Tuesday 22 May 2018

Pranjali Prabha (27-05-2018)


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: - శ్రీ కృష్ణాయనమ: 


(ఆనందం -ఆరోగ్యం -ఆధ్యాత్మికం)

13.  అభిరామ, అసహయ, అవనీతనయ,
                               అమాత్త్య,  అభిఘాత,   అసాధ్యాయ,
                              అక్షపాద,        ఆక్షేపక,    ఆర్యవర్తక,
                         నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.




                           14.  జనార్ధన:,      జగద్రక్ష:, జగత్కర్త:,
                                  జగజ్జేత:,   జగత్జ్యోతిష:, జగజ్జీవ:,
                                 జగద్గురు:, జగత్జయ:, జగత్సాక్షి:,
                          నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.




                            15.  కులక్షణ:, కులసంభవ:, కులసేష్ట:,

                                  కులీన:,     కులేస:,    కులేస్వర్య:,
                                  కూత్తమ:,  కూతేజార:,       కుధీర:,     
                          నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.*



“చదువుల తల్లియైన సరస్వతీదేవిని శ్రీపంచమినాడు విద్యార్థిని విద్యార్థులు పూజిస్తే, చదువుల్లో సత్వర పురోగతి ఉంటుంది. విజ్ఞాన వికాసాలు వృద్ధి చెందుతాయి.”

క్షోణితలంబున్ నుదురు సోకక మ్రొక్కినుతింతు సైకత 
శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి, రక్షితామర 
శ్రేణికి దోయజాతభావచిత్త వశీకరణైక వాణికిన్ 
వాణికి నక్షదామశుక వారిజపుస్తక రమ్యపాణికిన్

నల్లని అందమైన శిరోజాలు గల తల్లికి, దేవతలను రక్షించే ఆమెకు, బ్రహ్మదేవుని మనస్సును వశపరచుకున్న దేవికి, రుద్రాక్షమాల, చిలుక, పద్మం, పుస్తకాన్ని చేతులలో ధరించు వాణికి, సరస్వతీదేవికి, నా నుదురు నేలను తాకేటట్లు వంగి, భక్తితో నమస్కరిస్తాను.

ఈ సమస్త విశం శబ్దమయం. నాదం తోనే జగత్ సృష్టి ప్రారంభమైంది. ఆ నాదశక్తికి ప్రతిరూపంగా, సరస్వతీమాత బ్రహ్మవిద్యాస్వరూపిణియై శోభిస్తుంటుంది. విద్యకు అధిష్టాత్రి సరస్వతీదేవి. ఆ తల్లి మాఘశుద్ధ పంచమి నాడు అంటే శ్రీపంచమినాడు ఆవిర్భవించింది. శాస్త్రవాక్కు, శ్రీపంచమినాడు విధిగా సరస్వతీదేవిని ఆరాధించాలని దేవిభాగవతం, బ్రహ్మవైవర్త పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీపంచమినాడు సరస్వతీదేవిని పుస్తకాలు లేక విగ్రహా రూపంలో ఆవాహన చేసి పూజిస్తే సర్వాభిష్టాలు నెరవేరుతాయని, జ్ఞాపకశక్తి మేధ, బుద్ధి, వృద్ధి చెందుతాయని చెప్పబడింది. అందుకే ఈరోజున జ్ఞానాభివృద్ధి కోసం దేవతలు సైతం సరస్వతీదేవిని పూజిస్తారట.

సర్వజీవులలో చైతన్యస్వరూపిణిగా ప్రవహించే శక్తి స్వరూపిణే ‘సరస్వతీ’. ‘శ్రీమాతా’ అని కీర్తించబడిన ఆ తల్లి విశ్వేశ్వరుని వాక్, బుద్ధి, జ్ఞానాది ధీశక్తులకు అధిష్ఠాత్రి. సృష్టిలోని సమస్త జీవులకు ఆ తల్లి వల్లనే ఉలుకూ, పలుకూ ఎరుక ఏర్పడుతున్నాయి.

మాఘశ్య శుక్ల పంచమ్యాం… 
మానవో మనవోదేవా మునీంద్రాశ్చ ముముక్షవః 
వసవో యోగినస్సిద్ధ నాగా గంధర్వ రాక్షసాః 
మద్వరేణ కరిష్యంతి కల్పేకల్పే లయావధి 
భక్తియుక్తశ్చ దత్త్వావై చోపచారాణి షోడశ

మాఘశుద్ధ పంచమినాడు ఈ విశ్వమంతా మానవులు, మనువులు, దేవతలు, మునులు ముముక్షువులు, వసువులు, యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు…అందరూ సరస్వతీదేవిని ఆరాదిస్తారని దేవీ భాగవతం చెబుతోంది.

మన బుద్ధి శక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి సరస్వతీదేవి. అందుకే సూర్యుడు,

సర్వ చైతన్య రూపాం తాం ఆద్యం విద్యాంచ 
ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్

అని ప్రార్థించాడు. ఏ విద్యను గ్రహించాలన్నా అమ్మ అనుగ్రహం తప్పదు.

చత్వారి వాక్పరిమితా పదాని తానీ 
విదుర్భ్రాహ్మాణా యే మనీషిణీః 
గుహాత్రీణి నిహితా నేజ్గ్యంతి 
తురీయం వాచో మనుష్యా వదంతి

– అనిపించి సరస్వతీసూక్తంలో వాక్ స్వరూపం గురించి చెప్పబడింది. వాక్యం యొక్క స్వరూపం నాలుగు విధాలుగా ఉంటుంది.

1. పరా 
2. పశ్యంతీ 
3. మధ్యమా 
4. వైఖరీ

మనలో మాట పలకాలన్నా భావం స్ఫురింపచేసేదే “పరా”. మాట పలికే ముందు ‘పర’ ద్వారా ప్రేరితమై భావాత్మకంగా గోచరించేదే ‘పశ్యంతీ’. ఆ భావం మాటలుగా కూర్చుకున్న స్థితి ‘మాధ్యమా’ ఆ మాటలు శబ్దరూపంలో పైకి వినబడేదే ‘వైఖరీ! యోగశాస్త్ర పరంగా వీటి యొక్క ప్రయాణం గురించి చెప్పాలంటే, మూలాధారం నుండి నాభి, హృత్, కంఠ, నాలుకలు. వీటన్నింటికీ మూలమైన నాదం కూడ సరస్వతీరూపమే. ఇక, భావప్రకటన కోసం చెట్లు ‘పరా’ వాక్కుని, పక్షులు ‘పశ్యంతీ’ వాక్కును, జంతువులు ‘మధ్యమా’ వాక్కును, మనుషులు ‘వైఖరీ’ వాక్కును ఉపయోగిస్తున్నారు.

ఆ తల్లి శ్వేతపద్మవాసిని కనుక "శారదా" అని అన్నారు. అందుకే పోతనామాత్యుడు –

శారదనీరడెందు ఘనసార పటీర మరాళ మల్లికా 
హార తుషార పేనరజతాచలకాశ ఫణీశకుంద మం 
దార సుధాపయోధిసిత తామర సామరవాహిని శుభా 
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ

అని ప్రార్థించాడు. సరస్వతీదేవి తెలుపుదనాన్ని సందర్శించి అర్చించాలని కోరుకున్నారు పోతన. తెల్లని పద్మముపై కూర్చుని, ఒక కాలు నిలువుగా ఒక కాలు దానిపై అడ్డంగా మడుచుకుని కూర్చున్నట్లు, లేక నిలబడి, ఒక చేతిలో వీణ, ఒక చేతిలో పుస్తకాన్ని పట్టుకుని ఉన్నట్లు పద్మపురాణంలో చెప్పబడింది. ఆ తల్లి తెల్లనిపువ్వులు ధరించి, తెల్లనిపూసల

కంఠాహారం ధరించి, ఆ కంఠాహారంపై తెల్లని గంధంపూతతో దర్శనమిస్తుంది. అందుకే ఆ తల్లిని కూచిమంచి తిమ్మకవి ఈ క్రింది విధంగా స్తుతించాడు.

బలుతెలిపుల్గు వారువము, బంగరు వీణయ, మిణ్కు టందెలున్ 
జిలుక తూటారిబోటియును, జిందపు వన్నియమేను బొత్తమున్ 
జెలువపు దెల్ల దమ్మి విరి సింగపుగద్దెయు గల్గి యొప్పున 
ప్పలుకుల చాన, జానలరు పల్కులొసంగెడు గాత నిచ్చలున్

"బాగా తెల్లనైన పక్షి హంసనే గుర్రపువాహనంలా చెసుకున్న తల్లి, బంగారువీణను, మెరిసే అందెలను, చిలుకను, పుస్తకాన్ని ధరించి, శంఖంవంటి తెలుపు మేనితో ప్రకాశిస్తూ, అందమైన తెల్లని పద్మాన్నే ఆసనంగా చేసుకున్న "వాగ్దేవి" సరస్వతి, చక్కని పలుకులను నాకు నిత్యం అనుగ్రహించుగాక" అని కవీశ్వరుడు వేడుకుంటున్నాడు. అందుకే ఆ తల్లిని ప్రతి శ్రీపంచమినాడు భక్తి శ్రద్ధలతో పూజించుకోవలెను. శ్రీపంచమినాదు విద్యార్థినీ విద్యార్థులు ఆ తల్లిని పూజించడం వల్ల, చదువుల్లో మంచి ప్రగతిని సాధిస్తారు
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
తిరుమలసత్యశాయి గారికి ధన్యవాదములు .


మహర్షి వాల్మీకి విరచిత యోగ వాశిష్ట సారము 



4. సూక్ష్మశరీరము 
తదుపరి వశిష్ఠుడు శ్రీరామునికి సూక్ష్మశరీరతత్వమును బోధించుచున్నాడు. ఏ ప్రాణియైనను, మృతి చెందినపుడు, జీవాత్మ సూక్ష్మశరీరము ధరించి హృదయాకాశమున వాసనామయములగు (సంస్కారములు) త్రిలోకములను గాంచుచుండును. నిజానికి ఈ జీవాత్మ జన్మాది వికార రహితుడగు పరబ్రహ్మము. మరణ సమయమున మానసమందు నిలబడు కోర్కెలలో నేది అగ్రగణ్యమో దానినే జీవు డనుభవించును. నిజానికి జగత్తుమిధ్య, అసత్యమైనది. ఈ విషయము మరణ సమయ మందు, జనన సమయమందు, హృదయాకాశమున అనుభూతమగును. అనగా మరణ వేదనలో తన సంస్కారములన్ని, అనుభూతికి వచ్చి అంతా భ్రమయని తోచును. కాని సంస్కారములు నశించవు. జన్మ సమయములో గూడ, ఆ సంస్కారములు భ్రమయని తెలిసినప్పటికి జన్మించిన తరువాత, మాయ ఆవరించి తన గత సంస్కారములు అలానే వుండును. బ్రతుకు నందలి ఆశ, పుట్టుక, చావు అనుమిధ్యా ప్రపంచము నిజమని తలచును. 

స్ధూల శరీరములో సూక్ష్మ శరీరము, సూక్ష్శశరీరములో కారణ శరీరము గలదు. ఈ మూడు శరీరములే సంసారమునకు కారణమగుచున్నవి. సాధన ద్వారా ఈ మూడు శరీరములు దగ్ధమైనపుడే ముక్తి లభించును. ఈ సంస్కార తరంగములు నిద్రాసమయమందును, ప్రళయ సమయమందును చలనము లేక స్ధిరముగ వుండును. అది విశ్రాంతి సమయము. సృష్టి సమయము, స్వప్న సమయము లందు మరల భ్రాంతులు, తరంగములు లేచుచున్నవి. ఈ దేహత్రయములకు బ్రహ్మయే ఉపాధి. అందువలన స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు నశించగానే బ్రహ్మము మిగులును. సంస్కారముల ననుసరించి జన్మ లభించును. 

జనులు మాటి మాటికి పుట్టుచూ, చచ్చుచూ క్రమముగా సంస్కారములలోమార్పు తెచ్చుకొనుచు, చివరికి విదేహముక్తులగుదురు. ఉదాహరణకు వ్యాసుడు ఈ బ్రహ్మయుగములో ముప్పది రెండవ వ్యాసుడు. అనగా పూర్వపు సృష్టులందు, ముప్పది ఒక్క వ్యాసులు చనిరి. ఇంకను వ్యాసులు ఎనిమిది పర్యాయములు జన్మించి, భారత ఇతిహాసములను, వేదవిభజనను ఎనిమిది పర్యాయములు చేసి భారత వంశమునకు కీర్తి దెచ్చి, పిదప విదేహముక్తుడై బ్రహ్మమును పొందును. అలానే ప్రతి జీవి లక్షల జన్మములు ఎత్తి చివరకు ముక్తులు కావలసినదే. వివిధ జన్మలలో, ఇప్పుడున్న వారె అప్పుడు యధావిధిగ జన్మించి, సమకాలికులుగ వుందురు. అప్పుడప్పుడు విడివిడిగా గూడ జన్మింతురు. ఆయా జన్మలలో వారి వారి భార్య, బంధువులు, ఆయుర్ధాయము, జ్ఞానము ఒకే విధముగ ఇప్పుడున్నట్లే వుండును. 

కేవలము ఒక్క తత్వజ్ఞాని మాత్రమే, వికల్పములు లేక పరమ శాంతుడై సంతృప్తుడై బ్రహ్మ పదమును పొందును. జ్ఞాని సదేహముక్తుడైనను, విదేహముక్తుడైనను ఒకటియె. ఈ రెండు ముక్తులును భిన్నములు కావు. సదేహముక్తునకు విషయ భోగములున్నచో, విదేహముక్తుని కంటే, తక్కువగ నెంచుకొనవచ్చును. అయితే విషయ భోగమందు రసబోధ లేనందు వలన రెండును నిర్వాణముక్తి వంటివే. నీరు అలలుగా వున్నను, కదలకున్నను నీరు నీరే కదా! అలానే గాలి కదులుచున్నను, కదలకవున్నను గాలి గాలే కదా!.
"శ్రీమతిగారు! నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు, నా జీవితంలో ఒక భాగమైనందుకు నీకు కృతజ్ఞతలు. ఇప్పుడు నేనీస్థితిలో ఉన్నానంటే దానికి నువ్వే కారణం. నువ్వు నా దేవతవి.
నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థాంక్స్.
నువ్వు చాలా మంచిదానివి నువ్వు నా దేవతవి"

"శ్రీవారూ! మీ SMS ఇప్పుడే చదివాను. ఆలస్యానికి మన్నించగలరు. తాగడం అయిందా,
ఇంక SMSలు ఆపి ఇంటికి వేంటనేి దయచేయండి.
ఇవాళ మిమ్మల్ని నేనేమీ అనదల్చుకోలేదు,
మీకిష్టమైన గోళీకాయంత బంగాళాదుంప ఫళంగా కరకరలాడే వేపుడు, చిన్ని వంకాయ కాయ ఫళంగా వుల్లికారం కూరా, పనసపొట్టు మసాలా కూర, మామిడికాయ పచ్చడి, కందిపప్పు పచ్చడి, సాంబార్, బెంగాల్ టైప్ తీయని గడ్డ పెరుగు మీ కోసం రెడీ..

అన్నట్లు చెప్పడం మరిచాను! మీ క్రెడిట్ కార్డ్ మీద నెక్లెస్ కొనుక్కున్నాను"
                           

No comments:

Post a Comment