Thursday 17 May 2018

Pranjali Prabha (18-05-2018)





--(())--
ఆరోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం ) 
అందించటమే  ప్రాంజలి ప్రభ లక్షణం 

ప్రాంజలి ప్రభ - ఫోన్ 


                           13.  అభిరామ, అసహయ, అవనీతనయ,
                               అమాత్త్య,  అభిఘాత,   అసాధ్యాయ,
                              అక్షపాద,        ఆక్షేపక,    ఆర్యవర్తక,
                         నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


                           14.  జనార్ధన:,      జగద్రక్ష:, జగత్కర్త:,
                                  జగజ్జేత:,   జగత్జ్యోతిష:, జగజ్జీవ:,
                                 జగద్గురు:, జగత్జయ:, జగత్సాక్షి:,
                          నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


                            15.  కులక్షణ:, కులసంభవ:, కులసేష్ట:,
                                  కులీన:,     కులేస:,    కులేస్వర్య:,
                                  కూత్తమ:,  కూతేజార:,       కుధీర:,     


                          నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.



ఇన్ని చెప్పి  డబ్బున్నోడుతో ఉడా ఐన్చింది  చిన్నది 
నీ నుదుట రాత లేదు  నన్ను పొందే అదృష్టం లేదన్నది 
ఇది ఒక ప్రేమికుని అనుభవసారం గమనిస్తే స్వర్గం  
   

నేటి కవిత ( అధిక్షేప ప్రేమ లీలా ) -3

ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఇది వేణుగోపాల ప్రేమ సుమా

5. బ్రహ్మవేద మందించిన వెల్గు - నాదాంత సీమల నడచు వెల్గు
సాదు జనానంద పరిపూర్ణ వెల్గు - బోధకు నిలయమై పరిపూర్ణ వెల్గు
సుషమ్న నాలంబున జొచ్చు వెల్గు - ఆది మధ్యాంతర ప్రేమ వెల్గు
చూడు జూడగా మహాశోభితంబగు వెల్గు - నఖిలజగంబుల నిండు వెల్గు
మేరుశిఖరంబు వెల్గు
మోహావేశంబు పెంచు వెల్గు
మేను పులక రించే వెల్గు
ఇది వేణుగోపాల ప్రేమ సుమా

6. వేదాంత సూక్తులు విని కొన్ని తెల్పినంత మాత్రాన రాజయోగి కాడు
కుండంత కళ్ళు త్రాగి తెలియక వాగినంత మాత్రాన శాస్త్రవేక్త కాడు
ప్రధాని అయినంత మాత్రానా ఎప్పటికి అసలు గుణాన్ని మార్చలేడు
పరస్త్రీ వెంట తిరిగి నంతమాత్రాన భార్యని చూడనివాడు బద్ధుడు కాడు
ఎంత చదివిన గుణహీనుడెచ్చు గాడు
సింహము జయించె నంత బలుడుకాడు
నమ్మ పల్కువాడు బుద్ధిమంతుడు కాడు
ఇది వేణుగోపాల ప్రేమ సుమా


గజల్ 2185.

ఓర్వలేని తనముకన్న..రోగమేది ఉండలేదు..!
స్వార్థరహిత చెలిమికన్న..అద్దమేది ఉండలేదు..!

నిజం చెబితె నిష్టూరమె..దక్కునులే కానుకగా..
శ్వాసనడుపు శక్తికన్న..సత్యమేది ఉండలేదు..!

మృత్యుభయం కౌగిలింట..జన్మచక్ర సందోహం..
మనసుపడే గుణముకన్న..ఖర్మమేది ఉండలేదు..!

రెక్కలతో గగనాలను..చుట్టివచ్చు పక్షి చూడు..
నేలపైన వాలకుండ..ధర్మమేది ఉండలేదు..!

ఎవరినైన విమర్శించు..పనికన్నా ఘోరమేమి..
నర్మగర్భ హాసాలకు..అర్థమేమి ఉండలేదు..!

మోక్షమనే ఫలమిచ్చే..మాధవుడే లేడు చూడు..
ఈ జ్ఞానం వెలిగించే..దీపమేమి ఉండలేదు..!


1 comment: