Wednesday 22 July 2020

No photo description available.
జ్నాన తత్వ జ్యోతి అటవెలది పద్యాలు (1)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

జీవ భావ మంత జాతికి శాంతియు 

న్యాయ రక్తి యుక్తి నమ్మ శక్తె
జన్మ రక్ష నంత జీవిత లీలలే
కాల నిర్ణ యమ్ము కధలు లేలు......... 1

జనన మరణ వార్త సంతోష దు:ఖమే

ప్రేమ పంచి సౌఖ్య మిచ్చు సతియు
కాల మాయ వెనుక పరమాత్మ ఆత్మయు
కష్ట సుఖము లన్ని ఆత్మ శక్తి......... 2

నేను బిందు వైతి పూర్తిబిం దవ్వలే

గాలి ధూళి కలసి చిక్కి ఉన్న 
నేను బీజ మైతి పూర్తి మొక్కవలేదు 
ఎండ వాన కలసి రాక ఉన్న .........3

నాటి వైభ వాన్ని రతణాల సీమను

వర్ణ సాహసమ్ము కధలు కధలు
గురువు గాను విద్య నేర్పియు విశ్రాంతి 
జీవి గాను తెలుగు వెలుగు పంచె.........4

ప్రాణి యోని చేరి కర్మనను సరించి

జంగమత్వమును బడయు ను నిజము 
కాయమేర్పడి బతుకు ఈశ్వర మాయయే
సుఖము దు:ఖము ఆశ నిలయ మవ్వు....5.

వగలు తెలప కుండు మగసిరి పరువపు 

ప్రకృతి యంత నిజము తెలుపు చుండు
చిగురు సొగసు కోర్క నిత్య సత్య ములుగా 
ఆశ తుంచి శోభ పెంచు చుండు..... .......... 6

మాట రాని మోన మంతయు కమ్మెనే

కాల మాయ వెనుక చిక్కి ఉన్న 
శబ్ద భేది తెలియక కవిగా రాతలు
వెలుగు నీడ బతుకు ఛాయ అయ్యె......... 7

కాగడాగ మారి చీకటి తరిమియు

వెల్గు దశదిశలుగ వ్యాప్తి పరచి 
కవిత లల్లి మనసు భావము తెల్పియు 
కమ్ము కున్న చీకటి తరిమి కొట్టి............. 8

నిన్ను గెలవలేరు యజ్న్య రూపికళల

వేదముల్తొ సతియు కల్సి యుండు
రోమ కూప రంద్ర సూకర రూపంతొ
శూక్ష్మ  రూప మయ్యె లోక మంత...... . . . .  9



జ్ణాన తత్వ జ్యోతి అటవెలది పద్యాలు (2)

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

వేద జ్ణాన మంత వినిపింప పరమాత్మ

వల్లే వేసి భద్ర పరచిన  ఋషులులే    
సుద్ద వేద హితము శృతులని పించిరి   
ధర్మ మార్గ మంత పంచి చూపె  ....  .... 10  

వేద వ్యాస మునియె.. విభజించె వేదాలు   

ఫైలు జైమి సౌమ్య  వైశ్య పాయ
శిష్య కోటి వాటి  శ్రేష్ఠత పెంచెను 
నిత్య ధర్మ భోద మార్గ మయ్యె     ...  ... 11 

శ్రీయు నీవె వాణి నీవెయార్య నీవె 

వేయి చుక్కలందు వేఁగుఁజుక్క    
దేవి యంచు నిన్నె దల్చుచుందు నెపుడు  
గావవేల నన్ను నీవు ప్రేమతోడ  .... .... 12
      
జీవవృక్షమందు నుండు చేవవు నీవె 
జీవయాత్రయందు వాలు ద్రోవ  
మన్కి సంద్రమందుఁ జిన్న నావవు  నీవె 
మిన్కు తార పంపు మేటి కాంతి  .... .... 13

చెల్వమందు నూరు గొప్ప భావము నీవె 

కల్వపూలలోని ధూళి తావి  
చీకువాలునందుఁ వెల్గు రేకలు  నీవె 
మూకచిత్తమందు మౌనగీతి    ... ... 14

వేల్పుమానులోని పారిజాతము  మీవె 

తెల్పురంగులోని పారిశుద్ధ్య  
మేఘమాల యంచులోని వెండివి నీవె 
రాగమాల సుస్వరాల గీతి   ... .. 15  

వేదమంత్రమందు మ్రోఁగు శాంతివి నీవె 

నాదబిందువందు నృత్యగాన  
సొమ్ము నీవె సోయగాల కొమ్మవు  నీవె 
బమ్మ సృష్టియందు సుందరమ్ము  .... 16  

ప్రేమగీతమందుఁ జిందు ప్రీతివి నీవె 

శ్యామలాభ్ర మిచ్చు వాన చిన్కు  
పూలకారులోని చంద్రబింబము నీవె 
బాలకృష్ణు శీర్షమందు పింఛ     ... ..... 17  

పద్యమందు వ్రాయు తొల్లి శ్రీయువు నీవె 

మద్యపాత్రమందు మాధ్వి మత్తు  
అన్నమయ్య పాటలోని లాలివి నీవె 
వెన్నపూసలోని మార్దవమ్ము        ... .... 18  

--(())--

జ్ణాన తత్వ జ్యోతి అటవెలది పద్యాలు (3)

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

తాళవృత్తమందు ప్రాస సొంపు నీవె 
కేళిలోని చిందులందు కేక  
సీసపద్యమందు నెత్తుగీతివి నీవె 
రాసలీలలోని కోల రావ  .... .... 19  

మీనలోచనమ్ములందు మించును  నీవె 
గానకోకిలాళియొక్క గళము  
సందె సొంపు నీవె రేయి యింపువు  నీవె 
అందె పిల్పులోని క్రొత్త యంద  .... 20  

నన్ను బ్రోవ రమ్ము నాకు జీవము  మిమ్ము 
వన్నె లిమ్ము మంచి వార్త నిమ్ము  
కంటి నిండ నిద్ర నాకు హాయిని మిమ్ము 
కల్సి మెలసి బాటుకు శోభ నిమ్ము   ... 21 

ఉపనిషత్తు లనఁగ ఉమ్మడి బ్రతుకులో
జ్ఞాన్ మోక్ష శాంతి గమన స్థితులు 
బ్రహ్మ సూత్ర జ్ఞాన పంచశతంబులు    
నిత్య కల్ప తరువు మాట నిజము  ....... 22 

ఈశ వాస్య మంత  ఈశ్వరీయంబౌను
ముండ కోప నిషత్తు మండు క్యోప 
తైత్తిరోపనిషత్తు తతులెత్తు ఎరుగును 
కృష్ణ గీత భావి జీవితమ్ముతెలుపు  .... .... 23 

కూర్మి బ్రహ్మ చర్య గృహుని సు  ధర్మము 
వాన ప్రస్త సన్య సాన బ్రతుకు
యజ్ఞ యాగ విధులు అరణ్యకము జెప్పు 
వృద్ధ జనులు భక్తి మార్గ సులువు  .... .. 24 

అన్ని వేదములకు అన్ని బ్రాహ్మణములు 
కలవు యఙ్ఞ విధులు కలవు కధలు 
వ్యాకరణము సూక్తి మిత్రభేదములును 
మిత్ర లాభ ములను తెలుపుచు ఉండెను .. 25 

వైదిక బహు మంత్ర విశ్లేషణము జేసి 
అర్ధ పుష్టి నిచ్చు అద్వి తీయ            
గ్రంథ రాజములను బ్రహ్మణాలని యంద్రు
పుణ్య కర్మ క్రయ లన్ని చేయు      .... ..... 26 

ఋషులు వేద రచన దోషణంబులు నేరక 
ద్రష్టులగును వేద దర్శనములు 
చక్షు దృష్టి యుగళ సత్వాన నేర్చిరి 
కోాప మన్నలేక శాంతి తెల్పు   .... ....   27      
 --(())--
Lord Shiv Shanker Whatsapp Video
జ్ణాన తత్వ జ్యోతి  పద్యాలు (4)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

బంధ మంటె కాయ కష్టాన్ని గుర్తింపు
గాధ పూత పూస్తె నిలిచి పోదు
పలక రింపు సుఖము ఆకర్షణలు వల్ల
పరి మళములు ఉన్న వరుకు బతుకు    ...... 28  

జీవి తాన్కి సుఖము దుఃఖ మరణ మంత
దైవం లీల కాల నిర్ణ యమ్ము
మనిషి ఆశ ఎంత అని చెప్ప లేక యుండు
బతుకు వేట మొదలు ఆట మార్పు   ....  ..... 29  

కాయ మంత జిహ్వ చాపల్య మై యుండు
ముగ్గు లాగ సులువు గుర్తు పెట్టు
ఊడ్చి పార వేసె చెత్త వస్తు‌వు కాదు
స్వాస ఉన్న వరకు కాయ ముండు  ....  ... 30  

తలుపు తెరిచి ఉంచు వెలుగు కీరణములు
జేరి సుబ్ర పరిచి కాంతి పెంచు
మనిషి రోజు కొత్త ఆరాట పరుగులు
మనసు మార్చు కోక సతియు పతియు ....  ... 31  

భువన కనకపు రేడులు వెలుగు జిలుగు
కమ్ము కున్న ట్టి చీకటి తరిమి తరిమి
ఇలను సేద్యపు వెలుగులు కొమ్ము కాసి
బతుకు తెరువు పలుకు మీద జనులు   ... 32  

అంబ రమ్ము మేఘ మురుముతూ కదులుతూ  .. 32 
  వాన కురిసి ఊరు ఊరు ముంచె  
రాజ కీయ నాయ కులు పోటి పడుతూను
మనిషి మనిషి మధ్య తగువు తెచ్చె      ... .. ౩౩ 
      
అడవి తల్లి వర్ష మునుమింగి వికసించు 
ఉరుము మెరుపు చల్లఁ బడియు ఉండె 
నాయ కుండు డబ్బు మితిమీరి వికసించు
చెప్ప నలివి చేసి జనులకు తడిచూపు  '''' 34      

వాగు డొంక కలిపె వర్షపు ఛాయలు
నాయకుండు మనిషి ఓటు అడుగు
కొమ్మ ఆకు పువ్వు రాలియు విరిగెను    
మార్గ మంత నడవ వీలు లేదు           ... 35  

రోగ మొచ్చె మందు లేకయు బాధలు 
ఎంత మోత్తు కున్న వప్పు కోరు 
రోగమొచ్చి ఉన్న నాయకులకు వేరు  
ప్రాణ మంటె అంత తీపి ఏల    .... ..... 36  

--(())--

By Ravindra Svarupa Das Srimad-Bhagavatam Eleventh Canto Chapter 31: The Disappearance of Lord Śrī Kṛṣṇa. Dāruka delivered the account of the total destruction of the Vṛṣṇis, and upon hearing th…
జ్ణాన తత్వ జ్యోతి  పద్యాలు (5)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 


స్నేహ మంటె ఒకరి కొకరు కలియుట యు
హాస్య మాడి లోక జంట కబురు
అక్క రకును వచ్చు చెలిమియె ఇష్టము
బతికి ఉన్న వరకు చెలిమి యుండు  ..... .... 37 .

తరుణి తపన శాంతి బహుమతి పొందిన
ధనము కనక మాశ ఉండు నెపుడు
వ్యవహార మంత చక్క బరచుట
భార్య హోద తోన ఓర్పు ఉండు   ......... ........38 .

ముత్య మంత వెలుగు ప్రేయసి సౌందర్య
స్వేత వర్ణ ఉల్లి పొరల చీర
కట్టి మల్లె పూలు ఆహ్వానం పలుకుతూ
భర్త కొరుకు ఉన్న వెన్న ముద్ద  ...........  ...39.

నిన్న గాక నేడు నీడగా బతుకుకు
సర్వ అంగ సౌష్ట వమ్ము కలిగి
వంశ బీజ మంత భరించు శక్తిని
కలిగి సుఖము పొందు సంబరమ్ము ...... 40

చిలక పచ్చ చీర లో ఉన్న బంగారి
దొండ పండు ఎరుపు పెదవు లున్న
భామ నేను కొత్త కోక కిర్రెక్కింది
నిద్ర రాక సిగ్గు నంత దాచ         ...... ....41

నిన్ను నన్ను నవ్వు కలిపియు ఏకము 
చేసి తోడు నీడ లాగ ఉన్న   
నిన్ను చూసి తప్పు తెలిసియు మారాను 
వేచి ఉన్న కళ్ళు తృప్తి పొందె ..... ..... 42

నిన్న మాట నేడు ఫలితము కలిగెను 
రేయి సుఖము కొరకు వేచి ఉన్న 
బరువు పంచు కోవ టానికి సిద్దము
మంచు లాగ కరిగి నీడ నౌత   ..... ....  43

తెల్ల గుడ్డు పైన నల్లని మెరుపు  
కాంతి హావ బావ మంత చూపు
కంటి రెప్ప గాను కాపుకాస్తుంటాను   
పగలు రేయి ఏక మవ్వు దాము  ..... ...   44



Media Tweets by Iskcon,Inc. (@IskconInc) | Twitter

జ్ణాన తత్వ జ్యోతి  పద్యాలు (6 )
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

మీకు మేలు అమ్మ వారికృప తొమన 
మంద రముయు తల్లి వరలక్ష్మి పూజిద్దాం 
సకల జనుల కొరకు ఆరాధిద్దాం మనం 
సకల విద్య నేర్పు తల్లిని కొలుద్దాం  ..... ... 45.            

నీవు నీవు కాదు నడిపించు పరమాత్మ 
నీవు కష్ట జీవి ఫలమిచ్చు పరమాత్మ 
నీవు సుఖము పొంది తే సతి నిర్ణయం 
కాదు కర్మ ఫలము అందించు పరమాత్మ..... 46 

 వారసులము భక్తి తత్పరులము ధైర్య
వంతులము విషయము తెల్సి నిగ్రహమ్ముతొ
కాయ కష్ట మంత దేవుని చలువగా
అమ్మ వారి కృపకు పాత్రులము మనము.......47 

జ్ణాన మునకు కులము మతమనే దేది యు 
లేదు సూర్యకిరణములు లభ్య మోకటె 
పూజ ఎవరుచేసిన దైవ లీల ఒకటె
ఆమ్మ ప్రేమ బిడ్డల పైన మక్కు వగుటె...... 48 

సహజ గుణము నిజము భగవ దైక్యమ్ముగ 
లక్ష్య సాధనమ్ము జీవధారుడ్యమ్ము
శాస్త్ర పఠన వలన సిధ్ధి,  అజ్ణానము
అనగ తొక్కి సత్య సంపద కలిగించు........  49 

తమరు ఎవరు అయిన అమ్మకన్నబిడ్డ
మంచి తెల్ప లేని మానవ జన్మనా
నిజము తెల్పె మనిషి బతుకును తెలుసుకో
అమ్మ నాన్న గురువు మారని చరిత్ర.....  50 

వలస కూలీలు పనులు లేకున్న బతుకు
తెరువు కోసం మంటు వలసపక్షు ల్గాగ
వీధి వీధి తిరిగి నా బత్కేందుకే 
కేంద్ర రాష్ట్ర కర్తలుగమనించక ఉండె...... 51 

పక్షి ఎగర గలదు మానవ ఆహార
మవ్వు జీవ కోటి బుధ్ధియే మారదు
పిల్ల చేష్ట లుడికి వెర్రికోరికలొచ్చు
ఆశ మదము పెంచు పక్షిగా ఇకలేదు....   52 

మనిషి మనిషి మధ్య ప్రేమ సృష్టించావు 
ధనిక పేద మధ్య తరగతి ప్రజలు న్న
అహము సహన మధ్య బతుకు లన్నావయ్య 
మంచి చెడ్డ మధ్య బతుకు లాడుచు ఉన్న.... 53  


అగ్ని కట్టెను బూడిద చేయు చుండు  
అగ్ని కామము పుట్టించి మనసు మార్చు  
అగ్ని మంచును కరిగించి తెలివి చూపు 
జ్ఞాన అగ్ని కర్మములను భస్మ ముచెయు   ...... 54 

      Media Tweets by Iskcon,Inc. (@IskconInc) | Twitter

జ్ణాన తత్వ జ్యోతి  పద్యాలు (7 )
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

జ్ఞాన మునకుమించిన విద్య లేనె లేదు
యోగ సిద్ధిచే జగతిలో జ్ఞాన మొందు
మనసు విద్యను పంచేటి సవ్య జ్ఞాని       
దాన ధర్మము సలిపితే కాల జ్ఞాని     .....  ... 55  

శాస్త్ర విజ్ఞాన మందును శ్రద్ధ ఉన్న 
నిష్ఠ ఆధ్యాత్మిక సాధన యందు ఉన్న 
ఇంద్రి యములను జయించి ధర్మ నిరతి     
శాంతి తొ మనిషి  జ్ఞానము పొందు చుండు  .. 56 

చపల చిత్తుడు, అనుమాన మున్నా వాడు, 
శ్రద్ధ రహితుడు, చోరుడు, కోప పరుడు,     
సౌఖ్యము కొరకు మోసము చెయు వాడు, 
తల్లి తండ్రుల్ని దూషించు  జ్ఞాని కాడు    ,,, 57

నేటి తేట గీత పద్యాలు 

గురువు సామర్ధ్య మంతయు శిష్యు లెరుక   
గురువు యొక్క సాధన సిద్ధి శిష్య తెలివి 
గురువు సత్యపు ప్రేరణ శిష్య బతుకు  
గురువు బోధల చెలిమియు బతుకు తెరువు  ..58


నేటి ఆటవెలది పద్యాలు 

కన్నె సొగసు పరిమళించేటి పుష్పమ్ము
వన్నె తరగని మగువేను సంస్కరించు 
కన్నె వయసు పరుగు లేసేటి కెరటమ్ము
ఒక్క దీక్ష ధీర వనిత వినతి      .......      59

కన్నె మనసు యవ్వన పడక శుభయమ్ము
పాడి అభియ మిచ్చి ఫలిత మౌను  
కన్నె తప‌సు జతకు ధర్మమార్గమునన్ను
స్త్రీల భాగ్య మనేడి శాంతి మార్గ  ......... 60

పరగడుపున చూపు తొందర వద్దు లే 
ఎక్క డెక్కడాను ఆశ వద్దు 
తరుణులయెడ చూపు లస్సలు ఒద్దులే
సంతసమ్ముచూపు అసలు వద్దు   ........61

అనునయనపు చూపు ఇంటిపై దేనికి 
ఇంటి వాళ్ళు బయట నెట్టె దాక 
దొరకని పని చూపు భాదను తెచ్చులే 
ఇంగి తంబు నెరిగి బాటుకు సాగు    .......  62

కనబడిన విచిత్ర  సందర్బోచిమ్ములే   
మనసు చేరి వింత కోర్క కలుగు 
వినబడినవి విన్న అనుకూల లేదులే 
కాల మంత ధనము చుట్టు తిరుగు  ..... 63
  
Radhakrishna Love 1, Painting by Sanjay Tandekar | Figurative artwork on Acrylic On Canvas | BestCollegeArt

జ్ణాన తత్వ జ్యోతి  పద్యాలు (8 )
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

సుఖములొ అలసటయు సర్వసాధారణ
మేను పంచి ఆత్మ తృపి పెంచు 
నగుచనువయిన మతి కొత్తఅందముచూపు       
ముద్దుగుమ్మ మురిపములను పంచు ...... 64

గురువు శిష్య బంధ మంతయు చదువుకు 
హృదయ శాంతి కలుగ చేయు విద్య   
గురువు శిష్య శాసన అనుగమనములు  
అనుభ వంబు ప్రజ్ఞ అంకి తంబు  ...... ..... 65

అద్దె ఇల్లు ధరణి అందలి నిధులన్ని
వాడ వచ్చు కాని పాడు జేసి 
బుద్ధి రచన మార్చు పైపెత్తనము వద్దు 
అనువు కాని చోట అధిక మొద్దు    ..... .....   66

వాడి నట్టి నీరు వనరైన రీతులు 
శుభ్ర పరచి మరల శుచిగ వాడ 
వహ్హు వశు మిషను వాడుక తీరంగ
మైల నైన శుభ్ర పరచె మనిషి .... .....  67

వివిధ వసతులు గల ఇంటిపై ఇల్లులు 
వంట గ్యాసు నిచ్చు వర కరంటు 
పాయ ఖాన సొబగు దిద్ది ఉంచు 
సుఖము పెరిగి రోగమొచ్చు మనిషి ....  68   

రైలు బస్సు లందు  రహదారి జనులు 
మడ్డి తిండ్లు తినుచు మైల పరచి 
సీట్ల చుట్టు పాడు చేయుట సరి ఔన        
మంచి చెప్పి నాను బుద్ధి రాదు ..... ... 69

కలదు నేడు దృశ్య ప్రకటనలు పెర్గి
కథ మలుపు మరియు తెలియ కుండు
అర్ధ నగ్న దృశ్య ములంత పెరిగెను 
తల్లి తండి బిడ్డ కలసి చూడు .... ...... 70

అలరు నేటి టీ.వి ఆంకర్లు వంకర్లు 
చిన్న వయసు వారి మనసు చెడిపె
అన్ని భాషలొచ్చి  భయాలతోనింపే
నిత్యకృత్యమాయె నిద్ద్ర రాక   .... ......   71 

మూరెడు కలువ గలిగియు తోపు రండు 
అంటు ఆకుల తోరంబై వట్టి ఆది 
దొరక గాను పూజలనుచే పట్టి దాని 
కరణపు ఘందులు ఉబికియు పాకమయ్యె .. 72         
  



లలిత శృగారము ఆటవెలది పద్యాలు  
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ    

సిగ్గు ఎగ్గు లేక  ఇద్దరి  మధ్యనా 

అగ్గి బుగ్గి అయ్యె తీరు వద్దు 
ముగ్గు లోకి లాగి ముద్దుఆరాటము 
పెర్గి లొంగి నోడి బతుకు బుగ్గి 

వంగి పొంగు చూపి మనసును దోచేసి 

గుండె నుగ్గు చేసి తప్ప దంది    
బుగ్గ బుగ్గ కలిపి ముద్దులు ఇచ్చియు 
సొంగ కార్చి పోక తప్ప దంది  

కొంగు తీసి గుప్పు గుప్పుమ నిసిరె 

నంగ నాచి పంగ లెత్తి చూపె  
దగ్గి చేయి అడ్డు పెట్టియు పిలిచెను 
మంచు కరిగి నట్లు బుద్ధి కరిగె 

తగ్గు ముందు నీవు తొందరొద్దు లతను 

పట్టు కుంటె కంది పోవు జాతి  
చెంగు చెంగు దూకి పండ్లను చూపిస్తె  
నిప్పు తప్పు అంటు ఒప్పు చుండు 

అగ్గి మంచు లాగ కరిగి చల్లబడెను 

నిప్పు కణిక తాకి చల్లఁ తాగె 
కొత్త చోట చేరి రోగమ్ము పొందియు 
ఆశ చావ కుండ ఇంట నుండె 

ఒక పాత పద్యం చదవండి


దొంగనిద్దురవాడ! ముద్దు గొనినట్టి

చెక్కిళుల రేగు పులకల చెలువు గంటి!
ఏల కనుమూసికొనెదు? చోటిమ్ము కొంత
మసలి యుండను లెమ్మిట్లు మరల నెపుడు

సిగ్గు చేతనో, పనిలోపడో, పడక దగ్గరకి ఆలస్యంగా వచ్చింది భార్య. భర్త కించిత్తు అలకని ప్రదర్శిస్తూ నిద్ర నటిస్తున్నాడు. సరసురాలైన ఆలి అతని చెక్కిలిపై ఒక ముద్దు ముద్ర వేసింది. అప్పుడతని చెక్కిళ్ళపై పులకరింతలు అంకురించాయి. ఇంకేముంది, దొంగ దొరికిపోయాడు! అప్పుడా కాంత ముద్దుముద్దుగా తన మగనితో అంటున్న మాటలివి. అలక, సరసత్వం, చనవు, గడుసుదనం - భార్యాభర్తల శృంగారంలో యివన్నీ ఉంటాయి. అవన్నీ మనకీ పద్యంలో స్ఫురిస్తాయి!     

--(())--

ఈ కవితలో ఎన్ని గ అక్షరాలూ ఉన్నాయో తెలుపగలరు, కవితా భావం నచ్చితే షేర్ చేయండి 
--(())--

లలిత శృగారము ఆటవెలది పద్యాలు  
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ    

కళ్ళ చూపు తోనె కళలన్ని పసిగట్టి 
వద్దు వద్దు అంటు యూర డించె 
కలలు తీర్చు చదువు కనిపెట్టి పిలిచియు 
బువ్వ పెట్టి పక్క వేసి పిలిచె 
   
పెదవి ఎరుపు చూపి ముగ్గులో దించియే 
చిరునగవును చూపి కన్ను కొట్టె 
పైట చాటు పరువము పదిలం అంటునే 
త్రాసు కదలి కన్నె సొగసు పంచె 

ఓర కంట గానె పసికట్టి గుర్తుపట్టి 

గుండె లోని దడను చూపి కరుగు 
కన్నె సొగసు కాపు కాచియు ఉన్నది 
జంకు బొంకు లేక వచ్చి చేరు 

మనిషి వయసు సొగసు కనిపెట్టె పిలిచియు 

కులుకుల సొబగులను ముద్దు చేసి 
దొరికినదియు దోచి దోబుచు లాడియు 
సరుకు నంత దించి నిద్ర పుచ్చె 

సొగసరి గడసరియు ఒక్కటైనట్లుగా 

పెదవి బిగువు ఒరసి పట్టు పట్టి        
ఒకరికొకరు ఏక మవ్వుట ప్రకృతియు 
కాల ధర్మ మిదియు తప్పు కాదు 

నాకు సరియు నీకు సరిగున్నదామరి  

మగువ మనసు కులుకు పలుకు బట్టి 
మాట రాక మౌన ముద్రగా నవ్వులు 
ఒక్కరొక్కరూను నవ్వు చుండె 

--((***))--


లలిత శృగార ఛందస్సు పద్యాలు (21) 
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ    
2 నేటి వృత్త కవిత్వం " న. భ. న. గ "
IIIUII I iiU - IIIUII I iiU

సెగలు  తప్పని బతుకులే - పొగలు కమ్మిన అలకలే
రగులు కున్నవి చితుపులే - మంటలు కమ్మెను కురులులే       
కనులు తిప్పిన బెరుకులే - కలలు వచ్చిన చిరుగు లే
వినయ ముండిన శుభములే - విధిని మార్చుట లేఁదునులే
   
కలత వద్దును చినుకులే - మడత పేచియు కలలులే
మగువ ఆటలు చరితలే - మగని మాటలు పరిధిలే
పలుకు తెల్పిన చిలకలే - మగని చూపుకు భయము లే
కులుకు చూపిన పడచు లే - పడచు పిలుపుకు దడ లే

కళలు మారిన కలల లే - కధలు చెప్పిన వినదులే
విషయ మన్నను భయములే - వినయమన్నను చొరవలే
శుభము అన్నది నిజములే - భయము అన్నది కలలులే
సహనమన్నది నిజములే - అహము అన్నది కలలు లే   

--(())--




లలిత శృగార ఛందస్సు పద్యాలు (22) 
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ    
మృదువాణికి క్రింద నా ఉదాహరణములు - 
3,4 - 3,4 మాత్రలుగా - 
UI IIU - III UU

భార మయెనా - బ్రతుకు నాతో 
సాయ మగునా - ఆపనికి నాతోఁ 
నారిఁ గనరా - నగవుతోడన్ 
వాణి వినరా -  ఫలముతగ్గున్

జేర నను రా - చెలువ మిత్తున్ 
కాల్ మీదిరా - కలలు వచ్చున్  
మారునికి నా - మనసు నిత్తున్ 
చోరునికి  నా - మనసు నిత్తున్ 

వేణు రవమా - వినఁగ లేనే 
గాణ మదియే  - అడగ లేవే  
తేనె పలుకుల్ - తియగ లేదే 
వాన చినుకుల్ - తియగ లేవే

వాని కొఱకై - వగచుచుంటిన్ 
వాని కొరకై - నావు చుంటిన్   
వానికొఱకై - బ్రదుకుచుంటిన్ 
వాణి కొరకై - పరుగుచుంటిన్ 

నిన్నె మదిలో - నిలిపియుంటిన్ 
నీతొ యదలో - పలుకు చుంటిన్  
గన్ను గవలోఁ - గవిత నీకే 
అన్న మిదిగో - కరుణ చూపే 

కన్నెపయినన్ - గరుణ లేదా 
వినం పలుకున్ - తెలిప లేదా  
నన్ను గనరా - నవనవమ్మై 
కన్ను కలుపే - మనసులేదా  

వాదనలతో - వలదు రాత్రుల్ 
వేదనలతో - వృథయు రాత్రుల్ 
మోదములలో - మునుగుదామా 
నాదములలో - నలుగుదామా 

--(())--
Image may contain: 1 person

మృదువాణి - భ/జ/స/గ UIII UIII UU యతి లేదు 
10 పంక్తి 239 
లలిత శృంగార రాధాకృష్ణతత్వం 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

నీ దరికి రాకనకు కృష్ణా    
నా చరిత నే నసలు చూప  
నా కళలు నే కలుపుకుందాం 

స్వాతి చినుకే మన మమేకం 
చేసినది కాలమును కోరే 
ఆశయము వచ్చెను కాదా 

నవ్వులను పంచుకొని యేకా 
దాకలలు తీర్చుకొనుటేకా 
దా, నిదుర మబ్బు తొలగేనా  
           
పువ్వులను కోసితిని నీకో
సం, పరిమళం నటన కాదే
సంతసము పొందుటకు కాదా

నిర్మలము నిన్నొదలకే నా  
తో, కలసి జీవితము సాగే
నావ దరి చేరితివి కాదా 
        
దర్శనము కోసముణ ఎన్నో 
రాత్రులలొ నిద్దురయు రాకా     
నిన్నుకలసే తరుణమేదీ

పాలను కదల్చితిని ముఖ్య
మ్ముముఖ మనస్సు తెలిసాకా
ఉండుట కష్టమయ్యెను  కదా

రాధిక మనస్సు తెలుసేనా 
అర్దమును బట్టి కలిసే మా 
ర్గమ్ము లను తెల్ప వలె కృష్ణా   
            
ఈప్రకృతి భావములు ఎంతో
సుందరము సాకరము ఎంతో 
తాపమును పెంచుటయు లేదా 

కాలమును బట్టిమన మేకం 
కావలయు నామనసు తెల్పే
నీకు మరి చూపులక చిక్కా 

ఆకలనకు దాహమన కే భా 
మా కలలు పండునులె తోందా
రెందుకులె తోడుగగ నేనే 

కాదనిను రక్షణను కల్పిం
చేది కల తీర్చెదియు నేనే 
ఎందుకును బాధయును రాధా 

--(())--    
                   


Image may contain: 1 person
ప్రాంజలి ప్రభ పద్య పుష్పం 
శ్రీ కృష్ణ అష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

సిరి నీవు శ్రీ నిధి నీవు
సరి రారు నీ కెవ రూను
విధి నీధి నీ మనసంత
నవ నీత నీ కృప మాకు

విరి జాజి పువ్వు ధరించి 
అను రాగ మాలిక తోను
తనువంత తాపసి గాను 
తరుణాన్ని మాకును పంచె

తిధి చంద్ర బింబము చూపె
మది తొల్చు మాయను తుంచి
విధి ఆట తెల్పియు మంచి 
పలుకుల్ని మాకుయు చెప్పె

అనురాగ బంధము చూపి
నిశిరాత్రి సౌఖ్యము పంచి
చిరుహాస పాఠము తెల్పి
వెలుగంత పంచేటి కృష్ణ

కమలాల కళ్ల తొ మాకు
విజయమ్ము పంచేటి శక్తి 
భయమంత తర్మెటి ధైర్య 
మును పంచె మానస కృష్ణ


--(())--

నేటి వృత్త కవిత్వం  " న. భ. భ. గ "
IIIUII UiiU-  IIIUII UiiU-
రచయత:  మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ

ఎకశకాలను చూపనులే - తులువమానము తుంచెనులే
కలయు రాగము పల్కెనులే - వినయ వాదము చేయునులే  
పలుకు వేగము పెంచెనులే - మనసు మాటను పల్కెనులే
మనసు నాడిని పట్టనులే - మమత వేడిని చూచెనులే  

తరుణ మాయను చూపెనులే - వినయ వేదము చప్పెనులే
కరుణ సేవలు చేసెనులే  - కధలు తెల్పుట ఒప్పెనులే 
సమయ రోగము మాపెనులే - కళల కాలము వచ్చెనులే
విషయ వాంఛలు తీరెనులే - దయాయు హాయిని కొల్పెనులే 

విషయ మోనము మంచిదిలే - ప్రతిభ వేగము పెర్గునులే
ప్రగతి తెల్పియు ఉండెనులే - ప్రణతి నాదము తెల్పెనులే  
తనువు తాపము తగ్గునులే - తపన రోగము మారునులే
చిరుత వేగము వద్దనులే - కలువ పువ్వుల పొద్దులులే

వరుస నవ్వుల కాలములే - పగలు కొల్వుల దారులులే
బరువు చిందుల వేగములే - పగలు ఆశల కోరికలే 
మనసు మారక తప్పదులే - మగువ కోరిక తీరదులే 
మగని వాటము చాలునులే - కలవు ఆకలి తీరునులే 

  

ఆటవెలది పద్యమును అనుసరించునట్లు కూడ వెణ్బాను వ్రాయ వీలగును. ఆ ప్రయత్నమే యిది. క్రింద నా ఉదాహరణములు - 

UI IIIUI - UIU UIU      
UI III - III IIIUI               
UI IIIUI - UIU UIU           
UI IIIUI U                   

లలిత శృంగార సాహిత్యం (20 ) Pranjali Prabha
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

పుణ్యముకలిగేది చేసినా దానమే
పూజలు వలన కలుగు  మనసంత
ధర్మ వినయ సత్య - దేహమే సంభవం 
పుణ్య కళల పంటయే 

శక్తి కలిగి దేవి - ఈశ్వరీ ప్రార్ధనా     
చేసె శివుడు కదలక కనులంత  
పెద్దవి గను చేసి -అమ్మవారిన్ని చే     
రాక కలుగు ముక్తియే 

వెన్న మనసులోనఁ - బ్రేమయే వెన్నయా 
కన్నె మనసు - కలల కవనమయ్యె 
వన్నె లలరినట్లు - వాంఛలే పూచెఁగా 
నన్ను కనవదేల నీవు 

నేఁడు హృదయమందు - నీనృత్య మెల్లెడ 
నాడు మిపుడు - హరుస మలలవంగ 
పాడు వలపుగీతి - పల్లవిన్ వల్లకిన్ 
కూడ రజనివేళలో 

సందె వెలుఁగులోనఁ - జల్లఁగా మెల్లఁగా 
మంద పవన - మందు మనసునిండ 
కుంద కుసుమరాశి - కోమల గంధమే 
ముందు మొగముతమ్మి జూపు 

వేణు రవములందు - వెన్నుఁడే పల్కునా 
మౌన హృదయ - మలల మయమొనర్చ 
గాన లహరిలోన - గాయమ్ము లారునా 
ప్రాణ మొసఁగువాఁడు వాఁడు 

దేశ పనుల యందు - నిష్టుడై ఇష్టుడై 
కాలము పలుకు గురువు ననిపించు  
సాహసములుగాను సామరస్యముగా 
స్ఫూర్తి కరుణ లక్ష్యమే 


విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు మరియు మల్లాప్రగడ రామకృష్ణ 


భ  మా  స  భా  న  న  న  య   క్రొఞ్చపద ... 10  .. 18
UII   UUU  IIU  UII  III   III   III  IUU
నేటి కవిత్వం - క్రౌంచపద
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సర్వము సౌభాగమ్ము సమానమ్ము సమరము వినయము సమము తుల్యా
భారము భాగ్యమ్మే  సమదృష్టీ సరళము వినిమయము విషయ వాంఛా
పర్వము

నామది నిన్నేకో రి సమానా న్ని తలచినత డవున తలపులు తెల్పే
నే మనసే పంచీ మమతే నంచీ మగువ కళలు మునుగు నటుల చేసే
నే మది ఆడించే నటనే నా బతుకును ఒకవినయము నడిపించే
నే మరి నీవన్నా నను అన్నా తెలిసి మసలు కొను  వలపుల రాణీ

కాలమనే నావే కదిలే కాకుల కరుణ కలకల కరువు ఏగా
ఏలను అన్నా నాతలపే యేలిక ఇరుకున మయమగు కధ చెప్పే
పాలన లేకుండే మరి పాపాలను  కలయిక కపటము కరిగించే
చాలని తెల్పాకే సహనం చూపియు సమయ తఱచు సుఖములు రాణీ

మొహమనే దారే వినయం మత్తును కలుగు తనము మనసును వేధిం
చే హరినీ సౌందర్యమునే చూపియు మనసు మరచు విధమున సేవే
దాహము తీర్చేదే తనువే దాపరికము తెలపదు వయసును పెంచే
స్నేహము ఆహార్యమ్మును ప్రశ్నే తలపకయు మనసే కలిపిన రాణీ

--(())--



UII   UUU  IIU  UII  III   III   III  IUU

 న-గణ దండకము - 

హ-గణ దండకమువలె న-గణముతో కూడ దండకమును వ్రాయవచ్చును. న-గణములను ఎన్నైనా ఉంచి చివర ఒక గురువును చేర్చాలి ఈ దండకమునకు. ఈ దండకము వ్రాయుట కొద్దిగా కష్టమే. ఎందుకంటే పదములన్ని హ్రస్వాక్షరములుగా ఉండాలి. క్రింద నా ఉదాహరణము - 

ఇహము పరము మృతము నమృత మెపుడు నతఁడు 
పృథివి జలము దివము పవన మనల మతఁడు 
దినము రజని రవియు శశియు నుడుపు లతఁడు 
నగము జలధి వనము నగరి గృహము లతఁడు 
మెగము పులుఁగు ఝషము పురుగు మనిషి యతఁడు 
కరియు మొసలి హరియు ఫణియు హరిణ మతఁడు 
పదము పలుకు స్వరము స్వనము గతియు నతఁడు 
శ్రుతియు స్మృతియు ధృతియు కృతియు నృతియు నతఁడు 
ముదము వ్యధయు క్షుధయు సుధయు నొసఁగు నతఁడు 
వెలుఁగు విరుల విమల ఝరిగఁ దెఱచు నతఁడు 
చెలువ మలర చిలిపి నగవు నొలుకు నతఁడు 
సిరియవియని శరణనెదను హరిపదములకున్ 
 హ-గణ దండకము - 

లెక్కలేనన్ని హ-గణములతో (UI) చివర ఒక గురువును ఉంచి వ్రాసిన దండకము హ-గణ దండకము. ప్రారంభకాలములో ఇట్టి దండకములు గలవని కన్నడ కావ్యము "మదనతిలకము"లో నున్నదని వెంకటాచల శాస్త్రి గారు చెప్పారు. క్రింద నా ఉదాహరణము - 


దేవి శంఖ దండకము
IIII IIUI  -  UUI UUI  UUI UUI  (3 ) UUI IIU
       
సిరివలెఁ గనుముందు
రారమ్ము నీపాల - రత్నాల దీపాల
నీరేయి నీకోస - మీమేడ నేనుంచి
నీరాకకై యుంటి - నీవెప్పు డేతెంతు
వోరంగఁ వనితా

అరుణుఁడు సనె సందె
వేళయ్యె దీపమ్ము - వెల్గించి శంఖమ్ము
మేలై ధ్వనించంగ - మేఘారవమ్ముగా
రాగ కేళీవినోదుండు - కృష్ణుండు రంజిల్లఁ
బూరించుమా

లలితము హరిమోము
లాసమ్ము లందమ్ము - రాసమ్ము లందమ్ము
వేసమ్ము లందమ్ము - బృందమ్ము లందమ్ము
హాసమ్ము లందమ్ము - హారమ్ము లందమ్ము
నాశౌరికిన్


ఆటవెలది బేసి పాదపు ఒక ప్రత్యేకత -
UI UI III - UIU IIII
దీనినే ఇలా వ్రాద్దామా?
UI UII IIUI - UI III
ఇప్పుడిది తేటగీతి పాదమయినది. 
      

లీలావతీ - 
అశ్వగతి ఛందస్సు 
UII   UII  UII  UII  UII  U 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

కాలము నాలుక  నమ్మక నీదియు నాదియు స 
మ్మోహము తోడుగ ధీటుగా పూజలు చేసియు సం
తోషము లేకయు ఏమియు చేయక వేగము పెం 
పొందియు దాహము తీరక తాపము తగ్గక యే       

ఆకలి కాదుయు దాహము లేదియు కామముగా 
వాకిలి తెర్చియు ఆశలు చూపియు కోరికగా 
దీపము చక్కగా ఉందియు వేగము వచ్చియుక  
ల్లోలము తగ్గుట తధ్యము తాపము తగ్గుట యే  

దేహము ఉన్నను తన్మయ భావము పొందకయే 
ప్రేమలు చూపిన దగ్గర ఉన్నను కామముతో 
సేవలు చేసిన సంతస తెల్పక కోపము తో 
ఉండుట కొందరి భావము తాపము శాంతము యే     

ఏమని అన్నను  కాదని పల్కిన రోగము యే

రాకయు  ఉండక  ఉండుట ఎందుకు ఆగుటయే
యోగము రాగము కోపము  శాంతము భావములే
నాకును నీకును ఏమని చెప్పరు  ఎవ్వరులే 

No comments:

Post a Comment