Thursday 27 April 2017

మల్లాప్రగడ రామకృష్ణ కధలు -23/8

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

అపరాధి ?

రోడ్డు మీద ట్రాఫిక్ ఎపుడు ఆగుతుందా అని కొందరు ఎదురు చూస్తున్నారు, అప్పుడే సర్కిల్ సెంటర్లో సిగ్నల్ పడింది , నడిచేవారు నడుస్తుండగా స్కూటర్ వాళ్ళు, ఆటోలు, లారీలు బస్సులు   కారులు ఒక్కసారి వరుసగా ఆగాయి. ఒక కారు డోరును చేతి  ఉంగరాల వేళ్ళతో  టకటక కొట్టినాడు ఒక మధ్య వయస్సుగల గడ్డం ఉన్న మనిషి,. తలుపు తీయగా లోపల కూర్చొని వ్యక్తి బయటకు తోయబోయి కుదరక  రెండవ తలుపు తీసి వేగంగా కారు దిగాడు, అప్పుడే సిగ్నల్ పడింది సైకిల్లో వచ్చేవ్యక్తి కారు డోరుతగిలి ప్రక్కకు పడ్డాడు, కారునుండి దిగిన వ్యక్తి పరుగెత్తు తుంటే వెనుక నుంచి గడ్డపు మనిషి కత్తి విసరగా అక్కడి కక్కడే చనిపోయాడు, అక్కడ ఉన్న జనం తిరగబడి చంపిన వాణ్ణి గట్టిగా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు.

చనిపోయినవాడు రాజేంద్ర అని, చంపినవాడు మాధవ్ అని గుర్తించి అన్నీ  వివరాలు తెలుసుకొని చంపిన వాణ్ణి కోర్టులో హాజరు పరిచారు.ఎన్ని ప్రశ్నలు వేసినా  చంపాను, ఎందుకు చంపానో మీరే కనుక్కోండి, నేను ధర్మం తప్పులేదు, మీరు ఏశిక్ష విధించిన న్యాయబద్దగా అనుభవిస్తా, ఉరిశిక్ష వేసిన అనుభవిస్తా అని ధైర్యముగా చెప్పాడు మాధవ్ .

పోలీసులు ప్రవేశ పెట్టిన సాక్షాలు సరిగా లేక పోవటం వల్ల, పట్టిచ్చినవారు ఎవ్వరూ సాక్షం చెప్పక పోవుటవల్ల 
జడ్జిగారు ఈ కేసును వచ్చేనెలకు వాయిదా వేస్తున్నాను అని తెలిపి, పోలీస్ వారు, పూర్తివివరాలు సేకరించి, ఇతనే చంపినట్లుగా సాక్షులను ప్రవేశ పెట్టండి, అని తెలుపుతూ నేరస్తుణ్ణి పోలీస్ కష్టడీలో ఉంచండి అని చెప్పి లేచారు జడ్జిగారు అందరూ  లేచారు, అప్పుడే గడియారం గంట కొట్టింది.
కోర్టు గోడలు దద్దరిల్లి పోతున్నాయి ఎందుకంటే ఇసుకవేస్తే రాలనంత జనం కోర్టుకు వచ్చారు, మాధవ్ నిరపరాధి అతనికి శిక్ష పడకూడదు అని అరుస్తున్నారు.

కోర్టు ప్రారంభమైనది లాయర్ కొందరి అభిప్రాయాలు ఈ కేసుకు ముఖ్య ఆధారాలు వారు స్వయముగా మీకే విన్న వించు కుంటామన్నారు మీరు అనుమతిస్తే , తెలియపరుస్తారు.  అనుమతి ఇస్తున్నాను.
రాజేంద్రగారి భార్య రజనీని పిలవటం జరిగింది.

నేను భగవద్ గీత సాక్షిగా అంతా నిజమే చెపుతాను, అబద్ధము చెప్పను అని ప్రమాణము చేసి ఈవిధముగా తెలియపరిచింది. నాభర్త వ్యసనపరుడు, ఆశపరుడు, ఇంకా కావాలి అనుకొనే దురాశపరుడు, భారతనారీమణిగా ఎంతో ఓర్పుతో ఇప్పటిదాకా నన్ను పెట్టిన కష్టాలు భరించాను, అతను చనిపోవుటకు సహకరించిన వానికి నేను నమస్కరిస్తున్నాను, నాభర్త చనిపోయినందుకు నాకు భాధ లేదు, అతను నాకు చేసిన మంచిని తలచుకొని జీవిస్తాను, స్వేశ్చయా వాయువుని పీల్చగలిగాను నాకు  న్యాయం చేయగలరని ఆసిస్తూ ఇంతకన్నా నేను చెప్పేది ఏమీ లేదు అని రజని అందరికి నమస్కరించి బోను నుండి బయటకు వచ్చింది.

తరువాత మాధవ్ భార్య రాధను పిలిచారు.,  నేను భగవద్ గీత సాక్షిగా అంతా నిజమే చెపుతాను, అబద్ధము చెప్పను అని ప్రమాణము చేసి తన అభిప్రాయాన్ని తెలియ పరిచింది. నాభర్త అతనిని చంపుటకు కారణము నేనే చంపేసిన వానికన్నా ప్రోత్సహించిన వానికి శిక్ష పడాలి అని గట్టిగా తెలియ పరిచింది.

జడ్జిగారు అసలు ఏమి జరిగిందో పూర్తి వివరాలు తెలియపరచండి అన్నప్పుడు ప్రజల నుండి పెద్ద స్పందన వచ్చింది

మాపెళ్లి తర్వాత జరిగిన విషయం చెప్పాలి మీకు ఏమిటంటే
పార్కులో మాధవ్ ను ఒక అమ్మాయి ప్రేమించింది, నేను నిన్నేతప్ప వేరొకరిని ప్రేమించెను అని ఎంబడి పడిందట, ఆమ్మాయి పేరు " నళిని " కానీ నాభర్త మాధవ్ కు ఆమె అంటే ఇష్టం లేదు, ఎన్నో మంచి మాటలు చెప్పినా వినిపించు కోలేదు, నీవు వప్పుకోక పోతే నీముందే చచ్చిపోతా అని బెదిరించింది. అందరి ముందు ప్రతిజ్ఞలు చేసింది. ఆరోజు రాత్రే ఆమె చనిపోయినది. అని వివరించింది
లాయర్ లేచి కోర్టుకు సంభందం లేని విషయాలు తెలుపుతున్నారు అన్నాడు
జడ్జిగారు తెలియపరచండి తరువాత ఏమి జరిగింది
5 సంవత్సరాలు క్రితం ఇదే కోర్టులో నాభర్త అపరాధి అని తీర్పు ఇచ్చి జరిమానాతో పాటు 2సంవత్సరములు శిక్ష కూడావిధించారు. కేవలము ప్రేమించనందుకు, చంపారని సాక్షాలు పుట్టించారు.నాభర్త శిక్ష అనుభవించారు 
తప్పు చేసినవారికి శిక్ష పడుట తప్పు కాదు అన్నారు జడ్జిగారు.
అవునండి అవును మీరు చెప్పినది అక్షరాలా నిజం, మీకు కావలసినది సాక్షం మాత్రమే
అదే సాక్షం గా నాభర్త అప్పుడూ నిరపరాధి ఇప్పుడూ నిరపరాధి అని అరిచింది.                                 
లాయర్ లేచి ఆకేసుకు ఈకేసుకు సంబంధము ఏమిటి అని అడిగారు.
ఆ నళిని ఎవరో కాదు రాజేంద్రగారి చెల్లెలు ఆమె చని పోయిందని నన్ను మావారు లేని సమయాన నన్ను తీసుకొనివెళ్ళి  ఒక భూతల గృహములో బంధించాడు. సరిఅయిన ఆహారము ఇవ్వక తన కోరికను తీర్చమని రోజూ వేధించే వాడు, అప్పుడే రాజేంద్ర గారి భార్య అగు రజనికి చేతులెత్తి దండాలు పెట్టాలి నన్ను తన భర్తకు చిక్క నీయ కుండా నన్ను తప్పించింది.

నన్నుబందించాడని కోపంతో నాభర్త కత్తి తీసుకోని వెళ్ళటం నిజం తరువాత ఏమి జరిగిందో మీకు అందరికీతెలుసు అదే కీచకుడ్ని ఆడవాళ్లు చంపితే శిక్ష ఉండదు, మొగవాళ్ళు చంపితే శిక్ష, ఎంతవరకు నిజమో మేరె తెలపాలి, నాభార్త చెప్పినదే నేను చెపుతున్నా , సత్యం ఎదో న్యాయం ఎదో ధర్మం ఎదో తెలుసుకొని శిక్ష వేయండి. వందమంది అపరాదులను శిక్షించ వచ్చు కానీ ఒక్క నిరపరాధిని శిక్షించితే లోకం ఒప్పుకోదు అని తెలియపరిచినది రాధ.

జడ్జిగారు పోలీసులను పిలిచి మీరు చెప్పుకోవలసినది ఎమన్నా ఉన్నదా అని అడిగారు. మాకు దొరికిన సమాచారం మీకు ఉదహరించాం అని తెలియపరిచారు.

అప్పడే శిక్ష వివరించాలని జడ్జీ గారు ముందు కొచ్చారు, ఒక వ్యక్తిని నడిబజారులో సంహరించటానికి పూనుకోవటం తప్పే కారణాలు ఏమైనా మాధవ్ చేసినది తప్పే, అన్నారు.

అపుడే మాధవ్ గట్టిగా నవ్వటం మొదలు పెట్టాడు.

నీవు ఎమన్నా చెప్పాలనుకొంటే బోనులోకి వచ్చి చెప్పు అన్నారు.ధర్మాసనం కూడా తప్పుదోవ పడుతూ ఉంటే నవ్వకుండా ఉండలేక పోయాను అన్నాడు.

నేను కత్తి విసరగా చంపబడ్డాడు అని నన్ను బంధించారు. అసలు ఏమి జరిగిందో మరొక్కసారి గమనించి నాకు శిక్ష వేయండి అన్నాడు కోర్టు హాలు అంతా ఒక్కసారి నిశ్శబ్దంగా మారింది ఆమాటలకు.

అప్పుడే లాయర్ కోర్టును ఆపారాధి తప్పు దోవ పట్టిస్తున్నాడు, శిక్ష తప్పించుకోవటానికి ప్రాయత్నిస్తున్నాడు ఏవో కట్టు మాటలు చెపుతున్నాడు, మీరు గమనించి శిక్ష వేయండి అన్నాడు.

అప్పుడే జడ్జిగారు తెలియ పరిచాడు సాక్షాధారాలు బట్టి ఇతనికి శిక్ష పడాలి కానీ నామనసు అంగీకరించుట లేదు, ఈ కేసుకు సంభందించిన విషయాలన్నీ సేకరించమని ఆదేశిస్తున్నాను వెచ్చే నెలకు వాయదా వేస్తున్నాను. అని తెలియపరిచారు. 
మరొక్క విషయం తెలుపుతున్నాను,  నేను జడ్జీ పదవి ఈ రోజే రాజీనామా చేస్తున్నాను.  ఈ కేసును స్వయముగా వాదించాలను కుంటున్నాను.  నాకు అనుమతి మంజూరు చేయగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని తెలిపి లేచారు. అప్పడే గంట మ్రోగింది.

కోర్టు ప్రారంభమైనది లాయర్ విశ్వనాధం గారు మాధవ్ నిరాపరాధిగా వాదించారు.
క్రొత్తగా వచ్చిన జడ్జి గారు వాద ప్రతివాదనలు బట్టి మాధవ్ నిరపరాధి అని న్యాయస్థానం నమ్మి జరిమానా విధించి  విడుదల చేయటమైనది. రాజేంద్ర చనిపోవుటం కత్తి విసరటం వల్ల చేతికి గాయం జరిగి క్రింద పడ్డాడు, అందరూ చని పోయాడని తలంచి  మాధవ్ ను పట్టుకున్నారు, అక్కడ ఉన్నవారెవరో ఒకరు రాజేంద్రకు విషం ఇంజక్షన్ చేసినట్లు తెలిసింది దానివల్ల చని పోయినట్లుగా భావించటం జరిగింది.
కాబట్టి రాజేంద్ర చావుకు కారణమైనవారిని పట్టుకోవాలని పోలీసువారిని కోరటమైనది. ఈకేసును వెచ్చేనెలకు వాయిదావేస్తున్నాను అన్నారు జడ్జిగారు.
అందరూ ఒక్కసారి చప్పట్లు కొడుతూ జడ్జీ విశ్వనాధం గారు జిందాబాద్, మాధవ్ జిందాబాద్ అనేఅరుపులు వినబడుతున్నాయి.
అప్పుడే మాధవ్ దగ్గరకు ఒక విలేఖరు వచ్చి  ఇంజక్షన్ చేసిన వారెవరో తెలపండి అన్నప్పడు, ఎవరికివారు న్యాయంగా నిలబడితే ఈ కోర్టులతో పనియేమి అంటూ నవ్వాడు ......

            

No comments:

Post a Comment