Sunday 6 March 2022

మార్చి నెల రెండవ వారం 08-03-2022 నుండి 14-03-2022





IInd part.   మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభోదయము

శ్రీరాముడు-యోగ తత్వ రహస్యము ( కధా వచనము )


శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము కర్కాటక లగ్నము నందు, భరతుడు చైత్ర శుద్ధ దశమి పుష్యమి నక్షత్రము మీన లగ్నము నందు, లక్ష్మణ, శత్రఘ్నులు చైత్ర శుద్ధ దశమి ఆశ్లేష నక్షత్రము కర్కాటక లగ్నము నందును జన్మించిరి. వారి వారి జనన కాలము నందు రవి, కుజ, గురు, శుక్ర, శనులు ఉచ్చ దశలలో యుండిరి. జ్యోతిషశాస్త్ర ప్రమాణము ప్రకారము శ్రీరాముడు లోకనాయకుడు అనగా జగత్ప్రభువుగా, తక్కిన వారు జగత్ప్రసిద్ధులైరి.


సర్వే వేదవిదః శూరాః సర్వే లోక హితే రతాః
సర్వే జ్ఞానోప సంపన్నాః సర్వే సముదితా గుణైః   1 18  24

ఆ రాజకుమారులు వేదశాస్త్రములను అభ్యసించిరి. ధనుర్విద్య యందు ప్రావీణ్యము సంపాదించిరి. యుక్త వయస్కులైన తన పుత్రుల వివాహ విషయమై దశరథ మహారాజు ఆలోచించుచుండగా విశ్వామిత్ర మహర్షి వచ్చి యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముని పంప వలసినదిగా కోరతాడు. ఆ కోరిక విని దశరథ మహారాజు విశ్వామిత్రునితో ..
ఊన షోడశ వర్షో మే రామో రాజీవ లోచనః
న యుద్ధ యోగ్యతామ్ అస్య పశ్యామి సహ రాక్షసైః  1 20 2

రాముడు పదుహారు సంవత్సరముల ప్రాయము వాడు, క్రూర రాక్షసులతో యుద్ధము చేయలేడు. ఇక్కడ వాల్మీకి తన కావ్యములో శ్రీరాముడు జననము తర్వాత వారు పదునారు సంవత్సరముల ప్రాయములో సకల విద్యా పారంగతులైరి అని చెప్పెను. తరువాత శ్రీరాముని వైరాగ్యము, వసిష్ఠ మహర్షి చెప్పిన ఆత్మ విజ్ఞానము మనకు వాల్మీకి రామాయణములో కానరాదు. అది యోగ తత్వము నందు యున్నది  గావున గమనించ గలరు. 

రావణుడు అమోఘమైన తపఃసంపన్నుడు. అట్టి రావణుని సంహరించుటకు రావణుని మించిన తపఃశక్తిని  పొంది యుండవలెను.


వేదము - సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము - అని మూడు భాగాలు. ఆరణ్యకంలో వివిధ తపస్సులు క్రింది విధంగా పేర్కొనబడినవి:

"ఋతం తపః, సత్యం తపః, శ్రుతం తపః, శాంతం తపః, దమస్తపః, శమస్తపః, దానం తపః, యఙ్ఞం తపః, భూర్భువస్వుర్బ్రహ్మై తదుపాస్య తపః.
1. ఋతము = సూన్రుత భాషణము - వాక్కుతో సత్యము పలుకుట, 
2. సత్యము = త్రికాలలో - భూత-భవిష్యత్-వర్తమానాలలో - ఉండేది. యథార్థ వస్తు చింతనం చేయటం. సత్యం ఙ్ఞానం అనంతం బ్రహ్మ (తైత్తిరీయోపనిషత్తు), 
3. శ్రుతము = వేదాధ్యయనము, 
4. శాంతము = శాంతముగా నుండుట (ఓర్పు), 
5. దమము = ఇంద్రియ నిగ్రహము, 
6. శమము = కామక్రోధాదులు లేకుండుట, 
7. దానము = బ్రహ్మార్పణముగా ఇతరులకు ఇచ్చుట, 
8. యఙ్ఞము = దేవతారాధన. ఇవేకాకుండా బ్రహ్మను (అంటే సర్వమూ తానే అయి, సర్వత్రా, సర్వకాలములలో ఉండేవాడు) ఉపాసించుట కూడ తపస్సే. యఙ్ఞములు పలు రకాలు. వాటిలో తపోయఙ్ఞం ఒకటి. అదే ఆ పైన చెప్పబడినదియే యఙ్ఞం తపః.
శ్రీమద్భగవద్గీతలో శ్రీ క్రుష్ణ భగవానుడు ఐదు రకాలైన యఙ్ఞ భేదములను ఇట్లా వివరించాడు.

ద్రవ్య యఙ్ఞాస్తపోయఙ్ఞా, యోగ యఙ్ఞాస్తధాపరే|
స్వాధ్యాయ ఙ్ఞానయఙ్ఞాశ్చ, యతయః సంశితవ్రతాః||
(ఙ్ఞానయోగము: 4-28)

వాటిలో తపస్సు కూడా ఒక యజ్ఞమే. ఈ మాదిరి పుణ్య కార్యాలు, తపస్సులు చేస్తే దైవారాధన వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. మహర్షులు, సాధు పురుషులు తమ స్వార్థం కోసంగాక, లోక క్షేమం కోరి తపస్సు చేస్తారు. కామక్రోధాలను, రాగద్వేషాలను దరిజేరనీయక, జితేంద్రియులై, సత్వ గుణ ప్రధానులై త్రికరణ శుద్ధితో తపస్సు చేస్తారు. అట్టి తపోధనుల తపస్సంపద లోక కళ్యాణానికి దారి తీస్తుంది. శ్రీరాముడు లోకకళ్యాణార్థమై తపస్సు చేస్తాడు.
రామాయణము జాగ్రత్తగా మొదటి నుంచి చివర వరకు గమనించితే శ్రీరాముడు సాధించిన ఇట్టి తపః ప్రభావములు గనపడును. మానవుని పురోభివృద్ధి ఎలా యుండవలెనో/సాగవలెనో రామాయణము కాండల రూపములో శ్రీరాముని పాత్ర ద్వారా వాల్మీకి వివరించారు. 

ఉదాహరణకు బాలకాండములో శ్రీరాముడు గురుకులంలో విద్యాభ్యాసము, వసిష్ఠ మహర్షి వద్ద ఆత్మ జ్ఞానము, విశ్వామిత్రుని వద్ద అట్టి విద్యను సత్యధర్మములనే ఆయుధములుగా అభ్యాసము (ప్రాక్టీస్) చేసినాడు. అయోధ్యాకాండములో భరతునికి రాజ ధర్మమును బోధించుట ద్వారా ఆచార్యుడు (గురువు) గా దర్శనము చేసినాడు. అనగా తాను చదువుకున్నది అభ్యాసము చేసినవాడే సరియైన గురుస్థానమును పొందగలుగును. జాబాలి నాస్తిక వాదాన్ని ఖండించుట ద్వారా వేద ప్రమాణాన్ని నిలబెట్టాడు. (ఆది శంకరాచార్యులు ఇటులనే ప్రాచుర్యములో యున్న నాస్తిక వాదమైన బౌద్ధమును ఖండించడము గమనించ వచ్చు). అరణ్య కాండలో అసురభావములను నాశనము చేసి సత్య ధర్మములను ప్రతిష్టించవలెనని తన నడవడిక ద్వారా చాటెను. కిష్కిందా కాండలో అట్టి అసుర భావములను నాశనము చేయుటకు మిత్రుని తోడ్పాటు కూడా అవసరమని గ్రహించి సుగ్రీవునితో స్నేహము చేసినాడు. Finally యుద్ధ కాండలో దుష్ట సంహారం చేసినాడు.

ఈ విధముగా మానవుడు అభ్యుదయము పొందవలెనన్న పరిణామ క్రమము ఎలా ఉండవలెనో శ్రీరాముని పాత్ర ద్వారా మనకు వాల్మీకి అవగతము చేసినారు.
రేపటి నుంచి సుందర కాండలో హనుమ స్వరూపమును విహంగ వీక్షణము చేయుటకు ప్రయత్నిద్దాము.

శ్రీరామ జయరామ జయజయ రామ
ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - 
ఓం శ్రీ రామ - ఓం  శ్రీ రామ - ఓం శ్రీ రామ - 
ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - 

--(())--
*శక్తియే ఆది దైవం- ఆది పరాశక్తి*

*హైందవ పురాణాల ప్రకారం సర్వశక్తి మంతురాలైన దేవత. పరబ్రహ్మ స్వరూపం. శాక్తేయంలో ఆది పరాశక్తే పరమసత్య స్వరూపంగా గుర్తింపబడింది. దేవి భాగవత పురాణములో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు, వినాశకారి ఆది పరాశక్తే అని సూచించబడింది.*


 *🧘‍♀️ఆది పరాశక్తి🧘‍♀️*


*ఆది పరశక్తి, దేవీ, మాత, పరబ్రహ్మ, విశ్వ మాత నివాసం మేరు పర్వతం, కైలాస పర్వతం , వైకుంఠం. మంత్రం...ఐం హ్రీం క్లీం- ఆయుధములు సకల ఆయుధములు, అవతారాలు..*


*సతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి తండ్రి సతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి తల్లి సతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి రాజవంశం సతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి తరువాతి వారు సతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి అంతకు ముందు వారు సతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి.*


*సాక్షాత్ పరమశివుని స్త్రీ రూపమే శక్తి.*

*శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి శూన్యబిందు, అనగా దివ్యమైన శూన్య స్త్రీ శక్తి. ఈ శక్తి యొక్క సార్వత్రిక ఆత్మ (పురుషుడు), ప్రకృతి శక్తికి జన్మించిన అంశములు. దుర్గా దేవి ఆది పరాశక్తి యొక్క సమీప రూపాంతరము. ఆది పరాశక్తి యొక్క మానవ రూపమే శక్తికి, సౌందర్యానికి దేవత అయిన దుర్గా దేవి.*


 *దుర్గా దేవి సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మూడూ కలసిన ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము. అయితే, అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆది పరాశక్తి రూపం లేనిదీ, నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా ఉంది. ఈ వాదన ప్రకారం ఆది పరాశక్తి ఒక దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్యము.*


*ఆదిమ శక్తి తనే కావటం మూలాన ఇతర దేవతలకి కూడా తనే మూలము. కావున ఆది పరాశక్తే అఖండ సత్యం. ఈ శక్తి దానికై అదే సంపూర్ణం. ఆది పరాశక్తి భర్త లేనిది. కానీ ఈ జగత్తుకి శివుడిని ఆహ్వానించటానికి తాను స్త్రీ రూపంలో జన్మనెత్తినది.*


*హిందూ మతంలో ఆది పరాశక్తి అనగా ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి. స్త్రీ యొక్క సృజనాత్మక శక్తికి దైవత్వాన్ని ఆపాదించే ఒక భావన. భూభాగం పై ఆది పరాశక్తి ప్రాథమికంగా ఫలవంతమైన స్త్రీ స్వరూపంలో అవతరించిననూ పురుషావతారంలోనూ ఆ శక్తి నిగూఢంగా దాగి ఉంది.*


*సృష్టికే కాక, సకల మార్పులకీ కూడా శక్తే మూలం. శక్తే దైవత్వానికి ఉనికి. శక్తే విముక్తి. మానసిక, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే శక్తి యొక్క రూపాంతరమైన కుండలిని శక్తికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ ఆధారం అవసరం లేకుండా, స్వతంత్రంగా ఉండటంలోనూ, సమస్త సృష్టిపై ఆధారితమై ఉండటంలోనూ శక్తే కీలకం.*


*శక్తి ఆరాధన లోనూ శైవము లోనూ ఆది పరాశక్తి సర్వశక్తి మంతురాలిగా పూజించ బడుతోంది. సాక్షాత్ పరమశివుడి స్త్రీ రూపమే ఆది పరాశక్తిగా, ఈ రూపమే మహాదేవిగా, పార్వతీ దేవిగా గుర్తింపబడుతుంది.*


*శక్తియే ఆది దైవం. ఆది పరాశక్తిని అంటే భువనేశ్వరి  సకల చరాచర సృష్టి ఆమెకే స్వంతం,తానే అఖండ సత్యం. స్త్రీ రూపంలో తాను చలనశీల శక్తి, పురుష రూపంలో అచలన శక్తి. ఆ యొక్క శక్తితో ఈ సృష్టిని త్రిమూర్తులు ముగ్గురు పాలిస్తారు. అఖండ సత్యం యొక్క పురుష రూపాలు త్రిమూర్తులు కాగా,  స్త్రీ రూపాలు ఆది శక్తి. ఆది శక్తి రూపరహితం. సర్వానికి అతీతం. అన్ని దైవ శక్తులు తన లోనే ఇమిడి ఉన్నాయి ఆమె  శాశ్వతమైన, అపరిమిత శక్తి.*


*బ్రహ్మాను ఈ విశ్వానికి సృష్టికర్త గా నియమించి జ్ఞానానికి, సంగీతానికి గుర్తింపబడే శక్తి లోని రూపాంతరము శారదా దేవి (సరస్వతి) గా బ్రహ్మకు భార్య బ్రహ్మదేవుడు  భార్య తో కలసి ఈ విశ్వాన్ని సృష్టించే కార్యం చేస్తున్నారు.*


*విష్ణువును ఎదురులేని, మరణం లేని ఆత్మ. అమ్మవారి మాయ స్వరూపం రూపం లేకున్ననూ రూపాన్ని పొందుతాడు. భౌతిక రూపాన్ని పొందే దేవతలందరికీ విష్ణువే అధిపతి. ఈ విశ్వాన్ని సంరక్షించే బాధ్యత విష్ణువు దే ఈ సృష్టిలో జీవాలని రక్షించటానికి  వివిధ రూపాంతరాలని చెందుతాడు. విష్ణువు నాభి నుండి బ్రహ్మని సృష్టించారూ.  బ్రహ్మ ఇతర దేవదేవతలని సృష్టిస్తాడు. యోగమాయ (ఆదిశక్తి)  అంతర్భాగమైన  మహాకాళి విష్ణువు యొక్క యోగ నిద్ర నుండి అవతరించినది. విష్ణు  పరమాత్మ వెలుగుకి ప్రతిరూపమైన, ఆదిశక్తి యొక్క మరొక రూపాంతరము శ్రీదేవి విష్ణువు భార్య. జీవం ఉద్భవించే సమయానికి ఈ విశ్వాన్ని పరిశీలించే, పరిరక్షించే బాధ్యతలని నిర్వర్తించే ది మహావిష్ణువు.*


*రుద్రుడు మూర్తీభవించిన కాలగతికి చిహ్నం అయినది. శివుడు రూపంలో లేనపుడు కాలం స్థంభిస్తుంది. అది శక్తియొక్క శక్తితో శివునిలో చలనము కలుగుతుంది. ఈ శక్తి ద్వారానే విశ్వ వినాశనానికి, దాని పునర్నిర్మాణానికి కారకుడు అవుతాడు. మహాశక్తిని అయిన ఆది శక్తి శివుని కి భార్య. లక్ష్మీ సరస్వతి కూడా ఆదిశక్తి లోని రూపాంతరాలు. ఆమె పరిపూర్ణ రూపం మహా శక్తి. శివుడు  ధ్యాన శక్తి వలన ఆది శక్తి యొక్క అన్ని రూపాంతరాలని మించిపోతారు. అప్పుడే ఆది శక్తి శివుని  ఎడమ భాగం నుండి అవతరించింది.*


*దేవీ భాగవత పురాణం ప్రకారం బీజ మంత్రమైన "క్లీం"ని జపిస్తూ శివుడు ఆదిశక్తి పై దృష్టి కేంద్రీకరించి వేల యేళ్ళ కొలదీ ధ్యానం చేసాడు. శివుడి ఎడమ భాగం నుండి సిద్ధిధాత్రిగా రూపాంతరం చెంది శివుడికి ఆది శక్తి ప్రత్యక్షమైనది. అందానికి, శక్తికీ దేవత అయిన పార్వతి ఆది శక్తి యొక్క సగుణ స్వరూపమని (మానవ రూపం) తెలుపబడింది. సత్వ, రజో, తమో గుణములు కలిగిన పార్వతీ దేవి, ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము.*


*శక్తి దేని పైనా ఆధారపడకున్ననూ, ఈ అనంత విశ్వం సర్వం శక్తి పైనే ఆధారపడి ఉంది. ఈ విశ్వం వినాశనమైపోయిననూ శక్తి మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. కృష్ణశక్తి సృష్టి వినాశనానికి నాంది కాగా, శూన్య శక్తి సృష్టి పునర్నిర్మాణానికి నాంది. వినాశనానికి తర్వాత, పునఃసృష్టికి ముందు చైతన్యంగా ఉండే శక్తిని పవిత్ర శక్తి (Sacred Energy, Zero Energy) లేదా మహోన్నత మేధస్సు (Supreme Intelligence) అని అంటారు. దేవీ భాగవత పురాణం, చతుర్వేదాలు కాళినిని కాలంతో బాటు ముందుకు తీసుకువెళ్ళి నాశనం చేసే కృష్ణశక్తితో పోలుస్తాయి. లలితా దేవి అండపిండబ్రహ్మాండాన్ని సృష్టించటం, అది విస్ఫోటం చెందుట, తర్వాతి కాలంలో ఈ విస్ఫోటమే విశ్వంగా అవతరించే ప్రక్రియ విఙ్ఞాన శాస్త్రంలో మహా విస్ఫోటంకి పోలికలు ఉన్నాయి. అంటే, ఆది శక్తియే శూన్య శక్తి, పవిత్ర శక్తి, మహోన్నత మేధస్సు అని అర్థం.*


*సకల జీవాలలోనూ దైవము అచేతన రూపంలోనూ, చేతన రూపంలోనూ ఉంది. దైవం యొక్క అచేతనాంశం పరమాత్మ కాగా, చేతనాంశం ఆది పరాశక్తి. మనుష్యులలోని ఈ చేతన శక్తినే కుండలినీ శక్తి అని అంటారు. జీవకోటి యొక్క సకల కార్యకలాపాలకు ఈ కుండలినీ శక్తియే ప్రాథమిక మూలం. మన నిత్యకృత్యాలలో ఈ శక్తి నిగూఢంగా ఉంది. ధ్యానం ద్వారా కుండలినీ శక్తిని జాగృతం చేయటం వలన అదృష్టం వరించటమే కాక, భావోద్రేకాల నియంత్రణపై పట్టు కూడా సాధించవచ్చును.*


*అతి సూక్ష్మ కీటకం నుండి అతి విశాల విష్ణు స్వరూపం వరకు శక్తియే సర్వాంతర్యామిగా వ్యాపించి ఉన్నది. కృష్ణుడు, శివుడు శక్తిమంతులయితే వారికంటే ముందే ఉనికి గల, వారిలో అస్థిత్వం కల సర్వ శక్తియే వారిని శక్తిమంతులుగా చేస్తుంది. కావున శివుడు, విష్ణువు ఇరువురూ సృష్టికి ఆద్యులు కారు. శక్తియే ఆదిమం. మనం చేసే ఆరాధన, మన నిత్యకృత్యాలన్నీ శక్తితోనే సాధ్యం. శక్తి లేనిదే సృష్టి, సంరక్షణ , వినాశనాలు లేవు. ఆత్మని శరీరంలోనికి ప్రవేశపెట్టాలన్నా, ఈ రెంటినీ కాపాడుకోవాలన్నా లేదా ఆత్మ శరీరాన్ని విడివడిపోవాలన్నా, శక్తి అవసరం. కుండలినీ శక్తిని వేరు చేసినచో శివుడంతటి వాడు కూడా శవంతోనే సమానం.*


*ఆది పరాశక్తి భౌతిక శక్తి, విద్యా శక్తి, మాయా శక్తిగా తనని తాను విభజించుకొని అవతారములు ఎత్తినది. దైవ క్రమాన్ని నడిపించే నవగ్రహాలు భౌతిక శక్తి నుండి, దశావతారాలలో ఒకటైన కాళి విద్యా శక్తి నుండి వెలువడినవి. మాయా శక్తి నుండి యోగమాయ, మహామాయ, మాయలు అవతరించి, జీవులని భ్రాంతుల నుండి రక్షించి పరమాత్మ వైపు నడిపించేలా చూస్తుంది.*


*దుర్గాశక్తి నుండి విభజించబడిన నవదుర్గలు నవగ్రహాలకి దిశానిర్దేశం చేయటామే కాక వాటికి శక్తిని కూడా ప్రసాదిస్తుంది.*

*ఆది పరాశక్తి*

*శ్రీమద్ దేవీ భాగవత పురాణంలో త్రిమూర్తులకు దేవి యొక్క ఆజ్ఞలు మరియు సూచనలు ఇవ్వబడ్డాయి.*


*శక్తి, తన గురించి - "నేను ఆది పరాశక్తిని. భువనేశ్వరిని. సకల చరాచర సృష్టి నా స్వంతం. అఖండ సత్యాన్ని. స్త్రీ రూపంలో నేను చలనశీల శక్తిని, పురుష రూపంలో అచలన శక్తిని. నా యొక్క శక్తితో ఈ సృష్టిని మీ ముగ్గురు పాలిస్తారు. అఖండ సత్యం యొక్క పురుష రూపాలు మీరు ముగ్గురు కాగా, దాని స్త్రీ రూపాన్ని నేనే. నేను రూపరహితం. సర్వానికి అతీతం. అన్ని దైవ శక్తులు నాలోనే ఇమిడి ఉన్నాయి. నేను శాశ్వతమైన, అపరిమిత శక్తిని."*


*బ్రహ్మతో - "ఓ బ్రహ్మా! ఈ విశ్వానికి సృష్టికర్త నీవే. జ్ఞానానికి, సంగీతానికి గుర్తింపబడే నా రూపాంతరము శారదా దేవి (సరస్వతి) నీ భార్య. నీ భార్య తో కలసి ఈ విశ్వాన్ని సృష్టింపుము."*


*విష్ణువుతో - "ఓ నారాయణా! నీవు ఎదురులేని, మరణం లేని ఆత్మవి. నీకు రూపం లేకున్ననూ రూపాన్ని పొందుతావు. భౌతిక రూపాన్ని పొందే దేవతలందరికీ నీవే అధిపతివి. ఈ విశ్వాన్ని సంరక్షించే బాధ్యత నీదే. ఈ సృష్టిలో జీవాలని రక్షించటానికి నీవు వివిధ రూపాంతరాలని చెందుతావు. నీవు బ్రహ్మని సృష్టించావు. బ్రహ్మ ఇతర దేవదేవతలని సృష్టిస్తాడు. నా యొక్క అంతర్భాగమైన శక్తి అయిన మహాకాళి నీ యొక్క యోగ నిద్ర నుండి అవతరించినది. నీవే పరమాత్మవి. వెలుగుకి ప్రతిరూపమైన, నా మరొక రూపాంతరము శ్రీ నీ భార్య. జీవం ఉద్భవించే సమయానికి ఈ విశ్వాన్ని పరిశీలించే, పరిరక్షించే బాధ్యతలని నిర్వర్తించే విష్ణువు యొక్క రూపాన్ని నీవు పొందుతావు."*


*శివునితో - "ఓ రుద్రా! మూర్తీభవించిన నీ రూపం, కాలగతికి చిహ్నం. నీవు రూపంలో లేనపుడు కాలం స్థంభిస్తుంది. నా యొక్క శక్తితో నీలో చలనము కలుగుతుంది. ఈ శక్తి ద్వారానే విశ్వ వినాశనానికి, దాని పునర్నిర్మాణానికి కారకుడవు అవుతావు. మహాశక్తిని అయిన నేనే నీ భార్యను. లక్ష్మీ సరస్వతులు కేవలం నాలోని భాగాలు. నా రూపాంతరాలు. నా పరిపూర్ణ రూపం మహా శక్తి. నీ ధ్యాన శక్తి వలన నా యొక్క అన్ని రూపాంతరాలని నీవు మించిపోతావు. అప్పుడే నేను నీ ఎడమ భాగం నుండి నేను అవతరిస్తాను.   దేవీ భాగవత పురాణం ప్రకారం బీజ మంత్రమైన "క్లీం"ని జపిస్తూ శివుడు ఆదిశక్తి పై దృష్టి కేంద్రీకరించి వేల యేళ్ళ కొలదీ ధ్యానం చేసాడు. శివుడి ఎడమ భాగం నుండి సిద్ధిధాత్రిగా రూపాంతరం చెంది శివుడికి ఆది శక్తి ప్రత్యక్షమైనది. అందానికి, శక్తికీ దేవత అయిన పార్వతి ఆది శక్తి యొక్క సగుణ స్వరూపమని (మానవ రూపం) తెలుపబడింది.*


 *సత్వ, రజో, తమో గుణములు కలిగిన పార్వతీ దేవి, ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము. ఆధునిక వైఙ్ఞానికావిష్కరణలలో శక్తి యొక్క భావము, పురాణాలలోనిదే. శక్తి దేని పైనా ఆధారపడకున్ననూ,ఈ అనంత విశ్వం సర్వం శక్తి పైనే ఆధారపడి ఉంది.*


*ఈ విశ్వం వినాశనమైపోయిననూ శక్తి మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. కృష్ణశక్తి సృష్టి వినాశనానికి నాంది కాగా, శూన్య శక్తి సృష్టి పునర్నిర్మాణానికి నాంది. వినాశనానికి తర్వాత, పునః సృష్టికి ముందు చైతన్యంగా ఉండే శక్తిని పవిత్ర శక్తి (Sacred Energy, Zero Energy) లేదా మహోన్నత మేధస్సు (Supreme Intelligence) అని అంటారు. దేవీ భాగవత పురాణం మరియు చతుర్వేదాలు కాళినిని కాలంతో బాటు ముందుకు తీసుకువెళ్ళి నాశనం చేసే కృష్ణశక్తితో పోలుస్తాయి.*
 

*శ్రీ లలితా దేవి అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించటం, అది విస్ఫోటం చెందుట, తర్వాతి కాలంలో ఈ విస్ఫోటమే విశ్వంగా అవతరించే ప్రక్రియ విఙ్ఞాన శాస్త్రంలో మహా విస్ఫోటంకి పోలికలు ఉన్నాయి. అంటే, ఆది శక్తియే శూన్య శక్తి, పవిత్ర శక్తి, మహోన్నత మేధస్సు అని అర్థం.*
        

  *సకల జీవాలలోనూ దైవము అచేతన రూపంలోనూ, చేతన రూపంలోనూ ఉంది. దైవం యొక్క అచేతనాంశం పరమాత్మ కాగా, చేతనాంశం ఆది పరాశక్తి. మనుష్యులలోని ఈ చేతన శక్తినే కుండలినీ శక్తి అని అంటారు. జీవకోటి యొక్క సకల కార్యకలాపాలకు ఈ కుండలినీ శక్తియే ప్రాథమిక మూలం. మన నిత్య కృత్యాలలో ఈ శక్తి నిగూఢంగా ఉంది. ధ్యానం ద్వారా కుండలినీ శక్తిని జాగృతం చేయటం వలన అదృష్టం వరించటమే కాక, భావోద్రేకాల నియంత్రణపై పట్టు కూడా సాధించవచ్చును.*
 

*దేవీ పురాణంలో ఇలా వ్రాయబడినది: మునులు, మహామునులు అందరూ కృష్ణుని వద్ద పురాణాలని తెలుసుకొన్న సుతుడిని శక్తిని గురించిన పలు సందేహాలను నివృత్తి చేయమని కోరారు.*


*శివ పురాణం, విష్ణు పురాణం వంటి వాటిలో త్రిమూర్తులే శాశ్వతమని, బ్రహ్మాండాన్ని మించినది లేదనీ, త్రిమూర్తులందరూ ఒక్కరేననీ, ఒక్కరే త్రిమూర్తుల రూపాలని తెలియజేయడమైనది. మరి మీరు ప్రస్తావించే ఆది పరాశక్తి ఎవరు? తాను ఎప్పుడు ఎలా జన్మించినది? మాకు అర్థమయ్యేలా తెలియచెప్పండి.         అని విన్నవించుకొన్నారు.సుతుడు ఇలా సమాధానం ఇచ్చాడు.*


*ఈ ప్రశ్నలకి సమాధానం ఎవ్వరూ ఇవ్వలేరు. బ్రహ్మ, నారద మహర్షుల వంటి గొప్ప వారినే ఈ ప్రశ్నలు అయోమయానికి గురి చేస్తాయి. శ్రీ మహావిష్ణువే సకల శక్తులు కలిగినవాడు, సర్వాంతర్యామి అని కొందరు భావించి అతనిని పూజిస్తారు. మరి కొందరు అర్థ నారీశ్వరుడే గొప్పవాడు అని అంటారు.*
 

*వేదాలలో సూర్యుడే పరమాత్మ కావటం వలన సూర్యుడిని ఆరాధించటమే ఉత్తమం అని తెలుపబడినది. కొందరు బ్రాహ్మణులు అవగాహన, హేతువు మరియు వేద మంత్రాలను వీటికి ఆధారాలుగా చూపితే మరికొందరు పోలిక, పరిస్థితులు, సత్యశోధన, సూత్రాలు మరియు సాక్ష్యాలని ఆధారంగా చూపారు. కానీ పరమాత్మ, సృష్టి మూలాల గురించి తెలుసుకొనటానికి ఈ ఆధారాలు ఏ మాత్రం ఉపయోగపడవని వేదాంతం తెలుపుతుంది. అయితే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అందరూ శక్తిని మాత్రం స్మరిస్తున్నారు.*


 *అతి సూక్ష్మ కీటకం నుండి అతి విశాల విష్ణు స్వరూపం వరకు శక్తియే సర్వాంతర్యామిగా వ్యాపించి ఉన్నది. కృష్ణుడు, శివుడు శక్తిమంతులయితే వారికంటే ముందే ఉనికి గల, వారిలో అస్థిత్వం కల సర్వ శక్తియే వారిని శక్తిమంతులుగా చేస్తుంది. కావున శివుడు, విష్ణువు ఇరువురూ సృష్టికి ఆద్యులు కారు. శక్తియే ఆదిమం. మనం చేసే ఆరాధన, మన నిత్యకృత్యాలన్నీ శక్తితోనే సాధ్యం. శక్తి లేనిదే సృష్టి, సంరక్షణ మరియు వినాశనాలు లేవు. ఆత్మని శరీరంలోనికి ప్రవేశపెట్టాలన్నా, ఈ రెంటినీ కాపాడుకోవాలన్నా లేదా ఆత్మ శరీరాన్ని విడివడిపోవాలన్నా, శక్తి అవసరం. కుండలినీ శక్తిని వేరు చేసినచో శివుడంతటి వాడు కూడా శవంతోనే సమానం.*


      *ఆది శక్తి నవగ్రహాలని అన్నింటినీ నియంత్రిస్తుంది. ఆది పరాశక్తి భౌతిక శక్తి, విద్యా శక్తి మరియు మాయా శక్తిగా తనని తాను విభజించుకొని అవతారములు ఎత్తినది. దైవ క్రమాన్ని నడిపించే నవగ్రహాలు భౌతిక శక్తి నుండి, దశావతారాలలో ఒకటైన కాళి విద్యా శక్తి నుండి వెలువడినవి. మాయా శక్తి నుండి యోగమాయ, మహామాయ, మాయలు అవతరించి, జీవులని భ్రాంతుల నుండి రక్షించి పరమాత్మ వైపు నడిపించేలా చూస్తుంది.*


*దుర్గాశక్తి నుండి విభజించబడిన నవదుర్గలు నవగ్రహాలకి దిశానిర్దేశం చేయటామే కాక వాటికి శక్తిని కూడా ప్రసాదిస్తుంది.*


*సూర్యుడు - కూష్మాండ శక్తి,*

*రాహువు - మహాగౌరి,*

*శని - కాళరాత్రి,*

*కేతువు - సిద్ధిధాత్రి,*

*బృహస్పతి - కాత్యాయిని,*

*మంగళ - బ్రహ్మచారిణి,*

*చంద్రుడు - శైలపుత్రి,*

*బుధుడు - స్కంద మాత,*

*శుక్రుడు - చంద్రఘంట.*

*నవరాత్రులు నవగ్రహాలని పూజించినచో చెడు ప్రభావాలని దూరం చేస్తుంది.    శ్రీ దేవీ భాగవత పురాణం ప్రకారం విద్యా శక్తి మరల 10 భాగాలుగా విడిపోతుంది. వీటినే జ్ఞాన దేవలతలందురు. తంత్రాల దశావతారాలకి ఈ దేవతలే మూలాలు.*


*మత్స్యావతారం - ధూమవతి,*
*కూర్మావతారం - బగళాముఖి,*
*వరాహావతారం - భైరవి,*
*నరసింహావతారం - ఛిన్న మస్తా,*
*వామనావతారం - త్రిపురసుందరి,*
*పరశురామావతారం - మాతంగి,*
*రామావతారం - తార,*
*కృష్ణావతారం - కాళి,*
*బుద్ధావతరం - కమలా,*
*కల్కి అవతారం - భువనేశ్వరి.*


  *మాయాశక్తిగా జీవకోటి (ఉపదేవతల, జీవాల మరియు భూతాల)తో సాహచర్యము.*
 

*ఆదిశక్తి తనని తాను యోగమాయ, మహామాయ మరియు మాయగా విభజించుకొన్నది. యొగమాయ మహామాయని, మహామాయ మాయని నియంత్రిస్తాయి.*


*ఆది పరాశక్తి  హైందవ పురాణాల ప్రకారం సర్వశక్తిమంతురాలైన దేవత. పరబ్రహ్మ స్వరూపం. శాక్తేయంలో ఆది పరాశక్తే పరమసత్య స్వరూపంగా గుర్తింపబడింది. దేవి భాగవత పురాణములో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు మరియు వినాశకారి ఆది పరాశక్తే అని సూచించబడింది. శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి శూన్యబిందు, అనగా దివ్యమైన శూన్య స్త్రీ శక్తి.*


*ఈ శక్తి యొక్క సార్వత్రిక ఆత్మ (పురుషుడు) మరియు ప్రకృతి శక్తికి జన్మించిన అంశములు. దుర్గా దేవి ఆది పరాశక్తి యొక్క సమీప రూపాంతరము. ఆది పరాశక్తి యొక్క మానవ రూపమే శక్తికి, సౌందర్యానికి దేవత అయిన దుర్గా దేవి. దుర్గా దేవి సాత్విక, రాజసిక మరియు తామసిక గుణాలు మూడూ కలసిన ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము అయితే, అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆది పరాశక్తి రూపం లేనిదీ, నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా ఉంది. ఈ వాదన ప్రకారం ఆది పరాశక్తి ఒక దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్యము. ఆదిమ శక్తి తనే కావటం మూలాన ఇతర దేవతలకి కూడా తనే మూలము. కావున ఆది పరాశక్తే అఖండ సత్యం. ఈ శక్తి సంపూర్ణం. ఆది పరాశక్తి భర్త లేనిది. కానీ ఈ జగత్తుకి శివుడిని ఆహ్వానించటానికి తాను స్త్రీ రూపంలో జన్మనెత్తినది.*


*హిందూ మతంలో ఆది పరాశక్తి అనగా ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి. స్త్రీ యొక్క సృజనాత్మక శక్తికి దైవత్వాన్ని ఆపాదించే ఒక భావన. భూభాగం పై ఆది పరాశక్తి ప్రాథమికంగా ఫలవంతమైన స్త్రీ స్వరూపంలో అవతరించిననూ పురుషావతారంలోనూ ఆ శక్తి నిగూఢంగా దాగి ఉంది.*


*సృష్టికే కాక, సకల మార్పులకీ కూడా శక్తే మూలం. శక్తే దైవత్వానికి ఉనికి. శక్తే విముక్తి. మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే శక్తి యొక్క రూపాంతరమైన కుండలిని శక్తికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ ఆధారం అవసరం లేకుండా, స్వతంత్రంగా ఉండటంలోనూ, సమస్త సృష్టిపై ఆధారితమై ఉండటంలోనూ శక్తే కీలకం.*


*శక్తి ఆరాధన లోనూ శైవము లోనూ ఆది పరాశక్తి సర్వశక్తిమంతురాలిగా పూజించబడుతోంది. సాక్షాత్ పరమశివుడి స్త్రీ రూపమే ఆది పరాశక్తిగా, ఈ రూపమే మహాదేవిగా, పార్వతీ దేవిగా గుర్తింపబడుతోంది.*
              

   *ఆది పరాశక్తి అనగా నిత్య మరియు అపరిమిత శక్తి. ఆది శక్తి ఈ సృష్టిని మించిన శక్తి. యావత్ సృష్టి యొక్క పుట్టుకకి మరియు వినాశనానికి కారకమైన క్రియాత్మక అదృశ్య శక్తి.*         

   *శ్వేతాశ్వతరోపనిషత్తు - చతుర్థాధ్యాయం - మొదటి పద్యం ఆమె గూర్చి ఈ క్రింది విధంగా వర్ణించబడింది.*


*య ఏకోవర్ణో బహుధా శక్తియోగాద్!వర్ణననేకాన్నిహితార్థో దధాతి! విచైతి చాంతే విశ్వమాదౌ చ దేవ స నో బుద్ధ్యా శుభయా సంయునక్తు!!*

*తాత్పర్యం:-  రంగు లేనిది బహువిధ శక్తి గలది, సృష్టిని అంతం చేసే ప్రక్రియలో అనేక రంగులని సృష్టించేది, అన్నీ ఉద్భవించేది తన నుండే, అన్నీ కలసిపోయేది తన లోనే, తనే మనకి శుభాన్ని, అవగాహనని కలిగిస్తుంది.*
                           

*పార్వతీ దేవిగా అవతరించే ముందు ఆది పరాశక్తి హిమాలయ పర్వత మహారాజుకి ప్రత్యక్షమై తనని తాను పరిచయం చేసుకొని అతనికి దివ్యోపదేశము చేసి అనంత జ్ఞానాన్ని ప్రసాదించినది. వేదములలోని పదములతో పరాశక్తి అయిన తనకి ఆద్యంతాలు లేవని వివరించినది. విశ్వంలో తానే అఖండ సత్యమని తెలిపినది. ఈ విశ్వమంతయు తన సృష్టియేనని, తనే పరబ్రహ్మ స్వరూపము అని రహస్యము తెలిపినది. జయం, విజయం తానేనని, వాటి రూపాంతరాలు కూడా తానేనన్న సత్యము తెలిపినది. బ్రహ్మ తన స్పష్టమైన రూపాంతరమేనని, విష్ణువు తన అస్పష్టమైన రూపాంతరమని, శివుడు తన అతిశయ రూపాంతరమని తెలిపినది. ఎవరూ కని, విని, ఎరుగని తన రూపాన్ని హిమాలయ పర్వత మహారాజుకి చూపినది.*
 

*సత్యలోకాన్ని తన నుదుట, విశ్వాన్ని తన కురులలో, సూర్యచంద్రులను తన కళ్ళుగా, నాలుగు దిక్కులను తన కర్ణాలుగా, వేదాలనే తన పలుకులుగా, మృత్యువు, అనురాగం మరియు భావోద్రేకాలను తన దంతాలుగా, మాయను తన చిరునవ్వుగా చూపినది.*

 
*సప్తమాతృకలు అయిన బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి మరియు చాముండిలు బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు, స్కందుడు, వరాహుడు మరియు నరసింహు ల సహధర్మచారిణులు మరియు శక్తిస్వరూపాలు. అసురులతో శక్తి చేసిన యుద్ధానికి సప్తమాతృకలు సహాయసహకారాలనందించారు.*


*దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళ నాడు మరియు కేరళ లలో ఆది పరాశక్తి అమ్మలగన్న అమ్మగా, పెద్దమ్మ తల్లిగా పూజలందుకొంటోంది. ఆది పరాశక్తి యొక్క వివిధ అవతారాలకి దక్షిణ భారతదేశంలో పలు ప్రదేశాలలో పలు ఆలయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రజలు అమ్మవారే గ్రామాన్ని రక్షిస్తుందని, ఊరి బాగోగులని చూసుకొంటుందని, దుష్ట శిక్షణ చేస్తుందని మరియు రోగాలని నయం చేస్తుందని నమ్ముతారు.*


*సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతరలని అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తారు. గంగమ్మ తల్లి, కామాక్షమ్మ, కనకదుర్గ, లక్ష్మీ దేవి, మీనాక్షి, మారియమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, పేరంటాళ్ళమ్మ వంటివన్నీ ఆది పరాశక్తి యొక్క రూపాంతరాలకి కొన్ని ఉదాహరణలు.*
         
         
    *శక్తి ఆరాధన మినహాయించి "ఆది శక్తి" ఎక్కడా ఆ పేరుతో సంబోధించబడలేదు. కానీ, పరోక్షంగా అన్ని పురాణాలు శక్తినే మహోన్నతంగా ఆరాధిస్తాయి.                         వైష్ణవులు ప్రత్యేకంగా శక్తిని ఆరాధించకపోయిననూ మాయని, యోగమాయని నమ్ముతారు. రాధని మూల ప్రకృతిగా ఆరాధిస్తారు.*


 *మహాలక్ష్మి రాధ యొక్క వైశాల్య రూపమని భావించటం వలన విష్ణుపురాణం మరియు భాగవత పురాణం లలో కూడా ఎక్కడా ఆది శక్తి ప్రస్తావనలు లేవు.                        బ్రహ్మ పురాణం మాత్రం వీటికి విరుద్ధంగా ఆది పరాశక్తి అనే బీజము తనని తాను పురుషుడు మరియు ప్రకృతిగా విభజించుకొన్నదని తెలుపుతుంది. ఆది బీజం కృష్ణుడుకి మరియు కాళికి జన్మనిచ్చినది. తర్వాత కాళి లలితా త్రిపుర సుందరిగా అవతరించి, రెండు బుడగలని సృష్టించినది. మొదటి బుడగ నుండి విష్ణువు అవతరించి బ్రహ్మకి, గౌరికీ జన్మనివ్వగా, గౌరి సతిగా, పార్వతిగా రూపాంతరం చెందినది. రెండవ బుడగ నుండి శివుడు మరియు రాధ అవతరించారు. రాధ తర్వాత లక్ష్మిగా, సరస్వతిగా మరియు గంగగా అవతరించినది.*


 *1.ఆది బీజపు పురుష భాగం కృష్ణుడు,*
  *2.ఆది బీజపు ప్రకృతి భాగం కాళి,*
 *3.కాళి త్రిపుర సుందరిగా అవతరించినది,*
 *4.త్రిపుర సుందరి విష్ణువుని సృష్టించినది,* 
*5.త్రిపుర సుందరి, శివుణ్ణి సృష్టించినది,*
*6.త్రిపుర సుందరి రాధని సృష్టించినది,* 
*7.విష్ణువు బ్రహ్మని సృష్టించాడు.*
      

*శివ పురాణంలో శివుని ఎడమ సగభాగం నుండి ఆది పరాశక్తి పరమ ప్రకృతిగా అవతరించినట్లు ఉంది.*


*లింగ పురాణంలో ఆది శక్తి యొక్క సగుణ స్వరూపమైన పార్వతి పానవట్టముగా, శివుడు లింగంగా అవతరించి వీరి సంగమమే శివలింగం గా పూజింపబడుతూ జీవోద్భావన గావించినట్లు తెలుపుతుంది. స్కంద పురాణం మరియు మార్కండేయ పురాణం దుర్గ లేదా చండి సకల జగత్తుకీ ఆది దేవత అనీ, ఈ రూపాంతరమే ఆది శక్తి యొక్క భౌతిక రూపమనీ తెలుపుతున్నవి.*


*శ్రీ ఆదిశంకర విరచితమైన సౌందర్యలహరిలోని 1వ శ్లోకం - భావము:-*

*1) శివః శక్త్యా యుక్తో- యది భవతి శక్తః ప్రభవితుం*
*న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి|*
*అతస్త్వామ్ ఆరాధ్యాం హరి-హర-విరిన్చాదిభి రపి*
*ప్రణంతుం స్తోతుం వా కథ-మక్ర్త పుణ్యః ప్రభవతి||*

**తాత్పర్యము / భావం:-*

*అమ్మా! పరమశివుడే అయినా నీతో కలసి ఉన్నప్పుడు మాత్రమే సర్వశక్తిమంతుడై లోకవ్యవహారములు చేయ గలుగు తున్నాడు. అదే నీతోడు లేనినాడు శంకరుడే అయినా ఇసుమంత కూడా కదలలేడు కదా. (శక్తితో ఉంటే శివం-కదలగలిగేది,శక్తి లేకుంటే శవం - కదలలేనిది) శివరూపమైన లింగం శక్తిరూపమైన పానమట్టం లేనిదే నిలబడలేదుగా. అంత శంకరుడే పరాధీనతతో నీ ఆధారముతో నిలువగా ఇక సామాన్యులు నినువిడచి జీవించుట ఎట్లు సాధ్యం. నిన్ను నిత్యము శివుడు, విష్ణువు, బ్రహ్మ మొదలైన దేవాదిదేవతలే కొలుస్తూ ఉంటారు.*



*అటువంటి నిన్ను కొలవాలన్నా నీ పాదపద్మాలు సేవించాలన్నా ఎన్నో జన్మ జన్మల పుణ్యం చేసినవారికి తప్ప అన్యులకు ఆ భాగ్యము దక్కదు కదా.*


*పరాశక్తితో కలిసి ఉన్నప్పుడే ఈశ్వరునిలో శక్తి ఉంటుంది. ఆ దివ్యశక్తి తోడు లేకుంటే పరమశివుడు అయినను కదలుటకు కూడా శక్తిహీనుడే. కనుకనే ఆ శక్తిని ఆరాధించి హరిహర బ్రహ్మలు సృష్టి, స్థితి, లయలకు కారణ భూతులైనారు.*

 
*పుణ్యం లేనివారెవ్వరూ ఆ జగన్మాతను స్తుతించటానికి అర్హులు కానేరరు.  'నాకు శక్తి ఉంది' అనటం మనం తరచూ వింటూ ఉంటాం. ఆ శక్తి అనేక రకాలు. కొందరికి రాసే శక్తి, కొందరికి మాట్లాడే శక్తి, కొందరికి అభినయించే శక్తి, ఇలా ఏ శక్తి అయినా ఆ ఆదిశక్తి అంశ అని తెలుసుకోవాలి.*


*ఈ భౌతిక జగన్నిర్మాతలు - తల్లిదండ్రులు, (అమ్మవారు - అయ్యవారు) ఈ ఇద్దరి కారణంగానే సృష్టి జరుగుతుంది. అంటే ఈ జగత్తంతా వారి దాంపత్య ఫలితమే!* 


*అయితే వీరిలో అయ్యవారు నిర్గుణుడు, నిరాకారుడు. అమ్మవారు మూల ప్రకృతి. సంస్కృత అక్షరం 'ఏ' ఆమె యోని రూపం. వీరిద్దరి కలయిక తో సృష్టికి గుణమైన లక్షణం ఏర్పడుతుంది. ఇదంతా వ్యక్తము. గుణముతో కూడినది. అంటే,... జరిగిన సృష్టిలో సైతం 'సగుణాత్మక' చిహ్నాలు గలవి కొన్ని ఉత్పత్తి అవుతాయి. ఇవి తిరిగి నిర్గుణ లింగాకృతిని కూడి జగత్ విస్తరణకు దోహదపడతాయి.*

*శ్లోకము:-*

*సృష్టి స్థితి వినాశానాం - శక్తి భూతే సనాతని౹౹*
*గుణాశ్రయే గుణమయి - నారాయణి నమోఽస్తుతే౹౹*

*అంటూన్నది మార్కండేయ పురాణం. ఈ ప్రకారం శ్రీదేవిని ప్రస్తుతించాలన్నా - పూజాదికాలు జరిగించాలన్నా, బహుజన్మార్జిత పుణ్యములు అపారంగా కలిగిన వారికి మాత్రమే అర్హత ఉంటుంది.*

*కాళిదాస కవీంద్రుని రచన అయిన 'చిద్గగన చంద్రిక' లో -*

*శ్లోకము:-*
*అంబతావక పదద్వయార్చకస్త్వన్మయో భవతి నాత్ర విస్మయః ౹*
*యస్త్వయైవ వివశో వశీకృతః భక్తి రేవ సమ భూచ్ఛివః స్వయమ్ ౹౹*

*(జగన్మాతా! నీ పాద కమల ద్వయాన్ని అర్చించే వాడు తప్పక తన్మయుడవుతాడు. అందులో ఆశ్చర్యపడడానికేమీ లేదు. నిజానికి శివుడు - వశీకృతుడు, పరవశుడు. అయినప్పటికీ-శక్తుడు కూడా!)*


*మొత్తం మీద ఈ శ్లోక భావం ఇలా చెప్పవచ్చును!....*

*శ్రీ పరమేశ్వరి అనంత బ్రహ్మాండానికి తానే శాసకురాలు అగును. అందుచే తనను శాసించేవాడు ఇంకొకడు ఎవడును ఆమెకు లేడు. సర్వమూ తానే అయి, తన కంటె అభిన్నముగా ఉండే (ఇతరములేని) పరాశక్తికి శాసకుడుగానీ శాసము అనగా శాసింపదగినదిగానీ లేదు అనియు తలంపదగును. ఈ ప్రపంచాన్ని ప్రకృతి పురుషులు కలిసి నడుపుతున్నారు. వీరిలో ఎవ్వరికి ఎవ్వరు ప్రభువులు కారు. “ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీ ఉభావపి" సకల చరాచర జగత్తునకు తానే కారణముకానీ, తనకు కారణము లేనిది.*


*ఈశ్వరులందరికీ వారివారి కర్మలనుబట్టి అధికారము ప్రసాదించు పరమేశ్వరుడే ఈ పరదేవత. ప్రకృతి- పురుషులే సర్వ ప్రపంచాన్ని నడిపిస్తుంటే, వారిపై అధికారులు ఎవరుంటారు? అందుచేత శ్రీదేవి 'నిరీశ్వరా' యనబడును.*


   


మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు 

సీతాపతీ పద్య కావ్యము 

సీసము 

నా తండ్రి, నా నిధి  నా పుణ్య రూపుండు 

       నా తప స్సిద్ధియు నాదు గురువు 

నా ప్రాణ వాయువు, నా ధ్యాన రూపుండు 

       నా పరమాత్మయు, నా సమస్త 

కర్మల పుణ్యంబు, కారుణ్య వార్ధి, నా 

     బహుబంధు రూపుండు ప్రాణములకు 

నాధారభూతుండ నై. యనుగ్రహము, నా 

      యందు జూపెడి, మరమాత్ముడరయ  

తేటగీతి 

నాదు నేలిక నా సొఖ్య మాదరమున  

నాదు మనసుయే అర్పించె మాదరమున 

సేవ సలిపెద,  నా తపస్సిద్ధి కొరకు 

ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు 

--(())--

సీసము 

సామమ్ము చదివెనా ..సాలీడు చూడఁగ 

      సాయుజ్యమొందెనే చక్కగాను

సామంబు పొందెనో సాయుజ్యపదమును

      అదియేమి చేసెనో యరయ సుకృతి ?!

ఫణికినొసఁగితివి పాపముక్తగతిని

         సర్పభూషణశోభి.. సర్వగమ్య !

గొడగూచిచిఱునంబిఁగూడనీ భక్తులే

      స్వచ్ఛస్ఫటికమతి స్వచ్ఛగుణులు

గీ. ( పంచపాది )..

--

గుహ్యమెఱుఁగని విప్రుఁడు గుణనిధియును

మోక్షమొందెను చిత్రమో..ముక్తిదాత..

బాలభక్తులకిడితివి ..ఫాలనేత్ర.

జన్మరాహిత్యసుగతిని జటిలయోగి..

వందనశతమ్ము నీకిదే..స్కందగురుఁడ !!! "

--(())--


ప్రాంజలి ప్రభ లోని మరియు ప్రపంచంలో ని స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

సీస పద్యము 

అర్ధభాగముతోను అర్ధాంగి యైనావు  

        ఆశలన్నీ తీర్చి అరుగుతెంచి 

అంతరంగములోన అలుపుయే లేకుండా 

       ఆదమరచియు హాయి కలలు పంచి  

సాంగత్య సౌఖ్యము సుఖములే అందించి 

              తనువుల పులకింత దారి చూపి  

అలసి సొలసిన నా బతుకులో శుభముగా

భర్తగా సేవలు భాగ మవ్వు 

తేటగీతి 

అర్ధ పరమార్ధ అర్దాంగి వైన నీవె 

యౌవనమ్మును అందించి ఆశ తీర్చు 

నిత్య విద్యాబుద్ధులు నేర్పు పిల్లలందు  

జీవితానికి స్త్రీ వల్ల జీవ మొచ్చు 

--(())--

సీ.

----

స్త్రీశక్తి నరులకు తిరమైన సిరులౌను

       క్షేమసౌభాగ్యాల శేవధియును

స్త్రీలుండు తావది రీతిశాంతినిలయ

        రాగరంజితమణి రాజ్యరమయె !

స్త్రీశక్తి రాష్ట్రీయ శ్రీగతిమూలము

        కౌటుంబికనిధియై కామ్యదాత్రి !

స్త్రీశక్తి మూర్తియౌ త్రితయంపు పెన్నిధి

         సత్త్వప్రదాయిని తత్త్వశుభద  !

గీ. 

--

అట్టి స్త్రీమూర్తి గృహలక్ష్మి యబలయౌనె ?

ముగ్గురమ్మలరూపిణి ! మోదవరద !

గోవుమాలక్ష్మి యాకృతి కువలయసమ !

వందనశతమ్ములమ్మరో..యందుకొనుము !!! "

------------

 *పూజనీయా మహాభాగాః*

 *పుణ్యాశ్చ గృహదీప్తయఃl* 

 *స్త్రియః శ్రియో గృహస్యోక్తాః* 

 *తస్మాద్రక్ష్యా విశేషతఃll* 

స్త్రీలు ఎల్లవేళలా పూజింపదగినవారు. వారు పుణ్యశీలురు. ఇంటికి వెలుగును ఇచ్చువారు. మరియు స్త్రీలు ఇంటికి సంపద అని చెప్పబడుచున్నారు.

కావునా అటువంటి స్త్రీలను అవమానించరాదు. విశేషముగా పూజింపదగినవారు. వారిని రక్షించుట మనందరి కర్తవ్యo.

--(())--


మధురిమలు..మహిళ ప్రగతి

హృదయములోన సగము

అధికారములోన సగము

సాకారములోన  సగము

అమ్మగాను సంపూర్ణము


ఆదిశక్తి అవతారము

సృష్టి కర్త గా రూపము 

ఆధిక్యం లోన రూపము 

అందించును ఉపకారము 


పల్లె పడుచు మల్లె మనసు 

చెల్లె చెదర గుట్టు సొగసు

కళ్ళె మగుట పట్టు వయసు

కల్ల లగుట ఆట గడుసు


రిక్క చూపి పొద్దు కేగి

చక్క గున్న చుక్క తాగి

చిక్కు లన్ని చూచె తొంగి

గుక్క తిప్పు కోమ లాంగి


పైరు గాలి వీచి నంత

కైపు ఎక్కి ఊగు నంత

పైకి చిక్కి ఆక లంత

పైన కెక్కె బాధ కొంత


మోని వర్య ఆక లంత

మర్మ మెంతొ భేద మంత

మాన్య విద్య మోన మంత

మాన సమ్ము ముద్దు గీత


వాపు కల్గి ఆశ లెన్నొ

దుర్ద రేగి దర్వు లెన్నొ

చెత లన్ని తప్పు లెన్నొ

నోటి మాట గీత లెన్నొ


కాల మాయ కార్య మెంతొ

జ్ణాని కాల భావ మెంతొ

కార్య కర్త కర్మ మెంతొ

శ్రావ్య దివ్య భావ మెంతొ

--(())--

"సీ.

-----

శ్రీహర్ష వల్లిస్థ శ్రీసూర్యదేవాయ

        నమయంచు మ్రొక్కెద నళినపూల

ఛాయోష పద్మినీ జాయలకుపతియౌ

        మార్తాండునెప్పుడు మరువకుండ

పాటింతు శ్రద్ధగా పౌరాణికంబగు

         నిత్య పారాయణ నియమ విధిని

శ్రీపతంజలిదేవు శ్రీదయ ప్రాప్తికై

        సూర్యనమస్కృతి

సూక్తనుతుల

--

సకల కరణాల భక్తిగా సకలవరదు

అర్చనాది మంత్రయాగవిధుల

పూజసేయుదు తరణికి పూష్ణు రవికి

కంజబంధునరుణుకంజలింతు !!! "

------

( ఇందు....యెత్తు పద్యంలో..

1 ,3 ---- తే ట గీ తి ;

2 , 4 ---- ఆ ట వె లఁ ది..)

-----------------

నమస్కారములు 

నా తండ్రి, నా నిధి  నా పుణ్య రూపుండు 

నా తప స్సిద్ధియు నాదు గురువు 

నా ప్రాణ వాయువు, నా ధ్యాన రూపుండు 

నా పరమాత్మయు, నా సమస్త 

కర్మల పుణ్యంబు, కారుణ్య వార్ధి, నా 

బహుబంధు రూపుండు ప్రాణములకు 

నాధారభూతుండ నై. యనుగ్రహము, నా 

యందు జూపెడి, మరమాత్ముడరయ  

నాదు నేలిక నా సొఖ్య మాదరమున  

నాదు మనసుయే అర్పించె మాదరమున 

సేవ సలిపెద,  నా తపస్సిద్ధి కొరకు 

ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు 

--(())--

సీసము 

లక్ష్మ ణా మనసున లాశ్యము లాడక

      మనుషుల అలికిడి మెప్పు పొందు

ప్రేమతత్వ ముతోను పరిణతి చెందెను

    అధ్యక్షుడు పలుకు ఆదరించు

లక్ష్మణా మనసుయే లాహిరి లాహిరి 

    సర్వము మాయయు సతతముగను 

మోహము లోభము మోదము క్రోధము 

   యంతయు మాయయు యాలకించు 

తేటగీతి 

కార్య దక్షాపరా విధి కువల యేశ 

సర్వ మాయార్ద భావమ్ము సకలమందు 

నిర్వి రామ కృషియు చేయు నిరత మందు 

ఆర్య లక్ష్మణా ఇదియేను  ప్రేమ తృప్తి 

--(())--


స్త్రీ : తెలుగు పర్యాయపదములు

అంగన, అంచయాన, అంబుజలోచన, అంబుజవదన, అంబుజాక్షి, అంబుజానన, అంబురుహాక్షి, అక్క, అతివ, అన్ను, అన్నువ, అన్నువు, అబల, అబ్జనయన, అబ్జముఖి, అలరుబోడి, అలివేణి, అవ్వ, ఆటది, ఆడది, ఆడుగూతురు, ఆడుబుట్టువు, ఇంచుబోడి, ఇంతి, ఇందీవరాక్షి, ఇందునిభాస్య, ఇందుముఖి, ఇందువదన, ఇగురాకుబోణి, ఇగురుబో(డి)(ణి), ఇభయాన, ఉగ్మలి, ఉజ్జ్వలాంగి, ఉవిద, ఎలతీగబోడి, ఎలనాగ, ఏతుల, కంజముఖి, కంబుకం(ఠ)(ఠి), కంబుగ్రీవ, కనకాంగి, కన్నులకలికి, కప్పురగంధి, కమలాక్షి, కరభోరువు, కర్పూరగంధి, కలకంఠి, కలశస్తని, కలికి, కలువకంటి, కళింగ, కాంత, కించిద్విలగ్న, కిన్నెరకంఠి, కురంగనయన, కురంగాక్షి, కువలయాక్షి, కూచి, కృశమధ్యమ, కేశిని, కొమ, కొమరాలు, కొమిరె, కొమ్మ, కోమ, కోమలాంగి, కోమలి, క్రాలుగంటి, గజయాన, గరిత, గర్త, గుబ్బలాడి, గుబ్బెత, గుమ్మ, గోతి, గోల, చంచరీకచికుర, చంచలాక్షి, చంద్రముఖి, చంద్రవదన, చక్కనమ్మ, చక్కెరబొమ్మ, చక్కెరముద్దుగుమ్మ, చాన, చామ, చారులోచన, చిగురుటాకుబోడి, చిగురుబోడి, చిలుకలకొలికి, చెలి, చెలియ, చెలువ, చే(డె)(డియ), చోఱబుడుత, జక్కవచంటి, జని, జలజనేత్ర, జోటి, ఝషలోచన, తనుమధ్య, తన్వంగి, తన్వి, తమ్మికంటి, తరళలోచన, తరళేక్షణ, తరుణి, తలిరుబోడి, తలోదరి, తాటంకవతి, తాటంకిని, తామరకంటి, తామరసనేత్ర, తీయబోడి, తీ(గ)(వ)బోడి, తెఱవ, తెలిగంటి, తొ(గ)(వ)కంటి, తొయ్యలి, తోయజలోచన, తోయజాక్షి, తోయలి, దుండి, ధవళాక్షి, ననబోడి, నళినలోచన, నళినాక్షి, నవ(ల)(లా), నాంచారు, నాచారు, నాచి, నాతి, నాతుక, నారి, నితంబవతి, నితంబిని, నీరజాక్షి, నీలవేణి, నెచ్చెలి, నెలత, నెలతుక, పంకజాక్షి, పడతి, పడతుక, పద్మముఖి, పద్మాక్షి, పర్వేందుముఖి, పద్మాక్షి, పర్వేందుముఖి, పల్లవాధర, పల్లవోష్ఠి, పాటలగంధి, పుచ్చడీక, పుత్తడిబొమ్మ, పు(వు)(వ్వు)బోడి, పువ్వారుబోడి, పుష్కలాక్షి, పూబోడి, పైదలి, పొ(ల్తి)(లతి), పొ(ల్తు)(లతు)క, ప్రతీపదర్శిని, ప్రమద, ప్రియ, ప్రోడ, ప్రోయాలు, బంగారుబోడి, బాగరి, బాగులాడి, బింబాధర, బింబోష్ఠి, బోటి, భగిని, భామ, భామిని, భావిని, భీరువు, మండయంతి, మగువ, మచ్చెకంటి, మడతి, మడతుక, మత్తకాశిని, మదిరనయన, మదిరాక్షి, మసలాడి, మహిళ, మానవతి, మానిని, మించుగంటి, మించుబోడి, మీననేత్రి, మీనాక్షి, ముగుద, ముదిత, ముదిర, ముద్దరాలు, ముద్దియ, ముద్దుగుమ్మ, ముద్దులగుమ్మ, ముద్దులాడి, ముష్టిమధ్య, మృగలోచన, మృగాక్షి, మృగీవిలోకన, మెచ్చులాడి, మెఱుగారుబోడి, మెఱుగుబో(డి)(ణి), మెలుత, మె(ల్త)(లత), మె(ల్తు)(లతు)క, యోష, యోషిత, యోషిత్తు, రమణి, రామ, రుచిరాంగి, రూపరి, రూపసి, రోచన, లతకూన, లతాంగి, లతాతన్వి, లలన, లలిత, లలితాంగి, లీలావతి, లేడికంటి, లేమ, లోలనయన, లోలాక్షి, వధువు, వధూటి, వనజదళాయతాక్షి, వనజనేత్ర, వనజాక్షి, వనిత, వరవర్ణిని, వరానన, వరారోహ, వలజ, వశ, వామ, వామనయన, వామలోచన, వారిజలోచన, వారిరుహనేత్ర, వారిరుహలోచన, వారిరుహానన, వాల్గంటి, వాలుగకంటి, వాశిత, వాసుర, విరితీవబోడి, విరిబోడి, విశాలాక్షి, వెలది, శంపాంగి, శఫరాక్షి, శర్వరి, శాతోదరి, శిఖరిణి, శుకవాణి, శుభదంతి, శుభాంగి, శోభన, శ్యామ, శ్రమణ, సకి, సకియ, సారసాక్షి, సిత, సీమంతిని, సుందరి, సుగాత్రి, సుజఘన, సుదతి, సుదృక్కు, సుధ్యుపాస్య, సునయన, సుప్రియ, సుభాషిణి, సుభ్రువు, సుమతి, సుమధ్య, సుముఖ, సురదన, సులోచన, సువదన, హంసయాన, హరిణలోచన, హరేణువు, హేమ.

*****

శాశ్వతం ఏది ?

”కావు కావు కావు కావు! ఏవీ శాశ్వతం కావు!“ కాకి ప్రతీ ఊరిలో, ప్రతీ ఇంటిపై వాలి ఏదో ఒక సమయంలో అరిచే ఉంటుంది. 

”ఏమని? కావు కావు కావు అని. అనగా ఏవి శాశ్వతం కావు అని!

నువ్వు నిరంతరం ఎంతో శ్రమించి సంపాదించిన సంపదలు శాశ్వతం కావు. బంధాలు శాశ్వతం కావు. ఏ కోరికలూ శాశ్వతం కావు. నువ్వు చూసేవి చేసేవి ఏవీ శాశ్వతం కావు.

ఏదీ శాశ్వతం కానపుడు మరి ఎందుకు ఇంత తపన? నీది కాని దాని కోసం నువ్వు ఎంత తపించినా ప్రయోజనము లేదు. నీకు చెందవల్సింది నీవు వద్దు అన్నా నీకు చెంది తీరుతుంది. లేనిదాని కోసం ఉన్నదానిని వదులుకోకు!

"ప్రపంచం అసత్యం, అశాశ్వతం. ఒక్క పరమాత్మ మాత్రమే సత్యము, శాశ్వతమని తెలుసుకుని మసలుకో! నీ జీవనానికి ఎట్టి ఇబ్బందీ ఉండదు.  పరిపూర్ణమైన శాంతి లభిస్తుంది."

               శుభ సాయంత్రం🙏


 ప్రేమనగర్ సినిమా పాటని  పేరడీగా  భలే రాశారు ..

నేను పుట్టాను,

లేండ్ లైన్ వచ్చిందీ ...

నేను ఏడ్చాను,

సెల్ పోన్ వచ్చిందీ ...

నేను నవ్వాను,

స్మార్ట్ ఫోన్ వచ్చింది.

నాకింకా లోకంతో పని ఏముంది.

డోన్ట్ టాక్.       ॥నేను పుట్టాను ... ॥


  1వ. చరణం:

మనిషిని మనిషిని కలిపేటందుకు 

లేండ్ లైన్ వచ్చిందీ ... 

ఎవరికి దొరకక తిరిగేటందుకె

సెల్ ఫోన్ వచ్చిందీ ... 

ఒంటరి తుంటరి బ్రతుకు కోసమై 

స్మార్ట్ ఫోన్ పుట్టిందీ ... 

అందరి బుర్రలు నమలడానికే

వాట్సాప్ వెలిసింది.

డోన్ట్ టాక్.            ॥నేను పుట్టాను ...  ॥


   2వ చరణం:

లేండ్ లైన్ మ్రోగితే,

అందరి గుండెలు ఆనందించాయీ ... 

సెల్ ఫోన్ మ్రోగితే,

అందరి మనసులు చిరాకు పడ్డాయీ ...

స్మార్ట్ ఫోన్ తో,

అందరి బ్రతుకులు చతికిల బడ్డాయీ ...

తెల్లవారినా అవి,

కొంచెం కూడా బాగవ కున్నాయి.

డోన్ట్ టాక్.           ॥ నేను పుట్టాను ...॥


 3వ చరణం:

వాట్సాపులో వసతులతోటీ,

షరతులు వున్నాయీ ...

హద్దు మీరితే అంతు తెలియనీ,

శిక్షలు పడతాయీ ...

స్మార్ట్ ఫోనులో భాషల కుండే,

సొగసులు తగ్గాయీ ...

ఎమోజీ(emoji) లతో,

ఎవరికి తెలియని భాషలు పుట్టాయి.

డోన్ట్ టాక్.           ॥ నేను పుట్టాను ...  ॥


  4వ చరణం:

మనుషుల మనసులు,

కలిపేటందుకె ఫోనులు వున్నాయీ ...

ఏ ఫోనైనా,

మంచిగ వాడే మార్గాలున్నాయీ ...

మంచిగ వాడని,

ఫోనుల కెపుడూ వైరస్ లొస్తాయీ ...

వాట్సాపులో,

పెట్టేటందుకె నీతులు వున్నాయి.

డోన్ట్ టాక్.           ॥ నేను పుట్టాను ...  ॥


  5వ చరణం (ఆఖరి చరణం):

గంటలు రోజులు స్మార్ట్ ఫోనులో,

వాగుతు గడిపేసెయ్ ...

ఫోన్లో వున్న బేటరి తీసి,

బయటకు పారేసెయ్ ...

వైఫై సిగ్నల్ ఆపేసెయ్ ...

సిమ్ము కార్డును విసిరేసెయ్ ...

డ్రైవ్ ద డేటాకార్డ్ ఔట్ ... 

హహ్హహ్హహ్హహ్హ !!!


॥నేను పుట్టాను 

*****

శార్దూల విక్రీడితము

లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్

ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;

నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;

రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

తాత్పర్యము

"దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా!"

అని గజేంద్రుడు ఎలుగెత్తి ఆర్తితో ప్రార్థింపగా, ఆ ప్రార్థన  వైకుంఠంలో లక్ష్మీదేవితో వినోదించు శ్రీమన్నారాయణుని చెవులకు వినబడింది. వెంటనే ఆ భగవంతుడు, గజేంద్రుని రక్షించడానికి ఎలా బయలుదేరాడో పోతనగారు ఎలాచెప్పారో చూద్దాం.

****

మత్తేభ విక్రీడితము

సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే

పరివారంబునుఁ జీరఁ" డభ్రగపతిం బన్నింపఁ" డాకర్ణికాం

తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో

పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

తాత్పర్యం

గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. వాహనం ఐన గరుత్మంతుని పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడి కూడ చక్కదిద్దుకోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకొంగు కూడ వదలి పెట్టలేదు.

అలాశ్రీమన్నారాయణుడు బయలుదేరగా, ఆయనవెంట వైకుంఠమే కదిలి వెడలగా గజేంద్రుడు రక్షింపబడ్డాడు. గజేంద్రునిలోని అరిషడ్వర్గములు నశించి ముక్తిని పొందాడు.ఆ విధంగా పరమాత్మ భక్తుని భక్తికి వశమవడం జరుగుతుంది.

ఉద్థవుడు జిజ్ఞాసతో భగవంతుని లీలలను తెలుసుకోవాలను కున్నాడు. అదేమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాము.

శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన ఉద్దవుడు మహాభారతం చివర్లో శ్రీకృష్ణుడిని జిజ్ఞాసతో ఉద్ధవుడు కొన్ని ప్రశ్నలను  అడిగాడు. అవి ఏమిటంటే, నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా ధర్మరాజు జూదం ఆడకుండా ఆపవచ్చు లేదా ధర్మరాజు తరుపున నువ్వు ఆడి ఉండవచ్చు కదా అని అడుగగా అప్పుడు దానికి శ్రీకృష్ణుడు, ఉద్దవా ! గుర్తుపెట్టుకో, ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు.

ధర్మరాజుకు ఆ వివేకం …

*****

సందర్భం వచ్చినది గనుక సిద్ధులగురుంచి పరిశీలిద్ధాము.

అష్ట సిద్ధులు

అణిమ– అతి చిన్న వాడిగా మారిపోవడం

మహిమ – పెద్ద రూపం పొందడం

గరిమ – బరువుగా మారడం

లఘిమ– తేలికగా మారిపోవడం

ప్రాప్తి  - ఇంద్రియాల అధిష్ఠాన దేవతల్ని దర్శించడం, ఏదౖైెనా ఎక్కడైనా పొందగలగడం

ప్రాకామ్య – కోరుకున్న పదార్థాల్ని దర్శించి అనుభవించే సామర్థ్యం పొందడం

ఈశిత్వ – జ్ఞాన వీర్యాదుల ప్రకోప శక్తి, సృష్టిపై ఆధిపత్య శక్తి

వశిత్వ – విషయ భోగాల నుంచి రక్తిని పొందడం, అన్నిటిపై ముఖ్యంగా పంచ భూతాలపై నియంత్రణ

కామావసాయత- సమస్త కోరికల ఉపశమనం

 ఈ అష్ట సిద్ధులను పురాణ పురుషులు ప్రదర్శించారు.

అణిమా సిద్ధిని హనుమంతుడు సీతాన్వేషణకు లంకలో ప్రవేశించేటపుడు చిన్న వాడిగామారి ప్రదర్శించాడు.

మహిమా సిద్ధిని హను మంతుడు సముద్రోల్లంఘన సమయంలో ప్రదర్శించాడు. ఇక సురస నోరు తెరిచినపుడు పెద్దవాడుగా మారి ఒక్క సారిగా చిన్నవాడిగా మారి అణిమా మహిమా సిద్ధుల్ని ఒక దాని వెంట ఒకటి ప్రదర్శిం చాడు. ఇంకా ఎన్నో చోట్ల ఆయన కాయాన్ని పెంచ డం కనిపిస్తుంది.

ఇక వామనావతారంలో విష్ణువు మూడడు గులతో భూమ్యా కాశాలను ఆవరించిన పుడు కూడా ఇదే విధంగా పెరిగాడు.

గరిమా సిద్ధిని కృష్ణుడు చిన్నతనంలో తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో ఎత్తుకు పోవడానికి వచ్చినపుడు అతనితో బాటు పైకెగిరి వాడి భుజాల మీద కూర్చుని బరువుగా మారడంతో వాడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వాడిని కృష్ణుడు చంపివేశాడు.

భీముడు సౌగంధిక పుష్పాలను తెచ్చేందుకు వెళ్లినపుడు హనుమంతుడుడు తన తోకను అడ్డుగా పెట్టి దానిని భీముడు ఎత్తలేనంత బరువుగా మార్చాడు.

లఘిమా అంటే తేలికగా అయిపో వడం. ఆకాశగమనం వంటివి కూడా దీనితో అనుబంధంగా వచ్చే శక్తులని చెబుతారు.

ఈ సిద్ధుల ప్రదర్శన మనకు రామాయణ, భాగవతాదుల్లో ప్రముఖంగా కనిపిస్తుంది.

ఒక్క సిద్ధి సరైన గురువు వద్ద పొండానికే 40 సంవత్సరాలు పడుతుందని చెబుతారు. 

దీనికి సంబందించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఆది శంకరులకు ఒక పర్యాయం ఒక సిద్ధుడు తారసపడ్డాడు. తనకు ఉన్న ఆకాశ గమన విద్యను ఆయన ముందు ప్రర్శించాడు. అది సాధించేందుకు ఎంత కాలం పట్టిందని ఆయన అడిగారు. 40 ఏళ్లు పట్టిందని చెప్పాడు.

ఆ విద్య పొందేందుకు నీ జీవితంలో 40 ఏళ్లు ఖర్చు పెట్టావు. ఏ సత్పు రుషుడిని దూషించినా కాకివై పుట్టి పుట్టుకతోనే ఆకాశగమనం సాధించేవాడివి కదా అని ఆయన ఎద్దేవా చేసినట్టు చెబుతారు

 సిద్ధులు సాధించడం అనవసరమని, అందుకు జీవితం లో అంత కాలం వృధా చేయకుండా జగన్మాత అనుగ్రహం వల్ల ఉత్తమ గతులు పొందితే బాగుండుననేది ఆయన ఉద్దేశం.

కాని జగన్మాతను ఆరాధిస్తే మనకు ఏవి అవసరమో, ఏ శక్తులు వశంచేస్తే మనకు ఉపయోగము ఉంటుందో, మన దీక్షా సామర్థ్యం ఎంత ఉందో ఆ మేరకు ఆతల్లి అనుగ్రహిస్తుంది. ఏ కోర్కె అయినా ధర్మబద్ధంగా ఉండాలి.…

****



జయ మాతంగతనయే / జయ నీలోత్పలద్యుతే 

జయ సంగీతరసికే / జయ లీలాశుకప్రియే 

==

ఈవారం శ్లో కతాత్పర్యాలు 

*"""*

*జరా రూపం హరతి ధైర్యమాశా*

*మృత్యుఃప్రాణాన్ ధర్మచర్యామసూయా|*

*కామో హ్రియం వృత్తమనార్యసేవా*

*క్రోధః శ్రియం సర్వమేవాభిమానః||*

ముసలితనము రూపాన్ని, ఆశ ధైర్యమును, మృత్యువు ప్రాణాలను, అసూయ ధర్మప్రవృత్తిని, కామము లజ్జను, దుష్టసేవ సత్ప్రవర్తనను, కోపము ఐశ్వర్యమును, గర్వము సర్వమును హరించివేస్తాయి.

****"**

శ్లో|| సుశీలో మాతృ పుణ్యేన, పితృపుణ్యేన బుద్ధిమాన్ |

 ధార్మికో పూర్వపుణ్యేన, స్వీయపుణ్యేన భాగ్యవాన్ |

భావము:ఏ వ్యక్తియైనా తన తల్లి చేసిన పుణ్యం వలన మంచి శీల సంపద కలవాడవుతాడు. తండ్రి చేసిన పుణ్యం వలన బుద్ధిమంతుడవుతాడు. తమ వంశపూర్వికులు చేసిన పుణ్యం వలన ధర్మాత్ముడవుతాడు. తాను స్వయంగా చేసిన పుణ్యం వలన ధనవంతు డవుతాడు.

****""***

*🧘‍♂️284) యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️*

6-29

తాదృగ్వివేకవతి సంకలితాభిమానే 

పుంసి స్థితే విమలసత్త్వమయాగ్రజాతౌ 

సప్తాత్మికావతరతి క్రమశః శివాయ 

చేతః ప్రకాశనకరీ నను యోగభూమిః.

ఈ ప్రకారముగ వివేకసంపన్నుడై నిర్మలమును, సత్వ గుణమయమును నగు ఉత్తమ జాతులందు స్థితిని బడసిన యాతనికి మోక్షశ్రేయమునకై, జ్ఞానముచే చిత్తమును ప్రకాశింపజేయు సప్తయోగ (జ్ఞాన)భూమికలు క్రమముగ సంపన్నమగును. 

శ్రీరామ ఉవాచ :-

6-30

కీదృశ్యో భగవన్యోగభూమికాః సప్త సిద్ధిదాః 

సమావేతి మే బ్రూహి సర్వతత్వవిదాంవర. 

శ్రీరాముడు :- ఓ మహాత్మా! బ్రహ్మవిద్వరా! మోక్షసిద్ధిని చేకూర్చునట్టి సప్తజ్ఞానభూమిక లెవ్వియో సంగ్రహముగ దెలియజేయుడు? 

శ్రీ వసిష్ఠ ఉవాచ :-

6-31

స్వరూపావస్థితిర్ముక్తిసద్భ్రంశోఽ హంత్వవేదనమ్‌ ఏతత్సంక్షేపతః ప్రోక్తం తఙ్‌జ్ఞత్వాజ్ఞత్వలక్షణమ్‌ 

శ్రీ వసిష్ఠుడు :- ఓ రామచంద్రా! స్వస్వరూపమగు ఆత్మయందు స్థితి గలిగియుండుటయే ముక్తి! ఆ యాత్మస్వరూపము నుండి జారిపోవుటయే అహంకారాద్యనుభవము. ఈ ప్రకారముగ జ్ఞాని యొక్కయు, అజ్ఞానియొక్కయు లక్షణము సంక్షేపముగా చెప్పబడినది.

****

*అమ్మ 
*నవ మాసాలు మోసి చాలా బాధలు ను ఓర్చి బిడ్డను కంటుంది అమ్మ . అనుక్షణమూ తన కంటికి రెప్పలా కాపాడుతూ పెంచి పెద్ద చేస్తుంది. మంచి చెడులను, విచక్షణా జ్ఞానములను, బుద్దులను నేర్పుతుంది . మనము సమాజములో ఎలాబతకాలో నేర్పిస్తుంది. అమ్మ తన బిడ్డ ను గురించి చాలా కలలు కంటుంది . ఆ కలలను నిజము చేసుకోటాని చాలా కష్టాలు పడుతుంది. అసలు అమ్మ ఆ కష్టాలని కష్టాలుగానే చూడదు. అవి కుడా సుఖాలుగానే భావిస్తుంది. ఇది నిజము. తన బిడ్డ పెరిగి పెద్దవాడై తనని చూడాలన్న ఆశాతో బిడ్డ కోసము కష్టపడటం లేదు . కేవలము ఎటువంటి స్వార్ధము లేకుండా తనబిడ్డ పెరిగి ప్రయోజకుడై నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలని. అందరు మెచ్చుకొనే స్థితికి చేరాలని .* *శ్రమిస్తుంది . ఆమె కోరుకున్న ఫలితము దొరికితే అమ్మ పడిన కష్టాలన్నీ ఎలామర్చిపోతుందంటే.* *అప్పటిదాకా ప్రసవవేదనను అనుభవించిన తల్లి బిడ్డ పుట్టినా మరు నిమిషానికి బిడ్డను చూసి ఆ సంతోశములో ఆమె పడిన వేదనను మరచినట్టుగా . ఆమె భాదలన్నీ మరచి చాలా సంతోషిస్తుంది. చివరి శ్వాస వరకు*
*తల్లి పిల్లలకోసము ఎంతటి త్యాగానికైనా సిద్దమై పోతుంది. బిడ్డ చెడిపోతుంది అని అనిపిస్తే తాళికట్టిన భర్తను సైతము లెక్కచెయదు. ప్రపంచములోచెడ్డ వారు వుంటారు కానీ. చెడ్డ తల్లులు అంటు వుండరట ."*
*ఈ రోజులలో అమ్మని ఎవరు గౌరవంగా చూడటంలేదు . పెరిగి పెద్దఅయిన తరువాత పెరుతెచ్చుకొని ఆ అమ్మ తనకోసము చేసిన త్యాగాన్ని కష్టాన్ని మరచి .వివేకహీనులవుతున్నారు.* *ఇది విచారిచవలసినదే. ఆ తల్లిని ముసలి వారి నివాస గృహాలలో చేర్చుతున్నారు . ఇదేనా ఆమె కడుపున పుట్టి ఆమె ఋణము తీర్చుకోటము.*
*అమ్మకి బంగారాలు బాగ్యాలు ఇవ్వక్కరలేదు. అమ్మని ప్రేమగా చూసుకోండి చాలు. ప్రేమగా పలకరించండి చాలు*
****"""***
యుధ్ధరీతి 
---------
రష్యాలో పుతిన్ ఉక్రేయన్ లో జెరెన్స్కీ ఒకరేమో పొంచివున్న ముప్పు అని మరొకరేమో అస్తిత్వం 
కోసం యుధ్ధమని !
కారణాలు ఏమైతేనేం ఇరుదేశాల ప్రజకు ఇక్కట్లే నాటో అంటాడు ఒకడు వీటో అంటాడు మరొకడు ఎవరి వాదన వారిదే ఇరు పక్షాలకు మధ్ధతిస్తూ శోధ్యం చూస్తుంది నిశితంగా ప్రపంచం !  
ఐక్యరాజ్య సమితి అది అనైఖ్యత కు స్మృతి అనాధలా మిగిలింది ఇరు దేశాల జనజీవనం యుధ్ధమంటే హాస్య కళ ఓడినోడు బాహటంగా ఏడుస్తాడు గెలిచినోడు  లోలోన కుళ్ళుతాడు 
ఇరు దేశాల ప్రజలు మాత్రం ధైన్య స్తితికి దిగజారుతారు !! 
ఈ పాపం పాలకులదా వారి పంతాలదా !?
మారణ హోమం ద్వారా మంచి జరగదు మానవ వికాసం కుంటు పడుతుంది ! అందుకే ఆపండి యుధ్ధ ఘోష ! శాంతి మంత్రం వినిపించండి ప్రతి నోట !!
రచన - సాంబ శివ రావు. తోపుల. హైదరాబాదు - 104 , ph; 9676189134
****
శివరాత్రి ఉపోషం :
ఏమండీ, రేపు శివరాత్రికదా,  ఇద్గరం ఉపోషం ఉందామా ?
నన్ను కూడా కలుపుతావెందుకు కామేశ్వరీ, నీకు ఉండాలనిపిస్తే ఉండు, అంతేకానీ......
మీరు మరీనండీ, మీతో ఏ సరదాలూ ఉండవునాకు..  ఏదైనా ఇద్దరంకలసి  ఆచరిస్తే ఆనందంగా ఉంటుందని ఉత్సాహపడుతుంటే, మీరు   కావాలంటే   నీఉండూ   అనడంలో అర్ధముందా అసలు?
మీరూ నాతో ఉపవాసం ఉంటే మీకు వంట చేయనవసరంలేదుకదా అని !
ఓసినీ ,  అదా నీ బాధ  ?  నాకోసం తమరు కష్టపడనవసపంలేదు..  నావంట నేను చేసుకుంటానులే..
అయినా నీవు ఉపవాసాలకి  ఆగలేవుకదే   కామూ, అదివరకు ఎన్నోసార్లు  చేస్తానని అనుకోవడం ఆఖరులో విరమించుకోవడం..
అబ్బ మీరు మరీనండీ,  అప్పుడంటే వేరు, ఇప్పుడు  ఎందుకో ఉపోషం ఉండాలని  ముచ్చట పడుతున్నాను, ఇద్దరం అనుకుని ఉంటే అదో తృప్తంటూ  మొత్తానికి  రంగనాధాన్ని ఉపవాసానికి ఒప్పించింది..

