Friday 24 July 2020

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం



🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 66 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భృగువు మహర్షి - ఖ్యాతి - 2 🌻

7. ఆ తరువాత భరద్వాజుడు, “ఈ ఆకాశాది పంచభూతముల పరిమాణం ఎంత? అని ఆదిగాడు. ఇది చాలా సరియైన ప్రశ్న. (ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఇదే ఒక పెద్ద ప్రశ్నగా ఎదురవుతున్నది. 

8. విశ్వం పరిమితమా? అపరిమితమా? అన్న ఆ ప్రశ్నకు జవాబు ఇంకా ఇప్పటికీ అన్వేషిస్తున్నారు. చివరకు ఆధునికులు ఇది finite universe అని ఒక నిర్ణయానికి వచ్చారు. కొద్ది సంవత్సరాలకు పూర్వమే! Infinite కాదని, endless కాదని, దానికి boundaries ఉన్నాయని వాళ్ళ అభిప్రాయం. 

9. finite అయినప్పటికీ దీని end ఏమిటి? beyond the ends ఏమైనా ఉంటుందా అని ఒక ప్రశ్న ఉంటుంది కదా! Finite అయితే, borders ఉండాలి దానికి. Beyond the borders ఏదో ఒకటి ఉండాలి. Borders మాత్రమే అనంతంగా ఉంటే infinite అనాలి. కాని science ఈ answer తీసుకున్నతరువాత further questions పరిశీలన చేస్తున్నది.

10.  Universe finite యే కాని, దీన్ని ఎలాగ సిద్ధాంతీకరించాలి అని విచారణ చేస్తున్నారట.). భరద్వాజుడి ప్రశ్నకు భృగుమహర్షి, “ఈ భూతములన్నీ అనంతంగా ఉన్నయి” అని చెప్పాడు. Infinite గా ఉన్నాయి అని అర్థం.

11.  నిరవధికములు. వాటికి అవధులు లేవు. ఇంత అని ఒక limit లేదు. అప్రమేయము. అప్రమేయము అంటే, not measurable. ఇంత అని పరిమాణము చెప్పలేము. 

12. అదంతా ఆయన శరీరమే కాబట్టి, వాటియందు వ్యాపించినవాడుకాబట్టి, విష్ణువుకు అనంతుడు అనే పేరుంది. విష్ణువు అనంతుదయితే ఆయన సృష్టికి అంతం ఎలా ఉంటుంది? అందులోనే ఉందనామాట ఈ అర్థం. అనంతుడు అనే పేరులోనే infinite universe అనే ఒక మాట ఉంది.

13. ప్రళయకాలంలో బ్రహ్మ ఈ విశ్వాన్నంతా ఉపసంహరించు కుంటున్నాడు కదా! అని సందేహం కలుగవచ్చు. నిజానికి అది వేరే విషయం. ఎందుకంటే ఏమయినా మిగిలి ఉంటుంది అంటే ఆకాశమే మిగులుతుంది. 

14. ఆకాశంకూడా బ్రహ్మ యందుంటుంది. Space is not final. Space is borne by Brahma. ఇక limit ఏదో ఏమి తెలుస్తుంది? ఆకాశమే ఆయననుంచి పుట్టిందని చెపుతున్నారు. అందువలన అనంతత్వాన్ని, అంటే విష్ణువును మానవ మనస్సుతో అవగాహన చేసుకోలేమని తెలుసుకోవాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹

[17:08, 26/07/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 67 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భృగువు మహర్షి - ఖ్యాతి - 3 🌻
15. మనస్సు క్రమ క్రమంగా ఏయే స్థానాలను పొందుతుందో చెప్పాడు. మనస్సు మొట్టమొదట విషయంలోకి ప్రవేశిస్తుంది. 

16. తరువాత ఇంద్రియాన్ని చూస్తుంది. తరువాత అంతరాత్మ ద్వారా ప్రదర్శనకూడా చేస్తుంది. అటువంటి శక్తి మనసుకు ఉంది. మనోబుద్ధి చిత్తములు అనేక స్థాయిలలో ఉంటాయని దాని అర్థం.
చాతుర్వర్ణాశ్రమాలను గురించి చాలా చెప్పాడు: 

17. “సత్యమే తపస్సు యొక్క స్థానము. అంటే తపస్సుయొక్క ధ్యేయం సత్యం. తపస్సు సత్యమందు నిత్యము పరినిష్ఠమై ఉండాలి. దేనినిగురించి తపస్సుచేస్తున్నావు అంటే, ‘సత్యాన్ని గురించి చెస్తున్నాను. సత్యమే నా ధ్యేయము’ అని చెప్పాలి. 

18. సత్యాన్ని గురించి చేసిన ధ్యానం తపస్సే అవుతుంది. అది సత్పదార్థధ్యేయమైనదే. తపస్సుయొక్క చిట్టచివరి దశ సత్యం. అనగా తపస్సు సత్యాన్వేషణము అని తేలుతుంది దీన్నిబట్టి. 

19. సత్యమే బ్రహ్మము. అదే సృజనాత్మక శక్తి. ధర్మాధర్మములు, జ్ఞానాజ్ఞానములు, స్వర్గనరకములు, సుఖదుఃఖములు అవన్నీఖూడా వ్యావహారిక శబ్దములు మాత్రమే”

20. ఒకడికి ఉన్న జ్ఞానము అసత్యజ్ఞానమే కాని సత్యజ్ఞానము కాదు.  

ఇందులో గురుబోధ ఏమిటంటే, “నీ అనుభవం నీదే! నీ అనుభవం ఇంకొకరికి సత్యం కానవసరం లేదు. అసత్యాన్ని సత్యమని భావనచేసేవాడికి సత్యమనేది వేరే ఇంకొకటుందనే భావన వాగ్రూపంలో సాధ్యం కాదు” అని.

 21. సదసద్వివేకసంపత్తి లాంటివన్నీకూడా సాపేక్షంగా చెప్పే విషయాలు. 

సత్యపదార్ధము ఒకటుందని, అసత్పదార్ధము మరొకటి ఉందని – ఈ రెండూ ఉన్నాయని చెప్పటం జరుగుతుందిగాని, అసలు రెండూ ఉన్నాయనడం సబబుకాదు. తాను ఉండటమే మనుష్యుడికి సత్యము. 

22. తనవరకు ప్రపంచమే సత్యం. ప్రపంచం ఎంతకాలం సత్యమవుతుందో, అంతకాలం యథార్థమైన పరమసత్యం అనేది అతడికి లేదు. అది అతడికి లేనేలేదు. అతడికి ఇది ఒకటే ఉంది. 

23. ప్రతీ జీవుడికి అనుక్షణమూకూడా ఈ రెండూ అనుభవంలో ఉండవు. పరమాత్మ దర్శనం కానప్పుడు అసత్పదార్థమే అతడియందు ఎల్లప్పుడూ ఉంటుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

[17:36, 27/07/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 68 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

24. సత్యాసత్యవివేకి అనడం వట్టి లౌకిక, వ్యావహారికవాక్యంమాత్రమేఅని భృగువు అన్నాడు. “అసత్యమును అణగించుకోవటం కోసమనే బుధులు నియమనిష్టలనాచరించుతారు” అన్నాడు. 

25. అసత్యాన్ని పోగొట్టుకోవటానికి చేస్తారువాళ్ళు. దానివలన అనతికాలంలోనే శారీరక, మానసికమయిన దుఃఖాలు దూరమయిపోతాయి. దివ్యజ్ఞానం కలుగుతుంది. కష్టాలు ఎప్పుడయితే పోయాయో, అప్పుడిక సుఖాలను వదిలేస్తారు. 

26. దుఃఖాలను మాత్రమే పోగొట్టుకోవాలని చేసే తపస్సు తపస్సుకాదు. సుఖము, దుఃఖము రెండూ కూడా మన అనుభవాలే! ఆ రెండూ పోవటానికికూడా తపస్సుచేస్తారు. అవి ద్వంద్వవములు కదా! దుఃఖంలో ఉన్నంతసేపూ సుఖంకోసం నిరీక్షిస్తాడు. సుఖంలోకూడా సుఖాంతమనే భయం ఒకటి ఉంది. సుఖమంతా పోతుందనే భయం.

27. చాలా సుఖము, చాలా ఐశ్వర్యము, చాలా యోగము అన్నీ ఉన్నవి. ఇప్పుడు ఇవి ఎంతో ఉన్నప్పటికీకూడా ఎప్పుడూ మనిషికి శాశ్వతంగా ఉండేది మృత్యువు. తప్పనిసరిగా మృత్యువు ఉంటుందని మనందరికీ తెలుసు. మిగిలినవన్నీ ఉన్నయో లేదో మనకు తెలియదుకాని యథార్థంగా ఉన్నదని, అందరికీ బాగా అవగాహన అయి ఉన్నటువంటిది మృత్యువు. 

28. కాబట్టి మృత్యువే జగత్తుకు – ఆ జీవిడికి సంబంధించి – జగన్నాశనం. అంటే వాడికి జగత్తు వినాశనమయిపోతుంది. మృతిపొందిన వాడికి జగత్తు లేదు. కాబట్టి మృత్యువువస్తే జగత్తంతా పొయినట్లే! కాబట్టి ఆ అర్థంలోకూడా జగత్తు అసత్యమని మనుష్యుడు తెలుసుకోవచ్చు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 69 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

29. అశాశ్వతమయినటువంటి లౌకిక భౌతిక సుఖాన్వేషణ కొరకే యజ్ఞం చెయ్యబడుతుంది. అది జ్ఞానప్రదం కాదు. జ్ఞానంకోసమని ఎవరూకూడా యజ్ఞం చెయ్యరు. 

3౦. లౌకికమైన సుఖంకోసమే లౌకికమయినటువంటి శక్తులను అనేకమంత్రమములతో మనము ఆరాధిస్తాము. యజ్ఞంవలన జ్ఞానం పొందటానికి వీలుంటుందా? అని ఒక సందేహం కలుగవచ్చు. యజ్ఞం వలన జ్ఞానం రానేరాదు. 

31. అవిద్య, అజ్ఞానంలోంచే యజ్ఞం జరుగుతున్నది. యజ్ఞం అనేది మంత్రములు, అందులో ఋత్విక్కులు, వారు చేసే హోమం, అది ఇచ్చే ఫలములు యజమానిని సుఖవంతుణ్ణి చేస్తాయి. 

32. యజమానిని సౌఖ్యవంతుణ్ణి చేస్తూ పుణ్యలోకాలకు పంపించే మార్గం చూపిస్తాయి. యజమానిని కీర్తివంతుణ్ణీ చేస్తాయి. అలా అనే కదా ప్రతీ మంత్రం చెపుతున్నది! నిజానికి యజమానే శాశ్వతుడుకాడు. కాబట్టి కొన్ని పరిధులకులోబడి మనం యోచన చేయాలి. 

33. “ఈ భరతవర్షంలో, ఈ భారతదేశంలో సుజనులు, సత్వగుణసంపన్నులు ఎవరైతే ఉన్నారో అలాంటివాళ్ళకు భౌతికమయిన కష్టము, దుఃఖము రాకుండును గాక!” అని, అంతవరకే చాలా పరిమితంగా యజ్ఞఫలం ఆశించి చేయాలి. అలా అయితేనే ఫలం లభిస్తుంది.

34. మనం నిత్యము అరకొరగా సంధ్యావందనంచేసి, ధర్మార్థకామ మోక్షాలకై చేస్తున్నామంటే దానికి అర్థముందా! మధ్యాహ్నసంధ్య నుంచీ సాయంకాలసంధ్యవరకు నేను చేసిన పాపం ప్రాయశ్చిత్తం కోసం – ఆ పాపం పోవటం కోసం నేను ఈ సంధ్యావందనం చేస్తున్నాను; మళ్ళీ రేపు ఉదయకాల సంధ్యావందనం సమయం వరకూ నేను బ్రతికి ఉండటంకోసం చేస్తున్నాను అనుకోవాలి. 

35. దాని పరిమితి అంతే అల్ప కర్మకు అల్పఫలమే ఆశించాలి. అనంతమైన మోక్షవిషయానికొస్తే, కర్మ వల్ల మోక్షం రాదు. కాబట్టి అప్పుడు ఆశ్రయించదగినట్టిది అనంత కల్యాణగుణసంపన్నుడు, అనంత దయామయుడు అయినటువంటి ఈశ్వరుడినే. 

36. ఆయన కరుణమాత్రమే ఆధారమక్కడ. తన అర్హత కాదు. అసలు అర్హత లేకపోవచ్చు. ఆయన కరుణకు అర్హతార్హతలు స్వల్పములు. దానియందు విశ్వాసం కలిగి ముక్తినడగాలి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 70 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

37. “నేను వేదశాస్త్రాలు చదివాను. చాలా తపస్సు చేసాను. ఇక నేను మోక్షానికి అర్హుణ్ణే” అని ఎవరూ అనుకోరాదు! 

38. ఇంత తపస్సు చేస్తే నాకు మోక్షానికి ఎప్పుడో అర్హత వచ్చేసిందని - నా పని అయిపోయిందని - లోకక్షేమం కోసమే బ్రతుకుతున్నానని జ్ఞాని ఎప్పుడూ అనుకోడు. జీవన్ముక్తుడు కూడా ఎప్పుడూ అలా భావన చేయఖూడదు. అసలు చెయ్యనే చెయ్యడు. 

39. అనంత కల్యాణగుణ సంపన్నుడయిన, కరుణామయుడయిన ఆ హరిమాత్రమే ముక్తినివ్వాలి. అట్లా కోరాలి. సత్కర్మలు ఆచరించాను కాబట్టి మోక్షం రావాలి అంటే, అలా వీలు లేదు. కర్మకు, ముక్తికి సంబంధం లేదు.

40. కర్మ ముక్తి అయితే ఎలా? కర్మ బంధనం కదా! కర్మ వలన కదా మనం పుట్టాము. మళ్ళీ కర్మచేసి మోక్షము పొందటమేమిటి? అది తప్పు. 

41. సుఖదుఃఖాలు దూరం చేసుకోవటానికి తపస్సుచేస్తే, ఆ తరువాత సుఖాలు కూడా అధిగమించబడి దాటబడతాయి. అదీ పరిణామదశ, అట్టివాడు, వైరాగ్యప్రవృత్తి యందు దృధమయిన నిష్ట కలిగి యుండిన వాడు పరమపదం పొందుతాడు అని భృగుమహర్షి బోధించాడు.

42. తరవాత భరద్వాజుడు, “ఇహలోకానికి, పరలోకానికి భేదం ఏమిటి? అని అడిగాడు. 
దానికి భృగుమహర్షి బదులిస్తూ, ‘ఈ ఇహలోకమంతా కర్మభూమి, భోగాస్పదమైనటువంటిది. ఎక్కువ దుఃఖము, తక్కువ సుఖము కలిగినది. చాలా ఎక్కువ సుఖము – అనంతమైన సౌఖ్యప్రదమయినది – స్వర్గలోకమనబడుతుంది.  ఆ సుఖానికీ, ఈ భూలోకసుఖానికీ హస్తిమశకాంతం. ఏనుగు-దోమ ఆ పరిణామాలలోని భేదమంతఉంది. అక్కడ సుఖానికీ ఇక్కడ సుఖానికి తేడా.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment