Monday 23 November 2015

అబ్దుల్ కలాం జి - మీకు మా సలాం జి

ఓం శ్రీ రామ్                       ఓం శ్రీ రామ్                     ఓం శ్రీ రామ్
శ్రద్దాంజలి 
అబ్దుల్ కలాం  జి  - మీకు మా సలాం  జి


రామేస్వరం లొ  పెదవాడవై పుట్టావు 
తమిళనాడులో విద్యా ఘనుడైనావు 
భారత సాస్త్రవేక్తగా పేరుతెచ్చు కొన్నావు 
ప్రపంచ దేశాల్లో భారత పతాకాన్ని ఎగరేశావు 

భారత ప్రధమ పురుడుగా మారవు
జగతినంతా వెలుగు నిచ్చుటకు కృషి చేసావు
  ప్రస్చేక  పంధాగా అభివృద్ధికి సహకరించావు 
కొన ఊపిరి దాక దేశ భక్తిని చాటావు 

కష్టే ఫలే తొలి మార్గమని
దేశప్రగతి మరో మార్గమని   
మనసే జాగృతి అవసరమని 
 అమృత వాక్యాలు చెప్పావు మాకు 

నిజాయితీకి నిస్వార్ధతకు మారు పేరుగా
కర్తవ్యమే దీక్షగా పనిచేసిన శాస్త్రవేక్తగా 
రొదశి యాత్రకు సహకరించిన వ్యక్తిగా 
ఉన్న నీవు మమ్ము వదలిన నీకు శ్రద్దాంజలి 

సామాన్యుల కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడు పేపర్ బాయ్గా పనిచేశారు. కష్టపడి ఉన్నత చదువులు అభ్యసించారు. సైంటిస్టుగా కెరీర్ ఆరంభంచి దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నారు. దేశానికి వెలకట్టలేని సేవలు అందించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న స్వీకరించారు. దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పీఠం అధిరోహించారు. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ దాకా ఏపీజే అబ్దుల్ కలాం ప్రస్థానమిది. కోట్లాది మంది స్ఫూర్తిగా నిలిచిన అబ్దుల్ కలాం ఇకలేరు. సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 
కానీ ఆయన ఆశయాలు, కలలు ఎప్పటికీ బతికే ఉంటాయి. కలాం జీవితంలో కీలక ఘట్టాలు..

పూర్తి పేరు: ఆవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం
జననం: 1931 అక్టోబరు 15, రామేశ్వరం (తమిళనాడు)
వయసు: 84
తల్లిదండ్రులు: అషియమ్మ, జైనులబుద్దీన్

విద్య

పాఠశాల విద్య: రామనంతపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్
కాలేజీ విద్య: తిరుచిరాపల్లి సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఫిజిక్స్లో డిగ్రీ, మద్రాసులో ఏరోస్పేస్ ఇంజినీరింగ్

సైంటిస్టుగా కెరీర్

ఉద్యోగం: 1960లో డీఆర్డీఓలో సైంటిస్టుగా చేరిక
ఇస్రోతో అనుబంధం: 1969లో ఇస్రోకు బదిలీ, ఎస్ఎల్వీ-3 ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరణ.
1990 వరకు ఇస్రోలో వివిధ హోదాల్లో బాధ్యతలు, పీఎస్ఎల్వీ, ఎస్ఎల్వీ ప్రాజెక్టుల అభివృద్ధిలో కీలక పాత్ర
డీఆర్డీఓ: 1992-99 మధ్య డీఆర్డీఓ సెక్రటరీగా బాధ్యతలు
ప్రధాని సాంకేతిక సలహాదారుగా బాధ్యతలు
కలాం సారథ్యంలో ప్రోక్రాన్-2 అణుపరీక్షల నిర్వహణ

రాష్ట్రపతి పదవీకాలం: జూలై 25, 2002-జూలై 25, 2007

అవార్డు: భారతరత్న


జననం 15 అక్టోబర్ 1931 - మరణం 27 జూలై 2015


అబ్దుల్ కలాం  జి  - మీకు మా సలాం  జి


అబ్దుల్ కలాం  జి  - మీకు మా సలాం  జి
--((*))--
 

1 comment: