Sunday 1 November 2015

ప్రాంజలి ప్రభ - తెలుగు సూక్తులు

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - తెలుగు సూక్తులు

* తెలుగు సూక్తులు -1/7
1.సంకల్పంతో సత్యాన్ని సాధించడమే నిజమైన మతం
2.అంతరంగం అందంగా ఉంటే, ఆచరణ అర్ధవంతంగా ఉంటుంది.
౩. సంపద మూర్ఖులకు యజమాని, వివేకవంతులకు బానిసలాంటిది.
4. మన ప్రవర్తనే మనకు శత్రువుల్ని, మిత్రుల్ని సమకూరుస్తుంది.
.......

 ప్రాంజలి ప్రభ 

 *తెలుగు సూక్తులు-2


5. మాటకు మాట ప్రతీకారం కాదు. మౌనమే దానికి సమాధానం
6.పరిస్థితులు మనిషిని సృష్టించడం లేదు. మనిషే పరిస్థితులను సృష్టిస్తాడు.
7.ముందు చూపు లోపించినపుడే ముప్పు సంభవిస్తుంది.
8.అణుకువలేక పోతే అందం కూడా వికారం కలిగిస్తుంది.


Pranjali Prabha-3
 తెలుగు సూక్తులు
1.మనిషిని చులకన చేసేది తన గొప్పతాను చెప్పుకోవడమే.
2.అసమర్ధుని ఆఖరి అస్త్రమే హింస.
3.మంచి పనికి మించిన పూజలేదు.
4.వందవ్యర్ధ మాటల కంటే శాంతి చేకూర్చే ఒక్కమాట చాలు.

Pranjali prabha
 తెలుగు సూక్తులు
13.విజయం పొందాలను కున్నవారు, ఎన్నడూ నిరాశ చెందరు.
14.మూర్ఖుడి ప్రశంస కన్నా వివేకుడి మందలింపు మిన్న.
15. విమర్శలన్నింటిలోనికి ఉత్తమమైనది ఆత్మవిమర్శ.
16.వెంటపడేది భయం. వెంటవుండేది దైవం.
Pranjali prabha-5
 తెలుగు సూక్తులు
17. రాపిడి లేని వజ్రం ప్రకాశించదు. అలాగే, కష్టాలు లేనిదే మానవుడు పరిపూర్ణత చెందడు.
18.వికృతమైన మనసు కంటే, వికృతమైన మనిషి మంచివాడు.
19. విజయన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే అసలైన పోరాటం.
20. వివేకుడు వ్యవహార సలహాలకోసం ఎదురుచూస్తే, మూర్ఖుడు పొగడ్తల కోసం ఎదురుచూస్తాడు.

21. వివేకి తనకేమి తెలియదని, మూర్ఖుడు తనకంతా తెలుసునని అనుకుంటాడు.
22.గర్వం శత్రువులని పెంచుతుంది. మిత్రులని పారద్రోలుతుంది.
23. స్నేహం ఆనందాన్ని పెంచుకుంటుంది. విచారాన్ని పంచుకుంటుంది.
24.విజ్ఞానం ఉన్నది అని గర్వించడమంత అజ్ఞానం మరొకటి లేదు.

25.విజయం అనేది ప్రయాణమే తప్ప గమ్యం కాదు.
26.వాదనలో మహాబలమైన సాధనం మౌనం
27. కొన్ని సందర్భాలలో మాటలే వెండి, మౌనమే బంగారం.
28.తప్పు ద్రోవలో ముందుకు పరుగెత్తుటకంటే, మంచిదారిలో వెనక్కి నడవడమే ఉత్తమం.

29.నీడను చూసి భయపడకూడదు. దగ్గరలో వెలుతురుంటేనే నీడపడుతుంది.
30.ఎలా నిరీక్షించాలో తెలియడం విజయానికి నాంది.
31. కష్టాలు బలహీనుని పడగొడతాయి. బలవంతుడిని అభివృద్ధి చేస్తాయి.
32.తప్పుని సమర్ధిస్తే, రెండు తప్పులవుతాయి.

౩౩. ధనాన్ని వదిలివేసినవాడు జోగి, ధనాశను వదిలివేసినవాడు యోగి.
34. మనిషి ఎలాంటివాడో తెలుసుకోవాలంటే అతనికి అధికారం ఇవ్వాలి.
35.ఒక్కసారి మోసపోతే అది మన తప్పుకాదు. రెండోసారి మోసపోతే అది మనతప్పు.
36. సుఖం మళ్ళీ మళ్ళీ కావలి అనుకోవడమే దు:ఖం

37.జీవితం నిరాడంబరంగాను ఆశయం ఉత్తమంగాను ఉండాలి.
38. తనలో లోపాలే లేవనుకునే లోపానికి మించిన లోపం మరోకటి లేదు.
39. మాట ఇవ్వడానికి తొందరపడకూడదు. ఇచ్చిన మాటను నెరవేర్చడానికి వెనకాడకూడదు.
40.దీర్ఘజీవితం కంటే దివ్యజీవితం గొప్పది.

41.మంచివాళ్ళకు లోకంలో పాపం కనిపించదు.
42.ఆధ్యాత్మిక పవిత్రతే సత్యం.
43.మానవుడి మహోత్కృష్టమైన లక్ష్యం భగవంతుడు.
44.పవిత్రమైన నిజాయితీని వదలనంతవరకు దు:ఖం దరిచేరదు.

45. ప్రశ్నలేమి అడగకుండా ఇతరులకు తోడ్పడడమే యోగం.
46. అజ్ఞానమనే ప్రవర్తన ఎప్పుడూ మార్పును కోరుకుంటుంది.
47.పగతీరితే అప్పటికి మాత్రమే తృప్తి. ఓర్పువలన ఎప్పటికి తృప్తి.
48. నమ్మకం, ఓర్పు, ఆధ్యాత్మిక కవలలు.

49.శరీరం ఒకరధం అయితే, ఇంద్రియాలు సారధి, గుర్రాలు బుద్ధి. ఇవి ఏవియు సహకరించకపోతే గమ్యాన్ని చేరుకోలేము.
50.అపవిత్రమైన మనస్సుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్ని చేసినా వృధా.
51. అర్హతకు మించిన కోరికలు ఆనందాన్ని దూరం చేస్తాయి.
52.మంచివారు దూరం కావడం, చెడ్డవారు దగ్గరకావడమే దు:ఖానికి నిదర్శనం.

53.భక్తి మనసులో నిలుపుకొనేదేకాని, బహిర్గతం చేసేదికాదు.
54.ఎక్కువగా మాట్లాడేవారిలో వాక్శుద్ధి, జ్ఞానశక్తి నశిస్తాయి
55.పుణ్యకార్యాలేవె చేయకుండా పుణ్యం కావాలి అనుకోవడం మూర్ఖతే అవుతుంది.
56.మనస్సు,మాట, క్రియ, అన్నీ ఒకటిగా ఉన్నప్పుడే ధర్మాన్ని, సత్యాన్ని, పాటించినట్లు అవుతుంది.

57. ధనం మనుషుల్ని సృష్టించదు. మనుషులే ధనాన్ని సృష్టిస్తారు.
58. మంచి గుణాలున్న వారిని చిన్నదోషం వున్నంత మాత్రాన విడిచి పెట్టరాదు.
59. భగవంతుడు అన్నిచోట్ల ఉన్నప్పటికిని మానవరూపంలోనే గ్రహించగలము.
60. సర్వే జనా సుఖినోభవంతు 

 
మరికొన్ని సామెతలు



1.అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
2.అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
3.అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

5.అనువు గాని చోట అధికులమనరాదు
6.అభ్యాసం కూసు విద్య
7.అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
8.అయితే ఆదివారం కాకుంటే సోమవారం

9.ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
10.ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
11.ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
12.ఇంట గెలిచి రచ్చ గెలువు

13.ఇల్లు పీకి పందిరేసినట్టు
14.ఎనుబోతు మీద వాన కురిసినట్టు
15.చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
16.కందకు లేని దురద కత్తిపీటకెందుకు

17.కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు
18.కుక్క కాటుకు చెప్పుదెబ్బ
19.కోటి విద్యలూ కూటి కొరకే
20.నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

21.పిచ్చుకపైబ్రహ్మాస్త్రం
22.పిట్ట కొంచెం కూత ఘనం
23.రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
24.వాన రాకడ ప్రాణపోకడఎవరి కెరుక

25.కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
26.మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
27.ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
28.ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

29.ఆది లొనే హంస పాదు
30.ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టేమహా వృక్షము
31.ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
32.ఆకాశానికి హద్దే లేదు

33.ఆలస్యం  అమృతం విషం
34.ఆరే దీపానికి వెలుగు యెక్కువ
35.ఆరోగ్యమే మహాభాగ్యము
36.ఆవులింతకు అన్న ఉన్నాడు కానితుమ్ముకు తమ్ముడు లేడంట

37.ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
38.అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
39.అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
40.అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు

41.ఏ ఎండకుఆ గొడుగు
42.అగ్నికి వాయువు తోడైనట్లు
43.ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
44.అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట

45.అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
46.అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
47.అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
48.అప్పు చేసి పప్పు కూడు

49.అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
50.అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
51.బతికుంటే బలుసాకు తినవచ్చు
52.భక్తి లేని పూజ పత్రి చేటు

53.బూడిదలో పోసిన పన్నీరు
54.చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే యేడుస్తాడు
55.చాప కింద నీరులా
56.చచ్చినవాని కండ్లు చారెడు





57.చదివేస్తేఉన్నమతి పోయినట్లు
58.విద్య లేని వాడువింత పశువు
59.చేతకానమ్మకేచేష్టలు ఎక్కువ
60.చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

61.చక్కనమ్మ చిక్కినా అందమే
62.చెడపకురా చెడేవు
63.చీకటి కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్ళు
64.చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ

65.చింత చచ్చినా పులుపు చావ లేదు
66.చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ వంకర టింకరవి 
మి కాయలని అడిగిందట
67.చిలికి చిలికిగాలివాన అయినట్లు
68.డబ్బుకు లోకం దాసోహం

69.దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
70.దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
71.దాసుని తప్పు  డంతో సరి
72.దెయ్యాలువేదాలు పలికినట్లు

73.దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
74.దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
75.దొంగకు తేలు కుట్టినట్లు
76.దూరపు కొండలు నునుపు

77.దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
78.దురాశ దుఃఖమునకు చెటు
79.ఈతకు మించిన లోతే లేదు
80.ఎవరికి వారే యమునా తీరే

81.ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
82.గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి
గాడిద మూర్ఛ పోయిందంట
83.గాజుల బేరం భోజనానికి సరి
84.గంతకు తగ్గ బొంత

85.గతి లేనమ్మకు గంజే పానకం
86గోరు చుట్టు మీద రోకలి పోటు
87.గొంతెమ్మ కోరికలు
88.గుడ్డి కన్నామెల్ల మేలు

89.గుడ్డి యెద్దు చేలో పడినట్లు
90.గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
91.గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
92.గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు

93.గుడ్ల మీద కోడిపెట్ట వలే
94.గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
95.గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
96.గురువుకు పంగనామాలు పెట్టినట్లు

97.తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
98.ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
99.ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
100. ఇంటికన్న గుడి పదిలం

101.ఇసుక తక్కెడ పేడ తక్కెడ
102.జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
103.కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
104.కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు

105.కాకి ముక్కుకు దొండ పండు
106.కాకి పి ల్ల కాకికి ముద్దు
107.కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
108.కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా

109.కాసుంటే మార్గముంటుంది
110.కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
111.కలకాలపు దొంగఏదో ఒకనాడు దొరుకును
112.కలిమి లేములుకావడి కుండలు

113.కలిసి వచ్చే కాలం వస్తే,నడిచి వచ్చే కొడుకు పుడతాడు
114.కంచేచేను మేసినట్లు
115.కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
116.కందకుకత్తి పీట లోకువ

117.కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
118.కీడెంచిమేలెంచమన్నారు
119.కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
120.కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

121.కొండ తవ్విఎలుకను పట్టినట్లు
122.కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా
123.కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
124.కూటికి పేదైతే కులానికి పేదా

125.కొరివితో తల గోక్కున్నట్లే
126.కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
127.కొత్తొక వింత పాతొక రోత
128.కోటిి విద్యలు కూటి కొరకే

129.కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
130.కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
131.కృషితోనాస్తి దుర్భిక్షం
132.క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము

133.కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
134.కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
135.ఉన్న లోభి కంటే లేని దాత నయం
136.లోగుట్టు పెరుమాళ్ళకెరుక

137.మెరిసేదంతా బంగారం కాదు
138.మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
139.నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
140.మంది యెక్కువయితే  మజ్జిగ పలచన అయినట్లు

141.మనిషి మర్మము.. మాను చేవ...బయటకు తెలియవు
142.మనిషి పేద అయితే  మాటకు పేదా
143.మనిషికి మాటే అలంకారం
144.మనిషికొక మాట పశువుకొక దెబ్బ

145.మనిషికొక తెగులు  మహిలో వేమా అన్నారు
146.మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
147.మీ బోడి సంపాదనకు ఇద్దరు పెళ్ళాలా
148.మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

149.మొక్కై వంగనిది మానై వంగునా
150.మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు
151.మొసేవానికి తెలుసు కావడి బరువు
152.ముల్లును ముల్లుతోనే తీయాలి  వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

153.ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
154.ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
155.ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
156.నడమంత్రపు సిరి నరాల మీద పుండు

157.నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో
నీ మాటలో అంతే నిజం ఉంది
158.నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
159.నవ్వు నాలుగు విధాలా చేటు
160.నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

161.నిదానమే ప్రధానము
162.నిజంనిప్పు లాంటిది
163.నిమ్మకు నీరెత్తినట్లు
164.నిండు కుండ తొణకదు

165.నిప్పు ముట్టనిదే చేయి కాలదు
166.నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
166.నూరు గుర్రాలకు అధికారయినా భార్యకు యెండు పూరి
167.ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
168.ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

169.ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
170.బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
171.ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
172.ఊరు మొహం గోడలు చెపుతాయి

173.పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
174.పాము కాళ్ళు పామునకెరుక
175.పానకంలో పుడక
176.పాపని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

177పచ్చ కామెర్లు వచ్చిన వాడికి  లోకమంతా పచ్చగా కనపడినట్లు
178పండిత పుత్రః పరమశుంఠః
179.పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
180.పరిగెత్తి పాలు తాగే కంటేనిలబడి నీళ్ళు తాగడం మేలు

181.పట్టి పట్టి పంగనామం పెడితే గోడ చాటుకు వెళ్ళి రిపేసుకున్నాడట
182.పెదవి దాటితే పృథ్వి దాటుతుంది
183.పెళ్ళంటే నూరేళ్ళ పంట
184.పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

185.పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట
186.పెరుగు తోట కూరలో పెరుగు యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
187.పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
188.పిచ్చోడి చేతిలో రాయిలా

189.పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
190.పిల్లికిలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
191.పిండి కొద్దీ రొట్టె
192.పిట్ట కొంచెము కూత ఘనము

193.పోరు నష్టము పొందు లాభము
194.పోరాని చోట్లకు పోతే  రారాని మాటలు రాకపోవు
195.పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట
196.పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

197.పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
198.రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
199.రామాయణంలో పిడకల వేట
200.రామాయణం అంతా వినిరాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు

201.రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
202.రెడ్డి వచ్చే మొదలాడు అన్నట్టు
203.రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
204.రౌతు కొద్దీ గుర్రము

205.ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
206.చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
207.సంతొషమే సగం బలం
208.సిగ్గు విడిస్తే శ్రీరంగమే

209.సింగడు అద్దంకి పోనూ పొయ్యాడు రానూ వచ్చాడు
210.శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు
211.శుభం పలకరా వెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!
212.శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది

213.తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచిందట
214.తాడి తన్ను వాని తల తన్నేవాడు ఉంటాడు
215.తాళిబొట్టు బలం వల్ల తలంబ్రాల వరకు బతికాడు
216.తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు

217.తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయి
218.తాతకు దగ్గులు నేర్పినట్టు
219.తేలుకు పెత్తనమిస్తే  తెల్లవార్లూ కుట్టిందట
220.తన కోపమే తన శత్రువు

221.తన్ను మాలిన ధర్మము బతుకుచేటు
222.మొదలు చెడ్డ బేరము  అసలుకు మోసం
223.తంతే గారెల బుట్టలో పడ్డట్లు
224.తప్పులు వెదికే వాడు తండ్రి ఒప్పులు వెదికేది తల్లి

225.తీగ లాగితే డొంక అంతా కదిలినట్లు
226.తెగేదాక లాగవద్దు
227.తిక్కలోడు తిరణాళ్ళకు వెళితే  ఎక్కా దిగా సరిపొయిందంట
228.తినే ముందు రుచి అడుగకు చూసే ముందు కథ అడుగకు

229.తినగా తినగా గారెలు చేదు
230.తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి
231.తియ్యటి తేనె నిండిన నోటితోనే తేనెటీగ కుట్టేది
232.ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదు

233.ఉపకారానికి పోతే అపకారమెదురైనట్లు
234.ఉరుము ఉరుమి ఉరుమి మంగళం మీద పడ్డట్టు
235.ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కినట్టు
236.వాపును చూసి బలము అనుకున్నాడట

No comments:

Post a Comment