Sunday 11 October 2020


* దేవతా గణాలు - గంధర్వులు 

* మీ విలువ మీరు తెలుసుకోండి.,*జ్ఞానంలో ఏడు స్థితులు


దేవతా గణాలు - గంధర్వులు :

వేదాది సాహిత్యం లోనూ, పురాణాలలో, ఇతిహాసాలలోనూ ఈ "గంధర్వుల" ప్రస్తావన ఉన్నది. పురాణాల ప్రకారం వీరు "కశ్యప ప్రజాపతికి" పుట్టిన వారు. వీరు మనుజులలా, మనకు భౌతిక నేత్రాలకు కనిపించకపోవడం వలన(సామాన్య దృష్టికి) , వీరు మానవ తలాలకు (dimensions)చెందిన వారు కాదని అర్థం చేసుకోవాలి. మహా భారతంలో సాత్యవతేయుడైన చిత్రాంగదుడు, ఒక పరాక్రమ వంతుడైన గంధర్వరాజుతో పోరాడి మరణించడం మనం గాంచవచ్చు. దీనిని బట్టి గంధర్వులలో పరాక్రమశాలురు కూడా ఉన్నట్లు గమనించవచ్చు. అలాగే, భారతంలో అంగార పర్ణుడు అను వీరుడైన గంధర్వుడు, అర్జునుడి చేతిలో ఓడి, అర్జునిడికి , "చాక్షుసి" అనే విద్యను ఇస్తాడు. ప్రతిగా అర్జునుడు ఇతనికి "ఆగ్నేయాస్త్రాన్ని" ఇస్తాడు. ఈ అంగార పర్ణునికే " చిత్ర రథుడు" అనే పేరు కూడా ఉన్నది.ఈ అంగార పర్ణుడు, యక్షరాజైన "కుబేరుని" మితృడు కూడా.

    మనము, "త్రిమితీయ" (Three Dimensional) తలాలకు చెందిన వారము. వారు 4th లేదా అంతకంటే ఉన్నత తలాలకు చెందిన వారు గానీ అయ్యుండవచ్చును. చరాచరమైన, స్థావర జంగమాత్మక మైన ఈ భగవత్ సృష్టిలో ఎన్నో తలాలు (Dimensions) ఉన్నాయి. ఆయా తలాలలో ఒకానొక తలానికి చెందిన వారై ఉండవచ్చును, ఈ గంధర్వులు. మన పురాణాలలో, ఇతిహాసాలలో , వీరు మానవ లోకాలకు - గంధర్వ లోకాలకు సంచారం చేసినట్లు చెప్పబడినది. వీరు అదృశ్య ప్రపంచానికి చెందిన జీవులు. వీరు  దేవతలు పానం చేసే "సోమ రసాన్ని" రక్షించే వారిగా చెప్పబడ్డారు. స్వర్గలోకపు సభ అయిన అమరావతిలో, వీరు ఆస్తాన సంగీత కారులు కూడా. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఈ గంధర్వులు మనవ లోకానికి-దేవ లోకానికి మధ్య అనుసంథాన కర్తలుగా కూడా పనిచేసారు.  హిందూ సాంప్రదాయ వివాహ పద్ధతుల్లో "గంధర్వ వివాహం" ఒకటి. కొన్ని సార్లు గంధర్వులు ప్రకృతి దేవతలు గానూ, అప్సర స్త్రీల భర్తలుగా కూడా ఉన్నారు. ఇదంతా ఇతిహాస, పురాణ ప్రశస్తి. అలాగే శ్రీమద్రామాయణంలో కూడా, "దనువు" అనే గంధర్వుడు, కబంధుడిని  రాక్షసుడు కమ్మని శపించబడతాడు. అయితే గంధర్వులలో కూడా కొన్ని వర్గాలున్నట్లు మన పురాణాల సమాచారం. వారు

1. అశ్వ తారలు
2. మౌనీయులు - ముని నుండి పుట్టిన వారు(ఇక్కడ ముని అంటే తపము నాచరించే వాడు)
3. రోహితులు
4. శైలీశులు
5.ఉచ్ఛైశ్రవులు
6. వాలీయులు

అథర్వ  వేదంలోని ఈ మంత్రం, వీరిలో స్త్రీలను భోగులుగా వర్ణిస్తుంది.

మంత్రం :

జాయా ఇద్వో అప్సరసో గంధర్వాః పతయో యూయమ్|
ఆప ధావతామర్త్యా మర్త్యాన్ మా సచధ్వమ్ ||

(అథర్వ వేదం  4 - 37 - 13)

అయితే గంధర్వులు గొప్ప కళాకోవిధులుగా కూడా వర్ణించ బడ్డారు. గొప్ప గాన కళా లోలురుగానూ,చిత్ర కళా విశారదులుగానూ, వీరు వర్ణించ బడ్డారు.

   యజుర్వేదం లోని 18వ అధ్యాయంలోని కొన్ని మంత్రాలు, "అగ్ని-సూర్య-చంద్రాదులను" గంధర్వులుగా పేర్కొంటున్నాయి. గంధర్వులకు గొప్ప సౌందర్యము కలవారనే పేరు కూడా కలదు. 

మరొక అర్థంలో.......          " గాంధరతి ధారయతి ఇతి గంధర్వః" అనగా గోవును ధారణ చేయువాడు "గంధర్వుడు" అని కూడా అంటారు. ఇక్కడ "గో" శబ్దానికి నిఘంటువు ఏం చెబుతుందంటే.....సూర్య రశ్మి, వాణి, పృథివి మరియూ స్తుతి చేయువాడు మున్నగు నామములు ఉన్నాయి. ఈ విధంగా ఎలాంటి ప్రయాస లేకుండా "గో" అనగా "రశ్మి" ని ధరించే సూర్యుడు గానీ,చంద్రుడు గానీ, గంధర్వుడుగానే పిలువబడుతున్నాడు. 

"గాం" అనగా స్తుతిని ధరించే వారు అనగా స్తుతము చేయుటలో ప్రవీణులు, గాన విద్యా విశారదులు "గంధర్వులు" గానే పిలువబడ్డారు. ఉదాహరణకు "తుంబురుడు". అలాగే మన పురాణ, ఇతిహాసాల ప్రకారం అలంకార భూషితుడు(గంధర్వ రాజు), అర్క పర్ణుడు, ఔదుంబురుడు, భీమ సేనుడు, బ్రహ్మచారి, చిత్రాంగదుడు, దుంధుభి(వాలి సంహరించిన వాడు కాదు), హాహా, హూహూ, మనోరమ, నలుడు, నారదుడు (ఒక గంధర్వ రాజు), తుంబురుడు, రైవతుడు, అంగార పర్ణుడు.....ఇలా....బౌద్ధ, జైన వాఙ్మయంలో కూడా ఈ గంధర్వుల ప్రశస్తి ఉన్నది.

   స్థూలంగా, యోగ పరంగా చెప్పాలంటే "గంధర్వులు" భోగ యోనులు. భిన్న కోరికలతో కూడిన సాధనలు చేసి , మృత్యువునొందిన జీవాత్మలు ఈ "గంధర్వ" అవస్థలో తిరుగుచుందురు. ఈ "గంధర్వ అవస్థ" ఈ చరాచర విశ్వంలో స్వతంత్ర వ్యక్తిత్వం గల అవస్థ. దానికి తగిన కార్య కారణ లోకములు       "ఆప తత్వము" ద్వారా క్రియాన్వితమగును. అందుకని, యోగ శాస్త్రంలోనూ, దర్శన శాస్త్రాలలోనూ ఆపతత్వ సిద్ధి సాధకులను "గంధర్వులు" అనికూడా అంటారు. ఆ "యోగ భగవానుడు" గొప్ప సిద్ధి పొందినట్లయినచో,  వారి శరీరము నుండి "గొప్ప సుగంధము" వచ్చుచుండును. అనగా ఆ యోగి ఆప తత్వ అవస్థలో సిద్ధి పొందినట్లయినచో, ఆ యోగి సంకల్ప మాత్రంచేత సుగంధం వెదజల్లుతాడు. ఒక యోగి ఆత్మ కథలో (శ్రీ విశుద్ధానంద సరస్వతి) "గంధ బాబా" వృత్తాంతము దీనికి ఉదాహరణ. వీరు వారణాసికి చెందిన వారు. శ్రేష్ఠులైన ఆ ఉన్నతాత్మలను "గంధర్వులు" అని కూడా అంటారు. అట్టి గంధర్వులకు సిద్ధులన్నీ కరతలామలకాలు. ఆ సిద్ధుల మాయలో పడ్డవారు, చాలా కాలం వరకు ఆ గంధర్వ,అప్సర అవస్థలలోనే ఉంటారు. ఆయా భోగాలు అనుభవిస్తారు. వారుండే లోకమే " స్వర్గము". ఈ స్వర్గము అనేది ఒక "అవస్థ". ఒక "తలం". ఈవన్నీ సూక్ష్మ లోకాలుగా కూడా అనుకోవచ్చు. 

గంధర్వ లోకము : 

నీటిలో చెట్ల నీడలు కనిపించు రీతిలో , మరీచికల్లా....గంధర్వ లోకము అనుభూతికి వచ్చును. అనుభూతి అని ఎందుకన్నామంటే, ఇవి మనస్సు యొక్క అవస్థలు. జడ శరీర అవస్థలైతే భౌతిక అనుభవాలు అంటాము. ఉపనిషత్తుల నందు "తథా అప్సు పరీబ దదృశే తథా గంధర్వ లోకే ఛాయా" అని వర్ణించబడింది. ఏ యోగిలోనైనా, ఆప్ తత్వం అనగా జల తత్వం చైన్యవంతమైతే, అందుండి వచ్చెడి వారే "గంధర్వులు,అప్సరసలు". అందు చేత గంధర్వులు,అప్సరసలు ఆప్ తత్వీయులు.

భట్టాచార్య

--(())--


* మీ విలువ మీరు తెలుసుకోండి.

ఒక తండ్రి చనిపోయే ముందు కొడుకు ని పిలిచి...ఈ చేతి గడియారం 200 సంవత్సరాల పూర్వం మీ ముత్తాత వాడినది. ఒకసారి నగల దుకాణం దగ్గరకు వెళ్ళి అమ్మటానికి ప్రయత్నించు, ఎంత ఇస్తారో అడుగు అంటాడు.

కొడుకు నగల దుకాణంకు వెళ్ళి అడిగితే చాలా పాతది కాభట్టి 150 రూపాయలు ఇవ్వగలం అంటారు. అదే విషయం తండ్రికి చెప్తే ఒకసారి పాన్ షాప్ దగ్గర అడిగి చూడు అంటాడు.

పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే బాగా త్రుప్పు పట్టి ఉంది 10 రూపాయలకి కొనగలను అని చెప్తాడు. 

ఈ సారి తండ్రి కొడుకుతో ..మ్యూజియం దగ్గరికి వెళ్ళి అడిగి చూడు అంటాడు. వాళ్ళు అది చూసి ఇది చాలా పురాతనమైనది మరియూ అత్యంత అరుదైనది. 5 లక్షలు ఇవ్వగలం అంటారు.

అప్పుడు తండ్రి కొడుకుతో..."ఈ ప్రపంచం చాలా వైవిధ్యమైనది. నీకు ఎక్కడ విలువ ఉండదో అక్కడ ఉండకు, అలా అని వారి మీద కోపం వద్దు; వారితో వాదించి కూడా ప్రయోజనం ఉండదు. నీకు తగిన విలువ దొరికిన చోట ఉండు"  అని చెప్తాడు.
మీ విలువ మీరు తెలుసుకోండి.

*జ్ఞానంలో ఏడు స్థితులు
* మీ విలువ మీరు తెలుసుకోండి.

*జ్ఞానంలో ఏడు స్థితులు

*జ్ఞానంలో ఏడు స్థితులు ఉన్నాయి. వీటిని "సప్త జ్ఞాన భూమికలు" అంటారు.
1. శుభేచ్ఛ:- నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ. (తీవ్ర ఆకాంక్ష)
2. విచారణ:- బ్రహ్మ జ్ఞానం ఏ విధంగా పొందాలి? అన్న మీమాంస. 
బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి విధానమే -  ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని తెలుసుకుంటారు.
3. తనుమానసం:-  తత్ సాధనలో నిమగ్నులై ఉండడమే తనుమానసం. 
4. సత్త్వాపత్తి:- శుద్ధ సాత్వికం సాధించడమే సత్త్వాపత్తి. యోగి అయిన స్థితి.
5. అసంసక్తి:-  భౌతికతపై అనాసక్తి పొందిన స్థితి. తామరాకుపై నీటిబొట్టు వలె వ్యవహరిస్తారు.
6. పదార్థ భావని:-  ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. సవికల్ప సమాధి స్థితి. దివ్యచక్షువును ఉత్తేజింప చేసుకుంటారు.
7.  తురీయం:- జాగ్రత్, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు. నిర్వికల్ప సమాధి స్థితి. అందరినీ యోగులుగా, ఆత్మ జ్ఞానులుగా మలచడానికి కంకణం కట్టుకుంటారు*
--(())--


i: పెద్దవయసు - గౌరవం పొందండి

"పెద్దల మాట, చద్ది మూట  అనే రోజులు పోయాయి.  మమ్మల్ని ఎవరూ పెద్ద పీట వేసి గౌరవించరు.  ఏ విషయం లోనూ మా  పెద్దరికానికి విలువ ఇవ్వరు.  ఏం చేస్తాం కాలం వచ్చి చిక్కాం కానీ కాళ్ళు లేక చిక్కామా!  పెద్దతనంలో ఇలా అగచాట్లు పడుతున్నాం" అని మీరు తరచుగా అంటున్నారా?

ఒక్క క్షణం.....

పెద్దతనం అంటే వరం అండీ!!! మీరు పెద్దలుగా గుర్తించ బడుతున్నారంటే అది మీకు లభిస్తున్న  సువర్ణావకాశం సుమండీ!!  ఏమిటీ! అలా చిరాకుగా నా వంక చూస్తున్నారు!!  

"పెద్దతనమా! నా పిండాకూడా!!"  అంటున్నారు కదా మనసులో ??
అప్పుడే నిరాశానిస్పృహలకు లోనయ్యారా? !!  అందుకే అంటారు "ఈ పెద్దవాళ్ళు తమ మాటే తప్ప ఎదుటివారి మాట వినిపించుకోరని !!"

సరే నండి  వింటారు కదా !  మరి నామాట ....

పెద్దతనం వచ్చింది అనగానే కొన్ని విషయాలు మనం వదిలి వేయాలి.
పట్టుకోవటం కష్టం కానీ వదిలివేయటంలో బాధ ఏమిటి చెప్పండి?
అలా అనుమానంగా చూడకండి... ఏమి వదిలివేయాలో చూద్దామా ..
"అమ్మాయి!! గ్యాసు కట్టేసావా!! గీజర్ ఆఫ్ చేసావా??  ఏ.సి. ఆన్ లో ఉన్నట్లుంది.. పాలు ఫ్రిజ్ లో పెట్టావా ?? కరెంట్ బిల్లు కట్టారా !!! లాంటి ఎంక్వయిరీలు వదిలి వేయండి !!!
"మా కొడుకు కోడలు పట్టించుకోరు"  అని హైరానా పడకండి.. 

ఇలా పట్టించుకుంటూ.. 60..70 ఏళ్ళు గడిపారు, ఇంకా ఎంతకాలం ??   ఇది వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం .. కష్టనష్టాలు కూడా వాళ్ళవే !!  చూడండి అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండగలరో..  "నా అభిప్రాయం ఏమిటంటే" అని అనటం తగ్గించి.. 
"నీ ఇష్టం, నువ్వు చెప్పు" అని వాళ్ళ ఇష్టాయిష్టాలతో వాళ్ళని బ్రతకనిద్దామా!! 

'నాకూ తెలుసు' తో పాటు 'నాకు మాత్రమే తెలుసు' అనే అహం తగ్గించుకుని, వాళ్ళకి చాలా విషయాలు, టెక్నాలజీ 'నాకంటే ఎక్కువ తెలుసు' కదా అనే నిజాన్ని ఠక్కున ఒప్పేసుకోండి..  మీ మంచికేనండీ చెబుతున్నాను ...

"మా కాలంలో", "మా చిన్నప్పుడు" అంటూ వీలు చిక్కినప్పుడల్లా వారిని ఊదరకొట్టకండి.  వారి ముఖాల్లో కనిపించే విసుగుని చూడనట్లు నటించకండి.  మన పిల్లలు కోసం వచ్చేవారితో మితంగా మాట్లాడండి.  వాళ్ళు మనకోసం రాలేదు అని గుర్తుంచుకోండి.  కాసేపు మాట్లాడాక లేచి గదిలోకి వెళ్ళిపోగలిగే మనోనిగ్రహం అలవరుచుకోండి ..

పెద్దవారిని పలకరించే మర్యాదతో ఒక ప్రశ్న ఎవరైనా సహజంగా అడుగుతారు... "ఆరోగ్యం బాగుంది కదా" అని.   దయచేసి వెంటనే  స్పందించకండి...
మన బి.పి..... షుగర్.. కీళ్ళనొప్పులు .. నిద్ర పట్టకపోవటం,.. నీరసం అంత రసవత్తరమైన విషయం కాదని సదా సర్వదా గుర్తుంచుకోవాలండీ బాబూ !!!  మనకి తోచక కాలక్షేపానికి ఎంత ఆలోచించినా ఎదుటివాళ్ళకి దాంట్లో అంతే ఇంట్రెస్ట్ ఏం ఉంటుంది చెప్పండి.. "బాబోయ్ !! ఎందుకు అడిగామా" అనే పశ్చాత్తాపం వారికి కలిగించకండి.. 

ఇంకొక విషయం...
ఎవరో పెద్దాయన అన్నాడు... 
"మన అనుభవం తో వారిని తీర్చి దిద్దాలి కదా!" అని. కాలం మారింది... మారుతున్నది.. 
"రోట్లో కందిపచ్చడి రుబ్బటం.. తిరగలితో విసరటం.. కట్టెల పొయ్యి మీద వంట చేయటం, కవ్వంతో మజ్జిగ చిలకటంలో గల నా అనుభవం నేటి తరానికి ఎలా ఉపయోగపడుతుంది ??"

ఉద్యోగాలైనా అంతే ! పద్దతులు మారుతున్నాయి.. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది.... విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సు లో సీటు ఎలా పట్టుకోవాలో చెప్పి ఏం ప్రయోజనం ??

చివరగా పెద్దతనంలో మన పరువు కాపాడుకోవటం పూర్తిగా ... పూర్తిగా మన చేతుల్లోనే ఉందండీ !!  అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా... మితభాషిగా వుంటూ... మన ఆర్థిక స్వాతంత్ర్యం  కోల్పోకుండా... ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ... జిహ్వ చాపల్యం తగ్గించుకుని... అన్నింటికంటే ముఖ్యమైన విషయం "నన్ను ఎవరూ గౌరవించటం లేదు" అనే ఆత్మన్యూనతా భావం దరి చేరకుండా జాగ్రత్తపడాలి...

భావం, బంధాలు, అంత తేలికగా తగ్గించుకోలేము.. కనీసం కొన్ని విషయాలను వదిలివేద్దాం.. పాజిటివ్ గా చూడండి...  ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు... మొత్తం సంసారాన్ని లాగే బాధ్యత లేదు... పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది.. 

హాయిగా పూజలు చేసుకోవచ్చు.. భగవద్గీత, భాగవతం చదువుకోచ్చు.. దైవదర్శనం చేసుకోవచ్చు.. చిన్న చిన్న హాబీలు మనసు కి ఆహ్లాదాన్నిస్తాయి.. వాటికి సమయం కేటాయించవచ్చు.. 

ఒక మాటని రోజూ అనుకుందాం.. "I love myself...  I respect my self " ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.. 

చివరగా............మనం దిగవలసిన స్టేషన్ దగ్గరలోనే వుంది ...  Platform అదిగో ..... సమయం దగ్గర పడింది.  

ఇక మనకి బోగీలో ఉన్నవారితో  తగువులు... మనస్పర్థలు  ఎత్తిపొడుపు మాటలు అవసరం అంటారా... 

మనం దిగుతుంటే వారి ముఖాల్లో 'హమ్మయ్య' అనే  భావం కనిపించాలో లేక 'అయ్యో అప్పుడే స్టేషన్ వచ్చేసిందా' అనే భావం క…
[12:50, 28/06/2020] Mallapragada Sridevi: #వేణిదానం-ప్రయాగ

      వేణీదానం ఇదేమిటీ అనుకుంటున్నారా! అవును ప్రపంచంలో,రెండేరెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారు. దానిలో మొదటిది "వేణిదానం" రెండవది మహిషిదానం.

     తీర్ధరాజ్ గా పిలువబడే అలహాబాద్ లోని ప్రయాగ త్రివేణీ సంగమం దీనికివేదికగా,గంగా యమున సరస్వతి నదులపవిత్రసంగమం లో ఈ వేణీదానాన్ని నిర్వహిస్తారు.

     జీవితకాలంలో మహిళలకు సంబధించిన రుతుదోషాలు,రుతుకాలంలో వంటచేయటం, అలాగే భర్త సముఖం లో లేనప్పుడు అలంకరించుకోవటం,ప్రసవ సమయలో గర్భదోషాలు,భర్తను దూషించినా,
తాడనం(దండించటం) స్త్రీలకు సంబంధించి ఏదోషనివృత్తికైనా ఈ వేణీదానపూజ చేస్తారు.

   భార్య భర్తలు నూతనవస్త్రాలు ధరించి,విఘ్నేశ్వర పూజ,వేణీదానపూజ నిర్వహించి,భార్యను భర్త ఒడిలో కూర్చుండపెట్టుకోని,జడవేసి కత్తెర తో జడలోని చివరికొసలను కత్తిరించి,ఆ కొసలను త్రివేణి సంగమంలో నదీదేవతలకు దానం చేయాలి. మామూలుగా కేశాలను నీటిలో వేస్తే మునగవు. కానీ ఈ క్షేత్రం లో కేశాలను మునగటం గమనించవచ్చు.

     జీవితం లో ఎన్నిసార్లు ప్రయాగ వెళ్ళినా,ఈ
 కార్యక్రమం ఒకసారే చేయాలి.

     మనపాపాలు మనకేశాలను అంటిపెట్టుకోని వుంటాయి. అందుకే తిరుపతి వెళ్ళినా,గయ,ప్రయాగ క్షేత్రాలకు వెళ్ళినా ముండనం చేయించమంటారు.తల్లిదండ్రులు గతించినా, ముండనం చేయించుకోవటం తప్పనిసరి.

   ముండనం ప్రయాగలో, దండనం కాశీక్షేత్రం లో, పిండనం గయాక్షేత్రం లో తప్పనిసరి.


 పాండవులనాటి అశ్వత్థవృక్షంఈ క్షేత్రం లో చూడవచ్చు. ఆ వృక్షం వేర్లు గయలో,కాండం కాశీలో, చెట్లకొమ్మలు ప్రయాగ లో చూడవచ్చు. ఇక్కడ పితృకార్యక్రమం తప్పనిసరి.

--(())--

🕉🌞🌎🌙🌟🚩


No comments:

Post a Comment