Tuesday 14 July 2020

💞స్నేహబంధం💞


స్నేహబంధం
ఓంశ్రీమాత్రే నమః

స్నేహబంధం

సృష్టిలో బంధాలన్నింటికీ అర్థం ఉంటుంది. వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మనం ఎంతవరకు సామరస్యంతో, ప్రేమతో, బాధ్యతో వ్యవహరించగలమో అంతవరకూ అవి మనకు దూరం కావు. స్వార్థం కూడా బంధాల అమరికలో ముఖ్యపాత్ర పోషిస్తూ అమరికలకు ఆస్కారం ఇస్తూ ఉంటుంది. సంతోషం, ఇష్టం బంధాల రూపంలో దొరికినంత వరకూ మనలోని భావాలు పదిలంగా ఉంటాయి. కానీ కాస్త కష్టం కలిగిందో బంధాల మనోభావాలు తెబ్బతీస్తాయి. దూరంగా వెళ్లేందుకు సన్నద్ధం అవుతాయి. అయితే, అన్ని బంధాలు మన ప్రేమేయం లేకుండానే మన జీవితంలోకి వచ్చి చేరాయి. స్నేహబంధం మాత్రం మనం ఏరి,కోరి, నమ్మి, ఇష్టపడి చేరువయ్యే అద్భుతం, అదృష్టం. అది ఒక్కసారి బలపడిందో జీవితాంతం తోడుండేది.


 షరతులూ, హద్దులు లేనిది, స్వార్థం అంటని స్వచ్ఛమైనది స్నేహం. అటువంటి స్వచ్ఛమైన స్నేహం కుచేలుని రూపంలో ప్రపంచానికి పరిచయం అయింది. కృష్ణున్నే మైమరిపించింది. చిన్ననాటి స్నేహమే అయినా చిరకాలమై కుచేలునితత్వం కృష్ణుని మదిలో ఎదిగినదై స్థానం సంపాదించుకున్నది. కుచేలుని వ్యక్తివం విషయ విరక్తి అతన్ని నిశ్చయంగా ఉంచింది. కానీ బతుకు బాటలో ఆటుపోట్లు తప్పలేదు. చెదరని ఆత్మవిశ్వాసం, మేధస్సు, ప్రశాంత చిత్తం కుచేలుని బలాలు, బలహీనతలు.


-ప్రమద్వర
కుచేలుని అసలు పేరు సుదాముడు. ధర్మ మార్గాన్నే అనుసరించిన వాడై, శాంత స్వభావియై, నిష్కామయోగిలా బతికాడు కుచేలుడు. ఈతని భార్య వామాక్షి. వీరికి చాలామంది సంతానం. కటిక దారిద్య్రం అనుభవించే పేదవాడే అయినా, కుచేలుడు అభిమానాన్ని చంపుకొని ఏనాడూ బతుకలేదు. ఎంతటి కష్టమొచ్చినా అతనిలోని సంతోషం చెక్కుచెదురలేదు.


 కృష్ణునితో కుచేలుని స్నేహం సాంతీపుడనే గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో కుదిరింది. చదువు ముగియడంతో మనుషులు దూరమైనా వారి మనుసుల్లో స్నేహం పదిలంగా నిలిచిపోయింది. కృష్ణునికి కుచేలుడంటే ప్రత్యేకమైన అభిమానం, ఆదరణ. కుచేలునికీ కృష్ణుడంటే అవ్యాజమైన ప్రేమ. కృష్ణ లీలలు విన్నంతనే కుచేలుని మనసు ఉప్పొంగి పోయేది. ఎన్నడూ కృష్ణుడు తన స్నేహితుడనీ చెప్పుకొని గొప్పకు పోలేదు. ఎందుకంటే కుచేలునిది నిస్వార్థమైన స్నేహం. అతని ఉద్దేశం ప్రకారం కృష్ణుని స్నేహం వలన తనలో ఆనందమనే ప్రేమ జనించింది. అది కుచేలునిలో ప్రశాంతతను నెలకొల్పింది. శాంతం నిశ్శబ్ధ నిబద్ధతను కుచేలునికి అనుభవైకవేద్యంలా అందించింది. 


ఆ మౌనమే కుచేలునికి దైవత్వాన్ని ఆపాదించింది. అంటే బయట ప్రపంచం దృష్టిలో కృష్ణుడంటే రాజకుటుంబీకుడూ, దేవుడు. కుచేలుడంటే వేదవిదుడూ, పేదవాడు. కానీ కృష్ణునిలోని దైవత్వాన్ని తన వ్యక్తిత్వంలోనూ, కృష్ణునిపట్ల తనకున్న ప్రేమ, స్నేహంలోనూ పొందగలిగాడు కుచేలుడు. అందుకే ఇంతకన్నా గొప్ప సంపద స్నేహబంధంతో కాక మరెలా సాధ్యమని కుచేలుని సదాలోచన. 
కుచేలుడు ఒకనాడు తన కుటుంబ పరిస్థితిని గురించి ఆలోచిస్తుండగా అతని భార్య వామాక్షి, కృష్ణుడు మీ చిన్ననాటి మిత్రుడ కదా! ఒక్కసారి వెళ్లి ఆయన్ను కలిస్తే మన బాధలన్నీ తీరిపోతాయని అనిపిస్తుందని అంటుంది. పిల్లల దీనస్థితి, భార్య మాట కుచేలున్ని కృష్ణుని కలుసుకునేందుకు ప్రేరేపించాయనే కన్నా, తన మిత్రుని కలుస్తాననే ఆనందానికి తోవయ్యాయి. వట్టి చేతులతో వెళ్లడం సబబుకాదని ఇంట్లో మూలన దొరికిన కాసిన్ని అటుకులను తన ఉత్తరీయంలో మూటగట్టుకొని బయలుదేరుతాడు కుచేలుడు.కుచేలునికి తన కష్టాలకిక కాలం చెల్లిందనే సంతోషం ఏమాత్రం లేదు. ఎందుకంటే కృష్ణుని దర్శించడమే అతని మనసంతా నిండిన ముఖ్యోద్దేశం. దాని పొడుగునా అనేక సంశయాలు.


 ఎప్పటిదో చిన్ననాటి స్నేహం నాదీ, కృష్ణునిదీ. అనంతమైన ద్వారకలో ఉండే కృష్ణున్ని కలవడానికి, కనీసం చూడటానికి నాకు అనుమతి దొరుకుతుందో, ఈ పేదవాని రూపం అందుకు తగినదేనా ! అయినా సరే, నాలోని ప్రేమ, నాస్నేహం కృష్ణునిపట్ల నిశ్చయమైనవే అయితే, తప్పక కలుస్తానని సంకల్పించుకొని వెళతాడు కుచేలుడు.కృష్ణుని కోసం రాజద్వారం దగ్గర వాకబు చేస్తూ, నేను కృష్ణున్ని కలువడానికై వచ్చానని కుచేలుడు అలా చెప్పాడో లేదో, స్వయంగా తన మందిరం వదిలి కృష్ణుడు హుటాహుటిన వచ్చి చేయిపట్టుకొని తన మందిరానికి తీసుకెళుతాడు.


 బంగారు ఆసనంపై కూర్చోబెట్టి, బంగారు పళ్లెంలో కుచేలుని పాదాల నుంచి సేవ చేస్తాడు కృష్ణుడు. మంచి విందు భోజనాన్ని కొసరి, కొసరి వడ్డిస్తూ, విజామరతో విసురుతూ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కుచేలునికి గుర్తు చేస్తాడు. కుశలప్రశ్నలు ప్రేమగా అడుగుతాడు. తాను తెచ్చిన అటుకులు తనకెంతో ఇష్టమైనవని తృప్తిగా ఆరగిస్తాడు. ఇదంతా కుచేలునికి అంతుపట్టని విశేషం. నా స్నేహానికి ఇంతటి ఔదార్యమా! ఇంతటి ప్రేమాభిమానాలా! అని ఆశ్చర్యపోతాడు కుచేలుడు. మరునాడు కృష్ణుని దగ్గర తృప్తిగా సెలవు తీసుకొని ఇంటిదారిపట్టిన కుచేలుని మనసులో తన్మయత్వం తప్ప మరేమీ లేదు. కుచేలునికి తన కష్టాలేవి గుర్తులేవు. బాధల ఊసే లేదు. అలుపెరుగని ఆనందం తప్ప. 


ప్రపంచమంతా ఎవరిని సేవించాలనుకచుందో, అలాంటి కృష్ణుడు స్వయంగా నా కాళ్లు కడిగి శిరసున చల్లుకోవడమా! ఇంతకన్నా నాకు కావాల్సినదేంటని ఇంటికి చేరుకున్న కుచేలునికి తన పూరిగుడెసె స్థానంలో సకల సంపదలతో నిండిన అందమైన పాలరాతి మేడ కనిపించింది. కృష్ణుని వాత్సల్యానికి మనసారా నమస్కరించి కృతజ్ఞత తెలుపుకున్నాడు కుచేలుడు. కానీ ఆ సంపద వలన అహంకారాన్నీ, వాటిపై వ్యామోహాన్ని పెంచుకోక యోగిలా జీవిత చరమాంకం వరకూ బతికాడు కుచేలుడు.కుచేలుని విషయంలో జరిగిన ఈ అద్భుతం కృష్ణుని మహత్తులా కనిపించినప్పటికీ, కుచేలునికే పాత్రత, అర్హత లేకపోయినట్లయితే జరిగే పనేనా! కులచేలునిలోని నిస్వార్థ ప్రేమ, స్నేహం కృష్ణుడంతటి వాడినే తన్మయింపజేసిందనేది నిర్వివాదాంశం. స్నేహం పరస్పర వ్యక్తీకరణ కన్నా, భావ పరిభాషే అర్థమవుతుందనేది కుచేలుని వ్యక్తిత్వం చెబుతున్నది.

🕉🌞🌎🌙🌟🚩

!! కుచేలోపాఖ్యానం శ్రీ మహాభాగవతము !!

చిన్నప్పుడు గురుకులంలో ఉంటూన్నప్పుడు కృష్ణుడు కుచేలుడనే బ్రాహ్మణకుమారునితో మంచి స్నేహం చేసుకున్నాడు. ఆ తరువాత కృష్ణుడు ద్వారకలో, కుచేలుడు తన పల్లెలోనూ పెరిగి పెద్దయారు. కుచేలుడు నిజమైన బ్రాహ్మణుడిలా ధనార్జన మీద ఆశ లేకుండా, పరమ భాగవతోత్తముడిగా గృహస్థాశ్రమం సాగించుకుంటున్నాడు. అతని భార్య ఉత్తమురాలు. పతికి అన్నివిధాలా అనుకూలంగా నడుచుకుని బ్రతుకుతోంది.

ఆ దంపతులు యెంతో దారిద్ర్యం అనుభవిస్తూ, చివరికి బ్రతుకే కటకటలాడవస్తే, పాపం, ఆ యిల్లాలు ఒకనాడు భర్తతో, "మీరెప్పుడూ మీ మిత్రుడు కృష్ణుని గురించి చెపుతూ ఉంటారే? అతనో గొప్ప ప్రభువు కదా? ఐశ్వర్యవంతుడు. అతనిని అడిగితే, కాదనక తప్పక సహాయం చేయగలడు. దానితో మన దారిద్ర్యబాధ తీరి కాస్త సుఖంగా ఆకలన్నది యెరుగకుండా జీవిస్తాం. ఆయనని వెళ్లి కలుసుకోరాదూ?" అని యెంతో దీనంగా వేడుకుంది. కుచేలుడు తనలో, "ధనమేమి దొరకక పోయినా, యీ నెపంతో నైనా చాలాకాలం తరువాత నా స్నేహితుడిని చూసి ఆనందించే అవకాశం లభిస్తుంది" అని ఆలోచించి, "సరే్, అలాగే" అన్నాడు.

ద్వారకకి వెళ్దామని సిద్ధమవుతూ, "నా నేస్తానికి తీసుకు వెళ్లడానికి మనయింట్లో యేమైనా ఉందా?" అని కుచేలుడు భార్యని అడిగాడు. ఆమె, ఆ రోజునే యాచించి తీసుకువచ్చిన అటుకులు నాలుగు పిడికెళ్లు, కుచేలుని అంగవస్త్రంలో ముడికట్టింది.

సంతోషంగా ద్వారక యెప్పుడు వస్తుందా, యెప్పుడు నేస్తాన్ని చూస్తానా అని కుచేలుడు అడుగులు వేసాడు.

ద్వారకలో మూడు ప్రహారీగోడలు దాటి కృష్ణుడు తన భార్యలకి నిర్మించిన భవనాల దగ్గరకు వెళ్లి, కుచేలుడు అందులోని ఒక భవనంలోకి ప్రవేశించాడు. అది రుక్మిణి భవనం.

దూరం నుంచి తన స్నేహితుని చూసి కృష్ణుడు లేచి, రెండు చేతులూ ముందుకు చాచి వెళ్లి, కుచేలుని కౌగిలించుకున్నాడు. కుచేలుడిని లోనికి తీసుకుపోయి, ఆసనమిచ్చి, దీపధూపాలతో నివాళించి సాదరంగా స్వాగతం పలికాడు.

కుచేలుడు, చిక్కి శల్యంలా మురికిగుడ్డలతో చూడ బిచ్చగాడిలా ఉన్నాడు. అతనికీ, ముల్లోకాలకు అధిపతి అయిన కృష్ణునికీ యేమంత స్నేహం అని అంతఃపురవాసులంతా ఆశ్చర్యపొయారు.

కుశల ప్రశ్నలయాక, చిన్ననాటి గురుకులం కబుర్లు చెప్పుకుంటూ ఆ యిద్దరు మిత్రులూ మురిసిపోయారు. కొంచెం సేపయాక నవ్వుతూ, "మిత్రమా, నాకోసం యేం తెచ్చేవేమిటి?" అని కృష్ణుడు కుచేలుని అడిగాడు. కుచేలుడు అటుకులమూట పట్టుకుని, 'ఇంతటి ఐశ్వర్యవంతుడి కిదేనా తేగలిగేను" అని సిగ్గుతో తలవంచుకున్నాడు. అది చూసి కృష్ణుడు, ఆ అటుకులమూటని తీసుకుంటూ, "భక్తితో నాకు పత్రమర్పించినా చాలు. లేదంటే యేమి తెచ్చినా నాకు నచ్చదు" అని ఆ మూట విప్పి, రుక్మిణితో, "చూసేవా, ఎంత ఆప్యాయంగా నాకిష్టమని అటుకులు తీసుకొచ్చాడో" అని చెప్తూ, అందులోంచి ఓ పిడికేడు అటుకులు నోట్లో వేసుకున్నాడు. బాగున్నాయని తల ఆడించి, మరొ పిడికెడు వేసుకోబోయాడు, తన నోట్లో. అప్పుడు రుక్మిణి, "ఒక్క పిడికెడు నీకిచ్చినందుకే నీ మిత్రుడికి యిహంలోనూ, పరంలోనూ సకలసంపదలూ కలుగుతాయి. చాలు" అని మరి వద్దని కృష్ణుడికి చెప్పగా, సరే అని ఊరుకున్నాడు. ఆ రాత్రికి కృష్ణుని మందిరంలో సంతుష్టిగా భోజనం చేసి స్వర్గసుఖం పొందినట్లు హయిగా మెత్తని పరుపుల మీద కుచేలుడు నిదురించాడు. తెల్లవారగానే కుచేలుడు సెలవు తీసుకుంటానంటే, అతనితో కృష్ణుడు కొంతవరకూ వెళ్లి సాగనంపేడు.

ఇంటికి వస్తూ, తోవలో, "అరెరే, అ పరమసంతోషంలో మా ఆవిడ మరీమరీ చెప్పినది కృష్ణుని అడుగనే లేదు. ఐనా, ఎలా నోరు విప్పి, నాకేమైనా సర్దిపెట్టు అని అడుగను? ఆ మహాత్ముని చూడగలిగిన భాగ్యమే చాలు. ఎందరు నోచుకోగలరు అ భాగ్యానికి?" అని తృప్తిగా అడుగులు వేసాడు.

ఇంటి దరిదాపులకి చేరుకున్నాక, అక్కడ అంతా కొత్తగా కనిపించింది. అంత పెద్ద భవనం తన పల్లెలో యెన్నడూ చూడనే లేదు. ఆశ్చర్యంగా అలా కళ్లప్పగిస్తూ, వస్తూండగా నౌకరులు ముందుకు వచ్చి, " దయచేయండి స్వామీ" అని ఆ భవనంలోకి కుచేలుని తీసుకునిపోయారు. లోనికి వెళ్లగానే, ఆభరణాలతో అలంకరించుకుని అతని భార్య యెదురై, "స్వామీ! దయచేయండి" అని రత్నమాణిక్యాలతో దేదీప్యమానంగా వెలుగుతూన్న ఆ ఐశ్వర్య నిలయం లోనికి తీసుకుని వెళ్లింది. కాస్త తేరుకున్నాక కుచేలుడికి అదంతా ఆ కృష్ణపరమాత్ముని అనుగ్రహమే అని అర్థమయింది. అడుగకపోయినా యిచ్చే ఆ దాతకి, చిన్ననాడెంతో సఖ్యంగా ఉండేవాడో, అంతకంటే యెక్కువ మక్కువతో ఆదరించిన తన స్నేహితునికీ, కుచేలుడు నమస్కరించాడు.

కృష్ణుడు ప్రసాదించిన ఐహికభోగభాగ్యాలని అనుభవిస్తున్నా, వాటియందు మోహమే లెకుండా, నిరంతరమైన భక్తితో కృష్ణుని మొక్కుతూ, కుచేలుడు తన జీవితమంతా గడిపాడు. ఆ తరువాత దేవదేవుని పరమపదం చేరుకున్నాడు.

ఇందీవర శ్యాము వందిత సుత్రాముఁ

గరుణాల వాలు భాసురకపోలుఁ

గౌస్తుభాలంకారుఁ గామిత మందారు

సురుచిర లావణ్యు సురశరణ్యు

హర్యక్షనిభ మధ్యు నఖిల లోకారాధ్యు

ఘన చక్రహస్తు జగత్ర్పశస్తు

ఖగకులాధిపయానుఁ గౌశేయ పరిధానుఁ

బన్నగశయను నబ్జాతనయను

మకరకుండల సద్బూషు మంజు భాషు

నిరుప మాకారు దుగ్ధసాగర విహరు

భూతి గుణసాంద్రు యదు కులాంబోధి చంద్రు

విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణుఁ గృష్ణు!!

******


*భగవద్గీత అంటే ఏమిటి?* (6)
సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
– రిటైర్‌మెంట్‌ రోజు  సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
– అది కేవలం హిందువులదా?
– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?

*కాదు*

అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే *భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’*
 సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి


*☆సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం.  గీత చెప్పేదీ  నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.*


*☆ సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.*


*☆ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.*


 ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.*


*☆అసలు భగవద్గీత ఏం చెబుతుంది?*


👉-ధర్మాధర్మాల గురించి చెబుతుంది.

👉-కర్తవ్యం గురించి చెబుతుంది.
👉-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
👉 ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
👉సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.
👉ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
👉ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
👉-జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
👉-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
👉-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
👉-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
👉పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
👉కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
👉నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.

*అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం.*

 అర్థం చేసుకున్నవారు ధన్యులు.నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.

గీత చదువుకో.....

నీ రాత మార్చుకో.....

🕉🌹🙏


: 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
610వ నామ మంత్రము 

ఓం ఐం హ్రీం శ్రీం ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితాయై నమః🙏🙏🙏పాడ్యమి నుండి పూర్ణిమ వరకు గల పదునైదు తిథులలో పూజింపబడు జగన్మాతకు నమస్కారము🌹🌹🌹నిత్యా దేవతలచే పూజింపబడు జగన్మాతకు నమస్కారము🌻🌻🌻శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా అను పదహారు అక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం ఐం హ్రీం శ్రీం ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితాయై నమః అని ఉచ్చరించుచూ భక్తి ప్రపత్తులతో ఆ శ్రీమాతను పూజించు సాధకునికి ఆ శ్రీమాత పంచదశీ మంత్ర జప ఫలమును ప్రసాదించి సర్వాభీష్టములను నెరవేర్చును🌺🌺🌺 పంచదశాక్షరీ మంత్రము పదునైదు అక్షరములు, అలాగే పాడ్యమి నుండి పూర్ణిమ వరకు పదునైదు తిథులు అనగా పంచదశాక్షరీ మంత్రములోని ఒక్కొక్క బీజాక్షరము ఒక్కొక్క తిథికి సమన్వయించుకుంటే పదునైదు తిథులకు పదునైదు బీజాక్షరములు సరిపోవును. ఆ విధంగా పాడ్యమి నుండి పూర్ణిమ వరకు పూజింప బడునది అని గమనింపవలయును🌹🌹🌹ప్రతిపత్ అంటే శుద్ధ పాడ్యమి. రాకా అనగా పూర్ణిమ వరకూ గల నిత్యాదేవతలుగా ఉన్న 1) కామేశ్వరి, 2) భగమాలిని, 3) నిత్యక్లిన్నా, 4) భేరుండా, 5) వహ్నివాసిని, 6) మహావజ్రేశ్వరి, 7) శివదూతీ, 8) త్వరితా, 9) కులసుందరీ, 10) నిత్యా, 11) నీలపతాకా, 12) విజయా, 13) సర్వమంగళా, 14) జ్వాలామాలిని, 15) చిత్రే అని నిత్యమండల దేవతల రూపమున పూజింపబడుచున్నదని మరొక అర్ధము🌸🌸🌸ప్రతిపత్ అనగా ప్రతిపాదింపచేయునది, ప్రతి మాసములో తిథుల వరకును ప్రతిపాదన చేయునది. అనగా అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే పాడ్యమి శుక్లపక్షము నందుగల పాడ్యమి.  ముఖ్య అనగా ప్రారంభము, మొదలగును అని అర్థము. పూర్ణిమ వరకు వెన్నెల విరజిమ్ముతున్న రాత్రి. ఈ పూర్ణిమలు సంవత్సరమునకు రెండు రాగలవు. ఒకటి ఆశ్వయుజ పూర్ణిమ, రెండవది కార్తీక పూర్ణిమ.  మొదట వచ్చేది ఆశ్వీయుజ పూర్ణిమ. ముఖ్యంగా ఆశ్వయుజ మాసములో దేవీ నవరాత్రులు. వీటినే శరన్నవరాత్రులంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి ఈ దేవి నవరాత్రోత్సవాలు, చివరిరోజు మహిషాసురుని మరియు భండాసురుని సంహారం ఉంటుంది. మరుసటి రోజు దశమి రోజున ఆనందముతో పండుగ నిర్వహిస్తారు. దశరాత్రులు కనుక దసరా అని నామము వచ్చినది.భూ విజయమునకు హేతువైనది కావున విజయ దశమి అయినది🌹🌹🌹శ్రీమాతను పాడ్యమి నుండి పూర్ణిమ వరకూ పూజించుతారు🌻🌻🌻శ్రీమాతకు నమస్కరించు నపుడు ఓం ఐం హ్రీం శ్రీం ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితాయై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ  స్వీకరించడమైనది🙏🙏🙏🙏నేడు బుధ (సౌమ్య) వారము🔱🔱🔱బుధ (సౌమ్య) వారమునకు అధిపతి బుధుడు🌻🌻🌻ఈ రోజు గణపతిని, షణ్మఖుని ఆరాధించుదుము🌹🌹🌹ఆధ్యాత్మికంగా శ్రీమహా విష్ణువుకు ఈ రోజు  చాలా ప్రీతికరము🌸🌸🌸ఓం గం గణపతయే నమః🚩🚩🚩ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిప్రచోదయాత్🕉🕉🕉🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
[03:02, 15/07/2020] +91 95058 13235: 🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
33వ నామ మంత్రము

ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తన్యై నమః🙏🙏🙏కామేశ్వరుని భౌతాకాతీతమైన ప్రేమరత్నమును పొందుటకు కామేశ్వరి (శ్రీమాత) తన భౌతికమైన స్తనరత్నములను పణముగా సమర్పించుకున్న జగన్మాతకు నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తనీ అను పదహారు అక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తన్యై నమః అని ఉచ్చరించుచూ భక్తితత్పరతతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునకు భౌతికపరమైన వాంఛలు పోయి ఆధ్యాత్మికాతత్త్వ మానసుడై ఆ పరమేశ్వరీ పాదసేవాపరాయణుడై శాశ్వత బ్రహ్మత్వసాధనలో తరించును🌻🌻🌻ఈ నామ మంత్రమందు విశేషమైన ఆధ్యాత్మికతత్త్వము ఇమిడి ఉంది. అదేమిటంటే పార్వతీ పరమేశ్వరులవలె అన్యోన్యంగా జీవించండి అని నూతన దంపతులను ఆశీర్వదించడం జరుగుతూ ఉంటుంది🌺🌺🌺.ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే పరమేశ్వరుడు. లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను నిర్వహిస్తూఉంటాడు. పరమేశ్వరుడిని నిరంతరారాధన చేసేవారి హృదయమే కైలాసమై, వారి మనసులోని కామక్రోధాదులు శమించి నిరంతరానందాన్ని పొందుతారన్నది సత్యము. నిర్గుణ పరబ్రహ్మ యొక్క కర్మ స్వరూపం శ్రీమహావిష్ణువు అయితే, జ్ఞాన స్వరూపం పరమేశ్వరుడు. అందుకే లౌకిక పురోగతికి విష్ణు రూపాన్ని, ఆధ్యాత్మిక పురోగతికి శివ స్వరూపాన్ని ఆరాధన చేయాలి. ఇంతటి భౌతికాతీతమైన పరమేశ్వరుని ప్రేమ అనే ఒక రత్నాన్ని పొందడానికి జగన్మాత తన స్తన రత్నములను రెండిటిని పణముగా పరమేశ్వరునికి ఇచ్చినది🌹🌹🌹ఇలా ఆ ఆది దంపతులు  వారి ప్రేమ అనే వస్తువులను ఇచ్చి పుచ్చుకున్నారు అంటే పరమేశ్వరుని ప్రేమరత్నంపై శ్రీమాతకు, శ్రీమాత స్తన రత్నములపై పరమేశ్వరునకు హక్కులు ఇచ్చి పుచ్చుకున్నారు అంటే అయ్యవారి ప్రేమ ఇంక అమ్మవారిదే...అమ్మవారికొక్కదానికే...ఆ ప్రేమలో ఇంకొకరికి భాగంలేనట్లే అంటే అయ్యవారు ఏక పత్నీవ్రతుడే గదా. అలాగే అమ్మవారి స్తనరత్నాలు అయ్యవారికి మాత్రమే అంటే అమ్మవారి పాతివ్రత్యానికి నిదర్శనమేగదా🌺🌺🌺అయ్యవారి, అమ్మవారి దివ్యమైన మరియు పవిత్రమైన దాంపత్య ఫలితమే ఈ విశ్వం గాన దంపతులైనవారు అందరూ ఇదే పాతివ్రత్యాన్ని, ఏక పత్నీవ్రతాన్ని కలిగి ఉండాలన సూచనయే కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తనీ అను నామ మంత్రములోని భావము🌻🌻🌻 స్తనతి వర్థయతి భర్తుః ప్రేమ అథవా క్షీరేణ శిశుమ్ ఇతి స్తనమ్.  స్తన - వర్థనే - అంతర్భూత  ప్రేరణార్థకము అనగా స్తన దర్శనముచే భర్త ప్రేమను వృద్ధిని చేసేది మరియు తన క్షీరంచే శిశువును పెంచేది అగుటచే ఇది స్తనము అనబడుచున్నది🌺🌺🌺పరమాత్మను చేరడానికి భక్తియు, జ్ఞానమును రెండును ఆవశ్యకములు అనియు గూఢార్థముగా తలంపదగును🌸🌸🌸కామేశ్వర దృష్టి ప్రసార జనితమైన నృత్యభంగిమలో ఇదియు ఒకటనియు భావనోపనిషత్తుచే తెలియుచున్నది🌹🌹🌹పరమేశ్వరి యొక్క ఆవిర్భావ కాలమున చంద్రుని వలన స్తనయుగ్మము ఏర్పడినది అనియు తెలియదగును🌻🌻🌻వ్యక్త సృష్టికి కావలసిన ఆకార, గుణ, పరిణామం, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములో ఉండే ఈ భౌతిక ప్రపంచమును సూచించే తన  స్తనాలను పరమేశ్వరునికి ఇస్తే, భౌతిక తత్త్వానికి అతీతంగా ఉంటూ వాటికి సార్థకతను కూర్చు ఆత్మ సౌందర్య గుణాన్ని అయ్యవారు అమ్మవారికి ఇచ్చారట🌺🌺🌺 ఈ రెండిటి కలియిక వల్లే వ్యక్త ప్రపంచము పరిపూర్తి నందినది. ప్రాణకి దేహం ఉండాలి, ప్రేమ ఉండాలి. అప్ఫుడే సృష్టి పరిపూర్ణత నొందుతుంది అని భావము🌹🌹🌹జగన్మాతకు నమస్కరించునపుడు  ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తన్యై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ స్వీకరించడమైనది🙏🙏🙏🙏నేడు బుధ (సౌమ్య) వారము🔱🔱🔱బుధ (సౌమ్య) వారమునకు అధిపతి బుధుడు🌻🌻🌻ఈ రోజు గణపతిని, షణ్మఖుని ఆరాధించుదుము🌹🌹🌹ఆధ్యాత్మికంగా శ్రీమహా విష్ణువుకు ఈ రోజు  చాలా ప్రీతికరము🌸🌸🌸ఓం గం గణపతయే నమః🚩🚩🚩ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిప్రచోదయాత్🕉🕉🕉🕉️🕉️🕉️🕉️🕉️
[03:02, 15/07/2020] +91 95058 13235: 15.7.2020   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదమూడవ అధ్యాయము

యతిధర్మముల నిరూపణము-అవధూతకును, ప్రహ్లాదునకును మధ్య జరిగిన సంవాదము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

13.37 (ముప్పది ఏడవ శ్లోకము)

క్వచిదల్పం క్వచిద్భూరి భుంజేఽన్నం స్వాద్వస్వాదు వా|

క్వచిద్భూరి గుణోపేతం గుణహీనముత క్వచిత్॥6194॥

లభించిన ఆహారము స్వల్పమైనను, అధికమైనను ఒకప్ఫుడు అది రుచికరముగా ఉన్నను, లేకున్నను, మరియొకప్పుడు అది షడ్రసోపేతముగా ఉన్నను, ఏ రుచితో లేకున్నను, నేను స్వీకరింతును. 

13.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

శ్రద్ధయోపహృతం క్వాపి కదాచిన్మానవర్జితమ్|

భుంజే భుక్త్వాథ కస్మింశ్చిద్దివా నక్తం యదృచ్ఛయా॥6195॥

నాకు ఆహారపదార్థములను శ్రద్ధగా ఇచ్చినను లేక, చులకన భావముతో ఇచ్చినను వాటినిగూర్చి లెక్కసేయక  స్వీకరింతును. ఒక్కొక్కప్పుడు పగటియందును, మరియొకప్పుడు రాత్రుల యందు ఆహారము లభించును. అది ఎప్పుడు లభించినను దానిని భుజింతును. ఒక్కొక్కసారి భోజనము చేసిన పిమ్మట గూడ ఆహారము లభించును. దానిని గూడ మరల భుజింతుసు.

13.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

క్షౌమం దుకూలమజినం చీరం వల్కలమేవ వా|

వసేఽన్యదపి సంప్రాప్తం దిష్టభుక్ తుష్టధీరహమ్॥6196॥

ప్రారబ్దవశమున దైవికముగా లభించిన దానితోడనే నేను తృప్తిపడుదును కనుక, నాకు పట్టు వస్త్రమైనను, ముతక వస్త్రమైనను,   మృగచర్మముగాని, నారచీరగాని, ఏ వస్తువు లభించినను దానినే ధరించెదను.

13.40 (నలుబదియవ శ్లోకము)

క్వచిచ్ఛయే ధరోపస్థే తృణపర్ణాశ్మభస్మసు|

క్వచిత్ప్రాసాదపర్యంకే కశిపౌ వా పరేచ్ఛయా॥6197॥

ఒక్కొక్కప్పుడు కటిక నేల పైనను, గడ్డిమీదను, ఆకుల మీదను, రాళ్ళపైనను, బూడిదపైనను శయనింతును. మరొకప్పుడు ఇతరులు సమకూర్చిన భవనముల యందలి పర్యంకములపైనను, పరుపుల మీదను పరుండెదను.

13.41(నలుబది ఒకటవ శ్లోకము)

క్వచిత్స్నాతోఽనులిప్తాంగః సువాసాః స్రగ్వ్యలంకృతః|

రథేభాశ్వైశ్చరే క్వాపి దిగ్వాసా గ్రహవద్విభో॥6198॥

ప్రహ్లాదా! నేను అప్పుడప్పుడు శుభ్రముగా స్నానమాచరించి, శరీరముపై చందనములు అలంకరించుకొని, అందమైన వస్త్రములను, పుష్పహారములను, ఆభరణములను ధరింతును. రథముపై, ఏనుగుపై, గుర్రముపై తిరుగుచుందును. అప్పుడప్పుడు పిశాచమువలె దిగంబరముగ కూడా సంచరింతును. 

13.42 (నలుబది రెండవ శ్లోకము)

నాహం నిందే న చ స్తౌమి స్వభావవిషమం జనమ్|

ఏతేషాం శ్రేయ ఆశాసే ఉతైకాత్మ్యం మహాత్మని॥6199॥

మనుష్యుల స్వభావములు వేర్వేరుగా నుండును. కనుక, నేను ఎవ్వరినీ నిందించుటగాని, స్తుతించుటగాని చేయను. కాని, ఈ మానవులకు శుభములు కలగాలని, వారికి పరమాత్మయందు భక్తిగలిగి సాయుజ్యము లభించాలని కోరుచుందును.

13.43 (నలుబది మూడవ శ్లోకము)

వికల్పం జుహుయాచ్చిత్తౌ తాం మనస్యర్థవిభ్రమే|

మనో వైకారికే హుత్వా తన్మాయాయాం జుహోత్యను॥6200॥

13.44 (నలుబది నాలుగవ శ్లోకము)

ఆత్మానుభూతౌ తాం మాయాం జుహుయాత్సత్యదృఙ్మునిః|

తతో నిరీహో విరమేత్స్వానుభూత్యాఽఽత్మని స్థితః॥6201॥

సత్యాన్వేషణము చేయు మనుష్యుడు పలు విధములైన పదార్థములను, వాటి భేదాభేదములను చిత్తవృత్తియందు హవనము చేయవలెను. ఈ చిత్తవృత్తిని ఈ పదార్థములకు సంబంధించిన వివిధ భ్రమలను కలిగించు మనస్సు నందు హోమము చేయవలెను. మనస్సును సాత్త్వికాహంకారముల యందును, దానిని మహత్తత్త్వము ద్వారా మాయయందు హవనము చేయవలెను. ఈ తీరుగా భేదా భేదములకు మాయయే కారణమని నిశ్చయించుకొని, ఆ మాయను ఆత్మానుభూతియందు లయము చేయవలెను. ఈ విధముగా ఆత్మ సాక్షాత్కారము ద్వారా ఆత్మస్వరూపమునందు స్థితుడై, నిష్క్రియుడై నివృత్తి మార్గమును అవలంబింప వలెను.

13.45 (నలుబది ఐదవ శ్లోకము)

స్వాత్మవృత్తం మయేత్థం తే సుగుప్తమపి వర్ణితమ్|

వ్యపేతం లోకశాస్త్రాభ్యాం భవాన్ హి భగవత్పరః॥6202॥

ప్రహ్లాదా! నా ఈ ఆత్మకథ అత్యంత గోప్యమైనది. లోకమునకు, శాస్త్రములకు అతీతమైనది. నీవు పరమ భాగవతోత్తముడవు. కనుక, నేను ఈ కథను వర్ణించితిని" అనుచు చెప్పెను.

నారద ఉవాచ

ధర్మం పారమహంస్యం వై మునేః శ్రుత్వాసురేశ్వరః|

పూజయిత్వా తతః ప్రీత ఆమంత్ర్య ప్రయయౌ గృహమ్॥6203॥

నారదుడు నుడివెను ధర్మరాజా! దైత్యరాజైన ప్రహ్లాదుడు దత్తాత్రేయుని ముఖతః పరమహంసల ధర్మములను విని, ఆ మునిని అర్చించెను. అనంతరము అతనిని వీడ్కొని, ప్రసన్నుడై తన రాజధానికి బయలుదేరెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే త్రయోదశోఽధ్యాయః (13)

ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు పదమూడవ అధ్యాయము (13)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319
[06:28, 15/07/2020] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 428   / Bhagavad-Gita - 428  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 37 🌴

37. కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్
గరీయ సే బ్రహ్మణో(ప్యాథికర్త్రే |
అనన్త దేవేశ జగన్నివాస
త్వమక్షరం సదసత్తత్పరం యత్ ||

🌷. తాత్పర్యం : 
ఓ మహాత్మా! బ్రహ్మదేవుని కంటేను ఘనమైనవాడా! నీవే ఆది సృష్టికర్తవు. అట్టి నీకు వారెందులకు నమస్సులు అర్పింపరు? ఓ అనంతా! దేవదేవా! జగన్నివాసా! నీవు అక్షయమగు మూలమువు, సర్వకారణకారణుడవు, ఈ భౌతికసృష్టికి అతీతుడవు.

🌷. భాష్యము  : 
శ్రీకృష్ణుడు సర్వులచే ఆరాధనీయుడని ఈ ప్రణామములను అర్పించుట ద్వారా అర్జునుడు సూచించుచున్నాడు. 

అతడే సర్వవ్యాపి మరియు సర్వాత్మలకు ఆత్మయై యున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని “మహాత్మా” అని సంభోదించినాడు. అనగా ఆ భగవానుడు మహోదాత్తుడు మరియు అప్రమేయుడని భావము. 

అలాగుననే అతని శక్తి మరియు ప్రభావముచే ఆవరింపబడనిది ఏదియును జగత్తు నందు లేదని “అనంత” అను పదము సూచించుచున్నది. దేవతల నందరిని నియమించుచు అతడు వారికన్నను అధికుడై యున్నాడనుటయే “దేవేశ” అను పదపు భావము. సమస్త విశ్వమునకు ఆధారమతడే. 

అతని కన్నను అధికులెవ్వరును లేనందున సిద్ధులు మరియు శక్తిమంతులైన దేవతలందరు శ్రీకృష్ణభగవానునికి నమస్సులు గూర్చుట యుక్తముగా నున్నదని అర్జునుడు భావించెను. శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని సృష్టించినందున, అతడు బ్రహ్మ కన్నను ఘనుడని అర్జునుడు ప్రత్యేకముగ పేర్కొనబడినాడు. 

శ్రీకృష్ణుని ప్రధాన విస్తృతియైన గర్భోదకశాయి విష్ణువు నాభికమలమున బ్రహ్మదేవుని జన్మము కలిగెను. కనుక బ్రహ్మ, బ్రహ్మ నుండి ఉద్భవించిన శివుడు మరియు ఇతర సర్వదేవతలు శ్రీకృష్ణభగవానునకు గౌరవపూర్వక వందనములను అర్పించవలసియున్నది. 

ఆ రీతిగనే బ్రహ్మరుద్రాది దేవతలు శ్రీకృష్ణభగవానునకు నమస్సులు గూర్తురని శ్రీమద్భాగవతమున తెలుపబడినది. ఈ భౌతికసృష్టి నశ్వరమైనను శ్రీకృష్ణభగవానుడు దానికి అతీతుడై యున్నందున “అక్షరం” అను పదము మిగుల ప్రాధాన్యమును సంతరించుకొన్నది. 

అతడు సర్వకారణకారణుడు. తత్కారణమున అతడు భౌతికప్రకృతి యందలి బద్ధజీవులందరి కన్నను మరియు స్వయము భౌతికసృష్టి కన్నను అత్యంత ఉన్నతుడై యున్నాడు. కనుకనే శ్రీకృష్ణభగవానుడు పరమపురుషుడై యున్నాడు. 
🌹 🌹 🌹 🌹 🌹


✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 40

🌻. భాస్కరశాస్త్రితో బహుముఖ గోష్ఠి 🌻  (శ్రీరాజరాజేశ్వరిదేవి)

మేము వీలునుబట్టి అనేక ప్రయాణ సాధనాల ద్వారా ప్రయాణం చేస్తూ త్రిపురాంతకం అనే పుణ్యక్షేత్రం చేరాము.

 ప్రభువుల పాదుకలు మాతో ఉండటంతో వారు మాతోపాటు ప్రయాణం చేస్తున్నట్లు, మమ్మల్ని వారే ముందుకు నడి పించుతున్నట్లు, మేము మాట్లాడే మాటలు కూడా వారే పలికిస్తున్నట్లుగా మాకు ఒక వింత అనుభూతి కలుగు తుండేది. 

త్రిపురాంతకంలోని అర్చకస్వామి భాస్కరశాస్త్రి గారు పీఠికాపుర వాస్తవ్యులు, శ్రీషోడశీ రాజరాజేశ్వరి ఉపాసకులు. 

వారికి శ్రీపాదులు కలలోనే శ్రీరాజరాజేశ్వరిదేవి మంత్రదీక్షను ఇచ్చారట. మేము శ్రీచరణుల పాదుకలను వారి పూజా మందిరంలో ఉంచాము. వెంటనే ఆ పాదుకల నుండి దివ్యవాణి వినిపించింది.

 🌻. శ్రీపాదుల దివ్య భవిష్య వాణి 🌻

"నాయనలారా! మీరెంతో ధన్యులు. భాస్కరశాస్త్రి ఈ పాదుక లను కొంతకాలం పూజించిన తరువాత ఈ రాగి పాదుకలు బంగారు పాదుకలుగా మారిపోతాయి. 

మహాపురుషులు కొందరు వీటిని హిరణ్యలోకం, కారణలోకం తీసికొని పోయి అర్చనాదికాలు చేసిన తరువాత మహాకారణలోకంలో ఉన్న నా దగ్గరకు తీసుకొని వస్తారు. 

నేను వాటిని ధరించి ఈ మూడు లోకాల సిద్ధులను, మహాపురుషులను ఆశీర్వ దించాక వాటికి దివ్యతేజోమయ సిద్ధి కలుగుతుంది. 

తరువాత వీటిని సిద్దపురుషులు స్వర్ణ విమానంలో తీసు కొని వెళ్ళి శాస్త్రోక్తంగా నా జన్మస్థలంలో భూమికి 300 నిలువు లోతున ప్రతిష్ఠిస్తారు. యోగదృష్టి కల వారికి మాత్రమే ఈ స్వర్ణ పీఠికాపురపు ఉనికి తెలుస్తుంది. 

సరిగ్గా ఈ స్వర్ణ పాదుకలకు పైన పీఠికాపురంలో నా పాదుకలు ప్రతిష్ఠింపబడుతాయి". దివ్యవాణి చెప్పిన విషయాలు విని మేమెంతో ఆనందించాము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹6:28, 15/07/2020] +91 98494 71690: 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 96 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. చేయవలసినది- చేయదలచినది - 12 🌻

ఎవరయితే సేవ కావాలని కోరుతున్నారో ఆధ్యాత్మ విద్య వాళ్ళ కోసం కాదు. ఎవరికయితే సేవ చేద్దామని ఉందో, వారి కోసమే ఆధ్యాత్మ విద్య. తరించేది వాళ్ళే. మోక్షం వచ్చేది వాళ్ళకే. 

అంతేకాని ఈ సృష్టిలో నాకు మోక్షం కావాలి అని కోరిన వాడికి ఏనాడూ మోక్షం రాలేదు. ఎందులకనగా ముందు "నాకు" అనే శత్రువున్నది. అది ఉన్నవాడికి మోక్షం ఎలా వస్తుంది? చివర "కావాలి" అనే శత్రువు ఉన్నది. మధ్యన ఉన్న మోక్షం అనే పదానికి "నాకు" అనే ఒక శత్రువు "కావాలి" అనే శత్రువు ఉన్నాయి. 

నాకిది కావాలి అనే కోరేవాడికి మోక్షం ఇప్పించడానికి భగవంతుడేమన్నా తెలివి తక్కువ వాడా? ఎన్ని కోటానుకోట్ల సృష్టి చూశాడు. ఎంతమంది లౌక్యుల్ని చూశాడు? ఇవన్నీ వాడిలోంచి పుట్టి, వాడిలో పెరిగి, వాడిలోకి వెళ్ళిపోతున్నవే గదా! నాకు, కావాలి అనే ఈ "రెండూ" తీసివేయనంత కాలము మోక్షము రాదు. 

మోక్షం అనేది వచ్చేది కాదు. ఒకాయన ఒకమాటు రమణమహర్షి గారి దగ్గరకు వెళ్ళి అడిగాడు. "స్వామీ నాకు మోక్షం ఎలా వస్తుంది?" ఆయన "నీకు రాదురా అప్పా" అని అన్నాడు. 

వాడు నాకు మోక్షం రాదు కామోసు అనుకున్నాడు నేనంత పొరపాటు చేశానేమో అని కూడా అనుకున్నాడు పాపం. చాలా బాధపడి వారి ప్రసంగం అయిపోయాక మళ్ళీ వచ్చి "స్వామీ మోక్షం రావాలంటే ఏం చేయాలి?" ఆయన "చెప్పాను కదురా అప్పా మోక్షం రాదని. వాడు బాధపడ్తూనే మర్నాడు మళ్ళీ అంతే నంటారా? ఇంక లాభం లేదంటారా? అని అడిగాడు"..
..✍ మాస్టర్ ఇ.కె.🌻
[06:28, 15/07/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 32  / Sri Lalita Sahasranamavali - Meaning - 32 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 63

260. సుప్తా - 
నిద్రావస్థను సూచించునది.

261. ప్రాజ్ఞాత్మికా - 
ప్రజ్ఞయే స్వరూపముగా గలది.

262. తుర్యా - 
తుర్యావస్థను సూచించునది.

263. సర్వావస్థా వివర్జితా - 
అన్ని అవస్థలను విడిచి అతీతముగా నుండునది.

264. సృష్టికర్త్రీ - 
సృష్టిని చేయునది.

265. బ్రహ్మరూపా - 
బ్రాహ్మణ లక్షణము గల రూపము గలది.

266. గోప్త్రీ - 
గోపన లక్షణము అనగా సంరక్షణ లక్షణం కలది.

267. గోవిందరూపిణీ - 
విష్ణుమూర్తితో రూప సమన్వయము కలది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 
🌹. నారద భక్తి సూత్రాలు - 35 🌹 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 22

🌻 22. తత్రాపి న మహాత్మ్య జ్ఞాన విస్మృతి త్యపవాదః 🌻

            గోపికలు లౌకికమైన కామదృష్టితో వ్యవహరించి ఉండవచ్చునని సందేహించినా, లేకపోతే ఆ గోపికలు శ్రీకృష్ణ స్వామిని, మానవునిగానే భావించినా ఆ శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి అని ఉదాహరణగా ఒక కథ ఉన్నది. అయినా భగవద్గీతను ఉపదేశించి తాను కర్మయోగిగా ప్రసిద్ధి కెక్కినది అందరికీ తెలిసినదే.

            శ్రీ కృష్ణుడు గోపికల ప్రేమలో వ్యత్యాసమున్నదనుకున్నా, గోపికల ప్రేమ కామంతో కూడినదిగా, శ్రీ కృష్ణుని ప్రేమ దైవీ ప్రేమగా గుర్తించి చూద్దాం. ఈ రెండు ప్రేమలూ కలిశాయి అనుకుందాం. 

ఉదాహరణగా రెండు పదార్థాల కలయికలో దేని ప్రభావం ఎక్కువో దాని ప్రభావమే రెండవదాని మీద పని చేస్తుంది. అగ్ని ప్రభావం ఎక్కువైతే నీరు ఆవిరౌతుంది. నీటి ప్రభావం ఎక్కువైతే అగ్ని చల్లారిపోతుంది. 

ఇక్కడ శ్రీ కృష్ణుని ప్రేమ మహత్తుతోను, జ్ఞానంతోనూ కూడిందగుటచేత ఆ కృష్ణ ప్రేమ గోపికల ప్రేమ ప్రభావాన్ని అణచివేస్తుంది. అనగా కామ్యకమైన గోపికల ప్రేమ ఆవిరైపోతుంది. వారిలో దైవీ ప్రేమ ప్రతిష్ఠితమవుతుంది.

            మరొక ఉదాహరణ చూద్దాం. వెలుగును చీకటి, చీకటిగా మారుస్తుందా? లేక చీకటిని వెలుగు, వెలుగుగా మారుస్తుందా ? 

ఇక్కడ జ్ఞాన ప్రకాశమే గోపికల లోని అజ్ఞానమనే చీకటిని వెలుగుగా మారుస్తుంది. అందువలన గోపికల మానవ సహజమైన ప్రేమకు ప్రతిగా శ్రీకృష్ణుని దివ్య ప్రేమ స్పర్శతో గోపికల ప్రేమ కూడా దివ్యమే అవుతుంది.
🌹 🌹 🌹 🌹 🌹
 శ్రీ దత్తాత్రేయ విరచిత  జీవన్ముక్తిగీత  - 5  / DATTATREYA JIVANMUKTA GITA - 5  🌹

ఏకాకీ రమతే నిత్యం
స్వభావ గుణ వర్జితమ్‌
బ్రహ్మజ్ఞాన రసాస్వాదీ
జీవన్ముక్త స్స ఉచ్యతే ll                    17

భావము: 
గుణాతీతుడైన జ్ఞాని అద్వయుడైన  ఆత్మయందే రమించు చుండును. బ్రహ్మ- జ్ఞాన రసానందమును పానము చేయుచుండును, అతడే ‘జీవన్ముక్తుడు’.

హృది జ్ఞానేన పశ్యన్తి
ప్రకాశం క్రియతే మనః
సోఽహం హంసేతి పశ్యన్తి
జీవన్ముక్త స్స ఉచ్యతే ll                    18

భావము: 
జ్ఞానవంతులై హృదయములో ఎట్టి ప్రకాశమును గాంచు చున్నారో అట్టిది జ్ఞాని మనస్సుగా భావింప బడినది. ఈ స్థితిలో ‘ఆతడే నేను’, ‘నేనే ఆతడు’ అని దర్శించు చున్నారు. ఇదియే ‘జీవన్ముక్త స్థితి’.

శివ శక్తి సమాత్మానం
పిండ బ్రహ్మాండ మేవచ
చిదాకాశం హృదం మోహం
జీవన్ముక్త స్స ఉచ్యతే ll                    19

భావము: 
శివశక్తి సమన్వితమైన వైభవమును, పిండ బ్రహ్మాండ యుతమును, చిదాకాశమును, హృదయమునందలి మోహమును, సమస్తమును ఆత్మగనే దర్శింతురు. అట్టివాడే ‘జీవన్ముక్తుడు’.

జాగ్రత్స్వప్న సుషిప్తిం చ
తురీయావ స్థితం సదా
సోఽహం మనో విలీయేత
జీవన్ముక్త స్స ఉచ్యతే ll                    20

భావము: 
అవస్థాత్రయమును చరించునపుడు సైతము తురీయావస్థలో వలె ‘సోఽహం’ భావనతో ఎవ్వడు విలీనమై యుండునో అతడే ‘జీవన్ముక్తుడు’.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
 🌹. శివగీత  - 1  / The Siva-Gita - 1 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. ఉపోద్ఘాతము 🌻

తెలుగు వారికి భగవద్గీత సుపరిచితము. శివగీత అపరిచితము. శివుడు జ్ఞానమునకు మూలమైనవాడు, విశ్వప్రభువు. శివజ్ఞాన సర్వస్వమెరిగిన వాడే సమగ్రపండితుడు.

భగవద్గీత నర-నారాయణుల మధ్య జరిగిన చర్చ. శివగీత శ్రీరాముడు - పరమేశ్వరుడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. ఇది అమూల్యము. అతి రహస్యము. జ్ఞానము అర్హులకు లభించవలెనంటే అది రహస్యముగా ఉండవలసి ఉంటుంది. 

జ్ఞానమునకు మూల్యము నిర్ణయించగలవారు ఏ లోకములోనూ లేరు. భగవాన్ వేదవ్యాస మహర్షి కృపవలన ఈ అమూల్యమైన జ్ఞానము పద్మపురాణాంతర్గతముగ ఆస్తికులకు లభ్యమైనది.

భగవద్గీత వలెనే శివగీత కూడా పద్ధెనిమిది అధ్యాయములు కలిగి ఉన్నది. అక్కడ 'పార్థాయ ప్రతిబోధితాం' అని ప్రారంభమైతే, ఇక్కడ 'రామాయ ప్రతిబోధితాం' అని మొదలవుతుంది.

శ్రీరాముడు తారకనామబ్రహ్మము. నారాయణుని అవతారము కేవలము లోకహితార్థము శ్రీరాముడు ఉపాధిగా ఈ శివగీత ఉద్భవించినది. ఇది జ్ఞాన సుధాసాగరము. 

భక్తులకు సులభగ్రాహ్యము గావించుటకు సంక్షిప్తం చేయబడినది. ఇది నిత్యపారాయణ గ్రంథము. చదివిన కొద్ది శివభక్తి స్థిరపడుతుంది.
🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment