Friday 26 August 2016

* తెలుగు ఛందస్సు ప్రభ

ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ - తెలుగు ఛందస్సు ప్రభ 

సర్వ్ జానా సుఖినోభవంతు 



మృదువాణి - 



చివర రెండు గురువులు, ముందు పంచమాత్రలైన భ-లములను (UIII) ఉంచి వ్రాసిన కొన్ని వృత్తములను మీకు తెలిపాను. అవి - 




2 - కామలతికా UIII UU 

4 - వనమయూరము UIII UIII - UIII UU 

6 - సుగంధి UIII UIII - UIII UIII - UIII UU 

8 - లయగ్రాహి UIII UIII - UIII UIII - UIII UIII - UIII UU 

బేసి సంఖ్యల మాత్రాగణములతో వ్రాస్తే ఇట్టి వృత్తములు ఏ విధముగా నుంటుందో అనే ఆలోచన కలిగినది. దాని ఫలితమే మూడు మాత్రగణములతో నిర్మించబడిన "మృదువేణి" వృత్తము. నా వృత్తముల కల్పనలో ఒక కారణము ఉంటుంది. ఏదో వెఱ్ఱిగా వీటిని నేను కల్పించను. 

మఱొక చిత్రము ఏమంటే ఈ మృదువేణి వృత్తమును మిశ్రగతిలో కూడ వ్రాయ వీలగును. ఒకే అమరికలో రెండు గతులున్నాయి ఈ వృత్తమునకు. అనగా తాళములు వేఱు. అందుకే వీటిని నేను గతి గర్భ కవిత్వము అంటాను. 



సుశీలా -

కాకవిన్ కవులు వ్రాసిన వృత్తములలో పేరులేని ధృతి ఛందములోని జ/స/జ/స/జ/స గణములతో ఉండే వృత్తము ఒకటి. దీనికి నేను సుశీలా అని పేరునుంచినాను. అక్షరసామ్య యతితో, ప్రాసయతితో క్రింద నా ఉదాహరణములు -

సుశీలా - జ/స/జ/స/జ/స 

IUI IIU - IUI IIU - IUI IIU

18 ధృతి 120670

వసంత వనిలోఁ - బ్రసూన తతులే - దెసల్ సొబగులే 

అసీమ కరుణా - రసార్ద్రహృదయా - కసాయి యవకోయ్ 

అసాధ్య మయెఁగా - వసించ నిటులన్ - కృశించితినిరా 

రసించు తఱిరా - సుశీల త్వర రా - హసించ దరి రా

సదా తలఁతు నిన్ - మదిన్ బదిలమై - ముద మ్మదియెగా 

వ్యధల్ దొలఁగు నీ - హృదిన్ నదులుగా - సుధల్ గురియుఁగా 

నిదానముగ నే - పదమ్ములను బా-డెదన్ లలితమై 

అదే నవము నా - కదే భవము నా - కదే ధ్రువముగా

అక్షరసామ్య యతితో -

మరాళములతో - మయూరములతో - మలంగు సతి యా 

సరస్వతిని నా - సరోజముఖి నే - సదా తలఁతుఁగా 

వరాల నొసఁగన్ - స్వరాల నొసఁగన్ - పదమ్ము లొసఁగన్ 

విరాజితములై - ప్రియమ్ముగ మదిన్ - వెలుంగు నవియున్

సురాసురులు నిన్ - శుభమ్ము గలుఁగన్ - సుధీంద్రు

లవఁగన్ 

వరమ్ము లడుగన్ - స్వరమ్ము లడుగన్ - పదమ్ము లడుగన్ 

బిరాన నగుచున్ - వెలుం గిడెద వో - విరించి సుదతీ 

హరించు తిమిర - మ్మమోఘముగ నీ - యనంత రుచులన్

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


వెణ్బా - 18 - ఆటవెలఁది 

సుప్రభ పావులూరి గారికి కృతజ్ఞతా పూర్వక వందనాలతో , నా తొలి యత్నము .
.............................. డా . కృష్ణ సుబ్బారావు పొన్నాడ. 05 / 10 / 2016 .
--((*))--

బుధగురు షట్పది - 



బుధ, గురు గణములతో ఒక షట్పదిని నేను పరిచయము చేస్తున్నాను. ఇందులో 1,2,4,5 పాదాలలో ఒక బుధ, ఒక గురు గణములు ఉంటాయి. మూడవ, ఆఱవ పాదములలో ఒక బుధ, రెండు గురు గణములు ఉంటాయి. మూడవ, ఆఱవ పాదములలో మూడవ గణముతో అక్షరసామ్య యతి, అన్ని పాదములకు ప్రాస అవసరము. క్రింద నా ఉదాహరణములు - 



బుధగురు షట్పది - బు-గు // బు-గు // బు-గు - గు 

తల్లియు తండ్రియు
బిడ్డలక్షేమమ్ము


చందనచర్చితము 

సుందరదేహమ్ము 

మందము పవనమ్ము - మధువనిలో 
వందల పుష్పములు 
విందుగ నాట్యములఁ 
జిందుచుఁ జేసినవి - చిత్రముగా 

ఇంద్రుని కూఁతురివో 
చంద్రుని చెల్లెలివో 
సంద్రపు లోతులలో - జలజమ్మో 
మంద్రస్వరములతో 
ఆంధ్రపు పదములతో 
తంద్రకు గీతికవో - తారకవో 

ఇమ్ము నీవె నా 
సొమ్ము నీవె నా- 
కమ్ము నీవె నా - కామినీ 
రమ్ము నీవె లో- 
కమ్మ టంచు నే 
నమ్మి యుంటిఁగా - నాగినీ 

శారద రాత్రిలో 
తారల కాంతిలో 
హారము వేతు రా - హరిణాక్షీ 
కోరిక లెన్నియో 
కోరని వెన్నియో 
మారుని తూపులే - మదిరాక్షీ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు 

హిమమణి - 



మంగళమహాశ్రీ లయతో హిమమణి అనబడే ఒక కొత్త తాళవృత్తమును మీకు పరిచయము చేస్తున్నాను. మహచ్ఛ్రీలోని మొదటి భలము ఇందులో నలల అవుతుంది, రెండవ భలము త-గణమవుతుంది, అలాగే మిగిలిన గణములు కూడ. రెండేసి గణములకు ప్రాసయతి. క్రింద నా ఉదాహరణములు - 



న/స/భ/న/య/న/న/త/గగ 

IIIII UUI - IIIII UUI - IIIII UUI UU 

26 ఉత్కృతి 10461088 



విమలమగు నీ రోజు ద్యుమణి కడు శోభించెఁ గమలముల యందమ్ము పూచెన్ 
సుమతతులు నవ్వంగ భ్రమరములు పాడంగ రమణముగ నా గాలి వీచెన్ 
ద్రుమదళము లూఁగంగ హిమమణులు వెల్గంగ హిమయవని సించుచుండెన్ 
నమనముల నేనిత్తు సుముఖునికి నీవేళ నమలమతి హాసించుచుండన్ 
(హిమయవని=మంచుతెర) 

లలితముర నీ పల్కు లలితముర నీ కుల్కు లలితముర నీ తళ్కు లెప్డున్ 
లలితముర నీ యాట లలితముర నీ పాట లలితముర నీ బాట యెప్డున్ 
లలితముర నీ రూపు లలితముర నీ చూపు లలితముర నీ యూపు యెప్డున్ 
లలితముర నీ వీడు లలితముర నీ తోడు లలితుఁడవు నావాఁడు నీవే 

మన మొసఁగ వేళయ్యెఁ దను వొసఁగ వేళయ్యె నిను గనఁగ వేళయ్యె రావా 
విను మదియు కల్పమ్ము క్షణ మొకటి నీతోడ ననఘ నను గానంగ రావా 
ప్రణయ మొక యాగమ్ము ప్రణవ మది మంత్రమ్ము మన కదియు యోగమ్ము గాదా 
వనజభవు నాశీస్సు వనజముఖు స్నేహమ్ము వనజమగు డెందమ్ము గాదా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


వెణ్బా (ధవళగీతి) - 12
కుఱల్ వెణ్బా -
వెణ్బా ఛందస్సును ద్విపదగా కూడ వ్రాయ వచ్చును. మొదటి పాదములో నాలుగు గణములు, రెండవ పాదములో రెండున్నర గణములు :-) ఆఱున్నర గణములలో జీవిత సత్యములనే ఇమిడ్చాడు తిరువళ్ళువర్ మహాకవి తిరుక్కుఱల్ గ్రంథములో. అందుకే ఇట్టి వెణ్బాను కుఱల్ వెణ్బా అంటారు.

వనితా వృథయా - ప్రయత్నము లెల్ల 

కనవే యిట నన్ను నీవు

విను నే వెడలెద - వీడెద నిన్ను 

కనవిక నన్ను సకీ

నవ్వఁగా నీవు - ననలే విరియుఁగా 

నవ్వకున్న గ్రుచ్చును ముల్లు

చల్లని వెన్నెల - చల్లెఁగా నమృతము 

చల్లఁగా నుండుమా నీవు

చింతలో నుండఁగా - చీకట్లె యెల్లెడ 

చింతలు తీరఁగా వెల్గు

ఆకసము భూమిని - నంటిన యెల్లలో 

చీకటిని వెల్గురేక దాకు

అందమా నవ్వకే - యామెతోఁ జెప్పకే 

సందియపు పాము కఱచు

మునుగ నదుల - ముఱికి నిన్నంటు 

నొనరవుగ పున్నెములు నీకు

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

మాత్రాబద్ధ గేయము -

నది గొప్ప వరమా 

హరియని యన్నది గొప్ప వరమా

ధరణిజ విన్నది గొప్ప వరమా

చిఱునవు గన్నది గొప్ప వరమా

నిధి చాల సుఖమా 

భూమిజ పెన్నిధి చాల సుఖమా 

రాముని సన్నిధి చాల సుఖమా 

ప్రేమకు జలనిధి చాల సుఖమా

మతి క్రొత్త ముదమా 

శ్యాముని సన్మతి క్రొత్త ముదమా 

కోమలి సమ్మతి క్రొత్త ముదమా 

ప్రేముడి బహుమతి క్రొత్త ముదమా

గతి వెలుఁగు పథమా 

జనకజ సంగతి వెలుఁగు పథమా 

జనపతి యాగతి వెలుఁగు పథమా 

హనుమని సద్గతి వెలుఁగు పథమా
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

--((*))--

కోల -
కోల అనే వృత్తమును హేమచంద్రుడు ఛందోనుశాసనములో పేర్కొన్నాడు. ఇది ఉపేంద్రవజ్రకు చేసిన ఒక చిన్న మార్పు. అది ఎలగంటే -

IUI .UU - IIUI UU ఉపేంద్రవజ్ర 

IUI IIU - IIUI UU కోల

క్రింద నా ఉదాహరణములు -

కోల - జ/స/స/య IUI IIU - IIUI UU

12 జగతి 734

వసంతఋతు వీ - వసుధన్ జరించెన్ 

ప్రసూనలతలన్ - భ్రమరమ్ము లాడెన్ 

హసించఁ బ్రియ రా - యమృతమ్ము సిందెన్ 

వసించు ముదముల్ - పవనమ్మునందున్

చిరాకు వలదే - చెలి నీకు నాపై 

పరాకు కలిగెన్ - బయనమ్మునందున్ 

హరించ వెతలన్ - హరుసమ్ముతోడన్ 

బిరాన గనెదన్ - విరిమాల వేయన్

సుగమ్ము గలదా - సుమమందు

ముండ్లన్ 

యుగమ్ము గడచెన్ - యువరాజు రాఁడే 

ముగమ్ము యెచటో - మురళీధరుండా 

జగమ్ము వెలుఁగున్ - సరసుండ రారా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
 --((*))--

 గురు - 



ఆచార్యులను స్మరిస్తూ "గురు" అనే సార్థకనామ గణాక్షర వృత్తమును కల్పించినాను. ఇందులో ప్రతి పాదమునకు ఐదు గురువులు, ఐదు ర-గణములు ఉంటాయి. క్రింద ఒక ఉదాహరణము - 



గురు - మ/మ/య/య/య/య/లగ UUUUU - UIU UIU - UIU UIU UIU 

20 కృతి 299585 



దేవుం డీవేగా - దేవుఁడౌ బ్రహ్మయున్ - దేవుఁడౌ విష్ణువున్ భూమిపై 

దేవుం డీవేగా - దేవుఁడౌ శంభువున్ - దివ్యమౌ బ్రహ్మమున్ సత్యమున్ 
దైవం బీవే నా - తల్లి తథ్యమ్ము నా - తండ్రియున్ దైవమే యెప్పుడున్ 
దైవమ్ముల్ గుర్వుల్ - తాము బోధింతురే - తప్పకన్ బాఠముల్ వీరలున్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు





గజాస్య - ర/స/న/ర/గ UIU IIUI IIUI UU

13 అతిజగతి 1499

శ్రీగణేశ్వర సిద్ధ - శివచిత్త రూపా 

నాగభూషణ సాధ్య - నగజప్రదీపా 

వాగధీశ్వర వంద్య - వరదా గజాస్యా 

వేగ రమ్మిట నాదు - వినతుల్ గొనంగా

మోదక - (భ)4 UII UII - UII UII

12 జగతి 3511

పూవులఁ నాకులఁ - బూజలు సేతును 

దీవెల నుంచుచు - దేవునిఁ గొల్తును 

కోవెల నా చిఱు - గుండియ యందును 

జీవన వృక్షపు - చేవగఁ దల్తును

మోదముతో మృదు - మోదక మిచ్చెద 

నాదముతో నవ - నాట్యము సల్పెద 

సాధన సేసెద - స్వామిని దల్చెద 

బాధల నడ్డులఁ - బాపఁగఁ గోరెద

గజానన - ర/స/న/న/ల UIU IIUI - III III

13 అతిజగతి 8155

ఓ గజానన పూల - నొసఁగెదనుర 

ఓ గణేశ్వర యాకు - లొసఁగెదనుర 

స్వాగత మ్మిదె నీకు - సరస రసిక 

వేగ విఘ్నము లాపు - ప్రియత విరియ

గజవదన - 6, 6 అక్షరాలకు పాదము విఱుగుతుంది; ప్రతి అర్ధములో 8-12 మాత్రలు, పాదాంత విరామము

ఓ గజవదనా - యుల్లమె సదన 

మ్మాగని ముదముల్ - హర్షపు పదముల్ 

వేగమె కనఁగాఁ - బ్రీతిగ మనఁగా 

రాగనిలయ రా - ప్రాణవలయ రా

హేరంబ సుముఖా - హృత్కమలసూర్యా 

సారంగ నయనా - సంతాప హరణా 

మారసన్నిభుఁడా - మాలికాధరుఁడా 

వారణానన రా - వారిజాసన రా

సుముఖి - న/జ/జ/లగ IIII UII UII U 

11 త్రిష్టుప్పు 880

సుముఖుని జూడఁగ - సుందరమే 

ప్రముఖుని జూడఁగఁ - బావనమే 

సముఖము నుండఁగ - సమ్మతమే

విముఖత వద్దుర - విఘ్

నపతీ 
రచయత 
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

--((*))--


లీల - జాతి పద్యము
నిన్న "నిత్యమంగళ" అనే ఒక నూతన వృత్తమును మీకు పరిచయము చేసినాను. అందులోని ప్రత్యేకత ఏమంటే మిశ్రగతికి ఒక చతుర్మాత్రను తగిలించడము. అది మిశ్రజాతి త్రిపుట తాళమునకు సరిపోతుంది, దానిని లీల అంటారు. ఈ రోజు జాతి పాద్యముగా ఈ లీలావతారము! ప్రతి పాదములో 3,4,4 - 3,4,4 మాత్రలు, మొత్తము 22 మాత్రలు. 22 మాత్రలతో ఇలాటి మాత్రాగణములతో నాదగ్గర ఉండే 1000కి పైన వృత్తాలలో ఒకటి కూడ లేదు. కొత్త ఛందస్సులను ఎందుకు కల్పించాలనే ప్రశ్నకు ఇది ఒక జవాబు. క్రింద రెండు పాటలుగా నా ఉదాహరణములు -



ప. సుందరానన రావా - శోభ లివ్వఁగ దేవా

ఎందుఁ గాంచిన నీవే - యీ జగ మ్మెల నీవే
అను. వంద రేకుల విరియై - వాన ధారల ఝరియై
మందహాసపు మెఱుపై - మధుర సంధ్యల యెఱుపై



చ 1. ఆటలాడఁగ రావా - యాకసమ్మున శశితో

పాటఁ బాడఁగ రావా - పంచమమ్మున నళితో
నీట నీఁదఁగ రావా - స్నేహవాక్యపు టలయై
నోట నాడుచు రావా - నూఁగు తెలుఁగునఁ బదమై



చ 2. మధుర మురళీస్వరమై - మదనదేవుని వరమై

నిదురలోఁ బలు కలలై - నిండు పున్నమి వెలుఁగై
వ్యధలఁ దీర్చెడు మందై - వలపునందు పసందై
కథలఁ జెప్పఁగ రావా - కామలీలల పూవా



చ 3. లలిత సుందరతరమై - లాస తాళభరితమై

కళలఁ జిందిడు గళమై - కామజలధికి నలయై
వలపు తలఁపుల సెలయై - వంద పూవుల నెలవై
కలలు నిజమవ రారా - కామినీ హృచ్చోరా
==== వినాయకునిపై ఒక పాట ====



ప. వారణమ్మగు నడ్డులు - వారణానన యనఁగా

దూరమగు దురితమ్ములు - స్థూలకాయుని గనఁగా
అను. ఆఱు ముగముల వానికి - నగ్రజుండై వెలసిన
మేరు పర్వత ధీరుని - మృడుని సూనుని గొలువన్



చ 1. విశ్వమోహనుఁ డతఁడే - విష్ణురూపుం డతఁడే

శాశ్వతమ్మన నతఁడే - చంద్రు నణచిన దతఁడే
ఈశ్వరుండన నతఁడే - హిమజ హృదయ మ్మతఁడే
నశ్వరమ్మగు భువిపై - నావ ముక్తికి నతఁడే



చ 2. మోదకమ్ముల నిత్తును - మోద మొసగఁగ రారా

నాదగీతము పాడెద - నన్ను బ్రోవఁగ రారా
ఛాదనమ్ముల బూవుల - స్వామి గొల్తును రారా
బోధనమ్ములఁ జేయఁగ - బుద్ది నీయఁగ రారా



చ 3. ఆది దేవుఁడ వీవే - ఆది యంతము నీవే

నాదబిందువు నీవే - నాయకుండవు నీవే
వేదనలఁ బలు బాపెడు - వేదవేద్యుఁడ వీవే
పేద నిఁక కరుణించర - పెద్ద హృదయము నీదే
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు





గుచ్ఛకము - 2 



నలల-ర-నలల-ర గణములతో ఉండే అమరికను కూడ రూపగోస్వామి గుచ్ఛకము అని పిలిచారు. వారు ప్రాకృతపైంగలములో అలా ఉన్నదన్నారు, కాని ఆ పుస్తకములో గుచ్ఛకము నాకు కనబడలేదు. ఆ పుస్తకానికి వ్రాసిన వ్యాఖ్యలో అలా ఉన్నదేమో? 



గుచ్ఛకము - న/స/జ/న/జ/గ 

IIIII UIU - IIIII UIU 

16 అష్టి 24416 



మనసిజుని సూనమా - మధురతర గానమా 
వనజభవు నిష్టియా - వలపు కొక తుష్టియా 
అనుపదపు రాగమా - అలరుల పరాగమా 
దినకరుని హాసమా - తిమిరమున భాసమా 

కుసుమముల గుచ్ఛమా - కొమరు విరి స్వచ్ఛమా 
రసమయ విలాసమా - ప్రణయమున లాసమా 
దెసలఁ గల తేజమా - తియని సురభూజమా 
యసదృశము భావముల్ - యలఘు గురు రావముల్ 

నిను గనుచు నుండెదన్ - నిముస మిల వీడకన్ 
నిను దలఁచి యుండెదన్ - నెలఁత హృది పండఁగన్ 
నిను వలచుచుండెదన్ - నెనరు మది నిండఁగన్ 
నిను మఱువఁజాల నే - నెల వెలుఁగు తోడుగా 

మదిని బలు మల్లె లా - మమతలకు నిల్లులే 
వెదురు సడి గీతు లా - ప్రియతముని ప్రీతులే 
బ్రదుకు కగు బాట లా - రసహృదయు మాటలే 
వదల నిఁక వాని నే - వదల నిఁక నెన్నడున్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


అరుణోదయ - 



కుమార నిజగుణయోగులు కన్నడములో పాదమునకు 19 అక్షరములు ఉండే అతిధృతి ఛందములో 108 వృత్తములను కల్పించి, దానిని అతిధృతి శతకము అని పిలిచారు. అందులో "అరుణోదయ" అనే వృత్తము నన్ను ఆకర్షించినది. దీని గణములు - స/భ/ర/న/న/జ/గ. దీని నడక, మత్తేభవిక్రీడితమును, మందాక్రాంతమును జ్ఞాపకానికి తెస్తుంది. విక్రీడితములలో మందాక్రాంతపు నడక ఉన్నదని ఇంతకు ముందే నేను నిరూపించిన సంగతి గుర్తుం దనుకొంటాను. క్రింద అరుణోదయ, మందాక్రాంంత, మత్తేభవిక్రీడితముల గురు లఘువుల అమరికలను గమనించండి. 



.IIUU - IIU.IU - IIIII IIUI U అరుణోదయ 

UU.UU - IIIIIU - U.I.U U.IU U మందాక్రాంత 



IIUU IIUIU IIIII IIUI ... U అరుణోదయ 

IIUU IIUIU IIIU. U.IU UIU U మత్తేభవిక్రీడితము 

అరుణోదయ వృత్తమునకు నా ఉదాహరణములు - 

అరుణోదయ - స/భ/ర/న/న/జ/గ 
19 అతిధృతి 196276 
(కావాలనే యతి స్థానము చూపలేదు, మీరే కనుగొనగలరు) 

అమలమ్మై యరుణోదయ మ్మయెనుగద యతి యందమై 
కమలమ్ముల్ గడు రమ్య మా క్షణికమగు చెలువమ్ముల్ 
రమణా రా రమణీయమౌ రవము లిటఁ జెలఁగెన్ వనిన్ 
విమల మ్మీ ప్రియ రాగముల్ వెలుఁగు సెల విలసిల్లెఁగా 

మగువా యా మగవారినిన్ మహిపయిన మఱి నమ్మకే 
సగమేగా సరి పల్కులన్ జలితమగు నిజ మెప్పుడున్ 
మొగమందున్ మొలకెత్తు నా ముఱి నగవు లెల మోసమే 
నిగళమ్మై నినుఁ గట్టు నా నిగనిగల నగలెల్లయున్ 

హృదయమ్మా యిక నెందుకే యిటులఁ గడు వగ జేందకే 
మదిలోనన్ మగవారినిన్ మఱువగను భయమేలనే 
నదివోలెన్ నడచున్ సదా నవముగను మన మన్కియున్ 
వ్యధ వద్దే ప్రణయమ్ములోఁ బలు విధము లనుభూతులున్ 

వనమాలీ వరదా హరీ పదములను రహిఁ బాడెదన్ 
వినరావా ప్రియరాగమున్ బ్రియముగను వినిపింతు నేన్ 
బ్రణయాబ్ధిన్ వరరత్నముల్ వలపుసిరి నగ లయ్యెఁగా 
ప్రణవమ్మై పలుమార్లు నేఁ బలికెదను తవనామమున్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


తుంగ - "తుంగ" షట్పది
తుంగ అని ఎనిమిది అక్షరాల వృత్తము ఒకటి ఉన్నది. ఇది అనుష్టుప్పు ఛందమునకు చెందినది, అందులో 64వ వృత్తము. ప్రతి పాదములో గణములు న/న/గగ, అనగా III III UU. క్రింద నా ఉదాహరణములు -

తుంగ - న/న/గగ III III UU

8 అనుష్టుప్పు 64

రయము నదియు తుంగ
మ్మయిన యలల సాఁగెన్
బయన మయెను వార్ధిన్
స్వయము తుదకుఁ జేరన్
మనసు పిలిచెఁ గాదా
వినఁగ మనసు లేదా
దినము రజని నీవే
యినుఁడు శశియు నీవే
ఇప్పుడీ తుంగ వృత్తపు అమరికతో ఒక షట్పదిని నిర్మిద్దామా? అసలు షట్పది లాటి అమరికలు ఒకే విధమైన పాదములు లేకుండా ఛందస్సుకు ఒక వైవిధ్యమును కలిగిస్తుంది. అప్పుడు పాట నడకలో monotony ఉండదు. తుంగ షట్పదికి 1,2,4,5 పాదములు తుంగవలెనే, అనగా 3, 3, 4 మాత్రలు. మూడవ, ఆఱవ పాదములలో చివర ఒక త్రిమాత్ర, ఒక గురువు అదనముగా ఉంటాయి. క్రింద "తుంగ"షట్పదికి నా ఉదాహరణములు -
తుంగ షట్పది - 3,3,4/3,3,4/3,3,4-3,2 మాత్రలు
నింగిలోని తారా
రంగఁ డెక్కడే హృ-
ద్రంగమందు నాడన్ - రాఁడుగా
మంగళమ్ము గల్గన్
తుంగ షట్పదిన్ నే
రంగనికయి వ్రాతున్ - రమ్యమై
మనసు పిలిచె రావా
దినము నిన్నె దేవా
వినఁగ రా సురావా - వేగమే
మనసు నాది నీకే
స్వనము నాది నీకే
యనఘ నీవు నాకే - యమల రా
జీవితమ్మ దేమో
నావ నడుపు టెవరో
యీ విషాదములతో - నెట్టులో
దైవ ముండు టెచటో
దైవ మండ యగునో
పూవు లేని ముండ్లే - మోదమా
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

యమకవిన్యాస వృత్తము - 



యమకము ఒక అలంకారము. ఇందులో ఒకే పదమునకు వివిధమైన అర్థములు ఉంటాయి. అందఱు కవులు ఎప్పుడో ఒకప్పుడు యమకాలంకారమును ఉపయోగించినవారే. కొందఱు కావ్యములనే ఈ అలంకారములో వ్రాసియున్నారు, ఉదా. ఆనందతీర్థుల యమకభారతము. అతఁడు మాధవుఁడా, అతఁ డుమాధవుఁడా అన్నప్పుడు మనకు యమకము గోచరిస్తుంది. 



వృత్తముల అమరికలలో వేఱువేఱు గతులను మనము చూడవచ్చునని ఎన్నియో ఉదాహరణములతో మీకు ఇంతకు ముందు తెలిపియున్నాను. ఆ అమరికలకు తగినట్లు పదములను పద్య పాదములలో విఱిచి వ్రాసినప్పుడు ఆ అమరికలకు లేక విన్యాసమునకు "యమకత్వమును" ఆపాదించవచ్చును. ఉదాహరణముగా సురనర్తకీ వృత్తమును తీసికొందాము. దీని గణములు ర/న/ర/న/ర/న/ర లేక UIUIII - UIUIII - UIUIII UIU. UIUIII అమరికను UIU III పదముల విఱుపుతో లేక UI UIII పదముల విఱుపుతో వ్రాస్తే మనకు యమక విన్యాసము లభిస్తుంది. క్రింద ఒక ఉదాహరణము. ఇందులో బేసి పాదములలో UIU III విఱుపు, సరి పాదములలో UI UIII విఱుపు గలదు. ఇక్కడ యమకత్వము పదముల వలన కాదు, పదముల విఱుపు వలన, గతి భేదము వలన గణముల అమరికకు కలుగుతుంది. 



సురనర్తకీ - ర/న/ర/న/ర/న/ర 

UIUIII UIUIII UIUIII UIU 


మాధవున్ గనఁగ - మోదమే యెపుడు - భూధర మ్మలరుఁ బూవులన్ 
రాధ పెన్నిధియు - మోద వార్నిధియె - బాధ యుండదిఁక జీవులన్ 
శ్రీధరుం డనఁగ - వేదముల్ బలుకు - నాదముల్ వెలయు రాగముల్ 
వేద మంత్రములు - బోధ నామృతపు - నాద సింధువుల యోగముల్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు







మళ్లీ మధూళిక!

స్తవమాలను చదువుతుంటే అందులో ఇందిరాచ్ఛందము అని ఒకటి కనబడినది. దానికి గణములు న/ర/ర/లగ. దీనిని రాజహంసీ అని పిలుస్తారు. ర-గణమును అలాగే ఉంచి త్రిమాత్రను న-గణము, గలముగా చేస్తే మనకు నాలుగు విధములైన వృత్తములు లభిస్తాయి. అందులో రంజితా, రాజహంసీ, పంక్తికా ఛందోగ్రంథములలో ఉన్నాయి. నాలుగవ దానికి గణములు న/ర/న/ర. దీనికి నేను మధూళికా అని పేరు పెట్టి ఇంతకు ముందే తెలిపినాను. ఈ రోజు మధూళికకు మఱి కొన్ని ఉదాహరణములను ఇస్తున్నాను. ఈ నాలుగు వృత్తములు రథోద్ధత (UIUIII - UIUIU) వర్గమునకు చెందినది. పాదపు రెండు భాగములలో రెండు చతుర్మాత్రలు కాని అష్టమాత్ర ఈ వర్గపు ప్రత్యేకత.
న/ర/న/ర మధూళికా
ర/జ/స/లగ రంజితా, ఉపదారికా
న/ర/ర/లగ రాజహంసీ, కనకమంజరి, విభూషణా
ర/య/జ/గ పంక్తికా, మౌక్తిక, కర్ణపాలికా, హరహర
ర/న/ర/లగ రథోద్ధతా, వరాంతికా
మధూళికా - న/ర/న/ర IIIUIU - IIIUIU
12 జగతి 1496
తలఁపు లెన్నియో - తలుపు లేదుగా
వలపు చేప నే - వలకుఁ జిక్కితిన్
కలలు వచ్చునా - కలఁత తెచ్చునా
అలరుఁబోడి న-న్నలరఁ జేయునా
సరసఁ జేరఁగా - సరస మాడునా
వరదుఁ డైననున్ - వరము లిచ్చునా
కరము ప్రీతితోఁ - గర మొసంగునా
తరుణమందు నా - తరుణుఁ డెక్కడో
హరిని దల్చఁగా - హరుఁడు వచ్చునా
హరుని దల్చఁగా - హరియు వచ్చునా
హరిహరుల్ సదా - హరహరుల్ గదా
చరణ మంటఁగా - శరణ మిత్తురే
పడితిఁ బ్రేమలోఁ - బడితి మెల్లఁగాఁ
బడితి నెందుకో - ఫలిత మేమిటో
యిడుము లెన్నియో - యెడము లెన్నియో
కడకు యోగమో - కథ వియోగమో
మనసు నీదె యీ - మమత నీకెరా
తనువు నీదె యీ - ధరణిపై సదా
దినము రాత్రి సు-స్థిరము డెందమం
దనఘ నీవె యీ - యబలఁ గావరా
తెలుఁగు పద్యముల్ - దినము హృద్యముల్
తెలుఁగు పాటలో - తియని తేనియల్
తెలుఁగు పల్కు ము-త్తియము సత్యమై
తెలుఁగు నేర్చి నీ - తెలివి పెంచుకో
ఇందులో మొదటి మూడు ఉదాహరణములకు యతి, ప్రాసయతి రెండు ఉన్నాయి. న/ర గణములతో ఉండే వృత్తమును నరమనోరమా అంటారు. పై మూడు ఉదాహరణములను ఒక్కొక్క దానిని రెండు నరమనోరమ వృత్తములుగా వ్రాయ వీలగును. క్రింద ఒక ఉదాహరణము -
నరమనోరమా - న/ర
6 గాయత్రి 24
హరిని దల్చఁగా
హరుఁడు వచ్చునా
హరుని దల్చఁగా
హరియు వచ్చునా
హరిహరుల్ సదా
హరహరుల్ గదా
చరణ మంటఁగా
శరణ మిత్తురే
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

గుచ్ఛకము -
రూపగోస్వామి స్తవమాలలో ఉపయోగించిన ఛందములలో గుచ్ఛకము ఒకటి. దీనికి ప్రతి పాదములో ఐదు న-గణములు, ఒక ర-గణము. అనగా నాలుగు పంచమాత్రలు ఇందులో. వారి ఉదాహరణములోని చివరి రెండు పంక్తులు -

సకృదమలపదకమలవినతభయమోచనం 

భజ సదయమయి హృదయ సరసిరుహలోచనం

క్రింద నా ఉదాహరణములు -
గుచ్ఛకము - న/న/న/న/న/ర
IIIII IIIII - IIIII UIU
18 ధృతి 98304
అనుదినము నిను గొలుతు - ననఘ నను గావ రా
కనుల కిడు దరిసెనము - కమలముఖ దేవరా
వినుము నవ పదములను - విమల పద గుచ్ఛక
మ్మనఁగఁ గడు మధురముగ - నవనిపయి నిచ్ఛతో
విమలమగు గగనమున - వెలిఁగెఁ బలు తారకల్
అమల మతిఁ గలిఁగెఁ బలు - హరుసమిడు కోరికల్
సుమము లిట సురభిళము - సుఖ మొసఁగుఁ జేరికల్
రమణ నిను బిలిచె మృదు - రవళిఁ బ్రియ శారికల్
ఒకరి గృహమున దధి మ-ఱొకరికడ క్షీరమున్
ఒకరి గృహమున ఘృతము - నొకరికడ నీరమున్
సకలమును దెలిసి హరి - సరసరగఁ గ్రోలఁగా
వికచమయె హృదయములు - వెలుఁగు సెలఁ దేలఁగా
వెదురుసడి యిడు ముదము - ప్రియము ఖగవాహనా
బెదిరిపడు హరిణములు - విడు భయము మోహనా
వదలవుగ పసులు నిను - వరదుఁడని యాదవా
మధురవని మనికి యది - మధురిమయె మాధవా
కవన మిది వెలుఁగువలెఁ - గలిఁగె మదిఁ జల్లఁగా
భువనముల కడదెసలఁ - బొడిచె నది మెల్లఁగా
యువత గను నవత లవి - యుదయమగు నింపుగా
శ్రవణసుఖ మొదవు నిఁక - సకలమగు సొంపుగా
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

మునినుత -
నాగవర్మ ఛందోంబుధిలో పాదమునకు 26 అక్షరాలు ఉండే మునినుత అనే వృత్తమును పరిచయము చేసెను. పాదములో 30 మాత్రలు, అనగా ఏడున్నర చతుర్మాత్రలు. ఈ వృత్తమును శరషట్పదిగా, జాతి పద్యమైన కృష్ణానందగా కూడ వ్రాయ వీలగును. క్రింద నా ఉదాహరణములు -

మునినుత - న/జ/న/స/న/న/న/జ/లగ

IIII UII - IIII UII - IIII IIII - UIIU

26 ఉత్కృతి 29358064

మునినుత మెల్లఁగ - మునిఁగితి నవ్వుల - మునకలె ముదములు - మోహనుఁడా
కనక దుకూలము - కనక సరమ్ములు - కనఁగను దివమును - గాంచితిఁగా
ప్రణవపు మంత్రము - ప్రణయపు యంత్రము - ప్రణమిలి యడిగెద - రమ్మియఁగా
మనమున నెప్పుడు - మననము సేతును - మనికిని హరియని - మాధవ నేన్
షట్పదులుగా -
మునినుత మెల్లఁగ
మునిఁగితి నవ్వుల
మునకలె ముదములు - మోహనుఁడా
కనక దుకూలము
కనక సరమ్ములు
కనఁగను దివమును - గాంచితిఁగా
ప్రణవపు మంత్రము
ప్రణయపు యంత్రము
ప్రణమిలి యడిగెద - రమ్మియఁగా
మనమున నెప్పుడు
మననము సేతును
మనికిని హరియని - మాధవ నేన్
కృష్ణానందగా -
మునినుత మెల్లఁగ - మునిఁగితి నవ్వుల
మునకలె ముదములు - మోహనుఁడా
కనక దుకూలము - కనక సరమ్ములు
కనఁగను దివమును - గాంచితిఁగా
ప్రణవపు మంత్రము - ప్రణయపు యంత్రము
ప్రణమిలి యడిగెద - రమ్మియఁగా
మనమున నెప్పుడు - మననము సేతును
మనికిని హరియని - మాధవ నేన్
మునిసుత -
కలకల నాదము - కలవలె తోఁచఁగఁ - గలతలు మనసున - గల్గవుగా
కెలవుల పువ్వులు - కిలకిల నవ్వులు - కెలఁకుల ధ్వనులయె - కేళికలన్
పలుపలు పాటలు - వలపుల కూటలు - బలపడు నెనరుకు - బంధువులే
చెలువము నిండఁగ - చెలిమియు పండఁగ - శిల యిఁక కరుఁగును - శీఘ్రముగా
షట్పదులుగా -
కలకల నాదము
కలవలె తోఁచఁగఁ
గలతలు మనసున - గల్గవుగా
కెలవుల పువ్వులు
కిలకిల నవ్వులు
కెలఁకుల ధ్వనులయె - కేళికలన్
పలుపలు పాటలు
వలపుల కూటలు
బలపడు నెనరుకు - బంధువులే
చెలువము నిండఁగ
చెలిమియు పండఁగ
శిల యిఁక కరుఁగును - శీఘ్రముగా
కృష్ణానంందగా -
కలకల నాదము - కలవలె తోఁచఁగఁ
గలతలు మనసున - గల్గవుగా
కెలవుల పువ్వులు - కిలకిల నవ్వులు
కెలఁకుల ధ్వనులయె - కేళికలన్
పలుపలు పాటలు - వలపుల కూటలు
బలపడు నె
నరుకు - బంధువులే
చెలువము నిండఁగ - చెలిమియు పందఁగ
శిల యిఁక కరుఁగును - శీఘ్రముగా
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు







నిదురకఱవాయె కనులకు
మధురమ్మగునీతలపుల మానసచోరా!
యెదలో తాపము హెచ్చెను
సుధనిడు పుష్పము విధముగ చూచుచు నుంటిన్



కం.

విద్యాధికులను మించిన
పద్యంబుల వ్రాయఁగలవు భారతి కృపతో
హృద్యంబౌ ప్రతియొక్కటి
వేద్యంబౌ తల్లి పగిది, వీక్షించ జనుల్‌
సద్యోస్ఫూర్తిని సాగుచు
నాద్యంతము రమ్యమగుచు నలరించునవై
విద్యా విభవము జూపుచు
విద్యార్థులకిచ్చు వెలుఁగు వేవిధములుగా
వాణీ పుత్రివి నీవని
క్షోణినిఁ బ్రతివారు బలుకఁ జూచెద వీవే
పాణినిఁ బట్టిన కలమున
రాణింపఁగఁ జేయు పదమె రయముగ వెడలన్
కోటయ మెచ్చెడి రీతినె
కూటమిలోఁ జదువఁగలవు కూర్చెడి పద్యాల్‌
మాటల నేర్పిన గురువుగ
నీ టెంకణములనుఁ గొనఁగ నీ కృతి తోనే
వంగడమంతయు మురియును
పొంగెడి నీ పద్యగంగ పుడమినిఁ బారన్‌
సంగడికాండ్రును మఱి మఱి
పొంగఁగ నీచెలిమి వారి పుణ్యమె యనుచున్‌
రాశీభూతములై నుడు
లాశలనన్నింట నించి యంబిక వెలుఁగుల్
దేశములన్నిటఁ బంచును
శ్రీ శారద పల్కురుచులఁ జిత్సుఖమిడఁగా
అరుణారుణ కాంతులతో
నరుదెంచిన బాలభానుడైనటి తెఱఁగున్‌
ధరనంతట ప్రభ నింపుటె
కరుణామయి తల్లి యిడిన కవనంబులతోన్‌
శంకించకు నామాటలఁ
గంకణమును గట్టుకొమ్ము కవితలఁ బంచన్‌
పంకములో దించను నిను
శంకరినే యగుదునమ్మ సర్వవిధాలన్‌
ఒప్పందం గొప్పదె సరె
గప్పాలెందుకు జనాల కష్టం చూడూ
తిప్పల ట్రాఫిక్ నరకం
విప్పండీ మీ కనులను వేపుట తగునా.
ఉల్లాసం మీర్యాలీ
కల్లోలం వీధులన్ని కనబడ లేదా
ఇల్లలకంగా పండుగె
తల్లడ పాలౌ టజనులు తగునా తగునా.
కలికాలంలో ఒక్కడు
ఇలలో ఇటువంటి వాడు ఎటులుంటాడా
అల దేవతలూ చేయని
విలువౌ అతి ధన్యమైన వేదన మోసెన్.
తన ఆలి తనువు వీడగ
కనికరమే లేని జగతి కాలన్ తోయన్
తన భుజములపై మోయుచు
ఘనమౌ ఈదేశ చరిత కళవళ పడగా
దినమంతయు మోసినడచి
ఘనమౌ ఈశ్వరుని కన్న ఘనుడయ్యె నయా
తన గుండెకోత కావ్యము
తన కన్నీటను రచించె ధర్మము నిలిపెన్



సందడెట్టుల ...

----------------------
మ.కో
సుప్రభ
1:35 PM
08-27-2016
మత్తకోకిల - ర,స,జ,జ,భ,ర - యతి 1,11
ధ్రువకోకిల - న,భ,ర,స,జ,జ,గ - యతి 1,12
నా గోడ మీద వ్రాసి పంచిన -- పారఁజేసెద బద్యమొక్కటి --- పద్యమునకు స్పందనగా నాగజ్యోతిగారు క్రింది పద్యములోని మొదటి పాదమును వ్రాశారు. వ్రాయించేవారి దయతో వెంటనే నేను తరువాతి మూడు పాదములు వ్రాసి పద్యము పూరించాను. తరువాత మరల నాగజ్యోతిగారు అదే ప్రాసతో యింకొక పద్యము వ్రాసి ప్రచురించారక్కడే. వేరే పద్యము లిస్తానని యిక్కడ చెబుతున్నా, అక్కడి పద్యము గురించి చర్చిస్తూ కొన్ని నిముషములు గడుపవలసివచ్చినది. అక్కడ పని కాగానే వేచియున్న వారితో మాట్లాడుతూ చెప్పదలచుకున్నది చెప్పవచ్చిక అన్నాను. మాట్లాడకుండ ఆవాక్యమే మత్తకోకిల వృత్తములో బెట్టించి, మత్తకోకిలలకు తోడుగా ధ్రువకోకిలలను గూడ బంపి పాడించినవి. 
మత్తకోకిలకు, ధ్రువకోకిలకు మొదటిగణములోనే తేడా. మత్తకోకిలలోని మొదటి గురువును రెండు లఘువులుగా జేస్తే తరలము లభిస్తుంది.
పైన ప్రస్తావించబడిన పద్యము...




ధ్రువకోకిల ( తరలము )  న,భ,ర,స,జ,జ,గ - యతి 1,12

అలుగఁబోకుము తల్లి నాపయి నంతలోననె, మ్రొక్కుదున్‌
పలుకులాడక యున్న సాధ్యమ పల్కు దోషము దెల్పఁగాఁ
దెలిసినట్టిది యేదొ యచ్చట దెల్పుమన్నది నీవెగా!
తెలిపినట్టిది యాచరించుట తృప్తియందువు గాదొకో!

వలదు కోపము బిడ్డపైనిటు, బాధఁగూర్చెడు నమ్మరో
పలుకులాడుచుఁ బాట, పద్యము బారఁజేయుటె కమ్మనౌ
కలికివీణనుఁ దీసి ప్రీతిగ గానమాడుచుఁ దీయఁగాఁ


జిలుకరించిన నీదు సత్కృప చిత్తమెంతగఁ బొంగునో



మత్తకోకిల - ర,స,జ,జ,భ,ర - యతి 1,11

మార్గదర్శక మైనవారలు మాకుదక్కుట పుణ్యమే :-)
అర్గళమ్ముల బాపుచుండగ నామె పుత్రుడు ప్రేమతో
నిర్గమించగ నిర్భయమ్ముగ నిత్యసత్యము నెర్గగా
భర్గుపత్నియె చూపునందురు బాటనందరికీయిలన్‌



మగువ మనసు విరుపు మగనికది బాధలే

జగడము 

No comments:

Post a Comment