Sunday 26 March 2023

ప్రాంజలి ప్రభ..27/03

 



 



ప్రాంజలి ప్రభ పద్య పుష్పాలు 

ఎంతజీవకళవహించుచిత్రంబైన
జడముకాదెజీవజగతినద్దిప్రాంజలి 
సుగుణరహితుడైనసుందరునకుదాని
కించుకంతభేదమెన్నదరమె.

భా:-ఎంతగా జీవకళ ఉట్టి పడుతున్నా చిత్రం జడపదార్ధమైనట్టే... ఎంత అందంతో మెరిసిపోతున్నవాడైనా గుణంలేని వాడూ జడపదార్ధంతో సమానమే.

శ్లో:-అర్ధనాశం మనస్థాపం
గృహేదుశ్చరితానిచ
వంచంనం చావమానంచ
మతిమాన్ నప్రకాశతే.

భా:-బుధ్ధిమంతుడు...ధననష్టాన్ని,విచారాన్ని,ఇంట్లోజరిగినచెడను,తనకుజరిగినమోసాన్ని,అవమానాన్ని..ఇతరులకు చెప్పుకోడు.

--(())--
నేటి సూక్తులు

ప్రాంజలిప్రభ

సమ్మోహయంతి మదయంతి విడంబయంతి
నిర్భర్త్పయంతి రమయంతి విషాదయంతి
ఏతాః ప్రవిశ్య సదయం హృదయం నరాణాం
కిం నామ వామనయనా న సమాచరంతి

తాఃః నరుల సదయ హృదయము లందు చొరబారి సమ్మోహింప చేస్తున్నారు. మత్తు కలిగిస్తున్నారు. బ్రమింప జేస్తున్నారు , బెదిరిస్తున్నారు , ఆనందింప జేస్తున్నారు , ధుఖం కలిగిస్తున్నారు, ఒకటేమిటి ఏమిచేసిన ఓర్పతో చూడటమేగా 


51...* నేటి కథ *


*సత్యం పవిత్రమైనది, సత్యం సర్వజ్ఞం. సత్యం బలదాయకంగా ఉండాలి! జ్ఞానదాయకంగా ఉండాలి! జవసత్వదాయకమై ఉండాలి!*

*మనకు కావలసింది స్పందించే హృదయం ఆలోచించే మెదడు, పని చేసే బలిష్టమైన హస్తం కర్మ చేసే యోగ్యతను సంపాదించు.*


🕉🌞🌎🌙🌟🚩

*** *శ్రీగురుభ్యోనమః*

*మన సంప్రదాయమున కార్తీక మాసము, వృశ్చికరాశి అమితమగు పుణ్యకార్యములకు కేటాయింపబడినది. సూర్యుని వృశ్చికరాశి ప్రవేశము కార్తీక మాసముగా పరిగణింప బడుచున్నది. హడావిడి, అలజడి, డంబాచారము విసర్జించి, మౌనముగా మనలోని ఈశ్వరునితో అనుసంధానం చెంది సాధకుడు ముందుకు సాగవలెనని ఈ మాసము సందేశము ఇచ్చుచున్నది.*

*ఈ మాసములో శివానుగ్రహము అనూహ్యమైన రీతిలో అవతరిస్తూ ఉంటుంది. క్షరుడుగా తాను మరణించి, అక్షరుడుగా మేల్కొనే అద్భుతమగు మార్పు శివసంకల్పంగా జరుగును. శివలీల తన లీల కన్నా చాలా విశిష్టమైనదని మహావిష్ణువే పలికిన సందర్భములు పురాణములలో కలవు.*

***

*🌹. గీతోపనిషత్తు  - 75 🌹*

*🍀 13. కర్తవ్యాచరణము  - నాకు కర్మఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు" అని నన్ను గూర్చి ఎవడు తెలుసుకొనునో అతడు కర్మములచే బంధింపబడడు.   జీవుని పేరుకూడ 'నేను'యే . నాకు కర్మఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు." ఇది అనునిత్యము ధ్యానము చేయుచు కర్మలాచరించు వానిని కూడ కర్మలు బంధింపవు. 🍀*

*📚. 4. జ్ఞానయోగము  - 14  📚*

న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా |

ఇతి మాం యో జానాతి కర్మభి ర స బధ్యతే || 14

“నాకు కర్మఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు" అని నన్ను గూర్చి ఎవడు తెలుసుకొనునో అతడు కర్మములచే బంధింపబడడు. శ్రీకృష్ణుడు పలికిన ఈ వాక్యములో రెండు విధములగు అవగాహన గోచరించును. దైవము నిర్లిప్తుడని, కోరికల కతీతుడని, కావున అతడిచే నిర్వర్తింపబడుచున్న సృష్టి కర్మఫలము, అతనిని అంటదని ఒక అవగాహన. 

దైవము పేరు 'నేను'. జీవుని పేరుకూడ 'నేను'యే. జీవుడు కూడ పై తెలిపిన వాక్యమును మరల మరల జ్ఞాపకము చేసుకొనవచ్చును. అది యేమనగా “నాకు కర్మఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు." ఇది అనునిత్యము ధ్యానము చేయుచు కర్మలాచరించు వానిని కూడ కర్మలు బంధింపవు.

కోరిక యున్నచోట బంధముండును. కోరిక లేనిచోట బంధముండదు. కావున ఫలము కోరక, కర్తవ్య మాచరించుట కర్మబంధము నుండి బయల్పడుటకు మార్గము. ఇది గీత బోధించు ప్రధాన సూత్రము.

సశేషం....

***

*🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴* 

64. అధ్యాయము - 19

*🌻. సతీకల్యాణము - శివలీల -4 🌻*

విష్ణువు ఇట్లు పలికెను -

భూతనాథా! సృష్టికర్త, జగత్ర్పభువు అగు బ్రహ్మను సంహరించవద్దు. ఈతడీనాడు నిన్ను శరణు పొందుచున్నాడు. నీవు శరణాగత వత్సలుడవు (50). నేను నీకు మిక్కిలి ప్రియమగు భక్తుడను. నాకు భక్తరాజు అను కీర్తి గలదు. నీవు నా విన్నపమును మన్నించి నాపై దయను చూపుము (51). 

హే నాథా! నేను యుక్తి యుక్త మగు మరియొక్క మాటను చెప్పెదను. వినుము. మహేశ్వరా! నీవు నాపై దయచేసి నా మాటను మన్నింపుము (52). హే శంభో! ఈ నాల్గు మోముల బ్రహ్మ ప్రజలను సృష్టించుటకే ఆవిర్భవించినాడు. ఈయనను సంహరించినచో మరియొక సృష్టికర్త ఉండడు. మరియొక సృష్టికర్తను నీవిదివరలో సృష్టించలేదు (53).

హే నాథా! శివరూపములో నున్న నీ ఆజ్ఞచే మనము త్రిమూర్తులము సృష్టిస్థితిలయ కర్మలను మరల మరల చేయు చుందుము (54). 

హే శంభో! ఈ బ్రహ్మను సంహరించినచో, ఆ సృష్టికర్మను ఎవరు చేసెదరు? హే లయకర్తా! హే ప్రభో! కావున నీవు సృష్టి కర్త యగు ఈతనిని సంహరించవలదు (55). దక్షుని కుమార్తె యగు సతీదేవి రూపములో నున్న ఉమా దేవిని, హే ప్రభో! ఈతడే మంచి ఉపాయముతో నీకు భార్య అగునట్లు వ్యవస్థను చేసినాడు (56).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దృఢమగు వ్రతము గల మహేశ్వరుడు విష్ణువు చేసిన ఈ విన్నపమును విని, వారందరికి వినపడునట్లుగా, ప్రత్యుత్తరమును ఇట్లు చెప్పెను (57).

మహేశ్వరుడిట్లు పలికెను -

హే దేవదేవా ! రమాపతీ ! విష్ణూ! నీవు నాకు ప్రాణములవలె ప్రియుడవు. వత్సా! నేనీతనిని సంహరింపబోగా నీవు నన్ను నివారించవద్దు. ఈతడు దుష్టుడు (58). పూర్వము నీవు చేసిన విన్నపమును నేను అంగీకరించితిని. దానిని ఇప్పుడు పూర్తిచెసెదను మహాపాపమును చేసినవాడు, దుష్టుడు, నాల్గు ముఖములు గలవాడు అగు ఈ బ్రహ్మను నేను సంహరించెదను (59). 

స్థావర జంగమాత్మకమగు సర్వప్రాణులను నేనే సృష్టించెదను. లేదా, నా శక్తిచే మరియొక సృష్టికర్తను నేను సృష్టించెదను (60). ఈ బ్రహ్మను సంహరించి, నేను చేసిన శపథమును పూర్తిచేసి, మరియొక సృష్టికర్తను సృజించెదను. ఓ లక్ష్మీ పతీ! నీవు నన్ను నివారించకుము (61).

బ్రహ్మ ఇట్లు పలికెను -

గిరీశుని ఈ మాటను విని, చిరునవ్వుతో ప్రకటమైన కరుణాహృదయము గల అచ్యుతుడు 'వద్దు' అని మరల పలుకుచూ, ఇట్లనెను (62).

అచ్యుతుడు ఇట్లు పలికెను -

పరమ పురుషుడవగు నీవు ప్రతిజ్ఞను చెల్లించు కొనుట యోగ్యమైన విషయమే. కాని, నీవు విచారించుము. హే ప్రభూ! ఈశ్వరా! తనను తాను వధించు కొనుట తగదు (63). 

సశేషం....

***

: *🌹. శివగీత  - 114  / The Siva-Gita - 114 🌹*

 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*

📚. ప్రసాద్ భరద్వాజ 


అధ్యాయము 15

*🌻. భక్తి యోగము - 3 🌻*

అన్యత్ర భూతాద్భ వ్యాచ్చ - యత్ప్ర వక్ష్యామి తచ్చ్రుణు,

వదంతి యత్పదం వేదా - శ్శాస్త్రాణి వివిదానిచ 11

సర్వోప నిషదాం సారం -దద్నో ఘ్రుత మినోద్ద్రుతమ్,

యదిచ్చంతో బ్రహ్మ చర్యం - చరంతి మున యస్సదా. 12

తత్తే పదం సంగ్రహేణ - బ్రవీ మ్యోమితి యత్పదమ్ ,

ఏత దేవాక్షరం బ్రహ్మ - ఏత దేవాక్షరం పరమ్ 13

ఏత దేవాక్షరం జ్ఞాత్వా -బ్రహ్మ లోకే మహీయతే,

ఏత దాలంబనం శ్రేష్ఠ - మేత దాలంబనం పరమ్ 14

ఛందసాం యస్తు దేనూనా - మృత భత్వేన చోదితః,

ఇదమే వావధి స్సేతు- రమృత స్యచ ధారణాత్ 15

ఎటువంటి పరమ పదమును కలుగ చేయు వస్తువు పెరుగు నుండి దీయబడిన వెన్నవలె సమస్త శాస్త్రముల చేతను  వేదములతోడను దీయబడినదో -ఏ వస్తువు కోరబడిన  దై మునులచేత బ్రహ్మచర్య మాచరించ బడు చుండెనో అట్టి దానిని నీకు సంక్షిప్తముగా వివరింతును.  

అదేమి టందువా ఓం కారము,  అదే నాశరహిత మగు పరబ్రహ్మము. దానిని తెలసి కొనియే బ్రహ్మలోకమును పొందుదురు.  ఇదే అక్షరము, ఇదే పరము. 

ఛందస్సు లనెడు గోవుల కేది ఋషభ స్థానము పొందెనో  (ప్రదానత్వ మనుట )అట్టిదే అక్షరము అవధి ( నియామకమనుట)  మోక్ష ధారణ వలన సంసార సాగరమునకు దీరము వంటి దగును ( అజ్ఞాన నాశకమై మోక్షమును ప్రాపిం చేయు ).

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹

*🌻. నారద మహర్షి  - 34 🌻*

240. “తనకు క్రోధం వస్తే తప్పనిసరిగా అవతలి వాడు నశిస్తాడు. అలా అనుకున్నప్పుడు క్రోధాన్ని దగ్గరికి రానివ్వకూడదు. క్షమ తప్ప ఇంకొకటి ఉండకూడదు. లేకపోతే అందులోంచి కర్మ పుడుతుంది. 

241. ఒకడు పాపం చేస్తున్నాడంటే, ఈ ప్రపంచంలో పాపం చేసిన వాడికి ఏం జరగాలో అది శాసించబడే ఉంది, అలా జరగనే జరుగుతుంది. కనుక తాను శాంత స్వభావంతో ఉండాలి. జ్ఞానలక్షణం అదే. 

242. లేకపోతే ఒక కార్యం ఆచరించి, ఒక క్రోధం చేత ఒక దుఃఖానికి హేతువై ఒక కర్మ పుట్టి, ఆ కర్మకు ఫలం అనుభవించవలసి వస్తుంది” అని బోధించాడు నారదుడు. మహర్షులు, జ్ఞానులు ఎవరిని శపించినా, శిక్షించినా, తిట్టినా కొట్టినా అది వాళ్ళకు కల్యాణ హేతువే అవుతుంది. 

243. కృష్ణపరమాత్మ తన అవతారంలో 125 సంవత్సరములు జీవించి చేసిన పనులలో నూరోవంతు ఎవరైనా చేయాలంటే, నూరు జన్మలెత్తాలి. ఎన్ని పనులు చేసాడు! ఎన్ని పనులు ఎంత మందితో చేయించాడు! అదంతా కర్మకదా! కర్మకు ఫలం ఉండితీరాలి కదా ఎవరు చేసినా! 

244. కృష్ణుడు ఎన్ని జన్మలెత్తాలి ఆ కర్మఫలం కోసమని? అన్న ప్రశ్నలు కలుగకమానవు. ఆయన ఎన్ని కర్మలు చేసినప్పటికీ, నిస్సంగబుద్ధితో శుద్ధబ్రహ్మవస్తువైనటువంటి – తన స్వస్థితియందే ఉన్నాడు. 

245. బయట నిర్వర్తించిన కార్యములన్నీ కూడా మనసు, ఇంద్రియములు లోకకల్యాణం కోసమని చేసాయి. అంతేగాని, ఆయన యందు కర్తృత్వభావనే లేదు. కర్తృత్వభావన వల్ల కర్మ ఫలప్రదమవుతుంది. 

246. కర్మ స్వతహాగా జడమయినటువంటిది. భావనచేతనే-నేను పనిచేస్తున్నాననే భావనచేతనే-కర్మలోంచి ఫలం పుడుతుంది.

247. పూర్వం గాలవుడు అనే ముని నారదుని దగ్గరికి వచ్చి, “స్వామీ! జ్ఞానప్రవృత్తి ఎలా కలుగుతుంది? ఆశ్రమాచారాలైన గృహస్థధర్మం, సన్యాసము అనే వాటిలో ఏది మేలయినది? అనేక శాస్త్రాలు అనేకమార్గాలు చూపిస్తవికదా! శ్రేష్ఠమయిన ఒక్కమార్గం నాకు చెప్పు” అని అడిగాడు. 

248. అందుకు నారదుడు, “గాలవా! ఆశ్రమధర్మాలు నాలుగు ఉన్నాయని నువ్వు వినిఉన్నావు కదా! శాస్త్రాలలో ఆ ఆశ్రమధర్మాలు పైకి పరస్పరవిరుద్ధంగా కనబడతాయి. అందులోని ధర్మసూక్ష్మం సద్గురువును ఆశ్రయిస్తేనే తెలుస్తుంది. 

249. స్థూలంగా చూస్తే ఒక ధర్మానికి, మరొక ధర్మానికి వ్యతిరేకలక్షణం కనబడుతుంది. “గృహస్థధర్మంలో, ‘జాగ్రత్తగా ధనం సంపాదించుకుని దాచుకుని భార్యాపిల్లలను బాగా చూచుకో, అతిథి అభ్యాగతులకు పెట్టు’ అని అంటారు. సన్యాసాశ్రమంలో, ‘ధనంమాట ఎత్తవద్దు, ఆ మాట అసలు మనసులోకి రానీయకు’ అంటారు. 

250. అయితే ఈ ప్రకారంగా ఒకే వస్తువును గురించి వివిధ ధర్మాలు, ఆయా ఆశ్రమాల్నిబట్టి ఉంటాయి. అసలు ధర్మంయొక్క లక్షణం ఏమిటి? ఏది ఆచరిస్తే ఆ జీవాత్మకు క్షేమమో, ఆ జీవుడికి క్షేమకరమైన భవిష్యత్తు ఉంటుందో దాన్ని ధర్మము అంటాము.

సశేషం....

*🌻. మానసిక గోళము - మనోభువనము - 4 🌻*

*. సూక్ష్మ, మానసిక, గోళముల ద్వారా పొందుచున్న ఆధ్యాత్మిక ప్రగతి, కేవలము ఊహ మాత్రమే.

*. ఆత్మ, మనస్సు ద్వారా, మనోమయ గోళమందు ఎరుకను పొందుచున్నప్పుడు మానసిక శరీరముతో తాదాత్మ్యతను చెందుచున్నది.

*. నాల్గవ భూమికను దాటి అయిదవ భూమికలో ప్రవేశించుట యనగా-స్వర్గ ద్వారమును చేరుటయని అర్థము. 

*. ఆత్మ మానసిక సంస్కారములను కలిగి ఉండి, మనస్సు యొక్క చైతన్యమునే కలిగి, మానసిక లోకానుభవమును పొందుచుండును.

*. మానసిక లోకానుభవము :-

(అంతర్దృష్టి, దివ్యదృష్టి) కేవలము చుచుటే భగవద్దర్శనము.

*. ఆత్మ, మానసిక సంస్కారములను కలిగివుండి, మానసిక శరీరంతో తాదాత్మ్యము చెంది, మనస్సే తానని భావించును.


సశేషం...

***

శ్రీనాథ కవి సార్వభౌముడు: సంక్షిప్త కధ 

అయినా ఎల్లవేళలా ఈ ఆత్మ ప్రత్యయం, ఈ ఠీవీ చెలామణి కాదు. సందర్భాన్ని బట్టి ప్రయత్నించాలి. అందుకే శ్రీనాథుడు ఒక్కొక్కసారి సహనం అవసరమేనంటూ చెప్పిన పద్యమిది -

"నికటముననుండి శ్రుతి నిష్ఠురముగ

నడరి కాకులు బిట్టు పెద్దఱచినప్పు

డుడిగి రాయంచ యూరక యుంట లెస్స

సైప రాకున్న నెందేని జనుట యొప్పు"

- కాకులు గోలపెడుతున్నప్పుడు ఓర్పుతో సహించాలి. లేదా వాటినుండి దూరంగా వెళ్ళాలి. అంటే ఆ కాకులతో మనమూ గోలచేస్తే మన స్థాయి పతనమైనట్టే గదా! ఇది మన జీవితంలో చాలా సందర్భాలకి ఉపకరిస్తుంది.

శ్రీనాథుడు భోగి. రసికుడు. ఎన్నో సుఖాలు అనుభవించాడు. అవకాశాలను అనుకూలంగా మలచుకోవడంలో తనకు తానే సాటి. అయినా రాజుల రోజులు ముగిసిన తర్వాత కష్టాల పాల్పడ్డాడు. బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, ఈశ్వరార్చన కళాశీలుడూ, కవిసార్వభౌముడు, ఆగమ జ్ఞాననిధి అయిన శ్రీనాథుడు ఎన్నో బాధలు పడ్డాడు.

"కుల్లాయుంచితి కోక చుట్టుతి మహాకూర్పాసముండొడ్లితిన్

వెల్లులిందిల పిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా

చల్లాయంబలి ద్రావితిన్ రుచులు దోసంబంచు పోనాడితిన్, తల్లీ

కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా, నేను శ్రీనాథుడిన్"

అని వాపోయాడు. గతకాలంలో ఎప్పుడూ చేయలేని, ఇష్టపడని పనులు చేశాడు. అలవాటు లేనివన్ని అనుభవించాడు. ఎంతటివాడికైనా కాలం బాగుండకపోతే అష్టకష్టాలు తప్పవని అనుభవాలు చెప్తాయి.

జొన్నకూడు తిన్నాడు. సన్నన్నం దొరకలేదు. తన పంటపొలాలకు శిస్తు కట్టలేక పోయాడు. శిస్తు కట్టనందుకు కఠినమైన శిక్షలు అనుభవించాడు. వాటిని ఒక పద్యంలో వివరించి మనకి వ్యకిత్వ వికాస తరగతులు నిర్వహించాడు.

జీవితం "చక్రార పంక్తి రివ గచ్చతి భాగ్యపంక్తిః"కి నిదర్శనం. ఎప్పుడూ కష్టాలే ఉండవ్. ఎప్పుడూ సుఖాలే ఉండవ్. వెలుగునీడలు సహజాతి సహజం. సుఖాలకి పొంగిపోకూడదు. కష్టాలకు కుంగిపోకూడదు. అదే స్థిత ప్రజ్ఞత్వం. మనం మంచి జరిగితే విర్రవీగి పోతాం. కష్టం లేదా దుఃఖం వస్తే న్యూనతాభావంతో ఇతరులను తిట్టిపోస్తాం. ఇది సరైన పద్ధతి కాదు. "బాధే సౌఖ్యమనే భావన " రావాలి. సుఖదుఃఖాల్ని స్వాగతించగలవాడే జీవితాన్ని ఆస్వాదించగలడు. మరొకరికి ఆదర్శప్రాయుడూ కాగలడు. శ్రీనాథుడు అటువంటి వ్యక్తిత్వం కలవాడు కాబట్టే ఈ పద్యం వెలువడింది -

"కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా

పురవీధి నెదురెండ పొగడదండ

సార్వభౌముని భుజాస్తంభమెక్కెను గదా

నగరి వాకిటనుండు నల్లగుండు

వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత

వియ్యమందెను గదా వెదురు గడియ

ఆంధ్ర నైషధకర్త యంఘ్రి యుగ్మంబున

తగిలియుండెను గదా నిగళయుగము "


ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


26. పెళ్ళి

ఒక అమ్మాయి  గుడికి వచ్చి నాకు మంచి భర్తను ప్రసాదించు అని వేడుకుంది

మంచి కనబడిని , మంచిని గ్రహించలేని ఈ లోకంలో దొరకుట కష్టం అన్నాడు

దేముడు. మంచివాడు అసలు పెళ్ళికి సాహసించాడు, ఇక ఇంటికి పో అమ్మాయి.


27.ఉంగరం                                                                                                                            డాక్టర్ పేషంటు  ఫోన్ చేసి మీరు అర్జంటుగా నర్సింగ్ హోం రావాలి 

ఎందుకు సార్  నాకు మొన్ననేగదా  ఆపరేషన్ చ్చేసారు, నేను ఆరోగ్యముగానే ఉన్నాను

నీవు రాకపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుంది ఎందుకు డాక్టర్ ముందు రావయ్య తరువాత

చెపుతా అన్ని ఇప్పుడే చెప్పలా, అనగానే పేషంటు వచ్చాడు    

ముందు ఆపరేషన్ థియటర్ పోదాం పదా, ఎందుకు సార్ నేను బాగానే ఉన్నానుగా 

నీ కడుపులో మాఆవిడ పెళ్ళి  ఉంగరము పెట్టి కుట్టేసా, అది తీసురాకపోతే ఫుడ్,బెడ్ లేదు 


28. కోడి

విందు భోజనానికి వెళ్లి గోవిందరావు కోడి మాంసము గబ గబా తింటున్నాడు

గోవింద్  ఎందుకు అంత తొందరా  కోడి ఎక్కడికి పారిపోదు ఎప్పుడో చచ్చిన

దానిని తింటున్నావు ............నవ్వులే నవ్వులు    

***






No comments:

Post a Comment