Saturday 21 March 2020



*(1) అధముడు
*(1) గురువుల వద్దకూ దైవసన్నిధికి చెప్పులు విడవకుండానే, గొడుగును ముడవకుండానే పోవుట, గురువుగారి ఎదురుగానే ఉన్నతాసనంపై కూర్చుని యుండుట, పల్లకిలో కూర్చొని తీర్థయాత్రలు చేయుట, తీర్థాలలో గ్రామ్యధర్మాచరణను చేయుట- ఇవన్నీ అథమసంజ్ఞక దోషాలు.*


 దైవాన్నే ఎగతాళి  చేసి గొడుగే

 
*🌹. ఈ క్రింది 26 దోషాలు మనుష్యుని నరకం వైపు పయనింపచేస్తాయి - 1 🌹*

*🌻. భవిష్య పురాణం 5వ అధ్యాయము 🌻*
సేకరణ రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

*ఈ మనుష్యులెవరనగా*

*(1) అధముడు (2) విషముడు (3) పశువు (4) పిశునుడు (5) కృపణుడు (6) పాపిష్టుడు (7) నష్టుడు (8) రుషుడు (9) దుష్టుడు (10) పుష్టుడు (11) హృష్టుడు (12) కాణుడు  (13) అంధుడు (14) ఖండుడు (15) చండుడు (16) కుష్టు (17) దత్తాపహారకుడు (18) వక్త (19) కదర్యుడు (20) దండుడు (21) నీచుడు (22) ఖలుడు (23) వాచాలుడు (24)చపలుడు (25)మలీమసడు  (26)స్తేయి.*
*(ఈ దోషాలు స్త్రీలకున్నా దోషాలే... )*

*ఈ ఇరవై ఆరుదోషాల్లోనే మళ్ళా భేద, ప్రభేదాలు చెప్పబడ్డాయి.*

*అందుకే వాటిని ఒక్కొక్కటిగా సంగ్రాహంగానైనా వివరించి చెప్పవలసి వుంది. ఇలా :*

*(1) గురువుల వద్దకూ దైవసన్నిధికి చెప్పులు విడవకుండానే, గొడుగును ముడవకుండానే పోవుట, గురువుగారి ఎదురుగానే ఉన్నతాసనంపై కూర్చుని యుండుట, పల్లకిలో కూర్చొని తీర్థయాత్రలు చేయుట, తీర్థాలలో గ్రామ్యధర్మాచరణను చేయుట- ఇవన్నీ అథమసంజ్ఞక దోషాలు.*

*(2)  పైకి ప్రియంగా మధురంగా మాట్లాడుతూ హృదయంలో మాత్రం హాలాహలాన్ని కలిగియుండి చెప్పేదొకటిగా చేసేదొకటిగా జీవించేవాడు విషముడు.*

*(3) మోక్షమును గురించి అసలు ఆలోచించకుండా, ప్రాపంచిక విషయవాంఛలలోనే మునిగితేలుతూ, హరి సేవ వూసే తలపక, ప్రయాగలో వుంటూ ఇంకెక్కడో స్నానం చేస్తూ, ప్రత్యక్ష దైవాలను విస్మరించి అదృష్టభాగ్యాన్ని వెతుకుతూ, శాస్త్రసారాన్ని బొత్తిగా పట్టించుకోకుండా వుండేవాడు పశువు.*

*(4) బలంతోగాని, వేషంతోనో మోసంతోనో గాని, మిథ్యా ప్రేమను ప్రదర్శించి గాని మనుష్యులను తన లాభం కోసం ఆపదలలో ముంచేసేవాడు పిశునుడు.*

*(5)  దేవ, పితృ కార్యాలలో మంచి అన్నం పెట్టే స్తోమతు వుండీ కూడా మ్లానమై అశుభ్రమైన అన్నాన్ని భోజనాలలో వడ్డించే దుర్బుద్ధియైన మానవుడు కృపణుడు. వానికి స్వర్గమూ దొరకదు; మోక్షమూ లభింపదు.*

*అప్రసన్నమైన మనసుతో కుత్సిత వస్తువులతో దాన కర్మలను గావిస్తూ కోపంగా మొహం మాడ్చుకొని పూజలను చేసేవాడూ కృపణుడే. శరీర విక్రయదారులు కూడా కృపణులే.*

*(6) మాతాపితలను, గురువులను వారి కర్మకు వారిని వదలివేసి హోమ-యజ్ఞాల నిర్వహణలో కూడా లోపం చేసేవారు పాపిష్టులు.*

*(7) సాధనాచరణను పరిత్యజించి, అసత్యపు సేవాప్రదర్శన చేయువాడు, వేశ్యాగామి, దేవధనం ద్వారా స్వంత పబ్బం గడుపుకొనేవాడు, భార్యచేత వ్యభిచారం చేయించి బతుకు నిలుపుకొనేవాడు, కన్యలను తెచ్చి అమ్ముకొనో మరే విధంగానో మొత్తానికి స్త్రీధనం ద్వారానే  అపసవ్యంగా అక్రమంగా బతికేసేవాడు పురాణ పరిభాషలో నష్టుడన బడతాడు.*

*(8) మనసులో ఎప్పుడూ క్రోధమే తప్ప మరో మనోవికారమూ, సరాగమూ వుండనివాడు, తన హీనతను తానే తలచుకొని మరీ కోపం తెచ్చేసుకుని చల్లటి వాతావరణాన్ని మంట సెగలపాలు చేసేవాడు  (ఉడుకుమోతువాని ముఖాన కునుబొమలు శాశ్వతంగా ముడివడే ఉంటాయి. చిరునవ్వన్నది వుండదు ) - ఇలాంటి వాడు రుష్ఠుడు*

*(9) అకార్య లేదా నిందిత ఆచరణ ద్వారానే జీవించే వాడు. ధర్మకార్యమేదీ పూర్తిగా చేయని వాడు.*

*నిద్రాళువు, దుర్వ్యసనాలపై ఆసక్తిగలవాడు, మదిరాలోలోడు, స్త్రీలను సేవిస్తుండేవాడు, ఎల్లపుడూ దుష్టులుగా జగత్రసిద్ధులైన వారి సాంగత్యంలోనే తిరుగుతుండేవాడు దుష్టుడనబడతాడు.*

*(10) మధుర, మృష్టాన్న భోజనాన్ని తానొక్కడే తినేవాడు, వంచకుడు, సజ్జనులను నిందించేవాడు, శుకర (మద్యశాల వంటి వాటిని శుభ్రపరచుట)తో సమానమైన వృత్తి చేసేవాడు పుష్టుడు.*

*(11) నిగమాగమాలను అంటే వేదతంత్రాలను అధ్యయనం చేయకపోగా, వినడానికి కూడా రానివాడు హృష్టుడు*

*(12, 13) శ్రుతులు, స్మృతులు బ్రాహ్మణ్యానికి రెండు కళ్ళు. ఒకటి లేనివాడు కాణుడు, రెండూలేనివాడు అంధుడు.*

*(14) అన్నదమ్ములతో కయ్యమాడేవాడు, మాతాపితలను అప్రియవచనాలతో బాధించువాడు ఖండుడవుతాడు.*

*(15) శాస్త్రనింద జేయువాడు, చాటున కొండెములు చెప్పేవాడు, రాజ్ మాగీ, శూద్రసేవకుడు, శూద్రపత్నులతో అనాచర చేసేవాడు, శూద్రగృహంలో వండబడిన అన్నాన్ని ఒకమారు తిన్నా, శూద్రగృహంలో అయిదు రోజులు నివసించినా... వాడు చండుడనబడతాడు.*

*(16) కుష్టుడు :*
*ఎనిమిదిరకాల కుష్టురోగాలు కలవాడు, లేదా మూడురకాలైనా వున్నవాడు, శాస్త్ర నిందులతో కలిసి తిరిగేవాడు కుష్టుడు*

*(17) దత్తాపహారకుడు :*
*కీటకంలా తెగ తిరిగేవాడు, కుత్సిత దృష్టితోనే వ్యాపారం చేసేవాడు, దత్తాపహారకుడన బడతాడు.*

*(18) వక్త :*
*కుపండితుడై, అజ్ఞానియై ఉండి కూడా ధర్మోపదేశాలు చేసేస్తుండే వాడు వక్త. (వక్త అనే మాటకి ప్రస్తుతం మాత్రం మంచి అర్థముంది. అదే రూఢి)*

*(19) కదర్యుడు :*
*గురుజనుల వృత్తులను అపహరించడానికి ప్రయత్నించేవాడు. కాశీ నివాసి అయివుండి కూడా కాశినొదిలేసి బహుదినాలు బయటి ఊళ్ళల్లో వుండేవాడు కదర్యుడు.*

*(20) ఉద్దండుడు :*
*మిథ్యాక్రోధాన్ని ప్రదర్శిస్తూ, దండవిధానంలో, అమలులో కల్పించుకొని జనులను దండించేవాడు దండదోషి లేదా ఉద్దండుడు.*

*(21) దురాచారి :*
*బ్రాహ్మణ, రాజ, లేదా దేవ సంబంధి ధనాన్ని అపహరించి మరొక బ్రాహ్మణునికో దైవానికో పెట్టేవాడు, ఆ ధనంతో భోజనాలు పెట్టేవాడు, అక్షరాభ్యాసముండి చదవడానికి గాని, బలవంతాన చదివినా అర్థం చేసుకోవడానికి గాని ప్రయత్నించని వాడు, అనాచారి, దురాచారి నీచుడు.*

*(22) ఖలుడు :*
*గుణవంతులలో సజ్జనులలో దోషాలు వెతకడమే పనిగా పెట్టుకొనేవాడు ఖలుడు.*

*(23) వాచాలుడు :*
*భాగ్యహీనులను పరిహాసయుక్తంగా, వెటకారంగా సంబోధించి వేధించేవాడు, చండాలురతో మరీ బహి రంగంగా సల్లాపము లాడేవాడు వాచాలుడు.*

*(24) చపలుడు :*
*పక్షులను పెంచి అమ్ముకొనేవాడు పిల్లిపిల్లీ తగువులాడుకొని కోతి దగ్గరకు ధర్మంకోసం వెళితే రెండిటినీ మోసం చేసిన కోతిలాగా మానవద్రవ్యాలను భక్షించేవాడు, మాంస భక్షకుడు, అన్యాంగనాసక్తుడు, మట్టిపెళ్లలను పగులగొట్టేవాడు (వ్యంగా) చపలుడనబడతాడు.*

*(25) మలీమసుడు :*
*నూనె రాసుకొని నలుగు పెట్టుకొని తలంటి పోసుకోవడం వంటి శరీరశుద్ధికర్మ ఏనాడూ చేసుకోనివాడు, నిత్యశరీర శుభ్రతకర్మలేవీ చేపట్టనివాడు మలీమసుడు.*

*(26) స్తేయి :*
*చోరుడు దొంగతనం చేయడమేకాక మాతా పితలను పోషించకుండుట, గురువును గౌరవించకుండుట, మంచి ఆలోచనేదీ మనసులో లేకుండుట స్తేయి లక్షణాలు.*

*🌻. ఈ దోషాలలో ఏ ఒక్కటీ లేనివాడే నిజమైన మనిషి 🌻*
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment