Wednesday 8 June 2022

***


*...ఆనంద లాశ్యాలు.. అనురాగ రాగాలు

అనుబంధ భావాలు ...అక్షర సత్యాలు

మనసంస్కృతీ కళ ...మనసున వికసించు

చిన్నతనంలోనె..చిన్మయ దీపాలు


కంద పద్యం

*...చండ ప్రచండ భానుడు

మండుచు మాన్యత ను చూపు మనసే మమతై

దండిపరాక్రమ దాతడు

మండల భాస్కరుని కళలు మనుగడ కొరకే

*....అల్పానుమపి వస్తూనాం సంహతిః  కార్యసాధికా౹     

 తైణైర్గుణత్వ మాపన్నయైర్బ  థ్యంతేమత్త దంతినః౹౹

అల్పమైన వస్తువులుకూడా ఒక్కటైనపుడు ఎటువంటి కష్టమైన పని అయినా సాధిస్తాయి.అలాగే,గడ్డిపోచలను ఒక్కటిగా చేర్చి అల్లిన తాడు మదమెక్కిన ఏనుగును కూడా బంధిస్తుంది.

*...అప్పుగొని సేయు విభవము,

 ముప్పున బ్రాయంబు టాలు, మూర్ఖుని తపమున్,

 దప్పరయని నృపు రాజ్యము,

 దెప్పరయై మీద గీడు దెచ్చుర సుమ్మీ!!

 *          *          *          *          * 

అప్పు చేసి ఆడంబరంగా ఉండడం, ముసలితనంలో పడుచు పెళ్ళాం, అజ్ఞాని తపస్సు, చేసిన నేరాన్ని సరిగా విచారించకుండానే శిక్షలు విధించే రాజ్యం, భరింపలేనివై మున్ముందు ప్రమాదాన్ని తెస్తాయి.

****

*ప్రాణా యథాత్మనోఽభీష్టా*  *భూతానామపి తే తథా।*

*ఆత్మౌపమ్యేన భూతానాం*  *దయాం కుర్వన్తి సాధవః॥*

*తాత్పర్యం:-*

*ప్రతి వారికి తమ ప్రాణములు ఏ విధంగా ప్రియమైనవో, ఆ విధంగానే ఇతర జీవులకు వాటి ప్రాణములు కూడా ప్రియమయినవే. అందువల్ల సాధు సజ్జనులు తమ వలెనే అన్య జీవులను భావించి కరుణను చూపుతారు.*

*ఒకే ఆలోచనను (పనిని) చేపట్టండి. దానినే మీ జీవితంగా మలచుకోండి. దానినే తలపోయండి, దానినే కలగనండి. దానిమీదే జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలో ప్రతిభాగం, అదే ఆలోచనతో నిండి పోనివ్వండి. దాన్నితప్ప మిగిలిన ప్రతి ఒక్క ఆలోచనను విడిచిపెట్టండి. విజయానికి దారి ఇదే! ఈ పద్ధతి ద్వారానే గొప్పగొప్ప మహాత్ములైన సత్పురుషులు తయారయ్యారు. మిగిలినవాళ్ళందరూ వట్టి చిలక పలుకుల యంత్రాలే!*

*నిద్రిస్తున్న ఆత్మను తట్టి లేపండి. అది స్వస్వరూపంతో మేల్కొనడాన్ని చూడండి. మత్తు వదలి, పూర్తి మెలకువతో అది పని చేయడం మొదలుపెట్టిన మరుక్షణం అపరిమితమైన శక్తి సామర్థ్యాలు, తేజస్సు, పవిత్రతలూ మనసులో పెల్లుబుకుతాయి. సాటిలేని మేటి లక్షణాలన్నీ మన సొంతమవుతాయి.*

*🧘‍♂శాంతి /Peace🧘‍♀*

*మీతో మీరు నిజాయితీగా ఉండండి. ప్రపంచం మీ పట్ల నిజాయితీగా ఉండదు. ప్రపంచం కపటాన్ని ప్రేమిస్తుంది. మీతో మీరు నిజాయితీగా ఉన్నప్పుడు ఆంతరిక శాంతికి మార్గాన్ని కనుగొంటారు.*

*🧘‍♂️అమృతం గమయ🧘‍♀️*

*మీరు ఆనందంగా ఉన్నారా లేదా అనే దాని గురించి చింతిస్తూ గడిపే సమయమంతా మీరు బాధలో కూరుకుపోయిన సమయమే - సత్ చిత్.*

:

*బ్రహ్మా హా హేమ హారే చ సురాపో గురు తల్పగః |* 

*మహా పాతకి నో హేత్తౌ తత్సం సర్గీచ పంచమః ||*

                - దేవీ భాగవతం 11-15 

*భావం:-* 

 *బ్రాహ్మణుడిని చంపడం, బంగారాన్ని దొంగిలించడం, సురాపానం చేయడం, గురువు భార్యని అనుభవించడం అనే ఈ నాలుగూ మహాపాతకాలు. అయిదోది, ఇటువంటి పాపాలని చేసే వాళ్ళతో స్నేహం చేయడం.*

*🧘‍♂️88-కర్మ - జన్మ🧘‍♀️*

 *8 వ ఆధ్యాయం - "కర్మ మర్మం"*

 ప్రమాదాలు మంచికీ జరుగుతూంటాయి. రైలింజను చెడిపోయి వార్ధా రైల్లే స్టేషన్ లో ఆ రైలు ఆగిపోయింది. రైలు దిగి ఆకలితో ఫ్లాట్ ఫాం మీద ఓ కుర్రాడు పచార్లు చేస్తున్నాడు. అతని దగ్గరకి గంధం బొట్టు పెట్టుకున్న ఒకతను వచ్చి తనింటికి భోజనానికి పిలిచాడు.

ఫర్లాంగు దూరంలో కనిపించే ఆయనింటికి అతను, అతని మిత్రుడు కలిసి వెళ్ళారు. ఆమెకి ఏడో నెల. ఆమె భర్త రొట్టెలని ఒత్తి చేస్తూంటే ఆమె కొడుకు ఆ ఇద్దరికీ వడ్డించాడు.

 ఇరవై రెండేళ్ళ తర్వాత ఆ యువకుడు అదే రూట్ లో రైల్లో వెళ్తూంటే, అతను ఎక్కిన రైలు మళ్ళీ వార్ధా స్టేషన్లోనే పాడైంది. రైలు దిగి పచార్లు చేస్తూంటే, తనకి భోజనం పెట్టినతను గుర్తొచ్చి వెంటనే అతను స్టేషన్లోంచి కనిపించే ఆయనింటికి వెళ్ళాడు. ఆయనకి తనని పరిచయం చేసుకున్నాడు. అతని కొడుకుతో చెప్పాడు.

 "అప్పుడు నీ వయసు నాలుగేళ్ళు.”

 మాటల్లో ఆయనకి మూత్ర పిండాల్లో రాళ్ళు చేరాయని, ఆపరేషన్ చేయించుకోడానికి సరిపడే డబ్బు లేదని తెలిసింది. ఆ యువకుడికి కూడా ఉద్యోగం లేదు.

 కలెక్టరైన ఆ ఒకనాటి అతిథి ఆయనకి ప్రభుత్వ హాస్పిటల్ లో ఉచిత చికిత్సకి వెంటనే ఏర్పాటు చేసి, ఆ యువకుడికి వార్థాలో ఓ ఉద్యోగాన్ని కూడా ఇప్పించాడు. 

!!! రెండోసారి రైలింజను మళ్ళీ అక్కడే ఎందుకు చెడిపోయింది?!!!!

*దుష్టులతో సంపర్కం లేకుండా ప్రమాదాల్లో చిక్కుకోమా?* 

 ఏ టెర్రరిస్ట్ దాడిలోనో అమాయకులు కష్టాన్ని అనుభవించారనుకుందాం. అప్పుడు తాము గతంలో చేసిన సంచితం లేదా అగామిలలో నిలువ ఉన్న పాపాలని ఈ అనుభవం రద్దు చేసేస్తుంది.

అవి ఇంకా ప్రారబ్ధ కర్మగా మారక ముందే ఇప్పుడు ఈ కష్టాన్ని ముందే అనుభవించడం ద్వారా అవి భస్మం అవుతాయి. అంతే తప్ప నిష్కారణంగా కర్మ చేయని ఎవరూ దాని ఫలితాన్ని అనుభవించరు.

అంటే ప్రారబ్దంలో లేకపోయినా, సంచితం లేదా అగామిల్లో కర్మ ఉంటేనే ఆ దాడిలో వారు చిక్కుకుని తమ కర్మ ఫలాలనే ఎవరైనా అనుభవించేది. మనం ప్రమాదంలో మరణించినా లేదా గాయ పడ్డా అందుకు కారణం మన పూర్వకృత పాపమే అవుతుంది.

దీన్ని గురించి ఓ ఋషి చెప్పిన మాటలివి. 

*ఏకః పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజనః* 

*భోక్తారో విప్రముచ్యన్తే కర్తా దోషేణ లిప్యతే*

*భావం:-*

*ఒకడు చేసిన పాప కర్మ వల్ల అనేక మంది దాని ఫలాలని అనుభవించినప్పుడు, అలా అనుభవించిన వారు తాము ఇదివరకు చేసిన పాప ఫలాలనించి విడివడతారు. కాని ఆ పాపపు పనిచేసిన ఆ ఒక్కడికీ మాత్రం ఆ పాప కర్మ అంటుకుంటుంది.*

(తరువాత భాగంలో -  *కష్టసుఖాలు - నవగ్రహాలు*)

- శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ఆరవశతకం)*

672) శ్లోకము :-

ఉతాహో! తన్వంగ్యాం  భృగుకుల విధాత్య్రాం పితృగిరా 

తనూజేన  చ్ఛిన్నే శిరసి భయాలోకాక్షినలినే!


న్యధా స్తేజో భీమం నిజ మయి యదక్షుద్ర మనఘం 

తదాహు  స్త్వా  మమ్బ! ప్రథిత చరితే కృత్తశిరసమ్!!  672

భావము:-

తల్లీ ! ఓ ఉమాదేవి!  తండ్రి ఆజ్ఞ ప్రకారము పరశురాముడు భృగు వంశ విధాత్రి, అనగా మూల కర్త జమదగ్ని భార్య , తల్లి అగు రేణుకా దేవిని తన పరశువుతో  ఖండించు నప్పుడు,

ఆ రేణుక దేవి అందు ఉత్తమము, పవిత్రము, ఉగ్రము అగు నీ తేజస్సును ప్రవేశింప చేసితివి. 

కనుకనే  ఆమె  బ్రతక గలిగెను.  అందుచే కూడ నిన్ను చ్ఛిన్న మస్తక అని పిలుతురు.

673) శ్లోకము :-

హుతం ధారాజ్వాలా జటిల చటులే శస్త్రదహనే 

తపస్విన్యాః కాయం భగవతి! యదాంబ! త్వమవిశః!


తదా తస్యాః కంఠ ప్రగలదసృజః కృత్తశిరసః 

కబంధేన ప్రాప్తో భువన వినుతః  కోఽపి మహిమా!!  673

భావము:-

తల్లీ ! ఓ ఉమాదేవి! పరశురాముని సాంద్రము , జటిలము, శ్రీఘ్రము, ప్రచలము అగు పరశువు నుండి   అవిచ్ఛిన్న రక్తధార కారగా అగ్ని జ్వాల ధారచే హోమము చేయునట్లుండెను. ఖండించబడు రేణుకాదేవి దేహమున చ్ఛిన్న మస్తకవైన నీవు ఆవేశించినందు వలన, ఆమె కంఠము విడివడిన మొండెము నుండి బయటకు విరజిమ్ము చున్న రక్తము నీ మహిమ పొంది ఉండ వచ్చును.

సూచన: -

చ్ఛిన్నమస్తక అవతారమున  దేవి తన కుడి చేతి కత్తితో 

కంఠమును తెగనరికికొని  తన ఎడమ చేతిలో శిరస్సు పట్టుకొనును.


మొండెము నుండి మూడు ధారలుగా

రక్తము పైకి చిమ్ముచుండును.

మధ్య ధార ఆమె చేతిలోని శిరసులో పడుచుండును.

మిగిలిన రెండు ధారలను ఆమె చెలికత్తెలు స్వీకరింతురు.


🕉🌞🌎🌙🌟🚩

380) యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️* 

*స్థితి ప్రకరణము*  

*రెండవ అధ్యాయము*

*దామ వ్యాళ కటోపాఖ్యానము*

2-91

తజ్జ్ఞస్య సంకటే చ ముదితైవ కేవలం జ్యోత్స్నేవ 

భువనభావం అలంకరోతి యేన చిత్తాదృతే తు జ్ఞః కుర్వన్నప్యకర్తా సంపన్నో మనసోఽలేపకత్వాత్‌. 

జ్ఞాని సంకటమందును ఆనందముగనే యుండుచు కేవలము చంద్రకాంతివలె లోకమును శోభింపజేయుచుండును. ఏలయనగా చిత్తముకంటె వేఱుగ సుఖదుఃఖములు లేవు. జ్ఞానియే చిత్తముకంటె వేఱుగ నుండి దానికి అంటక యుండును, కాబట్టియే అతడు కార్యముల జేసినను అకర్తయే యగుచున్నాడు. 

2-92

న బంధోఽస్తి న మోక్షోఽస్తి నాబంధోఽస్తి న బంధనమ్‌ అప్రబోధాదిదం దుఃఖం ప్రబోధాత్ప్రవిలీయతే.  

యథార్థముగ బంధము గాని, మోక్షము గాని లేదు. బంధకారణమున్ను లేదు. అజ్ఞానమువలననే దుఃఖము గల్గుచున్నది. జ్ఞానముచే అదియంతయు నశించుచున్నది. 

2-93

ఆశామఞ్జరితాకృతిం విఫలితం దుఃఖాదిభిర్దారుణై

ర్భోగైః పల్లవితం జరాకుసుమితం తృష్ణాలతాభాసురమ్‌ 

సంసారాభిధవృక్షమాత్మనిగడం ఛిత్వా వివేకాసినా 

ముక్తస్త్వం విహరేహ వారణపతిః స్తమ్భాదివోన్మోచితః. 

ఓ రామచంద్రా! ఆశలను చిగిర్చిన లేతకొమ్మలతో గూడినదియు, భయంకర దుఃఖాదులను వివిధ ఫలములు గలిగినదియు, భోగములను చిగుళ్ళచే నొప్పునదియు, వార్ధక్యమను పుష్పము గలదియు, తృష్ణయను తీగలచే ప్రకాశవంత మైనదియు, ఆత్మకు బంధన స్థాన మైనదియు నగు సంసారమను వృక్షమును వివేకమను ఖడ్గముచే ఛేదించి బంధవిముక్తుడవై, కట్టుకంబము నుండి విడివడిన గజేంద్రమువలె ఈ ప్రపంచమున విహరింపుము.

🕉️🌞🌏🌙🌟🚩

: *శ్రీమన్నారాయణీయము*                     *దశమ స్కంధము 71వ దశకము - కేశి, వ్యోమాసురుల వధ - 71 - 3 & 4 - శ్లోకములు*

తార్ క్ష్యార్పితాంఘ్రేస్తవ తార్ క్ష్య ఏష చిక్షేప వక్షోభువి నామపాదమ్।

భృగోః పదాఘాతకథాం నిశమ్య స్వేనాపి శక్యం తదితీవ మోహాత్॥

3వ భావము :-

భగవాన్! రాక్షసుడగు ఆ కేశి - గరుడునిపై నిలుపు నీ పాదములను - తనకాళ్ళతో త్రొక్కుటకు యత్నించి, అది అసాధ్యమగుటతో -

ప్రభూ! భృగుమహర్షి తనపాదముతో నీ వక్షస్థలమును తాకెనని వినియుండెనో ఏమో!, ఆ దురాత్ముడగు కేశి తన ఎడమకాలితో నీ వక్షస్థలమును బలముగా తాక

71-4

ప్రవంచయన్నస్య ఖురాంచలం ద్రాగముం చ చిక్షేపిథ దూరదూరమ్।

స మూర్ఛితో౾పి హ్యాతిమూర్చితేన క్రోధోష్మణా ఖాదితుమాద్రుతస్త్వామ్॥

4వ భావము :-

భగవాన్! నీవు ఆ రాక్షసుడు - అశ్వరూపుడు అగు 'కేశి' కాలితాపులనుండి - వడివడిగా తప్పించుకొనుచు - అతనిని ప్రతిఘటించుచు - తటాలున అతని కాళ్ళను పట్టుకొని బలముగా - దూరముగా విసరివేసితివి.

 దానితో ఆ రాక్షసుడు మూర్చిల్లి - ఆపైన తేరుకొని - మరల ఆగ్రహావేశముతో నీపైకివచ్చి నిన్ను ఎదుర్కొనెను.

........


No comments:

Post a Comment