Thursday 20 April 2023



శ్రీ వేంకటేశ్వర లీలలు (1 )

రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


నేను వెనువెంట నున్నాను నిన్నుప్రార్ధిస్తూ 

వేకువనే గమనించలేని మనిషి నైతిని రమణా

సంస్కరించే శక్తి నీకే ఉంది మాపైనే ఎప్పుడూ  

విక్సష్ సేనలో మేము ఉన్నాము నమ్మాలి రమణా


షోడ షోపచారాలు నేను చేయ లేను ఎప్పుడూ 

చేతులు జోడించి నమస్కారమీ దిక్కు రమణా

కలశాభిషేకం చేయించే శక్తి లేని వాన్ని ఎప్పుడూ 

కేవలం కర్పూరం వెలిగించి వేడుకుంటన్నా రమణా


ఏడుకొండల పైన వెలుగుతున్నావు ఎప్పుడూ 

మా ఏడు జన్మల పాపాన్ని తొలగించే రమణా

కోరుకున్న విధంగా మాకు వరాలు ఇవ్వు ఎప్పుడూ 

నీవే సకల ప్రాణులను రక్షించే వేంకట రమణా


మా పరిమితులు మాకు తెలుసుకోగలిగాను ఎప్పుడూ       

నా అపరిమితులు నాకు తెలియదు ఎలా రమణా 

ఇక్కడ (పరిమితులు) తెలియడం జ్ఞానం ఎప్పుడూ 

అక్కడ (అపరిమితం) తెలియకపోవడం జ్ఞానం రమణా


అల్లంత దూరాన ఉన్నావు ఆశలు తీరుస్తావు ఎప్పుడూ 

అయినా మాహృదయంలో నిత్యమూ ఉన్నావు రమణా

అంతర్మధనం నుండి మా కష్టాలను కాపాడావు ఎప్పుడూ 

అప్పాలు నైవేద్యం పెడ్తున్నా తప్పులు క్షమించు  వేంకట రమణా

 

--(())--


నేను జూన్  నెలలో తెరపతికి వెళదామని నిర్నయిన్చుకున్నాను, నేను 2018  లో వ్రాసినవి మరలా పోస్టు చేస్తున్నాను, మీ విధేయులు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


No comments:

Post a Comment