Monday 10 August 2015

ప్రాంజలి ప్రభ - దేశభక్తిగీతాలు

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ 
సరేవేజనాసుఖినోభావంతు

Pranjali Prabha.com

           అమ్మడూ! తమ్ముడూ!మన పతాక పైకెత్తి
             వందేమాతరమంటూ నినదించి సాగాలి
        వందేమాతరం. . .వందేమాతరం ~ అమ్మడూ ~

           అహింసనే ఆయుధాన్ని చేసిన మన గాంధీజీ!
            జైజవాన్! జైకిసాన్! నినాదాల బహదూర్ జీ!
         ప్రపంచాన మన దేశపు ప్రగతికి బాటలు పరచిన
    కలాంజీని యెదనుంచి కదలిరండి కదంత్రొక్కి ~ అమ్మడూ! ~

         తెలుగువాడు సృష్టించిన తిరంగాల మన జెండా
          త్యాగం, నిస్వార్ధగుణపు ప్రతీకరా మన జెండా!
           ధర్మాశోకుని చక్రపు ధగధగరా మన జెండా!
సమధర్మపు సంస్కృతికి మరోరూపు మన జెండా! ~ అమ్మడూ! ~


దేశభక్తిగీతాలు - 



స్వతంత్రతా భ్రాతృత్వాలు సమతా మా సదాశయాలు! 
మాదీ స్వతంత్రదేశం లలితగీతాన్ని రచించినది స్వరపరచినది డా. బాలాంత్రపు రజనీకాంతరావుగారు. బిలహరి రాగం ఆది తాళంలో (కహరువా తాళం హిందూస్తానీలో) కూర్చారు. టంగుటూరి సూర్యకుమారి గానం చేయగా ఎంతో ప్రాచుర్యం పొందింది. 

పాట సాహిత్యo 

పల్లవి: 
మాదీ స్వతంత్ర దేశం - మాదీ స్వతంత్ర జాతి 
భరతదేశమే మా దేశం - భారతీయులం మా ప్రజలం || మాదీ స్వతంత్ర దేశం || 

చరణం 1: 
వింధ్య హిమవత్ శ్రీనీలాదుల సంధ్యారుణిత నవాశలు మావి 
గంగా గోదావరీ సహ్యజా తుంగ తరంగిత హృదయాల్ మావి || మాదీ స్వతంత్ర దేశం|| 

చరణం 2: 
ఆలయమ్ముల శిల్పవిలాసం ఆరామమ్ముల కళాప్రకాశం 
మొగల్ సమాధుల రసదరహాసం మాకు నిత్యనూతనేతిహాసం || మాదీ స్వతంత్ర దేశం || 

చరణం 3: 
అహింసా పరమో ధర్మ: సత్యం వద ధర్మం చర 
ఆది ఋషుల వేదవాక్కులు మా గాంధీ గౌతముల సువాక్కులు || మాదీ స్వతంత్ర దేశం || 

చరణం 4: 
స్వతంత్రతా భ్రాతృత్వాలు సమతా మా సదాశయాలు


Pranjali prabha .com 


రండోయ్! రండి !! 
రండోయ్! రండి !! 
ఓ పిల్ల లార రండి ! 
ఓ తల్లు లార రండి ! 
ఓ తండ్రులార రండి ! 
మన స్వాతంత్ర దినోత్సవము నేడే నండి !! 

రండోయ్! రండి !! 
రండోయ్! రండి !! 
ఎందరో యోధుల ధైర్య ఫలము ! 
ఎందరో వీరుల పోరాట ఫలము ! 
ఎందరో అమరుల త్యాగ ఫలము ! 
మన స్వాతంత్ర దినోత్సవము నేడే నండి !! 

రండోయ్! రండి !! 
రండోయ్! రండి !! 
ఓ బాల బాలిక లారా రండి ! 
ఓ యువతీ యువకు లార రండి ! 
ఓ భారత పౌరులారా రండి ! 
మన స్వాతంత్ర దినోత్సవము నేడే నండి !! 




స్వాతంత్య దిన శుభాకాంక్షలు 

Pranjali prabha .com 


రండోయ్! రండి !! 
రండోయ్! రండి !! 
ఓ పిల్ల లార రండి ! 
ఓ తల్లు లార రండి ! 
ఓ తండ్రులార రండి ! 
మన స్వాతంత్ర దినోత్సవము నేడే నండి !! 

రండోయ్! రండి !! 
రండోయ్! రండి !! 
ఎందరో యోధుల ధైర్య ఫలము ! 
ఎందరో వీరుల పోరాట ఫలము ! 
ఎందరో అమరుల త్యాగ ఫలము ! 
మన స్వాతంత్ర దినోత్సవము నేడే నండి !! 

రండోయ్! రండి !! 
రండోయ్! రండి !! 
ఓ బాల బాలిక లారా రండి ! 
ఓ యువతీ యువకు లార రండి ! 
ఓ భారత పౌరులారా రండి ! 
మన స్వాతంత్ర దినోత్సవము నేడే నండి !! 




పల్లవి. శుభము, శుభము, శుభము భారత దేశమా! 
ఆభివృద్ది పథములో యిక ముందు సాగుమా! || శుభము || 


అనుపల్లవి. నభము నంటునులే నీ దివ్య చరితము, 
ప్రబుధుడు మోడి పట్టెలే పగ్గము! ||శుభము || 

బంగారు పంటలు పండులే నీ యింట, 
సింగారపు సిరులు ఒలుకులే సర్వత్ర, 
రంగు రంగుల ప్రభలు పొంగారు ప్రతిచోట, 
రంగు రంగుల జెండా ఎగురులే నింగంత. ||శుభము || 

శ్వాశలు నింపుకొని ఆర్ధిక రంగము, 
కాసుల రాసులు కొల్లలుగ నింపులే, 
దేశ దేశము లందు నీ కీర్తి కౌముది, వి 
కశించి వెన్నెలై విద్యోత మగులే!. ||శుభము || 

ఆరోగ్య, విద్య, వ్యాపార రంగములు, 
ధరణిలో దివ్యముగ దేదీప్య మగులే, 
కార్మికుల, రైతుల, సైనికుల, సేవకుల, 
నిర్మలానందము నయనముల వెలుగులే ! ||శుభము || 

అవినీతి సమసి, ఆనందము వెలసి, 
భువిన భారతము స్వర్గ సీమగులే, 
కవుల, వైతాళికుల, గాయకుల కీర్తనలు, 
అవిరళముగ వెలసి అంతట నిండులే! ||శుభము || 

రమాకాంతరావు చాకలకొండ శుక్రవారం, 15 ఆగస్టు 2015


స్వాతంత్య దిన శుభాకాంక్షలు 
ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీతల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

ఏ పూర్వపుణ్యమో, ఏ యోగ బలమో
జనియించినవాడ నీ స్వర్గఖండమున
ఏ మంచి పూవులన్‌ ప్రేమించినావో
నినుమోసె ఈ తల్లి కనక గర్భమున

లేదురా ఇటువంటి భూదేవి యెందు
లేదురా మనవంటి పౌరులింకెందు
సూర్యుని వెలుతురుల్ సోకునందాక
ఓడల ఝండాలు ఆడునందాక

అందాక గల ఈ అనంత భూతల్లిని
మన భూమి వంటి చల్లని తల్లి లేదు
పాడరా నీ తెలుగు బాలగీతములు
పాడరా నీ వీర భావ గీతములు

తమ తపస్సుల్ ఋషుల్ ధారవోయంగా
శౌర్య హారము రాజ చంద్రులర్పింప
రాగ దుగ్ధము భక్త రక్తముల్ పిదుక
భావ సూత్రము కవి ప్రభువు లల్లంగా

దిక్కులకెగదన్ను తేజములు వెలుగ
జగముల నూగించు మగతనంబెగయ
రాళ్ళు తేనియలూరు రాగాలు సాగ
సౌన్దర్య మెగబోయు సాహిత్య మలర

వేలగిండీ దివ్య విశ్వము పుత్రా
అవమానమేలరా అనుమానమేల
భారత పుత్రుండనచు భక్తితో బలుక
పాడరా నీతల్లి వీర గీతములను

రాయప్రోలు సుబ్బారావు






మాదీ స్వతంత్రదేశం లలితగీతాన్ని రచించినది స్వరపరచినది డా. బాలాంత్రపు రజనీకాంతరావుగారు. బిలహరి రాగం ఆది తాళంలో (కహరువా తాళం హిందూస్తానీలో) కూర్చారు. టంగుటూరి సూర్యకుమారి గానం చేయగా ఎంతో ప్రాచుర్యం పొందింది.

పాట సాహిత్యo

పల్లవి:
మాదీ స్వతంత్ర దేశం - మాదీ స్వతంత్ర జాతి
భరతదేశమే మా దేశం - భారతీయులం మా ప్రజలం || మాదీ స్వతంత్ర దేశం ||

చరణం 1:

వింధ్య హిమవత్ శ్రీనీలాదుల సంధ్యారుణిత నవాశలు మావి
గంగా గోదావరీ సహ్యజా తుంగ తరంగిత హృదయాల్ మావి || మాదీ స్వతంత్ర దేశం||

చరణం 2:

ఆలయమ్ముల శిల్పవిలాసం ఆరామమ్ముల కళాప్రకాశం
మొగల్ సమాధుల రసదరహాసం మాకు నిత్యనూతనేతిహాసం || మాదీ స్వతంత్ర దేశం ||

చరణం 3:

అహింసా పరమో ధర్మ: సత్యం వద ధర్మం చర
ఆది ఋషుల వేదవాక్కులు మా గాంధీ గౌతముల సువాక్కులు || మాదీ స్వతంత్ర దేశం ||

చరణం 4:

స్వతంత్రతా భ్రాతృత్వాలు సమతా మా సదాశయాలు
జననీ ఓ స్వతంత్ర దేవీ కొనుమా నివాళులు మావి || మాదీ స్వతంత్ర దేశం ||








1.ప్రవచనం 

ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీతల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

ఏ పూర్వపుణ్యమో, ఏ యోగ బలమో
జనియించినవాడ నీ స్వర్గఖండమున
ఏ మంచి పూవులన్‌ ప్రేమించినావో
నినుమోసె ఈ తల్లి కనక గర్భమున

లేదురా ఇటువంటి భూదేవి యెందు
లేదురా మనవంటి పౌరులింకెందు
సూర్యుని వెలుతురుల్ సోకునందాక
ఓడల ఝండాలు ఆడునందాక

అందాక గల ఈ అనంత భూతల్లిని
మన భూమి వంటి చల్లని తల్లి లేదు
పాడరా నీ తెలుగు బాలగీతములు
పాడరా నీ వీర భావ గీతములు

తమ తపస్సుల్ ఋషుల్ ధారవోయంగా
శౌర్య హారము రాజ చంద్రులర్పింప
రాగ దుగ్ధము భక్త రక్తముల్ పిదుక
భావ సూత్రము కవి ప్రభువు లల్లంగా

దిక్కులకెగదన్ను తేజములు వెలుగ
జగముల నూగించు మగతనంబెగయ
రాళ్ళు తేనియలూరు రాగాలు సాగ
సౌన్దర్య మెగబోయు సాహిత్య మలర

వేలగిండీ దివ్య విశ్వము పుత్రా
అవమానమేలరా అనుమానమేల
భారత పుత్రుండనచు భక్తితో బలుక
పాడరా నీతల్లి వీర గీతములను

రాయప్రోలు సుబ్బారావు

హిమనగమే అండగా సముద్రాల సాక్షిగా 

అలరారే అనురాగమే మన దేశం ~ హిమ ~ 

భిన్నభిన్న సంస్కృతులకు వేదికగా నిలచి 
నీవు, నేను వాదాలను ప్రక్కకు త్రోసి 
మనమంతా, జనమంతా ఒకే జాతియని చాటే 
ఈ దేశం మనదిరా! ప్రపంచాన మణిదీపం ~ హిమ ~ 

కష్టాలను ఎదురొడ్డిన శ్రీరాముడే మన నేత 
నేరానికి శిక్షన్నది తప్పదన్న ఆ "గీత" 
సంస్కర్తల ప్రవచనాల స్పందించే మన "జనత" 
సత్యానికి, త్యాగానికి ప్రతీకైన పతాకతో 

హిమనగమే అండగా సముద్రాల సాక్షిగా 
అలరారే అనురాగపు మనదేశం 
" సత్యాహింస"ల స్ఫూర్తి విజయానికి చిహ్నమని 
నిరూపించి చూపినట్టి సందేశం 
"వందేమాతరం. . వందెమాతరం. .వందేమాతరం!"






2.నినాదం Pranjali Prabha.com

           అమ్మడూ! తమ్ముడూ!మన పతాక పైకెత్తి
             వందేమాతరమంటూ నినదించి సాగాలి
        వందేమాతరం. . .వందేమాతరం ~ అమ్మడూ ~

           అహింసనే ఆయుధాన్ని చేసిన మన గాంధీజీ!
            జైజవాన్! జైకిసాన్! నినాదాల బహదూర్ జీ!
         ప్రపంచాన మన దేశపు ప్రగతికి బాటలు పరచిన
    కలాంజీని యెదనుంచి కదలిరండి కదంత్రొక్కి ~ అమ్మడూ! ~

         తెలుగువాడు సృష్టించిన తిరంగాల మన జెండా
          త్యాగం, నిస్వార్ధగుణపు ప్రతీకరా మన జెండా!
           ధర్మాశోకుని చక్రపు ధగధగరా మన జెండా!
సమధర్మపు సంస్కృతికి మరోరూపు మన జెండా! ~ అమ్మడూ! ~


--3--



పల్లవి.వీధి వీధులలో వన్నెల జెండ, వినువీధులకు ఎగరాలి, 
మేదిన యింతకు మించిన జండ, లేదని ప్రగతితో చాటాలి.||వీధి|| 

అనుపల్లవి.నిరత సుందర త్రివర్ణ జెండ నాట్యము చేయుచు ఎగరాలి, 
భారత జాతికి మించిన సంతతి భువిలో లేదని తెలపాలి.||వీధి|| 

1. త్యాగముతో, బలి దానముతో, నెత్తురు ఒలకగ, యిచ్చి ప్రాణములు, 
భక్తిగ ఎందరో తెచ్చిన జెండ, ప్రగితి మార్గమున ఎగరాలి, 
ఖగ రాజు వలే విశ్వములోన, ఖ్యాతిని గొప్పగ చాటాలి 
నిగ నిగ లాడగ నింగి పతంగమై, పతాక మెత్తుగ ఎగరాలి.||వీధి|| 

2. దేశ మాతకై శిరములు యిచ్చి త్యాగ ధీరులు తెచ్చిన జండ, 
అశయాలతో, అవిరళ కృషితో, అమర వీరులు నిలిపిన జండ, 
మొసులెత్తిన మన ఆశలను, మేదిన తీర్చెడి ఘనమగు జండ, 
విశ్వశాంతికై, ప్రేమ నిరతితో, విజయ పథములో సాగాలి.||వీధి|| 

3. అన్న దమ్ములై అన్ని జాతులు, కుల, మత భావము కూల్చాలి, 
వెన్న ముద్దకై పీకులాటలు, దొమ్మి, దగాలు ఆపాలి, 
అన్నము, గుడ్డ, గూడు, నీరు సమముగ అందరికందాలి, 
మన్నన పొందే మంచి మార్గమున జాతి ఒక్కటిగా సాగాలి.||వీధి|| 

4. సహనము శాంతి, స్నేహ భావము అదర్శముగ మారాలి, 
దేహము ఒకటని, అన్ని రాష్ట్రములు దేశమును కాపాడాలి, 
మోహము వీడి, త్యాగము పెంచి, సమత భావం నిలపాలి, 
జై హింద్, జైహింద్, జైహింద్ అంటూ సింహ గర్జన చేయాలి.||వీధి|| 

రమాకాంతరావు చాకలకొండ 15 ఆగస్టు 2010

  

దేశభక్తి గీతాలు  బై సోమసుధ . ఓ పాలకుడా 


రాజ్యమేలుతున్నావని రాజసాలు పోవద్దు 
స్వార్ధంతో ప్రజలలోన చిచ్చును రగిలించొద్దు 
మనోరంగ తీరాల "మన" తత్వం ఎగరాలి 
తిరంగాల మన జెండా తరంగాలు రేపాలి ~ రాజ్య ~ 

ఆంగ్లేయుల గుండెల భీతిని కలిగించారు 
మనవాళ్ళు . . .మనవాళ్ళు. . 
అండమాను చెరశాలలో తనువుల నెరవేశారు 
స్వేచ్ఛ కొరకు. . స్వేచ్ఛకొరకు 
ప్రాణాలను బాణాలుగ చేసి పోరు సలిపారు 
"సర్వకళల కాణాచి"కి స్వతంత్రాన్ని తెచ్చారు ~ రాజ్య ~ 

రాజనీతి పేరుతో రాక్షసాలు చేయొద్దు 
పాలకుడా! . . పాలకుడా! 
త్యాగధనుల దేశంలో విషబీజాలేయొద్దు 
నాయకుడా!. . .నాయకుడా! 
భిన్నత్వంలోనే మనం ఏకత్వం చూపాలి 
అవనిలో తలమానికమై మనదేశం నిలవాలి ~ రాజ్య ~







--5--

పల్లవి. జాతి ఘనత దెలుపు జాతీయ జెండా, ప్ర 

గతికి, రీతికి, ప్రతీకైన జెండా. ||జాతి|| 

అనుపల్లవి. మూడు రంగుల వెలయు ముచ్చటైన జెండా, 
నడుమ చక్రము గల నయగారపు జెండా! ||జాతి|| 

1. ధీర స్వభావము చాటు కాషాయముతో, 
వీర రస ప్రబోధ విద్యోత జెండా, 
ధరణి మాతకై ప్రాణ త్యాగము చేసెడి, 
శూరల దేశమని తెలుపు నీ జెండా! ||జాతి|| 

2. శాంతి పధతమును జూపి, ధవళ 
కాంతుల మెరయు, దేదీప్యమాన రంగుల జెండ, 
ఎంత ఆపదనైన సత్యమే పల్కమని, 
అందరికి తెలిపెడి అందమైన జెండా! ||జాతి|| 

3. నమ్మకము తోటి నలుగురు చల్లగ, 
ధర్మ పథము లోన సాగుమను జెండ, 
సమానత్వము, మంచి, కరుణ స్వభావ, 
సమ సమాజ ఉనికి తెలుపు మన జెండా. ||జాతి|| 

4. అశోక చక్రము అందముగ అమరుండ, 
దేశ ప్రగతిని చాటు దీప్తుల జెండా, 
శ్వాశ పీల్చి యిచట న్యాయము, ధర్మము, 
వాసముండేనని తెలుపు నీ జెండా! ||జాతి|| 

రమాకాంతరావు చాకలకొండ మంగవారం, 14 ఆగస్టు 2015


--6--


ఎగరాలి ఎగరాలి - జాతీయపతాకం ఎగరాలి 

ఆకాశాన అలుపు నెరుగక - వికాసించు విజ్ఞానవీధిలో ~ ఎగరాలి ~ 

నదీతీరమే నాదనిలయమై విలసిల్లే యీ వేదభూమిలో 
ఆగమనుతుల ఆలయాలతో అలరారే మన పుణ్యధాత్రిలో ~ ఎగరాలి ~ 

పచ్చదనాల పంటభూమితో ముచ్చట గొలిపే ముద్దుసీమలో 
ధర్మచక్రము నెదలో నుంచి ప్రగతిబాటను పరుగులు తీస్తూ ~ ఎగరాలి ~ 

గలగల పారే పుణ్యనదులతో శాంతిగీతాల సంధానములో 
మేదినికే మేలుబంతిగా నిలచిన యీ హిమనగ సీమలో ~ ఎగరాలి ~




పల్లవి. వచ్చింది స్వాతంత్యం భరత భూమికి, 

తెచ్చింది ఆనందం తర తరాలకి! ||వచ్చింది|| 

అనుపల్లవి. యిచ్చింది పరిపాలన ప్రజల చేతికి, 
వచ్చిందా సమానత వీధి వీధికి? ||వచ్చింది|| 

1. ఝాన్సీ రాణి వంటి వీర వనితలు, 
ప్రాణాలు ఫణ మొడ్డిన రామ రాజులు, 
తనువులను అర్పించి భగత్ సింగులు, 
మన చేతికి అందించిన స్వాతంత్యము! ||వచ్చింది|| 

2. లాల్, బాల్, పాల్ వంటి దేశ భక్తులు, 
లాల్ బహాదూరు, పటేల్, సావర్కర్లు, 
కలిమి, బలిమి అర్పించిన త్యాగ శీలురు 
కలిసి తెచ్చినారు మనకు స్వాతంత్యము! ||వచ్చింది|| 

3. గాంధీజీ, నేతాజి, రాజాజీలు, 
చంద్రశేఖరాజదులు, రాజేంద్రులు 
ఆంధ్ర నేత టంగుటూరి, అమర వీరులు, 
ఎందరో సాధించిన స్వాతంత్యము. ||వచ్చింది|| 

4. తర తరాలు వంశ మొకటే గద్దె లెక్కగా, 
కుల, మతాల క్రౌర్యములు నింగి నంటగ, 
కలిమి, లేమి అంతరము పెరిగి పోవగ, ఆ 
కలి బ్రతుకులు అలముటా స్వాతంత్యము? ||వచ్చింది|| 

5. నోట్ల తోటి ఓట్లు కొనే రాజకీయము, 
తిట్ల తోటి గద్దె లెక్కు మంత్రి వర్గము, 
పొట్ట పట్టు కొని బ్రతుకు ప్రజానీకము, 
పాట్లు పడే బీదరికమా స్వాతంత్యము!? ||వచ్చింది|| 

6. పాత్ర మరచి ప్రవర్తించు పాత్రి కేయము, 
నీతి తప్పి ప్రజల నేలు అధికారము, 
మూతి గట్టి పాలు పితుకు మంత్రి జనము, 
చేత గాని చదువులా స్వాతంత్యము? ||వచ్చింది|| 

7. కలలు గన్న స్వాతంత్యం యిదే యిదేనా? 
అలవఱచిన ఆదర్శం యిదే యిదేనా? 
అలరారే సమానత ఒట్టి కలేనా? 
అలోచన అణగారుటా స్వాతంత్యము? ||వచ్చింది|| 

8. సమానత లేని నాడు స్వాతంత్య యేల, 
అమానుషం నిండినపుడు గణతంత్ర యేల? 
ప్రమతి ఏలు రాజ్యమే ప్రజా స్వామ్యము, (ప్రమతి = యదార్ధ ఙ్ఞానము) 
కిమ్మనవు ఎందులకీ స్వాతంత్యము? ||వచ్చింది|| 




అదిగదిగో - అదిగదిగో 

అదిగదిగో ఘనకీర్తితో ఎగురుతోంది చూడరా 
మువ్వన్నెల మన జండా దిగంతాల నిండా - 
అదిగదిగో! అదిగదిగో! ~ అదిగదిగో ~ 

కళలకూ, కాలాలకు దర్పణమై నిలచింది 
అశోకుని ధర్మచక్ర మాగుండెల నిండా 
వందేమాతరం! వందేమాతరం! ~ కళలకూ ~ 
త్యాగధనం, నిర్మలత, పచ్చదనం సైదోడుగ 
తిరంగాల, తరంగాల తలవంచక గర్వంతో 
అదిగదిగో - అదిగదిగో 
మువ్వన్నెల మనజండా దిగంతాల నిండా 
అదిగదిగో ఘనకీర్తితో ఎగురుతోంది చూడరా! 

పింగళి వెంకయ్య మదిని విరబూసిన ఆలోచన 
పురుడించి, పున్నమించి అలరారిన మన జండా 
వందేమాతరం! వందేమాతరం! ~ పింగళి ~ 
జాతీయత, సౌభ్రాత్రం పరిమళించు తెలుగుదనం 
భరతమ్మకు నివాళితో అర్పించిన తెలుగు ' ధనం ' 
అదిగదిగో - అదిగదిగో 
మువ్వన్నెల మన జండా దిగంతాల నిండా 
అదిగదిగో ఘనకీర్తితో ఎగురుతోంది చూడరా ~ అదిగదిగో ~ 

(ఈ గీతానికి సంగీత ప్రాణప్రతిష్ట జేసి 'బొబ్బిలి ' సీమలో ఎగురవేస్తున్న సోదరుడు " ఆకొండి భగవతీ ప్రసాద్"కి కృతజ్ఞతలు) 
( ఓ తెలుగువాడా! ఈ దేశానికి నువ్వేమిచ్చావని ఎవరైనా అడిగితే గర్వంగా తల పైకెత్తి జాతీయ జండాని చూపి " ఇది మా తెలుగుదనం,మాతెలుగు "ధనం" అని చెప్పండి)








… …

No comments:

Post a Comment