Thursday 4 May 2017

మల్లాప్రగడ రామకృష్ణ కధలు - 32

  ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:



నిరుద్యోగి ప్రయాణం -7

మాధవ్ అలా ట్యాన్క్ బండ్ వద్ద నడుస్తూ పోతున్నాడు వెనుక నుండి ఎవరో పిలుస్తు న్నారని పించింది, చూడగా ఎవ్వరు లేరు, అక్కడ ఉన్నపూల కొమ్మలు కదులుతున్నాయి, పూలు రాలు తున్నాయి. అప్పుడు ఒక ముసలాయన వస్తూ బాబు నన్ను గుర్తు పెట్టలేదా, ఎవరు రామయ్య తాతయ్యవు కదూ, నీవు గుర్తు పట్టావు నాకొడుకులు  నన్ను గుర్తు పెట్టలేని విధముగా తయారు చేశారు, నన్ను నడివీధికి నెట్టారు. 

నీవు ఇక్కడ ఏంచేస్తున్నావు అని అడిగాడు తాతయ్య.

తాతయ్య నేను ఏం చేస్తున్నానో తర్వాత చెపుతాను ముందు మనము ఈ ప్రక్కన అమ్ముతున్న బండి దగ్గర ఇడ్లి, దోస దొరుకుతుంది, తిన్నాక మనం మాట్లాడు కుందాం.

బాబు నీవు మరోలా అనుకోకు ఆనాడు నేను అడిగిన ప్రతి మాటకు చాలా చక్కగా సమాధానము చెప్పావు ఇంకా నాకు గుర్తు ఉన్నది.

కొడుకు ధర్మాలు మన శాస్త్రాలలో ఉన్నవి చాలా చక్కగా చెప్పఁవు, మరలా చెప్పవు మదఃవ్. సరే తాత ముందు టిఫిన్ తిను ఎప్పుడు తిన్నవో అని దగ్గరుండి చిన్న పిల్లలకు తినిపించినట్లు కొసరి కొసరి పెట్టాడు మదఃవ్.

మాధవ్ మరలా సుహాపాపితం మొదలు పెట్టాడు.

 దేహం తండ్రి ప్రసాదం’ అని వేదం స్పష్టంగా చెప్పింది. ‘పురుషే హవా అయిమదితో గర్భో...’ తండ్రి బింబం అయితే, తనయుడు ప్రతిబింబమని దీని అర్థం.
తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు చేసిన అపూర్వ త్యాగాన్ని రామాయణం విస్తారంగా చర్చించింది. తండ్రి యయాతికి తన యౌవనాన్నే ధారపోసిన పూరుడి కథను భాగవతం వర్ణించి చెప్పింది. తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి చివరికంటా బ్రహ్మచర్యం పాటించిన భీష్మ పితామహుడి గాథను భారతం వివరించింది. ‘పుత్ర శబ్దానికి- తన మంచి పనులతో ప్రీతి కలిగించేవాడు, పితృభక్తి గలవాడు మాత్రమే అర్హుడు’ అని మన పెద్దలు నిర్వచించారు.

‘భార్య, భర్త అనే రెండు తాళ్లు ముడివేస్తే, ఆ ముడి- సంతానం’ అంటాడు భర్తృహరి. దాన్నే ‘సుతాకారపు ముడి’ అని చెబుతారు. అది పేగు బంధం. ఆ బంధం శిథిలమైతే బతుక్కి అర్థం ఉండదు. వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన శ్రవణ కుమారుడు... అనుక్షణం తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న ప్రవరాఖ్యుడు... అమ్మ ఆర్యమాంబకు ఇచ్చిన మాట కోసం సన్యాస దీక్ష నుంచి దిగివచ్చి అమ్మకు అంత్యక్రియలు నిర్వహించిన శంకరులు... ఇలాంటివారే పుత్ర శబ్దానికి అర్హులు. అంతేకాని- వృద్ధులైన అమ్మానాన్నలను సేవించడం కంటే, వృద్ధాశ్రమాల్లో పెట్టి పోషించడం సౌకర్యంగా ఉంటుందనుకునేవాళ్లు, పుత్రులు అనిపించుకోరు.

బాబు నీవు చెప్పింది అక్షరాల నిజము, అటువంటి పుత్రుడు నాకు లేడు, ఉన్న ముగ్గురు ఒకడు పెళ్ళాం మీద మోజుతో ఇళ్ల్లరికం పోయాడు, రెండవ వాడు త్రాగుడు బానిసగా మారి డబ్బులు ఇచ్చేదాకా ఇంటిని వల్లకాడుగా మారుస్తాడు, ఇక మూడోవాడు ఎవరినో ప్రేమించాడుట ఆఅమ్మాయి నాకొడుకుని వాడాలి వేరొకరిని పెళ్లి చేసుకొని వెళ్లి పోయ్యిందట, అప్పటి నుండి ఇంటికి రాక పిచ్చోడిలా తిరుగుతున్నాడు, ఇప్పటిదాకా నాకు సేవలు చేసిన న శ్రీమతి దేవుని దగ్గరకు చేరింది.

అప్పటి నుండి నా బ్రతుకు నిత్యం నరకంగా మారింది.

అవును తాత నీవు పొలం దున్నేవాడివిగా, సోనా పొలం ఉండేదిగా. ఎక్కడి పొలం బాబు నా పిల్లలు నాప్రాణం హరించినట్లు నా ఆస్తిని హారతి కర్పూరం చేశారు.

నా బ్రతుకుకు ఎవరన్న దారి చూపితే బ్రతకాలనుకున్నా, ఈ ముసలివాడి సేవలు దేశానికి అవసరం లేదు అని బస్సు ఎక్కాను. ఆబస్సు యాక్సిడెంట్ అయ్యింది, ఈ ముసలి ప్రాణానికి చావు రాలేదు అని దినంగా మాట్లాడుతున్నాడు తాతయ్య.

ఆమాటలకు మాధవ్ తాత కు ఒక దారి చూపాలి, ఎట్లాగా అని ఆలోచనలో పడ్డాడు,
కొడుకు ధర్మాలు మన శాస్త్రాలలో ఉన్నవి చాలా చక్కగా చెప్పఁవు, మరలా చెప్పవు మదఃవ్. సారె తాత ముందు టిఫిన్ తిను ఎప్పుడు తిన్నావో అని దగ్గరుండి చిన్న పిల్లలకు తినిపించినట్లు కొసరి కొసరి పెట్టాడు మదఃవ్.

తాత నీవు ఇక్కడే ఉండు, నేను ఒక అరగంటలో వస్తాను, నీకొక దారి చూపుతాను అన్నాడు.
సరిబాబు ఈ బాలలమీద నాడు వాలుస్తాను.

ఇడ్లి బండి వాడితో మా తాతను కదిలించకు బాబు, కాస్త విశ్రాన్తి తీసుకోని అని మరి చెప్పి బయటకు నడిచాడు. దగ్గరగా ఉన్నపెద్ద పెద్ద భవనాల వద్దకు పోయి మాతాతకు ఉద్యోగము ఇవ్వండి అని అడిగాడు.

ఒక ఇంటివద్ద ఏంచేస్తాడు బాబు మీ తాత మొక్కలకు నీళ్లు పోస్తూ, ఇంటికి కాపలా ఉంటాడు, మీరే దన్న పెడితే అది తింటాడు, చిన్నగది ఇస్తే ఆగదిలో ముడుచు కొని పడు కుంటాడు. మీరు తిండి పెట్టె ఏర్పాటు చేయండి అని అడిగాడు.

మీతాతను తీసుకురా నేను ఒక్కరవ్ అతిగా మాట్లాడుతాను, నేను నవ్వు కోవటానికి ప్రశ్నలు వేస్తాను సమాధానము చెప్పాలి.

లోకజ్ఞానమ్ తెలిసినవాడు మీరడిగిన వానికి సమాధానము చెపితే ఉద్యోగమూ ఇస్తారా అని అడిగాడు.

ముందు నిన్ను అడుగుతా సమాధానము చెప్పు, మీ తాతకు ఉద్యోగము ఖాయం అన్నాడు
                     
ప్రక్కకు ఉండు అన్న మాట ?
ఆధి పత్యం  కోసమన్నట్లు

కలసి గుడికి పోదాం అన్న మాట ?
అన్యూన్య దాపత్యం అన్నట్లు

ఆకర్షించుతూ అన్నమాటా ?
అమాయకురాలిని పెట్టకు ఇక్కట్లు

వైకుంఠ పాళీ ఆడుతూ అన్నమాట ?
పావులు కదిపి పాము నోట్లో తోయకన్నట్లు

చేయి చేయి కలుపుతూ అన్న మాట ?
నాపై సానుభూతి చూపాలన్నట్లు

మాటకు మాట పలుకుతూ అన్నమాట ?
అహంకారం వదలి కష్టం చూడాలన్నట్లు

కళ్ళ చూపులతో పలికే మాట ?
నేను నోరు విప్పని జీవి అన్నట్లు

నోటితో గట్టిగా పలికే మాట ?
తప్పు చేస్తున్నారు వస్తాయి ఇక్కట్లు

కన్నీరు తో పలికే మాట ?
హృదయాన్ని అర్ధం చేసుకోమన్నట్లు 

నవ్వుతూ పలకరించే మాట ?
నీ శక్యతే నాకు సుఖ మన్నట్లు

సంపాదనతో పలికే మాట ?
సమానత్వం కావాలన్నట్లు

భాధ పెంచే వానితో పలికేమాట ?
మృగత్వం వదులు కోమన్నట్లు

ప్రేమతో పలికే మాట ?
మనస్సును అర్ధం చేసుకోవాలన్నట్లు

కోపంతో అనే మాట ?
మాటవిని మాట్లాడ మన్నట్లు

బాబు నీవు చక్కగా చెప్పావు, నీ తాతను తీసుకురా ఇక్కడ ఉద్యోగము ఇస్తాను అన్నాడు మదఃవ్ తో

తాతను తీసుకొచ్చి అక్కడ ఉద్యోగానికి చేర్పించాడు.

చంకన బ్యాగ్ పెట్టుకొని నడుస్తున్నాడు.

తాతయ్యే ముగ్గురు కొడుకులు కనబడి మానాన్నగారు నీకు కనిపించారా

మీ నాన్న గారు కనబడితే తీసుకోని వెల్దామను కున్నారా అని అడిగాడు. పెద్దోడా నీవే చెప్పు అని మిగతా ఇద్దరు అన్నారు.   

మానాన్నగారు మాకు చెప్పకుండా ఇటువైపు వచ్చినట్లు తెలిసింది, వారిని మేము పోషించగలము, మేము వారిని భాధ పెట్టినది మాత్రమూ నిజం, మాతప్పు తెలుసుకున్నాము అంటుంటే , మూడవవాడు నాన్న విషయం వీడికి చెప్పేది ఏంటి ఎక్కడున్నాడో చెప్పమను అని గట్టిగా అడిగాడు. 

నేను చెప్పఁక పోతే  

మేము కనుక్కోలేమా, మానాన్నను వెతికి ఇంటికి తీసుకు వెళ్ళగలం అన్నారు.    

మంచిది మీప్రయత్నంలో మీరు ఉండండి, నాసమయాన్ని వ్యర్థం చేయకండి, నేను ఇక వేళ్ళ వచ్చా. 

మాన్నాన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే నీతో మాకేం పని అని ముందుకు నడిచారు. 

మాధవ్,  వాళ్ళు వెళ్ళాక మరలా వెనక్కి పోయి రామయ్యను కలిసాడు. 
నీ కొడుకులు నిన్ను వెతుకు తున్నారు, నిన్ను తీసుకోని వెళ్లాలని వచ్చారు ఎందుకు ?
బాబు నేను నీకు ఎం చెప్ప గలను, నాకున్న పొలము ఇల్లు అమ్మేదాకా కొడుకులు ఊరుకోలేదు, నాభార్యకు చెలాయించిన చంద్రహారం, నాంతాడు నాకష్టార్జితమ్ అదికూడా నాదగ్గర గుంజాలని వచ్చి ఉంటారు. 

ఆ ఇంటి యజమాని వస్తూ బాబు మాధవ్, నేను చాలా సంపాదించాను, నేను వృద్దాశ్రమాలను నిర్వహిస్తున్నాను , మీతాతగారికి ఒక ప్రేత్యేక గది వేలకు భోజనము, ఆరోగ్య పరీక్షలు అన్నీ చేయిస్తాను. ఇక్కడ ఉండేవారు ఎవరూ పనివారు కాదు అందరు స్వతంత్రులు వారు ఓపిక ఉంటె పనులు చేయవచ్చు బలవంతము ఉండదు, నీవు కూడా వాచ్ మెన్ అని కోకు. 

మాధవ్ అడిగాడు రామయ్యను ఇంతా చేస్తే బంగారు నగలు ఎక్కడ ఉంచావ్ అని అడిగాడు. 

ఏమిటి నాకొడుకుల్లా నీవు అడుగుతున్నావు అన్నాడు రామయ్య . 

లేదు తాతయ్య ఎదో పొరపాటున నోరు జారా, చూడు బాబు మంచి మనసున్న వారు పొరపాటున కూడా నోరు జారకూడదు అన్నాడు. 

నిజమే తాతయ్య నన్ను క్షమించు అన్నాడు, నిన్ను గాని నన్ను గాని క్షమించేవాడు ఆభగవంతుడొక్కడే ఆయన్నే ప్రార్ధించుదాం అన్నాడు .                      

1 comment: