Tuesday 2 May 2017

మల్లాప్రగడ రామకృష్ణ కధలు - 30

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
 

నిరుద్యోగి ప్రయాణం - 5

మాధవ్ భాగ్యనగరానికి చేరాడు, అక్కడ ట్యాన్కు బండ్ మీదనున్న విగ్రహాలను చూస్తూ, దాని క్రింద వ్రాసినవి చదువుతూ నడుస్తున్నాడు.

అక్కడకి ఒక ఆటో డ్రైవర్ కాకి డ్రస్  వేసుకొని వచ్చి మాధవ్ ముందు ఆపాడు, బాబు మీకు గోల్కొండ చూపిస్తా, చార్మినార్ చూపిస్తా మీటర్ చార్జి ఇవ్వండి అన్నాడు.

నేను ఇక్కడే ఉంటాను, అవి తర్వాత చూస్తాను, వేరొకరిని తీసుకెళ్ళు అనిచెప్పాడు మధవ్

అప్పుడే ఒకతను సెక్రటేరియట్ కు వస్తావా, వస్తాను ఎక్కండి అన్నాడు. ఎంత కావాలో చెప్పు అన్నాడు.
మీరే చెప్పండి అన్నాడు, దూరం నాకు తెలియదు కదా అన్నాడు.
ఒక్క రెండొందలు ఇవ్వండి అన్నాడు సరే అని ఎక్కి కూర్చున్నాడు.


మాధవ్ అంతా గమనిస్తూ తెలియని వారిని ఎంత మోసం చేస్తున్నారు అని అనుకున్నాడు.

అప్పుడే ఒకతను వచ్చి సెక్రటేరియట్ ఎక్కడండీ అని అడిగాడు, అదిగో ఆ కనిపించేదే సెక్ర టేరియట్, నడచి పోగలనా, నడిచే దూరమే పోవచ్చు అన్నాడు.
నీళ్లల్లో నిలబడి ఉన్న బుద్ధవిగ్రహాన్ని చూస్తున్నడు.

అప్పుడే ఒక పిల్లవాడు ఆటో దిగి గబగబా ట్యాన్క్ బండ్ దగ్గరచేరి గభాలున నీళ్ళలోకి దూకాడు.

అక్కడే ఉన్న మాధవ్ అధిగమనించి వెంటనే నీళ్ళలోకి దూకి ఆ పిల్లవాడిని రక్షించాడు.

ఎందుకు రక్షించావు నన్ను నేను చావాలి, నేను ఎంతో కష్టపడి వ్రాసినా నాకు మార్కులు తక్కువ వచ్చాయి, మా ఇంట్లో  వాళ్ళు నన్ను ఇష్టము వచ్చినట్లు తిట్టారు, ఇక ఆతిట్టులు భరించ కూడదని నేను చనిపోవుటకు దూకాను.

మాధవ్ పిల్లవాణ్ణి దగ్గర కూర్చోపెట్టు కొని ఐస్ క్రైం కప్పు కొనిపెట్టి, మంచి మాటలు చెప్పుతూ ఉన్నాడు. 

 అప్పుడే తల్లి తండ్రులు అక్కడకొచ్చి బాబు మేము నిన్ను ఏమీ అనం నీవు ఎలా చదువు కోవాలనుంటే అలా చదువుకో, ఏ ఆట ఆడు కోవాలంటే ఆ ఆట ఆడుకో, నీవు అడిగి నవన్నీ కొనిపెడతాం అన్నారు.

మాబాబుని రక్షించినందుకు మీకు ధన్యవాములు అని అన్నారు. 

మీరు ఇంకెలా కూర్చోండి, కొన్ని మతాల తొందర వల్లే అనర్ధాలు జరుగుతాయి అన్నాడు మాధవ్ . 

చూడండి మీరు పిల్లలతో రోజూ ఒక్క అరగంట దగ్గర తీసుకోని మంచిగా కధలు చెపుతూ, కొత్త విషయాలు తెలియాపరుస్తూ, మానాన్న మా అమ్మ మంచివారు నాకోసం ఏమైనా చేస్తారు  అనే విధముగా పిల్లలమనసులో ఉండాలి.

అయినా మీకు చెప్పేంత వాడిని కాను పిల్లల మనసును అర్ధం చేసుకొని ప్రవర్తించగలరు అన్నాడు మాధవ్.

ఎంత పెద్దపాలకుండలోనైనా చిన్న మజ్జగ చుక్కపడితే అన్ని పాలూ

 విరిగి పోయినట్టే, ఎంత మంచి వాడైనా చిన్న పొరబాటుచేస్తే కీర్తిని 

కోల్పోతాడు. అట్లాగే పిల్లలు పసిపిల్లతో సమానం, వారికి ఏది మంచో, ఏది చెడో తెలియని  వయసు ఆవయసులో పెద్దలే జాగర్త గా మాట్లాడాలి అన్నాడు మాధవ్.  

అందం గుణం వల్ల,కులం నడవడివల్ల,చదువు కార్యసిధ్ధివల్ల,ధనం

అనుభవం వల్ల రాణిస్తాయి. మీరు తోటి పిల్లలను చూపి వాళ్ళ లాగా మార్కులు రావాలి అని వత్తిడి తెచ్చారు, పిల్లవాని మనసుకు భాధ కలిగే విధముగా ప్రవర్తించారు, డబ్బు ఉన్నది కదా అని ఆడుకోవటానికి కూడా సమయము కేటాయిన్చకుండా ట్యూషన్సు పెట్టడం అవసరమా. మీరు ప్రభుత్వస్కూలులో చదివారు, కానీ మీపిల్లలకు చదువు మాతృభాష కానీ భాషలో నేర్పు తున్నారు. ఒక్కసారి  మీరు ఆలోచించండి. అన్నాడు మాధవ్.        

తల్లిదగ్గర పాలు కుడవా(తాగా)లని ఆశపడ్డ దూడని తాగనీకుండా 

వెనక్కి లాగి మనుషులు పాలు పిండడానికి ప్రయత్నిస్తే ఆ ఆవు 

మూతి  పగిలేట్టుతంతుంది. అలాగే కోరికల సాకారం కోసం 

ప్రయత్నించే వారికి మనం స్వార్ధబుధ్ధితో అడ్డుపడితే దేవుడు ఏదో ఒక

రూపంలో జెల్లకాయ కొడతాడు.(కాబట్టి పిల్లల కోరికలకు,
  
ప్రయత్నాలకి అడ్డుపడకండి) అన్నాడు మాధవ్.

బాబు నీవు చేసిన సహాయానికి మాకు సంతోషముఆ ఉన్నది అన్నారు పిల్లవాని తలి తండ్రులు. 

అసలు మీరు ఎం చేస్తారు అని అడిగాడు. 

బాబు నేను ఆటో డ్రైవర్ని, అద్దెకు తీసుకోని నడుపు కుంటున్నాను, అదివరకు లాగా ఇప్పుడు బాడుగలు రావటంలేదు, క్యాబ్లు వచ్చి మా పొట్ట కొట్టి నాయి, అయినా ఓర్పుతో దేవుడు ఇచ్చిన విద్య నాకు ఇదేకదా అని ఏంతో  కష్టపడ్డా పిల్లలను చదివించటాకి డబ్బు సరిపోవుటలేదు. 

మాబాబు 10థ్ క్లాస్ తక్కువ మార్కులతో పాసయ్యాడు, వాడికి చదువు కన్నా ఆటలమీద బాగా ఇంటరెష్టు  చూపుతాడు, నాశ్రీమతి డాక్టర్ చదవాలి, ఇంజనీర్ చదవాలి, అని రోజు సతాయించుతున్నది మనం కష్టపడదాం పిల్లలను చదివిద్దాం అనేది . అట్లాగేనే నేను కూడా అదేగా అనేది. తెలుగు మీడియం స్కూల్లో చేర్పించి చదివిద్దాం అన్నాను అంతే కోపంతో మాట్లాడకుండా నాలుగు రోజులు మౌన వ్రతం  పాటించింది. 

చివరికు నా శ్రీమతి మాటకు కట్టుబడి మా స్సేట్ దగ్గర అప్పు తెద్దా మని వెళ్ళా ఇస్తాను రేపురా అన్నాడు , పిల్లవాణ్ణి చదివిద్దాం, సేట్ డబ్బులిస్తాడు అని పరధ్యానంగా ఆటో నడుపుతూ వచ్చాను. 

మరి ఇంటర్లో చేర్పించారా

ఎం చేర్పించటం బాబు ఆటో నడుపుకుంటూ వస్తూ ఉంటే ఒక కారు వాడు వేగంగా నా ఆటోను గుద్ది పారి పోయాడు , అప్పుడు నేను ఆటోలోంచి ఎగిరి ప్రక్కన ఉన్నఇసకలో బడ్డా, ఆటో పాడయి పోయినది. మాసేట్ నీకు డబ్బులిద్దామనుకున్న నా ఆటో పాడైనది నీవే నాకు ఎదురు డబ్బులు కట్టాలి అన్నాడు 

నేను దేవుని దయవల్ల బ్రతికి బాయఁటపడ్డ పిల్లలు గలవాడ్ని నాకు మిరే దారి చూపాలి అన్నా. 

అప్పుడు మాసేటు ఎప్పుడినుంచో మాదగ్గర నమ్మకంగా ఆటో నడుపు తున్నావు వారం రోజులు అయినతర్వాత ఏదన్న ఉద్యోగమూ చూస్తానువచ్చి కలవు. 

చేతిలో డబ్బు లేదు పిల్లవాణ్ణి చదివించాలి మేమిద్దరం అరుచుకున్నాం. 

నాన్న నేను చదవనులే నీలాగా ఆటో నడుపుకుంటూ బ్రతుకుతా అన్నాడు అన్నాడు మా బాబు 

నీ చదువేమోగాని అని కోపంగా అరిచాను, నేను మోర పెట్టుకొని అన్నా, కష్టపడి చదువుకోరా మంచి మార్కులు వస్తే స్కాలర్షిప్  వస్తుంది అని చెప్పినా మంచి మార్కులు తెచ్చుకోలేదని నాలుగు బాదా. 
నేను పోతున్న పోతున్న పోరా పో కోపంతో "ఎట్లోపడి చావ్ అని తిట్టాను "
మాధవ్ వచ్చిన వారితో నేను మీకు చెప్పేంత పెద్దవాడ్ని మాత్రం కాదు తాహతుకు మించి పోవద్దు, పిలల్లముందు మీరిరువురు ఎటువంటి దుర్భాషలు ఆడొద్దు, పిల్లల మనస్సు చాలా హత్తుకుంటుంది అన్నాడు. 

నేను నీకు సహాయము చేద్దామన్న చేతకాని వాణ్ని అన్నాడు మాధవ్ . 

అప్పుడే అక్కడకు ఒక లారీ వచ్చి ఆగింది. 

జై భజరంగబలి అన్నమాటలు విన్నాక 
భయ్యా నీవా, భయ్యా నీవా  అని కౌగలించుకున్నారు ఇద్దరూ 
భయ్యా నీవు నాకు సహాయం చేయాలి 
చెప్పు భయ్యా ఈ హనుమంతుడు నీకెప్పుడూ దాసుడు అన్నాడు 

చూడు భయ్యా ఇతను ఆటో డ్రైవర్, డ్రైవర్ లైసెన్సులు అన్నీ ఉన్నాయి ఉద్యోగ వేటలో 
ఎంభయ్యా నీవు ఇంకా ఉద్యోగ వేటలో ఉన్నావా, 
నావిషయం నీకు తర్వాత చెపుతాలే, ముందు ఇతనికి ఉద్యోగం ఇప్పిస్తావా అని అడిగాడు. 

ఉద్యోగమే ఏంటి భయ్యా నాలారీనే నడుపు కోమని చెపుతాను,
ఒక్క నిముషము ఉండు భయ్యా లారీలో పండు మామిడికాయలు ఉన్నాయి తెచ్చి ఇస్తాను అంటూ వెళ్లి తెచ్చి ఇచ్చాడు,
అందరి ముఖాలల్లో వెలుగు కమ్మింది.  
 
అందరూ ఎవరి దారి వారు వెళ్లారు మాధవ్ సంచిని తగిలించుకొని నడక సాగించాడు.                                        


1 comment: