Thursday 3 June 2021

chandasssu



న  భ న న జ న  ల గ ...9./ 20  


కళలు పొందియు వినక కనుల వినోద తరుణము ఏ  
విలయ మొచ్చిన తెగువ నిరతము చూపి సుఖములుఏ 
అలల లాగున ఉరక మరలుట వళ్ళ శుభములుఏ 
అలుక వళ్ళను జరుగ పనులు మనస్సు కలతలు ఏ     

ర జ న య స 6.'15.

రమ్య మైన వారము హృదయ  సంభందము ఏ   
గమ్య మందు సాగెను నడక సంతోషముఏ 
సౌమ్య మందు బాసల కళలు తీర్చేందుకుఏ 
కామ్య బుద్ధి  శోకము కలలు హృద్యమ్ము కధఏ 



ప్రాంజలి ప్రభ.....కలము తీర్పు  



నీతి 

బోధించుటకా ఆచరించుటకా

అనుభవించుటకా

ఆత్మీయులను బతికించుటకా    ... ... 101


స్నేహము

మనసు బాధ తెలిపేందుకా

కోరికలు తీర్చు కొనేందుకా

ప్రేమను తెలిపేందుకా    ... ... 102


రోగము


మనిషిలో ఉందా బయట వుందా

కర్మ అని సర్దు కోమందా

మందు వాడితే రోగము పోతుందా ... ... 103


ఆశలు

మనుష్యులను బతికిస్తాయా

చచ్చుటకు మార్గ మోతాయా

చంపుటకు మార్గమోతాయా  ... ... 104


105..చిరునవ్వు

నీలో లేదెందుకు, నాలో ఉందెందుకు, 

నీకు నమ్మకం లేదెందుకు

నవ్వుకోవడానికి రావెందుకు ... .. 105


106..దైవభక్తి

ఉండితీరాలి ఆస్తికుడుగా

ఉండకూడదు నాస్తికుడుగా

నడిపించేది దేవుడే గా


107..దేశ భక్తి

పుట్టినప్పుడే ఉగ్గుపాలతో నేర్పింది అమ్మ

కండకావరంతో లేదన్నా దేశం బతికి స్తుందని చెప్పేది అమ్మ

దేశద్రోహుడుగా మారితే నరికేది అమ్మ


108.

.గురుభక్తి

ఉన్నవాడు జీవితాన్ని చూడగలుగుతాడు

లేనివాడు జీవితంలో కష్టాలు చూస్తాడు.


109. వార్ధక్యం

పిరికిది కానేకాదులే మేధాసంపత్తు పంచే శక్తి లే

గౌరవించేవాడికి తెలుస్తుందిలే


110.. సత్యమే

విశ్వాన్ని నడిపించు ఆయుధము

దేనికీ లొంగని బతుకు జీవనము

సత్యవాణి తాకే మంత్రము


111. కాలం

కలవర పెడుతూ సాగు

నన్ను గుర్తించారా అంటూ సాగు

వయసు కాలంతో సాగు


112. ప్రశంస

మనిషికి ఉత్తేజం కల్పించు

బతుకు దారి చూపించు

నడవడికలో మార్పు కనిపించు


113..స్వేచ్ఛ

ఉండు చదువుకునేందుకు

ఉండు ప్రేమించేదుకు

ఉండు తల్లి తండ్రులను పూజించేందుకు


114..ఆశయం

అవకాసం బట్టి మార్చకు

డబ్బులకు అమ్ముడు బోకు

గొప్పదని చెప్పకు


115. విశ్వాసం

అందరితో వుంచు

ఆశయం

లో వుంచు

తల్లితండ్రుల వద్దవుంచు


116 ...మనిషి

మానవత్వాన్ని బతికించు మాట 

వంచన అనేది  లేదంట

సుఖమును అందుచే అట 


117 ... వేట

మృగాలనుండి ప్రజా రక్షణ 

శిష్ట రక్షణ,  దుష్టుల శిక్షణ 


118 .. మంచి

చెప్పడం కాదు, మంచిగా బతికి బతికించు 

మనసుతో విజయం సాధించు  


ఆలోచన    .....  119

వల్ల మనిషికి మార్చు కోరు 

బతుకు తెరువు పోరు 


చెమట ... .... 120

శరీర శ్రమకు సుగంధము

ఆనంద పరవసానికి పరిమళం


చావు  ... ... 121

కర్మాను బంధము వాళ్ళ సాగు 

పుడమితల్లి పిలుపు వచ్చు వరకు సాగు 


సమూహం ... ... 122

కప్పల తక్కెడ అన్నారు 

గాలిలో కదిలే కాగితాలన్నారు 

కుక్కల అరుపు కే పరుగెత్తే వారు 


నిర్వాహకులు ... ... 123

నిరంతరము అభిలాషులు 

కార్యనిర్వాహక వ్యక్తులు  

తప్పు ఒప్పులు చెప్పే సమర్థులు 


తాపత్రయం  .. .... 124

పొందలేనిది పొందాలని 

పొందినది అనుభవించాలని  


వీధి   ... .....  125 

నీకు నిత్యమూ కనిపించేది 

అంతము లేనిది 

అంటూ చిక్కనిది 


No comments:

Post a Comment