Thursday 9 June 2022


నేటి స్పందన పద్యాలు 



  *నిష్కపటమైన గురువును సమీపించుట  

4. సూత ఉవాచ
ద్వైపాయనసఖస్త్వేవం మైత్రేయో భగవాంస్తథా
ప్రాహేదం విదురం ప్రీత ఆన్వీక్షిక్యాం ప్రచోదితః

శౌంకౌడు సూతున్ని అడిగితే, సూతుడు విదుర మైత్రేయ సంవాదాన్ని మళ్ళి చెప్పాడు. భగవానుడైన మైత్రేయుడిని విదురుడు పరమతత్వాన్ని చెప్పమని ప్రేరేపిస్తే ఇలా చెప్పాడు
***
94-ఉపనిషత్ సూక్తి 🧘‍♀️
అభయం సర్వభూతేభ్యో నమేభీతిః కదాచన||

(ప్రాణాగ్ని హోత్రోపనిషత్)

-నేను సమస్త ప్రాణులకును అభయమును ఇచ్చుచున్నాను. నాకు ఎల్లప్పుడును భయములేదు. నావలన ఏప్రాణికిని భయము కలుగక యుండును గాక!
***

ఒక వ్యక్తి సమాజంలో ఏ హోదాలో ఉన్నప్పటికీ తోటివారిలోని లోపాలను తొలగించి వారిని చక్కదిద్దటానికి తోడ్పడేవాడే మానవ జాతికి నిజమైన ఉపకారి అవుతాడు.
**
జాగృతి : స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు

నిద్రిస్తున్న ఆత్మను తట్టి లేపండి. అది స్వస్వరూపంతో మేల్కొనడాన్ని చూడండి. మత్తు వదలి, పూర్తి మెలకువతో అది పని చేయడం మొదలుపెట్టిన మరుక్షణం అపరిమితమైన శక్తి సామర్థ్యాలు, తేజస్సు, పవిత్రతలూ మనసులో పెల్లుబుకుతాయి. సాటిలేని మేటి లక్షణాలన్నీ మన సొంతమవుతాయి.
**
ॐ卐సుభాషితమ్ॐ

శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం

29) అర్థమనర్థం భావయ నిత్యం నాస్తితతః సుఖలేశః సత్యమ్|

పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః ||

అర్థమే(ధనము) అనర్థమని ఎల్లప్పుడూ భావించుము.నిజంగా డబ్బు వలన సుఖం లేదు.ఇది సత్యము. ధనవంతుడు పుత్రుని నుండి కూడా భయపడును.ఇదే అంతటా ఉన్నరీతి.

లోకా స్సమస్తా: స్సుఖినోభవన్తు!
***

***నాస్తి వేదాత్ పరం శాస్త్రం నాస్తి మాతుః పరో గురుః ౹

     నాస్తి దానాత్ పరం మిత్రం ఇహలోకే పరత్ర చ ౹౹


వేదముకన్నా శ్రేష్టమనిపించే శాస్త్రం ఈ లోకములో లేక పరలోకములో ఏది లేదు.ఏజ్,తల్లికన్నా ఉన్నతమైనది ఏది లేదు.అలాగే దానంకన్నా మిన్నగా ఏ మిత్రులు ఉండరు.

___((()))___

 *🧘‍♂️1)-మనాచీ శ్లోకములు🧘‍♀️*

 *1వ శ్లోకం:-*

*1.  గణాధీశ! జో ఈశ సర్వాం గుణాంచా*

     *ముళారంభ ఆరంభ తో నిర్గుణాచా|*

     *నమూం శారదా మూళ చత్వార వాచా*

     *గమూం పంథ ఆనంత యా రాఘవాచా శ్రీరాం*   

*-అనంతమగు శ్రీ రామతత్వమును తెలిసుకొనుటకై సర్వసద్గుణములకును ఆధీశుడగు శ్రీగణపతి దేవునకు, నిర్గుణ తత్వ మూలాధారమగుచు పరా,పశ్యంతీ,మధ్యమా,వైఖరీ వాక్కులకును ఆధారభూతయగు శారదా దేవికిని నమస్కరించుచున్నాను.*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జూన్ 9._*

*సంపద హరించిపోతుంది. సౌందర్యం అంతరిస్తుంది. ప్రాణం ఎగిరిపోతుంది. శక్తులు ఉడిగిపోతాయి. కాని భగవంతుడు నిత్యుడు.*

*ఆధ్యాత్మికతయే భారతదేశానికి,భారత జాతికి పునాది.ఈ ఆధ్యాత్మికత అనేది పటిష్టంగా ఉంటే భౌతికంగా,రాజకీయంగా, సామాజికంగా,‌ఎన్ని లోటుపాట్లున్నా అన్నీ సమసిపోతాయి.* 

*-స్వామి వివేకానంద*

*🧘‍♂️అమృతం గమయ🧘‍♀️*

*ప్రతి ఒక్కరిలో సానుకూలతలను చూసినప్పుడు మీరు సుఖంగా జీవిస్తారు మరియు మీ జీవితం అద్భుతంగా మారుతుంది - సత్ చిత్.*

*🧘‍♂️శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘‍♀️*

 *21వ శ్లోకం:-*

*బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైస్సరోమోద్గమై:*

*కంఠేన స్వర గద్గ దేన నయనే నోద్గీర్ణ బాష్పాంబునా!*

*నిత్యం త్వచ్చరణార విందయుగళ ధ్యానామృయాస్వాదినాం*

*అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం!!* 

*భావం:-*

*ఓ పుండరీకాక్ష! నీకై మొగిడ్చిన దోసిలి, వంగిన శిరస్సు, గగుర్పొడిచిన యవయవములు, గద్గదస్వరము గల కంఠము, కన్నీటితో నిండు కన్నులు కలిగి ఎల్లప్పుడూ నీ పాదారవింద ధ్యానామృతమును ఆస్వాదించుచునే మా జీవితమంతయు సాగునట్లు అనుగ్రహింపుము.*

 *ఓం నమః శివాయ*:


: *శ్రీ అన్నమాచార్య సంకీర్తన*

విన్నవించితిమి నీకు వేడుకవేళ

కన్నెను నీవు దయఁ గాచేటివేళ!!

॥పల్లవి॥

మచ్చికలు దయివారె మనసెల్ల జైవారె

వచ్చె జవ్వనానకు వసంతవేళ

చొచ్చి నిన్నుఁ బాసి తాపసూర్యుఁ డెండగాయఁగా

విచ్చనవిడిగాఁ దోఁచె వేసగివేళ!!

॥విన్న॥

సిగ్గులు మొలవఁజొచ్చె చెమటలేరులు హెచ్చె

కగ్గులేక మించె వానకాలపువేళ

వెగ్గళించి సెలవుల వెన్నెలలు చూపట్టి

వొగ్గి శరత్కాలము వొదిగె నీవేళ!!

॥విన్న॥

తత్తరపుచలి పొంచె తలపోఁతమంచు మించె

యెత్తి యలమేల్మంగకు హేమంతవేళ

బత్తితో శ్రీవేంకటేశ పైకొని కూడితి విట్టె

చిత్తజుకాఁకలు దేరె సిసిరవేళ!!

॥విన్న॥

--

 స్వామి ఈ సంతోష సమయమున నీకు విన్నపము చేసుకొంటిమి. ఇదే నీవు ఆ కన్యామణిని దయచూచువేళ ఇంకా నిర్లక్ష్యం చేయుట తగదు ప్రభూ ఇది వసంతవేళ. చనువులు అతిశయించినవి మనసెల్లా పులకరించినది. ఆమె యౌవనమునకు కూడా ఆమని వచ్చినది.

నిన్ను విడిచిన తాపమును తాళలేక సూర్యుడు విపరీతమైన ఎండలు కాయగా విచ్చలవిడిగా వేసంగి తన ప్రతాపము చూపింది. యువతలకు చెమటలు ఏరులై పారినవి సిగ్గులు మొలకలెత్తినవి. అటువంటి వానాకాలము ఏ లోపము లేక అతిశయించినది. కొంచెము వానలు తగ్గుమొగం పట్టగానే శరదృతువు వచ్చిచేరినది. పండువెన్నెల కన్నులపండుగ చేస్తుంది.

 అతిశయించి మొలకవెన్నెలలు కుదురుకొన్నవి. ఇంతలో చలికాలం ముంచుకొచ్చేసింది. అంటే హేమంత బుతువు వచ్చేసింది. ఆ త్వరపాటు కలిగిస్తున్నది. ఆలోచనలలో కూడా మంచు కురిసి చల్లబడినవి.

అలమేల్మంగమ్మ అధిక్యముతో మించినది. ఇక శ్రీవేంకటేశ్వరుని కోసం ఎదురు చూచిన ఆమె అమితభక్తితో ఆయనకు వశమైనది. శ్రీవేంకటేశ పైకొని నీవామెను కూడితివి. ఇక ఆ శిశిర బుతువు నందు మన్మథుడు తన వేడిమినంత చూపి తపింపచేస్తున్నాడు అంటు అన్నమయ్య కీర్తించాడు.

-- 

*🧘‍♂️381) యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️* 

*స్థితి ప్రకరణము*  

*రెండవ అధ్యాయము*

*దామ వ్యాళ కటోపాఖ్యానము*

2-94

కుతో జాతేయమితి తే రామ మాస్తు విచారణా

ఇమాం కథమహం హన్మీత్యేషా తేఽస్తు విచారణా. 

ఓ రామచంద్రా! “ఈ అవిద్య యెచటినుండి పుట్టినది?” అను విచారణ నీకు వలదు. “దీని నెట్లు నశింపజేయుదును?” అను విచారణయే నీకుండుగాక! 

2-95

స్వసంకల్పిత తన్మాత్రజ్వాలాఽభ్యన్తరవర్తి చ 

పరాం వివశతామేతి శృఙ్ఖలాబద్ధ సింహవత్‌.

మనస్సు స్వసంకల్పిత శబ్దాది విషయములను అగ్నిజ్వాలల మధ్య నున్నదై గొలుసుచే కట్టబడిన సింహమువలె గొప్ప అవ్యవస్థను బొందుచున్నది. 

2-96

ఉహ్యమానమనాస్థాబ్ధౌ మనోవిషయవిద్రుతమ్‌ ఉద్ధరామరసంకాశ మాతఙ్గమివ కర్దమాత్‌.  

దేవతుల్యుఁడవగు ఓ రామచంద్రా! తత్త్వజ్ఞాన, తత్సాధనాదులందు అనాదరమను సముద్రమునఁ గొట్టుకొని పోవుచున్నదియు, విషయములందు నిమగ్నమై యున్నదియునగు ఈ మనస్సును - బురదనుండి ఏనుగునువలె పైకి లేవదీయుము. 

(ఉద్ధరింపుము)

----



No comments:

Post a Comment