Monday 1 May 2017

మల్లాప్రగడ రామకృష్ణ కధలు-29

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
నిరుద్యోగి ప్రయాణం - 4
       

 శ్రీధర్ గారు, శాంతమ్మ గారు మీరు స్థిమితముగా కూర్చోండి, మీకు ఎటువంటి సమస్యలు లేవు, ఇప్పుడు ఉన్నవి తాటాకు చప్పుళ్ళకు బెదేరేవి కావు అయినా మానసికముగా కొంత వత్తిడి ఉండక తప్పదు, అదికూడ లేకుండా నేను చేస్తాను, నామీద నమ్మకము పెట్టుకోండి, నేను కేవలము ఒక్కరోజు మాత్రమే ఇక్కడ ఉంటాను. జరిగిపోయినది, మరచి పోవటం తప్ప మనం చేసే ప్రయత్నాలు ఏమీ ఫలించవు, పోయినది కొంతకాలము మనది కాదనుకోండి మనస్సు నిగ్రహించుకోండి, జరిగేవన్నీ మనమంచికే అనుకోండి అని మాధవ్ తెలియ పరిచాడు.
          
మీరు నవ్వులను, దగ్గరకు తీసుకొని , ఇతరులతో నీ భావాలు పంచుకొనుటకు ప్రయత్నిచండి.  

పాజిటివ్ గా ఆలోచించండి, దాని వలన ఎనలేని సంతోషం మీ సొంతం చేసుకో గలుగుతారు.  

కక్ష కన్నా క్షమ గొప్పది,   క్షమ కన్నా *జీవుల పట్ల కరుణ* గొప్పదని అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకోండి.

ఇట్లు చెపుతున్నానని అనుకోకండి, మీరు కష్టపడ్డ సొమ్ము చిట్ ఫండ్ కంపెనిలోపెట్టారు, కంపెనీ తీసే సారని భాదపడితే ఆరోగ్యం చెడిపోతుంది కనుక అట్లు ఉండుట మంచిది కాదు.

రామాయణంలో హనుమంతుని చూసి తనకష్టాలు చెప్పుకొని హనుమంతుడు భుజము మీద తీసుకోని వెళతానన్న నీవు నా భార్త వద్దకు చేర్చాలని అనుకున్నావు, నాకోసం నీవు మచ్చ తెచ్చుకోవద్దు, నాభర్త వచ్చి రావణుని జయించి తీసుకెళ్లటం మంచిది అన్న మాటలకు సంతోష బట్టాడు హనుమంతుడు.

అప్పుడు సీతాదేవి అన్నది మానవులకు ఓర్పు ఎక్కువ, అప్పుడు పట్టుదలతో ఉన్నవారికి అపజయము లేదు విజయము తద్యము అన్నాడు మాధవ్ .

సీతాదేవి భర్త కోసం ఉన్నట్లుగా మీరిద్దరూ ఒక్కమాటగా ఉండి కష్టాలను కట్టెక్కించుటకు ప్రయత్నిమ్చన్డి .

శాంతి, శ్రీధర్ గారు అన్నారు మాలో ఉన్న భయాన్ని తొలగించారు, కొందరి మాటలు విని మాలో భయము పెరిగింది మా మనసే పని చేయలేదు అందుకే అట్లా గున్నాము.

నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను కొద్ది ధనముతో కష్టపడతారా, అప్పు తీసుకొచ్చి పెద్దమొత్తం వ్యాపారం చేస్తారా.

మీ అభిప్రాయం తెలపండి, ఆతరువాత ఎం చేయాలో నేను చెపుతాను అన్నాడు మాధవ్.

బాబు మాదగ్గర బంగారము లేదు, అప్పు ఇచ్చేవారు లేరు, మావారికి ఉద్యోగము లేదు,

ఈ చిన్న పిల్లలను పోషించటం కష్ట మోతున్నది అన్నది శాంతి.

శ్రీధర్ గారు మీ అభిప్రా యము కూడా అదేనా.

శ్రీధర్ గారు, శాంతమ్మ గారు నేను ఏమిచెప్పినా దాని ప్రకారముగా అనుకరిస్తాము అని ముందు మాట ఇవ్వండి అన్నాడుమాధవ్ .

అట్లాగే అనిమాట ఇచ్చారు

మీకో విషయం చెప్పాలి రామాయణంలో తన భర్తమీద నమ్మకంతో  ధైర్యంతో జీవించింది.

శాంతి గారు మీరు కూడా మీ భర్త మీద నమ్మకంతో ధైర్యం చెప్పండి.

ఇంతకీ మీదగ్గర ఎంత పైకము ఉన్నది. పిల్లల కోసం హుండీ డబ్బులు, చే బదులు అనగా పిల్ల పాలకు అని ఉంచన పైకము మొత్తము కలసి ౫౦౦ రూపాయలకన్నా ఎక్కువదొరకవు.

శాంతమ్మ గారు మీకు సాంబార్ అన్నం, పెరుగన్నం, పప్పు బియ్యం చేయటం వచ్చా అని అడిగాడు. చేయటం వచ్చు బాబు. మీదగ్గర టిఫిన్లు ఏమైనా ఉన్నాయా లేవు బాబు. కిరోసిన్ స్టవ్ లేదా గ్యాసా అని అడిగాడు మాధవ్

కిరోసిన్ బాబు అదికూడా నిండుకున్నది అని చెప్పెంది.

రామారావ్ గారు మీరు నాతొ వస్తారా అని అడిగాడు మాధవ్ .

మేము ఒక అరగంటలో వస్తాం అని చెప్పి బయఁటకు నడిచారు

అద్దెషాపుకు పోయి ఒక గిన్నె, రెండు బేసిన్లు మూడు టిఫిన్లు, అద్దెకు తీసుకోని పాపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, బియ్యము, పప్పు ,పెరుగు,  తిరగమోత గింజలు మరియు కిరోసిన్ తీసుకోని ఇంటికి వచ్చారు ఇద్దరు.

ఇవిగోనమ్మ మీరు వీటితో సాంబారన్నం, పెరుగన్నం, పప్పు బియ్యం అరగంటలో తయారు చేయండి. మళ్ళా అక్కడ దాకా వీళ్ళొస్తాము అని శ్రీధర్ తో ఒక పార్క్ వద్దకు చేరాడు.

పార్కువద్ద వాచమేన్ కలసి మేము ఇక్కడ తినేపదార్ధాలు అమ్మదలుచు కున్నాము ఎవరిని అనుమతి తీసుకోవాలి అని అడిగారు.

వెంటనే ఒక మేనేజర్ వద్దకు తీసుకెళ్లాడు.

మాధవ్ అన్ని వివరముగా మాట్లాడి ఒక్క రెండు గంటలు అవకాశము ఇవ్వండి, ఎటువంటి చెత్త పడకుండా మీరు ఎక్కడ పెట్టుకోమంటే అక్కడే పెట్టుకుంటాం అన్నాడు.

సరే ఈ రోజుకు అనుమతి ఇస్తా, బాగుంటే కంటిన్యూచేయిస్తా, దీనికి ఫుడ్ కంట్రోల్ వారి పరిమీషన్ కావాలి కదా.

వెంటనే మాధవ్ ఇక్కడ అంతకముందు హోటల్ పెట్టారుగా వారు ఏమైనట్లు, వారు మైంటైన్ చేయలేక మానేశారు . వారి అడ్రస్ తీసుకొని ఫోన్ చేసి ఏవో మాట్లాడాడు మాధవ్.

ముందుగా అనుకన్న  ప్రకారము రెండు చీరలు తీసుకోని భోజన పదార్ధాలు తీసుకోని శ్రీధర్, మాధవ్ పార్కుకు చేరారు.

చీరలతో గుడారముగా మార్చి తయారు చేసిన పదార్ధాలన్నీ ముగ్గురూ కలసి అమ్మటం జరిగింది. అనుకోని విధముగా కొంత పైకము సంపాదించటం జరిగింది.

ఆపైకము మొత్తము శాంతమ్మ గారి చేతిలో పెట్టాడు

ఏమండి ఇటు రండి అంటూ శ్రీధర్ ని పిలిచింది మీరేమన్న పెట్టుబడి పెట్టారా లేదే అన్నాడు. అంటే ఇది ఆ అబ్బాయి కష్టం మనం కూలీలం మాత్రమే అన్నది శాంతమ్మ.

మాధవ్ మాట్లాడుతూ నేను అద్దెకు తెచ్చిన వంట సామాను పాత్ర ల రసీదు దాని పైకము ఇవ్వండి అన్నాడు, ఇచ్చింది శాంతమ్మ, బియ్యం వగైరా క్రింద నేను వెచ్చించిన పైకము ఇది ఇవ్వండి అన్నాడు ఇచ్చింది, తరువాత మిగిలిన పైకమును నాలుగు భాగములు చేయండి అవి అన్నియు మీకే, రెండు భాగాలు మీకష్టార్జితం, మిగతా రెండు భాగాలు రేపటి సరుకులకు అద్దెసామానుకు ఉపయోగించండి అని చెప్పాడు మాధవ్ .

శాంతా, శ్రీధర్ ఒకరి మోఖాలు ఒకరు చూసుకున్నారు, ఇది కలా నిజమా

బాబు కష్టమంతా నీది మేము కేవలము సహాయకులము.

బాబు నీవు కూడా కూలి తీసుకో అన్నప్పుడు మిరే ఇవ్వండమ్మా అన్నాడు, ఇచ్చింది తీసుకున్నాడు మాధవ్  

చుడండి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగాలి, వచ్చిన పైకము లెక్క వేయకండి, కొంత భవిషత్ కు ఉంచి కొన్నాళ్ళు కష్టాన్ని కూడా పెట్టుబడిగా పెట్టండి, అతిగా కష్టపడకుండా నలుగురికి పని ఇచ్చే విధముగా ఎదగండి, నాకు అనుమతి ఇస్తే నేను బయలు దేరుతా,

నేను ఒకటే చెప్పేది మంచిగా, రుచిగా తినేపదార్ధాన్ని తయారు చేసి తక్కువ ధరకు నలుగురూ తినేటట్లు అమ్మండి

బాబు మేము నీకు ఋణపడి ఉన్నాము అన్నది.

మీరు పెద్దలు నేను మీకు ఋణపడి ఉన్నాను, అది ఇప్పుడు తీర్చుకున్నానని అనుకుంటున్నాను, నన్ను బలవంతం పెట్టద్దు, మీ కోదారి చూపను, ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పకూడదు అంటూ తనదగ్గర ఉన్న పైకమును చూసుకొని కొంత పెరిగిందని సంతోష పడి శాంతమ్మ శ్రీధరకు దండం పెట్టి చంకను సంచీ పెట్టుకొని నడక ప్రారంభించాడు మాధవ్ .

అప్పుడే శ్రీధర్ పరుగెత్తుకుంటూ వచ్చి మూడు పొట్లాలు చేతిలో పెట్టి ఇవి దారిలో తిను బాబు ఇంతకన్నా ప్రస్తుతము ఏమీ ఇవ్వలేను, అన్నప్పుడు శ్రీధర్ ని హృదయానికి హత్తుకొని మాధవ్ నేను నిరుద్యోగిని ఉద్యోగము కోసం వెత గాలికదా,

బాబు నీవు ఏఉద్యోగము కోసం వెతుకుతున్నావో ఆఉద్యోగం తప్పక రావాలి అంటూ కదిలాడు శ్రీధర్ మరియు మాధవ్ .                                                      

                      

1 comment: