Saturday 19 May 2018

ప్రాంజలి ప్రభ (2 4 - 0 5 -2 0 1 8 )

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ: - శ్రీ క్రిష్ణయనమ:



ఆనందం - ఆరోగ్యం - ఆద్యాత్మికం అందరికి అందించటమే మాలక్ష్యం 



నేటి కవిత
ప్రాంజలి ప్రభ

అణువణువు ఆక్రమించిన, అలివి మీరిన
భయాన్ని తొలగించే మాయల సింహము

ఆది అంతము వరకు ఆక్రమించిన,
 ఆది పురుషుని ఆకర్షించే పెను సింహము

బ్రహ్మాదులు, వేదాంతతతులు, తెలుసు
కోలేని ప్రేమను పంచే ఘన సింహము

కళ్ళతో ప్రేమను పంచి, కళ్ళతోనే
 భయము తొలగించే జిగి సింహము

తరుణి కౌగిట జేర్చి, మనసు ఊరడించి
 సంత్రృప్తి కల్పించే శ్రీ నరసింహము

అధర్మపరులను అంతము చేసి ధర్మాన్ని
రక్షించి శాంతి కల్పించే సంహార సింహము

వేంకటాద్రిపే, వేదాచలముపై, శీఘ్రంగా
 పెరిగి లోకాలన్నీ నిండి బెరిగిన సింహము

--((*))--




మందార మకరంద మాధుర్యమునఁ దేలు;
మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు;
రాయంచ సనునె తరంగిణులకు?
లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు;
కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక;
మరుగునే సాంద్ర నీహారములకు?

సంచరించే ఓ గురూత్తమా! మందార పూలలోని మకరందం త్రాగి మాధుర్యం అనుభవించే తుమ్మెద, ఉమ్మెత్త పూల కేసి పోతుందా? రాజహంస స్వచ్చమైన ఆకాశగంగా నదీ తరంగాలపై విహరిస్తుంది కాని వాగులు వంకలు దగ్గరకు వెళ్ళదు కదా? తీపి మామిడి చెట్ల లేత చిగుళ్ళు తిని పులకించిన కోయిల పాటలు పాడుతుంది తప్ప కొండ మల్లెల వైపు పోతుందా? చకోర పక్షి నిండు పున్నమి పండువెన్నెలలో విహరిస్తుంది కాని దట్టమైన మంచు తెరల వైపునకు వెళ్తుందా? చెప్పండి. అలాగే పద్మనాభస్వామి విష్ణుమూర్తి దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతం గ్రోలటంలో మాత్రమే నా మనసు పరవశించి ఆనందం పొందుతుంది. వెయ్యి మాటలు ఎందుకు లెండి, హరిపాదాయత్త మైన నా చిత్తం ఇతర విషయాల పైకి ఏమాత్రం పోవటం లేదు.”



*****బారతి వర్ణన ******* 
సీ:*ముఖచంద్రబింబానముసిరిఛందసులెన్నొ ; 
పదములేజోడించిపరవసించ 
ఉత్ప్రేక్షలాదులుఉరముహారములయి ; 
సొంపుగాపదజాలశోభపెంచ 
అఱకొరమణులుగాఅలరించుచమకులు ; 
భాసించుమధ్యలోభావమలర 
మువ్వలైమంజీరములజేరికవులును 
కావ్యాలుకూర్చుతూకవితలల్ల 

తే.గీ :*కదిలిరాగతల్లిపదకింక్వణులతోడ 
పదపదంబులనందొక్కపద్దెమమర 
లచ్చికోడలుందిభయమేలతమకన్న 
కవులపాలిటనీవమ్మకల్పతఱువు 


రచయత కవిశ్రి సత్తిబాబు 



పూచిన పూవులు 
----------------/------ 
పూచింది ఒక పువ్వు 
పూజకై వేచింది 
పురుషోత్తముని పాద 
పద్మముల చేరుటకు! 

పూచింది ఒక పువ్వు 
పూల చండుగ మారి 
పడతి సిగలో చేరి 
పరిమళించు టకు! 

పూచింది ఒక పువ్వు 
పరవసించగ మనసు 
పెట్టె మంచము చేర 
పులకించ తనువులు! 

పూచింది ఒక పువ్వు 
పురిటిలో రాలుటకు 
పాప మేమి చేసినదో 
ప్రాణములు కోల్పోవ! 

ప్రతి పూవుకు కలదు 
ప్రత్యేక రాతోకటి 
ప్రకృతి శోభిలగ 
పలు విధముల పూయ! 

శ్రీనివాసమూర్తి 




వాల్మీకి మహర్షి విరచిత 

యోగ వాశిష్ట సారము 



8. మహా పురుష లక్షణములు 

ముముక్షువు మొదట సాధుసంగమమొనర్చి వారి యుపదేశములను ఆచరింపవలెను. అపుడు బుద్ధి వికసించును. తదుపరి మహాపురుష లక్షణములను సంపాదింపవలెను. ఈ మహాపురుష లక్షణములు ఒక్కని యందే లభించకపోయిన, ఎవని యందా లక్షణములు గలవో వానినే గ్రహించి బుద్ధిని పెంపొందింప జేయవలెను. శమదమాది గుణములతో గూడిన ప్రజ్ఞయే మహాపురుష లక్షణము. సమ్యక్‌ జ్ఞానము లేకున్న ఇది సిద్ధించదు. వర్షధారచే అంకురము మొలకెత్తునట్లు, శమదమాది గుణములచే జ్ఞానము వృద్ధి చెంది, ఆత్మసుఖము లభించును. ముముక్షువులు శమ ప్రజ్ఞాదులలో మహాపురుషుల చరిత్రలు ఆదర్శముగా వుంచుకొని, జ్ఞాన, శమములు పెంపొందించుకొనవలెను. రైతులు పొలములో పాటలు పాడుచు, అరచుచూ, పక్షులను తరిమినట్లు, ముముక్షువు జ్ఞాన సదాచారములనాచరించుచూ, భ్రమ ప్రమాదాది విఘ్నములనాశన మొనర్చి పరమపదమును పొందవలెను. 

ఆత్మ ప్రకాశమనగా బ్రహ్మజ్ఞానము. అది పొందాలంటే మహా వాక్యములను అభ్యసించవలెను. తద్వారా అజ్ఞానము నశించును. దృశ్య ప్రపంచము మాయగా స్వప్నముగా ప్రత్యగాత్మ యందు అనగా జీవ చైతన్యమందు తోచుచున్నది. అందువలన ఇదంతయు బ్రహ్మమే అను మహావాక్యము వలన, స్వాత్మరహస్యమును గ్రహించువాడే బ్రహ్మజ్ఞుడనబడును. ఆత్మయొక్క స్వరూపము, ఆకాశమువలె నిరాకారము, చైతన్యము మాత్రమే. అది జీవ రూపము ధరించి జగత్తుగ భాసించుచున్నది. ఇది స్వప్నతుల్యము. జగత్తు సత్యమేయైనను అదిమిధ్య. స్వప్నము గూడనంతియె.



నేటి హాస్యం 


"ఉదయ్ కుమార్".... 
ఉదయాన్నే లేచాడు.... 
ఇంకా సూర్యుడు ఉదయించే లేదు... 
ఆ మసక వెలుతురూ లోనే...సముద్రపు ఒడ్డు కి వెళ్ళాడు!! 
అక్కడ ఒక రాళ్ల గుట్ట కనిపించింది!! 
ఏమీ చెయ్యడానికి తోచక... 
ఒక్కొక్క రాయి తీసుకుని... 
సముద్రం లో విసిరెయ్యడం మొదలెట్టాడు!! 
అలా... అన్ని రాళ్లు విసిరేసి.... 
ఆఖరి రాయి విసిరెడ్డ మని చేతి లోకి తీసుకున్నాడు!! 
ఇంతలో... 
సూర్రావు ...అదే... 
మన సూర్యుడు ఉదయించాడు!!!! 
అప్పుడు ... 
ఆ వెలుగు లో చూసాడు... 
తన చేతిలో ... 
వున్నా రాయి ని.... 
అది... అది ఒక డైమండ్!!! 
బాప్ రే...  ఇంతవరకు చీకటిలో .. 
తాను సముద్రం లోకి విసిరిన వన్నీ ...డైమండ్స్ !!! 
మతి పోయి ...ఏడవటం మొదలెట్టాడు... 
తన దురదృష్టానికి!! 
నీతి:::  అందుకే    ఎప్పుడూ.... 
అందుకే తాను చేసే పనిని గూర్చి ఆలోచించాలి కొంచెం !!



1 comment: