Sunday 14 May 2017

*Mallapragada ramakrishna telugu Stories-46

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: 
సంసారంలో సరిగమలు 

అది ఒక స్త్రీల విద్యా బోధనా కళాశాల, అక్కడకొచ్చే విద్యార్ధులందరు సీతాకోక చిలకల్లాగా రంగు రంగుల చీరలు, చిన్న చిన్న డ్రస్సులు, రెండు జడలు వేసుకొని లంగా ఓనితో హుషారుగా చేతిలో పుస్తకాలు కొందరికి, మరి కొందరికి చంకన బ్యాగులు పెట్టుకొని గుంపులు గుంపులు గా కలసి కాలేజీకి వస్తున్నారు. అక్కడకు వచ్చిన కుర్రాలను చూసి చూడకుండా ఉన్నట్లుగా కవ్విస్తూ నడక సాగిస్తున్నారు     
 
అప్పుడే వర్షంలో తడుస్తూ నెమ్మదిగా నడుస్తూ కదిలింది శృతి
శృతిని చూస్తూ అక్కడే ఆగాడు క్రిష్

ప్రకృతి దృశ్యాలు చూడనెమ్చి కాళ్ళు కదిపి, చినుకులు రాలగ జలదరించి వళ్ళు  తడిసి, కళ్ళెదురుగా తడిసి
శృతి రూపాన్ని చూసి శరీరమంతా సెగలు కమ్ముకొని,  జలాశయమున చిక్కిన కమలములాగా తడిసి సంబరపడుతూ ఉన్న శృతిని, జలాశయంలో ఉన్న కమలాన్ని  అందు కున్నట్లు తడిసి ముద్దగా మారి శృతి చెయ్ పట్టుకున్నాడు క్రిష్.   

కడు  విశాల   నేత్రములు  కలిగి  నట్టి, కను విందు  చెస్తూ కదులు తున్నట్టి, జలక మాడుతున్న జలకన్యలాగున్నట్టి, మూతి తిప్పినా కాదు సుందరమైన మొఖం కలిగినట్టి, ఆమె సౌందర్యం చూసి మతి చెడి, అక్కడ ఉన్న బురదలో జారి పడ్డాడు క్రిష్,

ఓరగా చూస్తూ ఒక చిరు నవ్వు నవ్వి కళాశాలలోకి వెళ్ళింది, అక్కడవారు క్రిష్ ను చూసి నవ్వు కున్నారు కొందరు, చూసి చూడనట్లుగా నడిచారు .      

బురదలో నుండి లేచి శృతిని తలుస్తూ 
కన్య  సౌందర్యం  వర్ణింప  నా   తరమా, 
సౌందర్య   ప్రభ వలే  ఉన్న చెందమామా, బరువైన పిరుదులపై ఊగుతున్నా జడకుప్పెలు అందమా, చూడ చక్కగా పమిట చాటున బరువుతో కదులుతున్న వక్షో జాలము, మెరుపు తీగలాగా మెరుస్తున్న నడుముకు నామనస్సు చలించింది, ఇది నా తప్ప నీ తప్ప ఆనుకున్నాడు క్రిష్  

కవ్వించే హృదయం గాలిలో  తేలుతూ, కను మరుగైనది, ఆమె రూపం బంగారు వర్ణం  మదిలో    నిలువగా, ఆకర్షించే నేత్రములు మరువలేకున్నాను, ఎంతటి వాడి కైనా ఆబ్రహ్మ కైనా తడిసిన దుస్తులలో ఉన్నస్త్రీ అందాన్ని చూసి, మనసు చెలించక ఉండ గలడా   

అప్పుడే చాటుగా చీర సర్దు కుంటున్న శృతి చూసి " చాటుగా చేరిన జవరాలు వంగి వంగి చీర కట్టి, పాలిండ్లపై   పావడాను  ఊపి ఊపి  ఆర బెట్టి, వయ్యారంగా నడుంపెట్టి ముఖంపై బొట్టు పెట్టి,అద్దంలో ముఖం చూసుకొని నవ్వు కుంది, ఎవరూ చూసినా నాకేమి అన్నట్లు నడిచింది

అప్పడే క్రిష్ చెట్టు చాటున  అంతా  చూసి  ఉండ  పట్ట   లేక, వంపుసొంపు నడకచూసి తపనకు తట్టుకోలేక, భువి  నుండి  దివికి   వచ్చిన నవరత్న మాలిక, దరిచేరి   ఆమెను   పలకరించే మనసు నిలవక, కళాశాల అయినతరువాత దాకా ఇక్కడే ఉంటాను నీకోసం అని చెప్పాడు క్రిష్   
      
కళాశాల ఆయినతర్వాత ఇద్దరు కలసి పార్కుకు చేరారు

హే   లావాన్య  ఎవరి బిడ్డవు ఎచ్చట  ఉందువు, నా  కంటికి నీవు సుకమార   సుందర వనితవు, ఇది స్వప్నము కాదు ప్రత్యక్ష శృంగార దేవతవు , యవ్వనంలో ఉన్న బ్రాహ్మణ పుత్రిక ఐ ఉందువు, డబ్బున్న గారాల ముద్దు బిడ్డవను  
కుంటాను .

దేహకాంతి చూసి ఆగలేక నీ ముందుకు వచ్చాను, మనసులో ఉన్న కోరికను తెలియపరుస్తున్నాను, చిరునవ్వుతో మాట్లాడితే   ముత్యాలు   రాలునా, నీ మనసులోని భావాలు తెలపవా,  నీ మంద హాసపు మాటలు వినాలని ఉంది, విశ్వమంత విశాల హ్రుదయము నాకు  ఉంది,
కోకిల గానం లా పా
  పాడాలని, వరుస కలపాలని ఉంది.

చిలుక పలుకుల చిన్నారి మాటలు రావా , నీ ప్రేమను చూపినా నేను సంతోషించే వాడినే అన్నాడు క్రిష్
 

సుధలు చింది నధరాలు కదలాడ, బిడియ మేళ విన్న వించు జాడ, మాటలాడక నా హృదయంలో పెంచకు దడ, మౌనమేల వహిస్తావు మనసు విప్పి చెప్పు మాలినీ, వచ్చి నాను నీవెంట,  పలకవు అందాల భామినీ, నన్ను చూసి నవ్వు తున్నావా సునయనీ, వేడుకొందును మనసు తెలుపవా కామినీ. 

పుడమి   పై   ఇంద్ర  భవనము    నిర్మించేదను, వజ్ర   వైఢూర్యముల  తొ  నగలు  చేయించెదను, సుందర ప్రాంతములు నిత్యమూ చూపించెదను. లలనా కష్ట పెట్టకుండా నిన్ను  సుఖపెట్టగలను
.

నీ మదిలో మెదిలిన  కాంక్షను  తీర్చెదను, నీ   అడుగు  జాడలలో నడుచు కొందును, నీ హృదయమును సంతసింప చేయుదును, నీవు నామనసు అర్ధం చేసుకొని పలుకుము


అప్పడు నోరు విప్పి శృతి ఈవిధముగా పలికినది. ప్రేమ అంటూ నావెంట తిరుగు తున్నావు, నీ సంపాదన ఏంతో నాకు చెపుతావా, నీ కష్టా
ర్జితం  ఎంత  దాచావో చెపుతావా అని అడిగినది.

మానాన్న గారి సంపాదన నా సంపాదన అవుతుంది కదా, అయినా నేను కంప్యూర్ విద్య నేర్చుకున్న మంచి ఉద్యోగము సంపాదిస్థా అన్నాడు.

అయితే ఈ సంవశ్చరము నా చదువు అవుతుంది, అప్పటికల్లా ఉద్యోగము సంపాదించి కనిపించు, అప్పటికి నీప్రేమ నిజమైనదని ఒప్పు కుంటా, అప్పటి దాకా నన్ను చూడకుండా ఉండాలి అన్నది శృతి.               

ఒక్క సంవస్చరము దాటిన తర్వాత వచ్చిన నేను నిన్ను వివాహము చేసుకోను, ఇదే రోజు, ఇదే చెట్టు వద్ద కలుసు కుందాము అన్నది శృతి

ఇరువురు అక్కడ నుండి విడిపోయారు. 

ప్రేమకు ఓర్పు ఉన్నది, మరణ మనేది లేదు, పెద్దలు వద్దన్నా ఏకమయ్యారు ఇద్దరు 
 

No comments:

Post a Comment