపస్సు కాదా! అందుకే ధర్మం ముందు చేదుగా అనిపించవచ్చు కానీ దాని ఫలం చాలా మధురంగా ఉంటుంది.  

*‘యత్తదగ్రే విషమివ పరణామే అమృతోపమమ్! తత్సుఖం సాత్త్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజమ్’* –

ముందు విషంలా ఉన్నా పరిణామంలో అమృతం అన్నాడు కృష్ణపరమాత్మ. అది ధర్మం యొక్క స్వరూపం. ఆ దాంపత్య ధర్మానికి సంతోషించి ఆ దాంపత్యధర్మపు మాధుర్యం తెలిసిన పరమేశ్వరుడు ఆ ఆదిదంపతులు ఇద్దరూ కూడా అనుగ్రహించారు. అందుకే ఆదిదంపతుల స్మరణ ఇంత విశేషంగా చెప్పబడుతున్నది.

*సేకరణ




1 comment: