Sunday 6 March 2022

మార్చి మొదటి వార పత్రిక (01-03-2022 నుండి 07-03-2022)

 




ఈవారం శ్లోకాలు - భావాలు ( 1/3 నుండి 7/3)

భావరాశిస్తథా బోధః సర్వో యాత్యేకపిణ్డతామ్‌ 

విచిత్రమృగ్భాణ్డగణో యథాఽపక్వో జలే స్థితః

జలమందుంచబడిన అనేక విధములైన పచ్చిమట్టిపాత్రలు జలమందు కరిగి ఒకే జలరూప మగునట్లు, ఆత్మతత్త్వబోధచే ఈ దృశ్య పదార్థసమూహము, తద్వృత్తిరూపమగు జ్ఞానము, సమస్త జీవులు అంతయు ఏకమై ఒకే బ్రహ్మరూపత్వము నొందును. 

పురుషేణ జాతమాత్రేణైవ బాల్యాత్ప్రభృతి 

విద్యాగ్రహణం కర్తవ్యం గురవోఽనుగన్తవ్యాః.

జన్మించిన పురుషుడు బాల్యకాలమునుండియే విద్యాగ్రహణ మొనర్చుచు, తత్త్వవేత్తలగు గురువుల నాశ్రయింపవలెను. 

స్వచ్ఛదృశా చిత్తవృత్తేః పురుషస్య 

హేయోపాదేయవిచార ఉత్పద్యతే.

చిత్తము నిర్మలమైనపుడు అట్టి నిర్మల చిత్తవృత్తియొక్క దృష్టిచే మనుజునకు ఇది (సంసారానర్థము) త్యాజ్యము. ఇది (మోక్షోపాయము, ఆత్మ) గ్రాహ్యము అనునిట్టి విచారణ ఉదయించును.

రోజుకోశ్లోకం :: 04-03-2022

బలినో బలినః స్నిహ్యంత్య   బలం తు న గృహ్ణతే |

     దావం దీపాయతే చండో   దీపం వ్యాహంతి మారుతః౹౹

బలం ఉన్నవారితోనే బలవంతులు స్నేహాన్ని చూపుతారు. బలహీనులను వాళ్లు ప్రోత్సహించరు.అలాగే,చండమారుతం కారుచిచ్చును ప్రజ్వలించేలా చేస్తుంది.దీపాన్ని ఆర్పేస్తుంది.

*****

రోజుకోశ్లోకం :: 04-03-2022

నాతిదూరే న చాసన్నే అత్యాఢ్యయే చాతిదుర్బలే౹

     వృత్తిహినే చ మూఖే చ షట్సు కన్యా న దీయతే౹౹

అతి దూరములో ఉన్నవాడికి, చాలా దగ్గిరగా ఉన్నవాడికి,చాలా సంపదలు ఉన్నవాడికి,చాలా దుర్బలుడికి,ఉద్యోగం లేనివాడికి,మూర్ఖుడైన వాడికి కన్నెపిల్లను ఇవ్వరాదు.

*****

రోజుకోశ్లోకం :: 03-03-2022

కీటోసపి  సుమనః సంగాదా రోహతి  సతాం శిరః౹

  అష్మాపి యాతి దైవత్వం  మహాద్భిః సుప్రతిష్టతః ౹౹

పువ్వుల సహవాసం వల్ల క్రిమికూడా సజ్జనుల శిరస్సుపై చేరుతుంది.మహా మహానుభావులు ప్రతిష్ట చేయడం వల్ల శిలకూడా దైవత్వాన్ని పొందుతుంది.

****

రోజుకోశ్లోకం :: 02-03-2022

సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్|

తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్

పాణిభ్యామలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీమ్|

సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం॥

భావము

సిందూరం మాదిరిగా ఎర్రనైన శరీరంతో, మూడు కన్నులతో, తారానాయకుడైన చంద్రుణ్ణి మాణిక్యకిరీటమునందు ధరించి, చిఱునగవుతో కూడిన ముఖంతో, ఉన్నతమైన వక్షస్థలంతో, చేతులలో మద్యంతో నిండిన రత్నభాండాన్ని, ఎర్రని కలువను ధరించి, సౌమ్యమైన రూపంతో రత్న ఘటమునందు ఎర్రని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ధ్యానించవలెను

🙏🙏🙏🌹🌹🌹

రోజుకో శ్లోకం  -- 01-03-2022

శ్లో. ఋషిర్గురుత్వాచ్ఛిరసి ధ్యేయత్వాద్దేవతా హృది|

ఛందోఽక్షరత్వాజ్జిహ్వాయాం  న్యస్తవ్యం మన్త్రవిత్తమైః॥

శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర మంత్రమునకు - శిరస్సున వశిన్యాది వాగ్దేవతారూపులగు ఋషులకు నమస్కారము, ముఖమునందు అనుష్టప్ ఛందస్సునకు నమస్కారము, హృదయమునందు శ్రీమహాత్రిపురసుందరీ దేవతకొరకు నమస్కారము, నాభియందు బీజము కొరకు నమస్కారము, గుహ్యమునందు శక్తికొరకు నమస్కారము, పాదములందు హకారము కొరకు నమస్కారము, నాకు సర్వాంగములయందు చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థమైన జపమునందు వినియోగము కొరకు నమస్కారము.

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹

0

ప్రాంజలి ప్రభలు..

* కష్టములయందు దయ 

 కష్టములకు గురియైన వారియందు దయకలిగి వారికి క్షేమము కలిగించుటకు పాటుపడుట.

దీనివలన తనకు కష్టములు కలుగవలసిన కారణము తొలగిపోయి కర్మ రాహిత్యము సిద్ధించును. ఒకవేళ తనకు కష్టములు కలిగినచో అవి కలిగించువారి యందు ద్వేషము వహింపక దయ కలిగి వర్తింపవలెను. 

." మంచి విషయములు, వస్తువుల యందు సంతోషము :-

ఇతరులలో నున్న మంచి గుణములు చూసి సంతోషపడి మనసార కీర్తింపవలెను.

 కాని ద్వేషపడి ఈర్ష్యతో కృంగి కృశింపరాదు. ఎదుటి వారిలోనున్న సద్గుణములు ధ్యానము చేసి స్తుతించుచున్నచో, క్రమేణా మనయందు కూడా అట్టి సద్గుణములు మేల్కొని వర్తింప నారంభించును.

****

*తాజా వార్త*

* *అన్ని మీడియా హౌస్‌లు ఉక్రెయిన్ సంక్షోభాన్ని కవర్ చేయడంలో బిజీగా ఉండటం మరియు కోవిడ్ ఉనికిని మరచిపోవడంతో  కరోనా 4th wave వాయిదా వేయడమైనది.....*

 *కోవిడ్ యొక్క అన్ని వేరియంట్‌ల కొత్త విడుదల తేదీలు త్వరలో ప్రకటించబడతాయి.*

 *హాస్పిటల్స్ కి , మందుల షాపులవారికి కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాము*.

 😀😀

*ఒక మంచిమాట వైరాన్ని అంతం చేస్తుంది.

ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది.

ఒక మంచి మాట కుటుంబాన్ని నిలబెడుతుంది.

ఒక మంచి మాట దృష్టున్ని కూడా మార్చగలిగే శక్తి వుంది 

****

*మాయ..

మానవునిపై మాయాశక్తి త్రిగుణాత్మకమైనది దాటుటకు శక్యము కానిది

ఈ జీవుడు ,  సూర్యుని వైపు వీపుత్రిప్పి  ఉన్నంతవరకు తన నీడయగు మాయను చూసి భయ పడతాడు

అదే ముఖం సూర్యుని కభిముఖం అయితే మాయ వెనక్కి వెళ్ళి పోతుంది 

మాయను దాటడానికి పరమాత్ముని పై భక్తి చాలా ముఖ్యమైనది

****

*🧘‍♂️01)అష్టావక్ర గీత🧘‍♀️*

🔥ఓంశ్రీమాత్రే నమ

ప్రాంజలి ప్రభ

*అష్టావక్రగీత - పరిచయము:-*

*సత్యం ఏకంగా అద్వయంగా ఎలా ఉందో తెలియజెప్పేది తత్త్వ జ్ఞానం. దీనిని ఎన్నో శాస్త్రాలు పురాణాలు, ఇతిహాసాలు వాఖ్యానాలూ ఉపాఖ్యానాలూ, మహాత్ములు మామూలు మనుషులు కూడా చెప్పడానికి ప్రయత్నించడంతో అనేకరకాలైన వ్యాఖ్యానాలూ అనుమానాలు కూడా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి.*

*వీటిలో ఎక్కువ మంది ప్రమాణంగా అంగీకరించిన వాటిలో శ్రీమద్భగవద్గీత ఒకటి. ఇది శ్రీ కృష్ణార్జున సంవాద రూపంలో ఉంది. ఇందులో అర్జునుడు సత్యాన్వేషిగా, కృష్ణుడు తత్త్వబోధకుడుగా భగవంతుడుగా కనిపిస్తారు.*

*రెండవదైన వశిష్ఠగీత (యోగవాసిష్ఠం)లో శ్రీరామునికి గురువుగా వశిష్ఠుడు జ్ఞానవిజ్ఞానాల నందిస్తూ తత్త్వబోధ చెయ్యడం చూస్తాము. అష్టావక్ర గీతకూడా ఇదే విధంగా జనక మహారాజునకూ అష్టావక్ర మునీంద్రునికి జరిగే సంవాద రూపంలో ఉంది.*

*మహాభారతంలో ఇది చాలా చక్కని ఉపాఖ్యానం.*

*అష్టావక్రుడు తల్లి సుజాత గర్భంలో ఉండగానే తన తండ్రి కహోదకుడు చదివే వేద శాస్త్రాలన్నిటినీ విని ఆకళింపు చేసుకుని మహాపండితుడు అయినాడు. ఒకనాడు తన తండ్రి చదివే దానిలో తప్పువిని గర్భంలో నుండే దిద్దబోగా, కోపించిన కహోదకుడు, శిశువును అష్టావక్రుడవు కమ్మని శపించడంతో అష్టవంకరలతో జన్మించాడు.*

*ఇతని చిన్నతనంలోనే ఇతని తండ్రి జనక మహారాజును ఆశ్రయించి ధనం సంపాదించాలనే కోరికతో విదేహపురానికిపోయి, అక్కడ జనకరాజర్షి ఆస్థాన పండితుడయిన వందినునితో ఓడిపోయి, అతని తండ్రి అయిన వరుణునికి సేవకునిగా నియమింపబడి ఉండిపోవలసి వచ్చింది.*

*అష్టావక్రుడు తన రూపంతోపాటు తండ్రి లేకపోవడాన్ని కూడా అందరూ హేళన చేయడం భరించలేక, తల్లి సుజాతను తండ్రి గురించి నిలదీసి అడిగి తెలుసుకున్నాడు. అప్పటికి 12 సంవత్సరాల బాలుడయినప్పటికీ తన మీద దృఢవిశ్వాసంతో విదేహనగరానికి వెళ్ళి, చాలా కష్టం మీద రాజాస్థానం ప్రవేశించి,* ఆస్థాన విద్వాంసుడైన వందినుని ఓడించి, తండ్రిని చెర నుండి విడిపించాడు.*

 *సంతోషస్వాంతుడైన తండ్రి, కుమారుని సమంగానదిలో స్నానం చేసిరమ్మని అతని వక్రత్వాన్ని పోగొట్టి అందమైన బాలునిగా ఆశీర్వదిస్తాడు. సత్యాన్వేషి అయిన జనకరాజర్షి ప్రశ్నలూ, అష్టావక్ర మునీంద్రుని జవాబులూ ఈ అష్టావక్రగీత (అష్టావక్ర సంహిత) గా పేరు పడ్డాయి.*

*ఉన్న ఏకైక సత్యమే తాననీ, అదే అనంతంగా భ్రమ కలిగిస్తున్నదనీ, దృఢజ్ఞానం కలిగిన అష్టావక్రుడు చెప్పేది అర్థం చేసుకోవడానికి జనక మహారాజు వలె అర్హత కలిగి ఉండాలి. అంటే సత్యాన్వేషణలో అనేక ప్రయత్నాలు చేసి అనేక కోణాల నుంచి అర్థం చేసుకోగలిగే శక్తి కలిగి, చివరగా మిగిలిపోయిన కొద్ది సందేహాలు కలిగివారికే అర్థం అవుతుంది.*

*సగుణరూపి అయిన భగవంతుని ప్రసక్తే లేని ఈ సంవాదం వింటే సామాన్యులకు అర్థం కన్నా అపార్థం అయ్యే  అవకాశమే ఎక్కువ ఉన్నది. సర్వవ్యాపియై భగవంతుడే ఉన్నాడనీ, నేనూ జగత్తూ వేరే లేవనీ, దృఢజ్ఞానం కలిగి, ఆ భగవంతుడిని, ఆ ఏకైక సత్యాన్ని అన్వేషించే బుద్ధికలిగిన వారికి మాత్రమే ఇది సరైన ప్రయోజనం ఇవ్వగలదు.*

*సాధన చతుష్టయ సంపన్నులై, శాస్త్రాధ్యయన తత్పరులై, ధార్మిక జీవనం సాగిస్తూ, అంతరంగ శుద్ధిని, నిశ్చల మనోబుద్ధుల శాంతస్థితిని సాధించి, సత్యాన్వేషణకోసమే జీవిస్తున్న ఉత్తమాధికారులకు, అర్హులకు, ఈ గీత ఉద్దేశించబడింది.*

*అహంకారాన్ని, తద్వారా చూడబడే ప్రపంచపు స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకుని, భావంలో భావంతో గుర్తింపబడే భావనామయ జగద్భ్రమను విడనాడాలనే దృఢసంకల్పంతో, ధీరత్వంతో ఆఖరి అడుగు వేయబోయే సత్యాన్వేషులకు, సాధక శ్రేష్ఠులకు, తత్త్వ జిజ్ఞాసులకు మాత్రమే ఇది సరిగా అర్థం అవుతుంది.*

*20) అధ్యాయాలు:-*

*01- ఆత్మ సాక్షిగా, అందరిలో,*

*02- ఆత్మ అత్యద్భుతం,*

*03- ఆత్మ అందరిలో అందరూ ఆత్మలో,*

*04- ఆత్మానుభవం - విశిష్టత, ప్రత్యేకత (ఆత్మసాక్షాత్కారం),*

*05- చతుర్విధ మార్గాలు -  అహంకార వినాశనం-లయం,*

*06- పరమాత్మ,*

*07- ఆత్మ - ఆనంద నిలయం,*

*08- బంధము - విముక్తి,*

*09- నిర్లిప్తత - ఉదాసీనత - నిర్వేదము,*

*10- నిర్మమత్వం - వైరాగ్యం,*

*11- ఆత్మ - జ్ఞానస్వరూపము,*

*12- ఆత్మనిష్ఠ, బ్రహ్మనిష్ఠ ఎలాసాధ్యం?,*

*13- ఆత్మ పరమానంద స్వరూపం,*

*14- ఆత్మ - శాంతస్వరూపమే,*

*15- సత్యం ఏకం - అదే ఆత్మ బ్రహ్మం,*

*16- ఆత్మనిష్ఠ - అనువైన సూచనలు,*

*17- ఆత్మ ఏకం - అద్వయం, కేవలం,*

*18- లక్ష్యము,*

*19- ఆత్మానుభవం - అఖండానందైక రసరూపం,*

*20- పరమార్థ స్థితి***

*కర్షకుని కృషి

ఆ చిరుగుల , మాసిన గుడిసె రాజప్రాసాదమే అతనికి

ప్రేమతో నాటిన మొనలకలు నేలతల్లి ఒడిలోనే జీవం పోసుకుంటాయి, అతడు పగలు నక్షత్రాలు చూపే గుడిసె,

పూల పరిమళాలను ఆస్వాదించే మనకు ఆ సువాసనలు పంచేదుకు పూలవ్యాపారం.

నాట్లు వేసిన  పంట దక్కేదెన్నడు, ఆలోచనలో 

కర్షకుని కుటుంబం నుదుటి నుండి రాలిన చెమటపూలు కృతజ్ఞతతో భూమాతకు నమస్కారం చేయుటయే తక్షణ కర్తవ్యం .

***

కధలు..5/03/2022

ఉక్రెయిన్ దేశం పై రష్యా యుద్ధం ప్రారంభించి ఆరు రోజులు అవుతున్నా.. రష్యా ఒక్క సారి కూడా యుద్ధం ఆపలేదు. ప్రపంచ దేశాలు యుద్ధం ఆపడానికి అనేక ప్రయత్నాలు చేసినా.. అన్నీ కూడా విఫలం అయ్యాయి.

కానీ భారత్ పవర్ చూపించింది. ఉక్రెయిన్ లోని ఖార్కివ్ లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రధాని మోడి.. పుతిన్ కు ఫోన్ చేశారు. ఖార్కివ్ లో ఉన్న భారతీయులను తరలించడానికి సాయం చేయాలని కోరారు. దీనికి పుతిన్ సానుకూలంగా స్పందించారు. అంతే కాకుండా ఖార్కివ్ లో దాదాపు 6 గంటల పాటు యుద్ధం ఆపాలని అక్కడ ఉన్న బలగాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు.

ఖార్కివ్ లో ఉన్న భారతీయులు అందరూ 6 గంటల్లో ఖాళీ చేయాలని సూచించారు. కాగ ప్రపంచ దేశాలు యుద్ధంపై ఎన్ని ప్రకటనలు చేసినా.. రష్యా తగ్గలేదు. కానీ భారత్ ఒక్క ఫోన్ కాల్ తో యుద్ధాన్ని ఆపించింది.

11

కధలు..04-03-2023

భోజన ప్రియత్వ స్నాత కొత్తర కోర్స్ 

నేను  భోజన సంతర్పణ విశ్వవిద్యాలయములో, ‘భోజన శాస్త్రమూ, అందలి మెళకువలూ’ అనెడి విషయమునందు రెండు సంవత్సరముల ఎం ఏ చదువుకొనుచున్న రోజులవి! ఆ 

ఎం ఏ పట్టా పొందుటకు గల పాఠ్యాంశములలో, 

బాగుగా నములు పద్ధతులూ, 

వివిధ ఆధరువులూ, 

ఆధరువులకు గల అనేక అనుపానములూ, 

భోజన సమాప్తి యందు  

విస్తరిని  ఒక్క అణువు కూడా మిగులకుండ శుభ్రపరచు విధానములూ, 

భోజన తయారీకి వాడు వివిధ దినుసుల ప్రాంతీయ ప్రాముఖ్యతా వంటివాటిని, 

గొప్ప పాకాచార్యులు 

బోధించెడి వారు! 

మా  భోజన సంతర్పణ విశ్వవిద్యాలయపు ఉప కులపతి (వైస్ చాన్సెలర్ ) అయినటువంటి పప్పు పార్వతీశావధాన్లు గారు ఎల్లప్పుడూ ఉటంకించెడివారు -

'సద్భోజనము వండుట కన్ననూ, 

ఆ సద్భోజనమును ముప్పూటలా ఆరగించు విధానము తెలిసి, దానినుండి బ్రహ్మానందము పొందగలుగుట యే కష్టసాధ్యము!' అని!

🍜

నా ఎం ఏ (భోజనానందము)  ఆఖరి సంవత్సరపు వార్షిక పరీక్షల యందు, ప్రశ్నాపత్రమునందు గల ఒక 30 మార్కుల ప్రశ్న ఏమనగా, 

'నీ మధ్యాహ్న భోజనమునకు వేడన్నమూ, వేయించి ఉడకబెట్టిన ముద్ద పప్పూ, పుల్ల పీచు గల, టెంక గట్టి  మామిడికాయలతో, సామర్లకోట పప్పు నూనె, ఆవపిండీ, వినుకొండ ఎర్ర ఖారమూ వాడి పెట్టిన ఆవకాయా, పాల ఇంగువ తిరగమాత తో, గుమ్మడీ, శొరా, బెండా, రామ ములగా, ములగా ముక్కలతో కాచిన ముక్కల పులుసూ, ఎర్ర మినప అప్పడములూ, అవనిగడ్డ ఆవు నెయ్యీ,  ఒంగోలు బర్రెల చిక్కని పాల పెరుగూ ఉన్నవి! నీవు ఈ ఆధరువులను ఏ విధముగా ఆరగించెదవో ఒక ఠావుకు మించక వర్ణించుము!' అని!  

నేను వ్రాసిన సమాధానము ఇది:

'ముందుగా, వేడన్నము నందు ఆ ముద్ద పప్పు మొదటి పర్యాయము కలిపి, ఆ ఆవునెయ్యి మూడు చెంచాలు దట్టించి, ఆ పప్పన్నము తో పాటు, విస్తరి యందు పక్కగా వేసుకున్న ఆ ఎర్ర పుల్ల ఆవ ఊట ఆవకాయ నంచుకునుచూ ఆరగించెదను! మధ్యే మధ్యే ఆ ఎర్ర మినపప్పడము ముక్క నములుదును! రెండవ తూరి, తిరిగి ఆ వేడన్నము నందు ముద్ద పప్పు కలిపి, నెయ్యి కుమ్మరించి,  విస్తరికి పక్క గా కొంచెము ఆ ఇంగువ ముక్కల పులుసు ఒక గరిటెడు పోసుకొని, ఆ పప్పన్నము తో పాటు ఆ పక్కనున్న వేడి ముక్కల పులుసు అద్దుకొనుచూ ఒక పట్టు పట్టెదను! మూడవ పర్యాయము తిరిగి ఆ వేడన్నము నందు ఆ ముద్ద పప్పు బాగుగా కలిపి, ఆ పప్పన్నము మీద ఆ ఇంగువ ముక్కల పులుసు పోసుకొని, ఆవునెయ్యి తో తడిపి, కడుపారా తాదాత్మ్యము చెందుచూ ఆరగించెదను! ఇక చివరి గా, ఆ వేడన్నమునందు ఆ ఒంగోలు బర్రెల మీగడ పెరుగు వేసుకొని, ఆ పెరుగన్నము నందు, ఆ గుమ్మడి ముక్కల గుజ్జూ, ఆ శొరముక్కల రుచీ, ఆ బెండముక్కల జిగురూ ఆస్వాదించుచూ తినివైచెదను!'

ఈ సమాధానము చదివి నోరు తడిసి పోయిన మా ప్రొఫెసరు శొంఠి శ్రీరామ శర్మ గారు ఆ సమాధానమునకు ముప్పై మార్కులకు ముప్పై మార్కులూ వేసినారు!!

ముదావహమైన విషయము ఏమనగా, ఆ ఏడాది ఆ ఎం ఏ పట్టా  యందు నేను విశ్వవిద్యాలయమునందు ప్రధమ స్థానము సంపాదించి, 'ఘటోత్కచ గోల్డు మెడలు ' కూడా అందుకొనగల్గినాను! 

ఈ విషయమును మీతో పంచుకొనుటకు సంతోష భుక్తాయాస పడుచున్నాను 

🍜🙏

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
 
సర్వేజనా సుఖినోభవంతు
ప్రాణ దాతలు 

 ఏమిటోయ్ పొద్దున్నే ఆకుకూర పట్టుకొచ్చావ్, అలా కూర్చొని వాగే బదులు కాస్త మీ భార్యకు సహకరిస్తే మీ సొమ్మేపోదు అన్న మాటలకు అంత రుసరుస పలుకులతో మాట్లాడుట మంచిది కాదే  అన్నాడు భర్త.

మాటలకేం చక్కగా మాట్లాడుతారు,  నా మాటలకు మాత్రం సమాధానము రాదు. ఏమిటే అట్లా మాట్లాడుతావు నీవు ఏదంటే అదే చేస్తున్నాగా, సరే మీరు ఇప్పుడు ఏమిచేయ వద్దులే అంతా  నేను చేసు కుంటాలే, అప్పుడే కోపం వచ్చిందా ఏమిటి, కోపం కాదండి మీచేత పనిచేయిన్చటం మంచిది కాదు కదండీ, అన్ని నీవే అంటావు అంతా మీ ఆడోళ్లకే చెందుతుంది.  ఏమాటైనా నవ్వుతూ ఆకుకూర తీసుకొని లోపలకు వెళ్ళింది.

అవునే మనపిల్లలు కనిపించుట లేదే, అయ్యే రామ మీకు చెప్పలేదా, స్కూలు పిల్లలతో చెన్నై టూర్ కు వెళ్లారు, ఎదో చేతి ఖర్చు కావాలంటే ఇచ్చాను.

అవునే రాత్రి  నిద్రలో పిల్లలొచ్చి అడిగారు నేను ఒప్పు కున్నాను కూడా.
ఈ వయసులో అంత  మతి మరు పేంటీ, ఏమోనే పిల్లలను స్కూల్లో దించే అలవాటుగా అడిగా అంతే.
మనం ఈ కార్తీకమాసంలో విజయవాడ వెళ్లి కృష్ణలో స్నాన మాచరించి, దుర్గమ్మను కొలిచి అక్కడే ఉన్న మాగురువు గారు శర్మ గారింటికి వెళ్లి వద్దామా, పిల్లలు ఎటుతిరిగి చెన్నై కి వెళ్లారుకదా అని అడిగాడు భర్త శంకరం భార్య పార్వతితో.
నీమాట ఎప్పుడు కాదన్నానండి అని నవ్వుతూ పలికింది. అవునే నామాట ఎప్పుడూ కాదనవు, సరేలే ఒక మూడు రోజులు సరిపడే బట్టలు సర్దు నేను బస్సు టిక్కెట్లు తెస్తాను, ఈ రోజు రాత్రికె వెల్దాము,
అట్లాగేనండి అన్నీ సర్దుతా
తెల్లవారుజామునే విజయవాడ లో ఉన్న శర్మగారి ఇంటికి చేరారు.
శర్మ గారి కుటుంబం సాదరంగా ఆహ్వానించింది, అయన భార్య సరస్వతి, పిల్లలు కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు, చేతికి టవల్ అందించారు. అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని ఉభయ పక్షాల క్షేమ సమాచారాలు తెలుసు కున్నాక కృష్ణ స్నానం దైవదర్శనం అంటూ  మేము శర్మ గారి భార్య పిల్లలతో బయలు దేరాము.    

మేము ఘాట్ దగ్గర స్నానం చేసి పైకి వచ్చాము గుడికి పోదామని, అప్పుడే శర్మగారి పిల్లవాడు గబగబా నీటిలోకి దూకాడు నీటిలో కొట్టుకు పోతున్న పిల్లవాన్ని కాపాడాడు, నేలమీద పడు కోపెట్టి పొట్ట వత్తాడు, నోటి నుండి నీరు కారుతూ కదిలాడు, ఆపిల్లవాని తల్లి తండ్రులు ఆ ఆమ్మ వారు నీలో ప్రవేశించి కాపాడింది బాబు, ఈ బాబు వాని తల్లి తండ్రులు చాలా పుణ్యాత్ములు అంటూ దీవించి వెళ్లారు.
అప్పుడే ఒక్కసారి తనపిల్లలు చేసే పనులు  గుర్తు తెచ్చు కుంది పార్వతి. నా పుత్రుడు మోటార్ సైకిల్ తో  ముసలావిడకు  డాషిచ్చి,    అయ్యో పాపం అనక పోగా,  అడ్డు వచ్చిందని తిట్టి మరీవచ్చాడు,    పోలీసులకు డబ్బులిచ్చి కేసులేకుండా చేసాడు.    

నా పుత్రిక ఎమన్నా తక్కువ తిన్నదా ఇంటి ముందుకు బిచ్చగాలొస్తే వారిపై కుక్కను తరిమి సంబర పడేది.  పనివాళ్లను కూడా నీటికి వచ్చినట్లు తిట్టేది. 
మచ్చుకైనా గౌరవ భావము లేదు నా బిడ్డలకు. అనుకున్నది. 

అమ్మవారి దర్సనం చేసుకొని శర్మ గారి ఇంటికి చేరాము.
అప్పుడే శర్మ గారి తండ్రి గారికి సేవలు చేస్తున్నారు, ఆయన వయసు 70 దాకా ఉండవచ్చు, పిల్లలు తాతా బాగున్నావా పలకరింపులు ఆయన ఓపికతో కధలు చెపుతున్నాడు 

శరణ కోరినవారికి అనేక మార్గాలు చూపిస్తాడు ఆ పరమాత్ముడు, అన్నింటికీ మూలం బుద్ధి, ఇది సక్రమముగా నడుస్తున్నప్పుడు, మానవుని  ప్రతిభ, ప్రజ్ఞ, నలుదిశలా పరిమళిస్తుంది. రాగ ద్వేషా లు, మానవుని ప్రధమ శత్రువులు వాటిని మానవులు త్యజించాలి.  కానీ కొందరు ఎవరో ఒకరికి భయపడి బంధాలు తెంచుకుంటున్నారు, వయసు మీరిన తల్లి తండ్రులను దూరంగా ఉంచు తున్నారు. ఎందుకు అలా ప్రవర్తిస్తారో నాకు తెలియుట లేదు, వారు పెద్దవారు కారా వారి పిల్లలు వారిని అట్లా చూస్తారని అనుకోరు ఎందుకు , ఇది అంతా కలియుగ మహిమ అనుకుంటున్నాను అని భాదతో శర్మ గారి తండ్రి గారు భాదతో పలికారు.  అవును శంకరం గారు మీ నాన్నగారు బాగున్నారా, వారు నాకు ప్రాణ దాత ఎలాగంటే మీనాన్నగారు నేను ఒకే ఆఫీసులో పనిచేసే వాళ్ళము, ఒకనాడు క్యామ్పుకు ఇద్దరం కలసి వెళ్ళాము, అక్కడ వాతావారణం నాకు పడ  లేదు, అంతా వర్క్ మీనాన్న చేసాడు అప్పుడే నాకు ఎదో పురుగు కుట్టింది,జ్వరం కూడా వచ్చింది వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు, నాకు సేవలు చేసాడు అటువంటి ప్రాణదాతకు నేను రుణపడి ఉన్నాను 
మీఇంటికి వచ్చి కలవాలని అనుకుంటున్నాను అన్నాడు.      
వింటుంటే పార్వతి మనసు కరిగి పోయింది. నేను ఉద్యో గం మానేసి మావ గారికి, అత్తయ్య గారికి సేవలు అందిస్తాను. 

అప్పుడే నెమ్మదిగా భర్త దగ్గరికి చేరి ఏమండి మీ తల్లితండ్రులను   వృద్ధాశ్రమం నుండి తీసుకొస్తే ఎంత బాగుంటుంది.

అవునే నేను చాలా తప్పు చేసాను,   ప్రాణ దాతలను నిర్లక్ష్యం చేసాను, అన్న  లు  వంత  పలికారని నేనుకూడా వెనకాడాను, వారికి సేవ చేయకుండా వృద్ధాశ్రమం లో ఉంచాను, నెలకు కొంత డబ్బు పంపుతున్నాను కానీ వారి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ఇప్పుడు శర్మ గారి కుటుంబం చూసాకా నేను తల్లి తండ్రులకు  సేవ  చేద్దా మనిపిస్తున్నది.
అవునండి నాకు అదే అనిపిస్తున్నది        

వృద్దశ్రమంలోకి పార్వతీ శంకరులు పిల్లలతో లోపలకు ప్రవేశించారు. అక్కడ  ఉన్న తల్లి తండ్రుల పాదాలను కన్నీళ్లతో కడిగాడు, "సాగరంలో నీటి బుడగ మరల సాగరంలో కలసి పోవటమే మోక్షమని తెలుసుకున్నాము" తల్లి తండ్రులకు సేవచేయుటయే మానవజన్మ పరమార్ధమని తెలుసుకున్నాను. 
 మావయ్య గారు అత్తయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నాను రండి, మీకు సేవలు  చేయుటకు మేము సిద్ధముగా ఉన్నాము, రండి తాత గారు, అమ్మొమ్మగారు అని పిలుస్తూ పిల్లలు కన్నీళ్లతో అభిషేకించారు.     
        
--(())--     

ఏమిటో....ఈ మనసు !
********
మా చిన్నప్పుడు మేము మా పోస్టు మేన్  టైముకి దారి కాసే వాళ్ళం.  తను మా ఇంటి ముందు సైకిల్ స్టాండ్ వేస్తే, మహానందపడిపోయేవాళ్ళం. తీరా చేసి, అద్దెకున్న వాళ్ళకిచ్చి,  మాకేమీ ఉత్తరాలు లేవంటే, నీరసం వచ్చేది.

మాకు ఒకటైనా పోస్టు కార్డు ఇస్తే, మొదట చదవడానికి పోటీలు పడి, దెబ్బలాడుకుని, 'బలవంతుడిదే ఉత్తరం' అన్నట్టు లాక్కుని, నాలుగుసార్లు చదివాక, మిగిలినవారిని 'ఉత్తరా'ధికారుల్ని చేసేవాళ్ళం.

ఢిల్లీ నుంచి మా అక్క రాసిన 'ఇంగ్లాండు' కవరు వస్తే, దాంట్లో విశేషాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి,  దానికి ఎంత గ్లామరో ! ఉత్తరానికి మూడు పక్కలా నింపేశాక, 'అందరినీ అడిగానని' చెప్పాలి కాబట్టి,  మా పనిమనిషి అప్పలమ్మ దగ్గిరనించీ, ప్రతి నెలా టైముకి అద్దె ఇవ్వని ప్రకాశం అంకుల్, పాలు పొసే పాలశంకరం లాంటి వాళ్ళ పేర్లు 
రాయడానికి మార్జిన్ లు వాడుకునేది.

1965 లో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు ప్రభుత్వం వారు తీసుకునే 'బ్లాక్ ఔట్' 
(కరెంటు తీసేసి,పట్టణమంతా చీకటి చేసెయ్యడం,) విమానం మోత వినిపిస్తే సైరన్ మోగించడం లాంటి విశేషాలన్నీ పూసలు గా గుచ్చి, పెద్ద కవరు రాసేది. ఢిల్లీ లో రిపబ్లిక్ డే కి జరిగే ఉత్సవాల విశేషాలు మొదటిసారిగా మా అక్క రాసిన 'పే.....ధ్ధ' ఉత్తరం ద్వారా తెలుసుకున్నాం.

ఠావులు ఠావులు ఉత్తరాలు రాసేస్తే,  అదనంగా స్టాంపులు అతికించాలని అప్పుడే తెలిసింది. ఆ ఉత్తరాన్ని వంతుల వారీగా ఎన్నిసార్లు చదివి ఉంటామో చెప్పాలంటే, 'మాయాబజార్ సినిమా చూసినన్నిసార్లు' అని చెప్పాలి. క్లాసు పుస్తకాల కంటే, మా అక్క రాసిన ఉత్తరాలే ఎక్కువ ఆకర్షణగాను, విజ్ఞానదాయకం గాను ఉండేవి.

అందుకే కాబోలు, నెహ్రూ గారు, "కూతురికి ఉత్తరాలు"  అనే శీర్షికతో, ఇందిరా గాంధీ గారికి జైలు నుంచే ఉత్తరాలు తెగ రాసి పడేశారు. 

"మీకు పాఠాలు చెప్పను, కధలు చెబుతాను" అని విష్ణు శర్మ, ముగ్గురు మొద్దబ్బాయి లయిన రాజ కుమారులకి కధలు వినిపించి, వాళ్ళతో పాటు, మనక్కూడా పంచ తంత్రాలూ బోధించాడు. 
                      ★★★★★★★★

ఇప్పుడు మన గుట్లన్నీ గూగుల్ మామకి,  ఫేస్ బుక్కు అంకుల్ కీ తెలిసినట్టే, మనకి ఎవరెవరి దగ్గర్నుంచి ఉత్తరాలు వస్తాయో, ఎవరి దగ్గర్నుంచి ఎంత మనీ ఆర్దరు వస్తుందో, ఎవరింట్లో పెళ్ళి కూతుళ్ళ కోసం,  "అమ్మాయి నచ్చింది" అని వచ్చే ఉత్తరం కోసం పడిగాపులు కాస్తున్నారో, ఏ కుర్రాడు తనకి ఉజ్జోగం ఇస్తున్నట్టు వచ్చే ఉత్తరం కోసం గెడ్డం పెంచుతున్నాడో, నాటి పోస్టు మేన్ లకి  బాగా తెలుసు.

కాబట్టే, దసరా మామూళ్లు దండిగా ఇచ్చేవాళ్ళం. ఇవ్వకపోతే, 'అలుగుటయే ఎరుంగని' పోస్టు మాన్ అలిగిననాడు, ఉత్తరాలే కాదు, కుద రబోయే పెళ్ళి సంబంధం, రాబోయే ఉజ్జోగం కూడా కాకి ఎత్తుకు పోతుందేమోనని భయం !

అప్పటి పోస్టు మాన్ లు ప్రతి కుటుంబానికి ఆప్తులు, హీరోలు !
టెలిగ్రాములు తెచ్చే ఎర్ర సైకిల్ వాళ్ళు,  త్రువులు, విలన్ లు !
టెలిగ్రామ్ వచ్చిందంటే.. "సో అండ్ సో సీరియస్, స్టార్ట్ ఇమీడియేట్లీ" యే !
అందుకే...టెలిగ్రాములకి నూరేళ్లూ నిండించాము !
   
                    ★★★★★★★★

రెండు మూడు తరాల వాళ్ళం అలా....
'ఉత్తర'కుమారులం, 'ఉత్తరా'కుమార్తెలం గా వెలుగుతూ, గలకి గుచ్చిన పాత ఉత్తరాలే దుమ్ము దులిపి,  మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉండగానే.....

'రోజులు మారాయి' సినిమా తీసిన చాలా కాలానికి, మా రోజులు మారడం మొదలెట్టాయి.
వింతలు, విడ్డూరాలు, విష్ణు మాయలు జరిగిపోతున్నాయి !

మనలాంటి వాళ్ళకి ఇంట్లో దేశవాళీ టెలిఫోను రావడానికే సగం జీవితం గడిచిపోతే, గత రెండు దశాబ్దాలుగా  అన్ని రంగాల్లోనూ మార్పులే మార్పులు !

ఒకప్పుడు విమానం శబ్దం వినిపిస్తే,  బయటికి పరుగెత్తి చూసిన మధ్య తరగతి వాళ్ళలో చాలామంది లక్షలకి పడగలెత్తి, కోట్లకి అర్రులు చాస్తూ... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగ,
గౌలిగూడా బస్ స్టాండు లాగ, విమానాశ్రయాలు ఖాళీ లేకుండా చేసేశారు.

"మా వాడు డల్లాస్"అంటే,  "మా అమ్మాయి "డెట్రాయిట్" అనేవారు !
"మా అల్లుడికి లండన్ లో ఆన్ సైట్ ఆఫర్ వచ్చింది" అంటే, "మా వాళ్ళకి కెనడా సిటిజెన్ షిప్ వచ్చేసింది" అనేవాళ్ళు.  ప్రస్తుతం కొరోనా కాటుకి, ఆ దేశాలతో పాటు,
మనవాళ్ళు కూడా పాపం, బిక్కు బిక్కుమంటున్నారనుకోండి !

ఇండియా కి విదేశీ మారక ద్రవ్యం పంపిస్తున్నది, దేశం లో టాక్స్ లు నిక్కచ్చిగా కడుతున్నదీ, తద్వారా దేశ ఆర్థిక పురోగతికి దోహద పడుతున్నదీ, మన మధ్య తరగతి వాళ్ళేట !

పావు కిలో బరువున్న నోకియా ఫోను తో మొదలయిన మన సాంకేతిక ప్రస్థానం, కొంప కి పది చొప్పున,  తల ఒక్కింటికి రెండు చొప్పున, సెల్ ఫోనులు,  టాబ్ లు కాక, లాప్ టాప్ లు అదనం గా వచ్చి కూచున్నాయి ! ఇంటి నిండా చార్జర్ ల కలగాపులగం !

పొద్దున్న లేచాక, దైవ ధ్యానం,దీపారాధన కంటే ముందే, 'కరచరవాణీ' దర్శనం చెయ్యాల్సి రావడమే కాదు, అన్నిటికీ ఛార్జింగ్ పెట్టడానికే జీవితం సరిపోతోంది !

ఇంక పనికొచ్చే పోస్టులు చూడ్డం, పనికిరాని వాళ్ళు పంపిన పోస్టులు తీసెయ్యడం, నిత్య కృత్యం ఐపోయింది. ఇది కాక, మన "ఎగుమతి - దిగుమతి"  వ్యాపారం (అదే నండి అప్ లోడ్, డౌన్ లోడ్) ఉండనే ఉంది !
(ఇదేదో పెద్ద వ్యాపారం అనుకోకండి, మనకి వాట్సాప్ లో వచ్చినవి అందరికీ పంపడం, ఫేస్ బుక్కు లో చూసినవి షేర్ చెయ్యడం లాంటివి)

ఇలా కొంతకాలంగా 'అత్యాధునిక సాంకేతిక విప్లవాలను ఔపోసన పట్టి, అలరారుతున్నాం' అని సంతోషిస్తుండగా...

ఒక రోజు మా పని మనిషి గొంతు, వాష్ ఏరియా లో నుంచి గట్టిగా వినపడుతోంది.

'ఏదైనా గొడవా' అని వెళ్ళి చూస్తే... 
దుబాయ్ లో ఉన్న కొడుకుతో వీడియో కాల్ మాట్లాడుతోంది !

తన దగ్గర ఉన్నది నా ఫోను కంటే కొత్త మోడలు, ఖరీదయినది !  
అన్నట్టు....రోజులు మారాయి కదూ....

                  ★★★★★★★★

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఒక రోజు మా పిల్లలు హడావిడిగా వచ్చి, నన్ను లాక్కెళ్లి, 
లాప్ టాప్ ముందు కూచోబెట్టారు.

తీరా చూస్తే, సినిమా ఆఖరి రీలులో గ్రూప్ ఫోటో లాగ,   దేశ విదేశాల్లో ఉన్న మా వాళ్ళందరూ అందులో ఉన్నారు !
అందరూ ఒకే సారి,  "బావ గారూ బాగున్నారా ?', "హాయ్ బ్రో",  "హల్లో తాత గారూ"
"బాబయ్యా, ఎలా ఉన్నావ్ ?"  "అల్లుడూ...కులాసానా ?"
"మావయ్యా, చాలా రోజులయింది, నిన్ను చూసి" అని కోరస్ పాడేస్తున్నారు !
ఒక్కక్కళ్ళనే గుర్తుపట్టి, పలకరించి,  పులకరించడానికి కొంచెం టైం పట్టింది.

"ఖండములు ఎన్ని, అవి ఏవి ?" అని ,  హైస్కూల్ లో సోషల్ మేష్టారు అడిగితే, 
తడుముకుని, బట్టీ బట్టి చెప్పేవాళ్ళం.

ఇప్పుడు ఖండములు, ఖండాంతరములు  అన్నీ ఒకే చోట కనిపించేస్తున్నాయి !!!

ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా, కెనడా,  సింగపూర్,లండన్ ఇలా అన్ని దేశాల నుంచీ, 
బీరకాయ పీచువాళ్ళందరూ....
కెనేడియన్ దగ్గిరనించీ తాడేపల్లిగూడేరియన్ వరకు కొరోనా ధర్మమా అని, ఒకేసారి, కొంపల్లో కూచుని,  నెల రోజులుగా అన్ని రకాల కాలక్షేపాలు చేసి, చేసి, విసుగెత్తి, బహుశా గాలి మార్పు కోసం, యిలా...
"జూమ్" వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  అందరూ ఒకే సారి దండెత్తారు.

ఎవరికీ హెయిర్ కట్ లు లేనట్టుంది !
మగంగులు అందరూ  తలలు మాసి ఉన్నారు. కొన్ని పాత మొహాలు...
ఆకారాలు, ప్రాకారాలు మారిపోయాయి. కొన్ని కొత్త మొహాలు గుర్తుపట్టలేకపోతున్నా.
కొన్ని పిల్ల మొహాలు యవ్వనం లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని చంటి మొహాలు కొత్తగా పుట్టాయి.

సామూహిక యోగక్షేమాల కార్యక్రమం అయ్యాక, ఎవరెవరు, ఎక్కడెక్కడ పని చేస్తున్నారో,
ఎవరికి ఎంతమంది పిల్లలో సగర్వంగా చెప్పుకున్నాక, లోకల్ కొరోనా వార్తలు, స్కోరులు చదువుకున్నాక, 'ఆరోగ్యాలు జాగ్రత్త' లాంటి షరా మామూలు హెచ్చరికలు చేసుకుని, చివరిగా సామూహికంగా  జాతీయ గీతం పాడినట్టు, అందరం "గో, కొరోనా, గో" అనే మంత్రం చదివి, 'బై' లు చెప్పుకున్నాం.

                      ★★★★★★★★

ఇదంతా అయ్యాక, కొత్త రకం ప్రసార మాధ్యమాలు వచ్చాయని, 'కానీ' ఖర్చు లేకుండా, నిమిషాల్లో,  ప్రపంచం లో ఎక్కడ ఉన్నా,మన వాళ్ళందరినీ చూస్తూ మాట్లాడుకునే సౌకర్యాలు వచ్చిన కారణంగా అందరి విశేషాలు, యోగ క్షేమాలు తెలుసుకోగలుతున్నామని సంతోషించాను.

                       ౦౦౦౦౦౦౦౦౦౦౦

కానీ ఏమిటో.....ఆ డొక్కు సైకిల్ మీద ఖాకీ గుడ్డలతో వచ్చి, నవ్వుతూ అరుగు మీద ఎదురు చూస్తున్న మాకు అందించిన ఆ 'కార్డు ముక్క' ఇచ్చిన ఆనందం, ఇప్పుడు వాట్సాప్ లు, ఫేస్ బుక్ లు తెచ్చే వందల కొద్దీ పోస్టులు,విశేషాలు, స్కైపులు, 'జూమ్' లు చూపించే  వీడియోలు ఇవ్వలేకపోతున్నాయి !

అవునులే ! నాన్న 200 రూపాయలతో రెండు చక్రాల సైకిల్ కొన్నప్పుడు, ఎంతగానో ఆనందించిన ఇదే బుర్ర,  పది లక్షలు పెట్టి నాలుగు చక్రాల కారు కొనుక్కున్నప్పుడు
ఆనందించలేకపోడమేవిటి ?
కాల మహిమ కాకపోతేను ?
ఏమిటో....యీ మనసు !!!

              సేకరణ    వారణాసి సుధాకర్.
 --(())--
  

ఈ కథ నాకు బాగా నచ్చింది. అందుకే పంపుతున్నాను.
       ****
గోదావరిపిలిచింది
🌅〰〰〰〰〰〰🌅

కొత్తగా పెళ్లైన కూతుర్నీ అల్లుడినీ సత్యనారాయణస్వామి దర్శనం చేయించి, భోజనాలయ్యేసరికి ఒంటిగంటయింది. కొత్త దంపతుల్ని వెంటబెట్టుకుని కారెక్కారు దక్షిణామూర్తి దంపతులు. ఆ సమయంలో దక్షిణామూర్తికి తన పెళ్ళి జ్ఞాపకానికొచ్చింది. అప్పుడు కూడా ఇలాగే పెళ్లైన వెంటనే అన్నవరం తీసుకొచ్చి దర్శనం చేయించారు అమ్మా, నాన్న. ఆ మాటకొస్తే దక్షిణామూర్తే కాదు, గోదావరి జిల్లాలో ఏ ఇంట్లో పెళ్ళయినా కొత్త జంట మొదటగా చేసేది సత్యనారాయణస్వామి దర్శనం. 

కారు నేషనల్‌ హైవే మీద పరిగెడుతోంది. చుట్టూ పచ్చదనం కమ్ముకున్న పొలాలూ, దూరంగా పచ్చదుప్పటి కప్పుకున్నట్లున్న కొండలూ గజిబిజిగా వేగంగా కనుమరుగవుతున్నాయి. దక్షిణామూర్తి కడుపు నిండింది, మనసు మాత్రం వెలితిగా ఉంది. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.

ఈమధ్యనే అమ్మాయి పెళ్ళి చేశాడు. అల్లుడికి అమెరికాలో ఉద్యోగం. మంచి స్థితిమంతుల కుటుంబం. భార్య తరఫు బంధువుల ద్వారా వచ్చిన సంబంధం అని, మరో ఆలోచన లేకుండా పెళ్ళి జరిపించాడు. ఒక వారంరోజుల్లో కూతురూ అల్లుడూ అమెరికా వెళ్ళిపోతారు.
తనసలు చుట్టుపక్కల మంచి సంబంధం చూసి చేద్దామనుకున్నాడు- మంచీ చెడ్డా కళ్ళెదురుగుండా ఉంటే బావుంటుందని భార్య పట్టుపడితే కాదనలేక ఒప్పుకున్నాడు.

అప్పటికీ ఉండబట్టలేక నిశ్చితార్థమప్పుడు వియ్యంకుడితో అనేశాడు ‘‘మీకు పది తరాలకూ తరగని ఆస్తి- అబ్బాయి పదేళ్ళుగా అమెరికాలో సంపాదించుకున్నాడు. నాకూ ఒక్కగానొక్క కూతురు. నాదంతా నా కూతురికే. ఇంకా అమెరికా దేనికంటారూ! ఇక్కడే ఉండమని చెప్పకూడదా బావగారూ’’ అని.
‘ఇంత చదువూ చదివించింది ఇండియాలో పన్జేయటానికా?’ అని రాచనాగు లేచినట్టు లేచింది వియ్యపురాలు. ఇంకేం చేయాలో తోచక అన్యమనస్కంగానే నిశ్చితార్థం కానిచ్చేశాడు దక్షిణామూర్తి.

1960లలో చెన్నైలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాడు దక్షిణామూర్తి. తల్చుకుంటే ఆ రోజుల్లోనే మంచి ఉద్యోగంలో సెటిలైపోయేవాడే. కానీ, సొంతగడ్డ మీద మమకారం, ఏం చేసినా మన వూరికే చేయాలనే సంకల్పం అతన్ని సొంత వూళ్ళొనే స్థిరపడేలా చేశాయి. స్వగ్రామంలోనే వ్యవసాయ పనిముట్లు తయారుచేసే ఇంజినీరింగ్‌ వర్క్‌షాప్‌ ప్రారంభించాడు. తన చదువునంతా సొంత గడ్డకే ఉపయోగించాడు. తండ్రి ఇచ్చిన పదెకరాల పొలం పాతికెకరాలకు పెంచాడు. చుట్టుపక్కల వాళ్ళందరికీ తల్లో నాలుకై వూరికి పెద్దదిక్కుగా మారాడు. అందరూ పిల్లల్ని ఇంజినీర్లూ డాక్టర్లూ లేదా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా చూడాలనుకుంటే దక్షిణామూర్తి మాత్రం తన కూతుర్ని అగ్రికల్చరల్‌ బిఎస్సీ చేయించాడు. మన రైతుల కోసం ఏదైనా చేయాలని నూరిపోశాడు.

కానీ, పిల్ల పెళ్ళిచేశాక మన చేతుల్లో విషయం కాదు కదా! మనకి ఒంట్లో బాగుండకపోతే మన బిడ్డ మన దగ్గరుండదు. మనం బెంగపడితే మన కంటికి కనపడదు. 
ఈ అమెరికాకి మన పిల్లలు తప్ప దిక్కులేదా? 
మన పిల్లలకి అమెరికా తప్ప దారిలేదా? మంచి జీవనం కోసం కొంత డబ్బు చాలు. కొంత డబ్బు కోసం మొత్తం జీవితాలే మారిపోవాలా? 
వేల మైళ్ళు ఏళ్ళకు ఏళ్ళు దూరమైపోవాలా?

‘‘కడియంలో కాసేపు ఆపాలయ్యా’’ డ్రైవర్‌కి చెప్పి కారాపించాడు. వియ్యపురాలు ఏవో పూలమొక్కలు కొనుక్కుంటానంది మరి. కడియంలో కారాగింది. అందరూ దిగారు. అదొక పూలస్వర్గం. వియ్యపురాలు ఎప్పుడూ చూడలేదేమో తెగ సంబరపడిపోయింది. రంగురంగుల పూలూ... ఒకటా రెండా వందల రకాల పువ్వులు తివాచీ పరిచినట్టు... ఎరుపూ, నలుపూ, పసుపూ, నీలం, తెలుపు గులాబీలూ, చామంతులూ... అదొక పూల సామ్రాజ్యం.

కారు ధవళేశ్వరం బ్యారేజ్‌ సమీపించింది. ‘‘నాన్నా, కాటన్‌ మ్యూజియంకి వెళ్దాం’’ దక్షిణామూర్తి కూతురు అంది.
‘‘సాయంత్రం అయింది. చీకటిపడేలా ఉంది. ఇప్పుడు మ్యూజియం అంటావేవిఁటే! ఇంటికెళ్ళాక బోలెడు పనుంది. తర్వాత చూద్దాంలే! అయినా చూడ్డానికేవుందీ? మీ నాన్నా, నువ్వూ ఎప్పుడూ చూసేది అదే కదా’’ అంది దక్షిణామూర్తి భార్య హైమ.
‘‘అదికాదమ్మా, ఆయనకి ఒకసారి చూపిద్దామని’’ కూతురనేలోగా దక్షిణామూర్తి కారు దిగాడు. ధవళేశ్వరం వచ్చినప్పుడల్లా దేవుడి గుడికెళ్ళినట్టు కాటన్‌ మ్యూజియానికి వెళ్ళక మానడు.

బ్రిడ్జ్‌ పక్కనే ఉన్న పదడుగుల విగ్రహం చూసి అల్లుడు కిరణ్‌ అడిగాడు- ‘‘అది ఎవరి విగ్రహం మామయ్యగారూ’’ అని.
హైదరాబాద్‌లో పెరిగి, అమెరికాలో పన్జేసేవాళ్ళకి కాటన్‌ గురించి తెలియదు కదా! 
చానాళ్ళక్రితం ఒకసారి ట్రెయిన్‌లో వస్తుండగా విజయనగరం కుర్రాడు తగిలాడు. ‘ఏమయ్యా, గురజాడ అప్పారావుగారి ఇల్లు చూశావా?’ అని అడిగాడు దక్షిణామూర్తి.
దానికా అబ్బాయి... ‘అప్పారావుగారంటే ఎవరండీ?’ అని ఎదురడిగాడు.
అవును, బీటెక్‌ చదివిన ఆ కుర్రాడికి గురజాడ అప్పారావు అవసరం ఏముందీ? విజయనగరంలో పుట్టి, విజయనగరంలో పెరిగినవాడికి గురజాడ అప్పారావంటే తెలియకపోగాలేందీ, హైదరాబాద్‌లో పెరిగి అమెరికాలో సెటిలైనవాడికి కాటన్‌ తెలియకపోవడంలో తప్పేంలేదనుకున్నాడు దక్షిణామూర్తి.

మ్యూజియం ముందుభాగంలో 1840 లలో ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించిన యంత్రాలూ, పనిముట్లూ, వాహనాలూ ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా లండన్‌ నుంచి కాటన్‌ తెప్పించారు. 
కొంచెం ముందుకువెళ్తే డెల్టాలో 10 లక్షల ఎకరాలకు నీరందించే గొప్ప ప్రాజెక్టును కేవలం 5 సంవత్సరాల్లో పూర్తిచేసిన కర్మయోగి ద గ్రేట్‌ సర్‌ సి.ఆర్ధర్‌ కాటన్.
ఆ రోజుల్లో నివాసం ఉన్న బంగ్లా! దానినే ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. లోపలికెళ్ళాక ప్రాజెక్టు వివరాలూ, ఫొటోలూ, చిత్రాలూ ఒక్కొక్కటీ వివరించి చెబుతోంది కూతురు- అల్లుడికి. అల్లుడు చాలా ఆసక్తిగా వింటున్నాడు.

‘‘ఆ రోజుల్లో అంటే 160 ఏళ్ళక్రితం ఇక్కడ తినటానికి వరి లేదు. ఇంట్లో పెళ్ళయితేనో లేదంటే శుభకార్యాలప్పుడో మాత్రమే వరి అన్నం. మామూలు రోజుల్లో జొన్నసంకటే. గోదారికి వరదొస్తే అడ్డే లేదు. కరవూ కాటకాలూ, జనాభా క్షయం... ఇదే ఆనాటి డెల్టా పరిస్థితి.
అప్పుడే కాటన్‌ అనూహ్య ప్రవేశం.
ప్రాజెక్ట్‌ కట్టి, ప్రజల కన్నీళ్ళు తుడవటం నిజానికాయన పనికాదు. కేవలం ఈ ప్రాంత పన్ను వసూలు అధికారి మాత్రమే. కానీ, కష్టం నష్టం తెలుసుకున్నాడు. కంపెనీకి నచ్చజెప్పాడు. అయిదేళ్ళంటే అయిదేళ్ళలోనే అంచనా వ్యయంలోపే ఖర్చుపెట్టి రూ.4,75,572 లతో పని పూర్తిచేసి చూపించాడు’’... దక్షిణామూర్తి చెప్పుకుంటూ పోతున్నాడు.

‘‘మన వూళ్ళొ పుట్టలేదు, మన దేశమే కాదు, మన భాష కాదు, మన మనిషే కాదు... అయినా మనకోసం పదిలక్షల ఎకరాలకు నీరిచ్చి మనకింత అన్నం పెట్టిన ఆ దేవుడు చేసిన దాంట్లో వందోవంతు మన నాయకులూ మన విద్యావంతులూ ఏదో ఒక రంగంలో కృషిచేస్తే మనదేశం ఇలా ఉంటుందా బాబూ’’ అల్లుడితో అన్నాడు దక్షిణామూర్తి.

ఇంటికెళ్ళేసరికి రాత్రి ఎనిమిది గంటలయింది. అల్లుడు ఏదో ఆలోచనలతో ఉన్నట్టున్నాడు. ‘నా మాటలు విసుగనిపించాయో ఏమో’ అనుకున్నాడు దక్షిణామూర్తి.
మర్నాడు అల్లుడూ కూతురూ బయల్దేరారు. చీరా, సారె, కానుకలూ అన్నీ సర్ది పక్కన పెట్టారు. పెళ్ళి ఫొటోలు వచ్చాయి. చూసుకున్నారు. వీడియో కూడా చూశారు. సాయంత్రమే ట్రెయిన్‌ ఎక్కటం. అనుకున్న సమయం రానే వచ్చింది. సాయంత్రం అయిదు గంటలయింది. అల్లుడూ కూతురూ రెడీ అయ్యారు. దక్షిణామూర్తికీ, భార్య హైమకీ కాళ్ళకు నమస్కారం చేశారు. హైమ కూతుర్ని పట్టుకుని బావురుమంది. వియ్యపురాలు ఓదార్చింది. ఆరున్నరకి రాజమండ్రిలో ట్రెయిన్‌ ఎక్కించారు.
‘‘వెళ్ళొస్తాం మామయ్యగారూ’’ అల్లుడు చేతిలో చెయ్యేసి నొక్కుతూ చెప్పాడు.
‘‘సరే, జాగ్రత్త! హైదరాబాద్‌లో దిగగానే ఫోన్‌ చేయండి’’ కళ్ళు చెమరుస్తుండగా గద్గదస్వరంతో అన్నాడు.
ట్రెయిన్‌ కదిలింది. చెయ్యూపి ఇంటికి బయల్దేరారు దక్షిణామూర్తి దంపతులు.

దక్షిణామూర్తి రొటీన్‌లో పడిపోయాడు... తన వ్యవసాయం, వర్క్‌షాప్‌ పనీ, వూరి పనీ. క్షణం తీరిక లేకపోవటంతో కూతురి బెంగమాట అటుంచి కూతురి గురించే మరిచిపోయాడు. మళ్ళీ వాళ్ళు తిరిగి స్వదేశం వస్తారని ఆశలేదు కాబట్టి, బాధ కూడా లేదు దక్షిణామూర్తికి.
సరిగ్గా పదిరోజుల తర్వాత ఒక ఫైన్‌ మార్నింగ్‌ హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్న దక్షిణామూర్తి, భార్య హైమ పిలుపుతో లోపలికెళ్ళాడు ‘‘ఏమండీ, అమెరికా నుంచి అమ్మాయి ఫోను...’’
దక్షిణామూర్తి ఫోనందుకున్నాడు.
‘‘నాన్నా, బావున్నారా?’’ 
‘‘బావున్నానమ్మా. నువ్వూ, కిరణ్‌ ఎలా ఉన్నారు?’’ 
‘‘ఫైన్‌ నాన్నా. ఆయన నీతో ఏదో మాట్లాడతారట నాన్నా...’’ 
ఫోన్‌ అల్లుడికిచ్చింది. 

‘‘మామయ్యగారూ బావున్నారా?’’
‘‘బావున్నాను. మీరిద్దరూ ఎలా ఉన్నారు? అమ్మాయికి అక్కడ అలవాటయిందా? ఇబ్బంది ఏమీ లేదు కదా?’’
‘‘అదేంలేదు మామయ్యా. మరి మీతో ఓ విషయం చెప్పాలి మామయ్యా’’ మాటల్లో ఏదో తటపటాయింపు.
‘‘చెప్పు కిరణ్‌, ఫర్వాలేదు’’
‘‘నేను ఇండియా వచ్చేద్దామనుకుంటున్నా మామయ్యా. రాజమండ్రిలోనే నలుగురైదుగురు ఫ్రెండ్స్‌ కలిసి సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెడదామని అనుకుంటున్నాం. ఇక్కడ రిలీవ్‌ కావటానికి ఇంకో మూణ్ణెల్లు పడుతుంది. ఈలోపు అక్కడ ఏర్పాట్ల విషయంలో మీ సహాయం కావాలి...’’ కిరణ్‌ చెబుతున్నాడు.
దక్షిణామూర్తికి ఎగిరి గంతేయాలనిపించింది.
‘‘అలాగే అల్లుడూ. 
మన వూరు వచ్చి, మన వూళ్ళొ బిజినెస్‌ చేసి, మనవాళ్ళకే ఉద్యోగాలిస్తామంటే అంతకంటే కావాల్సిందేముంది. నేనేం కావాలన్నా చేస్తాను’’ సంతోషంగా అన్నాడు.
‘‘థాంక్స్‌ మామయ్యా’’

‘‘సరే కానీ కిరణ్‌, పెళ్లైన నెలలోపే ఇండియా వచ్చేయాలని ఎలా అనుకున్నావు, చాలా ఆశ్చర్యంగా ఉందే’’ దక్షిణామూర్తి నవ్వుతూ అన్నాడు.
‘‘మనదేశం కాదు, మన భాషా కాదు, మన మనిషే కాదు... అయినా మన నేలకు కాటన్‌ చేసినదాంట్లో వందో వంతైనా చేయాలి కదా, మామయ్యా!. 
మీరు మీ వూరికి చేసిన దాంట్లో పదో వంతైనా చేయాలి కదా!"

దక్షిణామూర్తికి ఆ మాటలు వింటుంటే ఏమీ కన్పించట్లేదు. గోడమీద ‘కాటన్‌’ ఫొటో నవ్వుతూ.
‘నీ మంచి మనసుతో మా డెల్టానే కాదు...
నా అమెరికా అల్లుణ్ణి కూడా మార్చేశావా!
కాటన్‌ దొరా... నీకు కోటి నమస్కారాలు’ అనుకున్నాడు దక్షిణామూర్తి మనసులో.

దూరంగా గోదావరి నింపాదిగా, నిర్మలంగా సాగిపోతోంది. తన బిడ్డల్ని ఎక్కడికో కాకుండా తన ఒడి చెంతే ఉండమని పిలుస్తోంది మౌనంగా.

🌷🙏🌷🙏🌷🙏🌷🙏


కరోనా వేళ... క్యూబా అండ! 


ఒక చిన్న ద్వీపం. వైశాల్యంలో దాదాపు తెలంగాణ రాష్ట్రమంత ఉంటే, జనాభా మాత్రం ఇంచుమించుగా దిల్లీ నగరంలో ఉన్నంత! అలాంటి దేశం ఇప్పుడు ప్రపంచదేశాలకు ‘నేనున్నా’ అంటోంది. కరోనా చికిత్సల కోసం అడిగినవాళ్లకీ అడగనివాళ్లకీ కూడా వందలాది డాక్టర్లను సాయం పంపుతోంది. సేవకు సరిహద్దు ల్లేవంటూ అంతర్జాతీయ సమాజాన్ని అబ్బురపరుస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలకే సాధ్యం కాని పనిని ఓ చిన్న దేశం ‘క్యూబా’ చేసి చూపిస్తున్న వైనం ఆసక్తికరం.

పందొమ్మిదేళ్ల సెఫాకి మెడిసిన్‌ చదవాలని కోరిక. తండ్రికేమో చదివించే స్తోమత లేదు. బ్యాంకు నుంచి లోను  తీసుకుని చదువుకోవచ్చు కానీ చదువయ్యే సరికి తడిసి మోపెడయ్యే రుణభారం తలచుకుని ఆమె ఆ ధైర్యం చేయలేదు. కాలిఫోర్నియా యూనివర్శిటీలో డిగ్రీలో చేరి ప్రాజెక్టు వర్కు కోసం ఘనా వెళ్లిన ఆమెకి అక్కడ క్యూబా వైద్యులు కొందరు పరిచయం అయ్యారు. ఎలాంటి కనీస సౌకర్యాలూ లేనిచోట వారు పనిచేసే విధానం ఆ అమ్మాయికి చాలా నచ్చింది. తిరిగి వచ్చేశాక ఓరోజు ఏమీతోచక నెట్‌లో క్యూబాలో మెడికల్‌ కాలేజీల వివరాలు వెతికింది. భయ పడుతూనే ఓ కాలేజీకి ఫోన్‌ చేసింది. ఆన్‌లైన్లో దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే ఎంత ఫీజు కట్టాలీ అని అడిగింది. ‘ఉచితం’ అన్నారు వాళ్లు. పొరపాటు గా విన్నానేమో అనుకుని మళ్లీ అడిగింది. అవతలి వ్యక్తి నవ్వుతూ దరఖాస్తు ఫారమే కాదు ఇక్కడ అన్నీ ఉచితమే. ట్యూషన్‌ ఫీజూ హాస్టల్‌ ఫీజూ కట్టక్కర్లేదు... అని చెప్పేసరికి సెఫా ఎగిరిగంతేసినంత పనిచేసింది. వెంటనే బ్యాగు సర్దుకుని క్యూబా ఫ్లైటెక్కేసింది. అమెరికా నుంచి అలా క్యూబా వెళ్లి మెడిసిన్‌ చదివిన కొన్ని వందల మంది విద్యార్థుల్లో సెఫా ఒకరు.

వైద్య విద్య ఉచితమా?
మనకు నమ్మశక్యం కాదు కానీ అది నిజం. వైద్య విద్య మన దేశంలోనే కాదు, అమెరికాలో నూ చాలా ఖరీదైనదే. క్యూబాలో మాత్రం వేరు. అక్కడి లాటిన్‌ అమెరికన్‌ మెడికల్‌ స్కూల్‌ ప్రత్యేకించి బయటి దేశాల పేద విద్యార్థులకు వైద్య విద్యను ఉచితంగా అందించేందుకు పెట్టిందే. అలాగని అక్కడ చదువు కున్నవాళ్లు కొన్నేళ్లు అక్కడే పనిచేయా లన్న రూలేం లేదు. ఆరేళ్ల చదువు అవగానే తిరిగి తమ దేశానికి వెళ్లి ప్రాక్టీసు చేసు కోవచ్చు. అయితే అక్కడ చదువుకునేవారిలో కొంతమంది మాత్రమే ఫీజు ఉండదని వెళ్తారు. ఎక్కువ మంది అక్కడి వైద్య విద్యావిధానం నచ్చి వెళ్తారు. క్యూబా వైద్య విద్యా, చికిత్సా విధానాలే ఆ దేశాన్ని చాలా విషయాల్లో ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.

ఏమిటా ప్రత్యేకత?
క్యూబాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.  అమెరికా జీడీపీలో పదో వంతు కూడా ఉండదు ఆ దేశ జీడీపీ. ఖరీదైన మందులూ ఆధునిక వైద్య పరికరాలూ అక్కడ ఉండవు. అయినా ఆయుఃప్రమాణం మాత్రం అమెరికా కన్నా ఒక పిసరు ఎక్కువే. అమెరికాలో సగటు ఆయుః ప్రమాణం 78.54 అయితే క్యూబాలో 78.66. మానవాభివృద్ధి సూచీలో మనదేశం 122వ స్థానంలో ఉంటే క్యూబా 72వ స్థానంలో ఉంది. వెయ్యి  మంది ప్రజలకు కనీసం ఒక డాక్టరన్నా ఉండాలంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మనదేశంలో పదివేల మందికి ఒక డాక్టరుంటే క్యూబాలో వెయ్యి మందికే ఎనిమిది మంది డాక్టర్లున్నారు.

అంత తేడా... ఎలా సాధ్యం?
అందుకు ముందుగా క్యూబా చరిత్ర కొంచెం తెలుసుకోవాలి. స్వాతంత్య్రం కోసం యుద్ధాలు చేసి నాలుగు వందల ఏళ్ల సామ్రాజ్యవాద పాలన నుంచి బయటపడి 1902లో రిపబ్లిక్‌ ఆఫ్‌ క్యూబా ఏర్పడింది.  ఆ తర్వాత కూడా రాజకీయంగా ఎన్నో  ఒడుదొడుకుల్ని ఎదుర్కొన్న ఆ ద్వీపం 1950వ దశకంలో జరిగిన క్యూబా విప్లవం అనంతరం ఫిడెల్‌ క్యాస్ట్రో పాలనలోకి వచ్చింది. మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌ సిద్ధాంతాలను అనుసరించే సోషలిస్టు దేశం ప్రపంచంలో ఇప్పుడు క్యూబా ఒక్కటే. మొదటినుంచీ లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో అన్నిరంగాల్లోనూ క్యూబా పైచేయిగానే ఉండేది. ఆరోజుల్లోనే అక్కడి డాక్టర్ల సంఖ్య జనాభా ప్రాతిపదికన చూస్తే బ్రిటన్‌, ఫ్రాన్స్‌లకన్నా ఎక్కువే. అయితే వారంతా నగరాల్లోనే ఉండేవారు. క్యూబా విప్లవం తర్వాత చాలామంది వైద్యులు అమెరికా వలస వెళ్లిపోయారు. మరోపక్క వరస ఉద్యమాల వల్ల దేశం ఆర్థికంగా చితికిపోయింది. అదే సమయంలో రాజకీయంగా అమెరికాతో విభేదాలు వాణిజ్యపరమైన ఆంక్షలకు దారితీశాయి. చాలా  వస్తువులకు దిగుమతులపై ఆధారపడిన ఆ చిన్ని ద్వీపం ఆ ఆటుపోట్లన్నిటినీ తట్టుకుని తన కాళ్ల మీద తాను నిలబడడానికి చేసిన ప్రయత్నాల్లో భాగమే... వైద్య రంగంలో నేటి ప్రత్యేక స్థానం.

చాలా కష్టపడి ఉండాలి..?
అవును, చాలా కష్టపడి ప్రణాళికాబద్ధంగా పనిచేశారు. ఉద్యమకారుడిగా చాలామందికి తెలిసిన చే గెవారా వృత్తిరీత్యా వైద్యుడు. క్యాస్ట్రోకి సన్నిహితుడు. అతడి సలహాలతోనే ముందుగా అక్కడి ప్రభుత్వం ప్రజారోగ్య శాఖను పునర్వ్యవస్థీకరించిందంటారు. వైద్యసేవలు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలకూ సమానంగా అందేలా చూడటమే కాక ఉచితంగా వైద్యసేవల్ని పొందడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కుగా మార్చింది. మామూలు చెకప్‌ నుంచీ సంక్లిష్టమైన సర్జరీ వరకూ అన్నీ ఉచితమే. వైద్య విధానం కూడా 1960ల నుంచీ క్రమంగా మారుతూ వచ్చి, 80ల కల్లా  ప్రాథమిక ఆరోగ్యమూ వ్యాధినివారణా అన్నవి కీలకంగా చేసుకుంది. అందుకే ఇక్కడ వైద్యుడు- రోగి మధ్య బంధం మిగతాచోట్ల కన్నా భిన్నంగా ఉంటుంది.

అంటే ఎలా..?
అక్కడ రోగులు ఆస్పత్రికి వచ్చేదాకా డాక్టర్లు వేచి చూడరు. వాళ్లే రోగుల ఇంటికి వెళ్తారు. వైద్య వ్యవస్థ కింది నుంచి పైకి ఆరు అంచెల్లో ఉంటుంది. అన్నిటికన్నా కింది వరసలో ప్రతి రెండు వందల కుటుంబాలకీ ఒక డాక్టరు, నర్సు, సోషల్‌వర్కర్‌తో కూడిన మిని పాలీక్లినిక్‌లుంటాయి. క్లినిక్‌ ఉన్న భవనంలోనే వైద్యులు కూడా నివసించాలి. అంటే ఇరవై నాలుగ్గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. తమ పరిధిలోని రెండు వందల కుటుంబాలకి సంబంధించిన సంపూర్ణ సమాచారం వారి దగ్గర ఉంటుంది. వృద్ధులూ గర్భిణులూ బాలింతలూ ఉంటే వారి ఇళ్లకు వైద్యులే వెళ్లి చికిత్స చేస్తారు. కాలాన్ని బట్టి వచ్చే వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండటం, ప్రజలు జాగ్రత్తపడేలా చూడటం వారి బాధ్యతే. ఊళ్లో ఎక్కడైనా మురుగు నీరు నిలవుంటోందా, ఎవరైనా మద్యం, పొగతాగడం లాంటి అలవాట్లకు బానిసలవుతున్నారా... తదితరాలన్నీ గమనించుకుంటూ ఉండాలి. అలాంటి కొన్ని మినీ పాలీ క్లినిక్‌లు ఒక సెక్టార్‌ పాలీక్లినిక్‌ కిందికి వస్తాయి. 30 వేల జనాభాకి ఓ హెల్త్‌ సెంటర్‌ ఉంటుంది. దానిపైన మున్సిపల్‌ ఆస్పత్రులూ ఆ తర్వాత ప్రొవిన్షియల్‌ ఆస్పత్రులూ వాటిపైన నేషనల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఉంటాయి. తీవ్రమైన వ్యాధులకు మాత్రమే పైస్థాయి ఆస్పత్రులకు పంపిస్తారు. వ్యాధి నివారణకు ప్రాధాన్యం ఇస్తున్నందునే అక్కడి ప్రజల సగటు ఆయుర్దాయం ఎక్కువ. కాన్పు సమయంలో తల్లీబిడ్డల మరణాలూ గుండెజబ్బులతో ఆస్పత్రిలో చేరడమూ చాలా తక్కువ.

బోధన కూడా అలాగే ఉంటుందా?
అక్కడ వైద్య కళాశాలలు కూడా ఆరోగ్య మంత్రిత్వశాఖ కింద పనిచేస్తాయి. చదువుతో పాటే వైద్యమూ నేర్పిస్తారు. మొదటి రెండేళ్లూ జనరల్‌ మెడిసిన్‌ నేర్పిస్తూనే పాలీక్లినిక్‌లలో ప్రాక్టికల్‌ క్లాసులూ చెబుతారు. దీనివల్ల ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులూ అనారోగ్యానికి దారితీసే పరిస్థితులపైన విద్యార్థులకు అవగాహన వస్తుంది. తర్వాత మూడేళ్లూ తరగతి గది పాఠాలూ ల్యాబ్‌లో ప్రయోగాలతో పాటు వైద్యకళాశాల ఆస్పత్రిలో క్లినికల్‌ ప్రాక్టీసూ చేయాలి. నచ్చిన స్పెషలైజేషన్‌తో మరో ఏడాది ప్రాక్టీసు చేశాక డాక్టరు పట్టా ఇస్తారు. ఆ తర్వాత మూడేళ్లు తప్పనిసరిగా సంఘసేవ చేయాలి. విదేశీ మిషన్లూ అందులో భాగమే. ఆస్పత్రి గదులూ పరిసరాల డిజైన్‌ గురించి కూడా విద్యార్థులు నేర్చుకుంటారు. వార్డులో వెలుగు సహజంగా ఉందా, గాలి బాగా వీస్తోందా, పేషెంట్ల కళ్లకు హాయి గొలిపే రంగులు ఉన్నాయా... ఇవన్నీ చూస్తారు. పేషెంట్‌ కోలుకోవటానికి ఏసీ కన్నా సహజంగా వీచే తాజా గాలి మంచిదనీ, ఆస్పత్రి ద్వారా వ్యాపించే ఇన్‌ఫెక్షన్లకు తావుండదనీ నమ్ముతారు క్యూబా వైద్యులు. సంక్షోభ సమయాల్లో వైద్యం చేయడం ఎలాగో కూడా వారికి విద్యార్థి దశలోనే తెలిసిపోతుంది.

అదెలా..?
ఒకసారి మూడో సంవత్సరం విద్యార్థిని నైట్‌ షిఫ్టులో ఉండగా ఓ రోగికి బీపీ ఎక్కువై స్పృహతప్పుతున్న పరిస్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారు. అంతలో కరెంటు పోయింది. అదృష్టవశాత్తూ ఆ విద్యార్థిని దగ్గర పెన్‌ టార్చ్‌ ఉంది. దాన్ని ఆన్‌చేసి నోటితో పట్టుకుని గ్లూకోజ్‌ పెట్టి పేషెంట్‌ తేరుకునేలా చేసింది. ‘గెరిల్లా తరహా క్యూబన్‌ వైద్యంలో అది నా మొదటి అనుభవం’ అంటుంది నవ్వుతూ ఆ అమ్మాయి. అక్కడ వైద్య విద్యార్థులందరికీ ఇలాంటి అనుభవాలు చాలానే ఉంటాయి. అమెరికా ఆంక్షల వల్ల మందులూ వైద్య పరికరాలకు చైనాలాంటి సుదూర దేశాల మీద ఆధారపడాల్సి రావడంతో సమయానికి అవేవీ అందుబాటులో లేకపోయినా చికిత్స జరిగిపోయేలా చూడడం అక్కడి విద్యార్థులకు అలవాటై పోతుంది. అందుకే వాళ్లు ఏ దేశంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైద్యం చేయగలుగుతున్నారు. ల్యాబ్‌ రిపోర్టుల ఆధారంగా కాకుండా పేషెంటుతో ఎక్కువ సమయం గడిపి వివరాలు తెలుసుకోవడం ద్వారా వ్యాధినిర్ధారణ చేస్తారు. క్యూబాలో ప్రైవేట్‌ క్లినిక్‌లే కాదు ల్యాబ్స్‌ కూడా ఉండవు.  పైగా ఇతర దేశాలతో పోలిస్తే ప్రభుత్వం పెట్టే తలసరి వైద్య ఖర్చు చాలా తక్కువ.

విదేశాలకు పంపడం ఎందుకు?
క్యూబా ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 1963నుంచి నేటివరకూ 164 దేశాల్లో అక్కడి వైద్యులు సేవలందించారు. ఫిడెల్‌ క్యాస్ట్రో వారిని ‘ఆర్మీ ఆఫ్‌ వైట్‌ కోట్స్‌’ అనేవారు. అలా పనిచేయడం వైద్యులకు గర్వకారణమైతే దేశానికి ఆదాయమార్గం. క్యాస్ట్రో   అధికారంలోకి రాగానే చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ప్రత్యేకించి సైన్సు, వైద్య రంగాల్లో శిక్షణకి మొదటి ప్రాధాన్యమిచ్చారు. దాంతో వేలాది డాక్టర్లూ నర్సులూ శాస్త్రవేత్తలూ తయారయ్యారు. బయోటెక్నాలజీ, ఫార్మా రంగాల్లో ప్రగతి సాధించారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత ఎక్కువ మంది వైద్యులు తమ దేశంలో ఉండటంతో వారి సేవల్ని విదేశాలకూ అందించేందుకు ఈ తెల్లకోట్ల సైన్యాన్ని తయారుచేశారు క్యాస్ట్రో. సంపన్న దేశాల దగ్గర తమ సేవలకు రుసుములు వసూలుచేసే క్యూబా  పేద దేశాలకు ఉచితంగా సేవలందిస్తోంది. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాధి వ్యాపించినప్పుడు మొట్టమొదట 460 మంది వైద్యుల్ని పంపి ఆదుకుంది క్యూబానే. 2010లో వరస భూకంపాలతో అతలాకుతలమైన హైతీలో కలరా ప్రబలిన వార్త తెలియగానే అక్కడికి చేరుకున్నది క్యూబా వైద్యులే. 1200 మంది డాక్టర్లు అక్కడికెళ్లి సేవలందించారు. క్యూబా సాయం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో బ్రెజిల్‌ ప్రత్యక్షంగా చూసింది. ఒక ప్రత్యేక ప్రాజెక్టు కింద 2013 నుంచి అక్కడి గ్రామీణ పేద ప్రజానీకానికీ ఆదివాసీలకూ సేవలందిస్తున్నారు పది వేలమంది క్యూబా డాక్టర్లు. గతేడాది కొత్తగా వచ్చిన బ్రెజిల్‌ ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టు నచ్చకపోవడంతో క్యూబా తన డాక్టర్లను వెనక్కి పిలుచుకుంది. కొన్నాళ్లకే దాని ఫలితం కనిపించింది. తొమ్మిది నెలల్లోనే అక్కడ 530 శిశుమరణాలు సంభవించాయి. దానికి తోడు ఇప్పుడు కరోనా విజృంభించడంతో మళ్లీ క్యూబా వైపు చూడక తప్పలేదు బ్రెజిల్‌కి. వెనెజులా, నికరగువా, గ్రెనడా, సూరినాం లాంటి చిన్న చిన్న పేద దేశాలకే కాదు పెద్ద పేరున్న దేశాలకూ క్యూబా వైద్యులు వెళ్లారు. ప్రస్తుతం 30 వేల మంది స్పెషలిస్టులు 70 దేశాల్లో సేవలందిస్తున్నారని అంచనా. వాటిల్లో 22 దేశాలకు ఉచిత సేవలే.

చెర్నోబిల్‌ అణుప్రమాదం తర్వాత రేడియేషన్‌ మూలంగా వచ్చిన అనారోగ్యాలకూ మానసిక సమస్యలకూ రష్యా, ఉక్రెయిన్‌, బెలారస్‌లనుంచి దాదాపు 20 వేల మంది పిల్లలు క్యూబాలో చికిత్స పొందారు.

ఎబోలా సమయంలో ఆఫ్రికా దేశాల్లో సేవలందించినందుకుగాను 2017లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అవార్డును అందుకుంది క్యూబా వైద్యబృందం. ఇతర దేశాలకు పంపినట్లే కత్రినా తుపాను వచ్చినప్పుడు (2005) అమెరికాకు కూడా వైద్యుల్ని పంపుతానంది క్యూబా. అందుకు అమెరికా అధ్యక్షుడు అంగీకరించలేదు. అప్పుడే క్యూబా సైన్యంలో చేరి సేవలందించిన అమెరికన్‌ యువకుడు హెన్రీ రీవ్‌ పేరిట ఓ ప్రత్యేక వైద్యదళాన్ని ఏర్పాటుచేశారు ఫిడెల్‌ క్యాస్ట్రో. ఆ దళానికి విపత్తు వేళల్లో సేవలందించడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ దళ సభ్యులు 144 మంది ప్రస్తుతం జమైకాలో కరోనాని కట్టడి చేస్తున్నారు. కేవలం సేవలతో సరిపెట్టక తమ వైద్యవిధానాన్ని పేద దేశాలకు ఉచితంగా నేర్పాలని ప్రత్యేకంగా కళాశాలను ఏర్పాటు  చేశారు క్యాస్ట్రో. ప్రపంచంలోనే అతి పెద్ద వైద్య కళాశాల అదే.

ఎక్కడ..?
హవానాలోని పాత నౌకా స్థావరాన్ని  మెడికల్‌ కాలేజీగా మార్చి లాటిన్‌ అమెరికన్‌ మెడికల్‌ స్కూల్‌ని 1999లో ప్రారంభించారు. పాత బ్యారక్స్‌ని చిన్న చిన్న తరగతి గదులుగా మార్చడంతో అచ్చం మన ప్రభుత్వ పాఠశాలలాగా ఉంటుంది. అదే నల్లబల్ల... అవే డెస్కులు. ఎలాంటి ఆధునిక సౌకర్యాలూ అక్కడ ఉండవు. అయినా వివిధ దేశాల నుంచి వచ్చిన పదివేల మంది  విద్యార్థులతో ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది ఆ కళాశాల. క్యూబాలో చదువుకున్న 30వేల మంది డాక్టర్లు ఇప్పుడు అమెరికాలాంటి పలుదేశాల్లో ప్రాథమిక వైద్య రంగంలో డాక్టర్ల కొరత తీరుస్తున్నారు.

*       *       *

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అన్ని దేశాల వైద్య వ్యవస్థల్లోని డొల్లతనమూ బయటపడింది. దాంతో చాలా దేశాలు క్యూబా సాయాన్ని మహదానందంగా స్వీకరించాయి. ప్రజల ప్రాణాలను కాపాడుకున్నాయి.
అందుకే... వైద్యసేవల్లో అంతర్జాతీయ సహకారానికి సంబంధించి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ప్రపంచం ముందు ఉంది. ఒక్క కరోనా విషయంలోనే కాదు, ఎలాంటి విపత్తు సంభవించినా ఎదుర్కొని నిలవాలంటే ఆ సహకారం తప్పదనడానికి క్యూబా సాయమే సాక్ష్యం..!

మన దేశంలో క్యూబా వైద్యం

వైద్య ఆరోగ్య రంగంలో పరస్పర సహకారానికి రెండేళ్ల క్రితమే క్యూబాతో మనదేశం ఒప్పందం చేసుకుంది. ఆ వైద్య విధానాన్ని ఇక్కడా అనుసరించేలా వైద్యులకు శిక్షణ ఇచ్చేందుకూ, మందుల తయారీ, సరఫరా తదితర విషయాల్లో పరస్పరం సహకరించుకునేలా ఈ ఒప్పందం చేసుకున్నాయి. ఆ తర్వాత పైలట్‌ ప్రాజెక్టు కింద ఆ విధానాన్ని అమలుచేయడానికి కేరళలోని తిరువనంతపురం శివారులోని ఓ గ్రామాన్ని ఎంచుకున్నారు. క్యూబాలో చేసినట్లే ఇక్కడా డాక్టర్లు రోగుల ఇళ్లకు వెళ్తారు. ప్రతి వ్యక్తికీ  సంబంధించిన వైద్య రికార్డులతో కంప్యూటర్‌ డేటాబేస్‌ రూపొందించారు. దీర్ఘ   వ్యాధులు ఉన్నవాళ్లని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ చర్యలన్నీ చక్కటి ఫలితాన్నిస్తున్నాయి. ఊరి ప్రజల ఆరోగ్య స్థితిగతులు మెరుగుపడటమే కాక, వైద్యంకోసం వాళ్లు పెట్టే ఖర్చు బాగా తగ్గినట్లు గమనించారు. ఈ పద్ధతిని ఇప్పుడు మిగిలిన గ్రామాల్లోనూ అనుసరించడానికి కేరళలో  ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కరోనా ‘కేర్‌’లో క్యూబా ముద్ర

క్యూబా ఆర్థిక వ్యవస్థకి పర్యటకరంగం ప్రధాన వనరు కావటంతో ఏప్రిల్‌ ఫస్టు వరకూ పర్యటకుల్ని రానిచ్చింది. ముగ్గురు ఇటలీ యాత్రికుల ద్వారా అక్కడ మొదటి కరోనా కేసులు నమోదయ్యాయి. క్యూబా నుంచి వలసవెళ్లి అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడిన చాలామంది తరచూ స్వదేశానికి రాకపోకలు సాగిస్తుంటారు. దాంతో ఎంత కట్టుదిట్టంగా పరీక్షలు చేసినా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం ఆ చిన్నదేశానికి తలకు మించిన భారమే అయింది. అయినా అక్కడి వ్యవస్థ ఏమాత్రం కంగారుపడలేదు. తగినన్ని ఆస్పత్రుల్ని సిద్ధంచేసి చికిత్స అందిస్తోంది. మరో పక్క స్కూలు యూనిఫారాలు కుట్టే సంస్థల చేత పెద్ద ఎత్తున మాస్కులూ వైద్యులకు ప్రత్యేక దుస్తులూ కుట్టించింది. క్యూబాలో కరోనా వల్ల మృతి చెందినవారిలో పర్యటకులే అధికం. అలాంటి పరిస్థితుల్లోనూ ఆ దేశం సాయం కోరినవారిని కాదు పొమ్మనలేదు
. దాదాపు పదకొండు వందలమందితో కరీబియన్‌ సముద్రంలో చిక్కుకుపోయిన బ్రిటిష్‌ ఓడలో కొందరికి వైరస్‌ సోకడంతో అమెరికాతో సహా ఎవరూ దాన్ని తమ ఒడ్డుకు రానీయలేదు. క్యూబా ఏమాత్రం సందేహించకుండా ఆ నౌకను ఆహ్వానించింది. ప్రయాణికులు అందరికీ పరీక్షలు చేసి బాగున్నవారిని వెంటనే విమానం ఎక్కించి స్వదేశానికి పంపింది. వైరస్‌ సోకినవారికి చికిత్స అందించింది. క్యూబా చూపిన ఈ ఔదార్యానికి  అంతర్జాతీయ సమాజమంతా ప్రశంసలతో ముంచెత్తింది.
😋😋
సేకరణ 
(ఈనాడు దినపత్రిక  ఆదివారం ఎడిషన్ ప్రత్యేకం)

03/03/2022

👩 పది నిమిషాలు భార్య ముందు కూర్చుంటే

జీవితం  యొక్క భాద్యత గురించి తేలుస్తుంది ..🙁

🍺పది నిమిషాలు తాగుబోతు ముందు కూర్చుంటే

జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది.....🙂

👩‍🚀పది నిమిషాలు సాధువులు, సన్యాసుల ముందు కూర్చుంటే

ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది 😇

🦹‍♀️పది నిమిషాలు రాజకీయ  నాయకుడి ముందు కూర్చుంటే 

మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది...😔

 💷పది నిమిషాలు జీవిత బీమా చేసే ఏజెంటు ముందు కూర్చుంటే 

చస్తేనే మంచిదిమో అనిపిస్తుంది....😔

👨‍💼పది నిమిషాలు వ్యాపారుల ముందు కూర్చుంటే 

మన సంపాదన చాలా తక్కువ, దేనికీ సరిపోదు అనిపిస్తుంది....🙁

👨‍🔬పది నిమిషాలు శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే 

మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది...🧐

👨‍🏫పది నిమిషాలు ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే 

మనం మళ్లీ విద్యార్థులం కావాలని అనిపిస్తుంది.📚

👨‍🌾పది నిమిషాలు రైతులు, కార్మికుల ముందు కూర్చుంటే 

వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది.😢

👮పది నిమిషాలు సైనికుల ముందు కూర్చుంటే 

వారి ముందు, మన త్యాగం, సేవలు ఏమీ కావనిపిస్తుంది.😒

👨 కానీ ఓ పది నిమిషాలు ఓ స్నేహితుని ముందు కూర్చుంటే 

జీవితం స్వర్గంలా ఉంటుంది.😄

👌👍👌👍👌👍👌👍👌

కధలు..02/04/2023

లక్షల కాపీలు అమ్ముడుపోయిని The Sky Gets Dark, Slowly  అన్న పుస్తకం గురించి యండమూరి వీరేంద్రనాథ్ వివరణ.

ఈ పుస్తకం నేను చదవలేదు కానీ గూగుల్ లో దీని సారంశం చదివాను. డబ్బు సంపాదన గురించి నా పుస్తకం (ఏప్రిల్ విడుదల) "ఇంటి పెరట్లో లక్ష్మి చెట్టు" లో 'వృద్ధాప్యం లో డబ్బు అవసరం' గురించి ప్రస్తావిస్తూ ఆ సారాoశాన్ని ప్రస్తావించాను.

నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనం లో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు.

నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు.

నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. ఈ సొసైటీ నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది.

దాహంతో దూరంగా ఎక్కడో ఒక కాకి అరుస్తూ ఉంటుంది. నీ లాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు. నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది.

యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టావు. మధ్య వయసులో సంపాదించినది పిల్లల్ని అమెరికా పంపించడానికి ఖర్చు పెట్టావు. అందరితో ‘నా కొడుకు అమెరికాలో, కూతురు ఆస్ట్రేలియాలో ఉన్నది’ అని గర్వంగా చెప్తూ ఉంటావు. ఎన్నాళ్ళకొక ఒకసారి వాళ్ళు నిన్ను చూడటానికి వచ్చారన్నది మాత్రం చెప్పవు.

అమెరికా నుంచి నీ కొడుకు సెల్ ఫోన్ లో నీ పుట్టినరోజు తేదీ చూసి ఫోన్ చేస్తుంది. నీకు నీ మనవడితో మాట్లాడాలని ఉంటుంది. వాడు చా….లా బిజీ.

అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది.

పక్క మీద గంటల, రోజుల తరబడీ పడుకొని ఉండటం దినచర్య అవుతుంది. పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది. ఒకటే తేడా ఏమిటంటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి తల్లి ఉంది. ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ. నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు.

నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావనీ, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావనీ, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ నిన్ను మందలిస్తూ ఉంటారు.

ప్రొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్‌గా ‘నీకు కాన్సర్’ అని చెప్పటం మొదలైనవి అన్నీ నీ జీవితంలో భాగమైపోతాయి.

నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే, నువ్వు సంపాదించిన డబ్బు నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా, చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలో నీ వాళ్ళు చర్చిస్తూ ఉంటారు.

మరేం చెయ్యాలి?

THE SKY GETS DARK SLOWLY అనే పుస్తకంలో రచయిత “ప్రస్తుత జీవన విధానం మార్చుకుంటే. పై సమస్యల్లో ‘కనీసం కొన్ని’ తగ్గించుకోవచ్చు” అంటాడు. “ఆకాశo క్రమక్రమంగా నల్లబారుతోందనీ, ఒక్కొక్క దీపమే ఆరిపోతుందనీ గ్రహించిన వ్యక్తి జీవితపు ఆఖరి స్టేజి కోసం ఆరోగ్యవంతంగా ప్రిపేర్ అవ్వాలంటే అయిదు సూత్రాలు గుర్తుంచుకోవాలి” అంటాడు.

ఆకాశం పూర్తిగా నల్లబడక ముందే నీ దారి పొడుగునా లైట్లు వెలిగించి శక్తి ఉన్నంతవరకూ పని చేస్తూ ఉండు. నీకన్నా అశక్తులకీ, అనాథలకీ సహాయం చేస్తూ ఉండు.

ఏకాంతం స్థానే శూన్యత ప్రవేశించినప్పుడు అది అతి తొందరలో ఒంటరితనం గా మారుతుందన్న విషయాన్ని నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత బాగుంటుంది.

ప్రతి మనిషి చుట్టూ ఒక ‘తావి’ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అది సుగంధ సౌరభ పరిమళంగానో, దుర్గంధ పూరితoగానో మారుతుంది. ఎలా మారుతుందనేది హుందాతనాల / నీ చాదస్త ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది.

పిల్లలు పుట్టగానే లావు అవటం సహజం అనుకోకు. జిహ్వ చాపల్యం తగ్గించు. ఒక వయసు వచ్చాక తిండి ఆనందం కాదు. అవసరం. వయసు పెరిగే కొద్దీ శరీరం ఇచ్చే సంకేతాలు గమనించు. పెగ్గులు సిగరెట్లు తగ్గించు. ఆంధ్ర తెలంగాణాల్లో లక్షకి ఐదువేల మంది స్త్రీలు థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారని అంచనా.

వయసు వల్ల వచ్చిన అధికారంతో నీ చుట్టూ ఉన్నవాళ్ళని శాసించకు. వీలైనంత వరకూ వారి చర్యలపై నీ అమూల్యాభిప్రాయాన్ని వెల్లడి చేయకు. నీ బోధనలు ఆపి ఒక్కడివే ఉండటం ఎలాగో నేర్చుకో. లేకపోతే నీ ఇంటివారు నిన్ను మరింత దూరం పెడతారు.

ఒంటరిగా కూర్చొని పుస్తకాలు చదువు. ఏకాంతంలో సంగీతాన్ని విను. ఓపికుంటే మొక్కల్ని పరిరక్షించు. చిన్న పిల్లలతో కొద్ది సేపు వారికి ఇంటరెస్టు ఉన్న టాపిక్స్ కబుర్లు చెప్పు. అఫెక్షన్ బ్యాంక్ లో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళు.

“ఎప్పుడైతే నువ్వు మానసికంగా ఇలా ప్రిపేర్ అయ్యావో నీ వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలు వాయిదా వెయ్యగలవు” అంటాడు 'The sky gets dark slowly' అన్న పుస్తకంలో రచయిత వ్రాసింది. ఈ పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయింది

                  శుభోదయం🙏

రోజుకొక కధ...01/03/2022

సేకరణ.. రచయిత మల్లాప్రగడ రామకృష్ణ

బిర్యానీ హోటళ్ళు, సాంప్రదాయ బోజన హోటళ్ళను మింగివేసాయీ ఎందుకు ?

మన యువత ఏది ఇష్టపడితే అదే‌ సక్సెస్.నాకు కూడా చాలా ఆశ్చర్యమే.మన పులిహోర , చక్రపొంగలి,దధ్యోదనం వంటి వంటకాల కంటె ఇందులో ఏమి గొప్ప రుచి ఉన్న దో నా బుర్ర బద్దలు కొట్టు కున్నా అర్థం కాదు.

మనము మన సంప్రదాయ వంటకాలను సరిగా మార్కెట్ చేసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం.మనవాటిని పాత చింతకాయ పచ్చడి అని పక్కన పెట్టేశారు. బిర్యానీ చప్పగా ఉంటుంది.కొన్ని సుగంధ ద్రవ్యాలు వేస్తారు. అంతకంటే ప్రత్యేక త ఏమి ఉన్న ది.

తా వలచినది రంభ అన్నారు.యువత ఏది ఇష్టపడితే అదే గొప్ప వంటకం.వాళ్ళ దగ్గర డబ్బు లు బాగా ఉన్నాయి.ఉద్యోగం రాగానే పెళ్లి అయ్యేవరకు ఇదివరకు కుటుంబ ము నకు ఆర్థిక ముగా సహాయం చేసే వారు.ఇప్పుడు ఆ బాధ్యత లు లేవు.వారు బిర్యానీ తయారీ కి ఎంత అవుతుంది,వారు పెట్టే ధర ఎంత అని ఏమీ ఆలోచించడం లేదు.ఇలా ఖర్చు లు పెట్టి పార్టీ లు ఇవ్వటం లో పోటీ లు పెడుతూ ఉంటారు.అలాంటపుడు మన సంప్రదాయ వంటకాలను తోసేసి బిర్యానీ వెంట పడుతున్నారు.

పాత ఒక రోత, కొత్త ఒక వింత అనే సామెత ఎలా గో ఉన్నదే కదా!

0 Comments


1 comment: