Thursday 3 May 2018

ప్రాంజలి ప్రభ - (04-0 5 - 2 0 1 8)




ఈ రోజు పుట్టిన రోజు జరుపు కుంటున్న ప్రతిఒక్కరికి ముందుగా శుభాకాంక్షలు   


నేటి హస్యం 

మాష్టారూ!ఐదు వందలివ్వండి సార్,
నాలుగు రోజుల్లో ఇచ్చేస్తా

ఇంద! ఖచ్చితంగా ఇచ్చేయాలి సుమీ!

ఎంత మాట! మీరు నా పాలిట దేముడంటే నమ్మండి! 

ఎంత మాట మీ సహాయం ఈ జన్మలో మరచిన,  మనది జన్మ జన్మల భంధంగా గుర్తుపెట్టు కుంటా నండి, మీరు నాకు సహయం చేస్తూ వెయ్యేళ్ళు బ్రతకాలండి 

ఆ  .....    ఆ ..........  ఈ పిల్లవానికి ఇన్ని మాటలా .........   ........

--((*))--

నేటి పద్యం - జీవనజ్యోతి

అన్యూన్య దాపత్యానికి ఒక మార్గమంటూ లేదు, ఆశ పాశాల మధ్య , అనురాగాల మధ్య, ఆప్యా యతల మధ్య,, కాలగమనంలో, తను చేసే నైతిక కర్తవ్యాలను గుర్తు చేసుకుంటూ కాలాన్ని వ్యఫ్ధం చేసుకోకుండా ఒకరికోకరుభంధమై ఉండటమే జీవితం. ఈ జీవితం పెద్దలదీవెనలతో, దైవసాన్నిధ్యంలో, రంగ రంగ వైభవముగా "పెళ్ళి" అనేభంధం తలంబ్రాలాతో ప్రారంభ మౌతుంది. 
           
తలంబ్రాలు కావు అవి ఆశీర్వ అక్షతులు, అక్షతులు కావు అవి హ్రృదయా నందములు
ఆనతులు కావు అవి ప్రదీప వెల్గులులె, కాంతులవి కావు అవి మాధుర్య పుష్పములు
పుష్పములు కావు అవి ఆరోగ్య సూత్రములు, సూత్రములు కావు అవి ఆదర్శ పాఠములు
పాఠములు కావు అవి అధ్యయ భావములు, భావములు కావు అవి సఖ్యత సౌఖ్యములు

ఏది ఏమైనా మానవుని కర్మ బంధాన్ని బట్టి సుఖదు:ఖాలు, కష్టనష్టాలు, భరిస్తూ శక్తి వంచన లేకుండా సహకరిస్తూ ఉండేదే నిజమైన జీవితం.   


1 comment: