Thursday 17 November 2016

ఓ మనిషీ - బ్రతికీ - బ్రతికించు (పార్టు -3)

ఓ మనిషీ - బ్రతికీ - బ్రతికించు  (పార్టు -3)

అప్పుడే తల్లి వచ్చి ఇంకా కాఫీ త్రాగలేదు ఏమిరా మళ్ళీ వేడికాఫీ తెచ్చి ఇస్తా ,

ఉండూ అమ్మా కాఫీ కేం తొందర లేదు ఇటు కూర్చోమ్మా , నాకు ఏదన్నా సలహా ఇవ్వమ్మా అని అడిగాడు రామకృష్ణ .

ఏనాడైనా ఎప్పుడైనా సలహాలు ఇచ్చానా, వండానా అందరూ భోజనం చేశారా అని ఆలో చించాను తప్పా, అన్నీ నిర్ణయాలు మీనాన్న చెప్పినట్లు చేస్తేనే నాకు ఇంత కూడు దొరుకుతుంది లేక పోతే ఏనాడో  ఈ కుటుంబం ముక్కలయ్యేది, మీనాన్న చెప్పిన దాట్లో తప్పు ఎక్కడా  నాకు కని పించుట లేదు, నేను ప్రపంచములో బ్రతక గలను అని ఆత్మవిశ్వాసం ఉంటే తక్షణం బయట ప్రపంచంలో బ్రతికి నలుగురిని బ్రతికించు, నేను పెద్దగా చదువు కోలేదు ఇంతకన్నా నేను నీకు ఏమి చెప్పలేను, నాన్నే గదా అరిచింది వంటిమీద పడ్డ దుమ్ము దులుపు కున్నట్లు దులుపుకొని ఉండ దలుచు కుంటే నిత్యమూ మానసిక సంఘర్షణలకు చిక్కుతావు అది మాత్రం గుర్తుంచుకో నేను మీనాన్నకు తోడు , నాకు మీనాన్న తోడు తప్పదు. నేను ఒకటే చెప్పగలను ప్రతి రోజు అద్దం శుభ్రంగా తుడుచుకొని ముఖం చూడమన్నారు పెద్దలు. ఎందుకో తెలుసా నిన్న జరిగిన విషయాలన్నీ మరచి పోయి కొత్త ముఖంతో ఉండాలనేదే ఇందులో ఉన్న నీతి.
             
నా ఈజీవితము లో సగం పైన సుఖదుఃఖాలు అను భవించాను, ఇది మాకు శేష జీవితము.
నీవు వయసు లో ఉన్నావు, కష్ట పడగలవు ఆలోచించుకొనే శక్తి నీకు ఉన్నది అని చెప్పి లోపలకు వెళ్ళింది తల్లి......

బయట  నుండి అమ్మా ఇంత గంజి ఉంటే పోయండమ్మా, చద్ది ఉంటే  పెట్టండమ్మా, 2000 రూపాయలకు చిల్లర ఉంటే ఇవ్వండమ్మా అని అరుస్తున్నాడు ఒక బిచ్చగాడు,

బాబు బాబు అని తల్లి పిలుపుకు రామకృష్ణ తల్లి వద్దకు చేరాడు, ఒక్కసారి బయటకు పోయి రాత్రి పూరీలు తీసుకుంటాడేమో అడుగు నాయనా అన్నది  . అమ్మా ఇవ్వు నేను  ఇస్తా, వద్దు బాబు ముందు అడిగిరా మనం పెట్టిన వాటిలో కొద్దిగా వాసన వచ్చినా వారి నోటికి వచ్చి నట్లు తిడతారు అది గుర్తు పెట్టుకో సరేనమ్మా వెళ్లి అడిగి వస్తా.

రాత్రి పూరీలు తీసుకుంటావా, తీసుకుంటాను బాబు అన్నాడు.మరి చిల్లర ఉంటే కూడా సర్దు బాబు.

మీదగ్గర  చాలా చిల్లర ఉంటుంది అంటారుగా. అవును బాబు నిన్నటి దాకా ఉండేది, మా ఇంటి పక్క బాబుకు ఆరోగ్యం బాగుండక పోతే ఉన్న చిల్లరంతా ఆస్పత్రిలో  కట్టినాను 2000 రూపాయల నోటు తీసుకున్నా అయినా నేను ఉంచిన  చిల్లర ఒక ప్రాణికి సహాయ పడినందుకు నాకు సంతోషముగా ఉన్నది బాబు.  2000 చిల్లర అడుగుతున్నాను అన్నాడు.       

ఏమిట్రా బిచ్చగానితో సంభాషణ ముందు ఇవిపెట్టు అతనికి అని అన్నది తల్లి. 

రామకృష్ణ  వెంటనే పెట్టి వెనుకకు వచ్చాడు.   ......   3  .......    
 
                                       మిగతాభాగము క్రేపు చదవండి ... 

No comments:

Post a Comment