మర్నాడు ఉదయాన్నే,  స్నానం, పూజా, అభిషేకం పూర్తిచేసుకుని దగ్గరలోనున్న శివాలయానికి వెళ్లి వచ్చారు..

ఇంట్లో దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి కాయ చిప్పలను తీసి జాగ్రత్త చేసింది..  బయట ఉంటే ఎండలకు పాడైపోతాయని  ఫ్రిజ్ లో పెట్టింది, రేపు కొబ్బరీ మామిడికాయపచ్చడి చేయొచ్చని..

ఒక గంటగడిచింది.. మెల్లిగా కడుపులో కదలికలు మొదలౌతున్నాయి..  నిన్న భర్త సంతనుండి తెచ్చిన కాయగూరలు కంటిముందు మెదులుతున్నాయి, లేత వంకాయలు, చిక్కుడుకాయలు, వాక్కాయలూ,   లేత దొండకాయలు, తోటకూర, బచ్చలికూర, ఇలా ఒహటేమిటీ, చాలా తెచ్చి పడేసారు..  పనస చెక్క కూడా కొని తెచ్చారు..  చిన్నముక్కలు చేసి మిక్సీ లో వేసి పొట్టుగా చేసి  ఆవ పెట్టి  కూరొండుకోవచ్చని !

ఇంతలో సడన్ గా  విజయవాడనుండి వియ్యంకుడు ఆటోలో నుండి దిగాడు..  ఏదో పనిమీద రెండురోజులక్రితమే  హైదరాబాద్ వచ్చి , ఆపనిపూర్తయ్యాకా వీరింటికి వచ్చాడాయన..  ఈ విషయం వీరికి తెలియదు..  ఆయన ఫోన్ చేయలేదుకూడా..

కుశల ప్రశ్నలనంతరం   కాఫీ తెచ్చిచ్చింది కామేశ్వరి..  రాత్రి వారింటినుండే  బస్ లో విజయవాడ వెళ్లిపోతానని చెప్పాడు..

మీరు ఉపోషమా,  భోజనం చేస్తారా అని అడగానికి  సంశయిస్తున్న తరుణంలో ఆయనే  " ఏమిటో బావగారూ,  ఉపోషాలూ అవీ ఈ వయస్సులో సహకరించడం  లేదు"  ..  ఆవేళకు భోజనం కడుపులో పడకపోతే  తట్టుకోలేని పరిస్తితి అయిపోయింది..  మీరూ, మా  చెల్లాయీ  ఉపోషంలో లేరుకదా , నాకుతెలిసి మీరు కూడా  ఉండలేరనేసరికి   ,  వియ్యంకుని మాటలు ఆవిడకు  చెవిలో   అమృతంపోసినట్లుగా అయిపోయాయి..  ఆవిడకు అప్పటికే ఆకలి,  కమ్మని ఆ కాయగూరలూ కనపడుతున్నాయి..

ఏమీ మాట్లాడకుండా వంటింట్లోకి వచ్చేసింది..  కాసేపటికి రంగనాధంగారు కూడా వంటింట్లోకి వచ్చి భార్యతో, నేను చెపుతానులే కామూ, మనిద్దరం ఉపోషంలో ఉన్నామని, ఆయనకు వంట చేస్తున్నావని అనేసరికి ఆవిడ అలా చెప్పవద్గని, అన్నయ్య గారు నొచ్చుకోవచ్చని  చెప్పింది..  ఈసారికి మనంకూడా ఉపోషం కేన్సిల్ చేసుకుందామని వచ్చే సంవత్సరం   శివరాత్రికి  తప్పకుండా ఉందామని  అనేసరికి ఆయన కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు..  ఈ ఆడవాళ్లే ముందస్తుగా అన్నీ ప్రపోజ్ చేస్తూ , వారికి తగినట్లుగా చివరకు అన్నీ కేన్సిల్ చేస్తారని గొణుక్కున్నాడు..

వియ్యంకుని రాక  ఆవిడ కడుపులోని ఆకలి కదలికలకు  ఊపిరి పోసినట్లైంది.. గబ గబా  కొంగు   దోపేసి  లేత వంకాయలలో మెంతికారం కూరి మువ్వంకాయ కూర,  వాక్కాయపప్పు, కొబ్బరి మామిడి పచ్చడి, నాలుగు బచ్చలాకులేసి మజ్దిగపులుసు చేసేసి  కాసిని   గుమ్మడి వడియాలూ, ఊర మిరపకాయలూ  నూనెలో వేపేసి,  ఓ పుంజీడు అరటికాయ బజ్జీలు,  ఆవుపాల పేకెట్ మరొకటి ఉంటే కాస్త సేమియాపాయసం చేసేసి, వియ్యంకుడికి, భర్తకు వడ్డించేసింది..  ఏమిటో అన్నగారూ, ఈసారికి సింపుల్ గా చేసేసానంటూ  చిరుసిగ్గులు ఒలకబోస్తూ, చెప్పేసరికి ఆ వియ్యంకుడు, ఏమైనా  మా చెల్లాయి చేసిన  మువ్వంకాయకూర, మజ్జిగపులుసు రుచి ఎవరువండినా రాదు అంటూ కడుపునిండా  తిని బ్రేవ్  మంటూ  త్రేన్చాడాయన..
ఆవిడ  భోజనానికి  కూర్చునే ముందు   దేవుడి గదిలోకి వెళ్లి, పరమేశ్వరా, క్షమించు మమ్మలని,  అతిధిగారికి భోజనం పెట్టకుండా పంపలేము కదా.   ఆ చేత్తో మేమూ కాస్తంత కతకవలసి వచ్చిందంటూ, వచ్చే శివరాత్రికి తప్పకుండా ఉపవాసం చేస్తాము స్వామీ అని  విన్నవించేసరికి   ఆ భోళా శంకరుడు " అమ్మా కామేశ్వరమ్మా,  భక్తుల మనసును ఎరుగని వాడను కాదు " .    నిన్ను నేను ఉపవాసం చేయమన్నానా తల్లీ,  నీలో  ఆ ఓపికా, సహనం లేవని తెలిసే,  నీ దృష్టి అంతా  కమ్మని భోజనం వైపు లాగుతోందని గ్రహించి, మీ వియ్యంకుడిని  నేనే పంపానమ్మా,  వెర్రిదానా అన్నట్లుగా చిరునవ్వు చిందించాడాయన !!

*****

రమణీయ నిజరామ-రామ దశరథ రామ
రఘుకులహరివి రామ-రామ భార్గవ  రామ
రవి తేజరఘురామ-రామసుందరరామ
రమ్యరాఘవ రామ-రామ పరంథామా 
రవలిజానకిరామ-రామపంకజరామ
రమణి సీతా రామ- రామ మిథిలారామ
రజని రమ్యపు రామ- రామాశ్రీ రామా
రత్న పాన్పునరామ-రామాఅభి రామా
రవితేజ రఘురామ-రామా సుగుణ రామ
రంగ నాధరామా-రామఅభినవరామ
రసరమ్యపురామా-రామకరుణా రామ
రణరంగముపురామ-రామభీకర రామ
రథములోనరామ- రామ పౌరుషరామ
రథికుడవుశ్రీరామ-రామసీతారామ
రవిశశినయనరామ-రామనిర్మల రామ.
రమా రమణవు రామ-రామ హనుమత రామ
రమారామరామా-రామా రామ రామ.. 

**ఒక తమిళ వ్యక్తి రాసిన వ్యాసాన్ని యధాతధంగా.....
నా మాతృ భాష తమిళ భాష. దాని అర్థం ఇతర భాషల ను గురించి తెలియదని కాదు. తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.
    తెలుగు మాతృ భాష గా ఎవరికి వున్నదో, తెలుగు భాష ను ఎవరు ప్రేమిస్తున్నారొ, తెలుగు గురించి ఎవరు తెలుసుకుందాము అనుకుంటున్నారో వారి కోసం కొన్ని విషయాలు.
1. తెలుగు భాష సుమారు సామాన్య శకానికి ముందు 400 క్రితం నుండే  వుంది.
2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడినది.
మొదటి లిపిగ కొరియన్ భాష.
3. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు వుత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలిన భాష ల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.
4. శ్రీలంక లో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.
5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.
6.  ఇటాలియన్ భాష లాగానే తెలుగు భాష లో కూడా  పదాలు అచ్చుల శబ్దం తో అంతమౌతాయని 16 వ శతాబ్దంలో ఇటలీ కి  చెందిన  నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే  తెలుగు భాషను " ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్". అని అంటారు .
7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు.
ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానం ను పొందింది.
8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. త్రిలింగ పదమే నేడు వ్యవహారికంలొ తెలంగాణ అయ్యింది.  హిందూ పురాణాల ప్రకారం  త్రిలింగక్షేత్రాలు తెలంగాణ రాష్ట్రం లోని కాళేశ్వరం, రాయలసీమ లోని శ్రీశైలం, ఆంధ్రా ప్రాంతం లోని భీమేశ్వరమ్ ల మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.
9. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాష లో మాత్రమే ప్రతి పదం అచ్చు శబ్దం తో పూర్తి అవుతుంది.
10. తెలుగు భాష లో వున్న అన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాష లోన లేవు.
11. తెలుగు భాష ను పూర్వం తెనుంగు, తెలుంగు మరియు తెలంగి అని కూడ వ్యవహరించేవారు.
12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.
13. 200 సం. ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతే.
14. రామాయణ మహాభారతాల్లో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాష సాహిత్యం లో కూడా లేదు.
కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన వోకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.
15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగలో వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పి తెలుగు ను  తన సామ్రాజ్యం లో అధికార భాష గా చేసాడు.
16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే. 

తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకత ను అందిస్తుంది ఆనడం లో ఏమాత్రం సందేహం లేదు.పై విషయాలు అన్నీ వొక తమిళ వ్యక్తి  ఆంగ్లం లో  తెలియజేసిన విషయాల ను అనువదించారు. ఇది నిజం. ఇంత గొప్ప మన భాషను మన భావితరాల వారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరం పై వుంది. 

తెలుగు భాష ను చంపేసే తరం గా మనం వుండకూడదని నా భావన. ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు.అందుకు వారు గర్వపడతారు. అది ఏమి దౌర్భాగ్యమో, ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో గానీ తెలుగు వారం మాత్రం ఆంగ్ల భాష లో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆ పదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇకనుంచి అయినా తెలుగు భాష పై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగు లో మాట్లాడుదాం. ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాషను బలిచేయనవసరం లేదు. తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుదాం. 
🙏🏻🤝🏻🙏🏻🤝🏻🙏🏻🤝🏻🙏🏻🤝🏻🙏🏻🤝🏻🙏🏻🤝🏻🙏🏻🤝🏻
2


1 comment: