Sunday 27 June 2021

కరోనా బాధ నుండి మేల్కొని ఆనంద పర్చాలని ఉద్దేశముతో 


* ఆనందసూక్త  చంద్రిక పద్యాలు  


స్పర్శ వల్లననే సహన ఉద్రేకము సున్నిత భావమే     

నిర్వి రామకృషిఎ నిర్మల మనసు కే జ్ఞాన వి వేచనము 

సర్వ సృష్టి కిదే సమ్మ తానందమె సకల ఆనందము           

పర్వ దినములలో భజన పరులుగాను చూపు  సంతసమ్ము   .... 101    


నవ్వుల లోననే నాట్య ములలోననె నయన ఆనందము 

తవ్విన కొద్దియే దొఱుగు చుండు నీరు నవ్వి తె కన్నీరు  

కవ్వములా కదలి కెవ్వున సాగేను జువ్వల వెలుగులే       

నవ్యతకు నాందీ నాగరికతకు ఇది శోభ శుభము కలుగు ..... ... 102


ఖర్చు సుఖాని కే ఘనత అని పెడితే బూడిద భోగమే

స్వర్గ లోక భోగ సర్వ సాధారణ దాన ధర్మాలు లె

ధర్మ మార్గానే ధర్మనిరతిగా ను భోగ ఆనందమే

ధైర్య ములేకుంటె తప్పు దొర్లితుంది యుధ్ధ మేజరిగే.....103 


గుండెలో దాచా గుణము తెల్పలేక అంత రాత్మగాను

మండె హృదయములో మానవత్వాన్నీ తెలప లేక ఉన్న

నిండు హృదయంతో  నిజము తెల్పు చున్న నమ్మి బతుకు చున్న

నిండ మునిగి ఉన్న నడక మార్చ లేక జీవితం సాగును....104


శీతల కాలంలొ స్పర్శ అవసరమే చలిలొ ఆనందం 

మత్తు వెచ్చగాను వచ్చి కరము నలిపి చలికి వెచ్చనిసెగ             

అంతు తెలియ కేది అలుక తీర్చుటకే ఆలి అంగ స్పర్శ 

వింత మార్పు లేను వినయ వాంఛ వల్ల సతి పతులలొ లీల 105

      

వేసవి లోచల్ల వేకువ దనంలో వెచ్చ వెచ్చగానె      

ఆశలవెల్లువే అక్కర పిలుపే ఆట నేర్చుకొనే  

విశ్వమంతయు ఇది విజయ వాహినిగా జరుగు ప్రకృతియే 

అశ్వవేగములే వయసు బట్టి వచ్చు ఆనందం . ..... 106


తోడు గా హృదయం తోక చుక్క కదలి కా కూడదు

తోడు నీడ కొరకు తోలు బొమ్మ లాగ ఆట లాడ వలదు 

తోడు గాలి పిలుపు తప్ప ని సరిగాను హాయి నేనంటా 

తోడు పలుకులేను తడిపొడితపనలులె  సోయగములేలులె ...... 107

    

మేఘ వర్షానికి మనసు ఉప్పొంగియు కాల నది పొంగెను  

మేఘ హర్షానికి పుడమి పురివిప్పెను నిత్య సత్య  మయ్యె 

మేఘ కదలిక లే పాల నీళ్ల గాను కదలి వర్ణ  మాయె     

మేఘ జల్లులకే పులకరించేదే మదిలొ హాయి గొలుపు   .... ..... 108   


దూరపు తారలే తోరణ మల్లెలగు కాంతి వెలుగు లతో

జేరగలేనివే చెన్నుగ నుండెనే జిత్రము చూడగా

తారలు అన్ని యూ దాపరికము లేక తరుము చీకటియే

భారము లేనిదే బంధము పెంచేది బాధ్యతా కలిగే  ... ..... 109


 స్వీయ భావనలో  శీఘ్ర సహజ తృప్తియు మితి మీరు చుండు   .

స్థాయి ఏ దైనను సాహ సమ్ము తోను సమరముయే జరుగు         

వ్యయ మే దైనా వ్యాధి తగ్గుట యే పూర్తి నిజము లేదు     

న్యాయ పోరాటం న్యాయమానందం సుఖము తప్పు కాదు ... ... 110



చివరి మెట్టు వరకు చిరుత పోరాటం చేసి నట్లు చేయి   
ఎవరి మార్పు కొరకు ఏవిధము వళ్లైన చేయు సేవ మేలు 
కవులు చెప్పు కధలు కాటికి పోయేటి మనిషి బతక వచ్చు 
అవని కోరికలే అమలు చేయు మనిషి జీవి ఆనందం       .... .....  111    

మువ్వ గోపాలుని ముద్దు మోము చూడ ముందు పనులు ఆగె
జువ్వవెలుగు చూపి జూద మాడె మనసు గోల చేయు చుండె
నవ్వు చూపు కళలు నవ్వ భావ వెలుగు మోహన లీలలే
సవ్వకళలు చూపు సరళి హావ భావ అంద చందాలు లె .... .... 112

జీవితము కథయా జీవితము నిజమా జీవితము కలయా
జీవితము నదియా జీవితము కలయిక జీవితము కణమా
జీవితము బంధము జీవితము భంధము జీవితము చలనము
జీవితము పలుకా జీవితము కులుకా జీవితము కవితలే ........ 113

మాన వత్వమ్మే మంట కలిసి పోయి పాప భీతి పెరిగె
దాన వత్వమ్మే పంట పండు తుంది ఏమి చేయ లేకయె
పుణ్య భూమి కరుణ పరిత పించెనులే పాప భార ములకు
కన్నులెర్ర జేయ గా కలిగెను పుడమి కర్మ సాక్షి గాను      ....... 114


జీవుల రూపమే జీవ పరిమాణము ఈశ్వరుని లీలలు 
జీవుడు జ్ఞానాన్ని జిలుగు లేక బోధ చేయు చుండు లీల   
జీవుడు తనలోని జీతము ఇతరులకు ఆత్మ జ్ఞాన మవును 
జీవుడు భక్తి గా  జీవ శక్తిగాను దైవమును చూచును  .... ... 115


వెన్నతోఁబెంచే వేణు నాద మభ్య సింప వివేకమితొ 
యెన్నెని పొగడిన అవని తీర్పువల్ల దైవ బోధ చేయు 
నన్నుఁ బుట్టించే నమ్మిన దేవుఁడే నాకు శక్తి నిచ్చె   
కన్నచోటులనే కామ్య బుద్ధి ఉంచి కాచె దేవుఁడువే !! .... .... 116
  
సిరులను ఇచ్చినే  సేవగొనేటి మన సైన దేవుఁడువే 
గురుఁవుగ బోధించి ఘనము గల దేవుఁడు మనసు వెంట ఉండె  
మరులు గొల్పేటి పలుకు పటుత్వమును తెల్పె దేవుఁడువే  
తరువు లాగ పెరిగి పుడమి తల్లిరుణము తీర్చు దేవుడవే !! ... ... 117
 
దాపుదండైనను దేవుఁడు దరిచేరి మాన ప్రాణ రక్ష    
రూపు చూపేనే రమ్య మైన మనసు ఇచ్చి హాయి గొలుపు  
శ్రీ పతియైనట్టి శ్రీ రమణ దేవుఁడు నన్ను కావు చుండు 
చూపు మమ్మేలెను చూడ చక్కనోడు చితా తీర్చు వాడు !!  ... ... 118

మనకు ఆనందం మాత్ర అందరిలో ఉండి తీరుతుంది 
వెనుక సంతృప్తిగ వేకువనే తృప్తి గాను కల్గివుండు 
తనువు తపనల పొర తక్షణము సుఖాలు భావ సంతృప్తిఎ
మనలొ వేదభావ మోక్ష మిచ్చు దారి ఒక్క ఆనందం .....  ..... 119

కాలము వృధాగా కర్మకు కొదిలివేసి భావ నలో చిక్కి 
దూలము వల్లేను దరిన ఉన్నట్టి  సమయ మంత వృధా 
పాలన లేనిధై ఫలము పొందనిదై ప్రకృతి ఆనందం 
మేళము శబ్దమే పేరు గుర్తు లకై పరుగు ఆనందం  ..... .... 120

రేండు భావనలే రకర కములుగాను కలుగు ఆలోచన 
రండు అని వేదనల రమ్య సుఖము హోళి రంగ రించు చుండు 
పొండు దుర్భాషల పొందు ఆనందం చిందు లాట లగును 
మండు మాయ వళ్ళ మాన రక్షణలే మౌన తీర్పు వళ్ళ .... ... 121

కనక కానుకలే కలలు కళ్ళ లవక కినుకును కులుకుగా 
కోన కాకనుయే కొలత లేని కుసుమ కళకళలు కధగా 
గాన కోకిలగా కిలకిలా రావము కన్నులు కింపుగా 
వాన కులుకు తడిపి కనికరము కామ్యము కులుకు జంటలందు ...122
              
తొంగి చూసాడే తలుపు చాటు నుండి నిత్య సూరీడే
సిగ్గు దోచాడే సరస మాడాడే వళ్ళు చల్ల తీర్చె
అంగ సౌలభ్యాన్ని అందచేసేనే వయసు గల చిన్నది
ముగ్ద మోహ నాల మువ్వ గువ్వ లీల కాల తీపి గుర్తు .... .... 123

పెళ్లి కావాలని పెళ్ళి అంటె భయము కోరిక సహజమ్ము
పెళ్లి కావాలే నాకు పెళ్ళి భోజనమే కోరికె స్వార్ధం
పెళ్లి అందరికీ పెళ్లి యె శాడిజం అనుట మగరాయుడు
పెళ్లి ఆత్మ తృప్తి పెళ్లి సంతృప్తీ పెళ్లి జీవితమ్ము.... .... 124

నేటి  ... చంద్రిక పధ్యాలు 

భరత మాతకు ఇక భక్తి వందనాలు పంచు శాంతి సుఖము   
చరిత మారదు ఇక జాతికి ధైర్యమ్ము తెల్పి బతక మనెను   
అరుణ హృదయమ్మే ఆశ లన్ని తీర్చు జీవ సౌఖ్య మొవ్వు 
కరుణ మార్గమ్మే కాల సమయము నిత్య సత్య మొవ్వు     ..... 125

సుంద రమ్ము చూపు శోభ నిచ్చు వనము గిరివనరులతోను 
పొంద లేని దాన్ని పొందు అనుట వలన ఆశ అగుట ఏను          
మంద హాస మంత పాలు పంచు కొనుట జీవి సహజ మొవ్వు 
బుద్ధి కుశలత యే మంద బుద్ధి నట మార్చ వచ్చు ఇపుడు .... 126

స్వచ్ఛ గతుల నీతి సౌఖ్య ధైర్యాలయి ఇచ్చి పుచ్చు కొనును
స్వేచ్ఛ జనుల కుంది సామ దాన భేద రాజా నీతి అండ    
ఇచ్ఛ ఉంచు మేలు ఈశ్వర తత్వమ్ము తెల్ప గలరు మీరు 
మచ్చ లేని మనిషి మెచ్చ కున్న బతుకు కాల మాయ నేర్పు ... 127





No comments:

Post a Comment