https://vocaroo.com/i/s0eKabjuG2Kl
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
శ్రీ విష్ణు సహస్త్ర నామస్తోత్రము
.
పూర్వ భాగము
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే --1
వ్యాసం వసిష్ఠ నప్తారం, శక్తే: పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ --2
వ్యాసాయ విష్ణురూపాయ, వ్యాస రూపాయ విష్ణవే
నమో వైబ్రహ్మనిధయే, వాసిష్టాయ నమోనమ: --3
అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే
సదైక రూప రూపాయ విష్ణవే సర్వ జిష్ణవే --4
యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్
విముచ్యతే నమస్త స్మై ప్రభవిష్ణవే . --5
ఓం నమో విష్ణవే ప్రభావిష్ణవే
శ్రీ వై సంపాయన ఉవాచ:-
శృత్వాధర్మ మశేషేణ పావనాని చ సర్వశ:
యుధిష్టర శాంతనవం పునరేవాభ్యభాషత. ------ 6
వికార హితుడును , పరిశుద్ధుడును, శాశ్వతుడును, ఆత్మ స్వరూపుడును, అన్నీ రూపములు తానే అయి ప్రకాశించు విష్ణువు కొరకు నమస్కారము --4
ఎవనిని తలంచినంత మాత్రమున సంసార బంధములు జన్మ పరంపరలు వదలి పోవుచున్నవో అట్టి ప్రతిభా వంతుడైన విష్ణుదేవునికి నమస్కారము. --- 5
ఓం సర్వ వ్యాపి అయి ప్రకాశించు విష్ణువునకు నమస్కారము
సకల ధర్మములను, పాపములను పోగొట్టు విధములను విని ధర్మరాజు భీష్మునితో మరల ఇట్లు పలికెను -- 6
యుధిష్టర ఉవాచ :-
కిమేకం దైవతంలోకే కింవాప్యేకం పారాయణం
స్తువంత: కం కమర్చంత: ప్రాప్ను యు ర్మానవా: శుభం -7
కోధర్మ: సర్వ ధర్మాణాం భవత: పరమో మత:
కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార భందనాత్ . --8
శ్రీ భీష్మ ఉవాచ"-
జగత్ ప్రభుమ్ దేవదేవం అనంతం పురుషోత్తమమ్
స్తువన్నా మసహస్రేణ పురుషః: సతతోత్తిత: ---9
తమేవ చార్చ యన్నిత్యం భక్త్వా పురుషమవ్యయం
ధ్యాయం స్టువన మశ్యంశ్చ యజమానస్త మేవచ. --10
ధర్మరాజు పలికెను
ఈ లోకము నందు ప్రధానమైన ఒకే దైవ మేది? ముఖ్యమైన శుభ స్దాన మేది? ఎవనిని పూజించి నుతించి మానవులు శుభములు పాడయుదురు? --7
సర్వధర్మములలో నే ధర్మమును గొప్పదిగా మీరు తలచు చున్నారు? దేనిని జపించిన జీవులు జన్మ పరంపరలతో కూడిన సంసార భందం నుండి తప్పించు కో గలరు ? -- 8
భీష్ముడు ఉవాచ :-
లోకేశ్వరుడును, దేవదేవుడును, అనంతుడును, పురుషోత్తముడగు విష్ణుదేవుని సదా శ్రద్ధతో వేయి
నామములతో స్తుతించిన పురుషుడు రక్షణము కలవాడగును --- 9
నాశనరహితు డై నటువంటియు, పురుషు డై నటువంటియు, విష్ణుదేవుని నిత్యము భక్తితో పూజించి ధ్యానించి కీర్తించి నమస్కరించిన పురుషుడు తరింపగలడు -- 10
అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదు:ఖాతిగో భవేత్. --11
బహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం
లోకనాధం మహాద్భుభూతం సర్వభూత భావోద్బవం --12
ఏషమే సర్వధర్మాణాం ధర్మోధిక తమోమత:
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవై రర్చేన్నర : సదా. --13
పరమం యో మహాతేజ: పరమం యో మహత్తపః:
పరమం యో మహాద్బ్రహ్మ పరమంయ: పరాయణం --14 .
ఆది అంతములు లేనట్టియు,సకల లోకములకు నాయకుడై నట్టియు, లోకములను శాసించు నట్టియు, విష్ణుమూర్తిని ప్రతిరోజూ స్తోత్రము చేసిన సర్వ దు:ఖములు నశించును. --11
వేదమయుడై నట్టియు సకల ధర్మముల నెరిగినట్టియు లోకములకు కీర్తిని పెంచునట్టియు, జగన్నాధుడై నట్టియు, అన్నిటికంటే గొప్పవాడై నట్టియు సర్వజీవుల పుట్టుటకు కారణ భూతుడై నట్టియు, విష్ణుదేవుని స్తుతించిన సకల కష్టములు తొలగును. --12
ఎవరైనను కమలముల వంటి కన్నులుగల విష్ణుదేవుని సదా భక్తితో స్త్రోత్రము చేసి పూజించుట చేతనే సకల ధర్మములకు మేలైన ధర్మమని నా అభిప్రాయము. --13 .
సమస్త తేజములకు తేజస్సుగాను, సకల తపస్సులకు తపస్సుగాను, పర బ్రహ్మముగాను, పునర్జన్మలవలన భయము లేని స్థానముగా నున్న విష్ణువే పరమ గతి యని నా యభిప్రాయము.--14 .
పవిత్రాణాం పవిత్రంయో మంగళానాంచ మంగళం
దైవతం దేవతానాంచ భూతానాంయో వ్యయ: పితా. -- 15
యత: సర్వాణి భూతాని భావన్త్యాది యుగాగమే
యస్మిం చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. -- 16
తస్య లోక ప్రధానస్య జగనాథస్య ధూపతే
విష్ణో నామ సహస్రం మే శృణు పాప భయావహం ---17
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన:
ఋషిభి:పెరిగితాని తాని వ క్ష్యామి భూతయే. ---18
పవిత్రమైన వారికి పవిత్రుడై, సకల శుభములకు శుభుడై, దేవతలకు దేవుడై, శాశ్వతుడై నట్టి విష్ణువే దేవుడు. --- 15
కల్పాది కృతయుగము యొక్క ప్రారంభమందు సకల భూతములు దేవుని నుండి పుట్టుచున్నవో? ప్రళయము రాగా యుగములు నశించి నప్పుడు మరల నే దేవునియందు చేరు చున్నవో? అట్టి విష్ణువే దైవము. ---16
ఓ ధర్మ రాజా లోకములకు మూలకారణుడై, జగములకు నాధుడైన విష్ణు దేవునియొక్క సహస్ర నామములు పాపమును భయమును పోగొట్టును, ఆ నామములన్లు నా ద్వారా వినుము. ---17
ఏ నామములు మహాత్ముడైన విష్ణువునకు గుణములై ప్రసిద్ధి గాంచినవో? ఏ నామములు మునులు చేత గానము చేయ బడినవో? ఆ శ్రీ విష్ణు సహస్రనామములు పురుషార్ధములు సిద్ధించుటకై నీకు చెప్పెదను. ---18
.
ఋషి నామ్నామ్ సహస్రస్య వేదవ్యాసో మహాముని:
ఛందోనుష్టుప్ తథాదేవో భగవాన్ దేవకీ సుత: --19
అమృతాం సూద్భవో బీజం శక్తి ర్దేవకి నందన:
త్రిసామా హృదయం తస్య శాంత్యర్దే వినియుజ్యతే. --20
విష్ణుం జిష్ణుమ్ మహావిష్ణుం ప్రభవిష్ణుమ్ మహేశ్వరం
అనేక రూపదైత్యాంతమ్ నమామి పురుషోత్తమమ్ --21 .
సహస్ర నామ మంత్రమునకు వేదవ్యాసుడు ఋషి, అనుష్టుప్, ఛందస్సు, దేవకీసుతుడైన భగంతుడు దేవత. --- 19
అమృతాం సూద్భవ బీజము దేవకీ నందనుడు శక్తి త్రిసామాహృదయము, శాంతికొరకు సహస్రనామ మంత్రము జపించ బడుతుంది. --20
జయశీలుడును విశ్వవ్యాపకుడును, మహేశ్వరుడును అనేక రూపములు గల దానవులను సంహరించిన వాడును పురుషోత్తముడగు ఇష్ణుదేవునకు నమస్కారము చేయు చున్నాను --21
--((*))--

తెల్లని వస్త్రములను ధరించినట్టియు విష్ణువువలె జగమెల్లను వ్యాపించినట్టియు, చంద్రునివలె స్వచ్ఛమైన కాంతిని గలిగినట్టియు, నాలుగు చేతులు గలట్టియు, శాంతిగల ముఖమును గలిగి నట్టియు, గణపతిని సకల విఘ్నములను నివారించుట కొరకు ధ్యానించవలయును.--1
వసిష్ఠ మహామునికి ముని మనుముడై నట్టియు, శక్తి మహామునికి మనుముడై నట్టియు, పరాశరమునికి పుత్రుడైనట్టియు, శుఖమహార్షికి జనకుడైనట్టియు, నిర్మలుఁడైనట్టియు, తపమును ధనరాశి గలిగిన వ్యాసుల వారిని గూర్చి నమస్కాము చేయుచున్నాను.--2
విష్ణురూపుడైన వ్యాసులవారి కొరకును, వ్యాసరూపముతో నున్న విష్ణువు కొరకును, వేదములకు గని ఐన వాని కొరకు నమస్కారము. వశిష్టుని వంశమందు జన్మించిన వ్యాసునికి నమస్కారము. --3
అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే
సదైక రూప రూపాయ విష్ణవే సర్వ జిష్ణవే --4
యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్
విముచ్యతే నమస్త స్మై ప్రభవిష్ణవే . --5
ఓం నమో విష్ణవే ప్రభావిష్ణవే
శ్రీ వై సంపాయన ఉవాచ:-
శృత్వాధర్మ మశేషేణ పావనాని చ సర్వశ:
యుధిష్టర శాంతనవం పునరేవాభ్యభాషత. ------ 6
వికార హితుడును , పరిశుద్ధుడును, శాశ్వతుడును, ఆత్మ స్వరూపుడును, అన్నీ రూపములు తానే అయి ప్రకాశించు విష్ణువు కొరకు నమస్కారము --4
ఎవనిని తలంచినంత మాత్రమున సంసార బంధములు జన్మ పరంపరలు వదలి పోవుచున్నవో అట్టి ప్రతిభా వంతుడైన విష్ణుదేవునికి నమస్కారము. --- 5
ఓం సర్వ వ్యాపి అయి ప్రకాశించు విష్ణువునకు నమస్కారము
సకల ధర్మములను, పాపములను పోగొట్టు విధములను విని ధర్మరాజు భీష్మునితో మరల ఇట్లు పలికెను -- 6
యుధిష్టర ఉవాచ :-
కిమేకం దైవతంలోకే కింవాప్యేకం పారాయణం
స్తువంత: కం కమర్చంత: ప్రాప్ను యు ర్మానవా: శుభం -7
కోధర్మ: సర్వ ధర్మాణాం భవత: పరమో మత:
కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార భందనాత్ . --8
శ్రీ భీష్మ ఉవాచ"-
జగత్ ప్రభుమ్ దేవదేవం అనంతం పురుషోత్తమమ్
స్తువన్నా మసహస్రేణ పురుషః: సతతోత్తిత: ---9
తమేవ చార్చ యన్నిత్యం భక్త్వా పురుషమవ్యయం
ధ్యాయం స్టువన మశ్యంశ్చ యజమానస్త మేవచ. --10
ధర్మరాజు పలికెను
ఈ లోకము నందు ప్రధానమైన ఒకే దైవ మేది? ముఖ్యమైన శుభ స్దాన మేది? ఎవనిని పూజించి నుతించి మానవులు శుభములు పాడయుదురు? --7
సర్వధర్మములలో నే ధర్మమును గొప్పదిగా మీరు తలచు చున్నారు? దేనిని జపించిన జీవులు జన్మ పరంపరలతో కూడిన సంసార భందం నుండి తప్పించు కో గలరు ? -- 8
భీష్ముడు ఉవాచ :-
లోకేశ్వరుడును, దేవదేవుడును, అనంతుడును, పురుషోత్తముడగు విష్ణుదేవుని సదా శ్రద్ధతో వేయి
నామములతో స్తుతించిన పురుషుడు రక్షణము కలవాడగును --- 9
నాశనరహితు డై నటువంటియు, పురుషు డై నటువంటియు, విష్ణుదేవుని నిత్యము భక్తితో పూజించి ధ్యానించి కీర్తించి నమస్కరించిన పురుషుడు తరింపగలడు -- 10
అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదు:ఖాతిగో భవేత్. --11
బహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం
లోకనాధం మహాద్భుభూతం సర్వభూత భావోద్బవం --12
ఏషమే సర్వధర్మాణాం ధర్మోధిక తమోమత:
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవై రర్చేన్నర : సదా. --13
పరమం యో మహాతేజ: పరమం యో మహత్తపః:
పరమం యో మహాద్బ్రహ్మ పరమంయ: పరాయణం --14 .
ఆది అంతములు లేనట్టియు,సకల లోకములకు నాయకుడై నట్టియు, లోకములను శాసించు నట్టియు, విష్ణుమూర్తిని ప్రతిరోజూ స్తోత్రము చేసిన సర్వ దు:ఖములు నశించును. --11
వేదమయుడై నట్టియు సకల ధర్మముల నెరిగినట్టియు లోకములకు కీర్తిని పెంచునట్టియు, జగన్నాధుడై నట్టియు, అన్నిటికంటే గొప్పవాడై నట్టియు సర్వజీవుల పుట్టుటకు కారణ భూతుడై నట్టియు, విష్ణుదేవుని స్తుతించిన సకల కష్టములు తొలగును. --12
ఎవరైనను కమలముల వంటి కన్నులుగల విష్ణుదేవుని సదా భక్తితో స్త్రోత్రము చేసి పూజించుట చేతనే సకల ధర్మములకు మేలైన ధర్మమని నా అభిప్రాయము. --13 .
సమస్త తేజములకు తేజస్సుగాను, సకల తపస్సులకు తపస్సుగాను, పర బ్రహ్మముగాను, పునర్జన్మలవలన భయము లేని స్థానముగా నున్న విష్ణువే పరమ గతి యని నా యభిప్రాయము.--14 .
పవిత్రాణాం పవిత్రంయో మంగళానాంచ మంగళం
దైవతం దేవతానాంచ భూతానాంయో వ్యయ: పితా. -- 15
యత: సర్వాణి భూతాని భావన్త్యాది యుగాగమే
యస్మిం చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. -- 16
తస్య లోక ప్రధానస్య జగనాథస్య ధూపతే
విష్ణో నామ సహస్రం మే శృణు పాప భయావహం ---17
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన:
ఋషిభి:పెరిగితాని తాని వ క్ష్యామి భూతయే. ---18
పవిత్రమైన వారికి పవిత్రుడై, సకల శుభములకు శుభుడై, దేవతలకు దేవుడై, శాశ్వతుడై నట్టి విష్ణువే దేవుడు. --- 15
కల్పాది కృతయుగము యొక్క ప్రారంభమందు సకల భూతములు దేవుని నుండి పుట్టుచున్నవో? ప్రళయము రాగా యుగములు నశించి నప్పుడు మరల నే దేవునియందు చేరు చున్నవో? అట్టి విష్ణువే దైవము. ---16
ఓ ధర్మ రాజా లోకములకు మూలకారణుడై, జగములకు నాధుడైన విష్ణు దేవునియొక్క సహస్ర నామములు పాపమును భయమును పోగొట్టును, ఆ నామములన్లు నా ద్వారా వినుము. ---17
ఏ నామములు మహాత్ముడైన విష్ణువునకు గుణములై ప్రసిద్ధి గాంచినవో? ఏ నామములు మునులు చేత గానము చేయ బడినవో? ఆ శ్రీ విష్ణు సహస్రనామములు పురుషార్ధములు సిద్ధించుటకై నీకు చెప్పెదను. ---18
.
ఋషి నామ్నామ్ సహస్రస్య వేదవ్యాసో మహాముని:
ఛందోనుష్టుప్ తథాదేవో భగవాన్ దేవకీ సుత: --19
అమృతాం సూద్భవో బీజం శక్తి ర్దేవకి నందన:
త్రిసామా హృదయం తస్య శాంత్యర్దే వినియుజ్యతే. --20
విష్ణుం జిష్ణుమ్ మహావిష్ణుం ప్రభవిష్ణుమ్ మహేశ్వరం
అనేక రూపదైత్యాంతమ్ నమామి పురుషోత్తమమ్ --21 .
సహస్ర నామ మంత్రమునకు వేదవ్యాసుడు ఋషి, అనుష్టుప్, ఛందస్సు, దేవకీసుతుడైన భగంతుడు దేవత. --- 19
అమృతాం సూద్భవ బీజము దేవకీ నందనుడు శక్తి త్రిసామాహృదయము, శాంతికొరకు సహస్రనామ మంత్రము జపించ బడుతుంది. --20
జయశీలుడును విశ్వవ్యాపకుడును, మహేశ్వరుడును అనేక రూపములు గల దానవులను సంహరించిన వాడును పురుషోత్తముడగు ఇష్ణుదేవునకు నమస్కారము చేయు చున్నాను --21
--((*))--
.
om
ReplyDeleteom
ReplyDelete