Wednesday 10 May 2017

మల్లాప్రగడ రామకృష్ణ కధలు - 42

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:



సంసారంలో సరిగమలు -5

మిటండి ఇంత పీనాసి బుద్దులు మీకు, సంపాదించినది కట్టుకు పోతామా, అనుభవించటానికే కదా

కాదని ఎవరన్నారు, నా సంపాదనంతా నీకు మన పిల్లలలుకు కాక ఒక్క పైసా కూడా ఎవ్వరికి ఇవ్వను,  ఇతర ఖర్చులకు  వాడను, అది నీకు తెలుసు.

మరి నీవు నన్ను పీనాసి అను, సన్నాసి అను, ఏబ్రాసి అను ఏ పదముతో నయినా తిట్టు, నేను నోరు విప్పితే నీమీద ఒట్టు.

మీరు కారు కొనుక్కుంటే ఎంతో చక్కగా అన్ని ఊరులు తిరిగి రావచ్చు,  చుట్టాల నందరిని కలసి రావచ్చు, భ్న్దు వర్గాన్ని పెంచు కోవచ్చు. 

దాని వలన ఫలితాము ఏదన్న ఉన్నదా

ఎందుకు లేదండి సమయము సందర్భము కలసి వస్తుంది, ప్రేమ బంధం పేరుగు తుంది.

దాని కోసం " కారే " కొనాలా పుణ్యక్షేత్రాలు చూడాలన్న, చుట్టాలింటికి పోవాలన్నా క్యాబ్ మీద పోదాం, ఇప్పుడు కొన్నామనుకో మన పుత్రికా రత్నం నడుపుతాడు వాడి వేగాన్ని అడ్డు కట్ట వేయలేము, రోజు చూస్తూనే ఉన్నాము కదా యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతున్నారో రోజు వింటున్నాము కదా.

మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఏమి చేస్తారు, కారు కొని డ్రైవర్ను పెట్టు కోవచ్చు కదా అని హెచ్చరించింది. ఏది ఎమన్నా నేను మాత్రం నాకున్నస్కూటర్ మీదే పోతాను, ఎక్కడకన్నా పోవాలన్న బస్సు,  రైలు దాని మీదే వెళదాం. మరోసారి ఈవిషయం నాముందు తీసుకు రాకు అన్నాడు భర్త .

ఏమిటే ఆ కాగితాలు తెచ్చావు, ముందు జాగర్త అండి

ఇప్పుడు నాకేమైందని రేపు ఏమైనా జరగ వచ్చు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే వీలునామా వ్రాసుకొని రిజిస్టర్ చేసుకుంటే మంచిదికదాఅన్నది భార్య .

ఇది నీ ఆలోచనా, లేదా నీ పుత్రుని ఆలోచనా ఎవరిదైతేనేమి మా ఉద్దేశ్యం చెప్పాము ముందు జాగర్తగా అన్నది

నాది గట్టి ప్రాణం " నీకు వడ్డాణం, అబ్బాయికి కాస్ట్లీ కారు కొనలేదని ఏమి ఆలోచనే మీది '

 రేపు బిసినెస్ కాన్ఫరెన్స్ పోవాలి చాలా పని ఉన్నది.  

నేను నీవు చెప్పినట్లు నీకు గిఫ్ట్ గా  2  కోట్ల పెట్టి కారు కొన్నాను, ఇంటికి తెచ్చాను అందరు మెచ్చు కున్నారు,ఇక మన కుమారుడయితే ఒక్కసారి నడుపుతానని కారు తీసు కెల్లడు

జాగర్తగా వెళ్ళమని చెప్పగా స్నేహితులతో రింగ్ రోడ్డులో౦ అధిక వేగం తో ఆగి ఉన్న బస్సు గుద్దేసి

అక్కడే ప్రాణాలు విడిచాడు.

ఆ విషయం అప్పుడే నాకు ఎవరో ఫోన్ ద్వారా తెలిపారు, స్నేహితులకు గాయాలు దాగిలాయ్ అని       

అంతే నాకు గుండెలో సమ్మెటతో కొ్ట్టినంత నొప్పి వచ్చింది...స్ప్రుహ లేకుండా పడిపోయాను.తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు.....

న ఆత్మా కలవరిస్తున్నది.

కాఫీ కావాలి నాకు........నా భార్య ఎక్కడ ఉంది. ఎందుకు నన్ను లేపలేదు.
కాన్ఫరెన్స్ కు టైం అవుతోంది కదా! నా పక్కన ఎవ్వరూ లేరు. ఏమైంది నాకు?

వసారాలో ఎవరినో పడుకోబెట్టి ఉన్నారు.......ఇంటి బయట చాలా మంది గుంపుగా ఉన్నారు. ఎవరో చనిపోయి ఉన్నారు......అయ్యో! అది నేనే! దాని ప్రక్కన నా కొడుకు దేవుడా!

నేను చనిపోయానా?బయట చాలా మంది ఏడుస్తున్నారు.....బిగ్గరగా పిలిచాను........నా మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు. బెదిరిపోయి నా పక్కగదిలోకి తొంగి చూశాను....

 నా భార్య విపరీతంగా ఏడుస్తోంది.

కొడుకును చూసి వీడు ఎప్పుడు చని పోయాడు అని అడుగు తున్నాను ఎవ్వరు పట్టించు కోవటం లేదు.
భార్యను పిలిచాను.
తనకు నా మాటలు వినిపించలేదు........
మరో గదిలోకి వెళ్ళి చూశాను.
 ఆ గదిలో మా అమ్మ ...నాన్న ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కూర్చోని ఉన్నారు దు;ఖంలో.
" నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను " అని బిగ్గరగా అరిచాను.
.ఎవ్వరూ నన్ను చూడటం లేదు..
బయటికి పరుగెత్తి వచ్చాను.
అక్కడ నా ప్ర్రాణ స్నేహితుడు భయంకరంగా ఏడుస్తున్నాడు.
వాడిని మిగతావాళ్ళు ఓదారుస్తున్నారు.
నా స్నేహితునితో నాకు గొడవవచ్చి, వాడితో సంవత్సరం నుండి నేను మాట్లాడ్టం మానేశాను,ఎన్ని సార్లు బ్రతిమిలాడినా మాట్లాడలేదు.
మరి వాడెందుకు ఏడుస్తున్నాడు.
అవును నేను చనిపోయాను.
నిజంగానే చనిపోయాను.

' దేవుడా! నన్ను ఒక్కసారి బ్రతికించు
 తండ్రీ! కొద్దిరోజులు నాకు సమయాన్ని ఇవ్వు.
.ఇన్ని రోజులు నేను నా వ్యాపార వత్తిడితో నా భార్యను, కొడుకును  మంచిగా ప్రేమగా చూసుకోలేకపోయాను.
నా బిడ్డతో మంచిగా గడపలేకపోయాను, నానా బిడ్డను కూడా తీసుకెళ్లినావు .

ఇప్పటికీ నన్ను పసిపిల్లాడిలాగానే చూసుకునే నా తల్లిదండ్రుల బాధను చూడలేకపోతున్నాను.
చేసిన తప్పును తెలుసుకుని నన్ను మన్నించమని వేడుకున్న నా స్నేహితుడిని మన్నించలేని పాపిని నేను."

" దేవుడా! దయవుంచి నన్ను బ్రతికించు..నా తల్లి మొహంలో నవ్వును చూడాలి.
.నన్ను క్షమించి నాకు కొన్నిరోజులు ప్రాణబిక్ష పెట్టు స్వామీ! "

ఓ దేవుడా నాకు నాకొడుక్కి ప్రాణ బిక్ష పెట్టు అని గట్టిగా నిద్రలో అరుస్తున్నాడు 
ఏమండి ఏమండి ఏమైంది మీకు అలా కలవరిస్తున్నారు.
అంటూ లేపింది  
కళ్ళు తెరిచి చూశాను.
కళ్ళ ముందు నా భార్య.
" ఏమైంది? కల కన్నారా? పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు.

అంటే ఇంతసేపు నేను కల కన్నానా! అంటే నేను చావలేదన్నమాట.
నిజంగానే నాకు ఇది మరుజన్మనే! మన అబ్బాయిని పిలువు ముందు వాడు బ్రతికి ఉన్నడా
వాడు నిద్ర పోతున్నాడు.
ముందు వాడిని పిలువవే అన్నాడు.
బాబు నాన్న గారు పిలుస్తున్నారు, ఏమిత్తి నాన్న నిక్షేపం లాంటి కలను పాడు చేసావు చెప్పి మొఖం కడుక్కొని వస్తా అని చేపి వెళ్ళాడు.       
 కాంఫరెన్సు  టైం అయిందన్నా నా
భార్య మాటలు విని తనని ఒక్కసారి దగ్గరకు రమ్మని పిలిచి
" నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని
.నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకడం.
నేను గమనించనేలేదు ఈరోజెంత అందంగా ఉన్నావో తెలుసా ? " అన్నాను......
ఆశ్చర్యంగా నా వంక చూసి
ఒక్కసారిగా నన్ను హత్తుకుంది కన్నీళ్ళతో నా భార్య,

మీరు బ్రతికే ఉన్నారు అంతే చాలు మరో ఆలోచన పెట్టుకోకండి.
ఎం కల గన్నారు. 
అబ్బా ఆకల ఒక పీడకల
ఏమిటో చెప్పండి
ఏముందే కారు కొన్నా "కొడుకు నేను దేవునిదగ్గర చేరాము " అంతే 

ఆమ్మో ఆ పాడు కలేమి టండి.
ముందు అబ్బాయిని పిలువ ఆంజనేయస్వామి గుడికెళ్ళి పూజ చేయిన్చుకొని మరి కాన్ఫరెన్సుకు బయలు దేరుతా
గుడిలో పూజారి చెడు ఆలోచనలు, తాహతుకు మించిన కోరికలు, వేరొకరు బాగున్నారు నాకు లేదే అనే ఏడుపులు ఉంటే మనసు కల్లోలముగా మారుతుంది, మనసు ప్రశాంతి కొరకు నిత్యధర్మాలు పాటిస్తూ జీవితమును సాగించుటే మానవులయొక్క ధర్మం.          

మృత్యువుని ఎవరు ఆపలేరు, కానీ దాన ధర్మాలు చేసు మంచి భావంతో సహాయం చేస్తూ ఉంటె మృత్యువు దరి చేర కుండా ఆపగలం అన్నారు. 
      

No comments:

Post a Comment