Monday 21 May 2018





1. తిరుపతిలో ఉన్న ఏడుకొండల పేర్లు తెలుపుము?

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటెశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో ఏడు కొండలు కలవు.
వీటినే సప్త గిరులు అని అంటారు.
అవి.

1 శేషాద్రి
2 నీలాద్రి
3 గరుడాద్రి
4 అంజనాద్రి
5 వృషభాద్రి
6 నారాయణాద్రి
7 వేంకటాద్రి

2. సప్తాశ్వారాలు తెలుపుము?

సప్త స్వరాలు - మన భారతీయ సంగీతంలో 7 స్వరాలు కలవు.
వీటినే సప్త స్వరాలు అని పిలుస్తారు.
అవి.
1. స = షడ్జమం (నెమలి క్రేంకారం)
2. రి = రిషభం (ఎద్దు రంకె)
3. గ = గాంధర్వం (మేక అరుపు)
4. మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)
5. ప = పంచమం (కోయిల కూత)
6. ధ = ధైవతం (గుర్రం సకిలింత)
7. ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)

3. సప్తద్విపాలు తెలుపుము?

బ్రహ్మాండ పురాణములోను, మహాభారతంలోను, భాగవతం సప్త ద్వీపాలగురించి ప్రస్తావన ఉంది.
అవి .

1. జంబూద్వీపం - అగ్నీంద్రుడు
2. ప్లక్షద్వీపం - మేధాతిథి
3. శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
4. కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
5. క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
6. శాకద్వీపం - హవ్యుడు
7. పుష్కరద్వీపం - సేవనుడు.

4. సప్తనదుల పేర్లు తెలుపుము?
సప్త నదులు

1. గంగ
2. యమున
3. సరస్వతి
4. గోదావరి
5. సింధు
6. నర్మద
7. కావేరి

5. సప్తల్కాలు తెలుపుము?
సప్త అధొలోకములు

1. అతలము
2. వితలము
3. సుతలము
4. తలాతలము
5. రసాతలము
6. మహాతలము
7. పాతాళము

6. సప్త యూషుల పేర్లు వ్రాయుము ?
సప్త ఋషులు
1.వశిష్టుడు
2.ఆత్రి
3.గౌతముడు
4.కశ్యపుడు
5.భరద్వాజుడు
6.జమదగ్ని
7.విశ్వామిత్రుడు

7. అష్టదిగ్గజాలను వీటి నండూరు?
పురాణాలలో అష్టదిగ్గజాలు

1. ఐరావతం
2. పుండరీకం
3. వామనం
4. కుముదం
5. అంజనం
6. పుష్పదంతం
7. సార్వభౌమం
8. సుప్రతీకం

8. అష్ట జన్మలు ఏవి ?
అష్ట జన్మలు

1.దేవ జన్మ
2. మనుష్య జన్మ
3. రాక్షస జన్మ
4. పిచాచ జన్మ
5. పశు జన్మ
6. పక్షి జన్మ
7. జలజీవ జన్మ
8. కీటక జన్మ



1.  ప్రేమప్రియుడు : నేను మనసు మార్చుకున్నాను అన్నాడు    

                              ప్రియసితో
ప్రియసి: మంచిపని చేసావు మనసు మారకపోతే నన్ను కలువు వస్తా

2. "రోబో "
భర్త: భార్యతో మనబ్బాయి నీవు ఇంటి పని చేసు కోలేక పోతున్నావని
       "రోబో "ను పంపిస్తున్నాడు.
భార్య: అవునండి పనిమనిషిని పెట్టుకుంటే రోజు రాదు, వచ్చినా రోజు
          కాఫీ, టిఫిన్ పెట్టలేక పోతున్నాను.
         "రోబో " ఐతే ఎం అడగదు, ఖర్చు అసలే ఉండదు కదండి
భర్త: రోబో తిమ్డే "చిప్సు" అది తెలీదా ................

3."గలత్ "
హింది టీచెర్: పిల్లలు డిక్టేషన్ చెప్తా రాయండి
                    1. మేరనాం జోకర్
                     రాము ఇటు చూపించు ఎలా రాసావో
                     "  మేరనాం ధర్మాత్మ "  అలా రాసావెంటి
                     నాపేరు అదేగదా టీచరు ....అవనవును
       చార్ జీరో ఏక సాత్ అని వ్రాయండి.
                     ఎది ప్రతుష చూపించు
                     ఏమిటి ఇలా రాసావు (నాలుగు సున్నాలు చూసి )
                     అవును టీచర్ మిరే అన్నారుగా  చార్ జీరో అని
                     "గలత్ " 4017 అని వ్రాయాలి అవునా టీచర్
  

ఎందుకే  అంత కష్టపడతావ్, అంతా  నీ తాపత్రయం తప్పా, నిన్నెవరు గుర్తించరు, ఇంకా విమర్శిస్తారు తెలుసుకో అన్నాడు మధవ్  రాధతో
ఏదోనండి నాతృప్తి నాది, మీరు మాత్రం ఏమన కుండా నాకు సహకరిస్తే చాలు, అదే నాకు ఎనలేని సంతృప్తి.
అందుకే అన్నారు కష్ట బడే వారిని కష్టపెడతారు, సుఖ పడే వారిని పట్టించుకోరు అన్నాడు మాధవ్
ఇప్పుడు మనం తినలేం ఆవకాయ, మాగాయ, గోంగూర, చింతకాయ పచ్చడ్లు పెట్టి మరీ ఇద్దరు కొడుకు, కోడళ్ల కు ఇద్దరు  కూతురూ అల్లులకు కొరియర్ ద్వారా పంపిస్తు న్నావు,  పచ్చళ్ళు దేవు డెరుగు కనీసం మనల్ని గుర్తించే పరిస్థితే లేదు, అంతా నీ శ్రమ తప్ప .
ఏ మోనండి పిల్లలు మనల్ని గుర్తించక పోయినా మనం వారిని మరిచి ఉండలేమండీ.
ఇప్పుడు మరచి పోయానని చెప్పానా, లేదే వాళ్ళ గుణాలను గుర్తించి చెపుతున్నాను. 
       
నమస్కార మండి అంటూ కొందరు ఉద్యోగులు కలిశారు మాధవ్ గారిని, అందరిని సానుకూలంగా ఆహ్ఫానించి వారికి తగు అల్పాహారములు ఏర్పాటు చేసింది శ్రీమతి రాధా.

వచ్చిన విషయము తెలియపరుస్తు, మీరు వ్రాసిన "లోకమింతే "  అనే కావ్యానికి భాష ప్రాతిపది కముగా మొదటి బహుమతి కేంద్ర ప్రభుత్వం వారు గుర్తించారు, కాశీ లో జరిగే ప్రత్యేక ఉత్సవము నందు రాష్ట్ర పతి చేతులు మీదగా మీరు అందు కోబోతున్నందుకు మా టీచర్ అసోసియేషన్ ద్వారా సంతోషము వక్త పరుచుటకు వచ్చామని చెప్పారు. మీరు అవార్డు తీసుకోని తిరిగి వచ్చుటకు అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాము మీ తరుఫున ఎవరైనా వస్తానంటే మాకు తెలియ పరచండి ఏర్పాటు చేసుకోవాలి అని తీలియపరిచారు.

వారి మాటలకూ ఒక్కసారి మాధవ్ గారికి కళ్ళు చెమ్మగిల్లినాయ్ ఇప్పుడే ఉండండి అంటూ లోపలకు పోయి వచ్చినవారికి తాను రచించిన కావ్యాన్ని తలా ఒకటి చేతిలో పెట్టాడు.

మీకు అన్ని వివరముగా రెండు రోజుల్లో తెలియపరుస్తా అని అందరికి నమస్కార బాణాలు చెప్పాడు మాధవ్

రాధా అంతా  విన్నావు కదా కొడుకుల్లకు, కూతుర్లకు కబురు  చేయి, వాళ్ళ అభిప్రాయాలు కనుక్కొని చెప్పు అన్నాడు, నేను ఆ హనుమంతుని గుడిదాకా పోయి నమస్కరించి వస్తా అని గుడికి నడిచాడు మాధవ్.

కొడుకులు కూతుర్ల మాటలు విని ఓక్కసారి  బాధపడింది, భర్తకు ఏమిచెప్పాలో తెలియక ఉండి పోయినది.

మాధవ్ అడుగు పెడుతూనే ఏమన్నారు మనబిడ్డలు అని అడిగారు, తడబడుతూ ఈ అవార్డు తీసుకోకపోయినా పోష్టులోవస్తుంది నాన్న శ్రమ పడి పోవుట ఎందుకు ?

అవునే కష్టం విలువ వాళ్లకు తెలియదు, ఎదో కంప్యూటర్ విద్యనేర్చుకొని లక్షలు సంపాయించు తున్నారు, నేను లక్షలు సంపాదించ లేక పోయిన ప్రశంసా బహుమతితో ధనం పొందుట నాకు గొప్ప.

పిల్లలు వచ్చినా రాక పోయినా మన ఇద్దరం కాశీకి బయలు దేరుదాము,  నీకు నామీద నమ్మకం లేకపోతే నీవు రావద్దు.

అంత మాట అనకండి నేను మీతో వస్తాను, నా పిల్లల కన్నా మీరే ముఖ్యం
సరే రెండు రోజుల్లో మనం కాశీకి పోదాం, బహుమతి తీసుకోని పుణ్యక్షేత్రాలు తిరిగి వద్దాం, అన్నాడు.

అను కోని విధముగా బహుమతి ప్రధానము తారీఖు మార్చటం జరిగింది. అనుకున్న ప్రకారముగా ఉపాధ్యాయ పదవీ విరమణ జరిగింది. కొడుకులు కూతుర్లు ఎదో ఆశించి విరమణ సమయమున హంగామా చేశారు.

మాధవ్ మాత్రం లాయర్ పిలిపించి తనఆస్తి వివరాలు, రొక్ఖం వివరాలు తెలిపి వీలునామా రిజిస్ట్రేషన్ చేసాడు, ఆవిషయమే పిల్లలకు తెలియ పరిచాడు, నాన్న వచ్చిన డబ్బు ఎక్కడ దాస్తున్నాడో ఎవరికీ పెడుతున్నాడో, నీకు తెలియకుండా, మాకు ఇవ్వ కుండా ఉన్నాడు. అమ్మా నీవు జాగర్త పడాలి అని హెచ్చరించి వెళ్లారు.

 అనుకున్న ప్రకారముగా రాధా మాధవ్ కాశీలో బహుమతి తీసుకున్నారు, గంగలో స్నానమాచరించి పరమేశ్వరుని దర్శించి, గంగా హారతి చూడాలని పడవలో కూర్చున్నారు. ఒకవైపు హారతి మరోవైపు మాధవ్ కు  గుండె దడ పెరిగింది, పడవలోనుండి గంగలోకి విరిగి ప్రాణాలు అనంత వాయువులో కలిసాయి. 

మాధవ్ అకాల ముర్చువుని తట్టుకోలేక ఒక్కసారి మూర్ఛ పోయింది రాధ. తమతో పాటు వచ్చిన ఉపాద్యాయులు కొడుకులకు, కూతుర్లకు కబురుచేయక అందరూ వచ్చారు కర్మలు చేశారు, ఆస్తి వివరాలు అడిగారు. 

లాయర్ ద్వారా వీలునామా చదివించారు, దానిలో " నేనుకాని నాభార్య కానీ ముందుగా ఎవరు చనిపోయినా రెండవ వారికి పూర్తి అధికారము వచ్చును, ఇరువురము చని పోయిన తర్వాత కొడుకులకు కూతుర్లకు సమాన భాగముల్లాగా పంచు కొన వలెను. లాకర్ లో ఉన్న డబ్బు ఈ ఇల్లు వృద్ధులకు నివాసమునకు మందులకు, వ్యాయామ శాలకు వాడవలెను. అనివ్రాసిన దాన్ని వివరించారు. 
   
                  
కొడుకులు, కూతుర్లు ఆస్తి రాదని తెలుసుకొని తల్లిని అడిగి వెనుతిరిగారు ఫలితములేక. 

మాధవ్ రచించిన కవిత్వాలను ముద్రికవల్లా, వృద్దాశ్రమము వల్ల దినదినాభి వృద్దిగా మాధవ్ గారి పేరుతో అభివృద్ధి దిశలో తీసుకొచ్చింది రాధా 

ఇద్దరు కొడుకులు సంపాదన తారుమారై తల్లి పంచన చేరారు, అల్లుళ్ళ కోరికపై కూతుర్లు ఇంటికి వచ్చారు. ఎవ్వరిని వద్దనకుండా  పని పురమా యించి అభివృద్ధి దశలో కొచ్చారు, మాధవ్ ఆబ్దికం ఘనంగా ఏర్పాటు చేసారు. 

దు:ఖము వచ్చిన, సంతోషము పెరిగిన, గుండె ఆగి పోతుంది మరణ శాసనం అనే నిజం అదే రోజు రాధను వెంబ డించింది  అట్లు జరుగుట ఎవరి వళ్ళ ఏమో తెలియదు - డబ్బుకోసం కొందరి ఆశపరుల చర్యే     .......   



సప్తధాతువులు – రసము, రక్తము, మాంసము, మేధస్సు (కొవ్వు), ఆస్తి (ఎముక), మజ్జ (మూలుగ),
సప్త సముద్రాలు – లవణ (ఉప్పు), ఇక్షు (చెరకు), సురా (మధ్యం/ కల్లు), సర్పి (ఘృతం/ నెయ్యి), క్షీర (పాల), దధి (పెరుగు), నీరు (మంచినీటి)
ఏడు వ్యాహృతులు – ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహాః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం
సప్తగిరులు – శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషబాధ్రి, నారాయణాద్రి, వేంకటాద్రి
సప్తనదులు : గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి
సప్తపిండదానకరులు : 1.పుత్రులు, 2. దౌహిత్రులు, 3. పౌత్రులు, 4. మేనల్లుడు, 5. భార్య, 6. అన్నదమ్ములు, 7. అన్నదమ్ముల కొడుకులు.
సప్తమండలములు : 1.వాయుమండలము, 2. వరుణ మండలము, 3. అగ్ని మండలము, 4. చంద్ర మండలము, 5. సూర్య మండలము, 6. నక్షత్ర మండలము, 7. జ్యోతి మండలము.
సప్తమాతలు :1. స్త్రీ, 2. లక్ష్మి, 3. ధృతి, 4. మేధ, 5. శ్రద్ధ, 6. విద్య, 7. సరస్వతి.
సప్తమాతలు (మాతృసమానులు) : 1. తల్లి తల్లి, 2. మేనమామ భార్య, 3. తల్లి సోదరి, 4. భార్య తల్లి, 5. తండ్రి తల్లి, 6. అన్నభార్య, 7. గురుపత్ని.
సప్త రాజ్యాంగములు : 1.అగ్నిష్టోమము,2.అశ్వమేధము,3. బహుసువర్ణకము,4.రాజసూయము,5. గోమేధము,6. వైష్ణవము,7. మహేశ్వరము.
సప్తయజ్ఞములు : 1.అగ్నిష్టోమము,2.అశ్వమేధము,3. బహుసువర్ణకము,4.రాజసూయము,5. గోమేధము,6. వైష్ణవము,7. మహేశ్వరము.
సప్తలోకములు : 1.భూలోకము, 2. భువర్లోకము, 3. సువర్లోకము, 4. మహార్లోకము, 5. జనలోకము, 6. తపోలోకము, 7. సత్య లోకము.
సప్తగంగలు : 1. గంగ,2.యమున,3. గోదావరి,4. కృష్ణవేణి,.5.నర్మద,6.సింధు,7.కావేరి
సప్తజన్మలు : 1. దేవతలు,2.మనుష్యులు.3.మృగములు,4.పక్షులు,5.పురుగులు.6.జలచరములు,7.తరుపాషాణములు
సప్త తత్వములు : 1.సత్యము. 2.బ్రహ్మము.3.విలంబితమానము.4.పక్షులు,5.వస్తువు,6.స్వభావము,7.సత్యాదిగుణము
సప్తదేహ పుణ్య కార్యములు : 1.మనస్సు, దేవుని యందు భక్తి కలుగుట. 2.నోరు. దేవుని నామము స్మరించుట.3.చేతులు, దేవుని పూజించుట.4.కాళ్ళు,. దేవాలయమునకు వెళ్ళుట.5.కనులు. దేవుని కనులార గాంచుట.6.చెవులు. దేవుని కథలు వినుట.7.శిరము. దేవునికి వందనము చేయుట చేసిన పుణ్యము.
సప్తసరస్వతులు : సుప్రభ (పుష్కర క్షేత్రము), కాందనాక్షి (నైమిశారణ్యము), విశాల (గయా క్షేత్రము),
మనోరమ (ఉత్తర కోసలము), ఓఘవతి (కురుక్షేత్రము), సురేణు (హరిద్వార్),

విమనోదక (హిమాలయము).


నేటి హస్యం

గురువు :పిల్లలు నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాదానము చెప్పండి
         
             దేవుడు చేసే పని ఏమిటి ?
పిల్లలు

1 . గురువు స్థానంలో ఉండి బోధ చేయటం  కదా మాష్టారు
2.  జనన మరణాలు సృష్టించటం కదా మాష్టార్
౩. ప్రళయాన్ని శృష్టించి ఆడుకోవటం కదా సార్

గురువు: రేపటి లోపు సమాధానములు వ్రాసు కొని రండి
మరునాడు : అందరు తమకు తెలిసినవి వ్రాసుకొని వచ్చారు.

గురువు:: ఎం రామకృష్ణ నీవు సమాధానము ఏమి వ్రాఉకు రాలేదేమి ? ఏమిటి ?
ముందు మీరు సమాధానము చెప్పండి తర్వాత నేను చెపుతాను అన్నాడు అందరి ముందు
గురువు : ఎం చెప్పాలో తెలియక ఒక్క అరుపు అరిచి పిల్లలకు పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి అన్నాడు .

రామకృష్ణ : నేను చెపుతాను గురువుగారు నాకు అనుమతిస్తే
గురువు : చెప్పు

ఏమీ లేదు నేను సమాధానము చెప్పే వాడ్ని కనుక ఒక్క క్షణం గురువు స్థానంలో ఉంటా అన్నాడు

గురువు : సరే అట్లాగే అని పిల్లల మధ్య కూర్చున్నాడు.

రామకృష్ణ : దేవుడు చేసే పని అహంకారులను క్రింద కూర్చో పెట్టడం , అనుకువగా ఉన్న వారిని అందలం ఎక్కించటం  అంతే .......
.

ఆ..........                 ఆ.....................


No comments:

Post a Comment